🌹 27, FEBRUARY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 27, FEBRUARY 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹 27, FEBRUARY 2024 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 507 / Bhagavad-Gita - 507 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 18 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 18 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 862 / Sri Siva Maha Purana - 862 🌹
🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 2 / The March of Śaṅkhacūḍa - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 120 / Osho Daily Meditations  - 120 🌹
🍀 120. ఆనందం / 120. JOY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 537-2 🌹 
🌻 537. 'అమతి' - 2 / 537. 'Amati' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 27, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 75 🍀*

*75. సప్తలోకైకమకుటః సప్తహోత్రః స్వరాశ్రయః |*
*సప్తసామోపగీతశ్చ సప్తపాతాలసంశ్రయః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విజ్ఞాన భూమికకు త్రోవ అధిమనస్సే : విజ్ఞానమయ చేతనను క్రిందికి గొని తెచ్చుటకు ముందు, అధిమనస్సును చేరి దానిని క్రిందికి తీసుకొని రావడం అవసరం. ఏలనంటే, మనస్సు నుండి విజ్ఞాన భూమికకు చేరే మార్గం ఈ అధిమనస్సే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: కృష్ణ తదియ 25:54:59
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: హస్త 31:34:13 వరకు
తదుపరి చిత్ర
యోగం: శూల 16:25:01 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 12:35:18 వరకు
వర్జ్యం: 13:59:03 - 15:47:15
దుర్ముహూర్తం: 08:57:17 - 09:44:19
రాహు కాలం: 15:25:21 - 16:53:33
గుళిక కాలం: 12:28:57 - 13:57:09
యమ గండం: 09:32:33 - 11:00:45
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 24:48:15 - 26:36:27 
మరియు 27:13:56 - 29:01:12
సూర్యోదయం: 06:36:10
సూర్యాస్తమయం: 18:21:45
చంద్రోదయం: 20:39:23
చంద్రాస్తమయం: 08:11:27
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
31:34:13 వరకు తదుపరి ధ్వాoక్ష
యోగం - ధన నాశనం, కార్య హాని
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 507 / Bhagavad-Gita - 507 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 18 🌴*

*18. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస: పరముచ్యతే |*
*జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్ ||*

*🌷. తాత్పర్యం : తేజోపూర్ణములైన సర్వములందు తేజ:కారణుడతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞానవిషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై యున్నాడు.*

*🌷. భాష్యము : సూర్యుడు,చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే (దేవదేవుడే) కారణు. ఆధ్యాత్మికజగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు. దేవదేవుని తేజము అచ్చట విస్తరించియుండుటయే అందులకు కారణమనియు వేదవాజ్మయమున తెలుపబడినది. కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతికజగమునందు మహాతత్త్వముచే (భౌతికాంశములు) కప్పుబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మికజగత్తున ఏమాత్రము అవసరముండవు.*

*భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతికజగత్తు నందు స్థితిని కలిగిలేదని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంతదూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై యున్నాడు. ఈ విషయమును వేదములు సైతము నిర్ధారించియున్నవి. “ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8) అనగా సూర్యుని వలె నిత్యకాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతికజగత్తు అంధకారమునకు ఆవల నున్నాడు”.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 507 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 18 🌴*

*18. jyotiṣām api taj jyotis tamasaḥ param ucyate*
*jñānaṁ jñeyaṁ jñāna-gamyaṁ hṛdi sarvasya viṣṭhitam*

*🌷 Translation : He is the source of light in all luminous objects. He is beyond the darkness of matter and is unmanifested. He is knowledge, He is the object of knowledge, and He is the goal of knowledge. He is situated in everyone’s heart.*

*🌹 Purport : The Supersoul, the Supreme Personality of Godhead, is the source of light in all luminous objects like the sun, moon and stars. In the Vedic literature we find that in the spiritual kingdom there is no need of sun or moon, because the effulgence of the Supreme Lord is there. In the material world that brahma-jyotir, the Lord’s spiritual effulgence, is covered by the mahat-tattva, the material elements; therefore in this material world we require the assistance of sun, moon, electricity, etc., for light.*

*But in the spiritual world there is no need of such things. It is clearly stated in the Vedic literature that because of His luminous effulgence, everything is illuminated. It is clear, therefore, that His situation is not in the material world. He is situated in the spiritual world, which is far, far away in the spiritual sky. That is also confirmed in the Vedic literature. Āditya-varṇaṁ tamasaḥ parastāt (Śvetāśvatara Upaniṣad 3.8). He is just like the sun, eternally luminous, but He is far, far beyond the darkness of this material world.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 862 / Sri Siva Maha Purana - 862 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 34 🌴*

*🌻. శంఖచూడుని యుద్ధయాత్ర - 2 🌻*

*శంఖచూడుడిట్లు పలికెను - ఓ సేనాపతీ! ఈనాడు యుద్ధనిపుణులగు వీరులందరు యుద్దమునకు కావలసిన ఏర్పట్లనన్నిటినీ సంసిద్ధము చేసుకొని బయలుదేరెదరుగాక! (11)దైత్యుల యొక్క, శూరలగు దానవులయొక్క, మరియు బలవంతులగు కంకులయొక్క ఎనభై ఆరుపటాలములు సైన్యము ఆయుధములను సిద్ధముచేసుకొని నిర్భయముగా వెంటనే బయలుదేరవలెను (12). కోటి సైన్యముతో సమమగు పరాక్రమముగల అసురుల సేనలు ఏబది గలవు. దేవపక్షపాతియగు శంభునితో యుద్దము కొరకై ఆ సేనలు బయలుదేరును గాక! (13) ధౌమ్రుల వంద సేనలు నా ఆజ్ఞచే సన్నద్ధులై శంభునితో యుద్దము కొరకు వెంటనే బయలుదేరవలెను (14). కాలకేయులు, మౌర్యులు, మరియు కాలకులు నా ఆజ్ఞచే సన్నద్ధులై రుద్రునితో యుద్ధము కొరకు బయలుదేరెదరు గాక! (15).*

*సనత్కుమారుడిట్లు పలికెను - అసురులకు, దానవులకు ప్రభువు, మహాబలశాలియగు శంఖచూడుడు ఇట్లు ఆజ్ఞాపించి వేలాది పటాలముల మహాసైన్యముతో చుట్టు వారబడిన వాడై బయలు దేరెను (16). ఆతని సేనాపతి యుద్ధకళలో నిపుణుడు, మహాదథి, మహావీరుడు, యుద్ధములో రథికులలో శ్రేష్ఠుడు (17). మూడు లక్షల అక్షౌహిణీల సేనతో గూడియున్న ఆ సేనాపతి మంగళకరమగు పూజాదులను చేసి శిబిరము బయటకు వచ్చెను. యుద్ధములో శత్రు వీరులకాతడు భయమును గొల్పు చుండెను (18).ఆతడు శ్రేష్ఠమగు రత్నములతో అద్భుతముగా నిర్మింపబడిన విమానము నధిష్ఠించి, పెద్దలందరికీ నమస్కరించిన తరువాత, యుద్ధము కొరకు బయలుదేరెను (19).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 862 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 34 🌴*

*🌻 The March of Śaṅkhacūḍa - 2 🌻*

Śaṅkhacūḍa said:—
11. O general, let the heroic warriors start for the war. Let them be ready for action; they have been trained well for the war.

12. Let the heroic Dānavas and Daityas, the armies of the powerful Kaṅkas of eighty-six divisions well-equipped in arms set out fearlessly.

13. Let the fifty families of Asuras, having the heroism and prowess of a crore set out to fight with Śiva, the partisan of the gods.

14. At my bidding, let the hundred armed families of Dhaumras speedily set out to fight with Śiva.

15. At my behest, let the Kālakeyas Mauryas, Dauhṛdas and the Kālakas set out ready for the fight with Śiva.

Sanatkumāra said:—
16. After ordering thus, the powerful lord of Asuras and the Emperor of the Dānavas set out surrounded by thousands of warriors and great armies.

1 7. His general was an expert in the science and technique of warfare. He was the best of charioteers a great hero and skilled in warfare.

18. He had three hundred thousand Akṣauhiṇī[2] armies. He performed the rites of auspicious beginning and came out of the camp. He was terrible to the watching heroes.

19. Mounting on an aerial chariot of exquisite build and inlaid with gems, and making obeisance to the elders and preceptors he set out for the battle.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 120 / Osho Daily Meditations  - 120 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 120. ఆనందం 🍀*

*🕉 ఆనందం అన్ని భయాలకు విరుగుడు. జీవితాన్ని ఆస్వాదించకపోతే భయం వస్తుంది. జీవితాన్ని ఆస్వాదిస్తే భయం పోతుంది. 🕉*

*పాజిటివ్‌గా ఉండండి మరియు మరింత ఆనందించండి, మరింత నవ్వండి, ఎక్కువ నృత్యం చేయండి, ఎక్కువగా పాడండి. చిన్న విషయాల పట్ల, చాలా చిన్న విషయాల పట్ల కూడా మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. జీవితం చిన్న విషయాలతో కూడి ఉంటుంది, కానీ మీరు చిన్న విషయాలకు ఉల్లాసాన్ని తీసుకురాగలిగితే, మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా గొప్పది జరుగుతుందని వేచి ఉండకండి. గొప్ప విషయాలు జరుగుతాయి, అవి జరగవని కాదు-కాని గొప్పది జరిగే వరకు వేచి ఉండకండి. మీరు చిన్న, సాధారణ, రోజువారీ విషయాలను కొత్త మనస్సుతో, కొత్త తాజాదనంతో, కొత్త ఉత్తేజంతో, కొత్త ఉత్సాహంతో జీవించడం ప్రారంభించినప్పుడే ఇది జరుగుతుంది. ఆ తర్వాత మీరు కూడబెట్టుకుంటారు, మరియు ఆ సంచితం ఒక రోజు పరిపూర్ణ ఆనందంగా విరాజిల్లుతుంది.*

*కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒడ్డున గులకరాళ్ళను సేకరించడం కొనసాగించాలి. మొత్తానికి గొప్ప సంఘటన అవుతుంది. మీరు ఒక గులకరాయిని సేకరించినప్పుడు, అది ఒక గులకరాయి. గులకరాళ్లన్నీ కలిస్తే ఒక్కసారిగా వజ్రాలు. అదే జీవితం యొక్క అద్భుతం. ఎప్పుడూ ఏదో గొప్పదనం కోసం ఎదురుచూస్తూ ఉన్నదాన్ని చూడలేని వాళ్లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇది జరగదు. ఇది చిన్న విషయాల ద్వారా మాత్రమే జరుగుతుంది: మీ అల్పాహారం తినడం, నడవడం, స్నానం చేయడం, స్నేహితుడితో మాట్లాడటం, ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ కూర్చోవడం లేదా ఏమీ చేయకుండా మీ మంచం మీద పడుకోవడం. ఈ చిన్న విషయాలతోనే జీవితం ఏర్పడింది. అవి జీవితానికి ముఖ్యమైనవి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 120 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 120. JOY 🍀*

*🕉  Joy is the antidote to all fear. Fear comes if you don't enjoy life. If you enjoy life, fear disappears.  🕉*

*Be positive and enjoy more, laugh more, dance more, sing more. Become more and more cheerful, enthusiastic about small things, even very small things. Life consists of small things, but if you can bring the quality of cheerfulness to small things, the total will be tremendous. So don't wait for anything great to happen. Great things do happen it is not that they don't-but don't wait for the something great to happen. It happens only when you start living small, ordinary, day-today things with a new mind, with new freshness, with new vitality, with new enthusiasm. Then by and by you accumulate, and that accumulation one day explodes into sheer joy.*

*But one never knows when it will happen. One has just to go on collecting pebbles on the shore. The totality becomes the great happening. When you collect one pebble, it is a pebble. When all the pebbles are together, suddenly they are diamonds. That's the miracle of life. There are many people in the world who miss because they are always waiting for something great. It can't happen. It happens only through small things: eating your breakfast, walking, taking a bath, talking to a friend, just sitting alone looking at the sky or lying on your bed doing nothing. These small things are what life is made of. They are the very stuff of life. *

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 537 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 537 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 537. 'అమతి' - 2 🌻*

*బుద్ధి, ప్రాణ స్పందనము, అహంకారము, త్రిగుణములు యివి అన్నియూ మతికి ఆవలయున్న స్థితులు. మతిగ కూడ నుండునది శ్రీమాతయే అయినప్పటికినీ ఆమె మతికి అతీతమని తెలియవలెను. మతి కలిగినప్పుడే అమితముగ అనుమతి కలుగును. రస స్వరూపిణి యైన శ్రీమాత మతికి అందునది కాదు. తత్వానుభూతి జీవునకు సంబంధించినది కాని మనస్సంబంధితము కాదు. మతి లేకుండుట అన్నది అతీత స్థితియే గాక అవిద్యాస్థితి యని కూడ తెలియవలెను. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, జంతువు యిత్యాది వాటికి కూడ మతి లేదు. అట్లే మతి లేని మానవులున్నారు. వీరందరునూ అవిద్యా స్థితికి గురియైనటువంటివారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 537 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*

*🌻 537. 'Amati' - 2 🌻*

*Intellect, life force, egoism, trigunas are all states beyond the mind. It should be known that she is beyond the mind even though she herself is the mind. Permission is given mostly when there is a mind. Srimata who is the personification of Rasa, is beyond mind. The experience of Tatva is related to the soul but not to the mind. It should be known that lack of mind is not only a state of transcendence but also a state of ignorance. A stone, a rock, a tree, a flower, an animal etc. have no mind either. There are humans who have no mind. All of them are in a state of ignorance*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 220 : 3-30. svasakti pracayo'sya visvam - 2 / శివ సూత్రములు - 220 : 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 2


🌹. శివ సూత్రములు - 220 / Siva Sutras - 220 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 2 🌻

🌴. విశ్వం అనేది అతని స్వంత శక్తి యొక్క ప్రవాహం లేదా విస్తరణ. 🌴

అత్యున్నత చైతన్యం తనంతట తానుగా పని చేయదని, శక్తికి కావలసిన శక్తిని ఇవ్వడం ద్వారా, తన స్వతంత్ర స్వయం ప్రతిపత్తి శక్తి ద్వారా పనిచేస్తుందని కూడా అతనికి తెలుసు. ఈ విశ్వంలో ఉన్నదంతా శివుని ప్రతిబింబమే తప్ప మరొకటి కాదని కూడా ఆయనకు తెలుసు. శివుడు లేకుండా ప్రకాశం సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన మాత్రమే ప్రకాశానికి మూలం. శక్తి అనేది శివుడు పనిచేసే సాధనం. యోగికి కూడా తెలుసు, అతను శివుని యొక్క అత్యున్నత ప్రభావం అయిన శక్తి యొక్క సంభావ్యతను గ్రహించగలిగితే తప్ప, అతను శివుని సాక్షాత్కార స్థితికి చేరడానికి ముందుకు సాగలేడు అని.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 220 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-30. svaśakti pracayo'sya viśvam - 2 🌻

🌴. The universe is the outflow or expansion of his own shaktis. 🌴


He also knows that the Ultimate Reality does not act on His own, but acts through His independent Power of Autonomy given to Śakti by means of power of attorney. He also knows that whatever exists in this universe is nothing but the reflection of Śiva. Without Śiva, illumination is not possible, as He alone is the source of illumination. Śakti is the tool through which Śiva acts. The yogi also knows that unless he is able to realise the potentiality of Śakti, who is nothing but the Supreme effectuality of Śiva, he cannot proceed further to realise Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 217 : 4. There is no Movement Without a Purpose / నిత్య ప్రజ్ఞా సందేశములు - 217 : 4. లక్ష్యం లేకుండా కదలిక లేదు



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 217 / DAILY WISDOM - 217 🌹

🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 4. లక్ష్యం లేకుండా కదలిక లేదు 🌻


మనం తెలుసుకోవాలనే విషయం వస్తువుల వాస్తవికత; అవాస్తవాలు మనల్ని ఆకర్షించవు. మన గ్రహణశక్తిని తప్పించుకునేది, తరచూ మార్పు చెందేది వాస్తవంగా పరిగణించబడదు ఎందుకంటే అది నిరంతరం వేరొకదానిలోకి వెళుతుంది. విషయాలు మారుతున్నాయని మనం చెప్పినప్పుడు, వాస్తవానికి ఒక పరిస్థితి వేరొక పరిస్థితుల్లోకి వెళుతుందని అర్థం; ఒక పరిస్థితి మరొక పరిస్థితికి దారి తీస్తుంది. ఇది అస్సలు ఎందుకు ఉండాలి? విషయాలు తమను తాము మార్చుకోవడం మరియు రూపాంతరం చెందవలసిన అవసరం ఎక్కడ ఉంది? ప్రతిదానికీ దాని స్వంత ఉనికిపై అసంతృప్తి కూడా ఉంది. మనల్ని మనం మరొకటిగా మార్చుకోవాలను కుంటున్నాము. విషయాలు బాహ్యంగా మాత్రమే మారుతున్నాయని కాదు; మనం అంతర్గతంగా మారుతున్నాము. శారీరక మరియు ప్రాకృతిక మార్పులతో పాటు మానసిక మార్పు కూడా ఉంది.

కాబట్టి, విషయాల యొక్క క్షణికాత - ప్రపంచంలోని ప్రతిదానిలో వచ్చే ఈ మార్పు, మార్పును గ్రహిస్తామనుకునే మనతో సహా-మనం ప్రస్తుత సమయంలో అందుబాటులో లేని దాని వైపు కదులుతున్నట్లు కనిపిస్తున్న వాస్తవాన్ని సూచిస్తుంది. కదలిక ఎల్లప్పుడూ ఏదో ఒక దిశలో ఉంటుంది మరియు లక్ష్యం లేకుండా కదలిక ఉండదు. కాబట్టి ప్రకృతి యొక్క ఈ కదలికల్లో, మానవ సమాజం యొక్క చారిత్రక, మరియు సామాజిక కదలికల్లో కూడా ఒక నిర్దుష్టమైన ప్రయోజనం ఉండాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 217 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 4. There is no Movement Without a Purpose 🌻

The reality of things is what we are after; unrealities do not attract us. That which perpetually changes and escapes the grasp of our comprehension cannot be considered as real because of the fact of its passing constantly into something else. When we say that things are changing, we actually mean that one condition is passing into something else; one situation gives way to another situation. Why should this be at all? Where is the necessity for things to change and transform themselves? There is also a dissatisfaction with everything in its own self. We would like to transform ourselves into something else. It is not that things are changing only outwardly; we are changing inwardly. There is psychological change, together with physical and natural change.

So, the transitoriness of things—the changeful character of everything in the world, including our own selves as perceivers of change—suggests the fact that we seem to be moving towards something which is not available at the present moment. Movement is always in some direction, and there is no movement without a purpose. So there must be a purpose in the movement of nature, in even the historical transformations that take place in human society and in the world as a whole.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 906 / Vishnu Sahasranama Contemplation - 906


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 906 / Vishnu Sahasranama Contemplation - 906🌹

🌻906. అరౌద్రః, अरौद्रः, Araudraḥ🌻

ఓం అరౌద్రాయ నమః | ॐ अरौद्राय नमः | OM Araudrāya namaḥ


కర్మ రౌద్రమ్ రాగశ్చ రౌద్రః కోపశ్చ రౌద్రః యస్య రౌద్రత్రయం నాస్తి అవాప్తసర్వకామత్వేన రాగద్వేషాదేరభావాత్ అరౌద్రః

రౌద్రము లేదా ఉగ్రమగు కర్మాచరణము కాని, 'ఇవి నాకు సుఖము కలిగించునవి కావున నేను పొందవలయును' అను తలంపు అగు రౌద్రపూరితమగు రాగము కాని, రౌద్రమగు కోపము - ఈ మూడు రౌద్ర త్రయమును ఎవనియందు లేవో అట్టివాడు భగవానుడు శ్రీ విష్ణువు. అన్ని కోరికల ఫలములను పొందియున్నవాడగు అవాప్త సర్వకాముడు కావున అతని యందు రాగము, ద్వేషము, కోపము మొదలగునవి ఉండుటకు అవకాశము లేదు. అవి రౌద్రములుగా ఉండు అవకాశము మొదలే లేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 906 🌹

🌻906. Araudraḥ 🌻

OM Araudrāya namaḥ

कर्म रौद्रम् रागश्च रौद्रः कोपश्च रौद्रः यस्य रौद्रत्रयं नास्ति अवाप्तसर्वकामत्वेन रागद्वेषादेरभावात् अरौद्रः /

Karma raudram rāgaśca raudraḥ kopaśca raudraḥ yasya raudratrayaṃ nāsti avāptasarvakāmatvena rāgadveṣāderabhāvāt araudraḥ

Action is wild, attachment is passionate and anger is violent. He in whom these three kinds of fierceness do not exist by reason of His being of all fulfilled desires and as He is not moved by attachment, aversion etc., He is Araudraḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 313 / Kapila Gita - 313


🌹. కపిల గీత - 313 / Kapila Gita - 313 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 44 🌴

44. జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయః|
తన్నిరోధోఽస్య మరణ మావిర్భావస్తు సంభవః॥


తాత్పర్యము : జీవుని ఉపాధిరూపమైన లింగశరీరము మోక్షము లభించనంత వరకు అతని తోడనే యుండును. దేహము, ఇంద్రియములు, మనస్సులతో గూడిన కార్యరూపమగు స్థూలశరీరము ఈ జీవునకు భోగానుభవములకు ఆధారము. ఈ స్థూల, సూక్ష్మదేహములు పరస్పరము సంఘటితము గాకుండుటయే మృత్యువు అనబడును. ఈ స్థూల, సూక్ష్మదేహములు రెండును ఒకటిగా ప్రకటితమగుటనే జన్మ అని యందురు.

వ్యాఖ్య : ప్రాచీన కాలం నుండి, జీవుడు వివిధ జీవజాతులలో మరియు వివిధ గ్రహాలలో దాదాపు శాశ్వతంగా ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రక్రియ భగవద్గీతలో వివరించబడింది. బ్రహ్మాయాన్‌ సర్వ భూతాని యంత్రరూఢాని మాయయా : ( భగవద్గీత 18-61 ) మాయ యొక్క బంధనముతో, ప్రతి ఒక్కరూ భౌతిక శక్తి అందించే శరీర వాహనంపై విశ్వమంతా తిరుగుతున్నారు. భౌతిక జీవితం అనేది చర్యలు మరియు ప్రతిచర్యల శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది చర్యలు మరియు ప్రతిచర్యల యొక్క సుదీర్ఘ చలనచిత్రం, మరియు అటువంటి ప్రతిచర్య ప్రదర్శనలో ఒక జీవితకాలం కేవలం క్షణికం మాత్రమే. ఒక బిడ్డ జన్మించినప్పుడు, అతని నిర్దిష్ట రకమైన శరీరం మరొక రకమైన కార్యకలాపాలకు నాంది అని అర్థం చేసుకోవాలి మరియు ఒక వృద్ధుడు చనిపోయాక, ఒక ప్రతిచర్యాత్మక కార్యకలాపాల గుంపు ముగిసిపోయిందని అర్థం చేసుకోవాలి.

ఒక నిర్దిష్ట రకమైన కార్యాచరణ కోసం జీవికి నిర్దిష్ట శరీరం ఇవ్వబడిందని స్పష్టమవుతుంది. గుర్తించడం సాధ్యం కాని సమయం నుండి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. వైష్ణవ కవులు ఇలా అంటారు, కాబట్టి, అనాది కర్మఫలే, అంటే ఒకరి కార్యకలాపాల యొక్క ఈ చర్యలు మరియు ప్రతిచర్యలు గుర్తించబడవు, ఎందుకంటే అవి బ్రహ్మ జన్మ యొక్క చివరి సహస్రాబ్ది నుండి తదుపరి సహస్రాబ్ది వరకు కూడా కొనసాగవచ్చు. నారద ముని జీవితంలో మనం ఈ ఉదాహరణ చూసాం. ఒక సహస్రాబ్దిలో దాసి కొడుకుగా ఉండి, మరుసటి సహస్రాబ్దిలో గొప్ప జ్ఞాని అయ్యాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 313 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 44 🌴

44. jīvo hy asyānugo deho bhūtendriya-mano-mayaḥ
tan-nirodho 'sya maraṇam āvirbhāvas tu sambhavaḥ


MEANING : In this way the living entity gets a suitable body with a material mind and senses, according to his fruitive activities. When the reaction of his particular activity comes to an end, that end is called death, and when a particular type of reaction begins, that beginning is called birth.

PURPORT : From time immemorial, the living entity travels in the different species of life and the different planets, almost perpetually. This process is explained in Bhagavad-gītā. Bhrāmayan sarva-bhūtāni yantrārūḍhāni māyayā: (BG 18.61) under the spell of māyā, everyone is wandering throughout the universe on the carriage of the body offered by the material energy. Materialistic life involves a series of actions and reactions. It is a long film spool of actions and reactions, and one life-span is just a flash in such a reactionary show. When a child is born, it is to be understood that his particular type of body is the beginning of another set of activities, and when an old man dies, it is to be understood that one set of reactionary activities is finished.

It is clear that a particular body is given to the living entity for a particular type of activity. This process is going on perpetually, from a time which is impossible to trace out. Vaiṣṇava poets say, therefore, anādi karama-phale, which means that these actions and reactions of one's activity cannot be traced, for they may even continue from the last millennium of Brahmā's birth to the next millennium. We have seen the example in the life of Nārada Muni. In one millennium he was the son of a maidservant, and in the next millennium he became a great sage.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 26, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. రుద్రాధ్యాయ స్తుతిః - 03 🍀

03. ఇషుః శివతమా యా తే తయా మృడాయ రుద్ర మామ్ |
శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : విశ్వచేతనా వికాసం : అధిమనో భూమిక యందలి శక్తియే ఒక్కొక్కప్పుడు ప్రత్యక్షంగానూ, ఒక్కొక్కప్పుడు పరోక్షంగానూ విభాగకల్పనా ప్రవృత్తి నుండి మనస్సునకు విమోచనం కల్పించి, విశ్వచేతనను సాధకునిలో వికసింప జేసుంది. సాధకుడపుడు విశ్వాత్మను, విశ్వలీలను తెలుసుకొన గలడు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: కృష్ణ విదియ 23:17:19

వరకు తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 28:31:43

వరకు తదుపరి హస్త

యోగం: ధృతి 15:27:34 వరకు

తదుపరి శూల

కరణం: తైతిల 09:56:17 వరకు

అశుభఘడియలు

వర్జ్యం: 09:32:48 - 11:21:12

దుర్ముహూర్తం: 12:52:36 - 13:39:35

మరియు 15:13:32 - 16:00:31

రాహు కాలం: 08:04:52 - 09:32:57

గుళిక కాలం: 13:57:12 - 15:25:17

యమ గండం: 11:01:02 - 12:29:07

శుభ సమయం

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 20:23:12 - 22:11:36

మరియు 24:48:15 - 26:36:27

సూర్యోదయం: 06:36:47

సూర్యాస్తమయం: 18:21:27

చంద్రోదయం: 19:53:01

చంద్రాస్తమయం: 07:40:05

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,

సర్వ సౌఖ్యం 28:31:43 వరకు తదుపరి

వజ్ర యోగం - ఫల ప్రాప్తి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



సిద్దేశ్వరయానం - 2 Siddeshwarayanam - 2

🌹 సిద్దేశ్వరయానం - 2 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ ద్వాపర యుగం 🏵️

Part-2

దేవలుడి ఆశ్రమం లో కొన్నాళ్ళున్నతర్వాత జైగీషవ్యుడు బయలుదేరి తన మిత్రుడు మహనీయుడు అయిన కపిలమహర్షిని చూడాలనిపించి హిమగిరిలోని వారి నివాసానికి వెళ్ళాడు. ఆ మహాత్ము డిప్పుడు క్రౌంచద్వీపంలో ఉన్నట్లు తెలిసి ఆకాశమార్గాన ఆ ప్రదేశానికి చేరుకొన్నాడు. అది అరుణగిరిప్రాంతంలో ఉంది. (క్రౌంచద్వీపమంటే అమెరికా. కొలరాడో పర్వతాలే అరుణగిరి). చుక్క తెగిపడినట్లుగా అచట దిగి ఒక అశ్వత్థవృక్షం క్రింద ఆసీనుడై ఉన్న ఆ మహాపురుషునకు సాష్టాంగ ప్రణామం చేశాడు. కపిలుడు సాదరంగా ఆహ్వానించాడు.

కపిల : మిత్రుడా ! కుశలమే గదా ?

జైగీ : మీ దయవల్ల కుశలమే. మిత్రుడా అని నన్ను మీరాదరించారు. కానీ నేను మీ శిష్యుడను. మీ భక్తుడను.

కపిల : ఇద్దరమూ కలసి చిన్నప్పుడు చదువుకొన్నాము కనుక నాకు సతీర్థ్యుడవు, ఆప్తుడవు.

జైగీ : ఏదో నా పూర్వపుణ్యవశమున లభించిన అదృష్టము. విష్ణ్వంశ సంభూతులైన మీరు అవతారపురుషులు. మీ కృపవల్ల మీకు సఖుడను కాగల భాగ్యము లభించింది. సిద్ధులలో మిమ్ము మించినవాడు లేడు.

కపిల : తపస్సు వలన నీవు కూడా కొన్ని సిద్ధశక్తులు సాధించావు. అతి మానుషమైన శక్తులు నీకూ కొన్ని ఉన్నవి కదా!

జైగీ : నిజమే, కాని అవి కొన్ని మాత్రమే. దివ్యశక్తులు కొంత లభించిన మాట సత్యమే కాని, దివ్యజ్ఞానము మీకున్నంత నాకులేదు.

కపిల : అది యథార్ధమే. దాని హేతువులు దానికున్నవి. నీకు గుర్తున్నది. కదా! చాలాకాలం క్రింద ఒక రాజ్యంలో మనముండగా ఆరాజు మన దర్శనానికి వచ్చాడు. నీవు నన్ను గురించి చెపుతూ, సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారమీ కపిలమహర్షి అని అన్నావు. ఆ రాజు నమ్మలేదు. దివ్యశక్తులు కొన్ని చూపించినా అతడికి విశ్వాసం కలుగలేదు. చివరకు నీ కోరికమీద నాస్వస్వరూపమైన నారాయణా కృతిని ధరించాను. నీవు గరుత్మంతుడవై నాకు వాహనమయినావు. అతడేదో కొంత నమ్మినట్లు కనిపించి వినయపూర్వకంగా నమస్కారాలు అర్పించాడు. ఆ ఆకారాలతోటే మన మాకాశమార్గంలో మన ఆశ్రమానికి వచ్చాము.

జైగీ : ఋషివల్లభా ! నాకు గుర్తున్నది. ఇదే కాదు రావణాసురుని మీరు శిక్షించిన సంఘటన కూడా మీ అవతార మహత్వానికి నిరూపణగా గంధర్వులు కీర్తిస్తున్నారు.

కపిల : అవసరమై ఆవిధంగా చేయవలసి వచ్చింది. నేను

హిమాలయాలలోని ఒక గుహలో నిద్రిస్తున్నాను. బలవంతుడైన రావణాసురుడు, ఎటో జైత్రయాత్ర వెడుతూ ఈ గుహలో ఏముందో చూదామని లోపలికి వచ్చాడు. లోపల శయనించి ఉన్న నన్ను చూచి ఎవరక్కడ అని పెద్దగా అరిచాడు. వాడి అరుపుకు ఎవరైనా నిద్రలేస్తారు. నేను లేవలేదు. వాడు ఆగ్రహించి నా మీద దెబ్బ వేయబోయినాడు. క్షణంలో నేను లేచి వానికొక ముష్టిఘాతం ఇచ్చాను. ఆ దెబ్బకు కళ్లు తిరిగి క్రిందపడ్డాడు. తమాయించు కొని లేచి దిగ్భ్రాంతి చెంది నన్ను చూచి ఇలా అన్నాడు. "అయ్యా ! నీ వెవరో నాకు అర్థం కావటం లేదు. ఒక్క దెబ్బతో నన్నిలా పడగొట్టినవాడు ఇంత వర కెవ్వరూ లేరు. నేను బ్రహ్మవరం వల్ల అజేయుడను. నేను రుద్రుని చూచాను. ఇంద్రుని ఎరుగుదును. యముని, అగ్నిని, తెలిసినవాడను. వా రెవ్వరికీ ఇంతటి పరాక్రమము, రౌద్రము లేవు. నీ వెవ్వరో తెలియచేయవలసినది" అనగా నేను వానితో "మూర్ఖుడా! అహంకారముతో బలముతో విర్రవీగుతూ లోకాలను బాధిస్తున్నావు. బ్రహ్మ ఇచ్చిన వరము నందు మర్యాదనుంచి నిన్నింతకాలము ఉపేక్షించాను. త్వరలో మానవునిగా అవతరించి నిన్ను సంహరిస్తాను. నేనెవరైతే నేమి ? బ్రహ్మరుద్రాదుల కతీతుడైన సర్వాత్మకుడను, జగన్నాథుడను నేను. వెళ్ళు" అన్నాను. వాడు తలవంచుకొని వెళ్ళిపోయినాడు.

జైగీ : మహాత్మా ! ఈ సంఘటన నేను విన్నాను. ఇది ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ కదా ? అప్పుడు నే నెక్కడ ఉన్నాను.

( సశేషం )

🌹🌹🌹🌹🌹




సిద్దేశ్వరయానం - 1 Siddeshwarayanam - 1

🌹 సిద్దేశ్వరయానం - 1 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🌹సిద్దేశ్వరయానం 🌹

🏵 ద్వాపర యుగం 🏵

Part-1

హిమాలయ పర్వతాలలో కర్దమ ప్రజాపతి ఆశ్రమం ఉంది. ఆయన కుమారుడు కపిలుడు. విష్ణువు యొక్క అంశవల్ల పుట్టటం దివ్యస్ఫురణ ఉండడం వల్ల అతడు సహజంగా ఏ సాధన లేకుండానే సిద్ధుడైనాడు. చిన్నప్పుడు పాఠశాలలో ఆయనతో పాటు జైగీషవ్యుడనే ఋషి కుమారుడు కూడా తోటి విద్యార్థి. ఇద్దరూ చాలా ఆప్తులుగా ఉండేవారు. కొన్ని సంవత్సరాలు వేదాది విద్యలు పూర్తి అయిన తర్వాత జైగీషవ్యునికి తపస్సు చేసి దివ్యశక్తులు సాధించాలన్న కోరిక కలిగింది. మిత్రుడైన కపిలుని సలహాతో కైలాసపర్వత ప్రాంతంలోని సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు కఠోరనియమాలతో కైలాసనాథుని గూర్చి తపస్సు చేశాడు. మహేశ్వరునకు కరుణ కలిగింది. సాక్షాత్కరించాడు. అయితే ఆయన నీలలోహితుడై వజ్రధరుడై దిగంబరుడై భీషణ సుందరమూర్తితో ఉన్నాడు. జైగీషవ్యునకు ఆశ్చర్యం కలిగింది. హరుడు చిరునవ్వుతో అన్నాడు "ఓయీ! నీ ఆశ్చర్యం చూస్తున్నాను. నీవు తపస్సు చేసిన యీ చోటు డాకినీ శ్మశానం. నీవు రుద్రభూమిలో చేసిన యీ సాధన స్థల ప్రభావం వల్ల ఇక్కడి సిద్ధయోగుల కరుణవల్ల శీఘ్రఫలప్రదమైంది. ఇక్కడ నేను వజ్రకాళీవల్లభుడనై విహరిస్తుంటాను. మహాభైరవుడనై నీకు తీవ్రశక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ అనంతకాలంలో నీవు నా ప్రతినిధిగా నిర్వర్తించవలసిన పాత్ర ఉంది. నీ మిత్రుడైన కపిలుడు విష్ణుదేవుని అంశావతారము. సమస్త సిద్ధులు అతని వశంలో ఉంటవి. ఆ మహాపురుషుని మైత్రి నీకు శ్రేయస్కరము. ఇక్కడ నుండి నీవు కాశీమహాక్షేత్రానికి వెళ్ళు. అక్కడి గుహలో మరికొంత కాలం ధ్యానదీక్షలలో ఉండు. వారణాసీ వల్లభుడైన విశ్వనాధుడు, ఆ దివ్యక్షేత్ర రక్షకుడైన కాలభైరవుడు నిన్ను అనుగ్రహిస్తారు. కాలమునకు అధిపతియైన ఆ భైరవుని కృపవల్ల అఖండకాలములో నీ పాత్రను సమర్థతతో నిర్వర్తించగలుగుతావు" అని వరములిచ్చి అదృశ్యుడైనాడు.

ఆ స్వామి ఆజ్ఞప్రకారం కాశీలో గుహావాసియై అహోరాత్రములు భేదం లేకుండా చిరకాలం ధ్యానం చేసి ప్రమథగణంలో స్థానం పొందగలిగాడు. ఒక రోజు దేవల మహర్షి గొప్ప తపస్సంపన్నుడని విని అతని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి శాంతవాతావరణం ఆయనకు వచ్చింది. ఆ స్థలంలో కొంతకాలం ఉందామనిపించింది. ఆయన ఆసక్తిని చూచి దేవలుడు "ఆర్యా! మీరు మా ఆశ్రమంలో ఎంతకాలమైనా ఉండవచ్చు. తపస్సు చేసుకోవచ్చు. కావలసిన సౌకర్యాలన్నీ చేస్తాను. మీరు కోరిన సిద్ధి లభించిన దాకా మీ యిష్టదేవతా సాధనచేయండి" అన్నాడు. అతనికి జైగీషవ్యుని మహత్వాన్ని గురించి తెలియదు. సామాన్యుడైన మునిమాత్రునిగాను, ఇంకా సాధనదశలో ఉండి దేవతానుగ్రహం కోసం కృషిచేస్తున్న తపోభావుకునిగాను భావించాడు. జైగీషవ్యుడు కూడా దేవలుని అపరిపక్వతను గమనించి, ఏమీ తెలియని సామాన్యునిగా ఆ ఆశ్రమంలో నిత్యము జపధ్యానములు చేస్తూ గడుపుతున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత తన తపశ్శక్తిని, మహత్తులను జైగీషవ్యునకు చూపించాలన్న కుతూహలము, చాపల్యము దేవలునకు కలిగినవి. కలిగి ఇలాఅన్నాడు

"జైగీషవ్యా ! ఈ రోజు నాకు కొంచెం పని ఉండి ఆకాశమార్గంలో దివ్యలోకాలకు వెళ్ళి వస్తాను. నీకేయిబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను. నీకింకా అటువంటి శక్తులురాలేదు గదా! ఎప్పటికైనా రావచ్చు. శ్రద్ధగా సాధనచేస్తూ ఉండు" అని చెప్పి ఖేచరుడై కొన్ని వందల యోజనముల దూరంలో ఉన్న సముద్రం దగ్గరకు వెళ్ళి స్నానానికి దిగాడు. తీరా చూస్తే ఒడ్డుననే ధ్యానం చేస్తూ కండ్లు మూసుకొని ఉన్న జైగీషవ్యుడు కనిపించాడు. దిగ్భ్రాంతి కలిగింది. అక్కడి నుండి గగన పథంలో ప్రయాణించి సిద్ధలోకానికి వెళ్ళాడు. అక్కడ సిద్ధులంతా జైగీషవ్యుని పూజిస్తున్నారు. కొంత కనువిప్పు కలిగింది. “ఈయన సామాన్యుడనుకున్నాను. మహనీయులైన సిద్ధులచే పూజలందు కొంటున్నాడు. అయినా ఇంకా పైలోకాలకు వెళ్తాను. అక్కడకు కూడా చేరుకోగల శక్తి ఉన్నదా లేదా చూస్తాను" అని అగ్నిలోకము, సోమలోకము, వసులోకము, రుద్రలోకము, బృహస్పతిలోకము మొదలైన ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. ఆశ్చర్యంగా ప్రతిచోట జైగీషవ్యుడు పూజించబడుతూ కనిపించాడు. చివరకు తపోలోకానికి వెళ్ళినా అంతే. జైగీషవ్యుని దగ్గరకు వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఆయన ఇంకా ఊర్థ్వలోకానికి ఎగిరివెళ్ళిపోయినాడు. అక్కడ తపోనిధులను దేవలుడు జైగీషవ్యుని గూర్చి ప్రశ్నించాడు. వారు "ఆయన యోగీశ్వరుడని, అసమాన అద్భుతశక్తి సమన్వితుడని ప్రస్తుతం ఇక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళాడని - నీవింకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని అక్కడకు వెళ్ళలేవని - అమహాపురుషునిలో లక్షోవంతు శక్తికూడ నీకు లేదని" తెలియజేశారు.

అప్పుడు దేవలుడు ఆ లోకమునుండి క్రిందికి దిగి తన ఆశ్రమానికి వస్తే అక్కడ జైగీషవ్యుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. మహర్షి ఆ మహానుభావుని కాళ్ళమీదపడి ఆయన అనుగ్రహంతో అనేక తత్వవిద్యారహస్యాలను తెలుసుకొన్నాడు.

( సశేషం )


🌹 26, FEBRUARY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 26, FEBRUARY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 26, FEBRUARY 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 313 / Kapila Gita - 313 🌹 
🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 44 / 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 44 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 906 / Vishnu Sahasranama Contemplation - 906 🌹
🌻906. అరౌద్రః, अरौद्रः, Araudraḥ🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 217 / DAILY WISDOM - 217 🌹
🌻 4. లక్ష్యం లేకుండా కదలిక లేదు / 🌻 4. There is no Movement Without a Purpose 🌻 🌻
5) 🌹. శివ సూత్రములు - 220 / Siva Sutras - 220 🌹
🌻 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 2 / 3-30. svaśakti pracayo'sya viśvam - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రాధ్యాయ స్తుతిః - 03 🍀*

*03. ఇషుః శివతమా యా తే తయా మృడాయ రుద్ర మామ్ |*
*శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశ్వచేతనా వికాసం : అధిమనో భూమిక యందలి శక్తియే ఒక్కొక్కప్పుడు ప్రత్యక్షంగానూ, ఒక్కొక్కప్పుడు పరోక్షంగానూ విభాగకల్పనా ప్రవృత్తి నుండి మనస్సునకు విమోచనం కల్పించి, విశ్వచేతనను సాధకునిలో వికసింప జేసుంది. సాధకుడపుడు విశ్వాత్మను, విశ్వలీలను తెలుసుకొన గలడు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: కృష్ణ విదియ 23:17:19
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 28:31:43
వరకు తదుపరి హస్త
యోగం: ధృతి 15:27:34 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 09:56:17 వరకు
అశుభఘడియలు
వర్జ్యం: 09:32:48 - 11:21:12
దుర్ముహూర్తం: 12:52:36 - 13:39:35
మరియు 15:13:32 - 16:00:31
రాహు కాలం: 08:04:52 - 09:32:57
గుళిక కాలం: 13:57:12 - 15:25:17
యమ గండం: 11:01:02 - 12:29:07
శుభ సమయం
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 20:23:12 - 22:11:36
మరియు 24:48:15 - 26:36:27
సూర్యోదయం: 06:36:47
సూర్యాస్తమయం: 18:21:27
చంద్రోదయం: 19:53:01
చంద్రాస్తమయం: 07:40:05
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,
సర్వ సౌఖ్యం 28:31:43 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 313 / Kapila Gita - 313 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 44 🌴*

*44. జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయః|*
*తన్నిరోధోఽస్య మరణ మావిర్భావస్తు సంభవః॥*

*తాత్పర్యము : జీవుని ఉపాధిరూపమైన లింగశరీరము మోక్షము లభించనంత వరకు అతని తోడనే యుండును. దేహము, ఇంద్రియములు, మనస్సులతో గూడిన కార్యరూపమగు స్థూలశరీరము ఈ జీవునకు భోగానుభవములకు ఆధారము. ఈ స్థూల, సూక్ష్మదేహములు పరస్పరము సంఘటితము గాకుండుటయే మృత్యువు అనబడును. ఈ స్థూల, సూక్ష్మదేహములు రెండును ఒకటిగా ప్రకటితమగుటనే జన్మ అని యందురు.*

*వ్యాఖ్య : ప్రాచీన కాలం నుండి, జీవుడు వివిధ జీవజాతులలో మరియు వివిధ గ్రహాలలో దాదాపు శాశ్వతంగా ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రక్రియ భగవద్గీతలో వివరించబడింది. బ్రహ్మాయాన్‌ సర్వ భూతాని యంత్రరూఢాని మాయయా : ( భగవద్గీత 18-61 ) మాయ యొక్క బంధనముతో, ప్రతి ఒక్కరూ భౌతిక శక్తి అందించే శరీర వాహనంపై విశ్వమంతా తిరుగుతున్నారు. భౌతిక జీవితం అనేది చర్యలు మరియు ప్రతిచర్యల శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది చర్యలు మరియు ప్రతిచర్యల యొక్క సుదీర్ఘ చలనచిత్రం, మరియు అటువంటి ప్రతిచర్య ప్రదర్శనలో ఒక జీవితకాలం కేవలం క్షణికం మాత్రమే. ఒక బిడ్డ జన్మించినప్పుడు, అతని నిర్దిష్ట రకమైన శరీరం మరొక రకమైన కార్యకలాపాలకు నాంది అని అర్థం చేసుకోవాలి మరియు ఒక వృద్ధుడు చనిపోయాక, ఒక ప్రతిచర్యాత్మక కార్యకలాపాల గుంపు ముగిసిపోయిందని అర్థం చేసుకోవాలి.*

*ఒక నిర్దిష్ట రకమైన కార్యాచరణ కోసం జీవికి నిర్దిష్ట శరీరం ఇవ్వబడిందని స్పష్టమవుతుంది. గుర్తించడం సాధ్యం కాని సమయం నుండి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. వైష్ణవ కవులు ఇలా అంటారు, కాబట్టి, అనాది కర్మఫలే, అంటే ఒకరి కార్యకలాపాల యొక్క ఈ చర్యలు మరియు ప్రతిచర్యలు గుర్తించబడవు, ఎందుకంటే అవి బ్రహ్మ జన్మ యొక్క చివరి సహస్రాబ్ది నుండి తదుపరి సహస్రాబ్ది వరకు కూడా కొనసాగవచ్చు. నారద ముని జీవితంలో మనం ఈ ఉదాహరణ చూసాం. ఒక సహస్రాబ్దిలో దాసి కొడుకుగా ఉండి, మరుసటి సహస్రాబ్దిలో గొప్ప జ్ఞాని అయ్యాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 313 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 44 🌴*

*44. jīvo hy asyānugo deho bhūtendriya-mano-mayaḥ*
*tan-nirodho 'sya maraṇam āvirbhāvas tu sambhavaḥ*

*MEANING : In this way the living entity gets a suitable body with a material mind and senses, according to his fruitive activities. When the reaction of his particular activity comes to an end, that end is called death, and when a particular type of reaction begins, that beginning is called birth.*

*PURPORT : From time immemorial, the living entity travels in the different species of life and the different planets, almost perpetually. This process is explained in Bhagavad-gītā. Bhrāmayan sarva-bhūtāni yantrārūḍhāni māyayā: (BG 18.61) under the spell of māyā, everyone is wandering throughout the universe on the carriage of the body offered by the material energy. Materialistic life involves a series of actions and reactions. It is a long film spool of actions and reactions, and one life-span is just a flash in such a reactionary show. When a child is born, it is to be understood that his particular type of body is the beginning of another set of activities, and when an old man dies, it is to be understood that one set of reactionary activities is finished.*

*It is clear that a particular body is given to the living entity for a particular type of activity. This process is going on perpetually, from a time which is impossible to trace out. Vaiṣṇava poets say, therefore, anādi karama-phale, which means that these actions and reactions of one's activity cannot be traced, for they may even continue from the last millennium of Brahmā's birth to the next millennium. We have seen the example in the life of Nārada Muni. In one millennium he was the son of a maidservant, and in the next millennium he became a great sage.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 906 / Vishnu Sahasranama Contemplation - 906🌹*

*🌻906. అరౌద్రః, अरौद्रः, Araudraḥ🌻*

*ఓం అరౌద్రాయ నమః | ॐ अरौद्राय नमः | OM Araudrāya namaḥ*

*కర్మ రౌద్రమ్ రాగశ్చ రౌద్రః కోపశ్చ రౌద్రః యస్య రౌద్రత్రయం నాస్తి* *అవాప్తసర్వకామత్వేన రాగద్వేషాదేరభావాత్ అరౌద్రః*

*రౌద్రము లేదా ఉగ్రమగు కర్మాచరణము కాని, 'ఇవి నాకు సుఖము కలిగించునవి కావున నేను పొందవలయును' అను తలంపు అగు రౌద్రపూరితమగు రాగము కాని, రౌద్రమగు కోపము - ఈ మూడు రౌద్ర త్రయమును ఎవనియందు లేవో అట్టివాడు భగవానుడు శ్రీ విష్ణువు. అన్ని కోరికల ఫలములను పొందియున్నవాడగు అవాప్త సర్వకాముడు కావున అతని యందు రాగము, ద్వేషము, కోపము మొదలగునవి ఉండుటకు అవకాశము లేదు. అవి రౌద్రములుగా ఉండు అవకాశము మొదలే లేదు.*

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 906 🌹*

*🌻906. Araudraḥ 🌻*

*OM Araudrāya namaḥ*

कर्म रौद्रम् रागश्च रौद्रः कोपश्च रौद्रः यस्य रौद्रत्रयं नास्ति अवाप्तसर्वकामत्वेन रागद्वेषादेरभावात् अरौद्रः / 

Karma raudram rāgaśca raudraḥ kopaśca raudraḥ yasya raudratrayaṃ nāsti avāptasarvakāmatvena rāgadveṣāderabhāvāt araudraḥ 

*Action is wild, attachment is passionate and anger is violent. He in whom these three kinds of fierceness do not exist by reason of His being of all fulfilled desires and as He is not moved by attachment, aversion etc., He is Araudraḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥
Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 217 / DAILY WISDOM - 217 🌹*
*🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 4. లక్ష్యం లేకుండా కదలిక లేదు 🌻*

*మనం తెలుసుకోవాలనే విషయం వస్తువుల వాస్తవికత; అవాస్తవాలు మనల్ని ఆకర్షించవు. మన గ్రహణశక్తిని తప్పించుకునేది, తరచూ మార్పు చెందేది వాస్తవంగా పరిగణించబడదు ఎందుకంటే అది నిరంతరం వేరొకదానిలోకి వెళుతుంది. విషయాలు మారుతున్నాయని మనం చెప్పినప్పుడు, వాస్తవానికి ఒక పరిస్థితి వేరొక పరిస్థితుల్లోకి వెళుతుందని అర్థం; ఒక పరిస్థితి మరొక పరిస్థితికి దారి తీస్తుంది. ఇది అస్సలు ఎందుకు ఉండాలి? విషయాలు తమను తాము మార్చుకోవడం మరియు రూపాంతరం చెందవలసిన అవసరం ఎక్కడ ఉంది? ప్రతిదానికీ దాని స్వంత ఉనికిపై అసంతృప్తి కూడా ఉంది. మనల్ని మనం మరొకటిగా మార్చుకోవాలను కుంటున్నాము. విషయాలు బాహ్యంగా మాత్రమే మారుతున్నాయని కాదు; మనం అంతర్గతంగా మారుతున్నాము. శారీరక మరియు ప్రాకృతిక మార్పులతో పాటు మానసిక మార్పు కూడా ఉంది.*

*కాబట్టి, విషయాల యొక్క క్షణికాత - ప్రపంచంలోని ప్రతిదానిలో వచ్చే ఈ మార్పు, మార్పును గ్రహిస్తామనుకునే మనతో సహా-మనం ప్రస్తుత సమయంలో అందుబాటులో లేని దాని వైపు కదులుతున్నట్లు కనిపిస్తున్న వాస్తవాన్ని సూచిస్తుంది. కదలిక ఎల్లప్పుడూ ఏదో ఒక దిశలో ఉంటుంది మరియు లక్ష్యం లేకుండా కదలిక ఉండదు. కాబట్టి ప్రకృతి యొక్క ఈ కదలికల్లో, మానవ సమాజం యొక్క చారిత్రక, మరియు సామాజిక కదలికల్లో కూడా ఒక నిర్దుష్టమైన ప్రయోజనం ఉండాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 217 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 4. There is no Movement Without a Purpose 🌻*

*The reality of things is what we are after; unrealities do not attract us. That which perpetually changes and escapes the grasp of our comprehension cannot be considered as real because of the fact of its passing constantly into something else. When we say that things are changing, we actually mean that one condition is passing into something else; one situation gives way to another situation. Why should this be at all? Where is the necessity for things to change and transform themselves? There is also a dissatisfaction with everything in its own self. We would like to transform ourselves into something else. It is not that things are changing only outwardly; we are changing inwardly. There is psychological change, together with physical and natural change.*

*So, the transitoriness of things—the changeful character of everything in the world, including our own selves as perceivers of change—suggests the fact that we seem to be moving towards something which is not available at the present moment. Movement is always in some direction, and there is no movement without a purpose. So there must be a purpose in the movement of nature, in even the historical transformations that take place in human society and in the world as a whole.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 220 / Siva Sutras - 220 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 2 🌻*

*🌴. విశ్వం అనేది అతని స్వంత శక్తి యొక్క ప్రవాహం లేదా విస్తరణ. 🌴*

*అత్యున్నత చైతన్యం తనంతట తానుగా పని చేయదని, శక్తికి కావలసిన శక్తిని ఇవ్వడం ద్వారా, తన స్వతంత్ర స్వయం ప్రతిపత్తి శక్తి ద్వారా పనిచేస్తుందని కూడా అతనికి తెలుసు. ఈ విశ్వంలో ఉన్నదంతా శివుని ప్రతిబింబమే తప్ప మరొకటి కాదని కూడా ఆయనకు తెలుసు. శివుడు లేకుండా ప్రకాశం సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన మాత్రమే ప్రకాశానికి మూలం. శక్తి అనేది శివుడు పనిచేసే సాధనం. యోగికి కూడా తెలుసు, అతను శివుని యొక్క అత్యున్నత ప్రభావం అయిన శక్తి యొక్క సంభావ్యతను గ్రహించగలిగితే తప్ప, అతను శివుని సాక్షాత్కార స్థితికి చేరడానికి ముందుకు సాగలేడు అని.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 220 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-30. svaśakti pracayo'sya viśvam - 2 🌻*

*🌴. The universe is the outflow or expansion of his own shaktis. 🌴*

*He also knows that the Ultimate Reality does not act on His own, but acts through His independent Power of Autonomy given to Śakti by means of power of attorney. He also knows that whatever exists in this universe is nothing but the reflection of Śiva. Without Śiva, illumination is not possible, as He alone is the source of illumination. Śakti is the tool through which Śiva acts. The yogi also knows that unless he is able to realise the potentiality of Śakti, who is nothing but the Supreme effectuality of Śiva, he cannot proceed further to realise Śiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj