కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 19

Image may contain: one or more people and people standing
🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 19 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 7 🌻

ఈ ప్రేయోమార్గంలో జీవించే వారందరిలో కూడా వాళ్ళు దేహరూపానికి మానవులే గానీ బుద్ధియందు మిడతల వంటి వారు అనమాట. అట్టి మిడతల వంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞాన విచారణ అబ్బదు అని స్పష్టంగా చెప్తున్నాడు. 

నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని. 

అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖములపా లగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.

ఎక్కువమంది ఆకర్షించబడేది అంటే నూటికి 90 శాతం మంది ఈ ప్రేయోమార్గంలోనే వుంటారు.

 ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట, పౌత్రులను పొందుట, ప్రియమైనవారిని పొందుట, బంధువులను కలిగివుండుట, అందరికీ ఇష్టులుగా జీవించుట, ఆ ఇష్టము అనేటటువంటి ప్రియాప్రియములతో ఏ రకమైన వస్తుసంచయము “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదినః “ అనేటటుంటి పద్ధతిగా ధన కనక వస్తు వాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మచక్రమునందు తగులుకొని, కర్మబంధము చేత బాధించబడుతూ, అజ్ఞానబంధము చేత బాధించబడుతూ “నేనెవరు?” అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్యజీవనమునే జీవనముగా భావించి, అట్టి జీవనమును ఎప్పుడైతే నీవు పొందుతూ వున్నావో, ఆ జీవనము నీకు వృధా అయినటువంటి జీవనము. 

అటువంటి వృధా అయినటువంటి ఈ మానవ జన్మ తిరిగి పునః నువ్వు మానవ జన్మనే పొందుతావా అంటే సృష్టిధర్మములో అలాంటి అవకాశాలు చాలా తక్కువ వున్నాయి. 

కాబట్టి మానవుడవై పుట్టిన తరువాత మానవబుద్ధితో కాకుండా ఎనుబదినాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధిరూపమైనటువంటి జ్ఞానమును నీవు సముపార్జించి వున్నప్పటికీ ఆ యా జీవులయొక్క ప్రభావం నీలో బలంగా వుంది. కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం వస్తుంది. 

కస్సుబుస్సులాడుతూ వుంటారు. వాళ్లలో పాములకి సంబంధించినటువంటి వాసనాబలం మిగిలివుంటుందనమాట. కొంతమందిలో వ్యాఘ్రము వలే గాండ్రిస్తూ వుంటారు. పులులవలే గాండ్రిస్తూ వుంటారనమాట. 

వాళ్ళలో ఆ రకమైన వాసనాబలం మిగిలి వుంటుంది. కొంతమందిలో ఏనుగువలే ఘీంకరిస్తూ వుంటారు. ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మదం చాలా బలంగా వుంటుందనమాట. 

ఆ ధన మదం గానీ, విద్యామదం గానీ, రూపమదం గానీ, అష్టవిధమదములు ఏవైతే వున్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు, ప్రపంచమునే లెక్కచేయనటువంటి పద్ధతిగా మారతారనమాట. 

అటువంటివారు ప్రపంచ యుద్దాలకి కూడా కారణమైన సందర్భాలు వున్నాయనమాట. అలాంటివారందరిలో ఆ మదపుటేనుగు లక్షణం వుంటుందనమాట. 

వారిలో, ఆ మానవులై వున్నప్పటికీ కూడా, వారిలో ఆ అహంకారము, ఆ మదము అతితీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవజాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వుంటాయ్. మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవజన్మలో వున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 79

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 79 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 76:--telepathy 🌻

Ans :--
1) కుక్క, పిల్లి, ఆవు ఇలా కొన్ని పెంపుడు జంతువులు మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాల్ని పసిగట్టగలవు.

2) పసిపిల్లలు, పెంపుడు జంతువులు telepathy ద్వారా ప్రతి రోజు సంభాషించుకుంటాయి.

3) మానవజాతి సహజ ప్రవృత్తి లోకి మారాలి.
మానవజాతి, జంతుజాతి పరస్పర సహకారంతో చైతన్య పరిణామం చెందవలసి ఉంది.

4) వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్ని మన దేహం పసిగట్టగలుగుతుంది.మనం గమనిస్తే ఇది మన మైండ్ ద్వారా జరుగుతుంది అని గుర్తించవచ్చు. అలానే మానవుల ఆలోచనా తరంగాల్ని జంతువులు, వృక్షాలు ఇతర వస్తువులు ఫీలింగ్స్ ని కూడా మన మైండ్ పసిగట్టగలదు.

5) మన మైండ్ ఆలోచనా తరంగాల్నే కాదు ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలు కూడా పసిగట్టగలదు.

6) మన ఇంట్లో ఉన్న chair, table కూడా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనల్ని పసిగట్టగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 8

No photo description available.
🌹 Twelve Stanzas from the Book of Dzyan - 8 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴
 
🌻 STANZA II - The Knowledge of the Heart - 3 🌻

17. The darkness was overtaking those people who had trampled down their inner Light and so were useless to Life. 

These were the people of death whom evil was penetrating continuously — not only their thoughts, but also their breast, wherein he ruled on a soulless throne of stone. There was nothing for him to fear, for a stone could not strike a spark that would have burnt the darkness’ tenacious paws. 

O, how the darkness desired such hearts! One had to work very hard to get one’s own way, and the darkness spared no effort or means to this end, if only she could see herself ensconced on the throne which had previously belonged to Life.

18. Man was endeavouring to grow in grace and wisdom. He had already been able to distinguish the Light from the darkness. In him, these two principles were tightly interwoven, forming a single indivisible essence. 

Gloomy thoughts swept past, dictating strict orders and generating a combative atmosphere. Evil was amassing legions of venomous thoughts, capable of poisoning the whole Joy of Life with their sinister stench. 

Joy was the lampion oil which made the Flame of Love glow so brightly. The dark host of gloomy thoughts was successfully depriving the little fire of the nourishment it needed. 

The flame was gradually diminishing in size, and a light puff of air was all it would take to extinguish it forever. The world was being deprived of Joy, without which both Life and Love would be unthinkable.

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 14 / Sri Gajanan Maharaj Life History - 14

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 14  /  Sri Gajanan Maharaj Life History - 14 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 4 🌻

పూర్తిగా కోలుకున్నాక, శ్రీమహారాజు నివసించే మఠందగ్గర వందలాది భక్తులకు జానరావు అన్నసంతర్పణ చేసాడు. దేష్ ముఖేను కాపాడిన దృష్టాంతంతో శ్రీగజానన్ మహారాజుకు ఇబ్బందులు కలిగించాయి. వీటిని తొలగించుకోవడం కోసం శ్రీమహారాజు ప్రజలతో అసహజంగా, కఠినంగా అవవలసి వచ్చేది. 

శ్రీమహారాజు యొక్క ఈవిధమయిన ప్రవర్తనను ఆయన నిజమయిన భక్తులు భరించగలిగేవారు. నరసింహ భగవంతుని రూపానికి ప్రజలు భయభ్రాంతులు అయినా, ప్రహ్లాదుడు ఈయన బాహ్యరూపం వల్ల భయపడలేదు. ఆడపులి అంటే ప్రజలు భయపడతారు. కానీ పులిపిల్లలు ఆ ఆడపులితో ఆడుతూ ఉంటాయి. 

ఇదేవిధంగా శ్రీమహారాజు కఠినత్వానికి ఆయన నిజమయిన భక్తులు భయపడలేదు. ఇప్పుడు ఇంకొక కధ వినండి వాననీళ్ళు పడడంతోనే నేలకు సువాసన వస్తుంది. అదేవిధంగా గంధం చెక్కతో తాకగానే ఒక సాధారణ చెక్కకు కూడా సుగంధం వస్తుంది. ఇదిసహజం. 

కానీ అంతలోనే ఆసాధారణమయిన చెక్క తనేగంధపు చెక్కను అనుకోవడం వెర్రితనం. చెరకు మొక్కలతోపాటు చెత్త మొక్కలుకూడా పెరుగుతాయి. యోగులు, పిశాచకులు కూడా ఈభూమండలం మీద జన్మించారు. ఘనులలో వజ్రాలతోపాటు మామూలు గుళకరళ్ళుకూదా దొరుకుతాయి. 

ఇవిరెండూ ఒకేచోటదొరికినా వాటివాటి విలువవేరు. మామూలు గుళకరాయికి, వజ్రానికి ఉన్న వెలుగు ఎలావస్తుంది ? అందువల్ల ఈవజ్రాలను పట్టితీసి, గుళకరాళ్ళను కాళ్ళక్రింద పడేస్తారు. 

షేగాంలో శ్రీగజానన్ మహారాజు దగ్గర విఠోబాఘాటోల్ అనే ఒకకపటి సన్యాసి పైనచెప్పిన గుళకరాయి వంటివాడు. అవినీతి, దొంగప్రవృత్తులు కలవాడయినా గొప్పభక్తునిగా నటిస్తుండేవాడు. శ్రీగజానన్ భోజనానికి, పొగత్రాగడానికి మరియు ఇతర అవసరాలకు నాపైనే ఆధారపడతారు, నేను ఆయనకు కుడిభుజంవంటివాడిని అనిచెప్పుకునేవాడు. శివుడికి నంది ఎటువంటిదో నేను శ్రీగజాననకు అటువంటివాడను అని చెప్పుకుంటూ, అనేకమయిన వసతులు పొందేవాడు. 

విఠోబా ఏమిచేస్తున్నాడనే విషయం తనదైవజ్ఞానం వలన తెలుసుకున్న శ్రీగజానన్ ఈవిధంగా బుద్ధి చెప్పారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 14 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 4 🌻

After his full recovery, Deshmukh celebrated the blessings by feeding hundreds of people at the Math where Shri Gajanan Maharaj stayed. 

The incident of saving Deshmukh created problems for Shri Gajanan Maharaj and to avoid them, He had to become rather strict and indifferent to the people. 

His real devotees, however, could bear with that attitude of Shri Gajanan Maharaj . God Narsimha, by His very appearance, created terror in the minds of people, but Pralhad was not afraid of that outward look. 

Tigress is fearful to others, but not to her cubs playing in her lap. Likewise the real devotees were not afraid of the strictness showed by Shri Gajanan Maharaj . Now listen to another story. 

It is seen that the earth, when in contact with musk, gets its fragrance. Similarly by mere contact of sandal wood and ordinary wood also gets its fragrance. This is quite natural, but it will be absurd if the wood thinks itself to be sandalwood. 

Along with the Sugarcane also grows some useless bushes. Saints and Satan are both born on the same earth. Along with diamonds, ordinary pebbles too are found in the mines. 

Though found in one place they differ in value. An ordinary pebble cannot get the lustre of a diamond and will simply be trampled under our feet, while the diamond picked up. Vithoba Ghatol, like an above pebble, a hypocrite, was staying with Shri Gajanan Maharaj at Shegaon. 

He was dishonest and insincere, but showed off as being a great devotee of Shri Gajanan Maharaj . He used to call himself the Kalyan of Shri Gajanan Maharaj , and said that Shri Gajanan depended for everything, i.e. food, pipe and other comforts, on him. 

He was taking all sorts of advantages by his association with Shri Gajanan Maharaj and boasted himself to be a bull before Lord Shiva. 

By his divine vision, Shri Gajanan Maharaj knew what Vithoba was doing and so taught him a lesson by following incident.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 22 / The Siva-Gita - 22

Image may contain: 2 people
🌹. శివగీత  - 22  / The Siva-Gita - 22 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 6 🌻

ఇదం వ్రతం పశుపతం - వదిష్యామి సమాసతః ,
ప్రాత రేవతు సంకల్ప్య - నిధా యాగ్నిం స్వశా ఖయా .25

ఉషో షత శ్శుచి స్స్నాత - శ్శుక్లాం భర ధర స్స్వయ మ్,
శుక్ల యజ్ఞా పవీ తశ్చ - శుక్ల మాల్యా నులే పనః 26

జుహు యా ద్విర జో మన్త్రై: - ప్రాణా పానాది భిస్తతః,
అను వాకంత మేకాగ్ర - సమిదాజ్య చరూ న్ప్రుధక్ 27

ఇట్టి పాశు పత వ్రత విధానమును వివరింతును వినుమని చెప్పుచుండెను. 

ప్రాతః కాలమున నీ విధంబుగా సంకల్పించి ఆహారము తీసుకోకుండా
 స్నానం చేసి శుచియై పరిశుభ్ర వస్త్రములను దాల్చి స్వశా ఖోక్త ప్రకారంబుగా నర్పించి తెల్లని బ్రహ్మ సూత్రములు,శ్రీ గంధమును, 
పూలహారములను దాల్చి విరజా మంత్రంబులను బ్రాణా 
పానంబుల హోమం బాచరించి " యాతే అగ్నే .........రితి "

 అను మంత్రములతో అగ్నిని తన యందారో పించుకొని "భస్మా దాయాగ్ని " 
అను మంత్రముతో భస్మమును కురంగ ముద్రతో స్వీకరించి  తన శరీర మంతట త్రిపుండ్ర రేఖలుగా దరించ వలెను.

అట్లు భస్మమును ధరించు కొన్న వాడు మహా పాపముల నుండి విముక్తు డగును.  ఇందు ఏ మాత్రము సందేహము లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 22 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga  - 6 🌻

Agastya started narrating the sequences of the Pashutpata Vratam (Viraja Deeksha) to Rama as follows. 

In the early morning, one should become purified by taking bath, shouldn't eat anything, should wear clean clothes, should do Sankalpa (holy decision), should apply white holy Srigandham (sandal paste of bilva tree), should wear flower garlands, should utter the Viraja mantras by subduing the Prana, Apana kind of winds, should ignite fire by uttering "yaateange...riti" etc mantras, and then apply the holy ash in three horizontal lines format on all over the body by uttering "bhasmadaayagni..." etc. mantras. 

The one who applies ash in this manner on his body, he becomes freed of all his sins. There is no doubt in this.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

5-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 449 / Bhagavad-Gita - 449🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 237 / Sripada Srivallabha Charithamrutham - 237🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 139🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 56🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 24🌹
8) 🌹. శివగీత - 22 / The Shiva-Gita - 22🌹
9) 🌹. సౌందర్య లహరి - 64 / Soundarya Lahari - 64🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 189🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 65 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 61🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 76 🌹
15) 🌹 Seeds Of Consciousness - 141 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 79🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 25🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 8🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 19🌹
19) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 4 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 449 / Bhagavad-Gita - 449 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -05 🌴*

05. క్లేశో(ధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దు:ఖం దేహవద్భిరవాప్యతే ||

🌷. తాత్పర్యం : 
పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడును కష్టతరమే. 

🌷. భాష్యము : 
పరమపురుషుని అచింత్య, అవ్యక్త, నిరాకారతత్త్వమార్గము ననుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుచుండ, పూర్ణ కృష్ణభక్తిభావనలో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడుదురు. 

ఈ జ్ఞానయోగము, భక్తియోగము నడుమ గల భేదము ఇచ్చట చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు గొనివచ్చునదైనను జ్ఞానయోగవిధానము మిక్కిలి క్లేశకరము. 

కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవా మార్గమైనందున భక్తియోగము అత్యంత సులభమైనదే గాక జీవాత్మకు సహజధర్మమై యున్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై యున్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకముగా అవగాహన చేసికొనుట అతనికి అత్యంత కరినమైన విషయము. 

కనుక భక్తియోగియైనవాడు శ్రీకృష్ణుని శ్రీవిగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై యుండుటచే అందులకు కారణము. దానిని ఆ విధముగా అతడు అర్చనమునందు నియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధానము కాదు. 

అర్చనము సగుణము (గుణసహితము) మరియు నిర్గుణము(గుణరహితము) అను రెండు విధములుగా నుండునని వేదవాజ్మయము నుండి నిదర్శనము లభించుచున్నది. భగవానుని రూపము భౌతికగుణములతో రూపొందియుండుటచే మందిరమునందలి శ్రీవిగ్రహారాధానము సగుణమని తెలియబడును. 

భగవానుని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారువు లేదా తైలవర్ణపటములతో సూచింపబడినను అదెన్నడును నిజమునకు భౌతికము కాదు. అదియే దేవదేవుని పూర్ణస్వభావమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 449 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 04 🌴*

05. kleśo ’dhika-taras teṣām
avyaktāsakta-cetasām
avyaktā hi gatir duḥkhaṁ
dehavadbhir avāpyate

🌷 Translation : 
For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. To make progress in that discipline is always difficult for those who are embodied.

🌹 Purport :
The group of transcendentalists who follow the path of the inconceivable, unmanifested, impersonal feature of the Supreme Lord are called jñāna-yogīs, and persons who are in full Kṛṣṇa consciousness, engaged in devotional service to the Lord, are called bhakti-yogīs. 

Now, here the difference between jñāna-yoga and bhakti-yoga is definitely expressed. 

The process of jñāna-yoga, although ultimately bringing one to the same goal, is very troublesome, whereas the path of bhakti-yoga, the process of being in direct service to the Supreme Personality of Godhead, is easier and is natural for the embodied soul. 

The individual soul is embodied since time immemorial. It is very difficult for him to simply theoretically understand that he is not the body. 

Therefore, the bhakti-yogī accepts the Deity of Kṛṣṇa as worshipable because there is some bodily conception fixed in the mind, which can thus be applied. Of course, worship of the Supreme Personality of Godhead in His form within the temple is not idol worship. 

There is evidence in the Vedic literature that worship may be saguṇa or nirguṇa – of the Supreme possessing or not possessing attributes. 

Worship of the Deity in the temple is saguṇa worship, for the Lord is represented by material qualities. But the form of the Lord, though represented by material qualities such as stone, wood or oil paint, is not actually material. That is the absolute nature of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 237 / Sripada Srivallabha Charithamrutham - 237 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 45
*🌻. గురుసార్వభౌముల లీల 🌻*

మేము తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు, నాల్గు కుటుంబాలవారు మాతోపాటుగా కురువపురం రావడానికి నిశ్చయించుకున్నారు. 18 గుఱ్ఱపుబండ్లను సమకూర్చారు. ప్రయాణం చాలా రోజులు పడుతుంది అని తెలిసినా శ్రీపాదులను చూడబోతున్నాం అనే భావన ముందు ఇది పెద్ద విషయంలా వారికి తోచలేదు. 

18 గుఱ్ఱపు బండ్లు ఉన్నట్లుండి ఒక్కసారి నేలమీద కాక ఆకాశంలో పరిగెత్తుతున్నట్లు అనిపించింది. బండ్లు తోలేవాళ్ళతో సహా అందరికి మత్తు ఆవహించింది. మేము తెల్లవారుఝామున బయలుదేరితే మధ్యాహ్నానికల్లా ఒక గ్రామం దగ్గర బళ్ళు ఆగాయి. బండ్లు ఆగడం, మాకు మత్తు వదలడం ఒకేసారి జరిగాయి.

*🌻. పంచదేవ్‍పహాడ్‍లో గురువారం దర్బార్ 🌻*

మేము బండ్లు దిగి బాటసారులని అది ఏ ఊరు అని అడి గాము. వారది పంచదేవ్పహాడ్ అని, ఆ రోజు గురువారం కాబట్టి శ్రీపాదుల దర్బారుకి వెళ్ళుతున్నా మని, అక్కడ ఆ మహాప్రభువులు అందరి బాధలను నివా రించి, అందరికి కడుపు నిండుగా భోజనాలు పెడ్తారని చెప్పారు. 

ఇంత తక్కువ సమయంలో మేము అక్కడికి ఎలా చేరామో మాకు అర్థం కాలేదు. మాకు అది కలా? నిజమా? అన్న సందేహం శ్రీపాదులని చూసేంతవరకు దూరం కాలేదు. 

సుమతీదేవి శ్రీపాదులను కౌగిలించుకొని కన్నీరు పెట్టు కున్నారు. తల్లిని ఊరడిస్తూ శ్రీపాదులు," అమ్మా! అనసూయమాతతో సమానమైన సాధ్వివి, నిర్గుణ, నిరాకార పరతత్వాన్ని బిడ్డగా పొందిన భాగ్యశాలివి. నీవు కంటతడి పెడితే భూమిలో పంటలు పండుతాయా?” అంటూ తమ దివ్య హస్తాలతో ఆమె కన్నీరు తుడిచారు.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 237 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 26
*🌻 The Story of Sri Kanyaka Parameswari’s Birth 🌻*

We reached Kurungadda early in the morning for darshan of Sripada Srivallabha. Sri Dharma Gupta had a strong desire to know the things related to the origin of Kali Yugam from Sripada Srivallabha.  

On that day Sripada looked very pleased and with nectarine looks spreading His grace allowed us to touch His divine lotus feet. 

Sri Dharma Gupta prayed Sripada to tell us how Kali Yugam started and make us blessed. Sri Charana said, ‘My Dear! ‘kaalam’ (time) is paramatma’s opulent form (virat swaroopam). Sun is also called kaalaatmaka.  

The time taken for Sun, starting from  Dhanishta star, going round Shravana  star and coming back to Dhanishta, is called Brahma Kalpam.  

In Brahma Kalpam, one half is ‘shrishti kalpam’ (the time of creation) and the other half is ‘pralaya kalpam’ (the time of pralaya). 

It is like the experience of day and night for common people. In the ‘kaala’ related to pithru devathas, one  half is ‘shukla paksham’ and the other half is ‘krishna paksham’.  

For ‘samvatsara purusha’, 6 months is ‘uttarayanam’ and the other 6 months is ‘dakshinayanam’. Yogi will have darshan of this kala chakram (the cycle of time) in his body only. 

This secret vidya is called ‘Taaraka Raja Yoga Vidya’. People who do not know this will not understand ‘kala jnanam’. 

In Taraka Raja Yogam, the body is thought of as Brahmanda. All the ‘lokas’ (worlds) are in that. The site of thinking in our head is called Brahma lokam. There is Vishnu lokam in the umbilicus. 

There is Rudra lokam in our heart. In our sperm, pithrudevathas (Janyu devathas) will be there. These janyu devathas will transfer the fruit of karma done by previous generations to the coming generations.  

‘Time’ is very much essential for reaching these fruits of previous karmas in a sequential way.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻*

లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌ ఈ సాగరమే వాసుదేవుడు. ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము. 

దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు. 

జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు. 

నిజానికి లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి. 
కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు. 

కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు. కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు. 

అలాకాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు..
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 139 🌹*
*🌴 Dealing with Obstacles - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Occasions for Growth - 1 🌻*

The progress in evolution doesn’t happen automatically. We mostly learn by our own mistakes, and we thus try to realign our way of life and our attitudes. If we want to advance in life, inevitably also impediments arise. 

Wherever we experience in the outer an obstacle, a deception or a delay, this is a hint that something in the inner system has to be realigned. If we react in a disgruntled, irritated or depressed way, this shows our inability to accept situations.

When somebody says, “My living conditions aren’t good”, this means that the existing living conditions are seen as something bad. 

We regard something as good or as bad because of our impressions. The circumstances exist in our mind and not in our environment. 

What we perceive as outer obstacles are only our own definitions of obstacles. Where we see an obstacle, someone else achieves success. We can transform difficult situations from their quality of an obstacle to the quality of steps of progress. 

However, as long as we don’t know how to deal with the situation, it stands in our way of progress. Thus problems showing up in the outer provide an opportunity for inner growth.

The obstacles in life have a purpose. Every problem holds a present, which we can obtain with the right attitude and humility. Obstacles enable us to reflect more deeply, sometimes even at the cost of sleep.

 Without obstacles man seldom thinks, he falls into a routine and follows it like a sheep. Obstacles can awaken us and help to introspect, to retrospect and to look ahead. 

🌻 🌻 🌻 🌻 🌻
Sources : Master K.P. Kumar: Saturn / Jupiter / notes from seminars / Master E. Krishnamacharya: The Yoga of Patanjali.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 99

479. పాయసాన్న ప్రియా -
 పాయసాన్నములో ప్రీతి గలది.

480. త్వక్ స్థా - 
చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.

481. పశులోక భయంకరీ - 
పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.

482. అమృతాది మహాశక్తి సంవృతా - 
అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.

483. ఢాకినీశ్వరీ - 
ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.

🌻. శ్లోకం 100

484. అనాహతాబ్జ నిలయా - 
అనాహత పద్మములో వసించునది.

485. శ్యామభా - 
శ్యామల వర్ణములో వెలుగొందునది.

486. వదనద్వయా - 
రెండు వదనములు కలది.

487. దంష్ట్రోజ్వలా - 
కోరలతో ప్రకాశించునది.

488. అక్ష్మమాలాదిధరా - 
అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.

489. రుధిర సంస్థితా - 
రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 53 🌻*

479 ) Vadanaika samavidha -   
She who has one face

480 ) Payasanna priya -   
She who likes sweet rice (Payasam)

481 ) Twakstha -   
She who lives in the sensibility of the skin

482 ) Pasu loka Bhayamkari -   
She who creates fear for animal like men

483 ) Amruthathi maha sakthi samvrutha -   
She who is surrounded by Maha shakthis like Amrutha,Karshini, Indrani, Eesani, uma,Urdwa kesi

484 ) Dakineeswari -  
 She who is goddess of the south(denoting death)

485 ) Anahathabja nilaya -   
She who lives in the twelve petalled lotus

486 ) Syamabha -   
She who is greenish black

487 ) Vadanadwaya -  
 She who has two faces

488 ) Dhamshtrojwala -   
She who shines with long protruding teeth

489 ) Aksha maladhi dhara -   
She who wears meditation chains

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 56 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 32

*🌻 32. నతేన రాజా పరితోషః క్షుచ్ఛాంతిర్వా 🌻*

            సన్యాసి పుత్రుడు కాడని, రాజకుమారుడేనని తెలియగానే, అతడు పుట్టుక తోనే రాజకుమారుడని నిర్ణయమైంది. మధ్యలో అతడు సన్యాసి కుమారుడనేది అజ్ఞానావరణ. 

ఆవరణ తొలగగానే తాను రాజకుమారుడనే అనేది స్పష్టం. అలాగే తన గృహమందు తాను చేరి తన పూర్వ సుఖాన్ని తాను మరలా పొందాడు గాని, అది క్రొత్త సుఖం కాదు. 

దేశాంతరాల అనుభవాలు కొంతకాలం స్వగృహ సుఖాన్ని మరుగుపరిచాయి గాని, చివరకు అడ్డు తొలగగానే స్వగృహ సుఖం ఉన్నచోటనే ఉన్నది. 

సుఖానికి దూరమైనట్లు భ్రాంతి కలిగింది. తిరిగి దగ్గరవు తున్నట్లు కూడా భ్రాంతి కలిగింది. అతడి స్వగృహ సుఖం స్మృతిలో ఉండాలి.కాని కొంతకాలం మరుపులో పోయినట్లున్నది గాని, నిజానికి ఆ సుఖం ఎల్లప్పుడూ ఉంది.

     మధ్యమధ్యలో ఆకలి బాధ కలిగి, తన సహజ తృప్తిని మరిపించింది గాని, ఆకలి బాధ అనే అడ్డు తొలగగానే, అది నిత్య తృప్తేనని, క్రొత్తగా వచ్చేది కాదని తెలుస్తుంది.  

అలాగే భగవత్ప్రాప్తి సహజ సిద్ధం. మరపు అనే అజ్ఞానంలో భగవత్ప్రాప్తి లేనట్లు ఉంటుంది. అజ్ఞాన ఆవరణ తొలగగానే ప్రాప్తించి నట్లుంటుంది. 

కాని భగవంతుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూనే ఉన్నాడు. భక్తుడు కూడా భగవంతునిలా నిత్యం ఆనందమయుడే. ఆవరణ తొలగగానే ఆనందమే తానైన పరాభక్తుడు, ఆనందమే తానైన భగవంతుడు ఒక్కటే.

    దేవాలయంలో విగ్రహాన్ని కనబడకుండా తెర వేశారనుకుందాము. భగవంతుడు కనబడలేదు. తెరతీయగానే కనబడ్డాడు. భగవంతుడు అక్కడకు క్రొత్తగా వచ్చాడా ? అక్కడే ఉన్నాడు. 

తెర మాత్రం అడ్డుగా ఉంది. తెర తొలగగానే దర్శనమైంది. అంతే ! మనలో ఆత్మ సత్యం, నిత్యం. కొంత కాలం అజ్ఞాన కారణంగా జీవ భావం కలిగి ఆత్మానుభవాన్ని కప్పి వేసింది. 

భక్తి, కర్మ, జ్ఞాన, యోగ సాధనలచేత, కప్పిన ముసుగును తొలగించుకోగానే కలిగిన ఆత్మానుభవం స్వతస్సిద్ధం, సహజం.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 24 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

Compared to other spiritual practices, the method of following Guru offers a great advantage. The other pursuits grant only what you wish for, nothing else, and nothing more. 

In addition to satisfying your worldly desires, without your awareness your intellect will soar towards higher realms, and more than what you had ever imagined will be your reward when you follow Guru. 

The worship of other deities bestows only the boons that you ask for, whereas Guru, while he gives you what you desire, also grants you liberation. 

That is why, Kartaveeryarjuna, who approached Guru initially with a desire for kingdom, step by step rose to the highest spiritual level.
 
Swamiji is initiating all of you into this Guru Gita with the hope and desire that in addition to fulfilling all your desires, it would also open the doors to your blissful inner consciousness, the existence of which you never even imagined. He is not only initiating you into this teaching, but he is also sharing with you all the secret inner meanings contained in it. 

You are indeed very fortunate and blessed. Utilize this great beneficence and fulfill the purpose of your lives. 

Wishing for your welfare, for the satisfaction of all your wishes, and for granting you an experience of bliss, by meditating upon Guru Lord Dattatreya, he is now going to begin this spiritual journey.
 
We have to learn the detailed meaning of the verses that lead us into the contemplation of Guru.

Before commencing any good deed, one should remember Guru. Since we are going to be discussing the Guru Gita, an act that is unsurpassed in the world for its merit, let us begin with the contemplation of Guru. 

The foremost Guru of all is Lord Dattatreya. He embodies the Trinity. Guru is Brahma, Guru is Vishnu, and Guru is Siva. All Gurus who follow in this lineage are all also embodiments of all the three.

 Without question, Lord Dattatreya is the ultimate Supreme Soul. We offer him our prostrations.
 
In this context, let us learn how Guru Veda Dharma blessed his disciple Deepaka. It is an important incident in a short story. In the olden days, Deepaka, the disciple of Guru Veda Dharma believed that Guru was all in all. He believed that all deities resided in his Guru. 

When Siva and Vishnu appeared before him and offered him boons, Deepaka remained unmoved in his dedication to Guru. For possessing such intense devotion, let us find out what immense grace he received. 

Assuming that Deepaka’s devotion to Guru was not genuine, the other disciples created obstacles in every single effort of his. It is natural and commonplace that when one is trying to rise high, others try to pull him down. 

Afraid that Deepaka may rise to dizzying heights by the grace of Guru, the rest of the disciples tried their level best to drag him down by placing hurdles in his path of devotion to Guru. Let us see what happened after they managed to drag him down.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 22 / The Siva-Gita - 22 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 6 🌻*

ఇదం వ్రతం పశుపతం - వదిష్యామి సమాసతః ,
ప్రాత రేవతు సంకల్ప్య - నిధా యాగ్నిం స్వశా ఖయా .25

ఉషో షత శ్శుచి స్స్నాత - శ్శుక్లాం భర ధర స్స్వయ మ్,
శుక్ల యజ్ఞా పవీ తశ్చ - శుక్ల మాల్యా నులే పనః 26

జుహు యా ద్విర జో మన్త్రై: - ప్రాణా పానాది భిస్తతః,
అను వాకంత మేకాగ్ర - సమిదాజ్య చరూ న్ప్రుధక్ 27

ఇట్టి పాశు పత వ్రత విధానమును వివరింతును వినుమని చెప్పుచుండెను. 

ప్రాతః కాలమున నీ విధంబుగా సంకల్పించి ఆహారము తీసుకోకుండా
 స్నానం చేసి శుచియై పరిశుభ్ర వస్త్రములను దాల్చి స్వశా ఖోక్త ప్రకారంబుగా నర్పించి తెల్లని బ్రహ్మ సూత్రములు,శ్రీ గంధమును, 
పూలహారములను దాల్చి విరజా మంత్రంబులను బ్రాణా 
పానంబుల హోమం బాచరించి " యాతే అగ్నే .........రితి "

 అను మంత్రములతో అగ్నిని తన యందారో పించుకొని "భస్మా దాయాగ్ని " 
అను మంత్రముతో భస్మమును కురంగ ముద్రతో స్వీకరించి తన శరీర మంతట త్రిపుండ్ర రేఖలుగా దరించ వలెను.

అట్లు భస్మమును ధరించు కొన్న వాడు మహా పాపముల నుండి విముక్తు డగును. ఇందు ఏ మాత్రము సందేహము లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 22 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 6 🌻*

Agastya started narrating the sequences of the Pashutpata Vratam (Viraja Deeksha) to Rama as follows. 

In the early morning, one should become purified by taking bath, shouldn't eat anything, should wear clean clothes, should do Sankalpa (holy decision), should apply white holy Srigandham (sandal paste of bilva tree), should wear flower garlands, should utter the Viraja mantras by subduing the Prana, Apana kind of winds, should ignite fire by uttering "yaateange...riti" etc mantras, and then apply the holy ash in three horizontal lines format on all over the body by uttering "bhasmadaayagni..." etc. mantras. 

The one who applies ash in this manner on his body, he becomes freed of all his sins. There is no doubt in this.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 14 / Sri Gajanan Maharaj Life History - 14 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 3వ అధ్యాయము - 4 🌻*

పూర్తిగా కోలుకున్నాక, శ్రీమహారాజు నివసించే మఠందగ్గర వందలాది భక్తులకు జానరావు అన్నసంతర్పణ చేసాడు. దేష్ ముఖేను కాపాడిన దృష్టాంతంతో శ్రీగజానన్ మహారాజుకు ఇబ్బందులు కలిగించాయి. వీటిని తొలగించుకోవడం కోసం శ్రీమహారాజు ప్రజలతో అసహజంగా, కఠినంగా అవవలసి వచ్చేది. 

శ్రీమహారాజు యొక్క ఈవిధమయిన ప్రవర్తనను ఆయన నిజమయిన భక్తులు భరించగలిగేవారు. నరసింహ భగవంతుని రూపానికి ప్రజలు భయభ్రాంతులు అయినా, ప్రహ్లాదుడు ఈయన బాహ్యరూపం వల్ల భయపడలేదు. ఆడపులి అంటే ప్రజలు భయపడతారు. కానీ పులిపిల్లలు ఆ ఆడపులితో ఆడుతూ ఉంటాయి. 

ఇదేవిధంగా శ్రీమహారాజు కఠినత్వానికి ఆయన నిజమయిన భక్తులు భయపడలేదు. ఇప్పుడు ఇంకొక కధ వినండి వాననీళ్ళు పడడంతోనే నేలకు సువాసన వస్తుంది. అదేవిధంగా గంధం చెక్కతో తాకగానే ఒక సాధారణ చెక్కకు కూడా సుగంధం వస్తుంది. ఇదిసహజం. 

కానీ అంతలోనే ఆసాధారణమయిన చెక్క తనేగంధపు చెక్కను అనుకోవడం వెర్రితనం. చెరకు మొక్కలతోపాటు చెత్త మొక్కలుకూడా పెరుగుతాయి. యోగులు, పిశాచకులు కూడా ఈభూమండలం మీద జన్మించారు. ఘనులలో వజ్రాలతోపాటు మామూలు గుళకరళ్ళుకూదా దొరుకుతాయి. 

ఇవిరెండూ ఒకేచోటదొరికినా వాటివాటి విలువవేరు. మామూలు గుళకరాయికి, వజ్రానికి ఉన్న వెలుగు ఎలావస్తుంది ? అందువల్ల ఈవజ్రాలను పట్టితీసి, గుళకరాళ్ళను కాళ్ళక్రింద పడేస్తారు. 

షేగాంలో శ్రీగజానన్ మహారాజు దగ్గర విఠోబాఘాటోల్ అనే ఒకకపటి సన్యాసి పైనచెప్పిన గుళకరాయి వంటివాడు. అవినీతి, దొంగప్రవృత్తులు కలవాడయినా గొప్పభక్తునిగా నటిస్తుండేవాడు. శ్రీగజానన్ భోజనానికి, పొగత్రాగడానికి మరియు ఇతర అవసరాలకు నాపైనే ఆధారపడతారు, నేను ఆయనకు కుడిభుజంవంటివాడిని అనిచెప్పుకునేవాడు. శివుడికి నంది ఎటువంటిదో నేను శ్రీగజాననకు అటువంటివాడను అని చెప్పుకుంటూ, అనేకమయిన వసతులు పొందేవాడు. 

విఠోబా ఏమిచేస్తున్నాడనే విషయం తనదైవజ్ఞానం వలన తెలుసుకున్న శ్రీగజానన్ ఈవిధంగా బుద్ధి చెప్పారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 14 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 3 - part 4 🌻*

After his full recovery, Deshmukh celebrated the blessings by feeding hundreds of people at the Math where Shri Gajanan Maharaj stayed. 

The incident of saving Deshmukh created problems for Shri Gajanan Maharaj and to avoid them, He had to become rather strict and indifferent to the people. 

His real devotees, however, could bear with that attitude of Shri Gajanan Maharaj . God Narsimha, by His very appearance, created terror in the minds of people, but Pralhad was not afraid of that outward look. 

Tigress is fearful to others, but not to her cubs playing in her lap. Likewise the real devotees were not afraid of the strictness showed by Shri Gajanan Maharaj . Now listen to another story. 

It is seen that the earth, when in contact with musk, gets its fragrance. Similarly by mere contact of sandal wood and ordinary wood also gets its fragrance. This is quite natural, but it will be absurd if the wood thinks itself to be sandalwood. 

Along with the Sugarcane also grows some useless bushes. Saints and Satan are both born on the same earth. Along with diamonds, ordinary pebbles too are found in the mines. 

Though found in one place they differ in value. An ordinary pebble cannot get the lustre of a diamond and will simply be trampled under our feet, while the diamond picked up. Vithoba Ghatol, like an above pebble, a hypocrite, was staying with Shri Gajanan Maharaj at Shegaon. 

He was dishonest and insincere, but showed off as being a great devotee of Shri Gajanan Maharaj . He used to call himself the Kalyan of Shri Gajanan Maharaj , and said that Shri Gajanan depended for everything, i.e. food, pipe and other comforts, on him. 

He was taking all sorts of advantages by his association with Shri Gajanan Maharaj and boasted himself to be a bull before Lord Shiva. 

By his divine vision, Shri Gajanan Maharaj knew what Vithoba was doing and so taught him a lesson by following incident.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 64 / Soundarya Lahari - 64 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

64 వ శ్లోకము

*🌴. స్త్రీల వ్యాధులు నశింప చేయుటకు, ప్రజ్ఞా వంతులు అగుటకు 🌴*

శ్లో: 64. అవిశ్రాంతం పత్యర్గుణ గణకథా మ్రేడనజపా జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా| 
 యద గ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్ఛచ్భవిమయీ 
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! నీ యొక్క నాలుక నుండి నిరంతరమూ జప రూపముగా వచ్చు నీ భర్త అయిన ఆ పరమ శివుని జపా పుష్పములతో , నీ నాలుక చివరి భాగమున ఉన్న శుద్ధ స్ఫటిక రంగు కలిగిన సరస్వతీదేవి కూడా ఎఱ్ఱని వన్నె కలదై ప్రకాశించు చున్నది. కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, క్షీరాన్నము, తేనె, నివేదించినచో స్త్రీల వ్యాధులు నశింప చేయునని, ప్రజ్ఞ లభించును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 64 🌹*
📚. Prasad Bharadwaj 

Sloka - 64 

*🌴 Curing diseases for women and attaining wisdom 🌴*

64. Avishrantam pathyur guna-gana-katha'mridana-japa Japa-pushpasc-chaya thava janani jihva jayathi saa; Yad-agrasinayah sphatika-drishad-acchac-chavi mayi Sarasvathya murthih parinamati manikya-vapusha. 
 
🌻 Translation : 
Mother mine, the well known tongue of yours, which without rest chants and repeats, the many goods of your consort, Shiva,is red like the hibiscus flower the goddess of learning Saraswathi, sitting at the tip of your tongue, though white and sparkling like a crystal, turns red like the ruby, because of the color of your tongue.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 2000 times a day for 45 days, offering Payasam, honey as prasadam, it is believed that they will be achieve wisdom and cures all disorders for feminine gender.

🌻 BENEFICIAL RESULTS: 
In case of women, following are the beneficial results: diseases are cured, attainment of power to entice men, ability to pacify angry husband. 
 
🌻 Literal Results: 
Irresisitible speech for women folk, capacity to attract men.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 11 🌴

11. తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||

🌷. తాత్పర్యం :
నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.

🌷. భాష్యము :
శ్రీచైతన్యమహాప్రభువు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రకీర్తనమును వారణాసి యందు ప్రచారము చేసినపుడు వేలాదిమంది అయినను అనుసరించి. కాని ప్రకాశానందసరస్వతి యను నతడు (ఆ కాలమున వారణాసి యందు గొప్పసేవ మోసిన పండితుడు) మాత్రము మహాప్రభువు భావావేశపరుడైనందుకు ఆయనను హేళనచేసెను. 

అదేవిధముగా కొన్నిమార్లు కొందరు తత్త్వవేత్తలు భక్తులైనవారు అజ్ఞానాంధకారములో నుండి, తత్త్వరీత్యా భావావేశపరులై యుందురన్న భావానలో వారిని విమర్శింతురు. కాని వాస్తవమునకు అది సత్యముకాదు. ఘనులైన పండితులెందరో భక్తితత్త్వమును సమగ్రమముగా విశదపరిచిరి. కాని భక్తుడు వారి రచనల నుండి కాని, గురూపదేశముల నుండి కాని లాభము పొందలేకున్నను, 

భక్తియోగము నందు శ్రద్దాళువైనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని అంతర్యము నుండి సహాయమును కూర్చగలడు. అనగా శ్రద్ధతో కృష్ణభక్తిభావన యందు నిలిచిన భక్తుడు ఎన్నడును జ్ఞానరహితుడు కాబోడు. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో సేవ నొనర్చుట ఒక్కటే దానికి కావలసిన యోగ్యత.

ఆత్మానాత్మవిచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధజ్ఞానమును పొందలేరని ఆధునిక తత్త్వవేత్తలు భావింతురు. అట్టివారికి శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున చక్కని సమాధానమొసగినాడు. 

అనగా శుద్ధభక్తియోగమున నియుక్తులైనవారు తగినంత విద్య లేనప్పటికి మరియు వేదనియమములను గూర్చిన తగిన జ్ఞానమును కలిగియుండనప్పటికిని ఈ శ్లోకమున తెలుపబడినట్లు తప్పక భగవానునిచే సహాయమును పొందగలరు.

పరతత్త్వమైన తనను కేవలము మానసికకల్పనల ద్వారా అవగాహన చేసికొనుట సాధ్యముకాని విషయమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బోధించెను. పరతత్త్వమైన భగవానుడు అత్యంత ఘనుడైనవాడగుచో మనోకల్పనల ద్వారా అతనిని అవగాహనము చేసికొనుట లేదా పొందగలుగుట సాధ్యము కాదు. 

మనుజడు భక్తి లేకుండ మరియు పరతత్త్వమునందు అనురాగము లేకుండ కోట్లాది సంవత్సరములు మానసికకల్పనలు గావించినను పరతత్త్వమైన శ్రీకృష్ణుడు ముదమొంది తన అంతరంగశక్తి ద్వారా శుద్ధభక్తుని హృదయమున తనను తాను విశదపరచుకొనును. శుద్ధభక్తుడు శ్రీకృష్ణుడు సదా తన హృదయమునందు నిలుపుకొనియుండును. 

సూర్యసముడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తుని హృదయమునందలి అజ్ఞానాంధకారము పటాపంచలైపోవును. ఇదియే శ్రీకృష్ణుడు తన శుద్ధభక్తుల యెడ చూపు ప్రత్యేక కరుణయై యున్నది.

కోటానుకోట్ల జన్మల యందలి విషయసంపర్క మాలిన్యముచే మనుజుని హృదయము సదా భౌతికత్వమనెడి ధూళిచే కప్పబడియుండును. 

కాని అతడు భక్తియుతసేవలో నియుక్తుడై హరేకృష్ణమహామంత్రమును నిరంతరము జపించినచో శీఘ్రమే ఆ హృదయమాలిన్యము తొలగిపోయి, శుద్ధజ్ఞానస్థితికి ఉద్దరింపబడును. 

అనగా చరమలక్ష్యమైన విష్ణువు కేవలము హరినామసంకీర్తనము మరియు భక్తియుతసేవ తోడనే లభించునుగాని మనోకల్పన లేదా వాదములతో కాదు. శుద్ధభక్తుడు ఏనాడును భౌతిక జీవితావసరములను గూర్చిన చింత మరియు ఆందోళనలను కలిగియుండ నవసరము లేదు. 

ఏలయన అతడు తన హృదయము నుండి అజ్ఞానాంధకారమును తొలగించుకొనినంతనే ప్రేమయుతసేవచే తృప్తుడైన శ్రీకృష్ణభగవానుడు అతనికి అప్రయత్నముగా సర్వమును సమకూర్చును. ఇదియే గీతోపదేశముల సారాంశము. 

కనుకనే గీతాధ్యయనము ద్వారా మనుజుడు శ్రీకృష్ణభగవానునకు సంపూర్ణశరణాగతుడై అతని శుద్ధభక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. పిదప భగవానుడే రక్షణభారమును స్వీకరించినపుడు అతడు సర్వవిధములైన భౌతికయత్నముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 363 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 11 🌴

11. teṣām evānukampārtham
aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho
jñāna-dīpena bhāsvatā

🌷 Translation : 
To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance.

🌹 Purport :
When Lord Caitanya was in Benares promulgating the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, thousands of people were following Him. Prakāśānanda Sarasvatī, a very influential and learned scholar in Benares at that time, derided Lord Caitanya for being a sentimentalist. 

Sometimes Māyāvādī philosophers criticize the devotees because they think that most of the devotees are in the darkness of ignorance and are philosophically naive sentimentalists. Actually that is not the fact. There are very, very learned scholars who have put forward the philosophy of devotion. 

But even if a devotee does not take advantage of their literatures or of his spiritual master, if he is sincere in his devotional service he is helped by Kṛṣṇa Himself within his heart. 

So the sincere devotee engaged in Kṛṣṇa consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Kṛṣṇa consciousness.

The Māyāvādī philosophers think that without discriminating one cannot have pure knowledge. For them this answer is given by the Supreme Lord: those who are engaged in pure devotional service, even though they be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God, as stated in this verse.

The Lord tells Arjuna that basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of Godhead, simply by speculating, for the Supreme Truth is so great that it is not possible to understand Him or to achieve Him simply by making a mental effort. 

Man can go on speculating for several millions of years, and if he is not devoted, if he is not a lover of the Supreme Truth, he will never understand Kṛṣṇa, or the Supreme Truth. Only by devotional service is the Supreme Truth, Kṛṣṇa, pleased, and by His inconceivable energy He can reveal Himself to the heart of the pure devotee. 

The pure devotee always has Kṛṣṇa within his heart; and with the presence of Kṛṣṇa, who is just like the sun, the darkness of ignorance is at once dissipated. This is the special mercy rendered to the pure devotee by Kṛṣṇa.

Due to the contamination of material association, through many, many millions of births, one’s heart is always covered with the dust of materialism, but when one engages in devotional service and constantly chants Hare Kṛṣṇa, the dust quickly clears, and one is elevated to the platform of pure knowledge. The ultimate goal, Viṣṇu, can be attained only by this chant and by devotional service, and not by mental speculation or argument. 

The pure devotee does not have to worry about the material necessities of life; he need not be anxious, because when he removes the darkness from his heart, everything is provided automatically by the Supreme Lord, who is pleased by the loving devotional service of the devotee. 

This is the essence of the teachings of Bhagavad-gītā. By studying Bhagavad-gītā, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge, one becomes completely free from all kinds of materialistic endeavors.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 190 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
42. అధ్యాయము - 17

*🌻. గుణనిధి చరిత్ర - 3 🌻*

లోకమాన్యోsస్తి తే తాతస్స దాచారైర్న వై ధనైః | బ్రాహ్మణానాం ధనం తాత సద్విద్యా సాధుసంగమః || 21

కిమర్థం న కరోషి త్వం సురుచిం ప్రీతమానసః | సచ్ఛ్రోత్రియాస్తేsనూచానా దీక్షితాస్సోమయాజినః || 22

ఇతి రూఢిమిహ ప్రాప్తాస్తవ పూర్వ పితామహాః | త్యక్త్యా దుర్వృత్త సంసర్గం సాధుసంగరతో భవ || 23

సద్విద్యాసు మనో ధేహి బ్రాహ్మణాచారమాచర | తాతాను రూపో రూపేణ యశసా కుల శీలతః || 24

వత్సా! నీ తండ్రి ధనముచే గాక, సదాచారముచే లోకపూజ్యుడైనాడు. వత్సా! బ్రాహ్మణులకు సద్విద్య, మరియు సాధుసంగమము అనునవియే ధనము (21).

 నీకు వీటియందు అభిరుచి లేకపోవుటకు కారణమేమి? నీ పూర్వీకులు, తాతముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాగమును చేసినవారు (22) 

అని లోకమునందు ప్రతిష్ఠగలదు. నీవు చెడు స్నేహములను విడ నాడి సత్పురుషులు స్నేహమును అలవరచుకొనుము (23).

 సద్విద్యలయందు మనస్సును నిలుపుము. బ్రాహ్మణాచారముల ననుష్ఠించుము. రూపములో, కీర్తిలో, కులములో, శీలములో తండ్రికి దగ్గవాడవు కమ్ము (24).

తతో న త్రపసే కిన్న త్యజ దుర్వృత్తతాం స్వకామ్‌ | ఊనవింశతికోsసి త్వ మేషా షోడశవార్షికీ || 25

ఏతాం సంవృణు సద్వృత్తాం పితృభక్తియుతో భవ | శ్వశురోsపి హి తే మాన్య స్సర్వత్ర గుణశీలతః || 26

తతో న త్రపసే కిన్న త్య జ దుర్వృత్తతాం సుత | మాతులాస్తేsతులాః పుత్ర విద్యా శీలకులాది భిః || 27

తేభ్యోsపి న భిభేషి త్వం శుద్ధోsస్యుభయవంశతః | పశ్యైతాన్‌ ప్రతివేశ్మస్థాన్‌ బ్రాహ్మణానాం కుమారకాన్‌ || 28

ఆయన వలన నీవేల భయపడవు? నీ చెడు చేష్టలను విడువుము. నీకు పందొమ్మిది సంవత్సరములు. ఈమె పదునారు సంవత్సరముల యువతి (25). 

పతివ్రతయగు ఈమెను ప్రేమించుము. తండ్రియందు భక్తి గలవాడవు కమ్ము. నీ మామగారు కూడ గుణముచే, శీలముచే అంతటా పూజింపబడును (26). 

నీకు ఆయన వలనైననూ భయము లేకపోవుటకు కారణమేమి?కుమారా! చెడు పనులను కట్టిపెట్టుము. పుత్రా! విద్య, శీలమ, కులము ఇత్యాదులలో నీ మోనమామలు సాటిలేని వారు (27). 

నీకు వారి వలనైననూ భయము లేకున్నది. నీ తండ్రివైపు, తల్లివైపు వంశములు రెండు శుద్ధమైనవి. మన చుట్టుప్రక్కల గృహములలోని బ్రాహ్మణబాలకులను చూడుము(28).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 65 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Though He Suffers He Forgives - 2 🌻*

All sanskaras are like bindings of cloth, but unnatural sanskaras stick to one like thorns. And as one is cloaked with thorns, when one comes across someone else cloaked with thorns, one inevitably gets entangled with him. 

Because of this entanglement of thorns meshed with thorns, one's progress toward the path of Truth is seriously hindered. In other words, those with unnatural sanskaras generally end up getting entangled in a heap of thorns with those who also have similar unnatural sanskaras.  

The Avatar works to forgive, and his forgiveness is to show the way to the path of Truth for each one. He has to remove the heap of thorns produced by each one's unnatural actions with others. 

To remove the heap of thorns is his work, and while he works, he suffers, because these thorns are enmeshed in each one's  
consciousness. Since the thorns stick to one and the Avatar has to remove them, there is suffering, and this suffering causes yet another obstruction—resentment. 
 
For example, Meher Baba has to rid a hypocritical guru or false saint of his hypocrisy. 

The hypocrite poses himself to be a real saint and spiritual teacher, and so he deceives others. He enjoys this way of life and he is unwilling to give it up at any cost. 
 
To change this false guru is a difficult task, because the false guru loves this way of life,  
and he wants to continue appealing to his followers. 

Any act of changing him is met with resentment, and this resentment, which obstructs the work of the Avatar, contributes to the suffering of the Avatar while he works to change that hypocrite.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 61 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. దీక్షా విధి - 2 🌻*

ప్రద్యుమ్నేన సమాలోడ్య దర్వ్యా సంఘట్టయేచ్ఛనైః పక్వముత్తారయేత్ఫశ్చాదనిరుద్ధేన దేశికః. 12

ప్రక్షాల్యాలిప్య తత్కుర్యాదూర్ధ్వపుణ్డ్రం తు భస్మనా | నారాయణన పార్శ్వేషు చరుమేవం సుసంస్కృతమ్‌.

ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలెను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణ మంత్రముతో, భస్మచేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.

భాగమేకం తు దేవాయ కలశాయ ద్వితీయకమ్‌ | తృతీయేన తు భాగేన ప్రదద్యాదాహుతిత్రయమ్‌. 14

శిష్యైః సహ చతుర్థం తు గరురద్యాద్విశుద్ధయే| నారాయణన సంమన్త్య్ర సప్తధా క్షీరవృక్షజమ్‌. 15

దన్తకాష్ఠం భక్షయిత్వా త్యక్త్వా జ్ఞాత్వా స్వపాతకమ్‌| ఐన్ద్రాగ్న్యుత్తర కేశానీముఖం పతితముత్తమమ్‌. 16

శుభం సింహశతం హుత్వా ఆచమ్యాథ ప్రవిశ్యచ |
పూజాగారం న్యసే న్మన్త్రీ ప్రాచ్యాం విష్ణుం ప్రదక్షిణమ్‌. 17

ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భగామును గురువు శిష్యులతో కూడా భుజించవలెను. క్షీరవృక్షమనుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. 

శుభమైన నరసింహ మంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.

సంసారార్ణవమగ్నానం పశూనాం పాపముక్తయే| త్వమేవ శరణం దేవ సదా త్వం భక్తవత్సల. 18

దేవదేవానుజానీహి ప్రాకృతైః పాశబన్ధనైః పాశితాన్మోచయిష్యామి త్వత్ప్రసాదాత్పశూనిమాన్‌. 19

"భక్తవత్సలుడవైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవేశరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెదను. అనుజ్ఞఇమ్ము." అని విష్ణువును ప్రార్థించవలెను.

ఇతి విజ్ఞాప్య దేవేశం సంప్రవిశ్యం పశూంస్తతః | ధారణాభిస్తు సంశోధ్య పూర్వవజ్జ్వలనాదినా. 20

సంస్కృత్య మూర్త్యా సంయోజ్య నేత్రే బుద్ధ్వా ప్రదర్శయేత్‌ |
పుష్పపూర్ణఞ్జలీంస్తత్ర క్షిపేతన్నామ యోజయేత్‌. 21

అమన్త్రమర్చనం తత్ర పూర్వవత్కారయేత్క్రమాత్‌ |

యస్యాం మూర్తౌ పతేత్పుష్పం తస్య తన్నామ నిర్దిశేత్‌. 22

విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చేప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికము చేతను సంశోధనము చేసి సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. 

అచట పుష్పమములతో నిండిన దోసిళ్లను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుకటివలె క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 76 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కర్దమ మహర్షి – దేవహూతి - 2 🌻*

6. ముక్తి హేతువయినటువంటి విషయం బ్రహ్మ చెప్పడు. బ్రహ్మ ప్రవృత్తిమార్గమే చెపుతాడు.

7. ఎంతకాలం సగుణమయిన స్వరూపం దర్శనమిస్తుందో, మన తపస్సుకు మనలో ఉండే వృత్తే అలా దర్శనమిస్తుంది కాని మనలోలేనిది దర్శనమివ్వదు. 

8. సమస్తయోగాలలో ఒక్క రహస్యమేమిటంటే, మనం పొందేటటువంటి దర్శనానికి హేతువు, బీజం సంస్కారరూపంలో కోరికరూపంలో మన దగ్గర మన లోపలే ఉంటుంది. అదే బయటికివచ్చి ఒక రూపదర్శనం – ఒక రూపకల్పన చేసుకొని – దర్శనమిస్తుంది. 

9. తపస్సు మనదే! ఆ కనబడేటటువంటి రూపముకూడా మనలోంచి ఉత్పన్నమైనటువంటిదే! మన అడిగే కోరికలు మనవే! దానిఫలం అనుభవించేది మనమే లోపల పరతత్వం మాత్రం ఏమీకాదు. అది దేనికీ హేతువుకాదు. తటస్తంగా ఉండే వస్తువది.

10. భవంతుణ్ణి ముక్తి మార్గం కోసమే ఆశ్రయిస్తే, ఆయనే గురువుగా వస్తాడు. కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రయిస్తే, పురాణం చెప్పిన రూపంలో వస్తాడు. ఆ కోరికలు తీరుస్తాడు. 

11. కానీ అదంతా బంధనహేతువు అవుతుంది కాని ముక్తి మార్గం కానేరదు. ముక్తిని కోరితేనే భగవంతుడు గురుస్వరూపమై వస్తాడని దాని తాత్పర్యం.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 141 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 You can only know your self by being yourself 🌻*

Whatever can be described cannot be your self, and what you are cannot be described. 

You can only know your self by being yourself without any attempt at self-definition and self-description. 

Once you have understood that you are nothing perceivable or conceivable, that whatever appears in the field of consciousness cannot be your self, you will apply yourself to the eradication of all self-identification, as the only way that can take you to a deeper realisation of your self. You literally progress by rejection -- a veritable rocket.

 To know that you are neither in the body nor in the mind, though aware of both, is already self-knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 79 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 76:--telepathy 🌻*

Ans :--
1) కుక్క, పిల్లి, ఆవు ఇలా కొన్ని పెంపుడు జంతువులు మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాల్ని పసిగట్టగలవు.

2) పసిపిల్లలు, పెంపుడు జంతువులు telepathy ద్వారా ప్రతి రోజు సంభాషించుకుంటాయి.

3) మానవజాతి సహజ ప్రవృత్తి లోకి మారాలి.
మానవజాతి, జంతుజాతి పరస్పర సహకారంతో చైతన్య పరిణామం చెందవలసి ఉంది.

4) వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్ని మన దేహం పసిగట్టగలుగుతుంది.మనం గమనిస్తే ఇది మన మైండ్ ద్వారా జరుగుతుంది అని గుర్తించవచ్చు. అలానే మానవుల ఆలోచనా తరంగాల్ని జంతువులు, వృక్షాలు ఇతర వస్తువులు ఫీలింగ్స్ ని కూడా మన మైండ్ పసిగట్టగలదు.

5) మన మైండ్ ఆలోచనా తరంగాల్నే కాదు ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలు కూడా పసిగట్టగలదు.

6) మన ఇంట్లో ఉన్న chair, table కూడా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనల్ని పసిగట్టగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 25 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

ఆ ఊరి పెద్దలు వడ్రంగి పని చేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి, అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు. తాను పేదవాడినని, తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు.

తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని, కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు. ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు.

గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు. వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ఇచ్చింది. ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.

వివాహం అయిన తర్వాత కొంతకాలం వరకు తన భార్యతో కలిసి జీవిస్తూ, తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ గడిపారు బ్రహ్మంగారు.

ఆయన ఎక్కడా కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కానీ ప్రకటించుకోలేదు. తనకు శిష్యులున్నారని కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకే ప్రయత్నించేవారు తప్ప తన గురించి, తన శక్తి గురించి చెప్పుకోలేదు. మహిమలను కూడా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందుకు ఆసక్తి వుండేది కాదు.

అందువల్ల బ్రహ్మంగారిని స్వామిజీగా ఎవ్వరూ గుర్తించలేదు. ఇలా అనేకంటే బ్రహ్మంగారికి ఇలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు.ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరూ గుర్తించలేదు. కాబట్టే ముస్లిం మతస్థులు కూడా ఆయన శిష్యులుగా వున్నారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువల్లనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది.

*🌻. బ్రహ్మంగారి దేశ సంచారం 🌻*

కొన్నాళ్ళకి బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది.

కంది మల్లాయపాలెం నుంచి తన దేశాటనను ప్రారంభించారు. ముందుగా విజయవాడకు చేరి, కృష్ణానదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో తిరిగారు. వరంగల్ నుంచి హైదరాబాదుకు చేరారు.

అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు. బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని తానూ ఆయనతో మాట్లాడతానని కోరుతూ కబురు పంపాడు.

 హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు. బ్రహ్మంగారిని ప్రశ్నించిన నవాబు బ్రహ్మంగారిని కలిసిన నవాబు, ముందుగా తనకు ఆయనపై నమ్మకం లేదని చెప్పాడు. ఆయన జ్ఞాని అయితే కావచ్చు కానీ, దైవాంశ సంభూతుడు అంటే మాత్రం నమ్మలేనని, తనకు ఆయన ఏమైనా మహిమలు చూపితే తాను ఆయన భక్తునిగా మారగలనని అన్నాడు. మహిమలు ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మంగారికి నమ్మకం లేకపోయినా, తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఒక గిన్నె నీటిని తెప్పించుమని నవాబును ఆదేశించాడు. సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదలో పోయించారు. తర్వాత ఆ దీపమును వెలిగించాడు. అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు. రాజ్యం, అధికారం గురించి, తన వ్యక్తిగత విషయాలు భవిష్యత్ లో ఏ విధంగా వుంటాయో చెప్పమని ప్రార్థించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 8 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

*🌻 STANZA II - The Knowledge of the Heart - 3 🌻*

17. The darkness was overtaking those people who had trampled down their inner Light and so were useless to Life. 

These were the people of death whom evil was penetrating continuously — not only their thoughts, but also their breast, wherein he ruled on a soulless throne of stone. There was nothing for him to fear, for a stone could not strike a spark that would have burnt the darkness’ tenacious paws. 

O, how the darkness desired such hearts! One had to work very hard to get one’s own way, and the darkness spared no effort or means to this end, if only she could see herself ensconced on the throne which had previously belonged to Life.

18. Man was endeavouring to grow in grace and wisdom. He had already been able to distinguish the Light from the darkness. In him, these two principles were tightly interwoven, forming a single indivisible essence. 

Gloomy thoughts swept past, dictating strict orders and generating a combative atmosphere. Evil was amassing legions of venomous thoughts, capable of poisoning the whole Joy of Life with their sinister stench. 

Joy was the lampion oil which made the Flame of Love glow so brightly. The dark host of gloomy thoughts was successfully depriving the little fire of the nourishment it needed. 

The flame was gradually diminishing in size, and a light puff of air was all it would take to extinguish it forever. The world was being deprived of Joy, without which both Life and Love would be unthinkable.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 19 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 7 🌻*

ఈ ప్రేయోమార్గంలో జీవించే వారందరిలో కూడా వాళ్ళు దేహరూపానికి మానవులే గానీ బుద్ధియందు మిడతల వంటి వారు అనమాట. అట్టి మిడతల వంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞాన విచారణ అబ్బదు అని స్పష్టంగా చెప్తున్నాడు. 

నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని. 

అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖములపా లగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.

     ఎక్కువమంది ఆకర్షించబడేది అంటే నూటికి 90 శాతం మంది ఈ ప్రేయోమార్గంలోనే వుంటారు.

 ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట, పౌత్రులను పొందుట, ప్రియమైనవారిని పొందుట, బంధువులను కలిగివుండుట, అందరికీ ఇష్టులుగా జీవించుట, ఆ ఇష్టము అనేటటువంటి ప్రియాప్రియములతో ఏ రకమైన వస్తుసంచయము “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదినః “ అనేటటుంటి పద్ధతిగా ధన కనక వస్తు వాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మచక్రమునందు తగులుకొని, కర్మబంధము చేత బాధించబడుతూ, అజ్ఞానబంధము చేత బాధించబడుతూ “నేనెవరు?” అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్యజీవనమునే జీవనముగా భావించి, అట్టి జీవనమును ఎప్పుడైతే నీవు పొందుతూ వున్నావో, ఆ జీవనము నీకు వృధా అయినటువంటి జీవనము. 

అటువంటి వృధా అయినటువంటి ఈ మానవ జన్మ తిరిగి పునః నువ్వు మానవ జన్మనే పొందుతావా అంటే సృష్టిధర్మములో అలాంటి అవకాశాలు చాలా తక్కువ వున్నాయి. 

కాబట్టి మానవుడవై పుట్టిన తరువాత మానవబుద్ధితో కాకుండా ఎనుబదినాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధిరూపమైనటువంటి జ్ఞానమును నీవు సముపార్జించి వున్నప్పటికీ ఆ యా జీవులయొక్క ప్రభావం నీలో బలంగా వుంది. కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం వస్తుంది. 

కస్సుబుస్సులాడుతూ వుంటారు. వాళ్లలో పాములకి సంబంధించినటువంటి వాసనాబలం మిగిలివుంటుందనమాట. కొంతమందిలో వ్యాఘ్రము వలే గాండ్రిస్తూ వుంటారు. పులులవలే గాండ్రిస్తూ వుంటారనమాట. 

వాళ్ళలో ఆ రకమైన వాసనాబలం మిగిలి వుంటుంది. కొంతమందిలో ఏనుగువలే ఘీంకరిస్తూ వుంటారు. ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మదం చాలా బలంగా వుంటుందనమాట. 

ఆ ధన మదం గానీ, విద్యామదం గానీ, రూపమదం గానీ, అష్టవిధమదములు ఏవైతే వున్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు, ప్రపంచమునే లెక్కచేయనటువంటి పద్ధతిగా మారతారనమాట. 

అటువంటివారు ప్రపంచ యుద్దాలకి కూడా కారణమైన సందర్భాలు వున్నాయనమాట. అలాంటివారందరిలో ఆ మదపుటేనుగు లక్షణం వుంటుందనమాట. 

వారిలో, ఆ మానవులై వున్నప్పటికీ కూడా, వారిలో ఆ అహంకారము, ఆ మదము అతితీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవజాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వుంటాయ్. మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవజన్మలో వున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 4 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 4 🌻*

భగవంతుడు శాశ్వతముగా ఏక కాలమందే పది వేర్వేరు వాత్రలను ధరించి నిర్వహించుచున్నాడు.

అవి
1. పరబ్రహ్మ స్తితి లో భగవంతుడు. 
2. పరమాత్మ స్థితి లో భగవంతుడు. . 
3. సృష్టికర్తగానున్న భగవంతుడు. 
4. శరీరిగానున్న భగవంతుడు, . 
5. పరిణామదశలలో భగవంతుడు. 
6. మానవరూపములో పునర్జ్దన్మలు పొందుచున్న భగవంతుడు.
7. ఆధ్యాత్మిక సాధకులలో భగవంతుడు.
8. బ్రహ్మేభూతుడైన భగవంతుడు.
9. జీవన్ముక్తునిగా భగవంతుడు.
10. సద్దురువుగను, అవతార పురుషునిగను వున్న భగవంతుడు.

భగవంతుదెలప్పుడును ఉందెను
భగవంతుదెలప్పుడును ఉండును
అతడెప్పుడును నిర్వికల్పుడే
మాయాలీలయే అతని శాశ్వత ఖేల
                         —— మెహెర్‌ బాబా

భగవంతుడు =
అనంత అస్తిత్వము
అనంత జ్ఞానము
అనంత శక్తి
అనంత ఆనందము
అనంత చైతన్యము
అనంత సర్వవ్యాపకత్వము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹