విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 188, 189 / Vishnu Sahasranama Contemplation - 188, 189

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 188, 189 / Vishnu Sahasranama Contemplation - 188, 189 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻188. గోవిదాం పతిః, गोविदां पतिः, Govidāṃ patiḥ🌻

ఓం గోవిదాం పతయే నమః | ॐ गोविदां पतये नमः | OM Govidāṃ pataye namaḥ

గౌః అనగా వాక్కు. గాం విందతి ఇతి గోవిదః వాక్తత్త్వమును ఎరిగిన వారిని 'గోవిదః' అందురు. అట్టి గోవిదులకు విశేషించి పతి అనగా రక్షకుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 188🌹

📚. Prasad Bharadwaj

🌻188. Govidāṃ patiḥ🌻

OM Govidāṃ pataye namaḥ

Gauḥ is speech or language. Gāṃ viṃdati iti govidaḥ Those who know it are Govidaḥ. Their supreme Lord is Govidāṃ patiḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 189 / Vishnu Sahasranama Contemplation - 189🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻189. మరీచిః, मरीचिः, Marīciḥ🌻

ఓం మరీచయే నమః | ॐ मरीचये नमः | OM Marīcaye namaḥ

మరీచిః అనగా తేజస్సు అని అర్థము. తేజస్వినాం అపి తేజః అతః మరీచిః తేజస్సుకలవి యగు సూర్యాదులకును ఇతడే తేజస్సు కావున తేజో వాచకమగు 'మరీచి' శబ్దముచే శ్రీ విష్ణువు చెప్పబడును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।

జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ॥ 36 ॥

వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతుల తేజస్సును, జయించువారలయొక్క జయమును, ప్రయత్నశీలుర యొక్క ప్రయత్నమును, సాత్త్వికులయొక్క సత్త్వగుణమును అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 189🌹

📚. Prasad Bharadwaj

🌻189. Marīciḥ🌻

OM Marīcaye namaḥ

Marīciḥ / मरीचिः means effulgence. Tejasvināṃ api tejaḥ ataḥ marīciḥ / तेजस्विनां अपि तेजः अतः मरीचिः As He is the source of effulgence for even the most effulgent like Sun, He is known by the divine name Marīciḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 10

Dyūtaṃ chalayatāmasmi tejastejasvināmaham,

Jayo’smi vyavasāyo’smi sattvaṃ sattvavatāmaham. (36)

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।

जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥ ३६ ॥

I am the gambling of the practitioners of fraud; I am the radiance of the radiant; I am victory and the striving power; I am the quality of sattva among the good.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 159 / Sri Lalitha Chaitanya Vijnanam - 159

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 159 / Sri Lalitha Chaitanya Vijnanam - 159 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖

🌻159. “మదనాశినీ''🌻

శ్రీదేవి ఎంతటి మదమునైనను నశింపచేయగలదు. మదమును మర్దించుటలో శ్రీమాత పెట్టింది పేరు. ఆమె అసుర సంహారిణి. అసురశక్తులు మితిమీరినపుడు చీల్చిచెండాడ గలదు. మహిషాసురుని మర్దించినది కదా శ్రీదేవి! మహిషాసురుడు మదమునకు మారుపేరు.

ఆరాధకుల విషయమున ఆమె సున్నితముగా మదనిర్మూలనము గావింపగలదు. భక్తి, శ్రద్ధ, ఆర్తీ కలిగి ఆరాధనము చేసినచో తప్పక ఆరాధకుని యందు తన సాన్నిధ్యమును ఇనుమడింపచేసి, అసురశక్తులను దమించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 159 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Madanāśinī मदनाशिनी (159) 🌻

She destroys pride of Her devotees. Annihilating pride is one of the preconditions for realizing the Brahman.

What is followed is preached. She is without pride and She wants Her devotees also to be without pride.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 96 / Sri Vishnu Sahasra Namavali - 96

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 96 / Sri Vishnu Sahasra Namavali - 96 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శతభిషం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

🍀 96. సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ‖ 96 ‖ 🍀

🍀 896) సనాత్ -
ఆది లేనివాడు.

🍀 897) సనాతన సమ: -
సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.

🍀 898) కపిల: -
ఋషులలో కపిలుడు తానైనవాడు.

🍀 899) కపి: -
సూర్యరూపుడు.

🍀 900) అవ్యయ: -
ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.

🍀 901) స్వస్తిద: -
సర్వశ్రేయములను చేకూర్చువాడు.

🍀 902) స్వస్తికృత్ -
శుభమును కూర్చువాడు.

🍀 903) స్వస్తి -
సర్వ మంగళ స్వరూపుడు.

🍀 904) స్వస్తిభుక్ -
శుభమును అనుభవించువాడు.

🍀 905) స్వస్తిదక్షిణ: -
స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 96 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Sathabisham 4th Padam

🌻 96. sanātsanātanatamaḥ kapilaḥ kapiravyayaḥ |
svastidaḥ svastikṛt svasti svastibhuk svastidakṣiṇaḥ || 96 || 🌻

🌻 896. Sanāt:
The word Sanat indicates a great length of time. Time also is the manifestation of the Supreme Being.

🌻 897. Sanātanatamaḥ:
Being the cause of all, He is more ancient than Brahma and other beings, who are generally considered eternal.

🌻 898. Kapilaḥ:
A subterranean fire in the ocean is Kapila, light red in colour.

🌻 899. Kapiḥ:
'Ka' means water. One who drinks or absorbs all water by his Kapi, that is, the sun.

🌻 900. Avyayaḥ:
One in whom all the worlds get dissolved in Pralaya.

🌻 901. Svastidaḥ:
One who gives what is auspicious to devotees.

🌻 902. Svastikṛt:
One who works bestowing what is good.

🌻 903. Svasti:
One whose auspicious form is characterized by supreme Bliss.

🌻 904. Svastibhuk:
One who enjoys the Svasti mentioned above or who preserves the Svasti of devotees.

🌻 905. Svastidakṣiṇaḥ:
One who augments as Svasti (auspiciousness).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 132

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 132 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 11 🌻

539. తమ యందు ఎఱుకలేకున్న ఆత్మలు, జీవాత్మలుగా, పరిణామ దశలు, పునర్జన్మలు ఆధ్యాత్మిక మార్గము అను మూడు ప్రక్రియలను దాటి శివాత్మలైనవి.

జీవము + ఆత్మ = జీవాత్మ (మానవుడు)

జీవము = ప్రపంచ సంబంధమైన వాంఛలు.

జీవము = మిధ్యాహముతో కూడిన జీవితము.

జీవాత్మలో జీవము పోగా, ఆత్మ మిగులును.

(అనగా మానవునిలో వాంఛలు నశించినచో, మానవత్వము పోయి దైవత్వము ప్రాప్తించి ఆతడే భగవంతుడగును)

శివాత్మన్ = భగవంతుడైన మానవుడు.

= బ్రహ్మీభూతుడు.

= "అహం బ్రహ్మాస్మి" స్థితి.

= నిర్వికల్ప సమాధి స్థితి.

జీవ - శివాత్మన్ = సద్గురువు.

శివ - జీవాత్మన్ = అవతార పురుషుడు.

పురుషుడు = ఆత్మ, భగవంతుడు.

పరమ + ఆత్మ = పరమాత్మ,

పరమ = సర్వోత్తమమైన

ఆత్మ = భగవంతుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 193

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 193 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. దధీచిమహర్షి-సువర్చల - 2 🌻

7. ఈ ప్రపంచంలో చెట్లు మొదలైనవన్నీకూడా మన శరీరాలవలె పుట్టి కొంతకాలము పెరిగి చచ్చిపోతున్నాయి. కానీ చైతన్మ్ ఉంటున్నంతసేపు మాత్రమే అవి ఉంటున్నాయి.

8. మనిషికి శరీరం అనేది ఉన్నది. అది ప్రాణం ఉన్నంతసేపుమాత్రమే! ప్రాణంపోతే దానిని శవం అంటాము. అది అప్పుడు పంచభూతాలలో కలసిపోతుంది. పంచభూతాలతో నిర్మాణంచేయబది చైతన్యమాత్రంగా తిరుగుతున్నంతసేపు దానికొక వ్యక్తిత్వము, దానికొక చిత్తము, బుద్ధి, మనసు-ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ విషయం గ్రహించటమే ఆర్యసంస్కృతియొక్క ముఖ్యలక్షణం.

9. ఒక నిగూఢమయినటువంటి ప్రకృతిరహస్యమది. అది వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రతివస్తువునందు జాగ్రత్తతో దానిని చూచేవారు ఆర్యులు. వృక్షమంటే వృక్షమేకదా అని దాన్ని కొట్టకు. మొక్కలను కొట్టి, ఎండబెట్టి పొయ్యిలో పెట్టడము-ఇలాంటివి సాధారణముగా జరుగుతూనే ఉంటాయి.

10. ఒక మోదుగుచెట్టు దగ్గరికి బ్రాహ్మణుడు వెళ్ళి, “ఓ మోదుగు వృక్షమా! నీ కొమ్మను ఒకదానిని నేను యజ్ఞంకోసమని తీసుకుంటాను” అని ప్రార్థిస్తాడు. దానిని చూచి ఎవరైనా, “ఏమిటండీ! ఆయన పిచ్చివాడా! చెట్టును ప్రార్థించటం ఏమిటి? వేదాల్లో చెప్పబడిన మంత్రం ఇదేనా?” అనవచ్చు.

11. అంటే నిగూఢమయిన ఒకానొక చైతన్యము, నిగ్రహానుగ్రహ సమర్థత-ఈ పంచభూతములలో-వృక్షములలో చూడటమే వాళ్ళకున్న విశేషమయిన జ్ఞానము. దానినే మన పూర్వీకులకున్న వేదవిజ్ఞానము అనవచ్చు.

నిజంగా ఆలోచిస్తే కుడిచేతిపని కుడిచేతిదే, ఎడమచేతిది దానిదే! కుడిచేయిభోజనం చెయాడంవల్ల గొప్పదనుకుంటే, అది విరిగిపోతే ఎడమచేతితో తినవలసి రావటంలేదా! దేనిపని, దేవివిలువ దానిదే.

12. లోకంలో క్షిత్రియుడు లేకుండా ధర్మరక్షణ జరగదు. బ్రాహ్మణుడులేకుండా ధర్మముండదు. ధర్మం ఉండాలి. అది రక్షింపబడాలి. రెండూ జరగాలి. అంటే, బ్రాహ్మణుడివల్ల ధర్మం యొక్క ఉనికినినుస్తుంది. దాని యొక్క రక్షణ క్షత్రియుడివల్ల జరుగుతుంది. ఈ ప్రకారంగా వ్యవస్థ చేయబడిఉంది ఆర్యధర్మంలో.

13. అయితే పురాణాల్లో చెప్పబడినట్లు, ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణుడుచేసే పని క్షత్రియుడిచేత, క్షత్రియుడు చేసేపని బ్రాహ్మణుడిచేత జరుపబడిన సందర్భాలూ ఉన్నవి. సమర్థతనుబట్టి అలా జరిగేవి. అంటే బ్రాహ్మక్షత్రాలు పరస్పరపోషకంగా ఉండే రెండు ప్రవృత్తులు. అవి జననకులాన్నిబట్టే ఉండాలనిలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 308

🌹 . శ్రీ శివ మహా పురాణము - 308 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

75. అధ్యాయము - 30

🌻. సతీదేహత్యాగము - 2 🌻

ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నియు పిక్కటిల్లెను. అచట నున్న దేవతలు, మునులు, ఇతరులు అందరు భయమును పొందిరి (18). ఆ గణములన్నియూ కోపించి, ఆయుధములను పైకెత్తి, పరస్పరము సంప్రదించుకొని, ప్రలయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్య ధ్వనులతోనే గాక, వారి శస్త్రములచే దిక్కులు నిండెను (19).

ఓ దేవర్షీ !అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై, ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను, ముఖములను, ఇతరు అవయవములను ఖండించు కొనిరి (20). ఈ విధముగా ఆ సమయమునందు ఇరువది వేల గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము అత్యాశ్చర్యమును కలిగించెను (21).

ఇట్లు నశించగా మిగిలిన, మహాత్ముడగు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించియున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకురికిరి (22). ఓ మహర్షీ !ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులగు రాక్షసులను సంహరించే యజుర్వేదమంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసేను (23). భృగువు హోమమును చేసిన వెంటనే మహావీరులు, ఋభునామము గలవారు నగు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకివేలాదిగా లేచిరి (24).

ఓ మహర్షీ! ప్రమథగణములకు, కాగడాలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి బీభత్సమును కలిగించునది, వినువారికి రోమహర్షణమును కలుగుజేయునది అగు యుద్ధము జరిగెను (25). బ్రహ్మతేజస్సుతో నిండియున్న మహావీరులగు ఆ బు భువులు అన్నివైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా, వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది (26).

ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్ఛచే ఆఋభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను (27). అపుడా దృశ్యమును చూచి, ఋషులు, ఇంద్రుడు మొదలగు దోవతలు, మరుద్గణములు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలురు మిన్నకుండిరి (28). వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునః పునః సమాలోచన చేయుచుండిరి (29).

గొప్ప బుద్ధిశాలురగు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు, శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలుగుబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి (30). ఓ మహర్షీ! దుష్ట బ్రాహ్మణుడు, శివద్రోహి, దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అపుడీవిధమైన విఘ్నము ఘటిల్లెను (31).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

గీతోపనిషత్తు -108

🌹. గీతోపనిషత్తు -108 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 39 - 3

🍀 34 - 3. యత యింద్రియత్వము :

శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు సంబంధించినది. అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింప బడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించు కొనగలరు. 🍀

శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు

సంబంధించినది.

బాహ్యాంతరము లందు చెదరక యుండవలె నన్నచో అంతర్ముఖముగ శ్రద్ధ, నిష్ఠ యుండవలెను. బహిర్ముఖముగ యింద్రియ వ్యాపారములు తన వశమున నుండవలెను. ఇంద్రియముల యందు కన్ను ముఖ్యమే అయినను వానిని వశము చేసుకొనుటలో స్పర్శ, రుచి ముఖ్యమని దైవము మరియొక చోట తెలిపినాడు.

స్పర్శ, రుచి బాహ్యమును అంటును. చూపు, వినికిడి, వాసన సూక్ష్మముగ అంటును. తిన్నది, ముట్టుకున్నది. స్టూలమై, బాహ్యముతో గట్టి సంబంధ మేర్పరచును. అందువలన తినుట, ముట్టుకొనుట అను విషయమున కొంత నియమముండుట ఉపయోగించును.

చూచుట, వినుట, వాసన చూచుట అను విషయముల యందు కూడ నియమము ప్రధానము. చూచునది, వినునది, వాసన చూచునది, రుచి చూచునది, ముట్టుకొనునది, కావలెనని పించుట సామాన్యము. కావలె ననిపించగనె, అవసర మనిపించును. ఇంద్రియార్థముల విషయమున దైవ మొకటే ప్రశ్న పరిష్కారముగ నిచ్చినాడు.

'అవసరమా?' అని యింద్రియార్థముల విషయమున ప్రశ్నించుకొనుట ముఖ్యము. అవసరము లేనివి చూచుట, వినుట, రుచి చూచుట, ముట్టుకొనుట, వాసన చూచుట చేయు వానికి యింద్రియములు బలిష్టమైన గుఱ్ఱములవలె ఐదు దిశల లోనికి లాగుచు నుండును. ఇక ప్రయాణమెక్కడ? రథము ఐదు ముక్కలుగ చీలును. ఇంద్రియములను గుఱ్ఱములను అవసరమునకే వాడవలెను.

ఈ క్రింది విషయములందు అవసరమా? అను ప్రశ్న వేసుకొను చుండవలెను.

1. ఎచ్చటికైన వెళ్లదలచినపుడు, 2. ఏదైన వినదలచినపుడు, 3. తినదలచినపుడు, 4. ముట్టుకొనవలసి వచ్చినపుడు, 5. వాసన చూడ వలసినపుడు.

అవసరము లేక తినుట, తిరుగుట, వినుట, మాట్లాడుట, చూచుట, ముట్టుకొనుట వలన జీవప్రజ్ఞ బాహ్యమున బంధింపబడి యుండును.

బద్ధుడెట్టి కార్యమును నిర్వర్తించలేడు. పంచేంద్రియములందు బద్ధుడైనవాడు కర్మేంద్రియము లందు కూడ బద్దుడగును. ఇట్లు దశేంద్రియములందు బద్దుడై నశించును. కర్మేంద్రియబద్ధుడు ఈ క్రింది విధముగ ప్రవర్తించుచు నుండును.

1. పని లేక తిరుగుట

2. పని లేక వాగుట

3. అవసరము లేని పనులయందు చేతులను వినియోగించుట.

4. మలమూత్రావయవములను నిస్సత్తువ గావించుట.

పంచేంద్రియములను గుఱ్ఱములు, కర్మేంద్రియములతో కూడిన రథమును అవకతవకగ లాగుటచే జీవుడు బాహ్య ప్రజ్ఞ యందే నశించును. ఇక అంతరంగ మెక్కడ. బహిఃకరణములనే

వినియోగించ లేనివాడు అంతఃకరణములను వినియోగింప జాలడు.

అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింపబడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. ఈ శ్లోకము సాధకులకు అత్యంత ప్రాముఖ్యమగు శ్లోకమగుటచే క్లుప్తముగ మరల వివరింపబడు చున్నది.

జీవుడు బాహ్య ప్రపంచమున పనిచేయుటకు మనసు, పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అవసరము. అంత రంగమునుండి చిత్తము, బుద్ధి, అహంకారము పనిచేయును. జీవప్రజ్ఞ ఈ క్రింది విధముగ బాహ్యములోనికి ప్రసరించును.

1. అహంకారము, 2. బుద్ధి, 3. చిత్తము, 4. మనస్సు, 5. జానేంద్రియములు (5), 6. కర్మేంద్రియమలు (5), 6. వాక్కు. మొత్తము 15.

ఒక సంకల్పము కలిగినపుడు ఈ పదునైదు పనిచేయు చుండును. సంకల్పము కర్తవ్యమై యున్నచో దానిని నిర్వర్తించ వలెను. కానిచో విసర్జించవలెను. కర్తవ్యమైనపుడు శ్రద్ధతోను, తదేక

నిష్ఠతోను నిర్వర్తించుటకు అంతఃకరణశుద్ధి ముఖ్యము. అందు వలన శ్రద్ధ, నిష్ఠ అనువాటిని ఆయుధములుగ కర్తవ్య కర్మను జ్ఞానేంద్రియములతోను, కర్మేంద్రియములతోను నిర్వర్తించవలెను.

ఈ శ్లోకమున లింగ శరీరమందలి పదునైదు అంశములు అనుసంధానము చేయుటకు వలసిన దీక్షలను దైవము తెలిపి యున్నాడని తెలియవలెను. అవియే శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించుకొనగలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 142

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 142 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 72 🌻

హిరణ్యగర్భునిచే సృజించబడిన విరాట్ఫురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుచున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమందున్న శిశువునకు ఎటువంటి అపాయము కలుగకుండుటకై శుచియైన ఆహారము తీసుకొని కాపాడుచున్నారో అటులనే అధియజ్ఞుడగు విరాడ్రూప అగ్నిని పై అరణి, క్రింద అరణి అను రెండు అరణుల యందు ఋత్విక్కులు కాపాడుచున్నారు.

అధ్యాత్ముడగు జఠరాగ్నిని యోగులు మితాహారముచే కాపాడుచున్నారు. అట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. విరాడ్రూపమున ఉన్న ఈ అగ్నియు పరబ్రహ్మమే. ఇదియే నీవడిగిన తత్వము.

ఇపుడు హిరణ్యగర్భతత్వాన్ని గూర్చి వివరించ పూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్యగర్భ తత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.

ఎనిమిది తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవ తనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ ఎనిమిది తనువుల సమాహారమైనటువంటి ‘నేను’ విశ్వుడుగా ప్రారంభించి, విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు.

మరల విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడ పిండాండ బ్రహ్మాండ పంచీకరణల యందు స్పష్టంగా బోధించబడుతూఉంది.

జాగ్రత్ సాక్షి యైనటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి యైనటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి యైనటువంటి ప్రాజ్ఞుడు, తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ- విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. ఇదే ప్రత్యగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడు గా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడు గా ఉన్నాడో , ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు.

ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూలదేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూలదేహ సాక్షి - విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి - హిరణ్యగర్భుడు, కారణ దేహ సాక్షి- అవ్యాకృతుడు, మహాకారణ దేహ సాక్షి- పరమాత్మ. అయితే జీవ తనువులలో తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహసాక్షి యైనటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులు. జ్ఞాత, కూటస్థుడు అభిన్నులు.

అయితే సర్వ వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్యగర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితియందు అనంత విశ్వాన్ని తన లోకి గ్రహించి, గర్భిణీ స్త్రీ వలే ఉన్నాడట. అదీ పోలిక.

ఇక్కడ ప్రతిచోట ఒక ఉపమానాన్ని ఉద్దేశిస్తూ, ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ, అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మొదటినుండి. ఈ నడక చాలా ఉత్తమమైన నడక అన్నమాట. ఇది సిద్ధాంతరీత్యా బోధించినట్లుగా బోధించితే, దర్శనరీతిగా గ్రహించ కలిగి నటువంటివారు సత్శిష్యులు.

అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి, అందుబాటు లోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినపుడు సూచన స్థాయి నుండి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ.

సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్ధుడైనవాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తరువాత అర్ధమయేటటువంటి వాడు, బౌద్ధికంగా అర్ధం చేసుకుని, వివరణాత్మకంగా అర్ధం చేసుకుని, సాధనగా స్వీకరించేటటువంటివాడు శిష్యుడు.

వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధను అందుకోలేనటువంటి వారికి ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారున్నారో వారిని ఉద్దేశించి, వారికి అర్ధం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకువస్తారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 16

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 16 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 16 🍀

హరి బుద్ధీ జపే తో నర దుర్లభ్!
వాచేసి సులభ్ రామకృష్ణ!!

రామకృష్ణ నామీ ఉన్మనీ సాధిలీ!
తయాసీ లాధలీ సకళ్ సిద్ధీ!!

సిద్ధి బుద్ధీ ధర్మ్ హరిపాఠీ ఆలే!
ప్రపంచీ నివాలే సాదు సంగే!!

జ్ఞానదేవీ నామ రామకృష్ణ రసా!
యెణే దశదిశా ఆత్మారామ్!!

భావము:

రామ కృష్ణ నామము నాలుకతో పలుకడము చాలా సులభము అయిన కాని హరి నామ జపము చేయాలనే బుద్ధి కలిగే నరులు దుర్లభము.

రామకృష్ణ నామము మనుసును ఉన్మనిస్థితికి చేర్చును. అప్పుడు వారికి సకల సిద్ధులు లభించును. హరిపాఠము పఠించే వారికి సిద్ధి, బుద్ధి మరియు ధర్మాలు తెలిసిపోయి సాధువుల సాంగత్యముతో ప్రాపంచీకుల మనసు నిశ్చలమగును.

నామ స్మరణ వలన రామకృష్ణ స్వరూప ముద్రాంకితులై వారికి దశదిశలయందు ఆత్మారాముడు దర్శనమిస్తాడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.

🌻. నామ సుధ -16 🌻

హరి బుద్ధితో నామ జపము

చేయు నరులు బహు దుర్లభము

పలకడానికి అతి సులభము

రామకృష్ణుల మధుర నామము

రామ కృష్ణనామ ధ్యానము

మనసును హరిలో చేయునిమగ్నము

వెంబడించును సిద్ధులు సర్వము

అయినవి వారికి వెంటనే ప్రాప్తము

సిద్ధిబుద్ధి మరియు ధర్మము

హరిపాఠకునిలో చేరును సులభము

సాధు జనులతో సాంగత్యము

ప్రాపంచీకుల మనసు నిశ్చలము

జ్ఞానదేవునిలో హరినామము

రామ కృష్ణ ముద్రాంకితము

దశ దిశలందున భవ్య రూపము

ఆత్మారాముని దివ్యదర్శనము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

25 Dec 2020

25-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 188, 189 / Vishnu Sahasranama Contemplation - 188, 189🌹
3) 🌹 Daily Wisdom - 9 🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 142🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 16 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 163🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 87🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 159 / Sri Lalita Chaitanya Vijnanam - 159🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 500 / Bhagavad-Gita - 500🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 108🌹 
11) 🌹. శివ మహా పురాణము - 306🌹 
12) 🌹 Light On The Path - 61🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 193 🌹 
14) 🌹. చేతనత్వ బీజాలు - 257 / Seeds Of Consciousness - 257🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 132🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 97 / Sri Vishnu Sahasranama - 97🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 06 🌴*

06. ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్తా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితిం మతముత్తమమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! ఈ కర్మలనన్నింటిని సంగత్వముగాని, ఎట్టి ఫలాపేక్షగాని లేకుండా స్వధర్మమనెడి భావనలో ఒనరింపవలెను. ఇదియే నా తుది అభిప్రాయము.

🌷. భాష్యము :
యజ్ఞవిధానములు పవిత్రమొనర్చునవే అయినను మనుజుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు. అనగా భౌతికాభ్యుదయమునకు దోహదములైన యజ్ఞములను త్యజించివేయవలెనే గాని, తన జీవనమును పవిత్రమొనర్చి ఆధ్యాత్మికస్థాయికి ఉద్ధరించు యజ్ఞములను మనుజుడు నిలిపివేయరాదు. 

కృష్ణభక్తిరసభావనకు దోహదములయ్యెడి ప్రతిదానిని ప్రోత్సహింపవలెను. శ్రీకృష్ణభగవానుని భక్తికి కారణమయ్యెడి ఎట్టి కర్మనైనను అంగీకరింపవలెనని శ్రీమద్భాగవతమునందు తెలుపబడినది. 

ధర్మమునకు అత్యున్నత ప్రమాణమిదియే. కనుక భక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు తనకు సహాయభూతమగు ఎట్టి కర్మమునైనను, యజ్ఞమునైనను, దానమునైనను తప్పక స్వీకరింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 589 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 06 🌴*

06. etāny api tu karmāṇi saṅgaṁ tyaktvā phalāni ca
kartavyānīti me pārtha niścitaṁ matam uttamam

🌷 Translation : 
All these activities should be performed without attachment or any expectation of result. They should be performed as a matter of duty, O son of Pṛthā. That is My final opinion.

🌹 Purport :
Although all sacrifices are purifying, one should not expect any result by such performances. In other words, all sacrifices which are meant for material advancement in life should be given up, but sacrifices that purify one’s existence and elevate one to the spiritual plane should not be stopped. 

Everything that leads to Kṛṣṇa consciousness must be encouraged. In the Śrīmad-Bhāgavatam also it is said that any activity which leads to devotional service to the Lord should be accepted. That is the highest criterion of religion. A devotee of the Lord should accept any kind of work, sacrifice or charity which will help him in the discharge of devotional service to the Lord.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 188, 189 / Vishnu Sahasranama Contemplation - 188, 189 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻188. గోవిదాం పతిః, गोविदां पतिः, Govidāṃ patiḥ🌻*

*ఓం గోవిదాం పతయే నమః | ॐ गोविदां पतये नमः | OM Govidāṃ pataye namaḥ*

గౌః అనగా వాక్కు. గాం విందతి ఇతి గోవిదః వాక్తత్త్వమును ఎరిగిన వారిని 'గోవిదః' అందురు. అట్టి గోవిదులకు విశేషించి పతి అనగా రక్షకుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 188🌹*
📚. Prasad Bharadwaj 

*🌻188. Govidāṃ patiḥ🌻*

*OM Govidāṃ pataye namaḥ*

Gauḥ is speech or language. Gāṃ viṃdati iti govidaḥ Those who know it are Govidaḥ. Their supreme Lord is Govidāṃ patiḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 189 / Vishnu Sahasranama Contemplation - 189🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻189. మరీచిః, मरीचिः, Marīciḥ🌻*

*ఓం మరీచయే నమః | ॐ मरीचये नमः | OM Marīcaye namaḥ*

మరీచిః అనగా తేజస్సు అని అర్థము. తేజస్వినాం అపి తేజః అతః మరీచిః తేజస్సుకలవి యగు సూర్యాదులకును ఇతడే తేజస్సు కావున తేజో వాచకమగు 'మరీచి' శబ్దముచే శ్రీ విష్ణువు చెప్పబడును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ॥ 36 ॥

వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతుల తేజస్సును, జయించువారలయొక్క జయమును, ప్రయత్నశీలుర యొక్క ప్రయత్నమును, సాత్త్వికులయొక్క సత్త్వగుణమును అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 189🌹*
📚. Prasad Bharadwaj 

*🌻189. Marīciḥ🌻*

*OM Marīcaye namaḥ*

Marīciḥ / मरीचिः means effulgence. Tejasvināṃ api tejaḥ ataḥ marīciḥ / तेजस्विनां अपि तेजः अतः मरीचिः As He is the source of effulgence for even the most effulgent like Sun, He is known by the divine name Marīciḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Dyūtaṃ chalayatāmasmi tejastejasvināmaham,
Jayo’smi vyavasāyo’smi sattvaṃ sattvavatāmaham. (36)

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥ ३६ ॥

I am the gambling of the practitioners of fraud; I am the radiance of the radiant; I am victory and the striving power; I am the quality of sattva among the good.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 8 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 8. The Great Root of Life 🌻*

The Truth, “knowing which everything becomes known” is the subject of enquiry and the object of quest in the Upanishads. The Seers dived into the very depth of Existence and tasted the nature of the Limitless Life. 

They entered into the Root of the universe and the branches could easily realise their inner being through an investigation into the essential workings of the Great Root of Life. When the root is watered, the branches are automatically watered; when gold is known, all the ornaments also are known; when Truth is realised, everything is realised; for, Truth is One. 

Whatever system of philosophy may be derived from the Upanishads, the obvious truth goes without saying that they propound a theory that holds Reality to be indivisible, objectless and transcendent. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 142 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 72 🌻*

హిరణ్యగర్భునిచే సృజించబడిన విరాట్ఫురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుచున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమందున్న శిశువునకు ఎటువంటి అపాయము కలుగకుండుటకై శుచియైన ఆహారము తీసుకొని కాపాడుచున్నారో అటులనే అధియజ్ఞుడగు విరాడ్రూప అగ్నిని పై అరణి, క్రింద అరణి అను రెండు అరణుల యందు ఋత్విక్కులు కాపాడుచున్నారు. 

అధ్యాత్ముడగు జఠరాగ్నిని యోగులు మితాహారముచే కాపాడుచున్నారు. అట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. విరాడ్రూపమున ఉన్న ఈ అగ్నియు పరబ్రహ్మమే. ఇదియే నీవడిగిన తత్వము.

        ఇపుడు హిరణ్యగర్భతత్వాన్ని గూర్చి వివరించ పూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్యగర్భ తత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. 

ఎనిమిది తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవ తనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ ఎనిమిది తనువుల సమాహారమైనటువంటి ‘నేను’ విశ్వుడుగా ప్రారంభించి, విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు.

        మరల విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడ పిండాండ బ్రహ్మాండ పంచీకరణల యందు స్పష్టంగా బోధించబడుతూఉంది.  

జాగ్రత్ సాక్షి యైనటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి యైనటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి యైనటువంటి ప్రాజ్ఞుడు, తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ- విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. ఇదే ప్రత్యగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడు గా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడు గా ఉన్నాడో , ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు.
        
ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూలదేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూలదేహ సాక్షి - విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి - హిరణ్యగర్భుడు, కారణ దేహ సాక్షి- అవ్యాకృతుడు, మహాకారణ దేహ సాక్షి- పరమాత్మ. అయితే జీవ తనువులలో తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహసాక్షి యైనటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులు. జ్ఞాత, కూటస్థుడు అభిన్నులు.

        అయితే సర్వ వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్యగర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితియందు అనంత విశ్వాన్ని తన లోకి గ్రహించి, గర్భిణీ స్త్రీ వలే ఉన్నాడట. అదీ పోలిక. 

ఇక్కడ ప్రతిచోట ఒక ఉపమానాన్ని ఉద్దేశిస్తూ, ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ, అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మొదటినుండి. ఈ నడక చాలా ఉత్తమమైన నడక అన్నమాట. ఇది సిద్ధాంతరీత్యా బోధించినట్లుగా బోధించితే, దర్శనరీతిగా గ్రహించ కలిగి నటువంటివారు సత్శిష్యులు. 

అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి, అందుబాటు లోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినపుడు సూచన స్థాయి నుండి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ.

సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్ధుడైనవాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తరువాత అర్ధమయేటటువంటి వాడు, బౌద్ధికంగా అర్ధం చేసుకుని, వివరణాత్మకంగా అర్ధం చేసుకుని, సాధనగా స్వీకరించేటటువంటివాడు శిష్యుడు. 

వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధను అందుకోలేనటువంటి వారికి ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారున్నారో వారిని ఉద్దేశించి, వారికి అర్ధం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకువస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 16 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 16 🍀*

హరి బుద్ధీ జపే తో నర దుర్లభ్!
వాచేసి సులభ్ రామకృష్ణ!!
రామకృష్ణ నామీ ఉన్మనీ సాధిలీ!
తయాసీ లాధలీ సకళ్ సిద్ధీ!!
సిద్ధి బుద్ధీ ధర్మ్ హరిపాఠీ ఆలే!
ప్రపంచీ నివాలే సాదు సంగే!!
జ్ఞానదేవీ నామ రామకృష్ణ రసా!
యెణే దశదిశా ఆత్మారామ్!!

భావము:
రామ కృష్ణ నామము నాలుకతో పలుకడము చాలా సులభము అయిన కాని హరి నామ జపము చేయాలనే బుద్ధి కలిగే నరులు దుర్లభము.

రామకృష్ణ నామము మనుసును ఉన్మనిస్థితికి చేర్చును. అప్పుడు వారికి సకల సిద్ధులు లభించును. హరిపాఠము పఠించే వారికి సిద్ధి, బుద్ధి మరియు ధర్మాలు తెలిసిపోయి సాధువుల సాంగత్యముతో ప్రాపంచీకుల మనసు నిశ్చలమగును. 

నామ స్మరణ వలన రామకృష్ణ స్వరూప ముద్రాంకితులై వారికి దశదిశలయందు ఆత్మారాముడు దర్శనమిస్తాడని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.

*🌻. నామ సుధ -16 🌻*

హరి బుద్ధితో నామ జపము
చేయు నరులు బహు దుర్లభము
పలకడానికి అతి సులభము
రామకృష్ణుల మధుర నామము
రామ కృష్ణనామ ధ్యానము
మనసును హరిలో చేయునిమగ్నము
వెంబడించును సిద్ధులు సర్వము
అయినవి వారికి వెంటనే ప్రాప్తము
సిద్ధిబుద్ధి మరియు ధర్మము
హరిపాఠకునిలో చేరును సులభము
సాధు జనులతో సాంగత్యము
ప్రాపంచీకుల మనసు నిశ్చలము
జ్ఞానదేవునిలో హరినామము
రామ కృష్ణ ముద్రాంకితము
దశ దిశలందున భవ్య రూపము
ఆత్మారాముని దివ్యదర్శనము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 163 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
155

Sloka:
 Yasya prasadadahameva vishnuh mayyeva sarvam parikalpitam ca | Ittham vijanami sadatma tattvam tasyanghri padmam pranatosmi nityam ||

Obeisance to the lotus feet of Sachchidananda Sadguru whose grace has enabled me to grasp the principle of Supreme Truth and attain knowledge that I am Vishnu, that I am the all-pervasive soul and that the whole universe is conceived in me.

Sloka: 
Iti sri skanda purane uttara khande umamahesvara samvade sri guru gita samapta ||

Everybody should remember that the Sadguru is as essential as one’s own breath. We may say, “We read the Guru Gita, we all heard the Guru Gita, we discussed it in the form of short stories, I read it 10 times, I studied it 20 times, I did 7 Saptahas” (1 Saptaha = reading for 7 days), but we need the Guru every step of our lives, not just during the study of Guru Gita or during the Saptaha.

 It is only when we study the Guru Gita, undertake Saptaha or 7 Saptahas, chant the Guru’s name, study the Guru Gita, understand the Guru Principle, follow the Guru, stay in the presence of the Guru as much as possible in one’s life, with a view to strengthening our desire for a Guru that we attain liberation. 

Guru is like our breath. Giving up your Guru is like giving up your breath. It will not matter then whether we breathe or not at that point. A Guru is must in one’s life. Everybody should know that the Sadguru is as essential as one’s own breath.

Only a person who is desirous of learning more and more about the fame of the Guru and about the Guru principle regardless of how much he’s already learned, will actually realize the Guru Principle. One who thinks, “I have understood, that is enough, I read the Guru Gita several times, I learned the Guru Principle many times, that’s good enough” will never attain the Guru Principle, or anything else.

A lot of people have described the Guru Principle in several different ways. Sri Sankara Bhagavatpada (Sri Adi Sankaracharya) was the first to expound on it. Swamiji is giving you only as much as you need from this hymn composed by Sri Adi Sankaracharya

Sloka (from Sankaracharya’s Guru Ashtakam): Sareeram suroopam thatha va kalathram, Yasascharu chithram dhanam meru thulyam, Guroranghri padme manaschenna lagnam, Thathah kim Thatha kim, Thatha kim Thatha kim

Right in the beginning of this hymn, we are being cautioned, “You have a beautiful body, but what is the use?” The sculptor sculpts according to the Agama scriptures (these scriptures talk about the architectural principles for temple construction, creation of idols and much more), yet the sculpture doesn’t look like it has life in it. 

There is a procedure called “Drishti Pradanam”. Only when this is completed does the sculpture come alive with conscious awareness. “Drishti Pradanam” is a procedure done to sculptures after the yantra is installed and the sculpture is put in place.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 87 / Sri Lalitha Sahasra Nama Stotram - 87 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 159 / Sri Lalitha Chaitanya Vijnanam - 159 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*

*🌻159. “మదనాశినీ''🌻*

శ్రీదేవి ఎంతటి మదమునైనను నశింపచేయగలదు. మదమును మర్దించుటలో శ్రీమాత పెట్టింది పేరు. ఆమె అసుర సంహారిణి. అసురశక్తులు మితిమీరినపుడు చీల్చిచెండాడ గలదు. మహిషాసురుని మర్దించినది కదా శ్రీదేవి! మహిషాసురుడు మదమునకు మారుపేరు.

 ఆరాధకుల విషయమున ఆమె సున్నితముగా మదనిర్మూలనము గావింపగలదు. భక్తి, శ్రద్ధ, ఆర్తీ కలిగి ఆరాధనము చేసినచో తప్పక ఆరాధకుని యందు తన సాన్నిధ్యమును ఇనుమడింపచేసి, అసురశక్తులను దమించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 159 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Madanāśinī मदनाशिनी (159) 🌻* 

She destroys pride of Her devotees. Annihilating pride is one of the preconditions for realizing the Brahman.  

What is followed is preached. She is without pride and She wants Her devotees also to be without pride.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 500 / Bhagavad-Gita - 500 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 10 🌴*

10. రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజ: సత్త్వం తమశ్చైవ తమ: సత్త్వం రజస్తథా ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశీయుడా! కొన్నిమార్లు రజస్తమోగుణములను జయించి సత్త్వగుణము ప్రబలమగుచుండును. మరికొన్నిమార్లు రజోగుణము సత్త్వ, తమోగుణములను జయించుచుండును. ఇంకొన్నిమార్లు తమోగుణము సత్త్వ, రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును.

🌷. భాష్యము :
రజోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు తమోగుణము జయింపబడును. సత్త్వగుణము ప్రధానమైనప్పుడు రజస్తమోగుణములు జయింపబడును. ఇక తమోగుణము ప్రబలమైనప్పుడు సత్త్వగుణము మరియు రజోగుణము జయింపబడి యుండును. 

త్రిగుణముల నడుమ ఇట్టి పోటీ సదా కొనసాగుచునే యుండును కావున కృష్ణభక్తిభావనలో వాస్తవముగా పురోగతి కోరువాడు వీటిని అధిగమింపబలయును. మనుజుని యందు ప్రబలమైయున్నట్టి గుణము అతని వ్యవహారములు, కర్మలు, ఆహారము మొదలగు విషయముల ద్వారా వ్యక్తమగుచుండును. ఈ విషయము రాబోవు అధ్యాయములలో వివరింపబడును. 

కాని మనుజుడు తలచినచో సాధన ద్వారా సత్త్వగుణమును వృద్ధిచేసికొని రజస్తమోగుణములను జయింపవచ్చును. అదే విధముగా అతడు రజోగుణము వృద్ధిచేసికొని సత్త్వతమోగుణములను జయింపవచ్చును లేదా తమోగుణమును అలవరచుకొని సత్త్వరజోగుణములను జయింపవచ్చును. 

ఈ విధముగా ప్రకృతిగుణములు మూడువిధములైనను స్థిరనిశ్చయము కలిగినవాడు సత్త్వగుణమునందు స్థితుడు కాగలడు. పిదప ఆ సత్త్వగుణమును సైతము అతడు అధిగమించి “వసుదేవస్థితి” యను శుద్ధసత్త్వమునకు చేరగలడు. 

అట్టి స్థితియందే మనుజుడు భగవద్విజ్ఞానమును అవగాహనము చేసికొనగలడు. అనగా మనుజుని కర్మల ననుసరించి అతడు ఎట్టి గుణమునందు స్థితుడైయున్నాడో తెలిసికొనవచ్చును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 500 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 10 🌴*

10. rajas tamaś cābhibhūya sattvaṁ bhavati bhārata
rajaḥ sattvaṁ tamaś caiva tamaḥ sattvaṁ rajas tathā 

🌷 Translation : 
Sometimes the mode of goodness becomes prominent, defeating the modes of passion and ignorance, O son of Bharata. Sometimes the mode of passion defeats goodness and ignorance, and at other times ignorance defeats goodness and passion. In this way there is always competition for supremacy.

🌹 Purport :
When the mode of passion is prominent, the modes of goodness and ignorance are defeated. When the mode of goodness is prominent, passion and ignorance are defeated. 

And when the mode of ignorance is prominent, passion and goodness are defeated. This competition is always going on. Therefore, one who is actually intent on advancing in Kṛṣṇa consciousness has to transcend these three modes. 

The prominence of some certain mode of nature is manifested in one’s dealings, in his activities, in eating, etc. All this will be explained in later chapters. But if one wants, he can develop, by practice, the mode of goodness and thus defeat the modes of ignorance and passion. One can similarly develop the mode of passion and defeat goodness and ignorance. Or one can develop the mode of ignorance and defeat goodness and passion.

 Although there are these three modes of material nature, if one is determined he can be blessed by the mode of goodness, and by transcending the mode of goodness he can be situated in pure goodness, which is called the vasudeva state, a state in which one can understand the science of God. By the manifestation of particular activities, it can be understood in what mode of nature one is situated.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -108 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 39 - 3

*🍀 34 - 3. యత యింద్రియత్వము :
శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు సంబంధించినది. అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింప బడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించు కొనగలరు. 🍀*

శ్రద్ధ, తదేక నిష్ఠతో పాటుగ యమింపబడిన యింద్రియములను గూర్చి దైవము పలికినాడు. ఇంద్రియ నియమము జీవుని బాహ్య ప్రజ్ఞకు సంబంధించినది. శ్రద్ధ, నిష్ఠ అంతర్ముఖ ప్రజ్ఞకు
సంబంధించినది. 

బాహ్యాంతరము లందు చెదరక యుండవలె నన్నచో అంతర్ముఖముగ శ్రద్ధ, నిష్ఠ యుండవలెను. బహిర్ముఖముగ యింద్రియ వ్యాపారములు తన వశమున నుండవలెను. ఇంద్రియముల యందు కన్ను ముఖ్యమే అయినను వానిని వశము చేసుకొనుటలో స్పర్శ, రుచి ముఖ్యమని దైవము మరియొక చోట తెలిపినాడు. 

స్పర్శ, రుచి బాహ్యమును అంటును. చూపు, వినికిడి, వాసన సూక్ష్మముగ అంటును. తిన్నది, ముట్టుకున్నది. స్టూలమై, బాహ్యముతో గట్టి సంబంధ మేర్పరచును. అందువలన తినుట, ముట్టుకొనుట అను విషయమున కొంత నియమముండుట ఉపయోగించును. 

చూచుట, వినుట, వాసన చూచుట అను విషయముల యందు కూడ నియమము ప్రధానము. చూచునది, వినునది, వాసన చూచునది, రుచి చూచునది, ముట్టుకొనునది, కావలెనని పించుట సామాన్యము. కావలె ననిపించగనె, అవసర మనిపించును. ఇంద్రియార్థముల విషయమున దైవ మొకటే ప్రశ్న పరిష్కారముగ నిచ్చినాడు. 

'అవసరమా?' అని యింద్రియార్థముల విషయమున ప్రశ్నించుకొనుట ముఖ్యము. అవసరము లేనివి చూచుట, వినుట, రుచి చూచుట, ముట్టుకొనుట, వాసన చూచుట చేయు వానికి యింద్రియములు బలిష్టమైన గుఱ్ఱములవలె ఐదు దిశల లోనికి లాగుచు నుండును. ఇక ప్రయాణమెక్కడ? రథము ఐదు ముక్కలుగ చీలును. ఇంద్రియములను గుఱ్ఱములను అవసరమునకే వాడవలెను. 

ఈ క్రింది విషయములందు అవసరమా? అను ప్రశ్న వేసుకొను చుండవలెను. 

1. ఎచ్చటికైన వెళ్లదలచినపుడు, 2. ఏదైన వినదలచినపుడు, 3. తినదలచినపుడు, 4. ముట్టుకొనవలసి వచ్చినపుడు, 5. వాసన చూడ వలసినపుడు. 

అవసరము లేక తినుట, తిరుగుట, వినుట, మాట్లాడుట, చూచుట, ముట్టుకొనుట వలన జీవప్రజ్ఞ బాహ్యమున బంధింపబడి యుండును. 

బద్ధుడెట్టి కార్యమును నిర్వర్తించలేడు. పంచేంద్రియములందు బద్ధుడైనవాడు కర్మేంద్రియము లందు కూడ బద్దుడగును. ఇట్లు దశేంద్రియములందు బద్దుడై నశించును. కర్మేంద్రియబద్ధుడు ఈ క్రింది విధముగ ప్రవర్తించుచు నుండును.

1. పని లేక తిరుగుట
2. పని లేక వాగుట
3. అవసరము లేని పనులయందు చేతులను వినియోగించుట.
4. మలమూత్రావయవములను నిస్సత్తువ గావించుట.

పంచేంద్రియములను గుఱ్ఱములు, కర్మేంద్రియములతో కూడిన రథమును అవకతవకగ లాగుటచే జీవుడు బాహ్య ప్రజ్ఞ యందే నశించును. ఇక అంతరంగ మెక్కడ. బహిఃకరణములనే
వినియోగించ లేనివాడు అంతఃకరణములను వినియోగింప జాలడు. 

అంతఃకరణములు, బహిఃకరణములు సవ్యముగ నిర్వర్తింపబడుటయే గాక, అన్నిటి నుండియు అఖండమై 'తాను' అను ప్రజ్ఞ ప్రసరించినపుడే జ్ఞానమున కర్హత అని తెలియవలెను. అట్టి అఖండ ప్రజ్ఞ కలవారే పరమశాంతి కర్హులు. ఈ శ్లోకము సాధకులకు అత్యంత ప్రాముఖ్యమగు శ్లోకమగుటచే క్లుప్తముగ మరల వివరింపబడు చున్నది. 

జీవుడు బాహ్య ప్రపంచమున పనిచేయుటకు మనసు, పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు అవసరము. అంత రంగమునుండి చిత్తము, బుద్ధి, అహంకారము పనిచేయును. జీవప్రజ్ఞ ఈ క్రింది విధముగ బాహ్యములోనికి ప్రసరించును.

1. అహంకారము, 2. బుద్ధి, 3. చిత్తము, 4. మనస్సు, 5. జానేంద్రియములు (5), 6. కర్మేంద్రియమలు (5), 6. వాక్కు. మొత్తము 15.

ఒక సంకల్పము కలిగినపుడు ఈ పదునైదు పనిచేయు చుండును. సంకల్పము కర్తవ్యమై యున్నచో దానిని నిర్వర్తించ వలెను. కానిచో విసర్జించవలెను. కర్తవ్యమైనపుడు శ్రద్ధతోను, తదేక
నిష్ఠతోను నిర్వర్తించుటకు అంతఃకరణశుద్ధి ముఖ్యము. అందు వలన శ్రద్ధ, నిష్ఠ అనువాటిని ఆయుధములుగ కర్తవ్య కర్మను జ్ఞానేంద్రియములతోను, కర్మేంద్రియములతోను నిర్వర్తించవలెను. 

ఈ శ్లోకమున లింగ శరీరమందలి పదునైదు అంశములు అనుసంధానము చేయుటకు వలసిన దీక్షలను దైవము తెలిపి యున్నాడని తెలియవలెను. అవియే శ్రద్ధ, నిష్ఠ, యింద్రియ నిగ్రహము. ఈ మూడు దీక్షలను స్వీకరించువారు జ్ఞానమున నడచి, బంధములను తొలగించుకొనగలరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 308 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
75. అధ్యాయము - 30

*🌻. సతీదేహత్యాగము - 2 🌻*

ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నియు పిక్కటిల్లెను. అచట నున్న దేవతలు, మునులు, ఇతరులు అందరు భయమును పొందిరి (18). ఆ గణములన్నియూ కోపించి, ఆయుధములను పైకెత్తి, పరస్పరము సంప్రదించుకొని, ప్రలయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్య ధ్వనులతోనే గాక, వారి శస్త్రములచే దిక్కులు నిండెను (19). 

ఓ దేవర్షీ !అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై, ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను, ముఖములను, ఇతరు అవయవములను ఖండించు కొనిరి (20). ఈ విధముగా ఆ సమయమునందు ఇరువది వేల గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము అత్యాశ్చర్యమును కలిగించెను (21).

ఇట్లు నశించగా మిగిలిన, మహాత్ముడగు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించియున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకురికిరి (22). ఓ మహర్షీ !ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులగు రాక్షసులను సంహరించే యజుర్వేదమంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసేను (23). భృగువు హోమమును చేసిన వెంటనే మహావీరులు, ఋభునామము గలవారు నగు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకివేలాదిగా లేచిరి (24).

 ఓ మహర్షీ! ప్రమథగణములకు, కాగడాలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి బీభత్సమును కలిగించునది, వినువారికి రోమహర్షణమును కలుగుజేయునది అగు యుద్ధము జరిగెను (25). బ్రహ్మతేజస్సుతో నిండియున్న మహావీరులగు ఆ బు భువులు అన్నివైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా, వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది (26).

ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్ఛచే ఆఋభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను (27). అపుడా దృశ్యమును చూచి, ఋషులు, ఇంద్రుడు మొదలగు దోవతలు, మరుద్గణములు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలురు మిన్నకుండిరి (28). వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునః పునః సమాలోచన చేయుచుండిరి (29).

  గొప్ప బుద్ధిశాలురగు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు, శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలుగుబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి (30). ఓ మహర్షీ! దుష్ట బ్రాహ్మణుడు, శివద్రోహి, దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అపుడీవిధమైన విఘ్నము ఘటిల్లెను (31).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 61 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 6 🌻*

256. It is only after the buddhic body is fully developed on all the seven sub-planes that the man has the full fruition of the whole plane, a complete power of identification with the whole of humanity, so that he can learn through that relation what all these people think and feel. 

Before that buddhic consciousness is gained we may labour to reduce the sense of separateness and it may be done with great success intellectually, but we still remain outside, in the sense of not understanding others. They will still be an absolute mystery, for man is the greatest of mysteries to his fellow-man. 

We may come into very close relations with people for quite a long time, and yet not really know them inside. It may be that until the buddhic level is reached no man ever really knows any other man thoroughly.1 (1 Ante., Vol. II, p. 67.) When a man reaches that condition he is able to pour himself down into the consciousness of others and see what they do and why they act in that particular way. There all things are within him instead of outside, and he studies them as parts of himself. It sounds impossible down here, but that is something of what he feels. 

All the joy of the world is his joy; its suffering is his suffering. When he chooses to put himself down through any one of the million tentacles – the consciousnesses of other people with which he is one – then he can and does experience all which that person is experiencing. In this way all the world’s suffering is within his reach, but he knows with absolute certainty that it is a necessary part of the plan and has no existence on those higher levels. 

He is in no way less sympathetic with it, yet he knows that “Brahman is Bliss”, and that to be one with the divine is a state of perpetual inner joy. It is only when one gains that development that one can fully help others.

257. When a man touches that consciousness he has for a time withdrawn from these lower physical levels where he can be perturbed or upset, and he is himself part of the divine joy. When he comes back again into his mental, astral and physical bodies he may permit little troubles to annoy him. 

This ought not to be so; but still there is a great gap between the higher life and that lived in the physical body, where small things can still be very irritating. The possibility of being momentarily annoyed by something on the physical plane remains even when a very high level has been reached, but it is then merely superficial. The things from which people really suffer in this world are those which they feel to be hopeless. 

No one can ever have any feeling of hopelessness after he has touched that higher consciousness, because when we are absolutely certain that the reality is always joy, we know that all suffering at lower levels is only temporary, and that even that would not come to us if we were nearer to perfection.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 193 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దధీచిమహర్షి-సువర్చల - 2 🌻*

7. ఈ ప్రపంచంలో చెట్లు మొదలైనవన్నీకూడా మన శరీరాలవలె పుట్టి కొంతకాలము పెరిగి చచ్చిపోతున్నాయి. కానీ చైతన్మ్ ఉంటున్నంతసేపు మాత్రమే అవి ఉంటున్నాయి. 

8. మనిషికి శరీరం అనేది ఉన్నది. అది ప్రాణం ఉన్నంతసేపుమాత్రమే! ప్రాణంపోతే దానిని శవం అంటాము. అది అప్పుడు పంచభూతాలలో కలసిపోతుంది. పంచభూతాలతో నిర్మాణంచేయబది చైతన్యమాత్రంగా తిరుగుతున్నంతసేపు దానికొక వ్యక్తిత్వము, దానికొక చిత్తము, బుద్ధి, మనసు-ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ విషయం గ్రహించటమే ఆర్యసంస్కృతియొక్క ముఖ్యలక్షణం.

9. ఒక నిగూఢమయినటువంటి ప్రకృతిరహస్యమది. అది వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రతివస్తువునందు జాగ్రత్తతో దానిని చూచేవారు ఆర్యులు. వృక్షమంటే వృక్షమేకదా అని దాన్ని కొట్టకు. మొక్కలను కొట్టి, ఎండబెట్టి పొయ్యిలో పెట్టడము-ఇలాంటివి సాధారణముగా జరుగుతూనే ఉంటాయి. 

10. ఒక మోదుగుచెట్టు దగ్గరికి బ్రాహ్మణుడు వెళ్ళి, “ఓ మోదుగు వృక్షమా! నీ కొమ్మను ఒకదానిని నేను యజ్ఞంకోసమని తీసుకుంటాను” అని ప్రార్థిస్తాడు. దానిని చూచి ఎవరైనా, “ఏమిటండీ! ఆయన పిచ్చివాడా! చెట్టును ప్రార్థించటం ఏమిటి? వేదాల్లో చెప్పబడిన మంత్రం ఇదేనా?” అనవచ్చు. 

11. అంటే నిగూఢమయిన ఒకానొక చైతన్యము, నిగ్రహానుగ్రహ సమర్థత-ఈ పంచభూతములలో-వృక్షములలో చూడటమే వాళ్ళకున్న విశేషమయిన జ్ఞానము. దానినే మన పూర్వీకులకున్న వేదవిజ్ఞానము అనవచ్చు.
నిజంగా ఆలోచిస్తే కుడిచేతిపని కుడిచేతిదే, ఎడమచేతిది దానిదే! కుడిచేయిభోజనం చెయాడంవల్ల గొప్పదనుకుంటే, అది విరిగిపోతే ఎడమచేతితో తినవలసి రావటంలేదా! దేనిపని, దేవివిలువ దానిదే. 

12. లోకంలో క్షిత్రియుడు లేకుండా ధర్మరక్షణ జరగదు. బ్రాహ్మణుడులేకుండా ధర్మముండదు. ధర్మం ఉండాలి. అది రక్షింపబడాలి. రెండూ జరగాలి. అంటే, బ్రాహ్మణుడివల్ల ధర్మం యొక్క ఉనికినినుస్తుంది. దాని యొక్క రక్షణ క్షత్రియుడివల్ల జరుగుతుంది. ఈ ప్రకారంగా వ్యవస్థ చేయబడిఉంది ఆర్యధర్మంలో. 

13. అయితే పురాణాల్లో చెప్పబడినట్లు, ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణుడుచేసే పని క్షత్రియుడిచేత, క్షత్రియుడు చేసేపని బ్రాహ్మణుడిచేత జరుపబడిన సందర్భాలూ ఉన్నవి. సమర్థతనుబట్టి అలా జరిగేవి. అంటే బ్రాహ్మక్షత్రాలు పరస్పరపోషకంగా ఉండే రెండు ప్రవృత్తులు. అవి జననకులాన్నిబట్టే ఉండాలనిలేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 257 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻106. The highest type of rest is when 'I am' and 'I am not' are both forgotten. It is called 'Param Vishranti', which also means total rest, complete relaxation or utter quietude in the highest state. 🌻*

The word 'rest' has to be understood in its highest sense where you don't have rest for a certain period of time, but are eternally at rest. 

This state has been called as 'Param Vishranti', or the highest and final rest. In this state both the 'I am' and 'I am not' are forgotten. They are, in fact, aspects of the consciousness and you are neither of them. 

The meaning of the expression 'Param Vishranti' has been given as the highest type of rest. (In Marathi, 'param'=highest, 'vishranti'= rest. To clarify even further, the word 'vishranti' maybe split into 'visra'=forget, 'anti'=in the end).
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 132 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 11 🌻*

539. తమ యందు ఎఱుకలేకున్న ఆత్మలు, జీవాత్మలుగా, పరిణామ దశలు, పునర్జన్మలు ఆధ్యాత్మిక మార్గము అను మూడు ప్రక్రియలను దాటి శివాత్మలైనవి.

జీవము + ఆత్మ = జీవాత్మ (మానవుడు)
జీవము = ప్రపంచ సంబంధమైన వాంఛలు.
జీవము = మిధ్యాహముతో కూడిన జీవితము.
జీవాత్మలో జీవము పోగా, ఆత్మ మిగులును.
(అనగా మానవునిలో వాంఛలు నశించినచో, మానవత్వము పోయి దైవత్వము ప్రాప్తించి ఆతడే భగవంతుడగును)
శివాత్మన్ = భగవంతుడైన మానవుడు.
= బ్రహ్మీభూతుడు.
= "అహం బ్రహ్మాస్మి" స్థితి.
= నిర్వికల్ప సమాధి స్థితి.
జీవ - శివాత్మన్ = సద్గురువు.
శివ - జీవాత్మన్ = అవతార పురుషుడు.
పురుషుడు = ఆత్మ, భగవంతుడు.
పరమ + ఆత్మ = పరమాత్మ,
పరమ = సర్వోత్తమమైన
ఆత్మ = భగవంతుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 96 / Sri Vishnu Sahasra Namavali - 96 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శతభిషం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 96. సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |*
*స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ‖ 96 ‖ 🍀*

🍀 896) సనాత్ - 
ఆది లేనివాడు.

🍀 897) సనాతన సమ: - 
సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.

🍀 898) కపిల: - 
ఋషులలో కపిలుడు తానైనవాడు.

🍀 899) కపి: - 
సూర్యరూపుడు.

🍀 900) అవ్యయ: - 
ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.

🍀 901) స్వస్తిద: - 
సర్వశ్రేయములను చేకూర్చువాడు.

🍀 902) స్వస్తికృత్ - 
శుభమును కూర్చువాడు.

🍀 903) స్వస్తి - 
సర్వ మంగళ స్వరూపుడు.

🍀 904) స్వస్తిభుక్ - 
శుభమును అనుభవించువాడు.

🍀 905) స్వస్తిదక్షిణ: - 
స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 96 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sathabisham 4th Padam* 

*🌻 96. sanātsanātanatamaḥ kapilaḥ kapiravyayaḥ |*
*svastidaḥ svastikṛt svasti svastibhuk svastidakṣiṇaḥ || 96 || 🌻*