🌹 16, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 16, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 16, JUNE 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 385 / Bhagavad-Gita - 385 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 13 / Chapter 10 - Vibhuti Yoga - 13 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 232 / Agni Maha Purana - 232 🌹 
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 2 / Mode of conducting the bathing festival (snāna) - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 097 / DAILY WISDOM - 097 🌹 
🌻 6. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి / 6. Even Among Human Beings We have Various Grades 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 363 🌹
6) 🌹. శివ సూత్రములు - 99 / Siva Sutras - 99 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 2 / 2-07. Mātrkā chakra sambodhah   - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 16, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 49 🍀*

*49. అష్టకష్టహరే దేవి అష్టభాగ్యవివర్ధిని ।*
*మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అణచి వేయదగని హృదయ భావావేశం - ఈశ్వరుని యెడ పరమ ప్రేమతో ఆనంద బాష్పములు రాల్చే హృదయ భావావేశాన్ని ఎన్నడూ అణచి వేయరాదు. అట్టి భావావేశం సాధనకు అత్యంత సహాయకం. ఇంద్రియ వాంఛా ప్రవృత్తులతో కలగాపులగ మైనప్పుడు మాత్రమే భావావేశం సాధనకు భంగకరంగా తయారవుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 08:41:48 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: కృత్తిక 15:08:28 వరకు
తదుపరి రోహిణి
యోగం: ధృతి 25:22:44 వరకు
తదుపరి శూల
కరణం: వణిజ 08:41:48 వరకు
వర్జ్యం: 02:39:30 - 04:19:10
దుర్ముహూర్తం: 08:19:42 - 09:12:22
మరియు 12:43:01 - 13:35:41
రాహు కాలం: 10:37:56 - 12:16:41
గుళిక కాలం: 07:20:27 - 08:59:12
యమ గండం: 15:34:10 - 17:12:55
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 12:37:30 - 14:17:10
సూర్యోదయం: 05:41:43
సూర్యాస్తమయం: 18:51:40
చంద్రోదయం: 03:53:35
చంద్రాస్తమయం: 17:21:09
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ
లాభం 15:08:28 వరకు తదుపరి
మిత్ర యోగం - మిత్ర లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 385 / Bhagavad-Gita - 385 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 13 🌴*

*13. ఆహుస్త్వామృషయ: సర్వే దేవర్షిర్నారదస్తథా |*
*అసితో దేవలో వ్యాస: స్వయం చైవ బ్రవీషి మే ||*

🌷. తాత్పర్యం :
*నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు.*

🌷. భాష్యము :
*ఇప్పుడు ఆ భగవానుని కరుణచే అర్జునుడు వేదానుసారముననే అతనిని పరతత్త్వముగా అంగీకరించు చున్నాడు. అనగా శ్రీకృష్ణుడు తన స్నేహితుడు కనుక అతనిని పరతత్త్వమనియు, దేవదేవుడనియు అర్జునుడు ముఖస్తుతి చేయుటలేదు. కేవలము వేదానుసారమే అతడట్లు కీర్తించెను. అర్జునుడు ఈ రెండు శ్లోకములలో పలికినదంతయు వేదములచే నిర్దారింపబడినది. భక్తియుతసేవను చేపట్టినవాడే శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడుగాని ఇతరులు అందుకు సమర్థులు కారని వేదములు ద్రువీకరించుచున్నవి. అనగా అర్జునుడు పలికిన ప్రతిపదము కూడా వేదనిర్దేశముచే సమర్థింప బడుచున్నది.*

*పరబ్రహ్మము సర్వమునకు ఆశ్రయస్థానమని కేనోపనిషత్తు నందు తెలుపబడినది. అందుకు తగినట్లుగా శ్రీకృష్ణుడు సమస్తము తననే ఆశ్రయించియున్నదని పూర్వమే పలికియున్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన భగవానుడు తననే సదా చింతించువానికి మాత్రమే అనుభూతుడగునని ముండకోపనిషత్తు ధ్రువపరచుచున్నది. అట్లు కృష్ణుని గూర్చి సదా చింతించుటయే నవవిధభక్తిమార్గములలో ఒకటైన స్మరణము. శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారానే మనుజుడు తన నిజస్థితినెరిగి భౌతికదేహము నుండి విడివడగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 385 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 13 🌴*

*13. āhus tvām ṛṣayaḥ sarve devarṣir nāradas tathā*
*asito devalo vyāsaḥ svayaṁ caiva bravīṣi me*

🌷 Translation : 
*All the great sages such as Nārada, Asita, Devala and Vyāsa confirm this truth about You, and now You Yourself are declaring it to me.*

🌹 Purport :
*Vedic injunctions affirm that only one who takes to devotional service to the Supreme Lord can understand Him, whereas others cannot. Each and every word of this verse spoken by Arjuna is confirmed by Vedic injunction. In the Kena Upaniṣad it is stated that the Supreme Brahman is the rest for everything, and Kṛṣṇa has already explained that everything is resting on Him.*

*The Muṇḍaka Upaniṣad confirms that the Supreme Lord, in whom everything is resting, can be realized only by those who engage constantly in thinking of Him. This constant thinking of Kṛṣṇa is smaraṇam, one of the methods of devotional service. It is only by devotional service to Kṛṣṇa that one can understand his position and get rid of this material body.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 232 / Agni Maha Purana - 232 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 69*

*🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 2 🌻*

*మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ-అశ్వత్థ-వట-బిల్వ-ఉదుంబర-ప్లక్ష-జంబూ-శమీ-కపిత్థ వృక్షముల బెరుడునుండి తీసిన రసము పోయవలెను. అగ్నేయమునందున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ-పర్వ-గంగాజల-గజశాలా-తీర్థ-క్షేత్ర(పొలము) ఖల (కల్ళము) ములమట్టి ఉంచవలెను. దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగజంబీర-నింబ-ఖర్జూర-మృత్తికా-నారికేళ-పూగ-దాడిమ-పనసఫలము లుంచవలెను.*

*నైరృతిదిక్కున నవకమునందు మద్యక్షీర పూర్ణకుంభ ముంచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక-మాలతీ-మల్లికా-పున్నాగ-కరవీర-కమలకుసుమములుంచవలెను. పశ్చిమ నవక మధ్యమున నారికేలజాలపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర-కూప-వర్షా-హిమ, నిర్ఘర-దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య ననకమునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ-సింహీ-వ్యాఘ్రీ-అమృతా-విష్ణుపర్ణీ-దుర్వా-వచా అను దివ్యౌషదుల నుంచవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 232 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 69*
*🌻 Mode of conducting the bathing festival (snāna) - 2 🌻*

10. The remaining eight pitchers should be filled with the earth taken from loosening by cow’s horn, elephant’s tusk, horse hoofs, mountains, Ganges bed, sacred spots, rivers and fields.

11-12. In the nine pitchers on the south, the central one should be filled with sesamum. The other eight pitchers should be filled with nāraṅga, jambīra, kharjūra, nārikela (coconut), pūga (arecanut), pomegranate, panasa fruits. In the nine pitchers on the south-west, the central pitcher should be filled with milk.

13-15. (The remaining eight pitchers should be) duly (filled with) saffron (kuṅkuma), nāga, campaka, mālatī, jasmine, punnāga, karavīra, and mahotpala flowers. In the nine pitchers on the west, the central pitcher should contain the coconut water. (The other pitchers should contain) waters of the river, ocean, tank, well, rain water, water from the melted ice, waters of the falls, and of the Ganges. In the nine pitchers on the north-west the central one should have banana fruits.

16. The divine herbs sahadevī, kumārī, siṃhī, vyāghrī, amṛtā, viṣṇuparṇā, śataśivā and vacā should be placed in the other eight pitchers.

17-19. In the east and the northern (directions) among the nine pitchers one should place the central one having curd. The other pitchers should duly be filled with the fragrant substances—cardamom, tvacā, kuṣṭha, bālaka, the two varieties of sandal, the kastūrikā creeper and the black agallochum. (In the central pitcher among the nine pitchers on the north east) one should fill waters for purification. In the other pitchers we should have (the materials) candra, tāra, śukla, girisāra (iron), trapu (tin), camphor, śīrṣa and gems.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 97 / DAILY WISDOM - 97 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 6. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి 🌻*

*ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రకారం, అత్యల్ప స్థాయి క్రూర చైతన్యం, ఇది పరిపూర్ణ భౌతిక ఉనికి నుండి విడదీయరానిది. రెండవ దశ, దీని పైన, ప్రకృతికి ప్రతిస్పందించే స్వీయ-సంరక్షక చైతన్యం. ఇది మొక్కల జీవితంలో గమనించదగినది. మూడవ దశ ఇతరులలో తనను తాను కనుగొనాలనే మానసిక కోరిక. అవసరం మరియు ప్రేమ సమక్షంలో ఇది వ్యక్తీకరించబడుతుంది. ఈ చైతన్యం ప్రత్యేకంగా పునరుత్పత్తిలో తనను తాను కేంద్రీకరిస్తుంది.*

*నాల్గవది స్వీయ-చైతన్యం యొక్క దశ. ఇది ప్రత్యేకమైన మానవ చైతన్య దశ. ఇది కేవలం బాహ్య ఉద్దీపనలకు ప్రతిచర్య రూపంలో ఉన్న స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-పునరుత్పత్తి స్థాయి దాటిన చైతన్యం. అయినప్పటికీ, ఇక్కడ మానవ జీవితం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. మానవులలో కూడా మనకు వివిధ స్థాయిలు ఉన్నాయి: జంతు మనిషి, స్వార్థపరుడు, మంచి మనిషి, సాధువు మరియు దైవ మానవుడు అని ఉన్నాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 97 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 6. Even Among Human Beings We have Various Grades 🌻*

*According to Hegel, the renowned German philosopher, the lowest level is brute consciousness, which is inseparable from sheer material existence. The second stage, above this, is nature-reactive self-preservative consciousness, observable in plant life. The third stage is of a crude seeking of oneself in others, expressed in the presence of a psychological want, a need and a love which specifically concentrates itself in the reproductive consciousness.*

*The fourth is the stage of self-consciousness which is the special faculty of man, beyond the level of the mere animal satisfaction of self-preservation and self-reproduction in the form of reaction to external stimuli. Yet, human life here is incipient and not fully developed. Even among human beings we have various grades: there is the animal man, the selfish man, the good man, the saintly man and the God-man.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 362 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. 🍀*

*మనిషి అస్తిత్వంతో సంబంధ మేర్పరచు కోడానికి స్వచ్ఛమైన హృదయముండాలి. స్వచ్ఛంగా వుండడంతో బాటు నీలో మనసు ఆధిపత్య ముండకూడదు. మనసులో అధికారముంటే హృదయంలో స్వచ్ఛత వుండదు. అద్దానికి దుమ్ము పట్టినట్లు హృదయం పై మనసు పేరుకుని వుంటుంది. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛతకు నీతితో సంబంధం లేదు.*

*స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. కారణం అది అమాయకమైంది కాదు. అందువల్ల అది స్వచ్ఛమైంది కాదు. ఫలితంగా నీతి స్వచ్ఛతకు దారి తీయదు. స్వచ్ఛత తప్పక నీతిమంతమైందే అయితే మొదట స్వచ్ఛత వస్తుంది. నీతి దాన్ని అనుసరిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 099 / Siva Sutras - 099 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 2 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియుస్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*పరిపూర్ణ అవగాహన అంటే ఏమిటి అనే తదుపరి ప్రశ్న తలెత్తుతుంది. ఇది మునుపటి సూత్రం యొక్క పొడిగింపు. ఇది ఒకరి జ్ఞానోదయంలో గురువు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. మునుపటి సూత్రంలో చర్చించబడినట్లు గురువు సహాయంతో, శిష్యుడు 'నేనే అది' అనే ధృవీకరణ యొక్క ప్రాముఖ్యతను సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. కేవలం ధృవీకరణ వల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఈ ధృవీకరణ ఆశించే వ్యక్తి యొక్క మానసిక రంగంలో జరగాలి. ఇది జరగడానికి ఒకరి గురువు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 099 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 2 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*The next question arises as to what is meant by perfect understanding. This is an extension of the previous sūtra, which highlighted the importance of a guru in one’s enlightenment. With the help of the guru discussed in the previous sūtra, the disciple perfectly understands the significance of the affirmation “I am That”. Mere affirmation is of no use as this affirmation is to happen in the mental arena of the aspirant and one’s guru plays a significant role to make this happen.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 460. 'సుభ్రూ' - 2 🌻

భ్రూమధ్యమును, కనుబొమలను తిరువుగ నుంచుకొనుట భక్తులకు కర్తవ్యమై యున్నది. కుంకుమ, గంధము, విభూతి అలంకరించు కొనుట విధియై యున్నది. భ్రూమధ్యముయొక్క తేజమును బట్టియే జీవునికి తనపైనను, పరిసరముల పైనను గల స్వామిత్వము తెలియ గలదు. దైవధ్యానమునకు భ్రూమధ్యము ఉత్తమ స్థానము. భ్రూమధ్యమున మనస్సు లగ్నము చేయుట వలన దివ్య దర్శనములకు అవకాశము మెండుగ నుండును. రెండు కనుబొమలు రెండు కొండలుగ నడుమ నుండి వచ్చు సూర్య చంద్రాత్మకమగు కాంతిగ భక్తులు దర్శించి ఆనందమును పొందుదురు. ఇట్టి కాంతి దర్శనము మంగళప్రదము. నిత్యమూ ఇట్టి కాంతిని దర్శించుటకే గాయత్ర్యాది జప ధ్యానములు. తన యందు ఉదయించుచున్న ఈ కాంతిని నిత్యమూ దర్శించువారు తేజోవంతులై, యశోవంతులై, కీర్తివంతులై జీవింతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 460. 'Subhru' - 2 🌻


It is the duty of the devotees to keep the forehead and eyebrows clean. It is obligatory to put saffron, sandalwood or vibhuti ornaments there. Depending on the brilliance of centre of the brow, the living being can know the sovereignty over itself on its surroundings. Brow centre is the best place for meditate upon. As the mind concentrates on the brow centre, there is a chance for divine visions. The two eyebrows are like the two hillocks, and the light emanating from the brow centre is envisioned like the sun, the moon by the devotees. The vision of this light is auspicious. Gayathri meditations etc are to see this eternal light. Those who constantly see this light that rises in Him forever will be bright, prosperous and glorious.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 364. CHALLENGE OF THE WILD / ఓషో రోజువారీ ధ్యానాలు - 364. విశృంఖల విశాలత్వం యొక్క సవాలు



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 364 / Osho Daily Meditations - 364 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 364. విశృంఖల విశాలత్వం యొక్క సవాలు 🍀

🕉. ఇది ప్రారంభం మాత్రమే. మీరు మరింత వింత భూములను దాటవలసి ఉంటుంది. ఏ కల్పన కంటే సత్యం వింతైనది. అయితే ధైర్యంగా ఉండండి. 🕉


మీరు మీ లోపలికి ప్రవేశించడానికి ముందు, మీ గురించి మీకు ఎంతో తెలియదని మీకు తెలియదు. మీరు మీ జీవి యొక్క ఒక భాగంతో జీవిస్తున్నారు. మీరు నీటి బిందువులా జీవిస్తుంటే, మీ జీవి సముద్రం వంటిది. మీరు చెట్టు యొక్క ఆకుతో గుర్తించబడ్డారు కానీ మొత్తం చెట్టు మీకు చెందినది. అవును, ఇది చాలా వింతగా ఉంటుంది, ఎందుకంటే మీరు విస్తరించడం ప్రారంభిస్తారు. కొత్త వాస్తవాలను గ్రహించాలి. ప్రతి క్షణం మీరు ఎప్పుడూ చూడని వాస్తవాలను తెలుసుకోవాలి.

కాబట్టి ప్రతి క్షణం ఒక అశాంతి మరియు గందరగోళం నిరంతరంగా ఉంటుంది. మీరు ఎప్పటికీ స్థిరపడలేరు. మీరు ఎప్పటికీ ఖచ్చితంగా ఉండలేరు, ఎందుకంటే తదుపరి క్షణంలో మీకు ఏమి తెరవబడుతుందో ఎవరికి తెలుసు? అందుకే మనుషులు ఎప్పుడూ లోపలికి వెళ్లరు. స్థిరమైన జీవితాన్ని గడుపుతారు. ఉన్న కొద్దిపాటి భూమిని చదును చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. కళ్లు మూసుకుని పెద్ద పెద్ద కంచెలు, గోడలు కట్టి 'ఇది ఇంతవరకే’ అనుకుంటారు. కానీ గోడకు అవతల వారి నిజమైన, విశృంఖలమైన జీవితం వారి కోసం వేచి ఉంది. అదే సవాలు, విశృంఖల విశాలత్వం యొక్క పిలుపు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 364 🌹

📚. Prasad Bharadwaj

🍀 364. CHALLENGE OF THE WILD 🍀

🕉. This is just a beginning. You will have to pass through more and more strange lands. Truth is stranger than any fiction. But be courageous. 🕉


Before you start entering inside yourself, you don't know how much of yourself was never known to you. You were living with just a fragment of your being. You were living like a drop of water, and your being is like an ocean. You were identified with just the leaf of the tree, and the whole tree belongs to you. Yes, it is very strange, because one starts expanding. New realities have to be absorbed. Each moment one has to come across facts that one has never come across.

So each moment there is an unsettlement, and the chaos becomes continuous. You can never settle. You can never become certain, becau se who knows what is going to be opened to you in the next moment? That's why people never go in. They live a settled life. They have cleared a small land of their being and made their house there. They have closed their eyes and have made big fences and walls, so they think, "This is all." And just beyond the wall is their real, wild being waiting for them. That is the challenge, the call of the wild.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 745 / Sri Siva Maha Purana - 745


🌹 . శ్రీ శివ మహా పురాణము - 745 / Sri Siva Maha Purana - 745 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴

🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 4 🌻


బ్రహ్మయొక్క శిరస్సును దునిమిన వాడు, బ్రహ్మచే మరియు చంద్రునిచే స్తుతింపబడిన వాడు, పరబ్రహ్మ, పరమాత్మ అగు నీకు అనేక నమస్కారములు (27). అగ్నివి నీవే. వాయువు నీవే. ఆకాశము నీవే. జలములు నీవే. భూమి నీవే. సూర్యుడు నీవే. చంద్రుడు నీవే. నక్షత్రములు నీవే. జ్యోతిర్మండలములతో నిండిన బ్రహ్మాండము నీవే (28).

విష్ణువు నీవే. బ్రహ్మ నీవే. వారిచే స్తుతింపబడే పరమేశ్వరుడవు నీవే. సనకాది మహర్షులు నీ స్వరూపమే. తపోధనుడగు నారదుడవు నీవే (29). సర్వలోకములకు ప్రభువు నీవే. జగత్స్వరూపుడవు నీవే. సర్వపదార్థములయందు అనుగతముగ నుండు వాడవు నీవే. కాని నీవు సర్వము కంటె భిన్నుడవు. నీవు ప్రకృతికంటె అతీతుడవు (30). రజోగుణమునాశ్రయించి బ్రహ్మ అను పేరును పొంది నీవేలోకములను సృష్టించుచున్నావు. సత్త్వ గుణమునాశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలించుచున్నావు (31). ఓ మహదేవా! నీవే తమోగుణమునాశ్రయించి హరరూపమును ధరించి పంచభూతాత్మకమగు బ్రహ్మాండము నంతనూ లీలగా ఉపసంహరించెదవు (32).

ఈ జగత్తు నీ కల్పనయే. సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలముచే తపించుచున్నాడు. నీ ధ్యానబలముచే చంద్రుడు లోకములో అమృతకిరణములను వెదజల్లుచున్నాడు. వాయువు వీచుచున్నాడు (33). ఓ శంకరా! నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి. నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకములను తన సంతానమును వలె రక్షించుచున్నాడు (34) నిన్ను ధ్యానించిన బలము చేతనే దేవతలు అందరు తమ తమ అధికారములను ప్రవర్తిల్ల జేయుచున్నారు. నీ భయముచే వారు అట్లు చేయుచున్నారు. నీ ధ్యానముచే మహర్షులు అమోఘమగు తపస్సు గల వారగుచున్నారు (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 745🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴

🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 4 🌻


27. Obeisance to the destroyer of Brahmā’s head,[3] the one eulogised by Brahmā and the moon. Obeisance to you favourably disposed to Brahmins. Obeisance to you the great soul.

28. You are the fire, the wind, the ether, the waters, the earth, the sun, the moon, the stars, and the solar system.

29. You alone are Viṣṇu, Brahmā, and eulogised by them; you are the great lord, the sages Sanaka etc. You are Nārada the great saint.

30. You alone are the lord of all the worlds, the soul of the universe. You are converging in everything and different from everything; you alone are greater than Prakṛti.

31. With the Rajas attribute you alone create the worlds assuming the name Brahma. You are identical with Viṣṇu in Sattva attribute and you protect the entire universe.

32. With the Tamas attribute you assume the form of Śiva, O great God and you alone devour the universe composed of five elements.

33. With the strength of meditating on you, O creator of the universe, the sun blazes, the moon exudes nectar and the wind blows.

34. O Śiva, with the strength of meditating on you, the clouds shower water. Indra protects the worlds like his sons.

35. With the strength of meditating on you, the clouds, the gods and the great sages carry on their tasks. They are afraid of you.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 784 / Vishnu Sahasranama Contemplation - 784


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 784 / Vishnu Sahasranama Contemplation - 784🌹

🌻784. సుతన్తుః, सुतन्तुः, Sutantuḥ🌻

ఓం సుతన్తవే నమః | ॐ सुतन्तवे नमः | OM Sutantave namaḥ


విస్తీర్ణశ్శోభనస్తన్తుజగతోఽస్యేతి కేశవః ।
సుతన్తురితి సమ్ప్రోక్తో వేదతత్త్వవివేకిభిః ॥

తన్యతే ఇతి తన్తుః - విస్తరింప జేయబడుచున్నది అనగా ప్రపంచము. శోభనః తన్తుః ఇతి స్తుతన్తుః - సుందరమగు ఈ విస్తీర్ణ ప్రపంచము ఈతనిదియే! ఈ ప్రపంచమంతయు సృజించి విస్తరింప జేసిన వాడు ఈతడే కనుక స్తుతంతుః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 784🌹

🌻784. Sutantuḥ🌻

OM Sutantave namaḥ


विस्तीर्णश्शोभनस्तन्तुजगतोऽस्येति केशवः ।
सुतन्तुरिति सम्प्रोक्तो वेदतत्त्वविवेकिभिः ॥

Vistīrṇaśśobhanastantujagato’syeti keśavaḥ,
Sutanturiti samprokto vedatattvavivekibhiḥ.

तन्यते इति तन्तुः / Tanyate iti tantuḥ That which expands or in other words - the world. . शोभनः तन्तुः / Śobhanaḥ tantuḥ - This beautiful worldly expanse belongs to Him. His universe is expanded as a beautiful thread and hence He is Sutantuḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 192 / Kapila Gita - 192


🌹. కపిల గీత - 192 / Kapila Gita - 192 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 02 🌴

02. యథా సాఙ్ఖ్యేషు కథితం యన్మూలం తత్ప్రచక్షతే
భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో॥


తాత్పర్యము : వాటి ద్వారా సాధించు భక్తి లక్షణములను గూడ నీ ద్వారా వినియుంటిని. కాని, భక్తి యోగమును గూర్చి ఇంకను వినగోరు చున్నాను. కనుక, దానిని గూర్చి విపులముగా తెలుపుము.

వ్యాఖ్య : సాంఖ్య సిద్ధాంతాలలో ప్రకృతి లక్షణం, జీవుడంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే భక్తికి మూలమైన సాంఖ్య జ్ఞ్యానాన్ని గురించి చెప్పారు. ఈ భక్తి యోగం యొక్క మార్గం గురించి విస్తరముగా చెప్పండి. సాంఖ్య యోగం వచ్చాక భక్తిలోనికి ప్రవేశిస్తేనే దాని ఫలం. భక్తిగా మారితేనే జ్ఞ్యానానికి ప్రయోజనం. సాంఖ్య తత్వశాస్త్రం అనేది అన్ని ఉనికి యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం. ప్రతి దాని స్వభావాన్ని, లక్షణాలను పరిశీలించి అర్థం చేసుకోవాలి. దీనినే జ్ఞాన సముపార్జన అంటారు. కానీ జీవిత లక్ష్యాన్ని లేదా జ్ఞానం-భక్తి-యోగాన్ని పొందే ప్రాథమిక సూత్రాన్ని చేరుకోకుండా కేవలం జ్ఞానాన్ని పొందకూడదు. మనం భక్తి-యోగాన్ని విడిచిపెట్టి, వాటి స్వభావం యొక్క విశ్లేషణాత్మక అధ్యయనంలో నిమగ్నమైతే, ఫలితం ఆచరణాత్మకంగా శూన్యం. అటువంటి నిశ్చితార్థం వరి పొట్టు వంటిదని భాగవతంలో పేర్కొనబడింది. ఇంతకుముందే ధాన్యం తీసేసినా పొట్టు కొట్టినా ప్రయోజనం ఉండదు. భౌతిక ప్రకృతి, జీవుడు మరియు పరమాత్మ గురించి శాస్త్రోక్తంగా అధ్యయనం చేయడం ద్వారా, భగవంతుని భక్తితో చేసే సేవ యొక్క ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 192 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 02 🌴

02. yathā sāṅkhyeṣu kathitaṁ yan-mūlaṁ tat pracakṣate
bhakti-yogasya me mārgaṁ brūhi vistaraśaḥ prabho

MEANING : Now I shall request You to explain the path of devotional service, which is the ultimate end of all philosophical systems.


PURPORT : Bhakti-yoga, devotional service, is the basic principle of all systems of philosophy; all philosophy which does not aim for devotional service to the Lord is considered merely mental speculation. But of course bhakti-yoga with no philosophical basis is more or less sentiment. There are two classes of men. Some consider themselves intellectually advanced and simply speculate and meditate, and others are sentimental and have no philosophical basis for their propositions. Neither of these can achieve the highest goal of life-or, if they do, it will take them many, many years. Vedic literature therefore suggests that there are three elements-namely the Supreme Lord, the living entity and their eternal relationship-and the goal of life is to follow the principles of bhakti, or devotional service, and ultimately attain to the planet of the Supreme Lord in full devotion and love as an eternal servitor of the Lord.

Sāṅkhya philosophy is the analytical study of all existence. One has to understand everything by examining its nature and characteristics. This is called acquirement of knowledge. But one should not simply acquire knowledge without reaching the goal of life or the basic principle for acquiring knowledge-bhakti-yoga. If we give up bhakti-yoga and simply busy ourselves in the analytical study of the nature of things as they are, then the result will be practically nil. It is stated in the Bhāgavatam that such engagement is something like husking a paddy. There is no use beating the husk if the grain has already been removed. By the scientific study of material nature, the living entity and the Supersoul, one has to understand the basic principle of devotional service to the Lord.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 15, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 10 🍀

19. బ్రహ్మజ్ఞః సనకాదిభ్యః శ్రీపతిః కార్యసిద్ధిమాన్ |
స్పృష్టాస్పృష్టవిహీనాత్మా యోగజ్ఞో యోగమూర్తిమాన్

20. మోక్షశ్రీర్మోక్షదో మోక్షీ మోక్షరూపో విశేషవాన్ |
సుఖప్రదః సుఖః సౌఖ్యః సుఖరూపః సుఖాత్మకః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భావావేశ ప్రకృతికి చరితార్థత - ప్రాణ, మనఃకోశము లందు శాంతి, సమత్వములు. హృదయ కుహకము నందు తీవ్ర భావావేశము - యివి పరస్పర విరుద్ధములు కావు. ఈశ్వరుని యెడ భక్తిభావాన్ని నీ హృదయాంతరాళంలో రగుల్కొనేటట్లు చెయ్యి. అప్పుడే నీ భావావేశ ప్రకృతి చరితార్ధతను పొందుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ ద్వాదశి 08:33:02 వరకు

తదుపరి కృష్ణ త్రయోదశి

నక్షత్రం: భరణి 14:13:25 వరకు

తదుపరి కృత్తిక

యోగం: సుకర్మ 26:02:13 వరకు

తదుపరి ధృతి

కరణం: తైతిల 08:33:59 వరకు

వర్జ్యం: 26:39:30 - 28:19:10

దుర్ముహూర్తం: 10:04:50 - 10:57:29

మరియు 15:20:46 - 16:13:26

రాహు కాలం: 13:55:12 - 15:33:56

గుళిక కాలం: 08:59:01 - 10:37:45

యమ గండం: 05:41:33 - 07:20:17

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42

అమృత కాలం: 09:17:48 - 10:55:52

సూర్యోదయం: 05:41:33

సూర్యాస్తమయం: 18:51:24

చంద్రోదయం: 03:10:49

చంద్రాస్తమయం: 16:24:21

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య

ప్రాప్తి 14:13:25 వరకు తదుపరి

లంబ యోగం - చికాకులు, అపశకునం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹