🌹 23, FEBRUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 23, FEBRUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 23, FEBRUARY 2023 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 138 / Kapila Gita - 138 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 22 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 22 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 730 / Vishnu Sahasranama Contemplation - 730 🌹 
🌻🌻730. యత్, यत्, Yat🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 691 / Sri Siva Maha Purana - 691 🌹 *🌻. శివ స్తుతి - 4 / The Prayer of the gods - 4 🌻*
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 312 / Osho Daily Meditations - 312 🌹 🍀🍀 312. అభౌతిక విజ్ఞానం / 312. METAPHYSICS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 -1 🌹 🌻 435. 'కోమలాకారా’ - 1 / 435. 'Komalakara' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹23, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi 🌺*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 28 🍀*

28. విశేష విత్పారిష దేషు నాథ
విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు
జిగీషతో మే కవితార్కి కేంద్రాన్
జిహ్వాగ్ర సింహాసన మభ్యుపేయాః ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆచరణ యందు దోషాలుంటాయనే కారణాన కర్మను మాని వేయడం కంటే, వాటి నిర్మూలనకై కర్మను సాధనగా చేపట్టడం శ్రేయస్కరం. దోషాలు రాకూడదన్న దృఢసంకల్పం కలిగి వుండి, నీ కోశ సంశుద్ధికి దేవీశక్తి నాహ్వానిస్తూండే పక్షంలో ఆ దోషాలు రానేరావు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల చవితి 25:35:34 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: రేవతి 27:45:44 వరకు
తదుపరి అశ్విని
యోగం: శుభ 20:57:14 వరకు
తదుపరి శుక్ల
కరణం: వణిజ 14:29:39 వరకు
వర్జ్యం: 02:22:00 - 43:38:16
దుర్ముహూర్తం: 10:32:30 - 11:19:19
మరియు 15:13:20 - 16:00:08
రాహు కాలం: 13:57:16 - 15:25:02
గుళిక కాలం: 09:34:00 - 11:01:46
యమ గండం: 06:38:30 - 08:06:15
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: -
సూర్యోదయం: 06:38:30
సూర్యాస్తమయం: 18:20:32
చంద్రోదయం: 08:53:02
చంద్రాస్తమయం: 21:28:57
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 27:45:44 వరకు తదుపరి 
మానస యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 138 / Kapila Gita - 138 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 22 🌴*

*22. జ్ఞానేన దృష్టతత్త్వేన వైరాగ్యేణ బలీయసా|*
*తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మసమాధినా॥*

*తాత్పర్యము : తత్త్వసాక్షాత్కారమొనర్చు జ్ఞానము వలనను, ప్రబలమైన వైరాగ్యము వలనను, వ్రత నియమాదులతో గూడిన ధ్యానాభ్యాసము వలనను,*

 *వ్యాఖ్య : అన్ని యోగాలతో సహకరించిన భక్తి యోగముతో పరమాత్మను ఆరాధిస్తే. అలా ఆరాధించబడిన పరమాత్మతోటి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ శరీరములో ఎలా ఆత్మ ఉంటుందో, అలాగే పరమాత్మ జీవాత్మకి అంతర్యామిగా ఉంటాడు. ఆత్మ లేని శరీరానికి ఎలా ఉనికి లేదో, పరమాత్మ లేని జీవాత్మకు కూడా ఉనికి ఉండదు. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం కలగాలి. ఈ జీవాత్మకు మోక్షమని పరమాత్మ ప్రాప్తిని అంటారు. పరమాత్మ ప్రాప్తి, ఆత్మ స్వరూప జ్ఞ్యానముతో వస్తుంది. ఎలాంటి ఆత్మ స్వరూప జ్ఞ్యానం? పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం. పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన మనదగ్గరకు రావాలి. ఆ ఆనందం మనం పొందేది కాదు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 138 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 22 🌴*

*22. jñānena dṛṣṭa-tattvena vairāgyeṇa balīyasā*
*tapo-yuktena yogena tīvreṇātma-samādhinā*

*MEANING : This devotional service has to be performed strongly in perfect knowledge and with transcendental vision. One must be strongly renounced and must engage in austerity and perform mystic yoga in order to be firmly fixed in self-absorption.* 

*PURPORT : Devotional service in Kṛṣṇa consciousness cannot be performed blindly due to material emotion or mental concoction. It is specifically mentioned here that one has to perform devotional service in full knowledge by visualizing the Absolute Truth. We can understand about the Absolute Truth by evolving transcendental knowledge, and the result of such transcendental knowledge will be manifested by renunciation. That renunciation is not temporary or artificial, but is very strong. It is said that development of Kṛṣṇa consciousness is exhibited by proportionate material detachment, or vairāgya. If one does not separate himself from material enjoyment, it is to be understood that he is not advancing in Kṛṣṇa consciousness. Renunciation in Kṛṣṇa consciousness is so strong that it cannot be deviated by any attractive illusion. One has to perform devotional service in full tapasya, austerity. " Yoga indriya-saṁyamaḥ. Yogena implies that one is seriously absorbed in the self and is able, by development of knowledge, to understand his constitutional position in relationship with the Superself. In this way one becomes fixed in devotional service, and his faith cannot be shaken by any material allurement.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 730 / Vishnu Sahasranama Contemplation - 730 🌹*

*🌻730. యత్, यत्, Yat🌻*

*ఓం యస్మై నమః | ॐ यस्मै नमः | OM Yasmai namaḥ*

*యచ్ఛబ్దేన స్వతస్సిద్ధవస్తూద్దేశ ప్రవాచినా ।*
*బ్రహ్మ నిర్దిశ్యత ఇతి యద్యతో వేతి వేదతః ॥*

*'యత్‍' అను సంస్కృతసర్వనామము "ఏది కలదో అది" అని తెలుపుచు, ఇతః పూర్వమే స్వతః సిద్ధమగు వస్తువును ఉద్దేశించి చెప్పుటను తెలుపును. బ్రహ్మ తత్త్వము స్వతః సిద్ధ వస్తువే కదా! కావున పరమాత్మునకు 'యత్‍' అను నామము చెల్లును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 730🌹*

*🌻730.Yat🌻*

*OM Yasmai namaḥ*

यच्छब्देन स्वतस्सिद्धवस्तूद्देश प्रवाचिना ।
ब्रह्म निर्दिश्यत इति यद्यतो वेति वेदतः ॥

*Yacchabdena svatassiddhavastūddeśa pravācinā,*
*Brahma nirdiśyata iti yadyato veti vedataḥ.*

*'Yat' is generally used to indicate what is existent, a siddha vastu. By it Brahman is referred to. So Yat means Brahman that is, the Lord.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥
ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 691 / Sri Siva Maha Purana - 691 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. శివ స్తుతి - 4 🌻*

వేదము నీ స్వరూపమే. నీ ముఖమే వేదము. సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడచువారిచే పొందబడెదవు. నీకు అనేక నమస్కారములు (29). వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యము, ప్రియమైనవాడు, సత్యవర్తనముచే పొందగినవాడు అగు నీకు నమస్కారము (30). మాయావి, మాయను వశము చేసుకున్నవాడు అగు నీకు అనేక నమస్కారములు. బ్రహ్మనుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు అగు నీకు నమస్కారము (31). ఓ ఈశ్వరా! తపస్స్వరూపుడవగు నీవు తపస్సును చేయువారికి ఫలమునిచ్చెదవు. స్తుతిస్వరూపుడవగు నీవు నిత్యము భక్తులచే స్తుతింపబడెదవు. నీ మనస్సు భక్తుల స్తుతిచే మిక్కిలి ఆనందించును (32).

వేదోక్త కర్మానుష్ఠానముచే ప్రసన్నుడవగు వాడు, స్మృతి విహిత ధర్మమునందు ప్రీతిగలవాడు, జరాయుజ, ఉద్భిజ, ఆండజ, స్వేదజములను ప్రాణులే స్వరూపమైనవాడు, జలములో మరియు భూమిపై నివసించే ప్రాణులే స్వరూపముగా గలవాడు అగు నీకు నమస్కారము (33). ఓ దేవా! దేవతలు మొదలగు వారందరిలో శ్రేష్ఠులు నీ విభూతులే. దేవతలలో ఇంద్రుడు నీవే. గ్రహములలో సూర్యుడు నీవే (34). లోకములలో సత్యలోకము నీవే. నదులలో మందాకిని నీవే. వర్ణములలో శ్వేత వర్ణమునీవే. సరస్సులలో మానస సరోవరము నీవే (35). పర్వతములలో హిమవంతుడవు నీవే. గోవులలో కామధేనువు నీవే. సముద్రములలో పాలసముద్రము నీవే. లోహములలో బంగారము నీవే (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 691🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴*

*🌻 The Prayer of the gods - 4 🌻*

29. Obeisance to Thee whose form is the Veda, obeisance to the reciter of the Vedas. Obeisance to Thee who traversest the path of good conduct and who art approachable through the path of good conduct.

30. Obeisance to Thee the glory-seated; to the Truth-ful, beloved of truth, to the truth. Obeisance to Thee know-able through the truth. was a wrestler in Kaṃsa’s service. He was slain by Kṛṣṇa. 

31. Obeisance to Thee possessed of magic-power, obeisance to the lord of magic; Obeisance to Thee (knowable through the Vedas), to Brahman, to the one born of Brahmā.

32. Obeisance to Thee, O lord, the penance, the bestower of the fruits of penance, obeisance to thee, worthy of eulogy, the eulogy, and to Thee whose mind is pleased with eulogy always.

33. Obeisance to Thee delighted with vedic conduct, to the one fond of praiseworthy conduct; to the one who has fourfold forms and the forms of aquatic and terrestrial beings.

34. O lord, the gods and all others, being excellent, are your excellences. Among the gods you are Indra; among the planets you are the sun.

35. Among the worlds you are Satyaloka. Among the rivers you are the celestial river Gaṅgā. Among the colours you are the white colour. Among the lakes you are the Mānasa lake.

36. Among the mountains you are the Himālaya mountain. Among the cows you are the Kāmadhenu1, Among the oceans you are the milk ocean. Among the metals you are gold.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 312 / Osho Daily Meditations - 312 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 312. అభౌతిక విజ్ఞానం 🍀*

*🕉. అభౌతికం అనేది విశేషమైనది. భౌతికమే అంతా, పదార్ధమే అంతా అని భావించే వారు జీవితపు చుట్టుకొలతలతో సంతృప్తి చెందుతారు. వారు గుండ్రంగా తిరుగుతూ ఉంటారు, కానీ వారు ఎప్పటికీ ఇంటికి రాలేరు, ఎందుకంటే ఇల్లు మధ్యలో ఉంది. 🕉*

*అభౌతిక అవగాహన అంటే ఇంటికి రావడం. మీరు చైతన్యం అని తెలుసుకోవడం, ఉనికి మొత్తం చైతన్యంతో నిండి ఉందని తెలుసుకోవడం. చైతన్యం, పదార్థం యొక్క ఉప ఉత్పత్తి కాదని తెలుసుకోవడం. పదార్థం అనేది చైతన్యం యొక్క శరీరం మాత్రమే - దాని దుస్తులు, దాని ఆశ్రయం, దాని నివాసం, దాని ఆలయం. కానీ చైతన్యం దేవత, మరియు ఆలయం ఆ దేవత కోసం సృష్టించ బడింది. చైతన్యం ఉన్నందున పదార్థం ఉనికిలో ఉంది, చైతన్యం నిద్రలో ఉన్నప్పుడు పదార్ధం ఉంది. స్పృహ అనేది పదార్థంలోని మేల్కొలుపు. అంతిమంగా ఒకే ఒక్క విషయం ఉంది. దీన్ని దేవుడు లేదా సత్యం లేదా మీరు కోరుకున్నది అని పిలవండి. అంతిమంగా ఆ ఒక్క విషయం మాత్రమే ఉంది, కానీ ఆ విషయం రెండు స్థితులను కలిగి ఉంటుంది. ఒకటి నిద్ర, రెండవది మేల్కొలుపు.*

*పదార్థం తనను తాను తెలుసుకుంటే అది చైతన్యం. చైతన్యం తనను తాను మరచి పోయినప్పుడు అది పదార్థం. కాబట్టి పదార్ధమే అంతా అని భావించే వారు నిద్రలోనే ఉంటారు. వారి జీవితాలు చీకట్లో తడుముతూనే ఉంటాయి. కాంతి అంటే ఏమిటో వారికి ఎప్పటికీ తెలియదు, వారు ఎప్పుడూ ఉదయాన్ని చేరుకోలేరు. సహజంగానే చీకటిలో వారు చాలా పొరపాట్లు చేస్తారు మరియు తమను మరియు ఇతరులను కూడా బాధపెడతారు. వారి జీవితమంతా సంఘర్షణ, ఘర్షణ, హింస, యుద్ధం మాత్రమే ఉంటుంది. ప్రేమ అంటే ఏమిటో వారికి ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మీరు కాంతితో నిండినప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది. అభౌతిక విజ్ఞానం ఒక రకమైన మధురమైన జ్ఞానం. తర్కం అనేది చేదు, గొడవ. తార్కికవేత్తలు నిరంతరం కలహించు కుంటారు. తనను తాను తెలుసుకున్న వాడు మధురమైన వాడు; అతని ఉనికి తేనె లాంటిది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 312 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 312. METAPHYSICS 🍀*

*🕉. The word meta means beyond. Physics is not all, and matter is not all, and those who think that it is are satisfied with the circumference of life. They will keep moving round and round, but they will never come home, because home exists at the center. 🕉*

*Metaphysics means coming home, knowing that you are consciousness, knowing that the whole of existence is full of consciousness, that consciousness is not a byproduct of matter. It is not. Matter is only the body of consciousness-its clothing, its shelter, its abode, its temple-but the deity is consciousness, and the temple is created for the deity, not vice versa. Matter exists because consciousness exists, not vice versa. Matter is consciousness asleep; consciousness is matter become awakened. There is ultimately only one thing--call it x, y, or z or God or truth or whatever you wish. Ultimately there is one thing, but that one thing can have two states: one of sleep and one of awakeness.*

*When matter becomes aware of itself it is consciousness. When consciousness forgets itself it is matter. So those who think that matter is all remain asleep. Their lives remain just a groping in darkness. They never know what light is, they never reach the dawn. And naturally in darkness they stumble much and hurt themselves and others too, and their whole life consists only of conflict, friction, violence, war. They never come to know what love is, because love is possible only when you are full of light. Metaphysics is a kind of sweet wisdom. Logic is bitter, quarrelsome; philosophers continuously quarrel. The one who has known himself is sweet; his very presence is like honey.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 435 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।*
*కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀*

*🌻 435. 'కోమలాకారా’ - 1 🌻* 

*కోమల మగు ఆకారము కలది శ్రీమాత అని అర్థము. ఆకారము కోమలమైనపుడు ఆకర్షణ యుండును. అట్టి ఆకర్షణకు కారణము శ్రీమాత అస్థిత్వమే. వెతికిననూ ఎచ్చటనూ మలినము కానరాని ఆకారము కోమలమై యుండును. అట్టి ఆకారము నందు పారదర్శకత్వ మున్నది. పాదర్శక మున్నచోట ప్రకాశము హెచ్చుగ నుండును. ఈ ప్రకాశమే ఆకర్షణకు కారణము. పదార్థము సుకుమార మైనప్పుడు, మరణము లేనపుడు ప్రకాశము హెచ్చుగ నుండును. ఈ కారణముగనే పుష్పముల యందు, లేత చిగుళ్ళ యందు, పసిబిడ్డల యందు ఆకర్షణ ఎక్కువగ గోచరించును. పదార్థము ముదిరిన కొలది ప్రకాశము మరుగున పడును. అట్టి సమయమున ఆకర్షణగ లేకపోగా వికారము హెచ్చై యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 435 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 93. Kushala komalakara kurukulla kuleshvari*
*Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻*

*🌻 435. 'Komalakara' - 1 🌻*

*It means Srimata' has a tender form. There is charm when the form in tender. The reason for such attraction is the existence of Srimata itself. The form is tender as there is no impurity. There is transparency in that form. There is an exaggerated brightness in transparency. This brightness is the reason for attraction. When matter is delicate, when there is immortality, there is an exaggerated brightness. This is the reason why the attractiveness of flowers, tender plant shoots and babies is more noticeable. As the matter progresses to less delicate, the brightness fades. At that time it is not attractive but the ugly.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 044 - 14. Dṛśyaṁ śarīram - 3 / శివ సూత్రములు - 044 - 14. దృశ్యం శరీరం - 3


🌹. శివ సూత్రములు - 044 / Siva Sutras - 044 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 14. దృశ్యం శరీరం - 3 🌻

🌴. ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 🌴


ఎవరైనా కింది స్థాయిలను అధిగమించగలిగితే, అతను పరమాత్మ యొక్క సర్వవ్యాప్తతను అనుభవించడం ప్రారంభిస్తాడు. యోగి మూడు సాధారణ స్థాయి చైతన్యాలను అధిగమించి, అలా చేయడం ద్వారా, అతను విశ్వ వ్యాప్త చైతన్యం అయిన శివుడిని గుర్తించడం ప్రారంభిస్తాడు. ఫలితంగా బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతాడు.

అతను మొత్తం విశ్వాన్ని శివునిగా భావిస్తాడు. అతనికి శివునికి మించిన స్థితి లేదు. అతని వ్యక్తిగత అనుభవం శివునికి భిన్నంగా లేదు, వేడికి అగ్నికి భిన్నంగా లేనట్లుగా. మాయ వలన ఏర్పడిన ఈ వ్యక్తిగత అహంకారమే అన్ని కష్టాలకు కారణం. వాస్తవంగా సర్వం ఈశ్వర మయం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 044 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 14. Dṛśyaṁ śarīram - 3 🌻

🌴. The body is the visible self. It houses the true self, which is invisible.🌴


If one is able to transcend the lower levels, he begins to feel omnipresence of the Divine. The yogi transcends all the three normal level of consciousness and by doing so, he begins to recognize Shiva, the universal consciousness within, resulting in bliss.

He feels the whole universe as a single entity, Shiva. For him there is no other state other than Shiva. His individual experience is not distinct from Shiva, like the heat is not different from fire. Individual identification is the cause for pains and miseries. Individual identification unfolds only due to mistaken identity caused by māya. Reality is sarvaṃ īsvara mayaṃ (सर्वं ईस्वर मयं)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 307


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 307 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. వ్యక్తి లొంగిపోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి. 🍀


విజయానికి ప్రేమ ఒక్కటే వంతెన. కానీ అది వింతైన వంతెన. కానీ ప్రేమకు అవసరమయిన మొదటి విషయం ఆత్మ సమర్పణ. అది లొంగిపోవడం ద్వారా పొందే విజయం. అందువల్ల అక్కడ అద్భుత సౌందర్యముంది. అది దౌర్జన్య పూరితం కాదు, స్వీకరించే తత్వం. అది ఆక్రమించడం ద్వారా కాదు. లొంగిపోవడం ద్వారా విజయం సాధిస్తుంది.

దేవుణ్ణి ఆక్రమించు కోవాలనుకున్న వాళ్ళు బుద్ధిహీనులు. అది వాళ్ళ వల్ల కాదు. వివేకవంతులు దేవుడికి లొంగి పోతారు. తమకి ఆక్రమించు కొమ్మని ఆహ్వానిస్థారు. దేవుణ్ణి సొంతం చేసుకోలేవు, నువ్వు దేవుడికి సొంతం కావచ్చు. ప్రేమ లొంగిపోవడానికి సిద్ధపడుతుంది. వ్యక్తి లొంగి పోవాలి. సంపూర్ణంగా లొంగిపోవాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 42 - 11. The Object of Meditation / నిత్య ప్రజ్ఞా సందేశములు - 42 - 11. ధ్యాన వస్తువు


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 42 / DAILY WISDOM - 42 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 11. ధ్యాన వస్తువు 🌻


ధ్యానవస్తువు అనేది మన స్థితికి అనుగుణంగా ఉండే వాస్తవికత నుండి అయి ఉండాలి. ఇది ఒక సూత్రం లాగా మీకు అనిపించవచ్చు. మన ప్రస్తుత స్థాయి జ్ఞానం మరియు గ్రహణశక్తికి ఖచ్చితమైన ప్రతిరూపమైన దాని గురించి మాత్రమే మనం ధ్యానం చేయాలి. వస్తువు ఎంపికలో ఎలాంటి తప్పులు ఉండకూడదు. వస్తువును సరిగ్గా ఎంచుకుంటే, మనస్సు సహజంగానే నియంత్రణలోకి వస్తుంది.

మనస్సు యొక్క చంచలత్వం మరియు బాధ ప్రారంభంలో ఎంపిక లో చేసిన తప్పు కారణంగానే ఉంటుంది. తరచుగా మనం అత్యుత్సాహం వలన మన తలకు మించిన దాని కోసం ప్రయత్నిస్తాము. తన అవగాహనకు, అవసరాలకు మించిన అటువంటి విప్లవాత్మకమైన సత్యాన్ని అంగీకరించడానికి మనస్సు సిద్ధంగా ఉండదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 42 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 11. The Object of Meditation 🌻


The object of meditation is the degree of reality aligned to our state of being. This is a sentence which may appear like an aphorism. We have to meditate only on that which is the exact counterpart of our present level of knowledge and comprehension. There should not be any mistake in the choice of the object. If the object is properly chosen, the mind will spontaneously come under control.

The restlessness and the resentment of the mind is due to a wrong choice that is made in the beginning. Often we are too enthusiastic and try to go above our own heads. The mind is not prepared to accept such a sudden revolution which is beyond not only its comprehension but also its present needs or necessities.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 177 / Agni Maha Purana - 177


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 177 / Agni Maha Purana - 177 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 54

🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 4 🌻


భూతములచేత-అనగా ఐదుచేత భాగించినపుడు శేషము పృథివి అయిన శభము. అగ్నిచేత-అనగా మూడుచేత భాగించినపుడు-శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగము చేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు వచ్చనచో ఆ లింగము ''అఢ్యము'' ఐదు కంటె అధికము శేషమైనచో ''అనాఢ్యము'' ఆరు అంశల కంటె అధికము శైషమైనచో అది ''దేవేజ్యము''. మూడు అంశల కంటె అధికము శేషించినచో అది ''అర్కతుల్యము''. ఈ నాలుగు విధములగు లింగములును చతుష్కోణములుగ నుండను. ఐదవది ''వర్ధమాన లింగము'', దీనికి వ్యాసము కంటె ఆనాహము అధికము. ఆనాహము వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటె పెద్దదిగా ఉండుట అను దానినిపట్టి, ఈ లింగములలో రెండు భేదములుండును. విశ్కర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము లనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే అఢ్యాది లింగములలో మరల మూడు భేదము లుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగము లేర్పుడును. హస్తమానమును పట్టి 'జన' మను లింగమునకు గూడ మూడు భేదము లగును. దానిని సర్వ సమలింగమున కలిపివేయవలెను.

అనాఢ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకు గూడ ఐదేసి భేదములగుటచే ఇరువదియైదు అగును. ఏక-జిన-భక్త-భేదములచే డెబ్బదియైదు భేదము లగును. అన్నియు కలుపగా పదునైదువేల, నాలుగు వందల శివలింగములగును . ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగము కూడ ఏకాంగుళమానము, హస్తమానము, గర్భమానము అను మానత్రయము ననుసరించి తొమ్మిది భేదము లగును. వీటి నన్నింటిని కోణ-అర్ధకోణము లందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము మొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తారతుల్యముగ భావించి మధ్య-ఊర్ధ్వ-అధో విభాగము లేర్పరుపవలను. మధ్యమ విభాగముపై నున్న అష్ట కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతము ఉండు లింగాధోబాగము బ్రహ్మ యొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగమున విష్ణు యొక్క అంశము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 177 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 54

🌻The dimensions of different varieties of the Liṅga - 4 🌻


26-27. Among the elements, the earth is auspicious. Among the fires, the consecrated fire (from the household’s perpetual fire) is auspicious. Half of the said length having been divided in order into seven, eight, five, nine and five parts there would be symmetrical representation of Śiva, Viṣṇu and Brahman.

28. The fifth one is known as the Vardhamāna. There would be two kinds based on the increase of breadth and length. Many kinds are described according to Viśvakarma (the divine architect).

29. The āḍhya class would be of three kinds on account of the size. Measured by the barley grains it would be eight parts, by the arm it would be three parts. The last one endowed equally is known as jina.

30-31. (There would be) twenty-five liṅgas in the first (variety) which are worshipped by the celestials. Then being divided into thirty-five there would be 14000 and 1400 varieties. Thus (we have) the eight aṅgula’s extent from the nine cubit adytum.

32. One has to mark the angular points by means of threads placed at the angular and middle ofangular points. Having made the expansion from the middle, three parts should be fixed from the middle.

33. There would be eight angular parts above the division. Two angular parts represent the part of Śiva. From the foot to the knee portion (of the liṅga) is Brahmā. (From the knee) to the navel is Viṣṇu.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 330: 08వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 330: Chap. 08, Ver. 20

 

🌹. శ్రీమద్భగవద్గీత - 330 / Bhagavad-Gita - 330 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 20 🌴

20. పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్య క్తాత్సనాతన: |
య: స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||

🌷. తాత్పర్యం :

వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగము నందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి యుండును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన అంతరంగశక్తి దివ్యమును, శాశ్వతమును అయియున్నది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై, రాత్రికాలమున నశించు భౌతికప్రకృతి యందలి మార్పులకు అది అతీతమైనది.

అనగా శ్రీకృష్ణుని ఉన్నతశక్తి భౌతికప్రకృతి గుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. ఉన్నత ప్రకృతి మరియు న్యునప్రకృతి యనునవి ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినవి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 330 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 20 🌴

20 . paras tasmāt tu bhāvo ’nyo ’vyakto ’vyaktāt sanātanaḥ
yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati

🌷 Translation :

Yet there is another unmanifest nature, which is eternal and is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is.

🌹 Purport :

Kṛṣṇa’s superior, spiritual energy is transcendental and eternal. It is beyond all the changes of material nature, which is manifest and annihilated during the days and nights of Brahmā. Kṛṣṇa’s superior energy is completely opposite in quality to material nature. Superior and inferior nature are explained in the Seventh Chapter.

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹22, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 11 🍀


11. యస్యోదరాద్విశ్వమిదం ప్రసూతం
బ్రహ్మాణి తద్వజ్జఠరే స్థితాని |

ఆనంత్యరూపం జఠరం హి యస్య
లంబోదరం తం ప్రణతోఽస్మి నిత్యమ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సంసిద్ధికి మార్గం - మనస్సును ప్రశాంతంగా ఉంచుకో, దాని కతీతమైవున్న దివ్యశక్తిని గుర్తించు. నీ లోపలకు దానికి దారి యిచ్చి, అది నీయందు పనిచేయ డానికి అవకాశం కల్పించు. సంసిద్ధికి ఇదే సరియైన మార్గం. మనస్సులో ఆశాంతి సంసిద్ధికి మార్గం కానేరదు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: శుక్ల తదియ 27:25:46 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: ఉత్తరాభద్రపద 28:51:27

వరకు తదుపరి రేవతి

యోగం: సద్య 23:46:18 వరకు

తదుపరి శుభ

కరణం: తైతిల 16:42:36 వరకు

వర్జ్యం: 15:31:24 - 17:00:08

మరియు 26:22:00 - 43:38:16

దుర్ముహూర్తం: 12:06:17 - 12:53:01

రాహు కాలం: 12:29:39 - 13:57:17

గుళిక కాలం: 11:02:01 - 12:29:39

యమ గండం: 08:06:44 - 09:34:22

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 24:23:48 - 25:52:32

సూర్యోదయం: 06:39:06

సూర్యాస్తమయం: 18:20:13

చంద్రోదయం: 08:13:18

చంద్రాస్తమయం: 20:32:07

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: లంబ యోగం - చికాకులు,

అపశకునం 28:51:27 వరకు తదుపరి

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹