గీతోపనిషత్తు -101

🌹. గీతోపనిషత్తు -101 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 29. కర్మ నిర్వహణ - నియమములు - జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము . అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ నియమములను పాటించును.

1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట. 2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట. 3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట. 4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట. 5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట. 6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట. 🍀

33. శ్రేయాస్ ద్రవ్యమయా ద్యజ్ఞాద్ జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే || 33

ఓ అర్జునా! ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. కర్మము పరిసమాప్తి చెందు విధానము శ్రీకృష్ణుడు యిచ్చట తెలిపియున్నాడు. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము అనునది యిచ్చట తెలిపిన రహస్యము. అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ క్రింది నియమములను పాటించును.

1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట.

2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట.

3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట.

4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట.

5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట.

6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట.

పై సూత్రములను పాటించుచు, సమస్త కర్తవ్య కర్మలను నిర్వర్తించువాడు కర్మబద్ధత నుండి, క్రమముగ విముక్తి చెందును. అటు పైన దివ్యకర్మయందు భాగముగ నిలచును. దివ్యకర్మను కూడ పై సూత్రములాధారముగనే నిర్వర్తించును కనుక మోక్షస్థితి యందే యుండి, కర్మ నిర్వహణము చేయుచు నుండును. సనక సనందనాదులు, నారదమహర్షి, సప్తఋషులు, మనువులు అట్టివారు. వారు సృష్టియందు శాశ్వతులై జ్ఞానయజ్ఞమున నిలచి జీవులకు మార్గము చూపుచున్నారు.

ఈ శ్లోకము జ్ఞానయోగమునకు హృదయము వంటిది. ఎవరే పని గావించుచున్నను పై సూత్రములను పాటించుట వారిని ఆ పనుల నుండి విముక్తులను చేయును. ముక్తి మార్గమును చూపునదే జ్ఞానము. అది ఆచరణమున యిమిడి యున్నది. ఆచరణమున పై సూత్రములను పాటించని వారు ఎన్ని తెలిసినను, తెలియనివారే. జీవితమున బద్ధులే. బద్ధులైన వారు ఎంత చదివినను, తెలిసినను జ్ఞానులు కారు. బద్ధత లేనివారే జ్ఞానులు.

బంధచ్ఛేదనము గావించుకొనుటకు దైవమిచ్చినది నిష్కామ కర్మయోగము. అట్టియోగమున నిలచి, బంధములను పరిష్కరించుకొనుట జ్ఞానయోగ మగును. జ్ఞానము పేరిట శాస్త్రాధ్యయనము, క్రతువులు, మంత్రములు, తంత్రములు, పూజలు, అభిషేకములు, సత్కార్యములు చేయువారు కూడ పై సూత్రములను పాటించనిచో బద్దులే అగుచున్నారు. ఇది గమనించవలసిన విషయము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 299

🌹 . శ్రీ శివ మహా పురాణము - 299 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

72. అధ్యాయము - 27

🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 3 🌻

మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు (40). యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు (41). మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని (42). హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము (43).

ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు (44). కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు (45).

బ్రహ్మఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను (46).

దధీచుడు ఇట్లు పలికెను -

శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు (47). దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను (48). తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి (49). దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను (50).

దక్షుడిట్లు పలికెను -

శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి (51). ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను (52).

వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు (53). మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు (54).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి (55). ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము (56).

శ్రీశివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 186

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 186 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి - 6 🌻

35. ఆహారం ప్రాణశక్తి కోసమేకదా! ఆప్రాణశక్తి సర్వత్రా వ్యాపించిఉంది. ఉదకంలో ఉంది. ఆకాశంలో ఉంది. నీళ్ళలో ఉంది. గాలిలో ఉంది. ప్రాణశక్తి అనేది తినే ముద్దలోమాత్రమే లేదు. కాబట్టి ఆహారంతో నిమిత్తం లేకుండా వేరుగా ప్రాణశక్తిని ఎవరయితే తమలోకి తీసుకోగలరో వాళ్ళు తపస్సుకు యోగ్యమయిన శరీరాన్ని కలిగినవాళ్ళు. అట్లాంటివాళ్ళు ఆహారంమీద ఆధారపడి ఉండనక్కరలేదు. ఇది శౌచవిధి.

36. నిత్యజీవితంలోకూడా శరీరకశౌచం కంటే మానశికశౌచం ప్రధానం. అందుకనే ‘సబాహ్యాభ్యంతరః శుచిః’ అనిచెప్పి బాహ్యము, లోపలకూడా శుద్ధికోసమని నీళ్ళుచల్లుకుంటారు. ఆచమనంచేస్తారు. ఈ ఆచమనం ఎందుకంటే, లోపల ఉండే అంతఃశౌచంకోసమని. ప్రాణాయామం చేస్తారు, లోపల్ ఉండేటటువంటి మాలిన్యంపోవాలని. ఇవన్నీ ప్రయత్నాలు. ఇంతకూ వీటన్నిటికీ అటీతమయినది సంకల్పము.

37. సృష్టిలో దేనియందయినా కరుణ, దయ, నిర్వికారము; అలగే అవమానము, సన్మానము రెండింటియందు సమదృష్టి-ఇవి శౌచానికి హేతువులవుతాయి. ఎందుకంటే క్రోధం అశుచినిస్తుంది లోపల. ఆశ అసుచినిస్తుంది. లోభంతోనూ అశుచి వస్తుంది. దేనియందయినా ఆశపెట్టుకుని అదికావాలంటే అది అశౌచికం. అది అశుచి. ఆగ్రహం అశుచే! లోభం, మోహం ఇవన్నీకూడా – అంతఃకరణలో ఉండే దోషాలన్నీకూడా-అంతఃకరణకు అశుచిని అపాదించేవే. కాబట్టి ఇవి లేకపోతే శౌచధర్మం కలుగుతుంది. ఈ అశుచి వదిలినవాడికి అంతఃకరణ పూర్తిగా వశమై, పరమశుచీభూతుడై అంతఃకరణలో తపస్సు చేస్తాడు.

38. అలా లేకపోతే, శరీరం ఎన్ని మాట్లు స్నానంచేసినా, ఆచమనం చేసినా, మంత్రోదకం చల్లుకున్నా తపస్సు పదినిమిషాలకంటే ఎక్కువ చెయ్యలేడు. కూర్చోలేడు. ఒక గంటసేపుకూడా నిలబడలేడు. ప్రాణాయామంచేయలేడు. వాయువును నిగ్రహించలేడు. కాబట్టి కలిలో మితాహారము, అంతఃశౌచము ఉండాలి. దానివలన ప్రాణాయామము మొదలైన నియమాలన్నీ లభిస్తాయి. వాటివల్ల మనుష్యుడు తపస్సుకు యోగ్యమైన అంతఃశరీరం కలిగినవాడు. తపస్సుకు పనికిరాని శరీరం వ్యర్థమయినటువంటిదే. మానవజన్మకు తపస్సుతప్ప కర్తవ్యమేముంది? ఏది సంపాదించినా నశించేదే కదా!.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 125

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 125 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 4 🌻

518. అనంత స్థితియందు ఎఱుకలేనట్టి అవిభాజ్యుడను శాశ్వతుడును అయిన భగవంతుడు, తన స్వీయ చైతన్యమును పొందుటకు పడిన దుర్భర వేదనలో ... భౌతిక ప్రపంచముయొక్క స్థూల చైతన్య పరిణామము పొడవునా, స్థూల -సూక్ష్మ - మనో ప్రపంచములను విస్తరింప చేయుచు, సూక్ష్మ మనోమయ ప్రపంచముల యొక్క - సూక్ష్మ మనోమయ భూమికలయొక్క చైతన్యమును అంతర్ముఖమొనర్చుచు, అసంఖ్యాకమైన విచ్చిన్నం సంస్కారములను ప్రోగుచేయుచు; ప్రయాణ మంతటా నశ్వరము బుద్బుదప్రాయమునైన ఉనికితో (జీవనము) సంగమించుచు పోవుచున్నాడు.

చివరకు పూర్ణ చైతన్యము పూర్తిగా అంతర్ముఖమై పూర్తిగా, తన అనంత స్థితిలో స్వాత్మనే పరమాత్మగా అనుభితి నొందుచున్నాడు.

519. ఆదిలో తన అనంత స్థితియందు స్పృహలేనట్టి భగవంతుడు విజ్ఞాన భూమికలో, ఇప్పుడు ఎఱుకగల్గి తాను నిజముగా ఎవరో, అట్టి వాడయ్యెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasra Namavali - 89

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasra Namavali - 89 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

ధనిష్ట నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 89. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !! 🍀

🍀 826. సహస్రార్చిః -
అనంతకిరణములు కలవాడు.

🍀 827. సప్తజిహ్వః -
ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

🍀 828. సప్తైథాః -
ఏడు దీప్తులు కలవాడు.

🍀 829. సప్తవాహనః -
ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

🍀 830. అమూర్తిః -
రూపము లేనివాడు.

🍀 831. అనఘః -
పాపరహితుడు.

🍀 832. అచింత్యః -
చింతించుటకు వీలుకానివాడు.

🍀 833. భయకృత్ -
దుర్జనులకు భీతిని కలిగించువాడు.

🍀 834. భయనాశనః -
భయమును నశింపచేయువాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 89 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Dhanishta 1st Padam

🌻 89. sahasrārciḥ saptajihvaḥ saptaidhāḥ saptavāhanaḥ |
amūrtiranaghōcintyō bhayakṛdbhayanāśanaḥ || 89 || 🌻

🌻 826. Sahasrārciḥ:
One with innumerable Archis or rays.

🌻 827. Sapta-jihvaḥ:
The Lord in his manifestation as Fire is conceived as having seven tongues of flame.

🌻 828. Saptaidhāḥ:
The Lord who is of the nature of fire has seven Edhas or forms of brilliance.

🌻 829. Saptavāhanaḥ:
The Lord in the form of Surya or sun has seven horses as his vehicles or mounts.

🌻 830. Amūrtiḥ:
One who is without sins or without sorrow.

🌻 831. Achintyo:
One who is not determinable by any criteria of knowledge, being Himself the witnessing Self- certifying all knowledge.

🌻 832. Anaghaḥ:
One who is without sins or without sorrow.

🌻 833. Bhayakṛud:
One who generates fear in those who go along the evil path. Or one who cuts at the root of all fear.

🌻 834. Bhaya-nāśanaḥ:
One who destroys the fears of the virtuous.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 174, 175 / Vishnu Sahasranama Contemplation - 174, 175

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 174, 175 / Vishnu Sahasranama Contemplation - 174, 175 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻174. మహావీర్యః, महावीर्यः, Mahāvīryaḥ🌻

ఓం మహావీర్యాయ నమః | ॐ महावीर्याय नमः | OM Mahāvīryāya namaḥ

మహత్ (ఉత్పత్తికారణం అవిద్యాలక్షణం) వీర్యం యస్య సః జగదుద్పత్తికి హేతువగు 'అవిద్య' అనెడు వీర్యము ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

తే. బుద్ధిఁ దోఁచిన న మ్మహాపురుషవరుఁడు, కార్య కారణ రూపమై ఘనత కేక్కి

భూరి మాయాభిధాన విస్ఫురిత శక్తి, వినుత కెక్కినయట్టి యవిద్య యందు. (199)

క. పురుషాకృతి నాత్మాంశ, స్ఫురణము గలశక్తి నిలిపి పురుషోత్తముఁ డీ

శ్వరుఁ డభవుం డజుఁడు, నిజో, దర సంస్థిత విశ్వ మపుడు దగఁ బుట్టించెన్‍. (200)

భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయాశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది.

ఈ విధంగా తన అంశనుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి, పుట్టుక లేనివాడూ, పురుషోత్తముడూ ఐన ఈశ్వరుడు తన కడుపులో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 174🌹

📚. Prasad Bharadwaj

🌻174. Mahāvīryaḥ🌻

OM Mahāvīryāya namaḥ

Mahat (utpattikāraṇaṃ avidyālakṣaṇaṃ) vīryaṃ yasya saḥ / महत् (उत्पत्तिकारणं अविद्यालक्षणं) वीर्यं यस्य सः His energy (vīrya) is the cause of origination of Mahat, an evolute of Prakr̥ti, which is of the nature of avidyā or ignorance.

Śrīmad Bhāgavata Canto 3, Chapter 5

Sā vā etasya saṃdraṣṭuḥ śaktiḥ sadasadātmikā,

Māyā nāma mahābhāga yayedaṃ nirmame vibhū. (25)

Kālavr̥ttyā tu māyāyāṃ guṇamayyāmadhokṣajaḥ

Puruṣeṇātmabūtena viryamādhatta vīryavān. (26)

Tato’bhavanmahattattvamavyaktātkālacoditāt,

Vijñānātmātmadehasthaṃ viśvaṃ vyañjaṃstamonudaḥ. (27)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे पञ्चमोऽध्यायः ::

सा वा एतस्य संद्रष्टुः शक्तिः सदसदात्मिका ।

माया नाम महाभाग ययेदं निर्ममे विभू ॥ २५ ॥

कालवृत्त्या तु मायायां गुणमय्यामधोक्षजः ।

पुरुषेणात्मबूतेन विर्यमाधत्त वीर्यवान् ॥ २६ ॥

ततोऽभवन्महत्तत्त्वमव्यक्तात्कालचोदितात् ।

विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जंस्तमोनुदः ॥ २७ ॥

The Lord is the seer and the external energy, which is seen, works as both cause and effect in the cosmic manifestation. O greatly fortunate Vidura, this external energy is known as māyā or illusion, and through her agency only is the entire material manifestation made possible.

The Supreme Living Being in His feature as the transcendental puruṣa incarnation, who is the Lord's plenary expansion, impregnates the material nature of three modes, and thus by the influence of eternal time the living entities appear.

Thereafter, influenced by the interactions of eternal time, the supreme sum total of matter called the mahat-tattva became manifested, and in this mahat-tattva the unalloyed goodness, the Supreme Lord, sowed the seeds of universal manifestation out of His own body.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 175 / Vishnu Sahasranama Contemplation - 175 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻175. మహాశక్తిః, महाशक्तिः, Mahāśaktiḥ🌻

ఓం మహాశక్తయే నమః | ॐ महाशक्तये नमः | OM Mahāśaktaye namaḥ

మహతీ శక్తిః సామర్థ్యం అస్య గొప్పదియగు శక్తి సామర్థ్యము ఇతనికి కలదు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకునుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుఆ.మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు. (78)

ఎవ్వనికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవో - లోకాలను పుట్టించి నశింపజేయడం కోసం తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడో, రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడో, అన్నింటిణీ చూస్తూ ఉంటాడో, ఆత్మ కాంతిలో వెలుగుతూ ఉంటాడో, అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ, ఊహలకూ అందరానివాడు. పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కరిస్తాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 175🌹

📚 Prasad Bharadwaj

🌻175. Mahāśaktiḥ🌻

OM Mahāśaktaye namaḥ

Mahatī śaktiḥ sāmarthyaṃ asya / महती शक्तिः सामर्थ्यं अस्य He has immense śakti or power and capacity; so He is Mahāśaktiḥ.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3

Na vidyate yasya ca janma karma vā na nāmarūpe guṇadoṣa eva vā,

Tathāpi lokāpyayasambhavāya yaḥ svamāyayā tānyanukālamr̥cchati. (8)

Tasmai namaḥ pareśāya brahmaṇo’nantaśaktaye,

Arūpāyorurūpāya nama aścaryakarmaṇo. (9)

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे, तृतीयोऽध्यायः ::

न विद्यते यस्य च जन्म कर्म वा न नामरूपे गुणदोष एव वा ।

तथापि लोकाप्ययसम्भवाय यः स्वमायया तान्यनुकालमृच्छति ॥ ८ ॥

तस्मै नमः परेशाय ब्रह्मणोऽनन्तशक्तये ।

अरूपायोरुरूपाय नम अश्चर्यकर्मणो ॥ ९ ॥

He who has no material birth, activities, name, form, qualities or faults; to fulfill the purpose for which this material world is created and destroyed, He comes in a form by His original internal potency and He who has unlimited powers in various forms - all free from material contamination, acting wonderfully - to Him I offer my respects to.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 135

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 135 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 65 🌻

కాబట్టి సాధకులందరు తప్పక సాధించవలసినటువంటి లక్షణం ‘నిష్కామకర్మ’. మరి అట్టి తటస్థ లక్షణాన్ని, సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వారు మాత్రమే, తనను తాను బుద్ధి నుంచి వేరుపరచుకుంటారు. ఎవరైతే అట్లా బుద్ధినుంచి వేరుగా అయ్యారో, వేరు పడ్డారో, స్వానుభూతమై, బుద్ధి సాక్షిణి, ‘సాక్షిణీ, సాక్షి వర్జితా’ అని లతితా సహస్రనామంలో కూడా వస్తుంది. కాబట్టి, బుద్ధి సాక్షిణి, అయినటువంటి స్థితికి చేరాలి. ఆ మహతత్త్వానికి చేరాలి. అప్పుడు సహజముగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. నేను ఈశ్వరుడను, అనీశ్వర భావం పోతుంది. నిరీశ్వర భావం పోతుంది. సదా అదే భావనలో ఉండడానికి నీవు ఉద్యుక్తమౌతావు.

ఎందుకంటే, అది ఆనందప్రదం. అది సహజముగా ఆనందనిలయం. కాబట్టి, ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవటం ద్వారానో ఇప్పటి వరకూ కలుగుతున్న వన్నీ, సంతోషములు, సుఖదుఃఖములు. నిజానికి ఆనందములు కావు. కారణ రహితమైనటువంటి సుఖము ఏదైతే ఉందో, అదే, దాని పేరే ఆనంద ప్రతిబింబము.

అక్కడ సుఖదుఃఖాలు అనే అలలు లేవు. సాగర గర్భము వలె గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. నిరంతరాయమైనటువంటిది. నిరుపమానమైనటువంటిది. నిశ్చలమైనటువంటిది. అటువంటి నిశ్చలము - నీరవత్‌ స్థితికి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు, ఈ అభిమానము అనేటటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ అభిమానము అనే తెర తొలగించబడాలి. ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు ఉన్నది. అమ్మ యొక్క అనుగ్రహం చేత, మానవులందరు ఈ తెర తొలగించబడి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

ఈశ్వరుడే సర్వజీవులకు తండ్రి. ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో, నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయుక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నింటిని, ప్రకృతి యొక్క వరదానంగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా, ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడానికి మార్గంగా, ఇచ్చినది కాదనక, రానిది కోరక, తన కర్తవ్యాన్ని సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, తన కర్తవ్యాన్ని నాలుగు ఆశ్రమ ధర్మాలలో స్పష్టంగా ఎవరైతే నిర్వచించుకుని ధర్మంతో నిర్వహిస్తారో, మోక్ష కాంక్షతో నిర్వహిస్తారో,

సామాన్యముగా నిర్వహిస్తారో, విశేషమైనటువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారో, మానసికమైనటువంటి పరిణతి, బుద్ధి యొక్క పరిణతి చేత, నిష్కామ కర్మను సిద్ధింప చేసుకుని, ఆ నైష్కర్మ్యసిద్ధి యొక్క బలం చేత, నేను అనేటటువంటి అహంభావనను తొలగించుకుని, ఆ నేను స్థానంలో, ఈశ్వరుడే కర్త, ఈ పిల్లవాడిని ఎవరు చదివించారమ్మా ఇంత బాగా? నేనే చదివించానండి! ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడు? నా వల్లే అయ్యాడండి! ఈ రకమైనటువంటి కర్తృత్వభావాన్ని త్యజించాలన్నమాట.

ఈ భర్తగారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా? అంటే నేనే అయ్యానండీ అని ఏ భార్యా చెప్పదు. నావల్లే ఈయన ఇంతవాడయ్యాడండి, ఆయన చెప్పుకుంటాడు. నా భార్య యొక్క సహకారం చేత, నేను ఇంతవాడిని అయ్యాను. నేను ఈ పనులన్నీ సాధించాను. అట్లాగే భార్యగారు కూడా చెప్పుకుంటారు, నా భర్తగారి యొక్క సహకారం వల్ల నేను ఈ పనులన్నీ చేయగలిగాను. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానము ప్రవేశిస్తుంది.

ప్రశంస ద్వారా కూడా అభిమానము కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొంగక, కుంగక ఉంటారు. ప్రశంస చేత పొంగరు, తెగడ్త చేత కుంగరు.

ఓహో! అలాగా? ఈశ్వరానుగ్రహం. అని ఎవరైనా ఒక వేళ ప్రశంసించినప్పటికీ కూడా, ఆ ప్రశంసలన్నీ ఈశ్వరునికి ధారపోస్తారు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం.... అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళేమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి, ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్నేమీ బాధించలేదుగా. మనమేమీ దానిని స్వీకరించలేదు.

అట్లా మానసికంగా భౌతికంగా శరీరభావన నుంచి, దేహభావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి, తనను తాను వేరుచేసుకోవడానికి, ఈ సాంఖ్యవిచారణ క్రమాన్ని, ఈ పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణకు, పంచకోశ నిరసనకు ప్రతీ ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి. ఇది ఆంతరిక సాధన. ఇది ప్రతి నిత్యం చేయవలసినటువంటి సాధన. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 9 🍀

విష్ణువీణ్ జప్ వ్యర్ద్ త్యాచే జ్ఞాన్!
రామకృష్ఠీ మన్ నాహీ జ్యాచే!!

ఉపజోని కరంటా నేణే అద్వైత వాటా!
రామకృషీ పైఠా కైసేని హెయ్ ?!!

ద్వైతా చీ ఝాడణీ గురువీణ జ్ఞాన్!
తయా కైచే కీర్తన ఘడేల్ నామీ!!

జ్ఞానదేవ మణే సగుణ హే ధ్యాన్!
నామపాఠమౌన్ ప్రపంచాచే!!

భజన

II రామకృష్ణ హరే జయజయ రామకృష్ణ హరే ||

భావము:

విష్ణువుతో సంబంధము లేని జపము మరియు జ్ఞానము వ్యర్థము. వీరికి రామ కృష్ణులందు మనస్సు లగ్నం కాదు. ఈ మౌడ్యులు అద్వైత మార్గమున పయనించ జాలరు. కావున వీరికి ఏ విధముగ రామ కృష్ణుల కృప లభించగలదు.?

గురుబోధకానిదే ద్వైతము తొలగదు, జ్ఞానము కలుగదు. మరి భగవంతున్ని కీర్తించే భాగ్యము ఎలా సాధ్యము కాగలదు? ప్రపంచ విషయాల ఆసక్తి వదిలి వేసి సగుణ రూపాలను ధ్యానము చేయుచు మౌనముగా నామ పఠన చేయవలెనని జ్ఞానదేవులు అన్నారు.

🌻. నామ సుధ -9 🌻

విష్ణువును వీడి పోయిన జపము

వ్యర్థమగును వారి జ్ఞానము

రామకృష్ణులలో లేదు విశ్వాసము

మదిలో నిలవదు హరినామము

జన్మించి అయినది దుర్భాగ్యము

తెలుసుకోడు అద్వైత మార్గము

ఎరుగ జాలడు నామ తత్త్వము

రామకృష్ణ కృప ఎలా ప్రాప్తము?

ద్వైతము తొలగక పూర్వము

గురువు లేకనే జ్ఞానము

నామ కీర్తన చేసే భాగ్యము

ఎలా అవుతుంది సాధ్యము?

జ్ఞానదేవుని ప్రబోధము

సగుణ రూపమునే ధ్యానము

ప్రపంచ విషయంలో మౌనము

నామమునే పఠనము చేయుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalitha Chaitanya Vijnanam - 152

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖

🌻152. 'నిష్కారణా'🌻

కారణమేమియు లేకయే సృష్టి నిర్వహించునది శ్రీమాత. శ్రీమాత సృష్టి నిర్మాణము చేయుటకు వ్యక్తిగతముగా కారణ మేమియు లేదు. తన కోసము కాక జీవుల కొఱకు సృష్టి నిర్మాణము గావించు చున్నది. సృష్టి నిర్మాణము చేయుటలో ఆమె కొరుగునది ఏమియు లేదు. సృష్టి, స్థితి, లయములను జీవుల కొఱకే గావించు చున్నది. తాను ఆనందస్వరూపిణి. అట్టి ఆనందము కొఱకే జీవులు కూడ ప్రయత్నించుచున్నారు.

జనన మరణ చక్రముల పడుచు ఆనందము కొఱకై అన్వేషణము గావించువారు జీవులు. వారికి, వారి వారి పరిమణాములను బట్టి దేహములను అందించుచు, లోకములను సృష్టించుచు శాశ్వతముగా ఉండునది శ్రీమాత. ఆమె వరకు ఆమె నిష్కారణమే. కాని ఆమె కారణముగ సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. ఆమె లేనిచో జీవులకు చైతన్యమే లేదు. త్రిగుణములు లేవు. దేహములు లేవు. తామున్నామని కూడ వారికి తెలియుట శ్రీమాత వలననే. కారణము లేకయే ఇతరుల శ్రేయస్సు కొఱకు వర్తించువారు యోగులు.

ఋషులు, సిద్ధులు, దేవతలలో కొందరు ఇట్లు శ్రీదేవి వలె సృష్టి జీవులకు తోడ్పాటు గావించుచున్నారు. ఇట్టి నిష్కారణు లందరూ దేవి సైన్యమే. వీరి జీవితము యజ్ఞార్థము. ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల శ్రేయస్సునకు పనిచేయుట యజ్ఞము. అట్టి యజ్ఞముగ జీవితమును నిర్వర్తించుకొనుట దేవీ సైన్యమున చేరుటకు అర్హత, స్వార్థజీవితము నుండి నిస్వార్థము, శ్రేయోదాయకము అగు జీవనమునకు తమను తాము మలచుకొనుట సాధన.

“యజ్ఞార్థమ్ కురు కర్మాణి” అని శ్రీకృష్ణుడు శాసించుటలోని పరమార్ధము ఇదే. యోగి జనులకు, యోగసాధకులకు శ్రీదేవి సాన్నిధ్యమే గమ్యము. జీవులకు, సృష్టికి ఆమె ఆధారము, కారణము. ఆమె మాత్రము 'నిష్కారణ'యే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Niṣkāraṇā निष्कारणा (152)🌻

She is without cause. Kāraṇa means that which is invariably antecedent to some product. She is beyond descendance yet another quality of the Brahman. But the universe descends from Her.

Śvetāśvatara Upaniṣad (VI.9) says “There is none in this world who is His master or who governs Him, and here is nothing by which He can be identified. He is the cause of all. He is also the lord of the jīva (soul), who is the lord of the sense organs. No one is His creator and no one is His controller”.

She is invoked in Śrī Cakra by addressing Her as kāranānanda vigrahe (कारनानन्द विग्रहे).It means that She is the blissful elementary matter for manifestation of the universe. Therefore, She is the cause for the universe and there is no cause for Her.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Dec 2020

18-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 174, 175 / Vishnu Sahasranama Contemplation - 174, 175🌹
3) 🌹 Daily Wisdom - 1 🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 135🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 156 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 80 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalita Chaitanya Vijnanam - 152 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 493 / Bhagavad-Gita - 493 🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 101 📚
11) 🌹. శివ మహా పురాణము - 299 🌹 
12) 🌹 Light On The Path - 54🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 186🌹 
14) 🌹 Seeds Of Consciousness - 250 🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 125 🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasranama - 89🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 26 , 27 🌴*

26. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద: పార్థ యుజ్యతే ||

27. యజ్ఞే తపసి దానే చ స్థితి: సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||

🌷. తాత్పర్యం : 
భక్తియుతసేవా యజ్ఞమునకు పరమలక్ష్యమైన పరతత్త్వము “సత్” అను పదముచే సూచింపబడును. ఓ పృథాకుమారా! దివ్యములై యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఒనరింపబడు సర్వ యజ్ఞ, తపో, దానకర్మలవలె అట్టి యజ్ఞకర్త కూడా “సత్” అనబడును.

🌷. భాష్యము :
గర్భమునందు చేరుట మొదలుగా జీవితాంతము వరకు మనుజుని జీవన పవిత్రీకరణమునకై వేదవాజ్మయమున పెక్కు శుద్దికర్మలు ఉపదేశింపబడినవి “ప్రశస్తే కర్మణి” (విధ్యుక్తధర్మములు) యని పదము సూచించుచున్నది. జీవుని చరమమోక్షమునకై అట్టి పవిత్రీకరణవిధానములు అవలంబింపబడును. 

ఆ కార్యములన్నింటి యందును “ఓంతత్సత్” అను మంత్రమును ఉచ్చరింపవలెనని ఉపదేశింపబడినది. ఇచ్చట “సద్భావే” మరియు “సాధుభావే” యను పదములు ఆధ్యాత్మికస్థితిని సూచించుచున్నవి. కృష్ణభక్తిభావనలో వర్తించుట “సత్త్వము” అనబడగా, కృష్ణభక్తిరసభావితుడైన భక్తుడు “సాధువు” అనబడును. 

ఆధ్యాత్మిక విషయములు భక్తుల సాంగత్యమున సుస్పష్టములు కాగలవని శ్రీమద్భాగవతమున (3.25.25) “సతాం ప్రసంగాత్” అను పదము ద్వారా తెలుపబడినది. అనగా సత్సాంగత్యము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజ్ఞానమును పొందలేరు. మంత్రదీక్షను ఒసగునప్పుడుగాని, యజ్ఞోపవీతమును వేయునప్పుడుగాని గురువు ఈ “ఓంతత్సత్” అను పదములను ఉచ్చరించును. 

అదే విధముగా అన్ని రకములైన యజ్ఞములందలి లక్ష్యము “ఓంతత్సత్” (భగవానుడు) అనునదియే. “తదర్థీయం” అను పదము శ్రీకృష్ణభగవానునికి సంబంధించిన సేవాకార్యములను సూచించును. అనగా ప్రసాదమును తయారుచేయుట, మందిరకార్యములందు సహకరించుట, శ్రీకృష్ణభగవానుని కీర్తిని ప్రచారము చేయుట వంటి సేవలన్నింటిని అది సూచించుచున్నది. 

కనుకనే కర్మలను పూర్ణమొనర్చి సర్వమును సమగ్రమొనర్చు నిమిత్తమై ఈ దివ్యములైన “ఓంతత్సత్” అను పదములు పలురీతుల ఉపయోగింపబడుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 582 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 26 , 27 🌴*

26.sad-bhāve sādhu-bhāve ca
sad ity etat prayujyate
praśaste karmaṇi tathā
sac-chabdaḥ pārtha yujyate

27. yajñe tapasi dāne ca
sthitiḥ sad iti cocyate
karma caiva tad-arthīyaṁ
sad ity evābhidhīyate

🌷 Translation : 
The Absolute Truth is the objective of devotional sacrifice, and it is indicated by the word sat. The performer of such sacrifice is also called sat, as are all works of sacrifice, penance and charity which, true to the absolute nature, are performed to please the Supreme Person, O son of Pṛthā.

🌹 Purport :
The words praśaste karmaṇi, or “prescribed duties,” indicate that there are many activities prescribed in the Vedic literature which are purificatory processes, beginning from the time of conception up to the end of one’s life. 

Such purificatory processes are adopted for the ultimate liberation of the living entity. In all such activities it is recommended that one vibrate oṁ tat sat. 

The words sad-bhāve and sādhu-bhāve indicate the transcendental situation. Acting in Kṛṣṇa consciousness is called sattva, and one who is fully conscious of the activities of Kṛṣṇa consciousness is called a sādhu.

 In the Śrīmad-Bhāgavatam (3.25.25) it is said that the transcendental subject matter becomes clear in the association of the devotees. The words used are satāṁ prasaṅgāt. Without good association, one cannot achieve transcendental knowledge. When initiating a person or offering the sacred thread, one vibrates the words oṁ tat sat. 

Similarly, in all kinds of performance of yajña the object is the Supreme, oṁ tat sat. The word tad-arthīyam further means offering service to anything which represents the Supreme, including such service as cooking and helping in the Lord’s temple, or any other kind of work for broadcasting the glories of the Lord. 

These supreme words oṁ tat sat are thus used in many ways to perfect all activities and make everything complete.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 174, 175 / Vishnu Sahasranama Contemplation - 174, 175 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻174. మహావీర్యః, महावीर्यः, Mahāvīryaḥ🌻*

*ఓం మహావీర్యాయ నమః | ॐ महावीर्याय नमः | OM Mahāvīryāya namaḥ*

మహత్ (ఉత్పత్తికారణం అవిద్యాలక్షణం) వీర్యం యస్య సః జగదుద్పత్తికి హేతువగు 'అవిద్య' అనెడు వీర్యము ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
తే. బుద్ధిఁ దోఁచిన న మ్మహాపురుషవరుఁడు, కార్య కారణ రూపమై ఘనత కేక్కి
భూరి మాయాభిధాన విస్ఫురిత శక్తి, వినుత కెక్కినయట్టి యవిద్య యందు. (199)
క. పురుషాకృతి నాత్మాంశ, స్ఫురణము గలశక్తి నిలిపి పురుషోత్తముఁ డీ
శ్వరుఁ డభవుం డజుఁడు, నిజో, దర సంస్థిత విశ్వ మపుడు దగఁ బుట్టించెన్‍. (200)

భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయాశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది.

ఈ విధంగా తన అంశనుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి, పుట్టుక లేనివాడూ, పురుషోత్తముడూ ఐన ఈశ్వరుడు తన కడుపులో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 174🌹*
📚. Prasad Bharadwaj 

*🌻174. Mahāvīryaḥ🌻*

*OM Mahāvīryāya namaḥ*

Mahat (utpattikāraṇaṃ avidyālakṣaṇaṃ) vīryaṃ yasya saḥ / महत् (उत्पत्तिकारणं अविद्यालक्षणं) वीर्यं यस्य सः His energy (vīrya) is the cause of origination of Mahat, an evolute of Prakr̥ti, which is of the nature of avidyā or ignorance.

Śrīmad Bhāgavata Canto 3, Chapter 5
Sā vā etasya saṃdraṣṭuḥ śaktiḥ sadasadātmikā,
Māyā nāma mahābhāga yayedaṃ nirmame vibhū. (25)
Kālavr̥ttyā tu māyāyāṃ guṇamayyāmadhokṣajaḥ
Puruṣeṇātmabūtena viryamādhatta vīryavān. (26)
Tato’bhavanmahattattvamavyaktātkālacoditāt,
Vijñānātmātmadehasthaṃ viśvaṃ vyañjaṃstamonudaḥ. (27)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे पञ्चमोऽध्यायः ::
सा वा एतस्य संद्रष्टुः शक्तिः सदसदात्मिका ।
माया नाम महाभाग ययेदं निर्ममे विभू ॥ २५ ॥
कालवृत्त्या तु मायायां गुणमय्यामधोक्षजः ।
पुरुषेणात्मबूतेन विर्यमाधत्त वीर्यवान् ॥ २६ ॥
ततोऽभवन्महत्तत्त्वमव्यक्तात्कालचोदितात् ।
विज्ञानात्मात्मदेहस्थं विश्वं व्यञ्जंस्तमोनुदः ॥ २७ ॥

The Lord is the seer and the external energy, which is seen, works as both cause and effect in the cosmic manifestation. O greatly fortunate Vidura, this external energy is known as māyā or illusion, and through her agency only is the entire material manifestation made possible.

The Supreme Living Being in His feature as the transcendental puruṣa incarnation, who is the Lord's plenary expansion, impregnates the material nature of three modes, and thus by the influence of eternal time the living entities appear.

Thereafter, influenced by the interactions of eternal time, the supreme sum total of matter called the mahat-tattva became manifested, and in this mahat-tattva the unalloyed goodness, the Supreme Lord, sowed the seeds of universal manifestation out of His own body.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 175 / Vishnu Sahasranama Contemplation - 175 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻175. మహాశక్తిః, महाशक्तिः, Mahāśaktiḥ🌻*

*ఓం మహాశక్తయే నమః | ॐ महाशक्तये नमः | OM Mahāśaktaye namaḥ*

మహతీ శక్తిః సామర్థ్యం అస్య గొప్పదియగు శక్తి సామర్థ్యము ఇతనికి కలదు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకునుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుఆ.మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు. (78)

ఎవ్వనికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవో - లోకాలను పుట్టించి నశింపజేయడం కోసం తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడో, రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడో, అన్నింటిణీ చూస్తూ ఉంటాడో, ఆత్మ కాంతిలో వెలుగుతూ ఉంటాడో, అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ, ఊహలకూ అందరానివాడు. పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కరిస్తాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 175🌹*
📚 Prasad Bharadwaj 

*🌻175. Mahāśaktiḥ🌻*

*OM Mahāśaktaye namaḥ*

Mahatī śaktiḥ sāmarthyaṃ asya / महती शक्तिः सामर्थ्यं अस्य He has immense śakti or power and capacity; so He is Mahāśaktiḥ.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Na vidyate yasya ca janma karma vā na nāmarūpe guṇadoṣa eva vā,
Tathāpi lokāpyayasambhavāya yaḥ svamāyayā tānyanukālamr̥cchati. (8)
Tasmai namaḥ pareśāya brahmaṇo’nantaśaktaye,
Arūpāyorurūpāya nama aścaryakarmaṇo. (9)

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे, तृतीयोऽध्यायः ::
न विद्यते यस्य च जन्म कर्म वा न नामरूपे गुणदोष एव वा ।
तथापि लोकाप्ययसम्भवाय यः स्वमायया तान्यनुकालमृच्छति ॥ ८ ॥
तस्मै नमः परेशाय ब्रह्मणोऽनन्तशक्तये ।
अरूपायोरुरूपाय नम अश्चर्यकर्मणो ॥ ९ ॥

He who has no material birth, activities, name, form, qualities or faults; to fulfill the purpose for which this material world is created and destroyed, He comes in a form by His original internal potency and He who has unlimited powers in various forms - all free from material contamination, acting wonderfully - to Him I offer my respects to.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 1 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
*✍️ Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 KNOWLEDGE IS FREEDOM 🌻*

The attainment of the Infinite Life is the supreme purpose of finite life. Knowledge and meditation have both their dear aim in the realisation of the Absolute.

Moksha is the highest exaltation of the self in its pristine nature of supreme perfection. Emancipation is the Consciousness of the Reality; not becoming something which previously did not exist, not travelling to another world of greater joy.

It is the knowledge of eternal existence, the awareness of the essential nature of Pure Being. It is the Freedom attained by knowing that we are always free.

Knowledge is not merely the cause for freedom; it is itself freedom.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 135 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 65 🌻*

కాబట్టి సాధకులందరు తప్పక సాధించవలసినటువంటి లక్షణం ‘నిష్కామకర్మ’. మరి అట్టి తటస్థ లక్షణాన్ని, సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వారు మాత్రమే, తనను తాను బుద్ధి నుంచి వేరుపరచుకుంటారు. ఎవరైతే అట్లా బుద్ధినుంచి వేరుగా అయ్యారో, వేరు పడ్డారో, స్వానుభూతమై, బుద్ధి సాక్షిణి, ‘సాక్షిణీ, సాక్షి వర్జితా’ అని లతితా సహస్రనామంలో కూడా వస్తుంది. కాబట్టి, బుద్ధి సాక్షిణి, అయినటువంటి స్థితికి చేరాలి. ఆ మహతత్త్వానికి చేరాలి. అప్పుడు సహజముగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. నేను ఈశ్వరుడను, అనీశ్వర భావం పోతుంది. నిరీశ్వర భావం పోతుంది. సదా అదే భావనలో ఉండడానికి నీవు ఉద్యుక్తమౌతావు.

    ఎందుకంటే, అది ఆనందప్రదం. అది సహజముగా ఆనందనిలయం. కాబట్టి, ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవటం ద్వారానో ఇప్పటి వరకూ కలుగుతున్న వన్నీ, సంతోషములు, సుఖదుఃఖములు. నిజానికి ఆనందములు కావు. కారణ రహితమైనటువంటి సుఖము ఏదైతే ఉందో, అదే, దాని పేరే ఆనంద ప్రతిబింబము. 

అక్కడ సుఖదుఃఖాలు అనే అలలు లేవు. సాగర గర్భము వలె గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. నిరంతరాయమైనటువంటిది. నిరుపమానమైనటువంటిది. నిశ్చలమైనటువంటిది. అటువంటి నిశ్చలము - నీరవత్‌ స్థితికి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు, ఈ అభిమానము అనేటటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ అభిమానము అనే తెర తొలగించబడాలి. ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు ఉన్నది. అమ్మ యొక్క అనుగ్రహం చేత, మానవులందరు ఈ తెర తొలగించబడి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు.

    ఈశ్వరుడే సర్వజీవులకు తండ్రి. ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో, నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయుక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నింటిని, ప్రకృతి యొక్క వరదానంగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా, ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడానికి మార్గంగా, ఇచ్చినది కాదనక, రానిది కోరక, తన కర్తవ్యాన్ని సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, తన కర్తవ్యాన్ని నాలుగు ఆశ్రమ ధర్మాలలో స్పష్టంగా ఎవరైతే నిర్వచించుకుని ధర్మంతో నిర్వహిస్తారో, మోక్ష కాంక్షతో నిర్వహిస్తారో, 

సామాన్యముగా నిర్వహిస్తారో, విశేషమైనటువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారో, మానసికమైనటువంటి పరిణతి, బుద్ధి యొక్క పరిణతి చేత, నిష్కామ కర్మను సిద్ధింప చేసుకుని, ఆ నైష్కర్మ్యసిద్ధి యొక్క బలం చేత, నేను అనేటటువంటి అహంభావనను తొలగించుకుని, ఆ నేను స్థానంలో, ఈశ్వరుడే కర్త, ఈ పిల్లవాడిని ఎవరు చదివించారమ్మా ఇంత బాగా? నేనే చదివించానండి! ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడు? నా వల్లే అయ్యాడండి! ఈ రకమైనటువంటి కర్తృత్వభావాన్ని త్యజించాలన్నమాట. 

ఈ భర్తగారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా? అంటే నేనే అయ్యానండీ అని ఏ భార్యా చెప్పదు. నావల్లే ఈయన ఇంతవాడయ్యాడండి, ఆయన చెప్పుకుంటాడు. నా భార్య యొక్క సహకారం చేత, నేను ఇంతవాడిని అయ్యాను. నేను ఈ పనులన్నీ సాధించాను. అట్లాగే భార్యగారు కూడా చెప్పుకుంటారు, నా భర్తగారి యొక్క సహకారం వల్ల నేను ఈ పనులన్నీ చేయగలిగాను. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానము ప్రవేశిస్తుంది.

    ప్రశంస ద్వారా కూడా అభిమానము కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొంగక, కుంగక ఉంటారు. ప్రశంస చేత పొంగరు, తెగడ్త చేత కుంగరు. 

ఓహో! అలాగా? ఈశ్వరానుగ్రహం. అని ఎవరైనా ఒక వేళ ప్రశంసించినప్పటికీ కూడా, ఆ ప్రశంసలన్నీ ఈశ్వరునికి ధారపోస్తారు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం.... అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళేమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి, ఎవరి గిఫ్ట్‌ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్నేమీ బాధించలేదుగా. మనమేమీ దానిని స్వీకరించలేదు. 

అట్లా మానసికంగా భౌతికంగా శరీరభావన నుంచి, దేహభావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి, తనను తాను వేరుచేసుకోవడానికి, ఈ సాంఖ్యవిచారణ క్రమాన్ని, ఈ పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణకు, పంచకోశ నిరసనకు ప్రతీ ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి. ఇది ఆంతరిక సాధన. ఇది ప్రతి నిత్యం చేయవలసినటువంటి సాధన. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. - విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 9 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 9 🍀*

విష్ణువీణ్ జప్ వ్యర్ద్ త్యాచే జ్ఞాన్!
రామకృష్ఠీ మన్ నాహీ జ్యాచే!!

ఉపజోని కరంటా నేణే అద్వైత వాటా!
రామకృషీ పైఠా కైసేని హెయ్ ?!!

ద్వైతా చీ ఝాడణీ గురువీణ జ్ఞాన్!
తయా కైచే కీర్తన ఘడేల్ నామీ!!

జ్ఞానదేవ మణే సగుణ హే ధ్యాన్!
నామపాఠమౌన్ ప్రపంచాచే!!

భజన
II రామకృష్ణ హరే జయజయ రామకృష్ణ హరే ||

భావము:
విష్ణువుతో సంబంధము లేని జపము మరియు జ్ఞానము వ్యర్థము. వీరికి రామ కృష్ణులందు మనస్సు లగ్నం కాదు. ఈ మౌడ్యులు అద్వైత మార్గమున పయనించ జాలరు. కావున వీరికి ఏ విధముగ రామ కృష్ణుల కృప లభించగలదు.? 

గురుబోధకానిదే ద్వైతము తొలగదు, జ్ఞానము కలుగదు. మరి భగవంతున్ని కీర్తించే భాగ్యము ఎలా సాధ్యము కాగలదు? ప్రపంచ విషయాల ఆసక్తి వదిలి వేసి సగుణ రూపాలను ధ్యానము చేయుచు మౌనముగా నామ పఠన చేయవలెనని జ్ఞానదేవులు అన్నారు.

*🌻. నామ సుధ -9 🌻*

విష్ణువును వీడి పోయిన జపము
వ్యర్థమగును వారి జ్ఞానము
రామకృష్ణులలో లేదు విశ్వాసము
మదిలో నిలవదు హరినామము
జన్మించి అయినది దుర్భాగ్యము
తెలుసుకోడు అద్వైత మార్గము
ఎరుగ జాలడు నామ తత్త్వము
రామకృష్ణ కృప ఎలా ప్రాప్తము?
ద్వైతము తొలగక పూర్వము
గురువు లేకనే జ్ఞానము
నామ కీర్తన చేసే భాగ్యము
ఎలా అవుతుంది సాధ్యము?
జ్ఞానదేవుని ప్రబోధము
సగుణ రూపమునే ధ్యానము
ప్రపంచ విషయంలో మౌనము
నామమునే పఠనము చేయుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 156 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
148

Sloka: 
Guru gitamimam devi suddhatattvam mayoditam | Gurum mam dhyayati premna hrdi nityam vibhavaya |

Siva says to Parvati that she should meditate upon him with devotion, treating him as Guru and constantly visualizing the Guru Gita and the Principle of Truth he revealed.

Sloka:
 Iyam cedbhakti bhavena pathyate sruyatethava | Likhyate dhiyate pumbih bhavedbhava vinasini ||

When one reads the Guru Gita with devotion, listens to it, writes it or gives it to others, ignorance is dispelled. There is so much power in the Guru Gita. Merely donating the book to another is enough. Giving someone the book saying, “I am giving you this book” is enough.

 Telling another person, “Study the Guru Gita, your difficulties will be removed” is enough. “I am going to study the Guru Gita, please sit with me and listen” is also enough. Reading, listening to or writing the Guru Gita is enough. Lot of people write the slokas in the Guru Gita. Anything you do along these lines will dispel your ignorance.

“Bhava vinasini” means that it dispels ignorance and grants knowledge. That is the specialty of Guru Gita. Normally, other sacred texts will say that your sins will be removed and that you will attain the position of Indra (the king of Gods). 

But, they will not say that the ignorance will be dispelled. All sacred texts say that if you read or listen to the text, to the great stories and instances in those sacred texts, you will get a lot of punya (merit) and will attain the position of Indra, but they will never say that you ignorance will be dispelled. Guru Gita is the only text that says that your ignorance will be dispelled. If you read the Guru Gita or listen to it, your sins and ignorance will be wiped away. The Guru Gita also says that your ignorance will be removed and that you will gain knowledge. No other sacred text says this.

Think about it a little bit. It says that your sins will be removed. How will your sins be removed? It is possible to get rid of sins without experiencing the outcome? Some people undertake Yajnas and vows and rituals to get rid of sins. They spend a little money to undertake this. How does that money come to them? Where does it come from? It only comes at the expense of someone. 

Some people may get angry when they hear this. “I did not torment anyone, you are saying that I tormented someone, but I did not. I worked very hard to earn this money” Yes, true, you worked hard to earn the money. That means, you tormented yourself to earn this money. You tormented yourself, depriving yourself of food and sleep, walking long distances, facing many obstacles, tolerating insults, tolerating hunger, thirst etc. It means that you tormented yourself, not others.

 You think your hard work is all yours, it’s up to you. But it’s true that you tormented yourself. You cannot deny that. Who gave you the right to torment your good and healthy body? Whose loss is it if you torment that body and prematurely lose your life? Hence, always remember that money is obtained only through torment. That’s why it’s called “sinful money” or “torment money”. Someone got tormented, someone is tormenting, and that is why there is money. That is why money is sinful. Great souls don’t even touch the money with their hands.

So, one may wonder if the sins get wiped away when one does Yajna with such sinful money. They do. But, only the sins from this birth get wiped away, not the sins you’ve been carrying on from previous births. Let’s see what happens next.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 152 / Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*

*🌻152. 'నిష్కారణా'🌻*

కారణమేమియు లేకయే సృష్టి నిర్వహించునది శ్రీమాత. శ్రీమాత సృష్టి నిర్మాణము చేయుటకు వ్యక్తిగతముగా కారణ మేమియు లేదు. తన కోసము కాక జీవుల కొఱకు సృష్టి నిర్మాణము గావించు చున్నది. సృష్టి నిర్మాణము చేయుటలో ఆమె కొరుగునది ఏమియు లేదు. సృష్టి, స్థితి, లయములను జీవుల కొఱకే గావించు చున్నది. తాను ఆనందస్వరూపిణి. అట్టి ఆనందము కొఱకే జీవులు కూడ ప్రయత్నించుచున్నారు. 

జనన మరణ చక్రముల పడుచు ఆనందము కొఱకై అన్వేషణము గావించువారు జీవులు. వారికి, వారి వారి పరిమణాములను బట్టి దేహములను అందించుచు, లోకములను సృష్టించుచు శాశ్వతముగా ఉండునది శ్రీమాత. ఆమె వరకు ఆమె నిష్కారణమే. కాని ఆమె కారణముగ సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. ఆమె లేనిచో జీవులకు చైతన్యమే లేదు. త్రిగుణములు లేవు. దేహములు లేవు. తామున్నామని కూడ వారికి తెలియుట శ్రీమాత వలననే. కారణము లేకయే ఇతరుల శ్రేయస్సు కొఱకు వర్తించువారు యోగులు. 

ఋషులు, సిద్ధులు, దేవతలలో కొందరు ఇట్లు శ్రీదేవి వలె సృష్టి జీవులకు తోడ్పాటు గావించుచున్నారు. ఇట్టి నిష్కారణు లందరూ దేవి సైన్యమే. వీరి జీవితము యజ్ఞార్థము. ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల శ్రేయస్సునకు పనిచేయుట యజ్ఞము. అట్టి యజ్ఞముగ జీవితమును నిర్వర్తించుకొనుట దేవీ సైన్యమున చేరుటకు అర్హత, స్వార్థజీవితము నుండి నిస్వార్థము, శ్రేయోదాయకము అగు జీవనమునకు తమను తాము మలచుకొనుట సాధన. 

“యజ్ఞార్థమ్ కురు కర్మాణి” అని శ్రీకృష్ణుడు శాసించుటలోని పరమార్ధము ఇదే. యోగి జనులకు, యోగసాధకులకు శ్రీదేవి సాన్నిధ్యమే గమ్యము. జీవులకు, సృష్టికి ఆమె ఆధారము, కారణము. ఆమె మాత్రము 'నిష్కారణ'యే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 152 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niṣkāraṇā निष्कारणा (152)🌻*

She is without cause. Kāraṇa means that which is invariably antecedent to some product. She is beyond descendance yet another quality of the Brahman. But the universe descends from Her.

Śvetāśvatara Upaniṣad (VI.9) says “There is none in this world who is His master or who governs Him, and here is nothing by which He can be identified. He is the cause of all. He is also the lord of the jīva (soul), who is the lord of the sense organs. No one is His creator and no one is His controller”.

She is invoked in Śrī Cakra by addressing Her as kāranānanda vigrahe (कारनानन्द विग्रहे).It means that She is the blissful elementary matter for manifestation of the universe. Therefore, She is the cause for the universe and there is no cause for Her.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 493 / Bhagavad-Gita - 493 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 3 🌴*

03. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సమ్భవ: సర్వభూతానాం తతో భవతి భారత ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.

🌷. భాష్యము :
ఇదియే విశ్వమునందు జరుగుచున్న సమస్తమునకు వివరణము. ప్రతిదియు క్షేత్రము (దేహము) మరియు క్షేత్రజ్ఞుని (ఆత్మ) కలయికచే ఒనగూడుచున్నది. 

ఇట్టి ప్రకృతి, ఆత్మల కలయిక శ్రీకృష్ణభగవానునిచే సాధ్యము కావింపబడును. వాస్తవమునకు “మహతత్త్వము” సమస్త విశ్వమునకు సర్వ కారణమై యున్నది. త్రిగుణపూర్ణమైన ఆ మహతత్త్వమే కొన్నిమార్లు బ్రహ్మముగా పిలువబడును. దానియందే శ్రీకృష్ణభగవానుడు బీజప్రదానము చేయగా అసంఖ్యాకమగు విశ్వములు ఉత్పత్తి యగును. 

అట్టి మహతత్త్వము ముండకోపనిషత్తు (1.1.9) నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. “తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే”. 

అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల చతుర్వింశతి మూలకములన్నియును భౌతికశక్తిగా పరిగణింపబడును మరియ అవియే మహద్భ్రహ్మమనబడును భౌతికప్రకృతిని రూపొందించును. 

సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు దీనికి పరమైన దివ్య ప్రకృతియే జీవుడు. దేవదేవుని సంకల్పముచే భౌతికప్రకృతి యందు ఉన్నతప్రకృతి మిశ్రణము కావింపబడును. తదనంతరము జీవులందరును భౌతికప్రకృతి యందు జన్మింతురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 493 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 03 🌴*

03. mama yonir mahad brahma
tasmin garbhaṁ dadhāmy aham
sambhavaḥ sarva-bhūtānāṁ
tato bhavati bhārata

🌷 Translation : 
The total material substance, called Brahman, is the source of birth, and it is that Brahman that I impregnate, making possible the births of all living beings, O son of Bharata.

🌹 Purport :
This is an explanation of the world: everything that takes place is due to the combination of kṣetra and kṣetra-jña, the body and the spirit soul. This combination of material nature and the living entity is made possible by the Supreme God Himself. 

The mahat-tattva is the total cause of the total cosmic manifestation; and that total substance of the material cause, in which there are three modes of nature, is sometimes called Brahman. The Supreme Personality impregnates that total substance, and thus innumerable universes become possible. 

This total material substance, the mahat-tattva, is described as Brahman in the Vedic literature (Muṇḍaka Upaniṣad 1.1.19): tasmād etad brahma nāma-rūpam annaṁ ca jāyate. The Supreme Person impregnates that Brahman with the seeds of the living entities. 

The twenty-four elements, beginning from earth, water, fire and air, are all material energy, and they constitute what is called mahad brahma, or the great Brahman, the material nature. 

As explained in the Seventh Chapter, beyond this there is another, superior nature – the living entity. Into material nature the superior nature is mixed by the will of the Supreme Personality of Godhead, and thereafter all living entities are born of this material nature.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -101 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 29. కర్మ నిర్వహణ - నియమములు - జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము . అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ నియమములను పాటించును.*  
*1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట. 2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట. 3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట. 4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట. 5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట. 6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట. 🍀* 
 
*33. శ్రేయాస్ ద్రవ్యమయా ద్యజ్ఞాద్ జ్ఞానయజ్ఞః పరంతప |*
*సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే || 33*

ఓ అర్జునా! ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞమున, కర్మ మంతయును పరిసమాప్తి చెందుచున్నది. కర్మము పరిసమాప్తి చెందు విధానము శ్రీకృష్ణుడు యిచ్చట తెలిపియున్నాడు. జ్ఞానముతో యజ్ఞము చేయుటయే జ్ఞాన యజ్ఞము అనునది యిచ్చట తెలిపిన రహస్యము. అనగ తెలిసి కర్మను నిర్వర్తించుట. కర్మ, కర్తవ్యము రూపమున మనవద్దకు కాలానుసారముగ వచ్చుచుండును. దానిని నిర్వర్తించునపుడు తెలిసినవాడు ఈ క్రింది నియమములను పాటించును. 

1. ఫలాపేక్షలేక నిర్వర్తించుట. 
2. చేయవలసిన విధానము నెరిగి కర్తవ్యమును నిర్వర్తించుట. 
3. కర్తవ్యమును తప్పించుకొనకుండుట. 
4. కర్తవ్యము నిర్వర్తించునపుడు, వర్తనమున ఎక్కువ తక్కువలు లేకుండుట. 
5. అలసత్వము, అశ్రద్ధ, కాలయాపనము చేయకుండుట. 
6. నిర్వర్తింపబడుచున్న విషయములందు తగుల్కొనకుండుట, చిక్కుపడక యుండుట. వక్రగతుల ననుసరింపక సక్రమముగ ఓర్పుతో శ్రద్ధతో నిర్వర్తించుట.
 
పై సూత్రములను పాటించుచు, సమస్త కర్తవ్య కర్మలను నిర్వర్తించువాడు కర్మబద్ధత నుండి, క్రమముగ విముక్తి చెందును. అటు పైన దివ్యకర్మయందు భాగముగ నిలచును. దివ్యకర్మను కూడ పై సూత్రములాధారముగనే నిర్వర్తించును కనుక మోక్షస్థితి యందే యుండి, కర్మ నిర్వహణము చేయుచు నుండును. సనక సనందనాదులు, నారదమహర్షి, సప్తఋషులు, మనువులు అట్టివారు. వారు సృష్టియందు శాశ్వతులై జ్ఞానయజ్ఞమున నిలచి జీవులకు మార్గము చూపుచున్నారు.

ఈ శ్లోకము జ్ఞానయోగమునకు హృదయము వంటిది. ఎవరే పని గావించుచున్నను పై సూత్రములను పాటించుట వారిని ఆ పనుల నుండి విముక్తులను చేయును. ముక్తి మార్గమును చూపునదే జ్ఞానము. అది ఆచరణమున యిమిడి యున్నది. ఆచరణమున పై సూత్రములను పాటించని వారు ఎన్ని తెలిసినను, తెలియనివారే. జీవితమున బద్ధులే. బద్ధులైన వారు ఎంత చదివినను, తెలిసినను జ్ఞానులు కారు. బద్ధత లేనివారే జ్ఞానులు. 

బంధచ్ఛేదనము గావించుకొనుటకు దైవమిచ్చినది నిష్కామ కర్మయోగము. అట్టియోగమున నిలచి, బంధములను పరిష్కరించుకొనుట జ్ఞానయోగ మగును. జ్ఞానము పేరిట శాస్త్రాధ్యయనము, క్రతువులు, మంత్రములు, తంత్రములు, పూజలు, అభిషేకములు, సత్కార్యములు చేయువారు కూడ పై సూత్రములను పాటించనిచో బద్దులే అగుచున్నారు. ఇది గమనించవలసిన విషయము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 299 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
72. అధ్యాయము - 27

*🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 3 🌻*

మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు (40). యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు (41). మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని (42). హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము (43).

ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు (44). కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు (45).

బ్రహ్మఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను (46).

దధీచుడు ఇట్లు పలికెను -

శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు (47). దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను (48). తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి (49). దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను (50).

దక్షుడిట్లు పలికెను -

శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి (51). ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను (52). 

వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు (53). మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు (54).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి (55). ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము (56).

శ్రీశివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 54 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 3rd RULE
*🌻 Kill out desire of comfort. - Be happy as those are who live for happiness. - 11 🌻*

230. At the same time we must try to be very tolerant about it. We often feel impatient with the rampant, the brutal selfishness found everywhere, but that is useless. These unfortunate people are only carrying on now what was necessary for their development thousands of years ago. We should help them, if possible; we should always be gentle and tolerant, but very firm as to the necessity for getting rid of this point of view. 

Some of us find it helpful to try to realize the progress of humanity as a whole and to make a practice of thinking of ourselves as part of it. We try to act on the advice given by one of our Masters who once put it thus: “If you succeed in taking a step of some kind, if you succeed in making definite advancement, you should not think: ‘I have done this, I am really getting on’. 

The better way to put it is: ‘I am glad that this has happened, because humanity through me is just that much nearer to finding itself – that much nearer to the final goal which God means it to reach; humanity through me has taken this step, and the fact that it has done so means a very little advance for every other unit.” One may thus think of the whole of humanity, as a man thinks of the whole of his family, as a unit, from the baby to the old grandfather, and so considers the welfare of all.

231. We are told that we should live neither in the present nor the future, but in the Eternal. He who lives in the Eternal is the Logos, the Deity. He, living in the Eternal, sees the future as well as the present, sees the fulfilment of all these things. If we could raise ourselves up into His point of view we should be able to live in the Eternal as He does. That is not a thing that we can achieve to-day or to-morrow. 

We must fight our way towards it. A divine dissatisfaction is a necessity for our progress towards it. We must never be satisfied with the condition we have reached; that would at once mean stagnation. We must always aim at doing better and better, and by living in the future we shall learn how to do that.

232. At the same time, while we are always reaching forward, always striving upward, it is a mistake to allow ourselves to feel discontented or worried with regard to transitory happenings to the temporary condition of ourselves and others. It is wiser and better to project ourselves into the future and live in it. We should say: “I am at the moment such and such a person, with certain faults and failings. I am going to transcend these faults and failings. 

Let me look forward to the time when they will no longer exist.” It is a great thing to live for to-morrow and not for yesterday. The world at large is living for the centuries which lie behind it and is clinging to old prejudices. We should look forward to the future and live for that.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 186 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. విశ్వామిత్రమహర్షి - 6 🌻*

35. ఆహారం ప్రాణశక్తి కోసమేకదా! ఆప్రాణశక్తి సర్వత్రా వ్యాపించిఉంది. ఉదకంలో ఉంది. ఆకాశంలో ఉంది. నీళ్ళలో ఉంది. గాలిలో ఉంది. ప్రాణశక్తి అనేది తినే ముద్దలోమాత్రమే లేదు. కాబట్టి ఆహారంతో నిమిత్తం లేకుండా వేరుగా ప్రాణశక్తిని ఎవరయితే తమలోకి తీసుకోగలరో వాళ్ళు తపస్సుకు యోగ్యమయిన శరీరాన్ని కలిగినవాళ్ళు. అట్లాంటివాళ్ళు ఆహారంమీద ఆధారపడి ఉండనక్కరలేదు. ఇది శౌచవిధి.

36. నిత్యజీవితంలోకూడా శరీరకశౌచం కంటే మానశికశౌచం ప్రధానం. అందుకనే ‘సబాహ్యాభ్యంతరః శుచిః’ అనిచెప్పి బాహ్యము, లోపలకూడా శుద్ధికోసమని నీళ్ళుచల్లుకుంటారు. ఆచమనంచేస్తారు. ఈ ఆచమనం ఎందుకంటే, లోపల ఉండే అంతఃశౌచంకోసమని. ప్రాణాయామం చేస్తారు, లోపల్ ఉండేటటువంటి మాలిన్యంపోవాలని. ఇవన్నీ ప్రయత్నాలు. ఇంతకూ వీటన్నిటికీ అటీతమయినది సంకల్పము. 

37. సృష్టిలో దేనియందయినా కరుణ, దయ, నిర్వికారము; అలగే అవమానము, సన్మానము రెండింటియందు సమదృష్టి-ఇవి శౌచానికి హేతువులవుతాయి. ఎందుకంటే క్రోధం అశుచినిస్తుంది లోపల. ఆశ అసుచినిస్తుంది. లోభంతోనూ అశుచి వస్తుంది. దేనియందయినా ఆశపెట్టుకుని అదికావాలంటే అది అశౌచికం. అది అశుచి. ఆగ్రహం అశుచే! లోభం, మోహం ఇవన్నీకూడా – అంతఃకరణలో ఉండే దోషాలన్నీకూడా-అంతఃకరణకు అశుచిని అపాదించేవే. కాబట్టి ఇవి లేకపోతే శౌచధర్మం కలుగుతుంది. ఈ అశుచి వదిలినవాడికి అంతఃకరణ పూర్తిగా వశమై, పరమశుచీభూతుడై అంతఃకరణలో తపస్సు చేస్తాడు.

38. అలా లేకపోతే, శరీరం ఎన్ని మాట్లు స్నానంచేసినా, ఆచమనం చేసినా, మంత్రోదకం చల్లుకున్నా తపస్సు పదినిమిషాలకంటే ఎక్కువ చెయ్యలేడు. కూర్చోలేడు. ఒక గంటసేపుకూడా నిలబడలేడు. ప్రాణాయామంచేయలేడు. వాయువును నిగ్రహించలేడు. కాబట్టి కలిలో మితాహారము, అంతఃశౌచము ఉండాలి. దానివలన ప్రాణాయామము మొదలైన నియమాలన్నీ లభిస్తాయి. వాటివల్ల మనుష్యుడు తపస్సుకు యోగ్యమైన అంతఃశరీరం కలిగినవాడు. తపస్సుకు పనికిరాని శరీరం వ్యర్థమయినటువంటిదే. మానవజన్మకు తపస్సుతప్ప కర్తవ్యమేముంది? ఏది సంపాదించినా నశించేదే కదా!.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 250 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 99. The knowledge 'I am' means consciousness, God, Guru, Ishwara, but you the Absolute are none of these.🌻*

The knowledge 'I am' is but one of many names that have been attributed to it, like consciousness, God or Ishwara and Guru. Why so many names? 

Because the 'I am' is nameless and all these names have come by as it (the knowledge 'I am') intuitively revealed itself to different seekers who had deeply meditated on the 'I am'. Some saw it as God, some saw it as Brahman, some saw it as Guru and so forth. 

The ultimate revelation is, of course, that you stand apart from all these and are the Absolute, the formless, the eternal and totally free of all attributes.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 125 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 4 🌻*

518. అనంత స్థితియందు ఎఱుకలేనట్టి అవిభాజ్యుడను శాశ్వతుడును అయిన భగవంతుడు, తన స్వీయ చైతన్యమును పొందుటకు పడిన దుర్భర వేదనలో ... భౌతిక ప్రపంచముయొక్క స్థూల చైతన్య పరిణామము పొడవునా, స్థూల -సూక్ష్మ - మనో ప్రపంచములను విస్తరింప చేయుచు, సూక్ష్మ మనోమయ ప్రపంచముల యొక్క - సూక్ష్మ మనోమయ భూమికలయొక్క చైతన్యమును అంతర్ముఖమొనర్చుచు, అసంఖ్యాకమైన విచ్చిన్నం సంస్కారములను ప్రోగుచేయుచు; ప్రయాణ మంతటా నశ్వరము బుద్బుదప్రాయమునైన ఉనికితో (జీవనము) సంగమించుచు పోవుచున్నాడు.

చివరకు పూర్ణ చైతన్యము పూర్తిగా అంతర్ముఖమై పూర్తిగా, తన అనంత స్థితిలో స్వాత్మనే పరమాత్మగా అనుభితి నొందుచున్నాడు.

519. ఆదిలో తన అనంత స్థితియందు స్పృహలేనట్టి భగవంతుడు విజ్ఞాన భూమికలో, ఇప్పుడు ఎఱుకగల్గి తాను నిజముగా ఎవరో, అట్టి వాడయ్యెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasra Namavali - 89 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ధనిష్ట నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 89. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !*
*అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !! 🍀*

🍀 826. సహస్రార్చిః - 
అనంతకిరణములు కలవాడు.

🍀 827. సప్తజిహ్వః - 
ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

🍀 828. సప్తైథాః - 
ఏడు దీప్తులు కలవాడు.

🍀 829. సప్తవాహనః -
ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

🍀 830. అమూర్తిః - 
రూపము లేనివాడు.

🍀 831. అనఘః - 
పాపరహితుడు.

🍀 832. అచింత్యః - 
చింతించుటకు వీలుకానివాడు.

🍀 833. భయకృత్ - 
దుర్జనులకు భీతిని కలిగించువాడు.

🍀 834. భయనాశనః - 
భయమును నశింపచేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 89 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Dhanishta 1st Padam*

*🌻 89. sahasrārciḥ saptajihvaḥ saptaidhāḥ saptavāhanaḥ |*
*amūrtiranaghōcintyō bhayakṛdbhayanāśanaḥ || 89 || 🌻*