🌹 26, DECEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 26, DECEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, DECEMBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Dattatreya Jayanti, Annapurna Jayanti Good Wishes to All 🍀
🌻. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత 🌻
🌻. Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻
2) 🌹 కపిల గీత - 285 / Kapila Gita - 285 🌹 
🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 16 / 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 16 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 877 / Vishnu Sahasranama Contemplation - 877 🌹
🌻 877. జ్యోతిః, ज्योतिः, Jyotiḥ 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 189 / DAILY WISDOM - 189 🌹
🌻 7. ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధించదు / 7. Truth Triumphs not Always 🌻
5) 🌹. శివ సూత్రములు - 192 / Siva Sutras - 192 🌹 
🌻 3-21. మగ్నః స్వ చిత్తేన ప్రవిశేత్ - 1 / 3-21. Magnaḥ sva cittena praviśet - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Dattatreya Jayanti, Annapurna Jayanti Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దత్తాత్రేయ జయంతి, పూర్ణిమ ఉపవాసము, అన్నపూర్ణ జయంతి, Dattatreya Jayanti, Purnima Upavas, Annapurna Jayanti 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 33 🍀*

66. గణపః కేశవో భ్రాతా పితా మాతాఽథ మారుతిః |
సహస్రమూర్ధా సహస్రాస్యః సహస్రాక్షః సహస్రపాత్

*🍀. శ్రీ దత్తాత్రేయ స్తోత్రము 🍀*

*బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |*
*ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే *
*అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |*
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే *

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సచ్చిదానందముల అభివ్యక్తి విశేషాలు : పరాభూమికల యందు అభివ్యక్త మైనప్పుడు, సచ్చిదానందములు ఒకదాని నుండి ఒకటి విడదీయరాని వైనా ఒక్కొక్కదానికి విశేష ప్రాధాన్యంతో త్రికస్వరూపం పొందుతూ వున్నవి. ఆ సచ్చిదానందములే అవరాభూమికల యందు అభివ్యక్తమైనప్పుడు, గర్భిత వస్తు తత్వమున కాకపోయినా స్థూలదృష్టికి మాత్రం ఒకదాని నుండి ఒకటి విడదీయదగి వుండి తక్కిన రెండూ లోపించిన ఏదో ఒకటిగ రూపొందడం జరుగుతూ వున్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: పూర్ణిమ 30:04:29 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: మృగశిర 22:23:47
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: శుక్ల 27:21:13 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: విష్టి 17:55:05 వరకు
వర్జ్యం: 03:25:48 - 05:04:36
దుర్ముహూర్తం: 08:56:37 - 09:41:00
రాహు కాలం: 15:02:49 - 16:26:02
గుళిక కాలం: 12:16:22 - 13:39:35
యమ గండం: 09:29:55 - 10:53:08
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 13:18:36 - 14:57:24
సూర్యోదయం: 06:43:28
సూర్యాస్తమయం: 17:49:16
చంద్రోదయం: 17:10:41
చంద్రాస్తమయం: 06:00:18
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 22:23:47 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి విశిష్టత / Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻*

*🍀. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.🍀*

*🌿🌼🙏. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించు చున్నాము.🙏🌼🌿*

*🌿🌼🙏. ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.🙏🌼🌿*

*🌿🌼🙏. సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయుల వారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజు దగ్గర నుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!🙏🌼🌿*

*🙏🌼🌿. ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం. 

*🌿🌼🙏. ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.🙏🌼🌿*

*🌿🌼🙏1.శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ శ్రీ దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|,*
*భవగ్రహ క్లేశ హరిన్ సుకీర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*

*🌿🌼🙏2.త్వం నో మాతా త్వం నో పితాప్తో ధి పస్త్వం త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్*
*త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*

*🌿🌼🙏3.పాపం తాపం వ్యాధిదీం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం హ రాశు త్వ దైన్యమ్|*
*త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*

*🌿🌼🙏4.నాన్య స్త్రాతా న పీడాన్ న భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యో శోకహర్తా|*
*కుర్వత్రేయ అనుగ్రహం పూర్ణరతే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*

*🌿🌼🙏5.ధర్మే ప్రీతీం సన్మతం దేవభక్తిమ్ సత్స్ జ్ఞప్తి దేహి భుక్తిమ్ చ ముక్తిం |*
*భవ శక్తీమ్ చ అఖిలానంద మూర్తే ఘోరకష్టాదుద్ధారాస్మాన్ నమస్తే .🙏🌼🌿*

*🌿🌼🙏. శలోక పంచక మతద్యో లోక మంగళ |వర్ధనం ప్రపటేన్యతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ 🙏🌼🌿*

*🌿🌼🙏దగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా🙏*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Good Wishes to All 🌹*
*✍️. Prasad Bharadwaj*

*🌻. Specialty of Sri Dattatreya Swami's Jayanti 🌻*

*🍀. Sri Dattatreya is Gnanayoganidhi, Vishwaguru and Siddhasevita. Shruti says that just remembering 'Sridatta' fulfills the desires of our mind. Dattamurthy's incarnation is to teach all living beings knowledge, knowledge, love, truth, happiness and righteousness. Dattatreya is a sage who has transcended Vedic knowledge.🍀*

*🌿🌼🙏. Dattatreya was the son of sage Atri and Anasuya Devi. Sage Atri did severe penance to have a son and wanted a son with divine powers. As a result of his penance, Chandra was born in the Brahma aspect, Datta in the Vishnu aspect, and Durvasa in the Shiva aspect. Those three who were born in different times are known by the name Sridatta. Chandra and Durvasu showered their energies on Dattu. Adoption means one who willingly goes to adopt another person. He became an Atreya because Srihari left his birthplace Vaikuntha and became the son of Atri. 'Dattatreya + Athreya' we have treated as 'Dattatreya'.🙏🌼🌿*

*🌿🌼🙏. Atri Maharshi, who removed the three types of tapa, namely, material, spiritual and spiritual, with his tapo glory. He was also called 'Athreya' as he was the son of Atri. Datta did penance on the banks of the river Gomati for the acquisition of knowledge and became a sage. Dattatreya has six arms and three heads and the head is Vishnu. On the right is Shiva's head and on the left is Brahma's head. The right part is Sadguru's form, the left part is Parabrahma's form, and in the middle part Sridatta removes ignorance and protects the worlds. He appears with three faces, six arms, four dogs and a cow. The four dogs are the four Vedas, the cow's mind is the magic power, and the three faces are the trinity. Creation, status, rhythms. The trident is a ritual, the wheel is the destroyer of ignorance, the conch shell is the treasure of all things, and all the Vedas are derived from it. Kamandala is a symbol of removing all suffering and bringing good luck.🙏🌼🌿*

*🌿🌼🙏. Purnimanada falls in the month of Margashirsham on the birth day of Gurudev Dattatreya, who cut off all ties and chose his devotees to lead them to the supreme path. Dattatreya Jayanti is celebrated on Margashirsha Purnima, the day when the power of the moon is at full strength, as Taurus is the home of the Moon. If you anoint the Dattu with milk on the full moon day and tell him the desires of your mind, he will bring you success. If we think about Sri Datta get long life health, and Bhogabhagya, Bbeautiful change will happen from the day we think about it. So let's worship and get blessings of Datta on his birth anniversary!🙏🌼🌿*

*🙏🌼🌿. Ghora Khatshodharana Strotram of the Great Glorified Sri Dattatreya Swami, the Remover of Grievous Sufferings.

*🌿🌼🙏. Those who recite these Pancha Shlokas with devotion will get rid of all their troubles and sufferings due to the grace of Sri Dattatreya Swami and will be filled with happiness and joy. Recite with complete devotion, attention and faith.🙏🌼🌿*

*🌿🌼🙏 1. Sri Pada Sri Vallabha Tvam Sadaiva Sri Datta Sman Pahi Devadhideva|,*
*Bhavgraha klesha harin sukirte ghorakashtaduddharasman namaste.🙏🌼🌿*

*🌿🌼🙏 2.Tvam no mata tvam no pitapto dhi pastvam tratayoga kshemakrit sadguru stvam*
*Tvam Sarvasvam No Prabho Vishwamurte Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿*

*🌿🌼🙏 3. Sin, heat, disease, disease
*Trataram no veeksha ishasta juorte ghorakashtaduddharasman namaste.🙏🌼🌿*

*🌿🌼🙏 4. Nanya strata na peedan na bhartra tvatto deva tvam saranyo sokaharta|*
*Kurvatreya Anugraham Purnarate Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿*

*🌿🌼🙏 5.Dharme Pritim Sanmatam Devbhaktim Sats Jnapti Dehi Bhuktim Cha Muktim |*
*Bhava Shaktim cha Akhilananda Murte Ghorakashtaduddharasman Namaste.🙏🌼🌿*

*🌿🌼🙏. Saloka panchaka matadyo loka mangala
*🌿🌼🙏Dagambara Digambara Shri Pada Vallabha Digambara Digambara Digambara Avadhuta Chintana Digambara🙏*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 285 / Kapila Gita - 285 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 16 🌴*

*16. జ్ఞానం యదేతదదధాత్కతమః స దేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః|*
*తం జీవకర్ళపదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ॥*

*తాత్పర్యము : స్వామీ! నాకు ఈ త్రికాల జ్ఞానమును ప్రసాదించుటకు నీవు తప్ప మరి యెవ్వరును సమర్థులు కారు. ఏలయన, నీవు సకల చరాచర ప్రాణులలో అంతరాత్మగా విలసిల్లుచుండు వాడవు. తమ కర్మవాసనలచే జీవస్థితిని పొందిన మేము తాపత్రయముల నుండి బయట పడుటకు నిన్ను సేవించు చుందుము.*

*వ్యాఖ్య : మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ ( BG 15.15). 'నా ద్వారా నిజమైన జ్ఞానం మరియు జ్ఞాపకశక్తి లభిస్తుంది, మరియు నా వల్లనే మరచిపోతాడు' అని భగవంతుడు చెప్పాడు. భౌతికంగా తృప్తి పొందాలనుకునే వ్యక్తికి లేదా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించాలనుకునే వ్యక్తికి, భగవంతుడు తన సేవను మరపించి భౌతిక కార్యకలాపాలలో ఆనందం అని పిలవబడే అవకాశాన్ని ఇస్తాడు. అదేవిధంగా, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించడంలో విసుగు చెందినప్పుడు మరియు ఈ భౌతిక చిక్కు నుండి బయటపడటంలో చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, భగవంతుడు, లోపల నుండి, అతనికి లొంగిపోవాలనే జ్ఞానాన్ని అతనికి ఇస్తాడు; అప్పుడు విముక్తి లభిస్తుంది.*

*ఈ జ్ఞానాన్ని భగవంతుడు లేదా అతని ప్రతినిధి తప్ప మరెవరూ అందించలేరు. దీని అర్థం కృష్ణుడు పరమాత్మగా జీవుని హృదయంలో కూర్చున్నాడు మరియు జీవుడు తీవ్రంగా ఉన్నప్పుడు, భగవంతుడు అతన్ని ఆశ్రయించమని ఆదేశిస్తాడు. అతని ప్రతినిధి, మంచి ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు ద్వారా లోపలి నుండి నిర్దేశించబడి మరియు బాహ్యంగా మార్గనిర్దేశం చేయబడి, భౌతికం బారి నుండి బయటపడే మార్గమైన కృష్ణ చైతన్య మార్గాన్ని పొందుతాడు. కృష్ణ చైతన్యం యొక్క బీజము నియమితం చేయబడిన ఆత్మ యొక్క హృదయంలో నాటబడుతుంది మరియు ఆధ్యాత్మిక గురువు నుండి ఉపదేశాన్ని విన్నప్పుడు, విత్తనం ఫలిస్తుంది మరియు ఒకరి జీవితం ధన్యమవుతుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 285 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 16 🌴*

*16. jñānaṁ yad etad adadhāt katamaḥ sa devas trai-kālikaṁ sthira-careṣv anuvartitāṁśaḥ*
*taṁ jīva-karma-padavīm anuvartamānās tāpa-trayopaśamanāya vayaṁ bhajema*

*MEANING : No one other than the Supreme Personality of Godhead, as the localized Paramātmā, the partial representation of the Lord, is directing all inanimate and animate objects. He is present in the three phases of time-past, present and future. Therefore, the conditioned soul is engaged in different activities by His direction, and in order to get free from the threefold miseries of this conditional life, we have to surrender unto Him only.*

*PURPORT : Mattaḥ smṛtir jñānam apohanaṁ ca (BG 15.15). The Lord says, "Through Me one gets real knowledge and memory, and one also forgets through Me." To one who wants to be materially satisfied or who wants to lord it over material nature, the Lord gives the opportunity to forget His service and engage in the so-called happiness of material activities. Similarly, when one is frustrated in lording it over material nature and is very serious about getting out of this material entanglement, the Lord, from within, gives him the knowledge that he has to surrender unto Him; then there is liberation.*

*This knowledge cannot be imparted by anyone other than the Supreme Lord or His representative.This means that Kṛṣṇa as the Supersoul is seated within the heart of the living entity, and when the living entity is serious, the Lord directs him to take shelter of His representative, a bona fide spiritual master. Directed from within and guided externally by the spiritual master, one attains the path of Kṛṣṇa consciousness, which is the way out of the material clutches. The seed of Kṛṣṇa consciousness is sown within the heart of the conditioned soul, and when one hears instruction from the spiritual master, the seed fructifies, and one's life is blessed.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 877 / Vishnu Sahasranama Contemplation - 877 🌹*

*🌻 877. జ్యోతిః, ज्योतिः, Jyotiḥ 🌻*

*ఓం జ్యోతిషే నమః | ॐ ज्योतिषे नमः | OM Jyotiṣe namaḥ*

*స్వత ఏవ ద్యోతత ఇత్యుచ్యతో జ్యోతిరుచ్యతే ।*
*నారాయణపరోజ్యోతిరాత్మేతి శ్రుతివాక్యతః ॥*

*స్వయముగానే ఎవరి ప్రకాశపు సహాయమును లేకయే ప్రకాశించుచుండును.*

*ఈ విషయమున 'నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః' (నారా 13.1) - 'ఉత్కృష్టుడు అగు నారాయణుడే స్వయం ప్రకాశజ్యోతియు సర్వమునకు ఆత్మయు' అను శ్రుతి వచనము ప్రమాణము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 877🌹*

*🌻877. Jyotiḥ🌻*

*OM Jyotiṣe namaḥ*

स्वत एव द्योतत इत्युच्यतो ज्योतिरुच्यते ।
नारायणपरोज्योतिरात्मेति श्रुतिवाक्यतः ॥

*Svata eva dyotata ityucyato jyotirucyate,*
*Nārāyaṇaparojyotirātmeti śrutivākyataḥ.*

*Without dependence on any other source, He shines by Himself so Jyotiḥ*

*vide the mantra 'Nārāyaṇa paro jyotirātmā nārāyaṇaḥ paraḥ' (Nārā 13.1) -*

*'Nārāyaṇa is supremely self luminous and the supreme soul of everything'.*

🌻 🌻 🌻 🌻 🌻 
*Source Sloka*
*विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥*
*విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥*
*Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥*

*Continues....*
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 189 / DAILY WISDOM - 189 🌹*
*🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధించదు 🌻*

*అన్వేషకులు స్వర్గ ద్వారం వద్ద కూడా సురక్షితంగా లేరు, జాన్ బనియన్ తన పిలోగ్రిమ్స్ ప్రోగ్రెస్ లో పేర్కొన్నాడు. స్వర్గ ప్రవేశం వద్ద కూడా నరకానికి దారితీసే రంధ్రం ఉండే అవకాశం ఉంది. ఒక పెద్ద ద్వారం నేరుగా స్వర్గానికి దారి తీస్తుంది. మనం అక్కడే నిలబడి ఉంటాము. కానీ అక్కడే నరకానికి దారి తీసే ఒక గొయ్యి ఉంది, అందులో పడిపోతాం. తరవాత మరి మనం ఎక్కడికి వెళ్తాం? యమ నివాసంలోకి. సరే, స్వర్గ ప్రవేశ ద్వారం వద్ద అక్కడ ఒక రంధ్రం ఉండటమే విచిత్రం. ఇది సాధ్యమే, అని జాన్ బన్యన్ చెప్పారు. అలాగే చాలా మంది చెప్పారు. విషయం ఏమిటంటే, పడవ అవతలి ఒడ్డు దగ్గర కూడా మునిగిపోవచ్చు-మధ్యలోనే అవసరం లేదు.*

*ప్రపంచంలోని శక్తుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం మన ముందు చిన్న పిల్లి లేదా ఎలుక కాదు, ప్రపంచం మొత్తాన్ని మన వేళ్ళతో కట్టిపడేసే గొప్ప యోగులం అనే భావనలో మనం ఉండకూడదు. అది అలా కాదు. మనం కృష్ణులం కాదు, అర్జునుని ఒంటి చేత్తో దీవించడానికి. మనం ఆధ్యాత్మికంగా శిశువులం. మరియు పాండవుల హృదయాలలో వికసించబోతున్న ఆత్మ యొక్క చిన్న ఆకాంక్షలను ప్రతిఘటించగల ఆనాటి వ్యూహాలను కలిగి ఉన్న కౌరవుల ముందు శిశువు పాండవులు సమానమైనవారేమీ కాదు. మంచితనం ఎల్లప్పుడూ ముందు దశలలో విజయం సాధించదు. సత్యం విజయం సాధిస్తుంది. కానీ ఎప్పుడూ కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 189 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. Truth Triumphs not Always 🌻*

*The seekers are not safe even at the gate of heaven, as John Bunyan put it in his Pilgrim's Progress. There is a possibility of there being a hole leading to hell even at the entrance to heaven. A big gate leads straight to heaven and we are just there, standing. But there is a pit, like a manhole, and we fall in. And where do we go? Into Yama's abode. Well, it is strange that there is a hole there, just at the entrance to heaven. This is possible, says John Bunyan, and says everyone. The idea is that the boat can sink even near the other shore—not necessarily in the middle.*

*The point is that we have to be very cautious about the powers of the world. The world is not a petty cat or a mouse in front of us, and we should not be under the impression that we are great yogis who can simply tie the whole world with our fingers. It is not so. We are not Krishnas, blessing Arjuna with one hand. We are babies, spiritually. And the baby Pandavas were not an equal match to the terror of the Kauravas, who had the tactics of the time, who could counterblast the little aspirations of the spirit which were about to blossom in the hearts of the Pandavas. Goodness does not always succeed in the earlier stages. Truth triumphs not always.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 192 / Siva Sutras - 192 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-21. మగ్నః స్వ చిత్తేన ప్రవిశేత్ - 1 🌻*

*🌴. మానసిక శోషణ (చిత్త మగ్న) ద్వారా స్థిరమైన ఆలోచన (ఆసనం)లో ఉండటం ద్వారా, ఒక వ్యక్తి తన స్వంత స్పృహ (స్వచిత్త) ద్వారా ఆత్మను చేరుకోవాలి. 🌴*

*మగ్నః - లీనమై; స్వ - స్వంత (ఒకరి స్వంత); చిత్తేన – మనస్సు; ప్రవిశేత్‌ – ప్రవేశించడం లేదా గ్రహించడం.*

*ఈ సూత్రం మునుపటి సూత్రంలో చర్చించినట్లుగా, తుర్య దశ మూడు దిగువ స్థాయి స్పృహలలోకి ఎలా అందుంతుందో వివరిస్తుంది. ఒక వ్యక్తి తన ఆవశ్యకమైన స్వీయ చేతన (స్వయం)పై తన మనస్సును స్థిరపరచి, నాల్గవ స్పృహ (తుర్య) స్థితిలో మునిగిపోవాలి. తుర్య దశలోకి ప్రవేశించినప్పుడు, అతను ప్రాణాయామం, ధ్యానం మొదలైన సాక్షాత్కార సాధనాలను వదిలివేస్తాడు. తద్వారా తుర్య స్థితి మనస్సు యొక్క రంగంలోకి కూడా దిగుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 192 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-21. Magnaḥ sva cittena praviśet - 1 🌻*

*🌴. Through mental absorption (chitta magna) by abiding in the steady state of contemplation (asana), one should reach the self through one’s own consciousness (svachitta). 🌴*

*magnaḥ - immersed; sva – own (one’s own); cittena – mind; praviśet – to enter into or be absorbed.*

*This sūtra explains how to endow turya stage into the three lower levels of consciousness, as discussed in the previous sūtra. One should immerse into the fourth state of consciousness (turya) with his mind fixed on his essential Self (sva). When one enters turya stage, he leaves behind the tools of realisation, such as prāṇāyāma, meditation, etc. Turya also happens in the arena of mind.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 517 - 519 / Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 517 - 519 / Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 106. మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థి సంస్థితా ।
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥ 🍀

🌻 517 నుండి 519🌻


517. 'అంకుశాది ప్రహరణా' - అంకుశము మొదలగు ఆయుధములను బాహువునందు ధరించునది శ్రీమాత అని అర్థము.

518. 'వరదాది నిషేవితా' - వరద మొదలగు దేవతలచే పూజింపబడునది శ్రీమాత అని అర్థము.

519. 'ముద్దేదనాసత్తచిత్తా - మీనుప పప్పుతో కలిపిన అన్నమునందు ఆసక్తి కలది శ్రీమాత అని అర్థము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻106. Muladharanbujarudha panchavaktrasdhi sanpdhita
ankushadi praharana varadadi nishevita ॥ 106 ॥ 🌻


🌻 517 to 519 🌻

517. 'Ankushadi Praharana' - The wearer of Ankusha (spike) and other weapons in arms is Srimata.

518. 'Varadadi Nishevita' - Srimata means the one who is worshiped by Varada and other deities.

519. 'Muddedanasattachitta - Srimata is interested in rice mixed with black gram.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹



Osho Daily Meditations - 90. FEAR OF DEATH / ఓషో రోజువారీ ధ్యానాలు - 90. మరణ భయం



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 90 / Osho Daily Meditations - 90 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 90. మరణ భయం 🍀

🕉. మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణం రాబోతుంది: జీవితంలో అది ఒక్కటే నిశ్చయమైనది. మిగతావన్నీ అనిశ్చితంగా ఉంటాయి, కాబట్టి నిశ్చయత గురించి ఎందుకు ఆందోళన చెందాలి? 🕉


మరణం ఒక సంపూర్ణ నిశ్చయం. వంద శాతం మంది చనిపోతారు - తొంభై తొమ్మిది శాతం కాదు, వంద శాతం. ప్రజల మరణాలకు సంబంధించినంత వరకు అన్ని శాస్త్రీయ అభివృద్ధి మరియు వైద్య శాస్త్రంలో అన్ని పురోగతులు ఎటువంటి తేడా తేలేవు: వంద శాతం మంది ప్రజలు పదివేల సంవత్సరాల క్రితం మరణించినట్లే ఇప్పటికీ మరణిస్తారు. ఎవరు పుట్టినా, మరణిస్తారు; మినహాయింపు లేదు. కాబట్టి మరణం గురించి మనం పూర్తిగా విస్మరించవచ్చు. అది జరగబోతోంది కాబట్టి ఎప్పుడు జరిగినా సరే.

మీరు ప్రమాదంలో పడగొట్టబడినా లేదా మీరు ఆసుపత్రి మంచంలో మరణించినా అది ఎలా జరుగుతుందో దానిలో తేడా ఏమిటి? పర్వాలేదు. ఒకసారి మీరు మరణం నిశ్చయం అనే పాయింట్‌ని చూస్తే, ఇవి కేవలం మర్యాద మాత్రమే-ఎలా మరణిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు అన్నవి. అసలు విషయం ఏమిటంటే మీరు చనిపోతారు. క్రమంగా మీరు వాస్తవాన్ని అంగీకరిస్తారు. మరణాన్ని అంగీకరించాలి. దానిని తిరస్కరించడంలో అర్థం లేదు; మరియు ఎవరూ దానిని నిరోధించలేకపోయారు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి! మీరు జీవించి ఉండగా, పూర్తిగా ఆనందించండి; మరియు మరణం వచ్చినప్పుడు, దాన్ని కూడా ఆనందించండి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 90 🌹

📚. Prasad Bharadwaj

🍀 90. FEAR OF DEATH 🍀

🕉. There is no need to be afraid if death. Death is going to come: that is the only certain thing in life. Everything else is uncertain, so why be worried about the certainty? 🕉


Death is an absolute certainty. One hundred percent of people die-not ninety-nine percent, but one hundred. All the scientific growth and all the advances in medical science make no difference as far as people's deaths are concerned: one hundred percent of people still die, just as they used to die ten thousand years ago. Whoever is born, dies; there is no exception. So about death we can be completely oblivious. It is going to happen, so whenever it happens it is okay.

What difference does it make how it happens-whether you are knocked out in an accident or you just die in a hospital bed? It doesn't matter. Once you see the point that death is certain, these are only formalities-how one dies, where one dies. The only real thing is that one dies. By and by you will accept the fact. Death has to be accepted. There is no point in denying it; and nobody has ever been able to prevent it. So relax! While you are alive, enjoy it totally; and when death comes, enjoy that too.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 832 / Sri Siva Maha Purana - 832


🌹 . శ్రీ శివ మహా పురాణము - 832 / Sri Siva Maha Purana - 832 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴

🌻. శంఖచూడుని వివాహము - 3 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- తులసి ఆతనితో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికి విరమించెను. ఆతడు చిరునవ్వుతో గూడియున్న ఆమెను గాంచి ఇట్లు చెప్పుటకు ఉపక్రమించెను (18).

శంఖచూడుడు ఇట్లు పలికెను - ఓ దేవీ! నీవు చెప్పిన సర్వము అసత్యము కాదు. కాని కొంత సత్యము, కొంత అసత్యము గలదు. నా మాటను వినుము (19). పతివ్రతాస్త్రీలలో నీవు అగ్రేసరురాలవు. నేను పాపదృష్టిగల కాముకుడును గాను. నీవు కూడ అట్టి దానవు కాదని నేను భావించుచున్నాను (20). ఇపుడు నేను బ్రహ్మ యొక్క ఆజ్ఞచే నీవద్దకు వచ్చియుంటిని. ఓ సుందరీ! నేను నిన్ను గాంధర్వివిధిలో వివాహమాడెదను (21). దేవతలు పారిపోవునట్లు చేయు శంఖచూడుడను నేను. ఓ మంగళస్వరూపురాలా! నన్ను ఎరుంగనా ! ఎప్పుడైననూ నా పేరు వినలేదా? (22). విశేషించి నేను దనువంశములో జన్మించితిని. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుని అనుంగు సహచరుడైన సుదాముడనే గోపాలకుడను (23) రాధాదేవియొక్క శాపముచే ఈ జన్మలో దానవవీరుడనై జన్మించితిని. శ్రీకృష్ణుని ప్రభావముచే నేను పూర్వ జన్మ వృత్తాంతమునంతనూ ఎరుంగుదును (24).

సనత్కుమారుడిట్లు పలికెను - శంఖచూడుడు ఆమె ఎదుట ఇట్లు పలికి విరమించెను. ఆ రాక్షసరాజు ఇట్లు ఆదరముతో సత్యవచనమును పలుకగా, ఆ తులసి సంతసించి చిరునవ్వుతో ఇట్లు చెప్పుట మొదలిడెను (25).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 832 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴

🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 3 🌻


Sanatkumāra said:—

18. Tulasī thus spoke to the passionate Dambha and stopped. On seeing her smiling he began to say.


Śaṅkhacūḍa said:—

19. O gentle lady, what you said now is not entirely false. It is partially true also. Now listen to me.

20. You are the foremost among chaste ladies. I am not a lusty person of sinful nature. I think you too are not like that.

21. I come to you now at the behest of Brahmā. O gently lady, I shall take your hand by the Gāndharva rites of marriage.

22. I am Śaṅkhacūḍa, the router of the gods. O gentle lady, don’t you know me? Have I never been heard by you?

23. I am a scion of the family of Danu. I am a Dānava, the son of Dambha. In the previous birth I was the cowherd Sudāmā, a comrade of Kṛṣṇa.

24. Due to the curse of Rādhā I have become a Dānava now. By the favour of Kṛṣṇa I remember events of previous birth. I know everything.


Sanatkumāra said:—

25. After saying thus to her, Śaṅkhacūḍa stopped. Tulasī who was thus addressed truthfully and respectfully by the king of Dānavas, was delighted and she spoke smilingly.



Continues....

🌹🌹🌹🌹🌹



శ్రీమద్భగవద్గీత - 477: 12వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 477: Chap. 12, Ver. 08

 

🌹. శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 🌴

08. మయ్యేమ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయ: ||


🌷. తాత్పర్యం : దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.

🌷. భాష్యము : : శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడైనవాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబధమున జీవించును. తత్కారణముగా తొలినుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతికపరధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును. కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదములేదు కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగశక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు.

భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినపుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును గొని కృష్ణభావనలో తన్మయుడగును. భగవద్గీత యందు మరియు ఇతర వేదవాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడియున్నను ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అదియెట్లు సంభవమనెడి విషయమును అవగతము చేసికొనజాలడు.

🌹🌹🌹🌹🌹




🌹 Bhagavad-Gita as It is - 477 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 08 🌴

08. mayy eva mana ādhatsva mayi buddhiṁ niveśaya
nivasiṣyasi mayy eva ata ūrdhvaṁ na saṁśayaḥ


🌷 Translation : Just fix your mind upon Me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in Me. Thus you will live in Me always, without a doubt.

🌹 Purport : One who is engaged in Lord Kṛṣṇa’s devotional service lives in a direct relationship with the Supreme Lord, so there is no doubt that his position is transcendental from the very beginning. A devotee does not live on the material plane – he lives in Kṛṣṇa.

The holy name of the Lord and the Lord are nondifferent; therefore when a devotee chants Hare Kṛṣṇa, Kṛṣṇa and His internal potency are dancing on the tongue of the devotee. When he offers Kṛṣṇa food, Kṛṣṇa directly accepts these eatables, and the devotee becomes Kṛṣṇa-ized by eating the remnants. One who does not engage in such service cannot understand how this is so, although this is a process recommended in the Bhagavad-gītā and in other Vedic literatures.

🌹 🌹 🌹 🌹 🌹



25 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 57 🍀

117. దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః |
సర్వదేవ మయోఽచింత్యో దేవతాత్మా ఆత్మ సంభవః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సచ్చిదానందం - సచ్చిదానంద మనునది వస్తుతః ఒక్కటే. పరబ్రహ్మము నందు ఈ మూడును మూడు కావు, ఒకటే వస్తువు. సత్తే (ఉనికి) చిత్తు (తెలివి), చిత్తే ఆనందము. వాటిని విడదీయుటకు వీలు లేదు. విడదీయ రానంతగా ఆన్యోన్యంగా ఆవి ఏకమై వున్నవి.🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: శుక్ల చతుర్దశి 29:48:38

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: రోహిణి 21:40:34 వరకు

తదుపరి మృగశిర

యోగం: శుభ 28:22:47 వరకు

తదుపరి శుక్ల

కరణం: గార 17:51:20 వరకు

వర్జ్యం: 13:33:20 - 15:10:40

మరియు 27:25:48 - 29:04:36

దుర్ముహూర్తం: 12:38:02 - 13:22:25

మరియు 14:51:11 - 15:35:34

రాహు కాలం: 08:06:12 - 09:29:25

గుళిక కాలం: 13:39:04 - 15:02:17

యమ గండం: 10:52:38 - 12:15:51

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37

అమృత కాలం: 18:25:20 - 20:02:40

సూర్యోదయం: 06:43:04

సూర్యాస్తమయం: 17:48:43

చంద్రోదయం: 16:16:59

చంద్రాస్తమయం: 05:00:50

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ

ఫలం 21:40:34 వరకు తదుపరి

ఆనంద యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹