శ్రీ లలితా సహస్ర నామములు - 111 / Sri Lalita Sahasranamavali - Meaning - 111

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 111 / Sri Lalita Sahasranamavali - Meaning - 111 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ‖ 111 ‖

🍀 542. పుణ్యకీర్తి -
మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.

🍀 543. పుణ్యలభ్యా -
సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.

🍀 544. పుణ్య శ్రవణ కీర్తనా -
పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.

🍀 545. పులోమజార్చితా -
పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.

🍀 546. బంధమోచనీ -
అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.

🍀 547. బంధురాలకా -
అందమైన చిక్కనైన ముంగురులు కలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 111 🌹

📚. Prasad Bharadwaj

🌻 111. puṇyakīrtiḥ puṇyalabhyā puṇyaśravaṇa-kīrtanā |
pulomajārcitā bandha-mocanī bandhurālakā || 111 ||

🌻 542 ) Punya keerthi -
She who is famous for good deeds

🌻 543 ) Punya labhya -
She who can be attained by good deeds

🌻 544 ) Punya sravana keerthana -
She who gives good for those who listen and those who sing about her

🌻 545 ) Pulomajarchidha -
She who is worshipped by wife of Indra

🌻 546 ) Bandha mochini -
She who releases us from bondage

🌻 547 ) Barbharalaka -
She who has forelocks which resembles waves

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 62

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 62 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. త్రిగుణములు 🌻

కుండలో ఉన్న మట్టికి కుండ అంటదు. కాని మట్టి వలననే కుండ పుట్టుచున్నది.

అట్లే మనలో నున్న ఈశ్వరునకు గుణములంటవు. వానినుండియే గుణములు పుట్టుచున్నవి.

ఉప్పు, పంచదార నీటిలో కరగిపోవును. అప్పుడు కూడ అవి నీటికంటవు. ఆవిరి యంత్రమున నీటినావిరి చేసినచో స్వచ్ఛమైన నీరు వేరుగను, ఉప్పు మొదలగు మూడు ద్రవ్యములు వేరుగను వచ్చును.

అట్లే ప్రళయమున త్రిగుణములు దేవునియందు మాయమగును. మరల సృష్టిలో వేరుగా వ్యక్తమై సృష్టికి ద్రవ్యములగును.

✍🏼 మాస్టర్ ఇ.కె.

భాగవతము 2-84

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2021

వివేక చూడామణి - 111 / Viveka Chudamani - 111

🌹. వివేక చూడామణి - 111 / Viveka Chudamani - 111🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 25. వైరాగ్య స్థితి - 1 🍀

372. వైరాగ్య స్థితిని చేరుకొన్న వ్యక్తి మాత్రమే, అంతర్గమైన, బాహ్యమైన విముక్తి అర్హుడు. అట్టి వైరాగ్యము వలన కోరికలు నశించి బాహ్యాభ్యంతర సంబంధాలను, అహమును వదలగలడు.

373. విరాగి అయిన వ్యక్తి మాత్రమే తాను పూర్తిగా బ్రహ్మములోకి చేరి, బాహ్యమైన బంధనాలను బాహ్య వస్తు సముదాయమును, అంతర్గతమైన అహమును వదులుకొనగలడు.

374. ఓ జ్ఞాని తెలుసుకో! వైరాగ్యము, విచక్షణ అనేవి పక్షి యొక్క రెండు రెక్కలు. అవే సాధకునికి తోడ్పడేవి. ఒకదానికొకటి తోడ్పడుతూ విముక్తి అనే తీగ ప్రాకి ముక్తికాంతను అందుకోగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 111 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 25. Vairagya (Dispassion) - 1 🌻

372. It is the man of dispassion (Vairagya) who is fit for this internal as well as external renunciation; for the dispassionate man, out of the desire to be free, relinquishes both internal and external attachment.

373. It is only the dispassionate man who, being thoroughly grounded in Brahman, can give up the external attachment to the sense-objects and the internal attachment for egoism etc.

374. Know, O wise man, dispassion and discrimination to be like the two wings of a bird in the case of an aspirant. Unless both are there, none can, with the help of either one, reach the creeper of Liberation that grows, as it were, on the top of an edifice.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2021

శ్రీ శివ మహా పురాణము - 435

🌹 . శ్రీ శివ మహా పురాణము - 435🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 1 🌻

పార్వతి ఇట్లుపలికెను-

ఓ బ్రాహ్మణాశ్రేష్టా! బ్రహ్మచారీ! నా వృత్తాంతము నంతనూ వినుము నా సఖి ఇప్పుడు చెప్పిన వచనములు సత్యమే గాని మరియొకటి గాదు(1) నేను మనస్సుచే సత్యమును సంకల్పించి, వాక్కుచే సత్యమును పలికి కర్మచే సత్యము ననుష్టించెదను. అసత్యము పలుకను. నేను శంకరుని భర్తగా వరించితిని(2). దుర్లభమగు వస్తువును నేను ఎట్లు పొందదగును? ఈ విషయమును నేను ఎరుంగుదును. అయిననూ మనస్సునందు ఉత్సాహముండుటచే నేనీనాడు తపస్సును చేయుచున్నాను.(3)

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడా పార్వతి ఆ బ్రహ్మచారితో నిట్లు పలికి మిన్నకుండెను పార్వతి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మనుడిట్లు పలికెను(4).

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఈ దేవి ఏ వస్తువును గోరి తీవ్రమగు తపస్సును చేయుచున్నదో తెలియవలెనని నాకు ఇంతకాలము నుండియు కోరిక గలదు(5). ఓ దేవీ! ఇపుడా వృత్తాంతమునంతనూ నీ పద్మములవంటి ముఖము నుండి వినియుంటిని. ఇపుడీ స్థానము నుండి నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు తోచినట్లు చేయుము.(6) నీవు నాకు చెప్పనిచో స్నేహభావము వ్యర్థమయ్యెడిది. నీవు ఎట్లు ప్రవర్తించెదవో, నీ భవిష్యత్తు అటులనే నిర్మాణమగును. నీకు దీని యందే సుఖము ఉన్నచో, చెప్పవలసినది ఏమియూ లేదు(7).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికిన ఆ బ్రహ్మచారి బయలుదేరుటకు సిద్దపడుచుండెను. ఇంతలో పార్వతీదేవి ఆ బ్రాహ్మణునకు నమస్కరించి ఇట్లు పలికెను.(8)

పార్వతి ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణా శ్రేష్టా! ఏల వెళ్ళి పోవుచున్నావు? ఉండుము. నాకు హితమును భోధించుము. ఆమె ఇట్లు పలుకగా దండమును ధరించి యున్న భ్రాహ్మణుడు నిలబడి ఇట్లు పలికెను.(9).

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ దేవీ! నేను వెళ్లకుండగా భక్తి పూర్వకముగా ఆపివేయుచున్నావు. నా మాటను వినగోరుచున్నావా? అట్లైనచో నీకు జ్ఞానమును కలిగించే సత్యమున్నంతనూ చెప్పెదను(10). నేను మహాదేవుని బాగుగా ఎరుంగుదును. నేను నీకు గురువు యొక్క ధర్మము ననుసరించి సత్యము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము (11)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2021

గీతోపనిషత్తు -235

🌹. గీతోపనిషత్తు -235 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 17 -2

🍀 16 -2. బ్రహ్మసృష్టి - ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు. 🍀

సహస్రయుగపర్యంత మహ ర్యద్మహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః || 17

తాత్పర్యము : బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము.

వివరణము : ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు.

కాలము యొక్క పరిమాణము బ్రహ్మవిదులకే తెలుయునని తెలియవలెను. కాలమానము విషయమున విభిన్నమగు వ్యాఖ్యానములు కలవు. ఒక కలియుగ పరిమాణము గూర్చియే

అనేక విధమగు పండితాభిప్రాయము లుండగ, సృష్టికొలత మరింత అగోచరమై యుండును. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము, అట్లే కటక సంక్రమణము, దక్షిణాయన పుణ్య కాలము గూర్చి కూడ భిన్నాభిప్రాయము లున్నవి.

భగవద్గీతయందు ఈ శ్లోకమున సహస్రయుగ పర్యంతము ఒక పగలు, సహస్రయుగ పర్యంతము ఒక రాత్రిగ బ్రహ్మదేవుని ఒక రోజుండునని పెద్దలు చెప్పుచున్నారని చెప్పబడినది. ఇంకయు వివరములు తెలియుట కుత్సహించువారు సాయన, నిరయన పంచాంగములను పరిశీలించుకొనుట చేయవచ్చును.

కలియుగ మారంభము ప్రథమ పాదమున నున్నదని పెద్దలు భావింపగ, కలియుగ మంతమగుచున్నదని మరికొందరు భావించు చున్నారు. కొందరు కలియుగ మైపోయినదని కూడ వాదించుచు నుందురు. ప్రస్తుత కాలమున ఇదియొక చర్చనీయాంశమై, పండితులను కాలము మ్రింగుచు నున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

05 Aug 2021

5-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 235 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 436🌹 
3) 🌹 వివేక చూడామణి - 110 / Viveka Chudamani - 110🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -63🌹  
5) 🌹 Osho Daily Meditations - 52🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 111 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -235 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 17 -2
 
*🍀 16 -2. బ్రహ్మసృష్టి - ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు. 🍀*

సహస్రయుగపర్యంత మహ ర్యద్మహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః || 17

తాత్పర్యము : బ్రహ్మ సృష్టి వేయి యుగములు పగళ్ళు, వేయి యుగములు రాత్రులుగ నెరుగుము. 

వివరణము : ఒక బ్రహ్మ సంవత్సరమున 360 రోజులు కలవనియు, కనుక 720 వేల యుగములు యుండునని తెలుపుదురు. అట్టి బ్రహ్మ సంవత్సరములు ఒక వంద సంవత్సరములుగ తెలుపుదురు. పై తెలిపిన లెక్కలన్నియు రహస్యార్ధముతో కూడినవి. అందు చూపబడిన సున్నలలో రహస్య మిమిడి యున్నదని, బ్రహ్మర్షులు మాత్రమే కాలమానము, యుగములు స్పష్టముగ తెలిసి యుందు రని, ఇతరులకది అగమ్యగోచరమని కూడ పెద్దలు తెలిపినారు. 

కాలము యొక్క పరిమాణము బ్రహ్మవిదులకే తెలుయునని తెలియవలెను. కాలమానము విషయమున విభిన్నమగు వ్యాఖ్యానములు కలవు. ఒక కలియుగ పరిమాణము గూర్చియే
అనేక విధమగు పండితాభిప్రాయము లుండగ, సృష్టికొలత మరింత అగోచరమై యుండును. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము, అట్లే కటక సంక్రమణము, దక్షిణాయన పుణ్య కాలము గూర్చి కూడ భిన్నాభిప్రాయము లున్నవి.

భగవద్గీతయందు ఈ శ్లోకమున సహస్రయుగ పర్యంతము ఒక పగలు, సహస్రయుగ పర్యంతము ఒక రాత్రిగ బ్రహ్మదేవుని ఒక రోజుండునని పెద్దలు చెప్పుచున్నారని చెప్పబడినది. ఇంకయు వివరములు తెలియుట కుత్సహించువారు సాయన, నిరయన పంచాంగములను పరిశీలించుకొనుట చేయవచ్చును. 

కలియుగ మారంభము ప్రథమ పాదమున నున్నదని పెద్దలు భావింపగ, కలియుగ మంతమగుచున్నదని మరికొందరు భావించు చున్నారు. కొందరు కలియుగ మైపోయినదని కూడ వాదించుచు నుందురు. ప్రస్తుత కాలమున ఇదియొక చర్చనీయాంశమై, పండితులను కాలము మ్రింగుచు నున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 435🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 27

*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 1 🌻*

పార్వతి ఇట్లుపలికెను-

ఓ బ్రాహ్మణాశ్రేష్టా! బ్రహ్మచారీ! నా వృత్తాంతము నంతనూ వినుము నా సఖి ఇప్పుడు చెప్పిన వచనములు సత్యమే గాని మరియొకటి గాదు(1) నేను మనస్సుచే సత్యమును సంకల్పించి, వాక్కుచే సత్యమును పలికి కర్మచే సత్యము ననుష్టించెదను. అసత్యము పలుకను. నేను శంకరుని భర్తగా వరించితిని(2). దుర్లభమగు వస్తువును నేను ఎట్లు పొందదగును? ఈ విషయమును నేను ఎరుంగుదును. అయిననూ మనస్సునందు ఉత్సాహముండుటచే నేనీనాడు తపస్సును చేయుచున్నాను.(3)

 బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడా పార్వతి ఆ బ్రహ్మచారితో నిట్లు పలికి మిన్నకుండెను పార్వతి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మనుడిట్లు పలికెను(4).

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఈ దేవి ఏ వస్తువును గోరి తీవ్రమగు తపస్సును చేయుచున్నదో తెలియవలెనని నాకు ఇంతకాలము నుండియు కోరిక గలదు(5). ఓ దేవీ! ఇపుడా వృత్తాంతమునంతనూ నీ పద్మములవంటి ముఖము నుండి వినియుంటిని. ఇపుడీ స్థానము నుండి నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు తోచినట్లు చేయుము.(6) నీవు నాకు చెప్పనిచో స్నేహభావము వ్యర్థమయ్యెడిది. నీవు ఎట్లు ప్రవర్తించెదవో, నీ భవిష్యత్తు అటులనే నిర్మాణమగును. నీకు దీని యందే సుఖము ఉన్నచో, చెప్పవలసినది ఏమియూ లేదు(7).

 బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికిన ఆ బ్రహ్మచారి బయలుదేరుటకు సిద్దపడుచుండెను. ఇంతలో పార్వతీదేవి ఆ బ్రాహ్మణునకు నమస్కరించి ఇట్లు పలికెను.(8)

పార్వతి ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణా శ్రేష్టా! ఏల వెళ్ళి పోవుచున్నావు? ఉండుము. నాకు హితమును భోధించుము. ఆమె ఇట్లు పలుకగా దండమును ధరించి యున్న భ్రాహ్మణుడు నిలబడి ఇట్లు పలికెను.(9).

 బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ దేవీ! నేను వెళ్లకుండగా భక్తి పూర్వకముగా ఆపివేయుచున్నావు. నా మాటను వినగోరుచున్నావా? అట్లైనచో నీకు జ్ఞానమును కలిగించే సత్యమున్నంతనూ చెప్పెదను(10). నేను మహాదేవుని బాగుగా ఎరుంగుదును. నేను నీకు గురువు యొక్క ధర్మము ననుసరించి సత్యము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము (11) 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 111 / Viveka Chudamani - 111🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 25. వైరాగ్య స్థితి - 1 🍀*

372. వైరాగ్య స్థితిని చేరుకొన్న వ్యక్తి మాత్రమే, అంతర్గమైన, బాహ్యమైన విముక్తి అర్హుడు. అట్టి వైరాగ్యము వలన కోరికలు నశించి బాహ్యాభ్యంతర సంబంధాలను, అహమును వదలగలడు. 

373. విరాగి అయిన వ్యక్తి మాత్రమే తాను పూర్తిగా బ్రహ్మములోకి చేరి, బాహ్యమైన బంధనాలను బాహ్య వస్తు సముదాయమును, అంతర్గతమైన అహమును వదులుకొనగలడు. 

374. ఓ జ్ఞాని తెలుసుకో! వైరాగ్యము, విచక్షణ అనేవి పక్షి యొక్క రెండు రెక్కలు. అవే సాధకునికి తోడ్పడేవి. ఒకదానికొకటి తోడ్పడుతూ విముక్తి అనే తీగ ప్రాకి ముక్తికాంతను అందుకోగలడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 111 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 25. Vairagya (Dispassion) - 1 🌻*

372. It is the man of dispassion (Vairagya) who is fit for this internal as well as external renunciation; for the dispassionate man, out of the desire to be free, relinquishes both internal and external attachment.

373. It is only the dispassionate man who, being thoroughly grounded in Brahman, can give up the external attachment to the sense-objects and the internal attachment for egoism etc.

374. Know, O wise man, dispassion and discrimination to be like the two wings of a bird in the case of an aspirant. Unless both are there, none can, with the help of either one, reach the creeper of Liberation that grows, as it were, on the top of an edifice.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 62 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. త్రిగుణములు 🌻*

కుండలో ఉన్న మట్టికి కుండ అంటదు. కాని మట్టి వలననే కుండ పుట్టుచున్నది. 

 అట్లే మనలో నున్న ఈశ్వరునకు గుణములంటవు. వానినుండియే గుణములు పుట్టుచున్నవి.  

ఉప్పు, పంచదార నీటిలో కరగిపోవును. అప్పుడు కూడ అవి నీటికంటవు. ఆవిరి యంత్రమున నీటినావిరి చేసినచో స్వచ్ఛమైన నీరు వేరుగను, ఉప్పు మొదలగు మూడు ద్రవ్యములు వేరుగను వచ్చును.  

అట్లే ప్రళయమున త్రిగుణములు దేవునియందు మాయమగును. మరల సృష్టిలో వేరుగా వ్యక్తమై సృష్టికి ద్రవ్యములగును.

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 2-84
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 52 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 THE DOOR 🍀*

*🕉 All relationship is imagination, because whenever you go out if yourself, you go only through the door if imagination. There is no other door. 🕉*

The friend, the enemy: both are your imagination. When you stop imagination completely, you are alone, absolutely alone. Once you understand that life and all its relationships are imagination, you don't go against life, but your understanding helps you to make your relationships richer. 

Now that you know that relationships are imagination, why not put more imagination into them? Why not enjoy them as deeply as possible? When the flower is nothing but your imagination, why not create a beautiful flower? Why settle for an ordinary flower? Let the flower be of emeralds and diamonds. 

Whatever you imagine let it be that. Imagination is not a sin, it is a capacity. It is a bridge. Just as you cross a river and you make a bridge between this shore and that, so imagination functions between two people. Two beings project a bridge--call it love, call it trust-- but it is imagination. Imagination is the only creative faculty in human beings, so whatever is creative is going to be imagination. 

Enjoy it and make it more and more beautiful. By and by you will come to a point where you don't depend on relationships. You share. If you have something, you share it with people, but you are content as you are. All love is imagination, but not in the condemnatory sense that the word is ordinarily used. Imagination is a divine faculty.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 111 / Sri Lalita Sahasranamavali - Meaning - 111 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ‖ 111 ‖

🍀 542. పుణ్యకీర్తి - 
మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.

🍀 543. పుణ్యలభ్యా - 
సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.

🍀 544. పుణ్య శ్రవణ కీర్తనా - 
పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.

🍀 545. పులోమజార్చితా - 
పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.

🍀 546. బంధమోచనీ - 
అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.

🍀 547. బంధురాలకా -
 అందమైన చిక్కనైన ముంగురులు కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 111 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 111. puṇyakīrtiḥ puṇyalabhyā puṇyaśravaṇa-kīrtanā |
pulomajārcitā bandha-mocanī bandhurālakā || 111 ||

🌻 542 ) Punya keerthi -   
She who is famous for good deeds

🌻 543 ) Punya labhya -  
 She who can be attained by good deeds

🌻 544 ) Punya sravana keerthana -   
She who gives good for those who listen and those who sing about her

🌻 545 ) Pulomajarchidha -   
She who is worshipped by wife of Indra

🌻 546 ) Bandha mochini -   
She who releases us from bondage

🌻 547 ) Barbharalaka -   
She who has forelocks which resembles waves

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama