శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 308-2. 'రాజీవలోచనా' 🌻

కన్నులు జీవ చైతన్యమునకు ముఖద్వారములు. జీవులు ఒకరి నొకరు కన్నులలోనికి చూచియే పలుకరించుకొను చుందురు. ఇరువురి జీవుల మధ్య ప్రధానముగ కన్నుల ద్వారముననే చైతన్యము పరస్పరము వ్యవహరించుట జరుగును. కన్నులే జీవ చైతన్యమునకు ముఖ ద్వారములు. సర్వ ప్రపంచమును కన్నులతోనే దర్శింతుము. దివ్య లోకముల దర్శనము కూడా దివ్యమగు కన్నుల ద్వారముననే కలుగును.

విచ్చుకున్న కన్నులు సమస్తమును దర్శించగలవు. ఆ దర్శనమున పారదర్శకత్వ ముండును. అమ్మ కన్నులు పారదర్శకములు. పారమును చూడగలవు. పరమును చూచు కన్నులు గనుక పరతత్త్వమును ప్రసరింప జేయుచుండును. పరతత్త్వమును కోరిన జీవులకు ప్రసాదించు చుండును. అమ్మ కన్నులను వర్ణించుట కాళిదాసాది మహాకవులకు కూడ అసాధ్యమైనది. రాజీవ మనగా చేప అని కూడ అర్థమున్నది.

రాజీవలోచనములు అనగా చేప ఆకారమున నుండు కన్నులు. అమ్మకు 'మీనాక్షి' అని మరియొక నామ మున్నది. అది తరువాతి నామములలో వివరింప బడును. రాజీవ మనగా జింక అని అర్థ మున్నది. కావున జింక కన్నుల వంటి కన్నులు కలది అని కూడ అర్థము. జింక కన్నులలో చంచలత్వము, బెదరు కనిపించును. బెదరుచూపులు సౌమ్యతను, స్త్రీత్వమును ప్రకటించును. సౌమ్యత్వము సత్వగుణమును ప్రకటించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 308-2. Rājivalocanā राजिवलोचना (308) 🌻

The intended meaning of this nāma is that Her eyes are not comparable to anything. Her eyes are full of grace and compassion. By mere winking of eyes, She performs three actions of creation, sustenance and destruction (nāma 281). Rājiva also means king and rājivalocanā means eyes of one who is dependent on king. It has been already seen that Śiva is known as Rājarāja and dependent refers to His devotees. She blesses His devotees with the grace of Her eyes.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 70

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 70 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది. కానీ మనం హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వుంచు. దేవుణ్ణి అందుకుంటావు. 🍀

సమస్త అసిత్వం, నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అది నిన్ను రక్షిస్తుంది. నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది. అది చేజారి పోయిందంటే అది నీ వల్లనే జరుగుతుంది. నువ్వు నీ తలుపులు మూసి వుంటే సూర్యకాంతి బయటనే వుంటుంది. నువ్వు చీకట్లో వుంటావు. ఒక వేళ తలుపులు తెరిచినా సూర్యకాంతి లోపలికి వచ్చినా నువ్వు కళ్ళు మూసుకుంటే చీకట్లోనే వుంటావు.

అదే విషయం దేవుడికి సంబంధించినది అయినా ఆయన ప్రేమ ఎప్పుడూ అక్కడ వుంటుంది. మన హృదయాలే మూసుకుని వుంటాం. హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వుంచు. దేవుణ్ణి అందుకుంటావు. అప్పుడు నువ్వు అనంతంతో కలిసి స్పందిస్తావు. అప్పుడు ప్రార్థనగా నువ్వు మారుతావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

10 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 3

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 3 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 2. సాధన సోపానము-1 🌻

ఏ సన్నివేశము నందుగాని, సంఘటన మందుగాని, అకస్మాత్తుగా జరుగు సంఘటనల యందు గాని చెదరకుండుట అభ్యసింపుము. దీనివలన ఎంతయూ ప్రయోజనము కలుగును. నిశ్చలమైన మనస్సును ఏర్పరచుకొనుటకు అనేక రకములగు అభ్యాసములు గలవు. దైవము యొక్క స్మరణము భావరూపమున గాని, మంత్రరూపమునగాని నిరంతరము చేయుట ఒక ఉపాయము.

తనయందు, తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగియుండుట మరియొక యుపాయము. అనగా అన్యచింతన లేక అనన్యచింతన యందు నిలబడుట, దీనినే భగవానుడు పర్యుపాసనము అని తెలిపినాడు. ఈ ఉపాసనము దేశము, కాలము, నామము, రూపము అను పరిమితులు దాటి జరుగుచుండవలెను.

దైవమును ఒక నామము నందో, ఒక రూపము నందో, ఒక కాలమునందో లేక ఒక దేశము నందో స్మరించుట ప్రాథమికమగు అభ్యాసము. అభ్యాసము ముందుకు సాగిన సందర్భమున అన్ని రూపముల యందు, అన్ని నామముల యందు, అన్ని దేశములయందు, అన్ని కాలముల యందు భగవంతుని సాన్నిధ్యమును పొందు ప్రయత్నము జరుగును. అంతర్యామిని అంతట దర్శించుట చేయు ప్రయత్నము సత్యమైన సాధన. ఈ సాధన ద్వారా అస్థిరస్థితి నుంచి మనస్సు స్థిరస్థితిని చేరుకొనగలదు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

10 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 486 / Vishnu Sahasranama Contemplation - 486

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 486 / Vishnu Sahasranama Contemplation - 486🌹

🌻 486. గభస్తినేమిః, गभस्तिनेमिः, Gabhastinemiḥ 🌻

ఓం గభస్తినేమయే నమః | ॐ गभस्तिनेमये नमः | OM Gabhastinemaye namaḥ

గభస్తిచక్రస్య మధ్యే స్థితస్సూర్యాత్మనా హరిః ।
గభస్తినేమిరిత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

గభస్తులు అనగా కిరణములు. గభస్తి చక్రమునకు నేమివంటివాడుగనుక ఆ హరి గభస్తినేమి అని పిలువబడుతాడు. నేమి అనగా చక్రమధ్యమందలి దారుమయమగు చక్రావయవము లేదా ఇరుసు. కిరణములతో ఏర్పడిన చక్రమునకు నడుమ నేమివలె సూర్యరూపమున ఉన్నవాడు. సూర్యుడూ విష్ణుని విభూతియే కదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 486🌹

🌻 486. Gabhastinemiḥ 🌻

OM Gabhastinemaye namaḥ

गभस्तिचक्रस्य मध्ये स्थितस्सूर्यात्मना हरिः ।
गभस्तिनेमिरित्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

Gabhasticakrasya madhye sthitassūryātmanā hariḥ,
Gabhastinemirityukto vidvadbhirvedapāragaiḥ.

Gabhasti means brilliance. Nemi means axle of a wheel. Gabhastinemi means the axle of the wheel of rays or the One with brilliant circumference. Sun is the comparable axle around which or from which brilliant rays emanate from. Even the sun is eminence of Lord Viṣṇu!

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

10 Sep 2021

10-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 10 సెప్టెంబర్ 2021🌹
వినాయక చవితి శుభాకాంక్షలు 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 89 / Bhagavad-Gita - 89 - 2-42🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 658 / Bhagavad-Gita - 658 -18-69🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 486 / Vishnu Sahasranama Contemplation - 486🌹
5) 🌹 DAILY WISDOM - 164🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 3 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 70 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వినాయక చతుర్థి శుభాకాంక్షలు మరియు
శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహా గణపతి ధ్యానం 🍀*

హస్త్రీంద్రానన మిందుచూడ 
మరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా
 స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షు
కార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న 
కలశాన్ హస్తైర్వహంతం భజే ||
🌻 🌻 🌻 🌻 🌻

10 శుక్రవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
 తిథి: శుక్ల చవితి 21:59:05 వరకు తదుపరి శుక్ల పంచమి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: చిత్ర 12:58:29 వరకు తదుపరి స్వాతి
యోగం: బ్రహ్మ 17:42:22 వరకు తదుపరి ఇంద్ర
కరణం: వణిజ 11:08:37 వరకు
వర్జ్యం: 18:11:50 - 19:41:30
దుర్ముహూర్తం: 08:31:11 - 09:20:28 మరియు
12:37:32 - 13:26:48
రాహు కాలం: 10:40:31 - 12:12:53
గుళిక కాలం: 07:35:46 - 09:08:09
యమ గండం: 15:17:39 - 16:50:01
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 06:59:04 - 08:28:48 మరియు
27:09:50 - 28:39:30
సూర్యోదయం: 06:03:23, సూర్యాస్తమయం: 18:22:24
వైదిక సూర్యోదయం: 06:06:55
వైదిక సూర్యాస్తమయం: 18:18:51
చంద్రోదయం: 08:59:24, చంద్రాస్తమయం: 20:58:20
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: తుల
ఆనందాదియోగం: ముసల యోగం - దుఃఖం 12:58:29 
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు 
పండుగలు : వినాయక చవితి, గణేష చతుర్థి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 89 / Bhagavad-Gita - 89 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 42 🌴

42. యామిమాం పుష్పితాం 
వాచం ప్రవదన్త్యవిపశ్చిత: |
వేదవాదరతా: పార్థ 
నాన్యదస్తీతి వాదిన: ||

🌷. తాత్పర్యం :
స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. 

🌻. భాష్యము :
సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానకారణముగా వారు వేదమందలి కర్మకాండ భాగములోని సకామ కర్మల యెడనే అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకికవైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకమునందు జీవితము ననుభవించుటను తప్ప వారు వేరేదియును కోరరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు పెక్కు యజ్ఞములు(ముఖ్యముగా జ్యోతిష్టోమ యజ్ఞములు) వేదములందు ప్రతిపాదింపబడినవి. 

స్వర్గలోకప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించియే తీరవలెనని వాటి యందు తెలుపబడినది. కాని అల్పజ్ఞులు ఇది యొక్కటే వేదముల సమస్త ప్రయోజనమని భావింతురు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 89 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 42 🌴

42. yām imāṁ puṣpitāṁ vācaṁ pravadanty avipaścitaḥ 
veda-vāda-ratāḥ pārtha nānyad astīti vādinaḥ

🌻 Translation :
Men of small knowledge are very much attached to the flowery words of the Vedas, which recommend various fruitive activities for elevation to heavenly planets, resultant good birth, power, and so forth. 

🌻. Purport :
People in general are not very intelligent, and due to their ignorance they are most attached to the fruitive activities recommended in the karma-kāṇḍa portions of the Vedas. They do not want anything more than sense gratificatory proposals for enjoying life in heaven, where wine and women are available and material opulence is very common. 

In the Vedas many sacrifices are recommended for elevation to the heavenly planets, especially the Jyotiṣṭoma sacrifices. In fact, it is stated that anyone desiring elevation to heavenly planets must perform these sacrifices, and men with a poor fund of knowledge think that this is the whole purpose of Vedic wisdom. 
🌹 🌹 🌹 🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 658 / Bhagavad-Gita - 658 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 69 🌴*

69. న చ తస్మాన్మసుష్యేషు 
కశ్చిన్మే ప్రియకృత్తమ: |
భవితా న చమే తస్మాదన్య: 
ప్రియతరో భువి ||

🌷. తాత్పర్యం : 
నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైనవాడు వేరొక్కడు ఉండబోడు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 658 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 69 🌴*

69. na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ
bhavitā na ca me tasmād anyaḥ priya-taro bhuvi

🌷 Translation : 
There is no servant in this world more dear to Me than he, nor will there ever be one more dear.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 486 / Vishnu Sahasranama Contemplation - 486🌹*

*🌻 486. గభస్తినేమిః, गभस्तिनेमिः, Gabhastinemiḥ 🌻*

*ఓం గభస్తినేమయే నమః | ॐ गभस्तिनेमये नमः | OM Gabhastinemaye namaḥ*

గభస్తిచక్రస్య మధ్యే స్థితస్సూర్యాత్మనా హరిః ।
గభస్తినేమిరిత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

గభస్తులు అనగా కిరణములు. గభస్తి చక్రమునకు నేమివంటివాడుగనుక ఆ హరి గభస్తినేమి అని పిలువబడుతాడు. నేమి అనగా చక్రమధ్యమందలి దారుమయమగు చక్రావయవము లేదా ఇరుసు. కిరణములతో ఏర్పడిన చక్రమునకు నడుమ నేమివలె సూర్యరూపమున ఉన్నవాడు. సూర్యుడూ విష్ణుని విభూతియే కదా!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 486🌹*

*🌻 486. Gabhastinemiḥ 🌻*

*OM Gabhastinemaye namaḥ*

गभस्तिचक्रस्य मध्ये स्थितस्सूर्यात्मना हरिः ।
गभस्तिनेमिरित्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

Gabhasticakrasya madhye sthitassūryātmanā hariḥ,
Gabhastinemirityukto vidvadbhirvedapāragaiḥ.

Gabhasti means brilliance. Nemi means axle of a wheel. Gabhastinemi means the axle of the wheel of rays or the One with brilliant circumference. Sun is the comparable axle around which or from which brilliant rays emanate from. Even the sun is eminence of Lord Viṣṇu!

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 164 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 12. Creation is not Exhausted by this Small Earth 🌻*

To try to increase the field of one’s influence is not a solution to one’s problems. We may seek the assistance of many people outside, but how many will we collect altogether? The whole world? Even then there are many things left out. Creation is not exhausted by this small Earth. Even if we roam around the whole solar system, creation is not encompassed. 

The intention of the mind is to reach the limit of its activity, and this limit is never reached by external movements. Despite any amount of external activity—though it may serve as a temporary substitute in order to forget the monotony of life—life nevertheless becomes a monotony to many people. They just cannot tolerate it, but they do not know what to do with this fact. 

They try to forget it in various ways, but though these may become temporal aids, they are not going to be solutions. The creditor is put off with pleas like, “Come tomorrow, sir, or after one month,” but he will eventually come. It may be after five years, but he is going to come.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 3 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 2. సాధన సోపానము-1 🌻*

ఏ సన్నివేశము నందుగాని, సంఘటన మందుగాని, అకస్మాత్తుగా జరుగు సంఘటనల యందు గాని చెదరకుండుట అభ్యసింపుము. దీనివలన ఎంతయూ ప్రయోజనము కలుగును. నిశ్చలమైన మనస్సును ఏర్పరచుకొనుటకు అనేక రకములగు అభ్యాసములు గలవు. దైవము యొక్క స్మరణము భావరూపమున గాని, మంత్రరూపమునగాని నిరంతరము చేయుట ఒక ఉపాయము. 

తనయందు, తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగియుండుట మరియొక యుపాయము. అనగా అన్యచింతన లేక అనన్యచింతన యందు నిలబడుట, దీనినే భగవానుడు పర్యుపాసనము అని తెలిపినాడు. ఈ ఉపాసనము దేశము, కాలము, నామము, రూపము అను పరిమితులు దాటి జరుగుచుండవలెను. 

దైవమును ఒక నామము నందో, ఒక రూపము నందో, ఒక కాలమునందో లేక ఒక దేశము నందో స్మరించుట ప్రాథమికమగు అభ్యాసము. అభ్యాసము ముందుకు సాగిన సందర్భమున అన్ని రూపముల యందు, అన్ని నామముల యందు, అన్ని దేశములయందు, అన్ని కాలముల యందు భగవంతుని సాన్నిధ్యమును పొందు ప్రయత్నము జరుగును. అంతర్యామిని అంతట దర్శించుట చేయు ప్రయత్నము సత్యమైన సాధన. ఈ సాధన ద్వారా అస్థిరస్థితి నుంచి మనస్సు స్థిరస్థితిని చేరుకొనగలదు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 70 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది. కానీ మనం హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వుంచు. దేవుణ్ణి అందుకుంటావు. 🍀*

సమస్త అసిత్వం, నిన్ను చుట్టుముట్టిన సమస్త అస్తిత్వం దైవికమైన శక్తి. అది నిన్ను రక్షిస్తుంది. నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అదెప్పుడూ నీకు అందుబాటులో వుంటుంది. అది చేజారి పోయిందంటే అది నీ వల్లనే జరుగుతుంది. నువ్వు నీ తలుపులు మూసి వుంటే సూర్యకాంతి బయటనే వుంటుంది. నువ్వు చీకట్లో వుంటావు. ఒక వేళ తలుపులు తెరిచినా సూర్యకాంతి లోపలికి వచ్చినా నువ్వు కళ్ళు మూసుకుంటే చీకట్లోనే వుంటావు.

అదే విషయం దేవుడికి సంబంధించినది అయినా ఆయన ప్రేమ ఎప్పుడూ అక్కడ వుంటుంది. మన హృదయాలే మూసుకుని వుంటాం. హృదయాల్ని తెరిచి వుంచం. హృదయాన్ని తెరిచి వుంచు. దేవుణ్ణి అందుకుంటావు. అప్పుడు నువ్వు అనంతంతో కలిసి స్పందిస్తావు. అప్పుడు ప్రార్థనగా నువ్వు మారుతావు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 308-2. 'రాజీవలోచనా' 🌻* 

కన్నులు జీవ చైతన్యమునకు ముఖద్వారములు. జీవులు ఒకరి నొకరు కన్నులలోనికి చూచియే పలుకరించుకొను చుందురు. ఇరువురి జీవుల మధ్య ప్రధానముగ కన్నుల ద్వారముననే చైతన్యము పరస్పరము వ్యవహరించుట జరుగును. కన్నులే జీవ చైతన్యమునకు ముఖ ద్వారములు. సర్వ ప్రపంచమును కన్నులతోనే దర్శింతుము. దివ్య లోకముల దర్శనము కూడా దివ్యమగు కన్నుల ద్వారముననే కలుగును. 

విచ్చుకున్న కన్నులు సమస్తమును దర్శించగలవు. ఆ దర్శనమున పారదర్శకత్వ ముండును. అమ్మ కన్నులు పారదర్శకములు. పారమును చూడగలవు. పరమును చూచు కన్నులు గనుక పరతత్త్వమును ప్రసరింప జేయుచుండును. పరతత్త్వమును కోరిన జీవులకు ప్రసాదించు చుండును. అమ్మ కన్నులను వర్ణించుట కాళిదాసాది మహాకవులకు కూడ అసాధ్యమైనది. రాజీవ మనగా చేప అని కూడ అర్థమున్నది. 

రాజీవలోచనములు అనగా చేప ఆకారమున నుండు కన్నులు. అమ్మకు 'మీనాక్షి' అని మరియొక నామ మున్నది. అది తరువాతి నామములలో వివరింప బడును. రాజీవ మనగా జింక అని అర్థ మున్నది. కావున జింక కన్నుల వంటి కన్నులు కలది అని కూడ అర్థము. జింక కన్నులలో చంచలత్వము, బెదరు కనిపించును. బెదరుచూపులు సౌమ్యతను, స్త్రీత్వమును ప్రకటించును. సౌమ్యత్వము సత్వగుణమును ప్రకటించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 308-2. Rājivalocanā राजिवलोचना (308) 🌻*

The intended meaning of this nāma is that Her eyes are not comparable to anything. Her eyes are full of grace and compassion. By mere winking of eyes, She performs three actions of creation, sustenance and destruction (nāma 281). Rājiva also means king and rājivalocanā means eyes of one who is dependent on king. It has been already seen that Śiva is known as Rājarāja and dependent refers to His devotees. She blesses His devotees with the grace of Her eyes.  
Continues...
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹