1) 🌹 08, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 323 / Bhagavad-Gita -323 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 13 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 170 / Agni Maha Purana - 170 🌹 🌻 చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 2 / Characteristics of images of different forms of goddesses - 2🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 035 / DAILY WISDOM - 035 🌹 🌻 4. మనలోని జీవితం అంతరమూ, బాహ్యమూ రెండూ కాదు / 4. Life in Itself is Neither Inward nor Outward🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 300 🌹
6) 🌹. శివ సూత్రములు - 37 / Siva Sutras - 37 🌹
🌻 12. విస్మయో యోగ భూమికాః - 2 / 12. Vismayo yogabhūmikāḥ- 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 08, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 9 🍀*
9. వేదాః పురాణాని మహేశ్వరాదికాః
శాస్త్రాణి యోగీశ్వరదేవమానవాః |
నాగాసురా బ్రహ్మగణాశ్చ జంతవో
ఢుంఢంతి వందే త్వథ ఢుంఢిరాజకమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనశ్చైతన్యం - చైతన్యరూపమైన పరతత్త్వం తన శక్తి నుండి తాను వేరై దాని కార్యమును తిలకిస్తూ ప్రకృతి సాక్షియగు పురుషుడుగా నుండగలదు. అట్లే మనశ్చైతన్యం కూడా తన శక్తి నుండి తాను వేరై దాని కార్యములను... అనగా యోచనలు, భావనలు మున్నగు వాటిని సాక్షిగా తిలకిస్తూ ఉండగలదు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ తదియ 30:24:25 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 20:15:44
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: అతిగంధ్ 16:30:17 వరకు
తదుపరి సుకర్మ
కరణం: వణిజ 17:26:24 వరకు
వర్జ్యం: 02:36:20 - 04:22:12
మరియు 28:06:54 - 29:51:46
దుర్ముహూర్తం: 12:07:17 - 12:53:11
రాహు కాలం: 12:30:14 - 13:56:19
గుళిక కాలం: 11:04:09 - 12:30:14
యమ గండం: 08:11:58 - 09:38:03
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 13:11:32 - 14:57:24
సూర్యోదయం: 06:45:52
సూర్యాస్తమయం: 18:14:36
చంద్రోదయం: 20:26:20
చంద్రాస్తమయం: 08:26:31
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ
ఫలం 20:15:44 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 323 / Bhagavad-Gita - 323 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 13 🌴*
*13. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |*
*య: ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ||*
🌷. తాత్పర్యం :
*ఈ యోగవిధానము నందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు.*
🌷. భాష్యము :
ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణభగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకారశభ్ధ రూపమే ఓంకారము. కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరేకృష్ణ మాహామంత్రమునందును ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలియుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడినది.
కనుక మనుజడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యని కీర్తనము, జపము చేయచు దేహత్యాగము చేసినచో తన భక్తిలక్షణముల ననుసరించి ఏదియో ఒక ఆధ్యాత్మికలోకమును నిశ్చయముగా చేరగలడు. అనగా కృష్ణభక్తులు కృష్ణలోకమైన గోలోకబృందావనమును చేరుదురు. సాకారవాదులైన భక్తులకు ఆధ్యాత్మికజగమున ఇంకను వైకుంఠలోకనామమున తెలియబడు అసంఖ్యాక లోకములు లభ్యమై యున్నవి. కాని నిరాకారవాదులు మాత్రము అంత్యమున బ్రహ్మజ్యోతి యందు లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 323 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 13 🌴*
*13 . oṁ ity ekākṣaraṁ brahma vyāharan mām anusmaran*
*yaḥ prayāti tyajan dehaṁ sa yāti paramāṁ gatim*
🌷 Translation :
*After being situated in this yoga practice and vibrating the sacred syllable oṁ, the supreme combination of letters, if one thinks of the Supreme Personality of Godhead and quits his body, he will certainly reach the spiritual planets.*
🌹 Purport :
It is clearly stated here that oṁ, Brahman and Lord Kṛṣṇa are not different.
The impersonal sound of Kṛṣṇa is oṁ, but the sound Hare Kṛṣṇa contains oṁ. The chanting of the Hare Kṛṣṇa mantra is clearly recommended for this age.
So if one quits his body at the end of life chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, he certainly reaches one of the spiritual planets, according to the mode of his practice.
The devotees of Kṛṣṇa enter the Kṛṣṇa planet, Goloka Vṛndāvana. For the personalists there are also innumerable other planets, known as Vaikuṇṭha planets, in the spiritual sky, whereas the impersonalists remain in the brahma-jyotir.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 170 / Agni Maha Purana - 170 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 52*
*🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 2 🌻*
తూర్పుదిక్కు నుండి అగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్క దానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తము చేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర 'సమః' చేర్చవలెను.
ఉదా. ''ఓం హ్రాం భైరవాయనమః - ప్రాచ్యామ్, ఓం హ్రీం భైరవాయనమః- ఐశాన్యామ్; ఓం హ్రూం భైరవాయనమః- ఉదీచ్యామ్; ఓం హ్రేం భైరవాయ నమః - వాయవ్యే; ఓం హ్రైం భైరవాయ నమః-ప్రతిచ్యామ్ ఓం హ్రోం భైరవాయనమః -నైరృత్యామ్; ఓం హ్రౌం బైరవాయ నమః అవాచ్యామ్; ఓం హః అగ్నేయ్యామ్''
ఈ విధముగ మంత్రోచ్చారణ చేయుచు ఆయా దిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ అంగముల పూజ చేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. ''భైరవుడు అగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుకతోడను, నాద-బిందు, చంద్రులతోడను, మాతృకాధి పత్యంగము తోడను ప్రకాశించుచున్నాడు. (అట్టి బైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు. మాతృకామండల మధ్యమున నుండును. నాలుగు హస్తములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తము నందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితా దేవి కమలముపై కూర్చుండను. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి యుండును.
స్కందుని అనుసరించి యుండు మాతృకా గణము చేతులలో దర్పణము. శలాక ఉండును. చండికకు పది భుజములుండును. కుడి చేతులలో బాణ - ఖడ్గ - శూల - చక్ర, శక్తులను ధరించి యుండును. వానుహస్తములలో నాగపాశ - చర్మ - అంశుశ - కుఠార - ధనస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడి యుండును.
అగ్ని మహా పురాణమునందు చతుఃషష్టి యోగిన్యాది లక్షణమును ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 170 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 52
*🌻Characteristics of images of different forms of goddesses - 2 🌻*
12. One has to worship him being endowed with the letters of the alphabet upto the letter ‘ra’ and with (his mantra) having six constituents and the eight long vowel mantras.
13. (He is also to be contemplated upon) as established in the wicks of the flame in the house as endowed with golden ornaments and the nāda, bindu and indu[2] and making the body of the divine mother and the lord radiant.
14. Vīrabhadra (attendant of Śiva) (is represented) as having four faces, seated on a bull in front of the mother (goddesses). (Goddess) Gauri (consort of Śiva) (is represented) as having two arms and three eyes as endowed with a spear and mirror.
15. (Goddess) Lalitā (a form of Durgā) (should be represented) as having tour arms (holding) a spear, a small pitcher, (and another) pitcher (in the hands) and showing boonconferring hands. (She should) be seated on the lotus. (She should also) be endowed with a mirror, a small stick for applying collyrium and Skanda and Gaṇa (Gaṇeśa).
16. (Goddess) Caṇḍikā may (be represented) as having ten hands having a sword, spear, disc (and) dart in the right (hand) and the magical noose, shield, pike, axe, and bow in the left (hand). (She must) be riding a lion with the buffalo (demon) having been slain with (her) spear in front of her.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 35 / DAILY WISDOM - 35 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 4. మనలోని జీవితం అంతరమూ, బాహ్యమూ రెండూ కాదు🌻*
*మన జీవితం, అది అంతరంలో అయినా లేదా బాహ్యమైనా, ఒక శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది ఘన పదార్థం కాదు. మన ఉనికి కదలని గట్టి రాయి లాంటిది కాదు. ఇది ఒక ప్రవాహం. ధోరణుల, కదలికల, సంస్థల యొక్క శ్రేణి. ఇది ఆచరణాత్మకంగా లోపలి మరియు బాహ్య దశలుగా విభజించబడింది. స్వతహాగా జీవితం అంతరమైనది లేదా బాహ్యమైనది కాదు. ఇది ప్రతిచోటా ఉంది. కానీ సౌలభ్యం కొరకు మనం గది లోపల ఉన్నామని చెప్పుకున్నట్లే, లోపల మరియు బయట అనే తేడాను చూపుతాము.*
*కానీ ఈ 'లోపల' అనే ఆలోచన చుట్టూ గోడ కారణంగా పుడుతుంది; గోడ ఉండకపోతే లోపల ఉన్నామని చెప్పుకోము. మనం భూమి యొక్క ఉపరితలంపై మాత్రమే ఉన్నాము, కానీ నాలుగు వైపులా గోడలు ఉన్నాయనే స్పృహ ఉన్నందున, లోపల అనే ఒక స్పృహ మరియు వెలుపలి అనే ఒక స్పృహ కూడా ఉన్నాయి. బయటి నుండి లోపలిని వేరుచేసే గోడ ఉంటే తప్ప, లోపల లేదా వెలుపల నిజంగా లేనట్లే, అంతర్గత జీవితం మరియు బాహ్య జీవితం వంటివి నిజంగా లేవు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 35 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 4. Life in Itself is Neither Inward nor Outward 🌻*
*Our life, whether it is inner or outer, consists of a series. It is not a solid substance. Our existence is not like a hard stone which is immovable and motionless. It is a flux, a series of tendencies, movements, enterprises, etc., which get practically bifurcated into the inward and the outward phases. Life in itself is neither inward nor outward. It is everywhere. But for convenience’s sake we make this distinction of being inside and outside, just as we say we are inside the room.*
*But this ‘inside’ idea arises on account of the wall around; if the wall were not to be there, we would not say that we are inside. We are just on the surface of the Earth, but because there is a consciousness of walls on the four sides, there is also a consciousness of an inside and conversely a consciousness of an outside. There is really no such thing as inner life and outer life, just as there is really no inside or outside, unless there is a wall which separates the inside from the outside.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 300 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు. 🍀*
*ఉత్సాహంగా వుండు. మత భావనతో వుండడానికి నా నిర్వచనమది. విషాదంగా వుండడమంటే తప్పు చేసిన వాడుగా వుండడం. ఉత్సాహంగా వుండడమంటే సన్యాసిగా వుండడమే. నువ్వు హృదయపూర్వకంగా నవ్వితే నీ జీవితం పవిత్రం కావడం మొదలవుతుంది.*
*హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. తల నించీ పాదం దాకా నవ్వు ప్రసరిస్తుంది. అది మరింత గాఢంగా నీ లోలోతుల్లో నీ అస్తిత్వ కేంద్రాన్ని తాకనీ. అప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావు. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 037 / Siva Sutras - 037 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 12. విస్మయో యోగభూమికాః - 2🌻*
*🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴*
*ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నప్పుడు, అతను తెలిసిన మూడు స్థాయి చైతన్యాలను అధిగమించి తదుపరి ఉన్నత స్థాయి చైతన్యం అయిన తుర్యా దశకు చేరుకోవాలి. అతను అత్యున్నత స్థాయి చైతన్యంలో మాత్రమే శివుడిని గ్రహించగలడు, అంటే అతని ఏకాగ్రత పూర్తిగా శివునిపై మరియు శివునిపై మాత్రమే కేంద్రీకరించబడాలి. మరేదైనా ఆలోచనలు అతని మనస్సులో ప్రవహిస్తే, అతను సంపూర్ణతను గ్రహించలేడు.*
*అతను గణనీయమైన పురోగతి సాధించినప్పుడు, అతను ఆనందించే ఆనంద స్థాయి కూడా బలంగా మారుతుంది. అతనిని శివుని వైపుకు లాగుతుంది. అతను ఆ ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభించినప్పుడు, అతను అత్యున్నత ఆనందం లేదా ఆశ్చర్యాలతో నిండిన ఆనందం యొక్క దశలో మునిగిపోతాడు. అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతను ఇంతకు ముందు అలాంటి ఆనందాన్ని అనుభవించలేదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 037 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 12. Vismayo yogabhūmikāḥ - 2 🌻*
*🌴. The stages of yoga are a wonder 🌴*
*When a person progresses spiritually, he has to make a beginning to transcend the three known level of consciousness to the next higher level of consciousness, the turya stage. He can realize Shiva only in the highest level of consciousness, which means that his concentration should be totally focused on Shiva and Shiva alone. If any other thoughts impregnate his mind, he will not be able to realize the Absolute.*
*When he makes significant progress, the level of bliss that he enjoys also becomes strong and pulls him further towards Shiva. When he begins to taste the bliss, he gets engrossed in the stage of supreme happiness or ānandā that is full of surprises. He is surprised because, he has not experienced that kind of ānandā earlier.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj