శ్రీ లలితా సహస్ర నామములు - 8 / Sri Lalita Sahasranamavali - Meaning - 8

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 8 / Sri Lalita Sahasranamavali - Meaning - 8 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 8. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |
తాటంక యుగళీభూత తపనోడుప మండలా ‖ 8 ‖ 🍀

21) కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా :

కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.

22) తాటంక యుగళీభూత తపనోడుప మండలా :

చెవి కమ్మలుగా జంటగా అయిన సూర్య చంద్ర మండలమును గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 8 🌹

📚. Prasad Bharadwaj

🌻 8. kadambamañjarī-kḷpta-karṇapūra-manoharā |
tāṭaṅka-yugalī-bhūta-tapanoḍupa-maṇḍalā || 8 || 🌻

21 ) Kadambha manjari kluptha karna poora manohara -
She who has beautiful ears like the kadamba flowers

22 ) Thadanga yugali bhootha thapanodupa mandala -
She who wears the sun and the moon as her ear studs

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 31 🌻

603.నిర్వాణము - నిర్వికల్పము.

శరీరము నిలిచి యుండగనే ఇది ప్రాప్తించును. అప్పుడు విదేహముక్తుడగును. దేహమునకు ముక్తి కాదు. దేహము కాని దానికి--అనగా, స్వాత్మకు ముక్తి లభించును.

604. విదేహ ముక్తి:-

మానవుడు భగవంతుడైన తరువాత 3 లేక 4 రోజుల వరకు అతని శరీరము నిలిచి యుండును. ఇతని చైతన్యము పూర్తిగా భగవంతునిలో కరిగిపోవును. కనుక దేహములయందు, సృష్టియందు స్పృహయుండదు. వారు నిరంతరముగా సచ్చిదానంద స్థితిని అనుభవించుచుందురు. కాని వాటిని సృష్టిలో ఎఱుకతో వినియోగించరు. ఇతరులు ముక్తులగుకు సహాయపడరు.

కానీ, వారు భూమిమీద ఉన్నకొలది రోజులు, వారి సాన్నిధ్యము అనంతజ్ఞాన శక్యానందములను ప్రసారము చేయుటలో కేంద్రముగా నుండును;

వారిని దరిచేరువారును, సేవించువారును, పూజించువారును, మిక్కిలి ప్రయోజనమును పొందెదరు ఇతరులు తమ తమ ప్రారబ్ధము ననుసరించి సంవత్సరముల కొలది శరీరములను నిల్పుకొందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 213

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 213 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శుకమహర్షి - 1 🌻

జ్ఞానం:

01. జీవుడి పరిణామం ఎలా ఉందంటే, భౌతికంనుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటమే. అంటే, ధర్మబద్ధమైన భౌతికజీవనమునుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటము జరుగుతున్నది. ఈ రెండిటినీ చెప్పిన వేదవ్యాసుడు ఐహిక-ఆముష్మిక మార్గములు రెండింటికీ జగద్గురువు అయ్యాడు. వేదవిజ్ఞాన్నంతా మనకు ప్రసాదించాడు.

02. శుకుడు ఆయన కుమారుడు. అతడు ఆధ్యాత్మికస్థితిలోనివాడిగా, బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. వ్యాసమహర్షికి – ఈ సర్మకాండలతోటి, వేదవాజ్ఞ్మయంతోటి నిమిత్తంలేకుండా ఉన్నటువంటి, వాటియొక్క పరిణామదశయైన స్థితిలోఉన్న శుకుడు కుమారుడిగా జన్మించాడు.

03. అంటే, అది ఆయనయొక్క పరిణామదశ. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నట్లుగా, వ్యాసుడివిషయంలో పరమాత్మయే పుత్రనామంతో వచ్చినట్లుగా శుకుడి వృత్తాంతం సంభవించింది. తండ్రియైన వ్యాసమహర్షి ఆజ్ఞప్రకారం, జనకమహారాజుని “బ్రాహ్మణుడి కర్తవ్యం ఏమిటి? ఆయన మోక్షం ఎట్లా పొందుతాడు?” అని అడిగాడు.

04. జనకుడు ఆయనతో, “బ్రాహ్మణుడు ఊపనీతుడై, బ్రహ్మచర్యము, వేదాభ్యాసము నడిపి వివాహంచేసుకుని సంతానం పొంది, దేవపితృవిధులాచరించి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళి హుతవహ ప్రయత్నముగా వ్రతపాలనచేసి, ఆ తర్వాత సన్యాసస్వీకారముచేసి బ్రహ్మాశ్రమ పదము పొంది, అనంతరం జీవన్ముక్తికి తపస్సుచేయాలి” అని చెప్పాడు.

05. శుకుడు, “కానీ జ్ఞానోదయమై ఉండగా ఆశ్రమ త్రయాన్ని క్రమంగా నడుపవలేనా? జ్ఞానియైనా ఆశ్రమములు విడువరాదని వేదములు చెబుతాయా?” అని అడిగాడు. దానికి జనకుడు, “మునీంద్రా! జ్ఞాన విజ్ఞానములు మోక్షసాధనములే! గురూపదేశంతో అవి లభించగా మోక్షం పొందినవాడు వాటిని విడిచిపెడతాడు.

06. కానీ లోకోఛ్ఛేదకము, కర్మవ్యాకులత వాటిల్లకుండా ఉండటంకోసం లోకానికతడు ఉదాహరణగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని, కర్మభ్రష్టుడనే భ్రాంతిలోకానికి కలగరాదు. కాబట్టే పూర్వమునులు నాలుగు ఆశ్రమాలనూ క్రమంగా నడిపించారు. కాని ప్రథమ ఆశ్రమంలోనే సుస్థిరజ్ఞానం లభించిన వాడికి మిగిలిన ఆశ్రమాలతో పనిలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

శ్రీ శివ మహా పురాణము - 328

🌹 . శ్రీ శివ మహా పురాణము - 328 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

82. అధ్యాయము - 37

🌻. యజ్ఞ విధ్వంసము - 4 🌻

దక్షుడు శివుని నిందించిన సమయములో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నందికోపముతో నేలపై బడవేసి, అతని నేత్రములను గిల్లివేసెను(54) శివ గణనాయకులు ఆ యజ్ఞశాలయందు ఉన్న స్వాహ, స్వదా, దక్షిణా అను దేవతలను, మంత్ర తంత్రాదిష్టాన దేవతలను, ఇతరులను దురవస్థకు గురిచేసిరి(55) ఆ గణములు కోపముతో అగ్నివేదికయందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగ నుండెను(56).

వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచే దాగియున్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీర భద్రుని సన్నిధిలో నిలబెట్టిరి(57)

వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా, యోగమహిమచే ఆతలను నరకుట సంభవము కాలేదు(58) ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచేగాని నరుకుట సర్వథా అసంభవమని భావించి, అతడు గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో పెరికివేసేను(59)

గణాధ్యక్షుడగు వీరభద్రుడు దుష్టుడు, శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సునను అగ్ని కుండమునందు బారవైచెను(60) అపుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోథముతో సర్వమును తగులబెట్టి ప్రళయాకాలాగ్నిని బోలియుండెను(61)

వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి, తరువాత క్రోథముతో వారికి నిప్పుపెట్టి, అగ్నిహోత్రము మిడతలను వలె తగుల బెట్టెను(62) అపుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను(63)

అపుడాతడు వీరశోభతో ప్రకాశించెను గణములతో కూడియున్న వీరభద్రునిపై నందన వనమునందు పుట్టిన దివ్యపుష్పములు వర్ణించెను(64) పరిమళభరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయములో దేవదుందుభులు అద్భుతముగా మ్రోగినవి(65)

చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడు వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తిచేసుకొని శీఘ్రముమే కైలాసమునకు వెళ్ళెను(66) పరమేశ్వరుడగు శంభుడు కార్యమును పూర్తిచేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సుగలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను(67).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసనంహితయందు రెండవది యగు సతీఖండలో యజ్ఞ విద్వంస వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది(37)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

గీతోపనిషత్తు -128

🌹. గీతోపనిషత్తు -128 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 13

🍀. 11. మానసిక సన్న్యాసము - మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 🍀

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ II 13

మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. సన్న్యాస మనగ ముందు శ్లోకముల యందు దైవము నిర్వచన మందించినాడు.

1. దేనిని కాంక్షింపనివాడు, ద్వేషింపని వాడు సన్న్యాసి.

2. సతతము దైవముతో మనన మార్గమున యోగయుక్తుడైనవాడు సన్న్యాసి. సన్న్యాస దీక్ష వలన యింద్రియములు నియమమున నుండగలవు. మనసు పరిశుద్ధమగును.

3. సన్న్యాసి సర్వజీవుల యందలి దైవమునే దర్శించుచుండును.

4. తన నుండి జరుగుచున్న మనో దేహేంద్రియ వ్యాపారములను

మననమున నుండి వీక్షించువాడు సన్న్యాసి.

5. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు సన్న్యాసి. అట్టివాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును.

6. 6. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును.

పై ఆరు గుణములు కల జీవుని మనసున సన్న్యాసము స్థిరపడి యుండును. సుఖ మతని వశమున నుండును. అట్టివాడు దేహము నందుండుటకు ఎట్టి అసౌకర్యముండదు. నిజమున

కిట్టి సన్న్యాసియే మానవదేహ సౌలభ్యము, సౌకర్యము అనుభూతి పరముగ నెరిగి యుండును.

పై సర్వమును గృహస్థు అయినను నిర్వర్తించుకొన వచ్చును. గృహము, సంఘము, దేహము బంధములు కావు. ప్రతిబంధకములు కానే కావు. కావున సన్న్యాసమను పేర భార్యాపిల్లలను

విసర్జించుట, వృత్తి వ్యాపారములను వదలివేయుట, సంఘమున వేరుపడి వెలిగ నుండమని భగవంతుడు చెప్పలేదు.

“మనసా సన్న్యస్య" అని పలుకుటలో, మనసున సన్న్యసించిన చాలునని, భౌతిక సన్న్యాసము అవసరము కాదని తెలిపినాడు. తానట్లే ఆచరించి చూపినాడు. రాజర్షులు, మహర్షులుకూడ నట్లే ఆచరించిరని తెలిపినాడు. సంసారమధ్యమున కూడ సన్న్యాసిగ నుండవచ్చునని తెలిపినాడు.

“సన్న్యాసులందు కూడ చాలమంది సంసారులే” అని అనుచు అప్పుడప్పుడు మాస్టర్ ఇ.కె. గారు పలుకుచుండెడి వారు. మాస్టర్ ఇ.కె. గారు సంసారమందు సన్న్యాసిగ ఎట్లుండ వచ్చునో జీవించి చూపించినారు. సన్న్యాసము మానసికమే అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalitha Chaitanya Vijnanam - 184

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 184. 'నిస్తులా'🌻

సాటిలేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాతతో సాటియైనవారెవరూ లేరు. ఆమె కామెయే సాటి. ఆమెతో సరితూగుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. తూకమునకే తుల. మరియొకటేదియూ సృష్టిలో ఆమెతో తూకమునకు సరిపోదు.

అందువలన ఆమె నిస్తుల, పోల్చిచూడుకులెనన్నచో చైతస్యము అవసరము. 'పోల్చి చూచుట ఎఱుక యున్నపుడు కదా! ఎఱుకగల ఇద్దరిని పోల్చవచ్చును. ఎవరి ఎఱుక ఎక్కువ, ఎవరి ఎఱుక తక్కువ తేల్చవచ్చును. కానీ ఎఱుకతో ఎవరిని పోల్చగలరు? ఇద్దరియందు ఎఱుక శ్రీమాతయే.

అందరి యందూ ఆమెయే ఎఱుకగా యున్నది. ఆమె మొత్తము సృష్టికి ఎఱుక. సృష్టియందలి అన్నియూ ఆమె ఎఱుకతో నిండియున్నప్పుడు వాటిని ఆమెతో సరిపోల్చుట సాధ్యమగు విషయము కాదు.

సముద్రమందలి అలలను ఒకదానితో మరియొకదానిని పోల్చవచ్చును. కానీ సముద్రముతో వాటిని పోల్చలేము. ఎంత పెద్ద అలయైననూ సముద్రముతో పోల్చుట అపహాస్యము.

అట్లే శ్రీమాతతో ఎవరినైన పోల్చినచో అది పరిహాసమే. ఆమె జగత్ చైతన్య స్వరూపిణి. భక్త పరాధీన అగుటయే, తన భక్తుల నుద్ధరించుటకు లీలాప్రాయముగా పరమభక్తికీ, పరమ ప్రేమకూ సరితూగుచుండును.

ఆమెయే శ్రీకృష్ణుని రూపమున అవతరించినది. కృష్ణ మూలము శ్రీలలితయే. అతడు జగత్ చైతన్యస్వరూపుడు. అతనిని, తనకున్న ఐశ్వర్యముతో సత్యభామ శూకము వేయపూనినది. సృష్టి ఐశ్వర్యమైన శ్రీకృష్ణుని, సృష్టియందు అల్పములైన ఐశ్వర్యములతో తూకము వేయపూనుట వలన సత్యభామాదేవి అపహాస్యమునకు గురియైనది.

కానీ పరమభక్తికీ, పరమప్రేమకూ తాను లోబడుదునని తెలియజేయుటకు, రుక్మిల ప్రార్థించి యుంచిన తులసీదళముతో అతడు సరితూగి అనుగ్రహించెను.

సంకల్పించినచో శ్రీమాత అణువంత కూడ యుండును. స్వయమునకు మహత్తును మించి యుండును. అది ఆమె లీల.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nistulā निस्तुला (184) 🌻

She is incomparable. Comparison can be only between two equals. Since She is the Supreme and does not have equals there is no question of comparing Her.

Nāma 389 also refers to Her incomparability.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

ఎవరి తప్పులకు వారిదే బాధ్యత

🌹. ఎవరి తప్పులకు వారిదే బాధ్యత 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

📚. ప్రసాద్‌ భరద్వాజ.

మీ తప్పులకు మీరెలా బాధ్యులవుతారు? మీరు తప్పుగా బొమ్మవేసి, బొమ్మదే తప్పంటే ఎలా కుదురుతుంది. ఆ తప్పు మీదే కదా!

గుంపునకు ఏమాత్రం భయపడవలసిన పని లేదు.

ప్రపంచానికి ప్రళయం వచ్చిన రోజున ఏ కాల్పనిక దేవుడో వచ్చి ‘‘ఇంతవరకు నువ్వేంచేసావు. ఏంచెయ్యలేదు’’అని మిమ్మల్ని అడుగుతాడని ఎప్పుడూ భావించకండి. ఆ నిర్ణయాలన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. కాబట్టి, మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లే. ఈ సత్యాన్ని తెలుసుకున్న వెంటనే మీ జీవితం క్రియాశీలమైన నాణ్యతను సంతరించుకుంటుంది. ‘భయం మీకు బేడీలు వేస్తుంది, స్వేచ్ఛ మీకు రెక్కలనిస్తుంది.’’

🌷దని నుంచి స్వేచ్ఛ- దేని కోసం స్వేచ్ఛ: 🌷

ఎప్పుడూ ‘‘దేని కోసం స్వేచ్ఛగా ఉండాలి’’ అని ఆలోచించాలి తప్ప, ‘‘దేని నుంచి స్వేచ్ఛగా ఉండాలి’’ అని ఆలోచించకండి, వాటిమధ్య చాలా తేడా ఉంది. ‘‘దేని నుంచి’’ కాకుండా, ‘‘దేని కోసం’’ గురించే ఎప్పుడూ ఆలోచించండి.

సత్యం కోసం, దేవుడి కోసం స్వేచ్ఛగా ఉండండి. అంతేకానీ, గుంపు నుంచి, చర్చి నుంచి, దాని నుంచి, దీని నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించకండి, ఆశించకండి, ఏదో ఒకరోజు మీరు వాటికి చాలా దూరంగా వెళ్ళగలిగినా, మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. ఎందుకంటే, అదికూడా ఒక రకమైన అణచివేత లాంటిదే.

అయినా, గుంపంటే మీకెందుకంత భయం? ఆ భయమే మీ గుంపుకు గుంజుకునే ఆకర్షణ శక్తి ఉన్నట్లు, అందుకే మీరు దాని ఆకర్షణలో పడ్డట్లు నిరూపిస్తోంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా గుంపు మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది. దాని పరిమితులు, పద్ధతుల గురించి మీరు ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు.

కేవలం దాని వాస్తవాలను మీ పద్ధతిలో మీరు గమనిస్తే దానిని మీరు వెంటనే వదిలెయ్యగలరు. అది పెట్టే అవస్థలలో చిక్కుకున్న మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. పైగా, అలా అవస్థలు పడడంలో ఏమాత్రం అర్థంలేదు. కాబట్టి, దానిని వదిలించుకోండి.

నిజానికి, గుంపు ఒక సమస్యకాదు, మీకుమీరే సమస్య. గుంపు మిమ్మల్ని గుంజట్లేదు. మీకుమీరే గుడ్డిగా వెళ్ళి ఆ గుంపులో పడ్డారు. బాధ్యతను ఎవరిపైకో నెట్టడం భావ్యంకాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలా నెట్టినా మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు.

ఎందుకంటే, దానికి మీరే బాధ్యులని మీ అంతరంగం మిమ్మల్ని దొలుస్తూనే ఉంటుంది. ఎవరైనా గుంపును ఎందుకు అంతగా వ్యతిరేకించాలి, అది చేసే గాయాలను ఎందుకు భరించాలి? మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీ సహకారమే అసలు సమస్య.

అందువల్ల ఏమాత్రం ఆలోచించకుండా గుంపుకు సహకరించడం వెంటనే మానండి. ఏమాత్రం ఆలోచించినా వెంటనే మీరు సమస్యలో పడతారు. ఎందుకంటే, గుంపుతో పోరాడాలనుకుంటే మీరు ఓడిపోయే యుద్ధం చేస్తున్నట్లే, గుంపుకు ప్రాధాన్యమిస్తున్నట్లే. అలా అనేక లక్షల మంది ఓడిపోయే యుద్ధమే చేశారు.

భారతదేశంలో అనేక శతాబ్దాల పాటు అదే జరిగింది. నిద్ర, ఆహారాలు మాని, ఉపవాసాల వ్రతాలు, యమ, నియమ, ప్రాణాయామ యోగప్రక్రియలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేశారు. అయినా వారు వాటినుంచి ఏమాత్రం తప్పించుకోలేకపోగా, ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ, వాటి దగ్గరే ఉన్నారు. అలా అవే వారికి చాలా ముఖ్యమైపోయాయి. మఠాలలో అదే జరిగింది. వారు చాలా భయంకరమైన అణచివేతకు గురయ్యారు. అందుకే వారు చాలా భయపడ్డారు.

గుంపును చూసి భయపడితే రేపు మీకూ అదే జరుగుతుంది. మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీచెయ్యలేవు. కాబట్టి, గుంపుకు ఏమాత్రం సహకరించకుండా చాలా అప్రమత్తంగా ఉండండి.

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

దేవాపి మహర్షి బోధనలు - 7

🌹. దేవాపి మహర్షి బోధనలు - 7 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 1 🌻

జీవుల పుట్టుకవేళ ఆ జీవులపై ఆ సమయము యొక్క ముద్ర పడును. ఈ ముద్రలు క్షుద్రజంతువులలో కన్పింపవు. పాదములు గల జంతువులలో చివర వ్రేళ్ళపై పడును. మానవుల చేతి, కాలివేళ్ళ చివర ఈ ముద్రలు స్పష్టముగా కనపడును.

ఈ ముద్రలను బట్టి మానవుడు జీవితమున ఎందుకు పుట్టెనో తెలియుటయు, అతడు పుట్టిన తిథి, వారము, నక్షత్రము, గ్రహస్థితి, అతని పేరులోని ధ్వనులను గుణించి జీవిత ప్రయోజనము కనుగొనుటయు శాస్త్రకారులెరిగిన విషయము.

ఈ విధమైన సంబంధము బ్రహ్మాండ పిండాండములలో కలదని కనుగొని మానవుడు తన కర్తవ్యమును గుర్తెరుగుటకే ఈ గుప్త విద్యలు, అర్హులగు వారి చేతిలో గురు పరంపరగా వచ్చు చున్నవి. ఈ విధముగ కాలము ఒక చక్రముగా ఉపాసింపబడు చున్నది. అందలి భూత, భవిష్యత్, వర్తమానములు ఆ చక్రమున సమదూరములగు మూడు బిందువులు.

సమకోణ త్రిభుజము, వృత్తమును ఇమడ్చబడిన పైథాగరస్ చిహ్న మిదియే. దీనినే భారతీయులు ఆత్మ, బుద్ధి, మనస్సు చక్రము గను, గురుచక్రముగను, త్రిగుణాత్మక చక్రముగను బోధించిరి. భారతీయ జ్యోతిశాస్త్రమున ఈ త్రిభుజము నందలి కోణములను ప్రత్యేకముగా వివరించిరి.

జీవి పుట్టిన సమయమున ఆ ప్రదేశమున తూర్పు రేఖ వర్తమానమును, అచటనుండి మిగిలిన రెండు కోణముల భూత భవిష్యత్తులను దర్శింప చేయును. దీని మీదనే హస్త రేఖలలోని త్రిభుజ ముద్ర లాధారపడి యున్నవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 167

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 167 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 97 🌻

కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే.

కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్‌ ఆత్మ విరాట్‌ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.

కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు.

జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు.

కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.

ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు.

ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటుంవంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 238, 239 / Vishnu Sahasranama Contemplation - 238, 239

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 238, 239 / Vishnu Sahasranama Contemplation - 238, 239 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻238. విశ్వధృక్, विश्वधृक्, Viśvadhr̥k🌻

ఓం విశ్వధృషే నమః | ॐ विश्वधृषे नमः | OM Viśvadhr̥ṣe namaḥ

విశ్వం ధృష్ణోతి విశ్వమును నేర్పుతో ధరించువాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 238🌹

📚. Prasad Bharadwaj

🌻238. Viśvadhr̥k🌻

OM Viśvadhr̥ṣe namaḥ

Viśvaṃ dhr̥ṣṇoti / विश्वं धृष्णोति He supports the universe with confidence and power.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 239 / Vishnu Sahasranama Contemplation - 239🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻239. విశ్వభుక్, विश्वभुक्, Viśvabhuk🌻

ఓం విశ్వభుజే నమః | ॐ विश्वभुजे नमः | OM Viśvabhuje namaḥ

విశ్వభుక్, विश्वभुक्, Viśvabhuk

విశ్వం భుంక్తే జీవరూపమున విశ్వమును అనుభవించువాడు. లేదా విశ్వం భునక్తి ఈశ్వరుడుగా విశ్వమును పాలించువాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::

వ. ...నగ్ని యొక్కరుండయ్యుఁ బ్రెక్కుమ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుం డొక్కండ తన వలనం గలిగిన నిఖిలభూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు; లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుం డిట్లనియె... (61)

...ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కన్పిస్తున్నట్లు, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటియందూ అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సువంటి సూక్ష్మేందిర్యాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కు పడకుండా ఆ యా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిర్యగ్యోనులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తుంటాడు..

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 239🌹

📚. Prasad Bharadwaj

🌻239. Viśvabhuk🌻

OM Viśvabhuje namaḥ

Viśvaṃ bhuṃkte / विश्वं भुंक्ते He who in the form of Jīvas enjoys the universe.Viśvaṃ bhunakti / विश्वं भुनक्ति He who as the Īśvara, protects the worlds.

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 2

Asau guṇamayairbhūtasūkṣmendriyātmabhiḥ,
Svanirmiteṣu nirviṣṭo bhuṅkte bhūteṣu tadguṇān. (33)

:: श्रीमद्भागवते प्रथमस्कन्धे द्वितीयोऽध्यायः ::

असौ गुणमयैर्भूतसूक्ष्मेन्द्रियात्मभिः ।
स्वनिर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान् ॥ ३३ ॥

The Supersoul enters into the bodies of the created beings who are influenced by the modes of material nature and causes them to enjoy the effects of these modes by the subtle mind.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2021

19-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 614 / Bhagavad-Gita - 614 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 238, 239 / Vishnu Sahasranama Contemplation - 238, 239🌹
3) 🌹 Daily Wisdom - 33🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 167🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 188🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 7🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 106 / Sri Lalitha Sahasra Namaavali - 106 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalita Chaitanya Vijnanam - 184🌹
9)*🌹. ఎవరి తప్పులకు వారిదే బాధ్యత 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 525 / Bhagavad-Gita - 525🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 4 / Bhagavad-Gita - 4🌹

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 128🌹  
13) 🌹. శివ మహా పురాణము - 328 🌹 
14) 🌹 Light On The Path - 81🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 213🌹 
16) 🌹 Seeds Of Consciousness - 277 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 08 / Lalitha Sahasra Namavali - 08🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 08 / Sri Vishnu Sahasranama - 08🌹
20) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 1, 2, 3 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 614 / Bhagavad-Gita - 614 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 31 🌴*

31. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
ఆయథావత్ప్రజానాతి బుద్ధి: సా పార్థ రాజసీ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! ధర్మము మరియు అధర్మము నడుమగల భేదమునుగాని, చేయవలసిన కార్యము మరియు చేయదగని కార్యము నడుమగల భేదమును గాని తెలియలేనటువంటి బుద్ధి రాజసికబుద్ధి యనబడును.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 614 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 31 🌴*

31. yayā dharmam adharmaṁ ca
kāryaṁ cākāryam eva ca
ayathāvat prajānāti
buddhiḥ sā pārtha rājasī

🌷 Translation : 
O son of Pṛthā, that understanding which cannot distinguish between religion and irreligion, between action that should be done and action that should not be done, is in the mode of passion.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 238, 239 / Vishnu Sahasranama Contemplation - 238, 239 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻238. విశ్వధృక్, विश्वधृक्, Viśvadhr̥k🌻*

*ఓం విశ్వధృషే నమః | ॐ विश्वधृषे नमः | OM Viśvadhr̥ṣe namaḥ*

విశ్వం ధృష్ణోతి విశ్వమును నేర్పుతో ధరించువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 238🌹*
📚. Prasad Bharadwaj 

*🌻238. Viśvadhr̥k🌻*

*OM Viśvadhr̥ṣe namaḥ*

Viśvaṃ dhr̥ṣṇoti / विश्वं धृष्णोति He supports the universe with confidence and power.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 239 / Vishnu Sahasranama Contemplation - 239🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻239. విశ్వభుక్, विश्वभुक्, Viśvabhuk🌻*

*ఓం విశ్వభుజే నమః | ॐ विश्वभुजे नमः | OM Viśvabhuje namaḥ*

విశ్వభుక్, विश्वभुक्, Viśvabhuk

విశ్వం భుంక్తే జీవరూపమున విశ్వమును అనుభవించువాడు. లేదా విశ్వం భునక్తి ఈశ్వరుడుగా విశ్వమును పాలించువాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::
వ. ...నగ్ని యొక్కరుండయ్యుఁ బ్రెక్కుమ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుం డొక్కండ తన వలనం గలిగిన నిఖిలభూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు; లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుం డిట్లనియె... (61)

...ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కన్పిస్తున్నట్లు, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటియందూ అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సువంటి సూక్ష్మేందిర్యాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కు పడకుండా ఆ యా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిర్యగ్యోనులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తుంటాడు..

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 239🌹*
📚. Prasad Bharadwaj 

*🌻239. Viśvabhuk🌻*

*OM Viśvabhuje namaḥ*

Viśvaṃ bhuṃkte / विश्वं भुंक्ते He who in the form of Jīvas enjoys the universe.Viśvaṃ bhunakti / विश्वं भुनक्ति He who as the Īśvara, protects the worlds.

Śrīmad Bhāgavata - Canto 1, Chapter 2
Asau guṇamayairbhūtasūkṣmendriyātmabhiḥ,
Svanirmiteṣu nirviṣṭo bhuṅkte bhūteṣu tadguṇān. (33)

:: श्रीमद्भागवते प्रथमस्कन्धे द्वितीयोऽध्यायः ::
असौ गुणमयैर्भूतसूक्ष्मेन्द्रियात्मभिः ।
स्वनिर्मितेषु निर्विष्टो भुङ्क्ते भूतेषु तद्गुणान् ॥ ३३ ॥

The Supersoul enters into the bodies of the created beings who are influenced by the modes of material nature and causes them to enjoy the effects of these modes by the subtle mind.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 33 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 2. The Why of a Thing is Studied in Philosophy 🌻*

The ‘why’ of a thing is studied in philosophy. The ‘how’ of a thing is studied in psychology, and the ‘what’ is the actual daily routine of activity. In our approach to anything, even the smallest item, even the most insignificant so-called addendum to our life, we have to be scientific in our approach. 

And what is the meaning of being scientific? It is taking the first thing as the first thing, the second thing as the second thing and not mixing up one with the other. 

You should not start with the second thing while the first thing has been ignored. To be able to conceive the consecutive series of any kind of movement is to be scientific. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 167 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 97 🌻*

కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. 

కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్‌ ఆత్మ విరాట్‌ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
      
కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు. 

జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. 

కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.

        ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు. 

ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటుంవంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 7 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 1 🌻*

జీవుల పుట్టుకవేళ ఆ జీవులపై ఆ సమయము యొక్క ముద్ర పడును. ఈ ముద్రలు క్షుద్రజంతువులలో కన్పింపవు. పాదములు గల జంతువులలో చివర వ్రేళ్ళపై పడును. మానవుల చేతి, కాలివేళ్ళ చివర ఈ ముద్రలు స్పష్టముగా కనపడును. 

ఈ ముద్రలను బట్టి మానవుడు జీవితమున ఎందుకు పుట్టెనో తెలియుటయు, అతడు పుట్టిన తిథి, వారము, నక్షత్రము, గ్రహస్థితి, అతని పేరులోని ధ్వనులను గుణించి జీవిత ప్రయోజనము కనుగొనుటయు శాస్త్రకారులెరిగిన విషయము. 

ఈ విధమైన సంబంధము బ్రహ్మాండ పిండాండములలో కలదని కనుగొని మానవుడు తన కర్తవ్యమును గుర్తెరుగుటకే ఈ గుప్త విద్యలు, అర్హులగు వారి చేతిలో గురు పరంపరగా వచ్చు చున్నవి. ఈ విధముగ కాలము ఒక చక్రముగా ఉపాసింపబడు చున్నది. అందలి భూత, భవిష్యత్, వర్తమానములు ఆ చక్రమున సమదూరములగు మూడు బిందువులు. 

సమకోణ త్రిభుజము, వృత్తమును ఇమడ్చబడిన పైథాగరస్ చిహ్న మిదియే. దీనినే భారతీయులు ఆత్మ, బుద్ధి, మనస్సు చక్రము గను, గురుచక్రముగను, త్రిగుణాత్మక చక్రముగను బోధించిరి. భారతీయ జ్యోతిశాస్త్రమున ఈ త్రిభుజము నందలి కోణములను ప్రత్యేకముగా వివరించిరి. 

జీవి పుట్టిన సమయమున ఆ ప్రదేశమున తూర్పు రేఖ వర్తమానమును, అచటనుండి మిగిలిన రెండు కోణముల భూత భవిష్యత్తులను దర్శింప చేయును. దీని మీదనే హస్త రేఖలలోని త్రిభుజ ముద్ర లాధారపడి యున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 188 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
180

Next, ocean. There is a proverb (in Telugu) that says that a full pot (of water) does not move. True. A pot that is full does not move around like an empty pot. It remains stable. If even a little water is removed from the pot, the water splashes around every time the pot is moved. If the pot is filled to the brim, the water does not splash. It remains calm. 

Similarly, a spiritual seeker should have a great depth of personality at all times and never lose courage. Only then will he be able to withstand the obstacles faced in life and in his spiritual practice. He will withstand joys and sorrows and other dualities.

We sometimes observe, “This elderly person used to be fine. But, now he is sitting like a helpless person”. Lack of courage and mental strength makes a lot of elderly people weak. The reason is not disease or lack of comfort and amenities. This elderly person has no ailments. All comforts and amenities are within his reach. He even has people that will attend on him at the drop of a hat. 

The person looks quite okay, but seems to be in fear a lot. That is because he lost his courage. That is slowly emaciating him. Even a strong person looks like a coward if he loses courage. That is why, one must be strong in all aspects and activities. One must have the mental stability, “Let anything come, let anything happen”. 

One should never be afraid. One should not announce his weakness and fears to others. That is how courageously one must behave. That itself will pour life into the man. One endowed with such courage will always look alive and vibrant. This will save man’s life and give him longevity.

 If one keeps pondering and losing courage despite having no ailments and despite having all comforts within reach, he will die early. His lifespan will shrink. “How is this man so hale and hearty despite his illnesses and difficulties?” That’s because he has a lot of mental strength.

Keeping what’s in the heart from getting out is Gambhiryam (profundity). You should not repeatedly talk about your fears. It is difficult for another person to correctly judge or estimate a person with a great depth of personality. 

When one is profound and has a depth to his personality, he can even win over enemies. That means, if one is not profound, his actions and words will clearly reveal what is in his heart. Bad things will not happen to one who has a deep personality that does not reveal everything in his heart to others. 

Having a great depth of personality means that he has unlimited wealth. It means he is a treasure-house of knowledge. Unless one accumulates a lot of knowledge, such a quality will not become a habit. Even if difficulties keep piling on in layers, a stable and steadfast demeanor will become a habit. 

That is why, when we talk about depth of personality, the ocean first comes to mind. The ocean is also called Ratnakara. He has so much depth, no one knows what’s in his heart. Who knows what’s deep inside the ocean? Nobody does.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ఎవరి తప్పులకు వారిదే బాధ్యత 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
📚. ప్రసాద్‌ భరద్వాజ. 

మీ తప్పులకు మీరెలా బాధ్యులవుతారు? మీరు తప్పుగా బొమ్మవేసి, బొమ్మదే తప్పంటే ఎలా కుదురుతుంది. ఆ తప్పు మీదే కదా!
గుంపునకు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. 

ప్రపంచానికి ప్రళయం వచ్చిన రోజున ఏ కాల్పనిక దేవుడో వచ్చి ‘‘ఇంతవరకు నువ్వేంచేసావు. ఏంచెయ్యలేదు’’అని మిమ్మల్ని అడుగుతాడని ఎప్పుడూ భావించకండి. ఆ నిర్ణయాలన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. కాబట్టి, మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లే. ఈ సత్యాన్ని తెలుసుకున్న వెంటనే మీ జీవితం క్రియాశీలమైన నాణ్యతను సంతరించుకుంటుంది. ‘భయం మీకు బేడీలు వేస్తుంది, స్వేచ్ఛ మీకు రెక్కలనిస్తుంది.’’

*🌷. దేని నుంచి స్వేచ్ఛ- దేని కోసం స్వేచ్ఛ: 🌷*

ఎప్పుడూ ‘‘దేని కోసం స్వేచ్ఛగా ఉండాలి’’ అని ఆలోచించాలి తప్ప, ‘‘దేని నుంచి స్వేచ్ఛగా ఉండాలి’’ అని ఆలోచించకండి, వాటిమధ్య చాలా తేడా ఉంది. ‘‘దేని నుంచి’’ కాకుండా, ‘‘దేని కోసం’’ గురించే ఎప్పుడూ ఆలోచించండి. 

సత్యం కోసం, దేవుడి కోసం స్వేచ్ఛగా ఉండండి. అంతేకానీ, గుంపు నుంచి, చర్చి నుంచి, దాని నుంచి, దీని నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించకండి, ఆశించకండి, ఏదో ఒకరోజు మీరు వాటికి చాలా దూరంగా వెళ్ళగలిగినా, మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. ఎందుకంటే, అదికూడా ఒక రకమైన అణచివేత లాంటిదే. 

అయినా, గుంపంటే మీకెందుకంత భయం? ఆ భయమే మీ గుంపుకు గుంజుకునే ఆకర్షణ శక్తి ఉన్నట్లు, అందుకే మీరు దాని ఆకర్షణలో పడ్డట్లు నిరూపిస్తోంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా గుంపు మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది. దాని పరిమితులు, పద్ధతుల గురించి మీరు ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. 

కేవలం దాని వాస్తవాలను మీ పద్ధతిలో మీరు గమనిస్తే దానిని మీరు వెంటనే వదిలెయ్యగలరు. అది పెట్టే అవస్థలలో చిక్కుకున్న మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. పైగా, అలా అవస్థలు పడడంలో ఏమాత్రం అర్థంలేదు. కాబట్టి, దానిని వదిలించుకోండి.

నిజానికి, గుంపు ఒక సమస్యకాదు, మీకుమీరే సమస్య. గుంపు మిమ్మల్ని గుంజట్లేదు. మీకుమీరే గుడ్డిగా వెళ్ళి ఆ గుంపులో పడ్డారు. బాధ్యతను ఎవరిపైకో నెట్టడం భావ్యంకాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలా నెట్టినా మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. 

ఎందుకంటే, దానికి మీరే బాధ్యులని మీ అంతరంగం మిమ్మల్ని దొలుస్తూనే ఉంటుంది. ఎవరైనా గుంపును ఎందుకు అంతగా వ్యతిరేకించాలి, అది చేసే గాయాలను ఎందుకు భరించాలి? మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీ సహకారమే అసలు సమస్య. 

అందువల్ల ఏమాత్రం ఆలోచించకుండా గుంపుకు సహకరించడం వెంటనే మానండి. ఏమాత్రం ఆలోచించినా వెంటనే మీరు సమస్యలో పడతారు. ఎందుకంటే, గుంపుతో పోరాడాలనుకుంటే మీరు ఓడిపోయే యుద్ధం చేస్తున్నట్లే, గుంపుకు ప్రాధాన్యమిస్తున్నట్లే. అలా అనేక లక్షల మంది ఓడిపోయే యుద్ధమే చేశారు.

భారతదేశంలో అనేక శతాబ్దాల పాటు అదే జరిగింది. నిద్ర, ఆహారాలు మాని, ఉపవాసాల వ్రతాలు, యమ, నియమ, ప్రాణాయామ యోగప్రక్రియలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేశారు. అయినా వారు వాటినుంచి ఏమాత్రం తప్పించుకోలేకపోగా, ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ, వాటి దగ్గరే ఉన్నారు. అలా అవే వారికి చాలా ముఖ్యమైపోయాయి. మఠాలలో అదే జరిగింది. వారు చాలా భయంకరమైన అణచివేతకు గురయ్యారు. అందుకే వారు చాలా భయపడ్డారు. 

గుంపును చూసి భయపడితే రేపు మీకూ అదే జరుగుతుంది. మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీచెయ్యలేవు. కాబట్టి, గుంపుకు ఏమాత్రం సహకరించకుండా చాలా అప్రమత్తంగా ఉండండి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 106 / Sri Lalitha Sahasra Namaavali - 106 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*

*🌻 184. 'నిస్తులా'🌻*

సాటిలేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాతతో సాటియైనవారెవరూ లేరు. ఆమె కామెయే సాటి. ఆమెతో సరితూగుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. తూకమునకే తుల. మరియొకటేదియూ సృష్టిలో ఆమెతో తూకమునకు సరిపోదు. 

అందువలన ఆమె నిస్తుల, పోల్చిచూడుకులెనన్నచో చైతస్యము అవసరము. 'పోల్చి చూచుట ఎఱుక యున్నపుడు కదా! ఎఱుకగల ఇద్దరిని పోల్చవచ్చును. ఎవరి ఎఱుక ఎక్కువ, ఎవరి ఎఱుక తక్కువ తేల్చవచ్చును. కానీ ఎఱుకతో ఎవరిని పోల్చగలరు? ఇద్దరియందు ఎఱుక శ్రీమాతయే. 

అందరి యందూ ఆమెయే ఎఱుకగా యున్నది. ఆమె మొత్తము సృష్టికి ఎఱుక. సృష్టియందలి అన్నియూ ఆమె ఎఱుకతో నిండియున్నప్పుడు వాటిని ఆమెతో సరిపోల్చుట సాధ్యమగు విషయము కాదు. 

సముద్రమందలి అలలను ఒకదానితో మరియొకదానిని పోల్చవచ్చును. కానీ సముద్రముతో వాటిని పోల్చలేము. ఎంత పెద్ద అలయైననూ సముద్రముతో పోల్చుట అపహాస్యము.

అట్లే శ్రీమాతతో ఎవరినైన పోల్చినచో అది పరిహాసమే. ఆమె జగత్ చైతన్య స్వరూపిణి. భక్త పరాధీన అగుటయే, తన భక్తుల నుద్ధరించుటకు లీలాప్రాయముగా పరమభక్తికీ, పరమ ప్రేమకూ సరితూగుచుండును.

ఆమెయే శ్రీకృష్ణుని రూపమున అవతరించినది. కృష్ణ మూలము శ్రీలలితయే. అతడు జగత్ చైతన్యస్వరూపుడు. అతనిని, తనకున్న ఐశ్వర్యముతో సత్యభామ శూకము వేయపూనినది. సృష్టి ఐశ్వర్యమైన శ్రీకృష్ణుని, సృష్టియందు అల్పములైన ఐశ్వర్యములతో తూకము వేయపూనుట వలన సత్యభామాదేవి అపహాస్యమునకు గురియైనది. 

కానీ పరమభక్తికీ, పరమప్రేమకూ తాను లోబడుదునని తెలియజేయుటకు, రుక్మిల ప్రార్థించి యుంచిన తులసీదళముతో అతడు సరితూగి అనుగ్రహించెను. 

సంకల్పించినచో శ్రీమాత అణువంత కూడ యుండును. స్వయమునకు మహత్తును మించి యుండును. అది ఆమె లీల.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nistulā निस्तुला (184) 🌻*

She is incomparable. Comparison can be only between two equals. Since She is the Supreme and does not have equals there is no question of comparing Her.

Nāma 389 also refers to Her incomparability.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 525 / Bhagavad-Gita - 525 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 08 🌴*

08. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర: |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||

🌷. తాత్పర్యం : 
వాయువు గంధము మోసుకొనిపోవునట్లే, జీవుడు ఈ భౌతికజగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి, తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును.

🌷. భాష్యము :
తన దేహమునకు “ఈశ్వరుడు” (నియామకుడు) అని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలచినచో అతడు ఉన్నతజన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును లేదా నీచదేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయమున అతనికి సూక్ష్మమైన స్వాతంత్ర్యము కలదు. 

అనగా దేహమందలి మార్పు దేహియైన అతని పైననే ఆధారపడియున్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. 

అతడు తన చైతన్యమును శునక, మార్జాలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము కావించుకొనినచో అట్టి శునక, మార్జాల దేహమునే తప్పక పొందవలసివచ్చును. దేవతా లక్షణములందు అతని చైతన్యము లగ్నమైనచో మరణానంతరము దేవతాశరీరమును పొందును. ఒకవేళ కృష్ణభక్తిరసభావితుడైనచో ఆధ్యాత్మికజగమునందలి కృష్ణలోకమును చేరి కృష్ణుని సాహచార్యమును పొందును.

 కావున దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని పలుకుట మిథ్యావాదమే యగును. ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందు జీవుని వర్తమానదేహము మరియు దాని యందలి కర్మలు భావిజన్మకు నాంది కాగలవు. కర్మననుసరించే జీవుడు దేహమును పొందును. 

ఆ విధముగా లభించిన దేహమును జీవుడు తిరిగి సుక్ష్మశరీరమే తరువాతి జన్మలోని దేహమును తయారుచేయుచున్నదని ఇచ్చట పేర్కొనబడినది. ఒక దేహమును విడిచి వేరొక దేహమును పొందుట మరియు దేహమందున్నప్పుడు వివిధక్లేశములకు గురియగుట యనెడి ఈ విధానమే “కర్షతి” (జీవనసంఘర్షణము) యని పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 525 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 08 🌴*

08. śarīraṁ yad avāpnoti
yac cāpy utkrāmatīśvaraḥ
gṛhītvaitāni saṁyāti
vāyur gandhān ivāśayāt

🌷 Translation : 
The living entity in the material world carries his different conceptions of life from one body to another, as the air carries aromas. Thus he takes one kind of body and again quits it to take another.

🌹 Purport :
Here the living entity is described as īśvara, the controller of his own body. If he likes, he can change his body to a higher grade, and if he likes he can move to a lower class. 

Minute independence is there. The change his body undergoes depends upon him. At the time of death, the consciousness he has created will carry him on to the next type of body.

 If he has made his consciousness like that of a cat or dog, he is sure to change to a cat’s or dog’s body. And if he has fixed his consciousness on godly qualities, he will change into the form of a demigod. And if he is in Kṛṣṇa consciousness, he will be transferred to Kṛṣṇaloka in the spiritual world and will associate with Kṛṣṇa. It is a false claim that after the annihilation of this body everything is finished. 

The individual soul is transmigrating from one body to another, and his present body and present activities are the background of his next body. One gets a different body according to karma, and he has to quit this body in due course. 

It is stated here that the subtle body, which carries the conception of the next body, develops another body in the next life. This process of transmigrating from one body to another and struggling while in the body is called karṣati, or struggle for existence.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 4 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 4 🌴

4. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ||

🌷. తాత్పర్యం :
ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.

🌷. భాష్యము:
యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుని గొప్పశక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైనవారు పెక్కురు కలరు.

విజయపథములో వారు గొప్ప అవరోధములు వంటివారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో గొప్ప అవరోధముల వంటివారు దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతియెక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటచే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 BhagavadGita As it is - 4 🌹 
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 4 🌴

4. atra śūrā maheṣv-āsā bhīmārjuna-samā yudhi yuyudhāno virāṭaś ca drupadaś ca mahā-rathaḥ

🌷 TRANSLATION: 
Here in this army are many heroic bowmen equal in fighting to Bhīma and Arjuna: great fighters like Yuyudhāna, Virāṭa and Drupada.

🌷 PURPORT: 
Even though Dhṛṣṭadyumna was not a very important obstacle in the face of Droṇācārya’s very great power in the military art, there were many others who were causes of fear. They are mentioned by Duryodhana as great stumbling blocks on the path of victory because each and every one of them was as formidable as Bhīma and Arjuna. He knew the strength of Bhīma and Arjuna, and thus he compared the others with them.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -128 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 13

*🍀. 11. మానసిక సన్న్యాసము - మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 🍀*

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ II 13

మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. సన్న్యాస మనగ ముందు శ్లోకముల యందు దైవము నిర్వచన మందించినాడు. 

1. దేనిని కాంక్షింపనివాడు, ద్వేషింపని వాడు సన్న్యాసి. 

2. సతతము దైవముతో మనన మార్గమున యోగయుక్తుడైనవాడు సన్న్యాసి. సన్న్యాస దీక్ష వలన యింద్రియములు నియమమున నుండగలవు. మనసు పరిశుద్ధమగును.

3. సన్న్యాసి సర్వజీవుల యందలి దైవమునే దర్శించుచుండును. 

4. తన నుండి జరుగుచున్న మనో దేహేంద్రియ వ్యాపారములను
మననమున నుండి వీక్షించువాడు సన్న్యాసి. 

5. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు సన్న్యాసి. అట్టివాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును. 

6. 6. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 

పై ఆరు గుణములు కల జీవుని మనసున సన్న్యాసము స్థిరపడి యుండును. సుఖ మతని వశమున నుండును. అట్టివాడు దేహము నందుండుటకు ఎట్టి అసౌకర్యముండదు. నిజమున
కిట్టి సన్న్యాసియే మానవదేహ సౌలభ్యము, సౌకర్యము అనుభూతి పరముగ నెరిగి యుండును.

పై సర్వమును గృహస్థు అయినను నిర్వర్తించుకొన వచ్చును. గృహము, సంఘము, దేహము బంధములు కావు. ప్రతిబంధకములు కానే కావు. కావున సన్న్యాసమను పేర భార్యాపిల్లలను
విసర్జించుట, వృత్తి వ్యాపారములను వదలివేయుట, సంఘమున వేరుపడి వెలిగ నుండమని భగవంతుడు చెప్పలేదు. 

“మనసా సన్న్యస్య" అని పలుకుటలో, మనసున సన్న్యసించిన చాలునని, భౌతిక సన్న్యాసము అవసరము కాదని తెలిపినాడు. తానట్లే ఆచరించి చూపినాడు. రాజర్షులు, మహర్షులుకూడ నట్లే ఆచరించిరని తెలిపినాడు. సంసారమధ్యమున కూడ సన్న్యాసిగ నుండవచ్చునని తెలిపినాడు. 

“సన్న్యాసులందు కూడ చాలమంది సంసారులే” అని అనుచు అప్పుడప్పుడు మాస్టర్ ఇ.కె. గారు పలుకుచుండెడి వారు. మాస్టర్ ఇ.కె. గారు సంసారమందు సన్న్యాసిగ ఎట్లుండ వచ్చునో జీవించి చూపించినారు. సన్న్యాసము మానసికమే అని తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 328 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
82. అధ్యాయము - 37

*🌻. యజ్ఞ విధ్వంసము - 4 🌻*

దక్షుడు శివుని నిందించిన సమయములో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నందికోపముతో నేలపై బడవేసి, అతని నేత్రములను గిల్లివేసెను(54) శివ గణనాయకులు ఆ యజ్ఞశాలయందు ఉన్న స్వాహ, స్వదా, దక్షిణా అను దేవతలను, మంత్ర తంత్రాదిష్టాన దేవతలను, ఇతరులను దురవస్థకు గురిచేసిరి(55) ఆ గణములు కోపముతో అగ్నివేదికయందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగ నుండెను(56). 

వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచే దాగియున్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీర భద్రుని సన్నిధిలో నిలబెట్టిరి(57)

వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా, యోగమహిమచే ఆతలను నరకుట సంభవము కాలేదు(58) ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచేగాని నరుకుట సర్వథా అసంభవమని భావించి, అతడు గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో పెరికివేసేను(59)

 గణాధ్యక్షుడగు వీరభద్రుడు దుష్టుడు, శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సునను అగ్ని కుండమునందు బారవైచెను(60) అపుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోథముతో సర్వమును తగులబెట్టి ప్రళయాకాలాగ్నిని బోలియుండెను(61)

వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి, తరువాత క్రోథముతో వారికి నిప్పుపెట్టి, అగ్నిహోత్రము మిడతలను వలె తగుల బెట్టెను(62) అపుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను(63) 

అపుడాతడు వీరశోభతో ప్రకాశించెను గణములతో కూడియున్న వీరభద్రునిపై నందన వనమునందు పుట్టిన దివ్యపుష్పములు వర్ణించెను(64) పరిమళభరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయములో దేవదుందుభులు అద్భుతముగా మ్రోగినవి(65)

  చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడు వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తిచేసుకొని శీఘ్రముమే కైలాసమునకు వెళ్ళెను(66) పరమేశ్వరుడగు శంభుడు కార్యమును పూర్తిచేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సుగలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను(67).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసనంహితయందు రెండవది యగు సతీఖండలో యజ్ఞ విద్వంస వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది(37)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 81 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 6 - THE 10th RULE
*🌻 10. Desire only that which is beyond you. - It is beyond you, because when you reach it you have lost yourself. - 2 🌻*

324. At each of these stages we feel that we have grasped the truth, and entered upon the real life, but presently we realize that there is something still higher, as high again as that was beyond our previous experience. All the way up we have to drop the lower before we can really gain the higher. 

That is to say, we have to lose the life we know before we can reach the higher life which we hope to attain. At each stage, as we reach it, we find that we have lost the self which we have known previously, because we have transcended it. We have lost it in finding a higher self.

325. It is written in the books that we become one with the Logos, merged in Him. Now, that final result we know nothing of, but this much some of us can say from our own personal experience, that many such mergings at different levels take place in the progress of the soul, and in each of them it seems that we become utterly one with the highest which then we can reach, yet never through all that do we lose anything of our true Self. 

When we rise, let us say, into the buddhic consciousness, and lose the causal body, we have lost the lower life, but that was never more than a very inadequate manifestation of a small part of us. All that we have gained through the long series of lives is still there. 

What we have shed is only the outer form in which our various qualities expressed themselves. We have the qualities still, on a higher level, shining forth with greater brilliancy, but the form in which they were cast has gone. 

Because people so constantly identify the life with the form, to many it seems that should they lose that form there would be nothing left. On the contrary, nothing that has been gained is ever lost.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 213 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శుకమహర్షి - 1 🌻*

జ్ఞానం:

01. జీవుడి పరిణామం ఎలా ఉందంటే, భౌతికంనుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటమే. అంటే, ధర్మబద్ధమైన భౌతికజీవనమునుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటము జరుగుతున్నది. ఈ రెండిటినీ చెప్పిన వేదవ్యాసుడు ఐహిక-ఆముష్మిక మార్గములు రెండింటికీ జగద్గురువు అయ్యాడు. వేదవిజ్ఞాన్నంతా మనకు ప్రసాదించాడు. 

02. శుకుడు ఆయన కుమారుడు. అతడు ఆధ్యాత్మికస్థితిలోనివాడిగా, బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. వ్యాసమహర్షికి – ఈ సర్మకాండలతోటి, వేదవాజ్ఞ్మయంతోటి నిమిత్తంలేకుండా ఉన్నటువంటి, వాటియొక్క పరిణామదశయైన స్థితిలోఉన్న శుకుడు కుమారుడిగా జన్మించాడు. 

03. అంటే, అది ఆయనయొక్క పరిణామదశ. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నట్లుగా, వ్యాసుడివిషయంలో పరమాత్మయే పుత్రనామంతో వచ్చినట్లుగా శుకుడి వృత్తాంతం సంభవించింది. తండ్రియైన వ్యాసమహర్షి ఆజ్ఞప్రకారం, జనకమహారాజుని “బ్రాహ్మణుడి కర్తవ్యం ఏమిటి? ఆయన మోక్షం ఎట్లా పొందుతాడు?” అని అడిగాడు. 

04. జనకుడు ఆయనతో, “బ్రాహ్మణుడు ఊపనీతుడై, బ్రహ్మచర్యము, వేదాభ్యాసము నడిపి వివాహంచేసుకుని సంతానం పొంది, దేవపితృవిధులాచరించి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళి హుతవహ ప్రయత్నముగా వ్రతపాలనచేసి, ఆ తర్వాత సన్యాసస్వీకారముచేసి బ్రహ్మాశ్రమ పదము పొంది, అనంతరం జీవన్ముక్తికి తపస్సుచేయాలి” అని చెప్పాడు.

05. శుకుడు, “కానీ జ్ఞానోదయమై ఉండగా ఆశ్రమ త్రయాన్ని క్రమంగా నడుపవలేనా? జ్ఞానియైనా ఆశ్రమములు విడువరాదని వేదములు చెబుతాయా?” అని అడిగాడు. దానికి జనకుడు, “మునీంద్రా! జ్ఞాన విజ్ఞానములు మోక్షసాధనములే! గురూపదేశంతో అవి లభించగా మోక్షం పొందినవాడు వాటిని విడిచిపెడతాడు. 

06. కానీ లోకోఛ్ఛేదకము, కర్మవ్యాకులత వాటిల్లకుండా ఉండటంకోసం లోకానికతడు ఉదాహరణగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని, కర్మభ్రష్టుడనే భ్రాంతిలోకానికి కలగరాదు. కాబట్టే పూర్వమునులు నాలుగు ఆశ్రమాలనూ క్రమంగా నడిపించారు. కాని ప్రథమ ఆశ్రమంలోనే సుస్థిరజ్ఞానం లభించిన వాడికి మిగిలిన ఆశ్రమాలతో పనిలేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 277 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 126. This knowledge 'I am' has dawned on you, thereafter witnessing began. That 'One' who witnesses is separate from what is witnessed. 🌻*

This knowledge 'I am' has come uncalled, it has appeared or dawned on you without your asking for it. It came very spontaneously and swiftly, and before even you could do anything the witnessing of space began. The 'I am' and space came together, you 'saw' and felt the body and started identifying the 'I am' with it. 

In the process of going back you ponder on the question 'who is witnessing?' or 'On whom did this 'I am' appear?' Then you realize that the 'One' who witnesses has to stand apart from what is witnessed, and that this 'One' has been forever there.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 152 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 31 🌻*

603.నిర్వాణము - నిర్వికల్పము.
శరీరము నిలిచి యుండగనే ఇది ప్రాప్తించును. అప్పుడు విదేహముక్తుడగును. దేహమునకు ముక్తి కాదు. దేహము కాని దానికి--అనగా, స్వాత్మకు ముక్తి లభించును.

604. విదేహ ముక్తి:-
మానవుడు భగవంతుడైన తరువాత 3 లేక 4 రోజుల వరకు అతని శరీరము నిలిచి యుండును. ఇతని చైతన్యము పూర్తిగా భగవంతునిలో కరిగిపోవును. కనుక దేహములయందు, సృష్టియందు స్పృహయుండదు. వారు నిరంతరముగా సచ్చిదానంద స్థితిని అనుభవించుచుందురు. కాని వాటిని సృష్టిలో ఎఱుకతో వినియోగించరు. ఇతరులు ముక్తులగుకు సహాయపడరు. 

కానీ, వారు భూమిమీద ఉన్నకొలది రోజులు, వారి సాన్నిధ్యము అనంతజ్ఞాన శక్యానందములను ప్రసారము చేయుటలో కేంద్రముగా నుండును; 

వారిని దరిచేరువారును, సేవించువారును, పూజించువారును, మిక్కిలి ప్రయోజనమును పొందెదరు ఇతరులు తమ తమ ప్రారబ్ధము ననుసరించి సంవత్సరముల కొలది శరీరములను నిల్పుకొందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 8 / Sri Lalita Sahasranamavali - Meaning - 8 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 8. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |*
*తాటంక యుగళీభూత తపనోడుప మండలా ‖ 8 ‖ 🍀*

21) కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : 
కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.

22) తాటంక యుగళీభూత తపనోడుప మండలా : 
చెవి కమ్మలుగా జంటగా అయిన సూర్య చంద్ర మండలమును గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 8 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 8. kadambamañjarī-kḷpta-karṇapūra-manoharā |*
*tāṭaṅka-yugalī-bhūta-tapanoḍupa-maṇḍalā || 8 || 🌻*

21 ) Kadambha manjari kluptha karna poora manohara -   
She who has beautiful ears like the kadamba flowers

22 ) Thadanga yugali bhootha thapanodupa mandala -
She who wears the sun and the moon as her ear studs

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 8 / Sri Vishnu Sahasra Namavali - 8 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*భరణి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 8. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |*
*హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ‖ 8 ‖ 🍀*

 🍀 64) ఈశాన: - 
సర్వ భూతములను శాసించువాడు.

🍀 65) ప్రాణద: - 
ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.

🍀 66) ప్రాణ: - 
ప్రాణశక్తి స్వరూపమైనవాడు.

🍀 67) జ్యేష్ఠ: - 
వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)

🍀 68) శ్రేష్ఠ: - 
అత్యంత ప్రశంసాపాత్రుడు.

🍀 69) ప్రజాపతి: - 
సమస్త ప్రజలకు పతి.

🍀 70) హిరణ్యగర్భ: - 
విశ్వగర్భమున నుండువాడు.

🍀 71) భూగర్భ: - 
భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.

🍀 72) మాధవ: - 
శ్రీదేవికి భర్తయైనవాడు.

🍀 73) మధుసూదన: - 
మధువను రాక్షసుని వధించినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 8 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka For Bharani 4th Padam*

*🌻 8. īśānaḥ prāṇadaḥ prāṇō jyeṣṭhaḥ śreṣṭhaḥ prajāpatiḥ |*
*hiraṇyagarbhō bhūgarbhō mādhavō madhusūdanaḥ || 8 || 🌻*

🌻 64) Ishana – 
The Lord Who Rules Over Everything

🌻 65) Pranada – 
The Bestower of Vital Breaths

🌻 66) Prana – 
The Lord Who is the Soul

🌻 67) Jyeshtha – 
The Lord Who is Elder to All Others

🌻 68) Shreshtha – 
The Lord Who is Better Than All Others

🌻 69) Prajapati – 
The One Who is the Chief of All Human Beings

🌻 70) Hiranyagarbha – 
The Lord Who Dwells in the Womb of the World

🌻 71) Bhoogarbha – 
The Lord Who Carries the Earth Within Himself

🌻 72) Madhava – 
The Lord Who is the Consort of Lakshmi

🌻 73) Madhusudana – 
Destroyer of the Demon Madhu

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 1 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఉపోద్ఘాతం 🌻
 
🌻 1. భారతీయ సంస్క్రతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించి చెప్పినవారు మన మహర్షులు. వారు లేకపోతే, వేదములూ లేవు, హిందూ ధర్మమూ లేదు, మనకొక విర్దుష్ఠమైన, గమ్యమైన ఈశ్వరుడూ లేడు.
 
🌻 2. దేవతలకంటే, ఈశ్వరుని కంటే కూడ మనకు దగ్గరగా వుండి, మనను నిత్యమూ నడిపిస్తూ, మనకు సంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. వారి వల్లనే మనకు ఈ సంస్కృతి వచ్చింది. (అట్టి ఋషులు ఈ శతాబ్దంలో కూడా మనకు ఉన్నారు; రమణమహర్షి అటువంటివారు.)
 
🌻 3. ఋషుల చరిత్ర మనలో ఒక ఉత్తేజం కలుగజేసి, మనకు గొప్పజ్ఞానం ఇస్తుంది. బ్రహ్మ ముఖంలో నుండి వేదం పుట్టింది గాని, దానిని మనకు ప్రసాదించింది ఋషులే. బ్రహ్మమనకు నేరుగా ఇవ్వలేదు. ఋషులే ఇచ్చారు.
 
🌻 4. బ్రహ్మ మొట్టమొదట సృష్టించిన అతడి మానసపుత్రులు,వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోయి మోక్షంపొందారు. పూర్వ కల్పంలో (అంటే ప్రళయానికి ముందరున్న పూర్వసృష్టిలో) ఉండే దేవతలు, ఋషులు, మునులు, వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులై పుట్టడం, వెళ్లిపోవడము జరిగింది. 

ప్రజాపతుల ఉద్దేశ్యం – మనుష్యులు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. వాళ్ళ సంతానం వృద్ధిచెంది దేశమంతా నిండాలి, కళకళ లాడాలి అని. అవిద్య, ఆజ్ఞ్యానం, దేహాత్మ భావన, దేహాభిమానం- ఇలాంటి లక్షణాలుంటే తప్ప మనుష్యులు వృద్ధిపొందరు. శుద్ధ జ్ఞానంతో ఉండేవారు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. జ్ఞానాజ్ఞానములు రెండూ, విద్య-అవిద్యలు రెండూ ఎవరికైతే ఉంటాయో వారే సంతానము పొందుతారు. అప్పుడే ప్రజలు వృద్ధి అవుతారు.
 
🌻 5. మనకందరికీ మూలాధార చక్రంలో చతుర్దళ పద్మంలో గణపతి అధిష్ఠాన దేవతగా ఆశీనుడై ఉండి,’ఈ దేహమే నేను‘ అనే భ్రాంతిని కలుగ జేస్తున్నాడు. ఆయన అలా చేస్తున్నందు వలనే మనం అన్నం తింటున్నాము, పడుకొంటున్నాము. దేహం నాదని, ఇల్లు నాదని కాపాడుకుంటున్నాము. ఇందువలనే సంతానం కలుగుతున్నది. ఇదంతా, ఈ నాగరికత అంతా కూడా దేహాభిమానం వల్లనే కలుగుతోంది. దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమై పోతుంది. ఎవరూ ఉండరు.”దేహాభిమానం చెడ్డది కదా!” అని అంటే, జ్ఞానానికీ, మోక్షానికీ వెళ్లే దారిలో వదిలి పెట్టమన్నారు కానీ, అది లేకుండా జీవితంలో సంచరించడమే సాధ్యంకాదు. 

అది లేకుండా సంచరిస్తే, మనుష్యుడు-త్రాగినవాడు, పిచ్చివాడివాలె – తనను ఏ స్థంభానికో వేసికొట్టుకుంటాడు. దేంట్లోనో పడి చచ్చిపోతాడు. ”ఈ దేహం నాది, దీనిని సంరక్షించి ఉంచుకుంటాను” అనేటువంటి వివేకం ఒకటి జీవకాక్షణంలో సహజంగా ఉండాలి.అట్టి జీవలక్షణం అనే భావానికి అధిపతి గణపతి.
 
🌻 6. అలా సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు అనేక ఇబ్బందులు కలిగాయి. మనుష్యులను సృష్టించగానే, వారికి తలపైకి ఉండాలో క్రిందికి ఉండాలో, కడుపు ఎక్కడ ఉండాలో తెలియలేదు. ఆకారం ఎలాగ ఉండాలో ఆయనకు జ్ఞాపకం రాలేదట. ఒకవేళ జ్ఞాపకం వచ్చి అలాగే పెడదామని ప్రయత్నించినా కూడా, వంకరటింకరగా తల క్రిందికి, కాళ్ళు పైన, చేతులు వీపువెనుక – అలాగ వచ్చాయట.
 
🌻 7. అప్పుడు ఆ గణపతిని బ్రహ్మదేవుడు తన ముందర ఆవాహన చేసుకున్నాడు. అ గణపతి బ్రహ్మ దేవుని కంటే పూర్వుడు. “బ్రాహ్మణాం బ్రహ్మణస్పతి” అని మంత్రం అంటే, సృష్టి ప్రారంభానికి ముందు అని. బ్రహ్మదేవుడు, ఆ మహాగణపతిని తలచుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమై,”మూలాధారమనే చక్రాన్ని సృష్టించు, అక్కడి నుండి సహస్రార కమలం దాకా నిర్మాణం చెయ్యి. 

ఆ మూలాధార చక్రంలో నేను అధిష్ఠాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను ప్రసాదించి, వాళ్ళ ఆత్మరక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్లు, అన్నవస్త్రాలను సంపాదించుకుని బ్రతకాలనే కోరిక వాళ్లలో కలిగేటట్లుగా చేసి, ఆ కోరికలో నుండి సంతాన మందు వాళ్లకు ఇచ్ఛ కలుగజేసి సృష్టిని కలుగచేస్తాను. నీవు సృష్టించు, నేను ఈ పనిని చేస్తాను” అన్నాడు. 

కాబట్టి, ఆ మహాగణపతి జీవులలోకి ప్రవేశించగానే, ఆయన యొక్క అనుగ్రహం చేత వాళ్లకు దేహాత్మభావన కలిగింది. దేహాభిమానం కూడా కలిగింది. అటువంటి గణపతి అనుగ్రహం చేత, తరువాత సృష్టి సక్రమంగా జరిగింది.
 
🌻 8. ఈ సృష్టి రహస్యము యావత్తు, సమస్త జీవకోటి యొక్క జీవలక్షణమూ అంతా సంపూర్ణంగా అర్థంచేసుకుని,”బ్రహ్మ ఎవరు? ఆత్మ ఎక్కడ? పదార్ధం అంటే ఏమిటి? పంచభూతములు ఎలా వచ్చాయి? ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి?“ 

ఇన్ని విషయాలూ తెలిసి, ఈ జగత్తు యొక్క భవిష్యత్తు తెలిసి, జీవులకు ఏది క్షేమకరమో అదీ తెలిసిన వారు మహర్షులు. ఆద్యంతమూ సృష్టి కథ అంతా తెలిసి, వాళ్ళ కర్తవ్యమేగాక, మన కర్తవ్యము, భవిష్యత్తులో పుట్టబోయే వారియొక్క యోగక్షేమాలుకూడా ఆలోచించి గలిగినవారు మహర్షులు. అటువంటి మహర్షులు అనేకమంది ఆర్యసంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 2 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అగస్త్య – లోపాముద్ర - 1 🌻
 
🌻 1. అగస్త్య మహర్షి – లోపాముద్ర వివాహము విదర్భ దేశంలో సిద్ధతీర్ధం అనే ప్రాంతంలో జరిగింది. అగస్త్యుడు లోపాముద్రను వివాహం చేసుకున్న స్థానం కాబట్టి, ఆ సిద్ధ తీర్ధాన్ని స్మరణ చేసుకున్నా, అక్కడికి వెళ్లి స్నానం చేసినా కన్యకు అత్యుత్తమమైన వరుడు లభిస్తాడని, వరుడుకి కూడా అత్యుత్తమమైన వధువు లభిస్తుందని విశ్వాసం.
 
🌻 2. అగస్త్య మహర్షి త్రికాలవేది. ఆయనది మనుష్య బుద్ధి కాదు. అనేక విషయాలు చూడగలడు. మనుష్య బుద్ధికి కొంతే తెలుస్తుంది. ఒక మాట వింటుంటే దాని వెనకాల ఎన్ని పరిణామాలు ఉన్నవో చూసేదే దివ్యదృష్టి. మాట మాత్రమే అర్థంచేసుకుంటే అది మనుష్య బుద్ధి.
 
🌻 3. తపస్సుకు, యోగానికి అసాధ్య మనేదేమీ లేదు. అవి శాశ్వత సత్యాలు. ఇప్పుడైనా ఎప్పుడైనా సాధ్యమే. భవిష్యత్తులో ఎంత అధర్మం ఉన్నా, అజ్ఞానం ఉన్నా యోగం మాత్రం నశించే విద్య కాదు. సజీవంగా ఉండే విద్య. అదే ఆర్ష్య సంప్రదాయం! ఈ సత్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఋషుల యొక్క చరిత్రలు సత్యము యొక్క చరిత్రలు.
 
🌻 4. పితృలోకాలలో ఎప్పుడూ అయిదుగురు దేవతలు శాశ్వతంగా ఉంటారు. ఇక్కడ చనిపోయిన జీవులు ఆ పితృలోకాలకువెళ్లి ఆ పితృదేవతల సంరక్షణలో ఉంటారు. ఆ దేవతలకు ముందర నమస్కరించి, తర్పణం ఇచ్చి, తరువాత మనం ఇక్కడనుంచి వెళ్ళిపోయిన మన తాతలకు ఇస్తాము.
 
🌻 5. మనుష్యులలో సామాన్యప్రజాలు లక్షల కొద్దీ చేసే నేరాలు, అధర్మాలు-వాటినాన్నిటినీ ఆహారంగా తీసుకొని జీర్ణించుకొని, చక్కగా ఈ ప్రపంచాన్ని ధర్మబద్ధంగా నడిపించేటటువంటి వాళ్ళు మహర్షులే!. నిరంతరమూ మహర్షులే మానవ జాతికి ప్రాతఃస్మరణీియులు, వందనీయులు.
 
🌻 6. జీవులకు చాలా భయంకరమయిన కర్మపాశం ఉంటుంది. ముక్తికి అది అడ్డు వస్తుంది. ముక్తిని కోరుకోగలిగి నప్పటికీ, కర్మ జీవుని వదలదు. పూర్ణ కర్మక్షయం కావడం అనేది సాధ్యంకాదు. సులభంగా కాదు. అందుకే అనుభవించ మంటారు దానిని. అనుభవించాలి. వదిలి పెట్టేటప్పుడు దానిని విడదీసుకోవాలి. పాశం మనకు ఎక్కడ అయితే బంధం అయిందో, అక్కడ దానిని కత్తిరిస్తే ఆ గొలుసంతా ఊడిపోతుంది.
 
🌻 7. దేవతలు శాపగ్రస్థులై భూమిమీద పుట్టారంటే, అక్కడ వాళ్ళు అలా వుండగానే వాళ్ళ జీవలక్షణంతో మనిషి శరీరంలోకి వచ్చి ఇక్కడ కూడా బ్రతుకుతున్నారు అని అర్థం చేసుకోవాలి . అలాంటి మానవత్వ లక్షణం వాళ్లకు శాపం తోటే కలగాలి. లేకపోతే రాదు.
 
🌻 8. “అగస్త్య మహర్షి జీర్ణం చేసుకొని, పవిత్రమైన సముద్ర జలం మళ్లీ వదిలిపెట్టారు. అందుచేత నిరంతరమూ సముద్రస్నానం చేయకండి! పర్వదినాలలో, పుణ్యతిధులలో మాత్రమే – ఆ పుణ్యతిధుల ప్రభావంచేత దాంట్లో ఉన్న అపవిత్రత తొలగుతుంది. ఆనాడు మాత్రమే స్నానం చేయాలి” అని నిర్ణయంచేశారు అగస్త్య మహర్షి.
 
🌻 9. క్షత్రియుడు లోకాన్ని పరిపాలించే ప్రభువు. కాబట్టి ఎవరైనా తమ ప్రభువుకు ఏదైనా సమర్పిస్తారు. అది దానంకాదు. సమర్పణం. దేశాన్ని ఏలే ప్రభువుకు ప్రజాలెవరైనా ఆభరణాలలాంటి కానుకలు సమర్పించటము, ప్రభువులు స్వీకరించటము ధర్మము. అయితే బ్రాహ్మణుడు దానం తీసుకుని ఆశీర్వదిస్తాడు. చెయ్యిజాపి అడుగుతారు, తీసుకుంటాడు. దానం తీసుకునేటప్పుడు బ్రహ్మణుడి చెయ్యి క్రింద ఉంటుంది. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. కాని రాజు స్వీకరించేటప్పుడు ఇచ్చేవాడి చెయ్యి క్రిందఉంచి అందిస్తే, రాజు చేయి పైన ఉంచి స్వీకరిస్తాడు క్షత్రియుడు కాబట్టి.
 
🌻 10. యజ్ఞం జరుగుతూ ఉండగా, లోకోపద్రవంగా తుఫానురాకూడదు. వర్షం మాత్రం పడాలి. అదికూడా ప్రసన్నంగా, నాజూకుగా వర్షంపడటం యజ్ఞానికి శుభసూచన. సాత్వికంగా ఉండాలి ఆ వర్షం.
 
🌻 11. దక్షిణకాశి – వాస్తవానికి భీమేశ్వరమే దక్షిణకాశి. ఏదయినా సరే, కాశీతో సమానమని చెప్పటం చేత ఒక క్షేత్రాన్ని గౌరవించినట్లు భారతీయుల భావం.
 
🌻 12. మహర్షులు తత్త్వం తెలిసి మాట్లాడుతారు. వారి స్తోత్రంలో సత్యం ఉంటుంది. కాబట్టి ఆ స్తోత్రాలను మనం చదువుకుంటే, అందులో ఉన్న సత్యమే మనల్ని కాపాడుతుంది. నాశనంగాని, వినాశనం గాని అజ్ఞానంవలన ఏర్పడతాయి. మనిషికి ఆయుర్దాయం, భాగ్యం అన్నీ కూడా సత్య జ్ఞానం వలన కలుగుతాయి. మహర్షులు చేసే స్తోత్రములన్నీ కూడా సత్యములే! సృష్టిలో రహస్యంగా కనబడీ కనబడకుండా ఉండే సత్యాలతో వారు చేసిన స్తోత్రములు నిండి ఉండటం చేత, వాటికి ఆ శక్తి ఉంది. అంతేగాని వట్టి స్తోత్రాలు కావావి.
 
🌻 13. రసవంతము, రసహీనము – పుష్టిగా ఉండే చెఱకు కర్రకు, ఎండకు ఎండిపోయిన పుల్లకు ఉన్న తేడా.
 
🌻 14. 29 వ మహా యుగంలో అగస్త్య మహర్షే వేదవ్యాసుడు.
 
🌻 15. లోపాముద్ర సహితమయినటువంటి అగస్త్య మహర్షిని ఎవరైతే తలచు కుంటారో, వాళ్లకు సమస్తశుభాలు, కళ్యాణము జరుగుతాయి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 3 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అగస్త్య – లోపాముద్ర - 2 🌻
 
🌻 16. పురాణ గోత్రకర్తలయిన సప్తఋషులు వేరు. సప్తఋషులలో, అంటే గోత్ర కర్తలలో ఆగస్థ్య మహర్షి లేడు. నక్షత్రమండలంలో ఉన్నాడు. ఒక యుగంలో ఆ నక్షత్రానికి అధిపతిగా, యాజమానిగా ఉన్నాడాయన. వశిష్ఠుడు,అరుంధతి ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు అక్కడ లోపాముద్ర సహితంగా ఆగస్త్యుడున్నాడు. సప్తర్షులు అంటే ఒకే సమూహము అని అర్థం.
 
🌻 17. తపస్సులు ఎలాంటివి?ఎన్ని జన్మలు ఎన్నివేల సంవత్సరములు ఎంత చేసినా అలా ఎందుకవుతుంది? దీనికి ఒక ముగింపు లేదా! ఈశ్వరుడు ప్రత్యక్షం కావాలి కదా! అని ప్రశ్న. అంటే, ముక్తికొరకై ఆచరించ బడేటటువంటి తపస్సుకు, ఈశ్వరుడిలో లయం చెందుదామనే తపస్సుకు అవరోధంగా ఏదో ఒక చిన్న కర్మశేషం మిగిలి ఉంటుంది. ఆ కర్మ శేషం నివారణ అయ్యే వరకు కూడా అలాగే తపస్సు చేసుకుంటూనే ఉంటారు. తపస్సు అంటే ఆత్మదర్శనం/ఈశ్వర దర్శనం. అల్లాంటిది ఏదో అయిన తరువాత కూడా, ఆ జీవత్వం అతడిని వదలక ఆ కర్మశేషం అనుభవింపచేస్తుంది. లౌకికమయిన కోరికలతో చేసే తపస్సులో, వ్యక్తి తపస్సును అనవసరంగా ఎక్కువగా పెరగనీయకుండా, ముందే ప్రత్యక్షమై, అతడికి ఆ భౌతికమయిన కోరికలనిచ్చి, అంతటితో తపస్సులోంచి బయటకులాగి మళ్ళీ మామూలు మనుష్యుల్లో పడేస్తుంది దైవం. 

🌻 18. తపస్సు దేని కోసమంటే – ఆ ఆత్మ దర్శనం కోసం వేచి ఉండటమే తప్ప, తాను వెళ్లి ప్రయాణం ముగించి సంపాదించు కోవడం అనేది లేదు. ఆ ప్రయాణానికి అంతు లేదు. దానంతట అది లభించ వలసిందే.
 
🌻 19. ముక్తి కోరే తపస్సుకి ఏ కర్మయితే అడ్డువస్తున్నదో, ఆ కర్మానుభవం వాళ్లకు రావసిందే! ముక్తికి అడ్డం వచ్చేటటువంటి కర్మ, కర్మఫలం, సంస్కారం, మానుషత్వం, ఈ ప్రపంచపు వాసన – ఇదంతా నిస్సేషంగా దానంతట అదిపోదు. ఏదో ఒక సంఘటన,ఒక అనుభవం, ఒక జన్మ అయితేనే అవుతుంది!ఎవడి అదృష్టం పండుతుందో వాడికి ఆ తపస్సు అక్కడితో భంగమయి; ఆ కర్మశేషానికి దాన్ని ఖర్చుపెట్టడానికి ఏయే సంఘటనలు కావలెనో ఆ సంఘటనలు వెంటనే జరిగితే, ఆతడు ముక్తిని పొందుతాడు. ఆ తపస్సుకు భంగం కలగటమే వాడి అదృష్టం! అలా కాకపోతే శిలామయంగా కూర్చుని ఉంటాడేతప్ప వాడికేమీ సుగతి ఉండదు. వేలాది సంవత్సరాలు ఎందుకు తపస్సులో ఉన్నారో అంటే, సమాధానం ఇదే.
 
🌻 20. మానస తీర్ధములే ముక్తిహేతువులు. బాహ్య తీర్ధముల కంటే ఇవి మేలు. సత్యము, ఇంద్రియ నిగ్రహము, అనసూయ, దానము, దయ, సంతోషము, బ్రహ్మచర్యము, ధైర్యము, యమము, సమత్వము, విజ్ఞానము వీటన్నింటినీ మానస తీర్ధములు అంటారు. వీటిని పాటించకుండా, కేవల బాహ్య తీర్ధముల వలన ప్రయోజనము లేదు. అంటే, మానసిక తీర్ధములు అలవరచు కొంటేనే గాని బాహ్య తీర్ధముల వలన ప్రయోజనము ఉండదు. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనక పోవటము, అహంకారము లేకపోవటము, కోపము చంపుకోవటం, ఆలస్యం చేయక పోవటం, సత్యనిష్ఠ మొదలైనవన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఎన్ని తీర్ధాలైనా కాశీప్రాప్తినే ఇస్తాయి. కాశీ తీర్ధంలో స్నానం చేయని వాడు లక్ష తీర్ధాలను దర్శించినా మోక్షం రాదు.
 
🌻 21. ప్రకృతిని ఎవ్వరూ శాసించలేరు. ఒకవేళ ప్రార్థిస్తే ప్రసాన్నంకావచ్చు. ప్రార్థిస్తే ప్రసన్నమయే లక్షణం ప్రకృతిలో ఉండబట్టే, ‘శన్నోవాతః…’ అంటూ ప్రార్ధన వచ్చింది. మనం ప్రార్థిస్తే అది ప్రసన్నం అవుతుంది. ఇవాళపుట్టి రేప్పొద్దున్న వెళ్లిపోయే మనిషిఎవడికీ కూడా, ఈ ప్రకృతిమీద అధికారం లేదు. ఈ ప్రపంచంలో మనం ఉండేది కేవలం అతిస్వల్పకాలం! ఒక రకంగా చెప్పాలంటే, మనకు దానిమీద ఈనాడు అధికారం ఉంటే, అంతకు ముందు ఏముంది? స్వతంత్రంగా ఉందా? మనం వచ్చాకే అది మనకు లొంగిందా? అజ్ఞానంవల్ల అలా మనుష్యుల్లో కొందరికి అహంకారంవస్తుంది. ఎప్పుడూ అలా రాకూడదు.
 
🌻 22. శరీరాన్ని రక్షించే అంగములన్నీ దేవతల రక్షణ పొందటాన్ని ‘కవచం’ అని అంటారు. మనోబలం, ఆత్మబలం అనిమనం అంటూ ఉండే ధైర్యస్థైర్యాలను ఈ కవచం ఇస్తుంది. శరీరంలో రోగబాధలు వచ్చినప్పుడు ఆదిత్యకవచం చదువుకోవాలి. అందరు దేవతలకు స్తోత్రం ఉంటుంది. తరువాత కవచం, తరువాత హృదయం, తరువాత మంత్రము ఉంటాయి. అవి అన్నీ ఆయా ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయి. అందుకే శరీరాబాధలు వచ్చినప్పుడు కవచం, దర్శన సిద్ధి కోసం మంత్రం చదువుకోవాలి. 

🌻 23. నక్షత్రరూపంలో ఉన్న అగస్థ్యమహర్షిని భాద్రపద మాసంలో దర్శించుకోవాలని చెపుతారు. ఆ కాలంలో రాత్రి సమయంలో సూర్యుడు కన్యారాశిలో ఉండటంచేత, కన్య అస్తమించిన తరువాత ఉదయించేటటువంటి ధనూరాశి, పైకి వెళ్లినప్పుడు ఆగస్థ్యమహర్షి దర్శనం సరిగ్గా ధనూరాశి ప్రక్కనే అవుతుంది. అంటే మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రక్కనే, అర్ధరాత్రి సమయంలో మిణుకు మిణుకుమంటూ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి దక్షిణభాగంలో, ధనూరాశి ప్రక్కన, అర్ధరాత్రి సమయంలో బాగా చీకటి ఉన్నప్పుడు మాత్రమే అగస్త్య నక్షత్రం భాద్రపద మాసంలో కనబడుతుంది. అప్పుడు చూసిన తరువాత దానికి నమస్కరించి, నదీ స్నానం చేసి ఆర్ఘ్యములు ఇవ్వాలి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹