శ్రీ లలితా సహస్ర నామములు - 159 / Sri Lalita Sahasranamavali - Meaning - 159
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 159 / Sri Lalita Sahasranamavali - Meaning - 159 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 159. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ ।
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159 ॥ 🍀
🍀 848. జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ :
చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చునది.
🍀 849. సర్వోపనిషదుద్ఘుష్టా :
అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
🍀 850. శాంత్యతీతకళాత్మికా :
శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 159 🌹
📚. Prasad Bharadwaj
🌻 159. Janmamrutyu jaratapta janavishranti daeini
Sarvopanishadudghushta shantyatita kalatmika ॥ 159 ॥ 🌻
🌻 848 ) Janma mrutyu jara thaptha jana vishranthi dhayini -
She who is the panacea of ills of birth, death and aging
🌻 849 ) Sarvopanisha dhudh gushta -
She who is being loudly announced as the greatest by Upanishads
🌻 850 ) Shantyathheetha kalathmika -
She who is a greater art than peace
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సాధన యొక్క రెండు తరగతులు 🌻
ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. ఎంత తెలిసిన వారైనను నిర్ణయము తమది అయినపుడు తమ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును.
ఇక రెండవ తరగతి వారు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. కనుక వారి మార్గమున పతనము లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు.
కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. కర్తవ్యము నిర్వహించుకొని దానిని భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2021
వివేక చూడామణి - 159 / Viveka Chudamani - 159
🌹. వివేక చూడామణి - 159 / Viveka Chudamani - 159🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -6 🍀
521. ఈ విశ్వము యొక్క అంతములేని వివిధ బ్రహ్మము యొక్క భావనలు అన్ని బ్రహ్మాన్ని గౌరవించుచున్నవి. ఇదంతా పవిత్రమైన మనస్సుతో అన్ని పరిస్థితులలో వ్యక్తమవుచున్నది. ఎవరైతే ఎపుడైన ఈ వస్తు సముధాయము కాకుండా ఏదీ చూడలేరో, అలానే బ్రహ్మము కాక వేరేది లేదు. బ్రహ్మము ఒక్కటే ఉన్నది. వ్యక్తి తన యొక్క ఆత్మ జ్ఞానమును తెలుసుకొని వ్యక్తము చేయుచున్నాడు.
522. జ్ఞాని అయిన ఏ వ్యక్తి కాదనలేడు. ఉన్నతమైన ఈ ఆత్మానందము అన్ని వస్తు సముధాయముల మీద వ్యక్తమవుచున్నది. ఎపుడైతే ప్రకాశవంతమైన చంద్రుని ప్రకాశమును ఎవరైన చంద్రుని చిత్రము నుండి చూచుటకు ప్రయత్నము చేయగలడా!
523. అసత్యమైన వస్తువులను చూసినపుడు ఏవిధమైన తృప్తి కలగదు. బాధలు తప్పవు. అందువలన బ్రహ్మ జ్ఞానమును పొందిన వ్యక్తి ఆనందముగా సత్యాన్ని గుర్తించి అందులో లీనమవుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 159 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -6🌻
521. The universe is an unbroken series of perceptions of Brahman; hence it is in all respects nothing but Brahman. See this with the eye of illumination and a serene mind, under all circumstances. Is one who has eyes ever found to see all around anything else but forms? Similarly, what is there except Brahman to engage the intellect of a man of realisation ?
522. What wise man would discard that enjoyment of Supreme Bliss and revel in things unsubstantial ? When the exceedingly charming moon is shining, who would wish to look at a painted moon ?
523. From the perception of unreal things there is neither satisfaction nor a cessation of misery. Therefore, being satisfied with the realisation of the Bliss Absolute, the One without a second, live happily in a state of identity with that Reality.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2021
శ్రీ శివ మహా పురాణము - 482
🌹 . శ్రీ శివ మహా పురాణము - 482 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 37
🌻. పెళ్ళి హడావుడి - 1 🌻
నారదుట్లిపలికెను-
తండ్రీ! నీవు ప్రాజ్ఞుడవు. హే ప్రభో! నాయందు దయ ఉంచి, సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసెను? అను వృత్తాంతమును నాకు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
అరుంధతితో గూడి సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసినాడు అను విషయమును నీకు చెప్పెదను. ఓ మహర్షీ! (2) మహాత్ముడు, పర్వతేశ్వరుడు అగు హిమవంతుడు తరువాత మేరువు మొదలగు తన సోదరులను, కుమారులను, బంధువులను ఆహ్వానించి ఆనందించెను (3).
మహర్షుల ఆజ్ఞ ప్రకారము హిమవంతుడు తమ పురోహితుడగు గర్గుని చేత ప్రీతి పూర్వకముగా లగ్నపత్రికను వ్రాయించెను (4). తరువాత ఆయన ఆ పత్రికను, అనేక విధములగు వస్తువులను, ఆనందముతో నిండిన హృదయములు గల బంధువులచేత శివునికి పంపించెను (5).
ఆ జనులు కైలాసములో శివుని సన్నిధికి చేరి ఆ పత్ర మునకు తిలకమునద్ది శివునకు సమర్పించిరి (6). వారందరికి ఆ ప్రభుడు యథాయోగ్యముగా ప్రత్యేక సన్మానమును చేయగా, వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై పర్వతుని సన్నిధికి మరలివచ్చిరి (7).
మహేశ్వరునిచే ప్రత్యేకముగా సన్మానింపబడి మిక్కిలి ఆనందముతో తిరిగి వచ్చిన ఆ జనులను చూచి పర్వతరాజు మనస్సులో చాల సంతోషించెను (8). అపుడాయన ఆనందముతో అనేక దేశములందున్న తన బంధువులందరికీ ప్రీతికరమగు ఆహ్వానములను పంపెను (9).
తరువాత ఆయన వివాహమునకు కావలసిన వివిధ సామగ్రులను, బంగారమును శ్రద్ధతో ప్రోగు చేయ జొచ్చెను (10). బియ్యము, అటుకులు, బెల్లము, పంచదార, మరియు లవణము పర్వత శిఖరముల వలె గుట్టలుగా పోయబడి యుండెను (11).

గీతోపనిషత్తు -283
🌹. గీతోపనిషత్తు -283 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 14-3
🍀 14-3. మహాత్ములు - దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది. నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. 🍀
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.
వివరణము : కులమత భేదములు, స్త్రీ పురుష భేదములు, జాతి భేదములు, దేశీయత వంటి వర్గీకరణము లేక అట్లు గోచరించుచున్న వైవిధ్యము నందు ఏకత్వమును దర్శింతురు. నిజమునకు దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. అన్ని రంగులకు మూలము శ్వేతవర్ణమే. అన్ని శబ్దములకు మూలము నాదమే. అన్ని రూపములకు మూలము అండమే. అన్ని అంకెలకు మూలము పూర్ణమే (సున్న).
దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. చూచు వానికి, వినువానికి మూలము కూడ అదియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది.
నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. ఇట్టి కల్లోలము నందు కూడ దైవలీలను చూచువాడు నిజమగు మహాత్ముడు. దీనిని నిరాకరింపక అన్నియు అతని వైభవమే అని భావించుచు, అన్నిటి యందు అతనిని దర్శించు మహాత్ములే మానవజాతికి పరిష్కారము. దైవమే మహాత్ములు గూర్చి నిర్వచించినాడు. మహాత్ములను గుర్తించుటకు ఈ రెండు శ్లోకములే (13, 14) ప్రామాణికములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2021
29-NOVEMBER-2021 MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, సోమవారం, నవంబర్ 2021 ఇందువారము 🌹
🍀. కార్తీక మాసం 25వ రోజు 🍀
🌹. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 283 🌹
3) 🌹. శివ మహా పురాణము - 482🌹
4) 🌹 వివేక చూడామణి - 159 / Viveka Chudamani - 159🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -111🌹
6) 🌹 Osho Daily Meditations - 100🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 159 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 159 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*29, నవంబర్ 2021, ఇందువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. కార్తీక మాసం 25వ రోజు 🍀*
*నిషిద్ధములు : పులుపు, చారు – వగైరా ద్రవపదార్ధాలు*
*దానములు : యథాశక్తి*
*పూజించాల్సిన దైవము : దిక్పాలకులు*
*జపించాల్సిన మంత్రము : *ఓం ఈశావాస్యాయ స్వాహా*
*ఫలితము : అఖండకీర్తి, పదవీప్రాప్తి*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు,
కార్తీక మాసం
తిథి: కృష్ణ దశమి 28:15:06 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 21:42:10
వరకు తదుపరి హస్త
యోగం: ప్రీతి 26:50:30 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: వణిజ 16:51:56 వరకు
వర్జ్యం: 05:11:30 - 06:45:50
మరియు 29:42:12 - 31:13:40
దుర్ముహూర్తం: 12:26:37 - 13:11:21
మరియు 14:40:50 - 15:25:35
రాహు కాలం: 07:52:36 - 09:16:29
గుళిక కాలం: 13:28:08 - 14:52:01
యమ గండం: 10:40:22 - 12:04:15
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 14:37:30 - 16:11:50
సూర్యోదయం: 06:28:43
సూర్యాస్తమయం: 17:39:47
వైదిక సూర్యోదయం: 06:32:32
వైదిక సూర్యాస్తమయం: 17:35:57
చంద్రోదయం: 01:16:07
చంద్రాస్తమయం: 13:53:39
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
శ్రీవత్స యోగం - ధన లాభం ,
సర్వ సౌఖ్యం 21:42:10 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -283 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 14-3
*🍀 14-3. మహాత్ములు - దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది. నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. 🍀*
*సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |*
*నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14*
*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.*
*వివరణము : కులమత భేదములు, స్త్రీ పురుష భేదములు, జాతి భేదములు, దేశీయత వంటి వర్గీకరణము లేక అట్లు గోచరించుచున్న వైవిధ్యము నందు ఏకత్వమును దర్శింతురు. నిజమునకు దైవము కాని దేదియు లేదు. ఆ దైవీతత్త్యము అనేకానేకమగు అల్లికలు ప్రకృతి నిర్వర్తించును. అన్నియు మూలము నందు దైవమే. అన్ని రంగులకు మూలము శ్వేతవర్ణమే. అన్ని శబ్దములకు మూలము నాదమే. అన్ని రూపములకు మూలము అండమే. అన్ని అంకెలకు మూలము పూర్ణమే (సున్న).*
*దేవతలకు, మానవులకు, జంతువులకు, వృక్షములకు, ఖనిజములకు, పక్షులకు, గ్రహగోళములకు, సూర్యమండలములకు, తారకా మండలములకు, సమస్త సృష్టికి మూలము ఒకటియే. చూచు వానికి, వినువానికి మూలము కూడ అదియే. అట్టి తత్త్వమును దర్శించుట అనుక్షణము భగవద్గీత యందు బోధించ బడుచున్నది.*
*నామ రూప భేదములతో కొట్లాడుకొను మూర్ఖులకు, మత భేదములతో హింసించుకొను మతోన్మాదులకు, జాతి భేదము లతో ఒకరినొకరు దమించజూచు జాతి అహంకారులకు, దైవమును గూర్చిన ఉద్యమకారులకు, ఉద్వేగులకు, ఉగ్రవాదులకు దైవము తెలుయుట కలనైనను సాధ్యపడదు. ఇట్టి కల్లోలము నందు కూడ దైవలీలను చూచువాడు నిజమగు మహాత్ముడు. దీనిని నిరాకరింపక అన్నియు అతని వైభవమే అని భావించుచు, అన్నిటి యందు అతనిని దర్శించు మహాత్ములే మానవజాతికి పరిష్కారము. దైవమే మహాత్ములు గూర్చి నిర్వచించినాడు. మహాత్ములను గుర్తించుటకు ఈ రెండు శ్లోకములే (13, 14) ప్రామాణికములు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 482 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 37
*🌻. పెళ్ళి హడావుడి - 1 🌻*
నారదుట్లిపలికెను-
తండ్రీ! నీవు ప్రాజ్ఞుడవు. హే ప్రభో! నాయందు దయ ఉంచి, సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసెను? అను వృత్తాంతమును నాకు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
అరుంధతితో గూడి సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసినాడు అను విషయమును నీకు చెప్పెదను. ఓ మహర్షీ! (2) మహాత్ముడు, పర్వతేశ్వరుడు అగు హిమవంతుడు తరువాత మేరువు మొదలగు తన సోదరులను, కుమారులను, బంధువులను ఆహ్వానించి ఆనందించెను (3).
మహర్షుల ఆజ్ఞ ప్రకారము హిమవంతుడు తమ పురోహితుడగు గర్గుని చేత ప్రీతి పూర్వకముగా లగ్నపత్రికను వ్రాయించెను (4). తరువాత ఆయన ఆ పత్రికను, అనేక విధములగు వస్తువులను, ఆనందముతో నిండిన హృదయములు గల బంధువులచేత శివునికి పంపించెను (5).
ఆ జనులు కైలాసములో శివుని సన్నిధికి చేరి ఆ పత్ర మునకు తిలకమునద్ది శివునకు సమర్పించిరి (6). వారందరికి ఆ ప్రభుడు యథాయోగ్యముగా ప్రత్యేక సన్మానమును చేయగా, వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై పర్వతుని సన్నిధికి మరలివచ్చిరి (7).
మహేశ్వరునిచే ప్రత్యేకముగా సన్మానింపబడి మిక్కిలి ఆనందముతో తిరిగి వచ్చిన ఆ జనులను చూచి పర్వతరాజు మనస్సులో చాల సంతోషించెను (8). అపుడాయన ఆనందముతో అనేక దేశములందున్న తన బంధువులందరికీ ప్రీతికరమగు ఆహ్వానములను పంపెను (9).
తరువాత ఆయన వివాహమునకు కావలసిన వివిధ సామగ్రులను, బంగారమును శ్రద్ధతో ప్రోగు చేయ జొచ్చెను (10). బియ్యము, అటుకులు, బెల్లము, పంచదార, మరియు లవణము పర్వత శిఖరముల వలె గుట్టలుగా పోయబడి యుండెను (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 159 / Viveka Chudamani - 159🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -6 🍀*
*521. ఈ విశ్వము యొక్క అంతములేని వివిధ బ్రహ్మము యొక్క భావనలు అన్ని బ్రహ్మాన్ని గౌరవించుచున్నవి. ఇదంతా పవిత్రమైన మనస్సుతో అన్ని పరిస్థితులలో వ్యక్తమవుచున్నది. ఎవరైతే ఎపుడైన ఈ వస్తు సముధాయము కాకుండా ఏదీ చూడలేరో, అలానే బ్రహ్మము కాక వేరేది లేదు. బ్రహ్మము ఒక్కటే ఉన్నది. వ్యక్తి తన యొక్క ఆత్మ జ్ఞానమును తెలుసుకొని వ్యక్తము చేయుచున్నాడు.*
*522. జ్ఞాని అయిన ఏ వ్యక్తి కాదనలేడు. ఉన్నతమైన ఈ ఆత్మానందము అన్ని వస్తు సముధాయముల మీద వ్యక్తమవుచున్నది. ఎపుడైతే ప్రకాశవంతమైన చంద్రుని ప్రకాశమును ఎవరైన చంద్రుని చిత్రము నుండి చూచుటకు ప్రయత్నము చేయగలడా!*
*523. అసత్యమైన వస్తువులను చూసినపుడు ఏవిధమైన తృప్తి కలగదు. బాధలు తప్పవు. అందువలన బ్రహ్మ జ్ఞానమును పొందిన వ్యక్తి ఆనందముగా సత్యాన్ని గుర్తించి అందులో లీనమవుతాడు.*
*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 159 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 32. I am the one who knows Brahman -6🌻*
*521. The universe is an unbroken series of perceptions of Brahman; hence it is in all respects nothing but Brahman. See this with the eye of illumination and a serene mind, under all circumstances. Is one who has eyes ever found to see all around anything else but forms? Similarly, what is there except Brahman to engage the intellect of a man of realisation ?*
*522. What wise man would discard that enjoyment of Supreme Bliss and revel in things unsubstantial ? When the exceedingly charming moon is shining, who would wish to look at a painted moon ?*
*523. From the perception of unreal things there is neither satisfaction nor a cessation of misery. Therefore, being satisfied with the realisation of the Bliss Absolute, the One without a second, live happily in a state of identity with that Reality.*
*Continues.... *
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సాధన యొక్క రెండు తరగతులు 🌻*
*ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. ఎంత తెలిసిన వారైనను నిర్ణయము తమది అయినపుడు తమ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును.*
*ఇక రెండవ తరగతి వారు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. కనుక వారి మార్గమున పతనము లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు.*
*కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. కర్తవ్యము నిర్వహించుకొని దానిని భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 100 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 100. LOW ENERGY 🍀*
*🕉 Don't think that anything is wrong with having low energy. There is also nothing especially right about having high energy. 🕉*
*You can use high energy as a destructive force. That's what high energy people all over the world have been doing all through the centuries. The world has never suffered from low-energy people. In fact, they have been the most innocent people. They cannot become a Hitler or a Stalin or a Mussolini. They cannot create world wars. They don't try to conquer the world. They are not ambitious. They cannot fight or become politicians. Low energy is wrong only if it becomes indifference.*
*If it remains positive, nothing is wrong with it. The difference is like the difference between shouting, which is high energy, and whispering, which is low energy. There are moments when shouting is foolish and only whispering is right. There are a few people who are attuned to shouting and a few who are attuned to whispering.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 159 / Sri Lalita Sahasranamavali - Meaning - 159 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 159. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ ।
సర్వోపనిష దుద్ఘుష్టా, శాంత్యతీత కళాత్మికా ॥ 159 ॥ 🍀*
🍀 848. జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ :
చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చునది.
🍀 849. సర్వోపనిషదుద్ఘుష్టా :
అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
🍀 850. శాంత్యతీతకళాత్మికా :
శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 159 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 159. Janmamrutyu jaratapta janavishranti daeini
Sarvopanishadudghushta shantyatita kalatmika ॥ 159 ॥ 🌻*
🌻 848 ) Janma mrutyu jara thaptha jana vishranthi dhayini -
She who is the panacea of ills of birth, death and aging
🌻 849 ) Sarvopanisha dhudh gushta -
She who is being loudly announced as the greatest by Upanishads
🌻 850 ) Shantyathheetha kalathmika -
She who is a greater art than peace
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)