🌹 18 NOVEMBER 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 18 NOVEMBER 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀
1) 🌹. కార్తిక పురాణం - 17 🌹
🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻
2) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575,576 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 575,576 - 1 🌹 
🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 1 / 575, 576. 'madhvipanalasa, matta' - 1 🌻
3) 🌹 శ్రీ చిదంబర అష్టకం 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కార్తిక పురాణం - 17 🌹*
*🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించు చున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగు చున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను.  'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక,  యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ'  యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది' అనుకోనునదియే ఆత్మ.  

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును,  ప్రకాశింప జేయు నటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే  'పరమాత్మ' యని గ్రహింపుము.  'తత్వమసి'  మొదలైన వాక్యము లందలి  'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము,  ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడి యున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 575, 576 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 1 🌻*

*మధుపానము గ్రోలి మత్తెక్కినట్లు గోచరించు శ్రీమాత అని అర్థము. మధు వనగా మధ్యము కాదు మధువు మేలుజాతి పుష్పములందేర్పడు అత్యంత మధురమైన రసము. ఆ రసమును గ్రోలి మత్తుగా నున్న కన్నులతో తన్మయత్వమున నుండునది శ్రీమాత. మధువు గ్రోలుట బాలకృష్ణుడు వెన్న దొంగిలించుట వంటిది. భక్తులు భగవదారాధనమున కరగి తన్మయులై యుండగా వారి హృదయ పద్మముల నుండి భక్తిరస ముద్భవించును. అట్టి భక్తిని మధురభక్తి అందురు. అట్టి భక్తియందు కలుగు రసము మధురసము. దానిని భగవంతుడు స్వీకరించి నపుడు భక్తులకు మహదానందము కలుగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 1 🌻*

*This phrase translates to "The divine mother who appears as if intoxicated by consuming honey." Here, the term "madhu" (honey) does not refer to ordinary liquor but rather to the exceptionally sweet nectar formed from the essence of superior flowers. The Mother Divine is depicted as experiencing a blissful intoxication, symbolizing divine absorption. The act of savoring honey here is akin to Lord Krishna stealing butter. Devotees, when deeply immersed in their worship and adoration, become one with their devotion. From their heart-lotuses arises a nectar called bhakti rasa (the essence of devotion). This pure and sweet devotion is known as madhura bhakti (sweet devotion). When this essence is offered to the Divine, it brings immense joy to the devotee.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శ్రీ చిదంబర అష్టకం 🌹*

*1) బ్రహ్మ ముఖామర వందిత లింగం! జన్మ జరా మరణాంతక లింగం|*
*కర్మ నివారణ కౌశల లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*2) కల్పక మూల ప్రతిష్ఠిత లింగం!దర్పక నాశ యుధిష్ఠిర లింగం|*
*కుప్రకృతి ప్రకరాంతక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*3) స్కంద గణేశ్వర కల్పిత లింగం!కిన్నర చారణ గాయక లింగం|*
*పన్నగ భూషణ పావన లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*4) సాంబ సదాశివ శంకర లింగం! కామ్య వరప్రద కోమల లింగం|*
*సామ్య విహీన సుమానస లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*5) కలిమల కానన పావక లింగం! సలిల తరంగ విభూషణ లింగం|*
*పలిత పతంగ ప్రదీపక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*6)అష్టతను ప్రతిభా సుర లింగం! విష్టపనాథ వికస్వర లింగం|*
*శిష్టజనావన శీలిత లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*7) అంతక మర్దన బంధుర లింగం! కృంతిత కామకలేబర లింగం|*
*జంతు హృది స్థిత జీవక లింగం! తన్మృదు పాతు చిదంబర లింగం||*

*8) పుష్టధియస్సు చిదంబర లింగం! దృష్టమిదం మనసాను పఠంతి|*
*అష్టకమే తదవాఙ్మన సీయం! అష్టతనుం ప్రతి యాంతి నరాస్తే||*

*ఇతి శ్రీచిదంబరాష్టకం సంపూర్ణము.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
*🌹📽️Chaitanya Vijnanam Channel 📽️🌹*
*Like, Subscribe and Share 👀*
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h