🌹 18, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 18, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, MAY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219 🌹 
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 3 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 084 / DAILY WISDOM - 084 🌹 
🌻 24. ప్రతి వ్యక్తి యొక్క కోరిక / 24. The Desire of Every Individual 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹
6) 🌹. శివ సూత్రములు - 86 / Siva Sutras - 86 🌹 
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 2 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 6 🍀*

*11. రామో రామో రఘుపతిర్బుద్ధః కల్కీ జనార్దనః |*
*గోవిందో మాధవో విష్ణుః శ్రీధరో దేవనాయకః*
*12. త్రివిక్రమః కేశవశ్చ వాసుదేవో మహేశ్వరః* |
*సంకర్షణః పద్మనాభో దామోదరపరః శుచిః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశ్వచేతన మూలస్వరూప లక్షణం- సర్వజగత్తుతో ఏకత్వం మూలమందు స్వత స్సిద్ధంగానూ, స్వయం సంపూర్ణంగానూ ఉండనే ఉన్నది. ఆభివ్యక్తం చేసుకోవలసిన అవసరం దానికి లేదు. అయినా, ప్రేమ రూపంలో అది అభివ్యక్త మగునప్పుడు, ఎంతటి గాఢమైనదైనా దాని యందొక విధమైన విశాలత, ప్రశాంతత, విశ్వజనీనత తప్పనిసరిగా ఉండితీరుతుంది. విశ్వచేతనకు మూలస్వరూప లక్షణమిది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 21:44:17
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: అశ్విని 07:23:16 వరకు
తదుపరి భరణి
యోగం: సౌభాగ్య 19:36:11 వరకు
తదుపరి శోభన
కరణం: విష్టి 10:05:06 వరకు
వర్జ్యం: 03:25:40 - 05:00:36
మరియు 17:01:48 - 18:38:16
దుర్ముహూర్తం: 10:02:48 - 10:54:42
మరియు 15:14:11 - 16:06:05
రాహు కాలం: 13:49:51 - 15:27:10
గుళిక కాలం: 08:57:55 - 10:35:14
యమ గండం: 05:43:19 - 07:20:37
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 00:15:48 - 01:50:44
మరియు 26:40:36 - 28:17:04
సూర్యోదయం: 05:43:19
సూర్యాస్తమయం: 18:41:47
చంద్రోదయం: 04:31:48
చంద్రాస్తమయం: 17:35:09
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 07:23:16 వరకు తదుపరి పద్మ
యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: దక్షిణం 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 372 / Bhagavad-Gita - 372 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 34 🌴*

*34. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమష్కురు |*
*మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ: ||*

🌷. తాత్పర్యం :
*నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము. నాకు నమస్కారము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు.*

🌷. భాష్యము : 
కృష్ణభక్తిరసభావన మొక్కటే కలుషితమైన భౌతికప్రపంచ బంధముల నుండి ముక్తిని పొందుటకు ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టముగా తెలుపబడినది. భక్తియుతసేవను శ్రీకృష్ణభగవానునికే అర్పించవలెనని స్పష్టముగా ఇచ్చట తెలుపబడిన విషయమునకు అప్రమాణికులైన గీతావ్యాఖ్యాతలు కొన్నిమార్లు అర్థమును చెరచుదురు. దురదృష్టవశాత్తు వారు సాధ్యము కానటువంటి విషయముపైకి పాఠకుని మనస్సును మళ్ళింతురు. పరతత్త్వమేగాని సామాన్యుడు కానటువంటి శ్రీకృష్ణుని మరియు అతని మనస్సుకు భేదము లేదని అట్టి వారు తెలియజాలరు. శ్రీకృష్ణుడు, అతని దేహము, అతని మనస్సు అన్నియును ఏకమే. పరిపూర్ణమే. 

ఈ విషయమునే “దేహదేహివిభేదో(యం నేశ్వరే విద్యతే క్వచిత్” యని చైతన్యచరితామృతము (ఆదిలీల పంచమాధ్యాయము 41-48) యొక్క అనుభాష్యమునందు శ్రీభక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారు కుర్మపురాణము నందు తెలుపబడినదానిని ఉదహరించియుండిరి. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు భేదభావమనునదియే లేదు. అతడు మరియు అతని శరీరము అభేదములు. కాని కృష్ణసంభందవిజ్ఞానము లేని కారణముగా అట్టి వ్యాఖ్యాతలు కృష్ణుని దేవదేవత్వమును మరుగుపరచి ఆ భగవానుడు అతని దేహము లేదా మనస్సు కన్నను అన్యుడని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది వాస్తవమునకు కృష్ణసంబంధవిజ్ఞాన రాహిత్యమేయైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు.

శ్రీమద్భాగవతము యందలి “పరమగుహ్యజ్ఞానము” అను నవమాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 372 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 34 🌴*

*34. man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru*
*mām evaiṣyasi yuktvaivam ātmānaṁ mat-parāyaṇaḥ*

🌷 Translation : 
*Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.*

🌹 Purport :
 In this verse it is clearly indicated that Kṛṣṇa consciousness is the only means of being delivered from the clutches of this contaminated material world. Sometimes unscrupulous commentators distort the meaning of what is clearly stated here: that all devotional service should be offered to the Supreme Personality of Godhead, Kṛṣṇa. Unfortunately, unscrupulous commentators divert the mind of the reader to that which is not at all feasible. Such commentators do not know that there is no difference between Kṛṣṇa’s mind and Kṛṣṇa. 

Kṛṣṇa is not an ordinary human being; He is Absolute Truth. His body, His mind and He Himself are one and absolute. It is stated in the Kūrma Purāṇa, as it is quoted by Bhaktisiddhānta Sarasvatī Gosvāmī in his Anubhāṣya comments on Caitanya-caritāmṛta (Fifth Chapter, Ādi-līlā, verses 41–48), deha-dehi-vibhedo ’yaṁ neśvare vidyate kvacit. This means that there is no difference in Kṛṣṇa, the Supreme Lord, between Himself and His body. But because the commentators do not know this science of Kṛṣṇa, they hide Kṛṣṇa and divide His personality from His mind or from His body. Although this is sheer ignorance of the science of Kṛṣṇa, some men make profit out of misleading people.

Thus end the Bhaktivedanta Purports to the Ninth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Most Confidential Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*

*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 3 🌻*

*వరుణసూక్తము పఠించుచు పుష్ప-చామర-దర్పణ-ఛత్ర-పతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, 'ఉత్తిష్ఠ' అని పనికి లేవదీసి, ఆ రాత్రికి అధివాసనము చేయించవలెను. 'వరుణం వా' అను మంత్రముచే సంనిధీకరణము చేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీకరణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. అగ్నికుండమున సమిధులతో హోమము చేయవలెను. వైదికమంత్రములతో గంగ మొదలగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్నిదిక్కులందును యవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతులచేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రముచేతను అభిమంత్రించిసూర్య-ప్రజాపతి-దివ్‌-అంతకనిగ్రహ-పృథ్వీ-దేహధృతి-స్వధృతి-రతి-రమతీ-ఉగ్ర-భీమ-రౌద్ర-విష్ణు-వరుణ-ధాతా-రాయస్పోష-మహేంద్ర-అగ్ని-యమ-నిరృతి-వరుణ-వాయు-కుబేర-ఈశ-అనంత-బ్రహ్మ-వరుణ నామములను చతుర్థ్యంతములు చేసి పలుకుచు అంతమున "స్వాహా" చేర్చి బలి ఇవ్వవలెను.. "ఇదం విష్ణుః" "తద్విప్రాసః" అను మంత్రములచే అహుతుల నీయవలెను. "సోమో ధేనువు" ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతు లిచ్చి "ఇమం మే వరుణ" అను మంత్రముతో ఒక ఆహుతి ఇవ్వవలెను. 'అపో హిష్ఠా' ఇత్యాది మంత్రత్రయముతోను 'ఇమా రుద్రా' ఇత్యాదిమంత్రముతోను కూడ ఆహుతుల నీయవలెను.*

*పిమ్మట పది దిక్కులందును బలు లిచ్చి గంధపుష్పాలతో పూజించవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధపుష్పాదుల చేతను, సువర్ణ పుష్పాదుల చేతను పూజించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలెను. 'వరుణస్య' ఇత్యాది మంత్రము చదువుచు, ఘృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరు వేరుగ నూటఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొని వచ్చి దానితో వరుణుని శిరస్సుపై అభిషేకము చేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్నియగు గౌరితో కూడిన వరుణుడు నదీనదములతో పరివేష్టితుడై యున్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాంనిధ్యకరణము చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 219 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 3 🌻*

21. The invocation should be performed with the vyāhṛtis, gāyatrī and the principal mantra. Oblation should be done with the mantra sūryāya prajāpataye dyauḥ svāhā cāntarikṣakaḥ.

22. (Ceremony is to be performed) for the earth, Dehadhṛti, Svadhṛti, Rati, Ugra, Bhīma, Raudraka.

23-24. Viṣṇu, Varuṇa, Dhātṛ, Mahendra the furtherer of riches, Agni, Yama, Nairṛta, Varuṇa, Vāyu, Kubera, Īśa, Ananta, Brahman and the lord of waters should be propitiated. with oblations reciting svāhā and (the mantras) idaṃ viṣṇuḥ[28] and tad viprāsa[29].

25. Having made oblation six times with somo dhenu[30], oblation should be made with imaṃ me[31]. Again oblation should. be done thrice with āpo hi ṣṭhā[32] (and once) with imā rudrā[33].

26. Bali (offering) should be made in the ten directions. The image should be worshipped with perfumes and flowers. The image should be lifted and placed in a mystic diagram by a wise man.

27-28. (The image) should be worshipped with perfumes. and flowers as well as golden flowers duly. The excellent priest should lay eight raised platforms filled with sand after having made ready the water tanks measuring two feet. Then clarified. butter (should be given as oblation) hundred and eight times with (the mantra) varuṇasya[34].

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 84 / DAILY WISDOM - 84 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 24. ప్రతి వ్యక్తి యొక్క కోరిక 🌻*

*విరాట్‌ స్వరూపంగా మారాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఏ కోరికకైనా ఇదే అర్థం. ఒక కప్పు టీ తీసుకున్నా, మన కోరిక ఒక్కటే; మనం సర్వవ్యాపులమవ్వాలని అనుకుంటాము. సర్వంతో ఏకత్వం చెందాలని మన అంతర్గత మనస్సు ఇచ్చే ప్రేరేపణ కోరికగా వ్యక్తమవుతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాడు సర్వస్వం అవుతాడు, అని ఉపనిషత్తు చెబుతోంది. ఇది జీవులకు ఉపనిషత్తులు ఇచ్చే ఒక గొప్ప జ్ఞానం. ఈ సృష్టి ఎలా జరిగింది, చైతన్యం అన్ని వస్తువులుగా ఎలా మారింది, ఈ విషయాలను తెలుసుకుంటే, కోరిక యొక్క మూల రూపం మీకు అర్థమవుతుంది.*

*ఇది మనచే సరిగ్గా గ్రహించబడినట్లయితే, ఈ అభివ్యక్తికి కారణమైన దానిగా మనం మారవచ్చు. అది తెలిసినవాడు దైవం అవుతాడు. అందరికీ ఉపనిషత్తు యొక్క ముగింపు మరియు ఓదార్పు సందేశం ఇదే: జ్ఞానమే అస్తిత్వం. ఈ రహస్యాన్ని మనం తెలుసు కోగలిగితే, మనం స్వయంపాలన యొక్క రహస్యంలోకి లోతుగా వెళ్ళవచ్చు, తద్వారా కోరిక ఆగిపోతుంది. చైతన్యం వస్తువు ప్రాదేశికంగా మరియు తాత్కాలికంగా తన నుండి వేరు చేయబడిందని భావించడం కోరికకు కారణం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 84 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. The Desire of Every Individual 🌻*

*The desire of every individual is to become the Virat. This is the meaning of any desire. Even if we take a cup of tea, our desire is only that; we want to become one with everything. It is a stimulation of the inner psyche towards the unification of oneself with all things. One who knows this mystery can become everything, says the Upanishad, which is a great consolation and a comfort for created beings. If we can understand what all this drama means, how this creation has taken place, how Consciousness has become all things, what desire means actually in its intention.* 

*if this is comprehended properly by us, we can become That, which has been the cause of this manifestation. One who knows it, becomes ‘That’. So is this concluding, solacing message of the Upanishad to everyone: Knowing is Being. If we can know this secret, we can go deep into the secret of self-mastery, so that desire ceases. The assumption by Consciousness that the object is spatially and temporarily cut off from itself is the cause of desire.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. 🍀*

*ప్రతి మనిషీ గుడ్డివాడుగా పుట్టాడు. ప్రతి మనిషికీ అంధకారం నించీ బయటపడే శక్తి వుంది. మనిషి గుడ్డిగా పుడతాడు. ఎందుకంటే అచేతనంగా వుంటాడు. మెలకువతో వుండడు. కేవలం జీవితం గుండా, దాని అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. అప్పుడు ఒక సందర్భంలో వ్యక్తిలో విప్లవాత్మక పరివర్తన జరుగుతుంది. అప్పుడు జీవితం వెనకటిలా వుండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 086 / Siva Sutras - 086 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 2 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*

*ఒక సాధారణ మనస్సు ఉన్న వ్యక్తి తన శరీరం వెలుపల లేదా అతని చైతన్యం వెలుపల భగవంతుని కోసం చూస్తాడు. అతను భగవంతుని యొక్క స్థూల రూపాలతో అనుబంధం కొనసాగిస్తాడు. భగవంతుడు చాలా సూక్ష్మ స్వభావం కలిగినవాడు మరియు మానవ గ్రహణశక్తికి మించినవాడు. అలాంటి వ్యక్తులు మతపరమైనవారు కానీ ఆధ్యాత్మికవాదులు కాదు. మతపరంగా ఉండడం వల్ల ముక్తి లభించదు. గరిష్టంగా, ఇది ఆధ్యాత్మికతకు పునాది వేయగలదు. భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోగలరు తప్ప స్థూల రూపంతో చూడలేరు. అందుకే, భగవంతుడిని ఎల్లప్పుడూ స్వయంలో దర్శిస్తారు. కానీ స్వయం అనేది మీకు స్థూల మానవ రూపాన్ని మాత్రమే సూచిస్తుంది. భ్రాంతితో బాధపడుతున్న మనస్సు ద్వంద్వవాదానికి దారి తీస్తుంది, ఇది భగవంతుడిని భిన్నమైన వ్యక్తిగా చూపుతుంది. స్వీయం (స్థూల మానవ రూపం) గురించిన జ్ఞానం అజ్ఞానమని, కలతో పోల్చబడింది. అలాంటి మనుష్యులు భగవంతుని దర్శనం చేసుకునే బదులు భగవంతుడిని చూడడానికి విఫల ప్రయత్నాలు చేస్తారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 086 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 2 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*

*A person with an ordinary mind will look for the Lord either outside his body or beyond his consciousness and he continues to be associated with gross forms of Lord. Lord is extremely subtle in nature and beyond human perception. Such persons are religious but not spiritual. Being religious does not lead to liberation. At the most, it can lay a foundation for spiritualism. The Lord can only be realised and cannot be seen with a gross form. That is why, Lord is always referred as Self and self only refers to gross human form. A mind afflicted with illusion leads to dualism, which shows Lord as a different entity. The knowledge about self (gross human form) is said to be ignorant and compared to a dream. Such men make abortive attempts to see the Lord instead of visualizing Him.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 455. 'హంసినీ' - 2 🌻


శ్వాస యందలి ఉచ్ఛ్వాసను ఏకాగ్రతతో గమనించినచో 'సో' అను శబ్దము వినిపించును. అట్లే నిశ్వాసను గమనించినచో 'హం' అను శబ్దమును గమనించవచ్చును. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసలపై పూర్ణముగ దీర్ఘకాలము లగ్నము కావించినపుడు శ్వాస మూలమైన స్పందనమునకు మనస్సు చేరును. ఇట్లు చేరుటను అంతర్ముఖ మగుట అందురు. మనస్సు ఇట్లు అంతర్ముఖమైనపుడు స్పందనము కూడ ద్వయాక్షర మంత్రమగు 'సోం హం' అను మంత్రమును శబ్దించు చున్నట్లుగ కనిపించును. శ్వాస శబ్దము, స్పందన శబ్దము సో హం. 'సో' అనినపుడు వ్యాకోచము చెందుట, 'హం' అనునపుడు సంకోచము చెందుట గమనింపవచ్చును. ఇచ్చట అనుట అనగా జరుగుటయే. స్పందనము సంకోచ వ్యాకోచ ప్రజ్ఞ. దాని ననుసరించియే శ్వాస కూడ సంకోచ వ్యాకోచమై జరుగుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 455. 'Hamsini' - 2 🌻


If you concentrate on breathing and exhalation, you will hear the sound 'so'. Similarly, if you observe the breath of inhalation, you will notice the sound 'hum'. When the mind is fully engaged with the inhales and exhales, the mind reaches the response which is the source of the breath. Such a joining is called an introspection. When the mind is thus introverted, the response also seems to be like reciting the two-syllable mantra 'Som Ham'. The sound of breathing, the sound of response is so hum. It can be observed that 'So' is expanded and 'Hum' is contracted. To say, here, means to happen. Response is the pragnya of contraction and expansion. Following it, the breathing is also going on contraction and expansion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 351. FREEDOM AND LOVE / ఓషో రోజువారీ ధ్యానాలు - 351. స్వేచ్ఛ మరియు ప్రేమ




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 351 / Osho Daily Meditations - 351 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 351. స్వేచ్ఛ మరియు ప్రేమ 🍀

🕉. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారు స్వేచ్ఛగా ఉంటారు. వారికి స్వేచ్ఛ ఉంది; ప్రేమ ఒక విధి కాదు. వారు ఒకరికొకరు ఇచ్చే స్వేచ్ఛగా ఇచ్చుకునే ప్రేమ అది, మరియు వారు వద్దు అని చెప్పే స్వేచ్ఛ ఉంది. 🕉

ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు అవును అని చెబితే, అది వారి నిర్ణయం--అది ఒక బాధ్యత కాదు, ఏ నిరీక్షణను నెరవేర్చడం కాదు. ఎందుకంటే మీరు ప్రేమను ఇవ్వడం ఇష్టపడతారు, మీరు ఇస్తారు. మరియు మీరు ఏ క్షణంలోనైనా మార్చవచ్చు, ఎందుకంటే వాగ్దానం చేయలేదు, నిబద్ధత చేయలేదు. మీరు ఇద్దరు స్వేచ్ఛా వ్యక్తులుగా మిగిలిపోతారు - స్వేచ్ఛగా కలుసుకోవడం, స్వేచ్ఛగా ప్రేమించడం, కానీ మీ వ్యక్తిత్వం మరియు మీ స్వేచ్ఛ చెక్కుచెదరకుండా ఉంటాయి. అదే ప్రేమయొక్క అందం!

అందం అంటే ప్రేమ మాత్రమే కాదు; అది ప్రేమ కంటే స్వేచ్ఛ. అందం యొక్క ప్రాథమిక అంశం స్వేచ్ఛ; ప్రేమ ఒక ద్వితీయ పదార్ధం. ప్రేమ కూడా స్వేచ్ఛతో అందంగా ఉంటుంది, ఎందుకంటే స్వేచ్ఛ అందంగా ఉంటుంది. స్వేచ్ఛ పోయిన తర్వాత, ప్రేమ వికారమవుతుంది. అప్పుడు ఏమి జరిగిందో మీరు ఆశ్చర్యపోతారు. ఆ అందమంతా ఎక్కడికి పోయింది?


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 351 🌹

📚. Prasad Bharadwaj

🍀 351. FREEDOM AND LOVE  
🍀

🕉. When two people are in love they are free, individuals. They have freedom; love is not a duty. It is out if their freedom that they give to each other, and they are free to say no. 🕉


If people in love say yes to each other, that is their decision--it is not an obligation, it is not a fulfillment of any expectation. Because you enjoy giving love, you give. And any moment you can change, because no promise has been made, no commitment has been made. You remain two free individuals-meeting out of freedom, loving out of freedom, but your individuality and your freedom are intact. Hence the beauty of love!

The beauty is not only of love; it is more of freedom than of love. The basic ingredient of beauty is freedom; love is a secondary ingredient. Love is also beautiful with freedom, because freedom is beautiful. Once the freedom is gone, love becomes ugly. Then you will be surprised at what has happened. Where has all that beauty gone?


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 732 / Sri Siva Maha Purana - 732


🌹 . శ్రీ శివ మహా పురాణము - 732 / Sri Siva Maha Purana - 732 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴

🌻. త్రిపుర దహనము - 5 🌻

కొందరు సగము కాలి తెలివి తెచ్చుకొని మోమముతో ఇటునటు పరువలెత్తి మూర్ఛిల్లిరి. ఘోరమగు ఆ అగ్నిచే దహింపబడని సూక్ష్మమగు వస్తవు అయిననూ ఆ త్రిపురములో లేకుండెను (38). కదలాడని జడములు గాని, కదలాడే ప్రాణులు గాని దహింపబడకుండగా విడువబడినవి అచట లేకుండెను. రాక్షసుల విశ్వకర్మయగు మయాసురునకు వినాశము లేదు. ఆయన తక్కసర్వము నశించెను (39).

యముడు దేవతలకు విరోధి కాదు. ఆపత్కాలమునందైననూ మహాభక్తుడు, మహేశుని శరణు పొందిన వాడు అగు యముడు శంభుని తేజస్సుచే రక్షింపబడెను (40). రాక్షసులు గాని, ఇతర ప్రాణులు గాని చేయు కర్మలు, పరిత్యజించు కర్మలు, మరియు వారి రాగద్వేషములు పతనహేతువులు కానిచో, వారికి వినాశము కలుగదు (41). కావున సత్పురుషులు మిక్కిలి యోగ్యమగు కర్మను ఆచరించుటకై యత్నించవలెను. పాపకర్మచు ఇహపరములు నశించును. కావున అట్టి నిందనీయమగు కర్మను చేయరాదు (42). త్రిపురవాసులకు ఘటిల్లిన సంగము వంటి సంగము ఇతరులకు కలుగకుండు గాక ! అట్టి సంగము దైవవశమున సంప్రాప్తమైనచో, దానిని సర్వులు స్వీకరించవలసినదే గదా! (43). ఆ రాక్షసులు బంధులతో గూడి త్రిపురములో నున్నవారై శివుని పూజించిరి గదా! వారందరు ఆ శివపూజానుష్ఠనప్రభావముచే గాణపత్య స్థానమును పొందిర (44).

శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో త్రిపురదాహ వర్ణనమనే పదియవ ఆధ్యాయము ముగిసినది (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 732🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴

🌻 The burning of the Tripuras - 5 🌻


38-39. Some who were partially burnt woke up and rushed here and there. They fell unconscious and fainted. There was not even a minute particle whether mobile or immobile which escaped unscathed by that terrible Tripura fire excepting Maya, the imperishable Viśvakarman of the Asuras.

40. Those who were not opposed to the Gods were saved by Śiva’s brilliance, those who devoutly sought refuge in lord Śiva at the time of adversity.

41. Whether Asuras or other beings those whose collective activities were not destructive were saved; others of contrary activities were burnt in fire.

42. Hence, all possible efforts shall be made by good men to avoid despicable activities whereby people waste away themselves.

43. Let there be no predicament to any as it happened in regard to the residents of the three cities. This is the opinion of all. By chance if it happens, let it.

44. Those who worshipped Śiva along with their family attained Gaṇapati’s region, thanks to the worship of Siva.


Notes on the Burning of Tripura:

The Purāṇas accord different versions of the burning of Tripurī. The present version is a regular legend based on an ancient tradition. There is however another version which describes graphically the devastation, oppression and barbarities practiced by the Gaṇas which remind us of those perpetrated by the Hūṇa-chief Mihirakula in his invasions There is a veiled allusion to this event, for Agni is addressed as a Mleccha (Matsya p. I88. 51). There is no such anachronism in the ŚP account of Tripuradāha.


Continues....

🌹🌹🌹🌹🌹




విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 771 / Vishnu Sahasranama Contemplation - 771



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 771 / Vishnu Sahasranama Contemplation - 771🌹

🌻771. చతుర్వేదవిత్‌, चतुर्वेदवित्‌, Caturvedavit🌻

ఓం చతుర్వేదవిదే నమః | ॐ चतुर्वेदविदे नमः | OM Caturvedavide namaḥ


యథావత్ వేత్తి వేదానాం చతుర్ణామర్థమచ్యుతః ।
ఇతి స చతుర్వేదవిదితి కఙ్కీర్త్యతే బుధైః ॥

నాలుగు వేదములను, వాని అర్థములను కూడ ఉన్నవి ఉన్నట్లు వాస్తవరూపమున ఎరుగును కనుక చతుర్వేదవిత్‍.


:: శ్రీమద్భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగము ::

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్స్మృతిర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥

నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదమును ఏరిగినవాడనుగూడ నేనే అయియున్నాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 771🌹

🌻771. Caturvedavit🌻

OM Caturvedavide namaḥ


यथावत् वेत्ति वेदानां चतुर्णामर्थमच्युतः ।
इति स चतुर्वेदविदिति कङ्कीर्त्यते बुधैः ॥

Yathāvat vetti vedānāṃ caturṇāmarthamacyutaḥ,
Iti sa caturvedaviditi kaṅkīrtyate budhaiḥ.

Since He know the four Vedas and their meaning correctly, He is called Caturvedavit.


:: श्रीमद्भगवद्गीत पुरुषोत्तमप्राप्ति योग ::

सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्स्मृतिर्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदन्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 15

Sarvasya cāhaṃ hr‌di sanniviṣṭo mattaḥ ssmr‌tirjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo vedantakr‌dvedavideva cāham. 15.

And I am seated in the hearts of all. From Me are memory, knowldge and their loss. I alone am the object to be known through all of the Vedas; I am also the originator of the Vedanta and I Myself am the knower of the Vedas.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 179 / Kapila Gita - 179


🌹. కపిల గీత - 179 / Kapila Gita - 179 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 33 🌴


33. ధ్యానాయనం ప్రహసితం బహులాదరోష్ఠభాసారుణాయితతనుద్విజకుందపంక్తి|
ధ్యాయేత్ స్వదేహకుహరేఽవసితస్య విష్ణోః భక్త్యాఽఽర్ధ్రయార్పితమనా న పృథగ్దిదృక్షేత్॥

తాత్పర్యము : శ్రీహరియొక్క దంతపంక్తి (పలువరస) మల్లెపూవులవలె శ్వేతకాంతులచే విరాజిల్లుచు, పెదవుల యొక్క అరుణకాంతులతో మిశ్రితమై శోభిల్లుచుండును. అట్టి దంతశోభలతో అలరారుచుండెడి ఆ స్వామి దరహాసము ఎంతయు ధ్యానార్హమైనది. అట్టి శ్రీహరి చిరునవ్వును తన హృదయమునందు నిలుపుకొని, మిక్కిలి ప్రేమార్ద్ర భావముతో భక్తుడు అనన్యమనస్కుడై ధ్యానింపవలెను.

వ్యాఖ్య : యోగి భగవంతుని చిరునవ్వును చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత అతని నవ్వును దృశ్యమానం చేయాలని సిఫార్సు చేయబడింది. చిరునవ్వు, నవ్వు, ముఖం, పెదవులు మరియు దంతాలపై ధ్యానం యొక్క ఈ ప్రత్యేక వర్ణనలు భగవంతుడు వ్యక్తిత్వం లేనివాడు కాదని నిశ్చయంగా సూచిస్తున్నాయి. విష్ణువు యొక్క నవ్వు లేదా చిరునవ్వు గురించి ధ్యానం చేయాలని ఇక్కడ వివరించబడింది. భక్తుని హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేయగల కార్యకలాపం మరొకటి లేదు. విష్ణువు యొక్క నవ్వు యొక్క అసాధారణ సౌందర్యం ఏమిటంటే, అతను మల్లెపూల మొగ్గలను పోలి ఉండే అతని చిన్న దంతాలు నవ్వినప్పుడు, అతని గులాబీ పెదవులను ప్రతిబింబిస్తూ ఒక్కసారిగా ఎర్రగా మారుతాయి. యోగి తన హృదయంలో భగవంతుని అందమైన ముఖాన్ని ఉంచగలిగితే, అతను పూర్తిగా సంతృప్తి చెందుతాడు. మరో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తనలో ఉన్న భగవంతుని అందాన్ని చూడటంలో లీనమైనప్పుడు, భౌతిక ఆకర్షణ అతనికి అంతరాయం కలిగించదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 179 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 33 🌴

33. dhyānāyanaṁ prahasitaṁ bahulādharoṣṭha- bhāsāruṇāyita -tanu-dvija-kunda-paṅkti
dhyāyet svadeha-kuhare 'vasitasya viṣṇor bhaktyārdrayārpita-manā na pṛthag didṛkṣet

MEANING : With devotion steeped in love and affection, the yogī should meditate within the core of his heart upon the laughter of Lord Viṣṇu. The laughter of Viṣṇu is so captivating that it can be easily meditated upon. When the Supreme Lord is laughing, one can see His small teeth, which resemble jasmine buds rendered rosy by the splendor of His lips. Once devoting his mind to this, the yogī should no longer desire to see anything else.

PURPORT : It is recommended that the yogī visualize the laughter of the Lord after studying His smile very carefully. These particular descriptions of meditation on the smile, laughter, face, lips and teeth all indicate conclusively that God is not impersonal. It is described herein that one should meditate on the laughter or smiling of Viṣṇu. There is no other activity that can completely cleanse the heart of the devotee. The exceptional beauty of the laughter of Lord Viṣṇu is that when He smiles His small teeth, which resemble the buds of jasmine flowers, at once become reddish, reflecting His rosy lips. If the yogī is able to place the beautiful face of the Lord in the core of his heart, he will be completely satisfied. In other words, when one is absorbed in seeing the beauty of the Lord within himself, the material attraction can no longer disturb him.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, మే, May 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, మాసిక శివరాత్రి, Pradosh Vrat, Masik Shivaratri. 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 23 🍀

23. అమంగలం విశ్వమిదం సహాత్మభిః అయోగసంయోగయుతం ప్రణశ్వరమ్ |
తతః పరం మంగలరూపధారకం నమామి మాంగల్యపతిం సుశాంతిదమ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : విశ్వ ప్రేమానుభవం - పరమాత్మ స్పర్శ పొందనేర్చిన సాధకుడు స్వయంగా తాను విశ్వ ప్రేమానుభవం లేనివాడైనా, పరమాత్మకు గల విశ్వ ప్రేమను - అనగా సమస్త భూతజాలము నందు గల ప్రేమను తెలుసుకో గలడనియే చెప్పవచ్చును. ఆ తెలివియే తుదకాతనిని సహజంగా విశ్వ ప్రేమానుభవ సంపన్నునిగా చేయగలుగుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: కృష్ణ త్రయోదశి 22:30:24

వరకు తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: రేవతి 07:39:30 వరకు

తదుపరి అశ్విని

యోగం: ఆయుష్మాన్ 21:17:20

వరకు తదుపరి సౌభాగ్య

కరణం: గార 11:02:12 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 11:46:35 - 12:38:27

రాహు కాలం: 12:12:31 - 13:49:45

గుళిక కాలం: 10:35:17 - 12:12:31

యమ గండం: 07:20:50 - 08:58:04

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37

అమృత కాలం: 05:32:36 - 43:07:08

సూర్యోదయం: 05:43:36

సూర్యాస్తమయం: 18:41:25

చంద్రోదయం: 03:52:44

చంద్రాస్తమయం: 16:39:05

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 07:39:30 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹