శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalitha Chaitanya Vijnanam - 184


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 184 / Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 184. 'నిస్తులా'🌻

సాటిలేనిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాతతో సాటియైనవారెవరూ లేరు. ఆమె కామెయే సాటి. ఆమెతో సరితూగుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. తూకమునకే తుల. మరియొకటేదియూ సృష్టిలో ఆమెతో తూకమునకు సరిపోదు.

అందువలన ఆమె నిస్తుల, పోల్చిచూడుకులెనన్నచో చైతస్యము అవసరము. 'పోల్చి చూచుట ఎఱుక యున్నపుడు కదా! ఎఱుకగల ఇద్దరిని పోల్చవచ్చును. ఎవరి ఎఱుక ఎక్కువ, ఎవరి ఎఱుక తక్కువ తేల్చవచ్చును. కానీ ఎఱుకతో ఎవరిని పోల్చగలరు? ఇద్దరియందు ఎఱుక శ్రీమాతయే.

అందరి యందూ ఆమెయే ఎఱుకగా యున్నది. ఆమె మొత్తము సృష్టికి ఎఱుక. సృష్టియందలి అన్నియూ ఆమె ఎఱుకతో నిండియున్నప్పుడు వాటిని ఆమెతో సరిపోల్చుట సాధ్యమగు విషయము కాదు.

సముద్రమందలి అలలను ఒకదానితో మరియొకదానిని పోల్చవచ్చును. కానీ సముద్రముతో వాటిని పోల్చలేము. ఎంత పెద్ద అలయైననూ సముద్రముతో పోల్చుట అపహాస్యము.

అట్లే శ్రీమాతతో ఎవరినైన పోల్చినచో అది పరిహాసమే. ఆమె జగత్ చైతన్య స్వరూపిణి. భక్త పరాధీన అగుటయే, తన భక్తుల నుద్ధరించుటకు లీలాప్రాయముగా పరమభక్తికీ, పరమ ప్రేమకూ సరితూగుచుండును.

ఆమెయే శ్రీకృష్ణుని రూపమున అవతరించినది. కృష్ణ మూలము శ్రీలలితయే. అతడు జగత్ చైతన్యస్వరూపుడు. అతనిని, తనకున్న ఐశ్వర్యముతో సత్యభామ శూకము వేయపూనినది. సృష్టి ఐశ్వర్యమైన శ్రీకృష్ణుని, సృష్టియందు అల్పములైన ఐశ్వర్యములతో తూకము వేయపూనుట వలన సత్యభామాదేవి అపహాస్యమునకు గురియైనది.

కానీ పరమభక్తికీ, పరమప్రేమకూ తాను లోబడుదునని తెలియజేయుటకు, రుక్మిల ప్రార్థించి యుంచిన తులసీదళముతో అతడు సరితూగి అనుగ్రహించెను.

సంకల్పించినచో శ్రీమాత అణువంత కూడ యుండును. స్వయమునకు మహత్తును మించి యుండును. అది ఆమె లీల.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 184 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nistulā निस्तुला (184) 🌻

She is incomparable. Comparison can be only between two equals. Since She is the Supreme and does not have equals there is no question of comparing Her.

Nāma 389 also refers to Her incomparability.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



19 Jan 2021

No comments:

Post a Comment