తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 13 - పాశురాలు 25 & 26 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 13 - Pasuras 25 & 26


https://youtu.be/eZJ7U-0ZuMw


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 13 - పాశురాలు 25 & 26 Tiruppavai Pasuras Bhavartha Gita Series 13 - Pasuras 25 & 26 🌹

🍀 25వ పాశురం - అవతార రహస్యం – సేవాస్వీకార గీతం. 26వ పాశురం - వటపత్రశాయి అనుగ్రహ యాచన గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 25వ పాశురంలో, శంఖచక్ర గదాధరుడైన ఆ నారాయణునికే తల్లి కావాలనుకున్న దేవకి కోరిక తీర్చి. వ్రేపల్లె చేరి యశోదమ్మ బిడ్డవై నీ ఆటపాటలతో మురిపించావు. అలాగే మా సేవలు స్వీకరించి మా కోరికనూ తీర్చు స్వామీ అంటూ గోదాదేవి పాడుతున్నది. 26వ పాశురంలో, గోపికలు, ఇంద్రనీలమణి వలె మెరిసి పోతున్న ఆ వటపత్రశాయిని తమ వ్రతానికి కావలసిన వస్తువులు అడుగుతూ, మాధవుని నిత్య సన్నిధిని ప్రసాదించమని అర్ధిస్తున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ధరణీ దండాలమ్మా - భూమి భ్రమణ దినోత్సవ శుభాకాంక్షలు / Salutations to Mother Earth - Happy Earth Rotation Day


https://youtube.com/shorts/MCyLlivpa8g


🌹 ధరణీ దండాలమ్మా - భూమి భ్రమణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి
Salutations to Mother Earth - Happy Earth Rotation Day to All 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

24వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 24rd Pasuram - Tiruppavai Bhavartha Gita Malika


https://youtube.com/shorts/7qr9DBkxh7I


🌹 24వ పాశురము - 24rd Pasuram 🌹

🌻 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - Tiruppavai Bhavartha Gita Malika 🌻

🍀 అవతార లీల స్తుతి - మంగళహారతి గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 24వ పాశురంలో, దుష్ట శిక్షణకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని లీలలు కొని యాడుతూ శ్రీహరి చరణారవిందాలకు మంగళహారతినిస్తూ పాడుతున్నారు. 🍀


తప్పకుండా వీక్షించండి


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు Makar Sankranti Brahmotsavams at Srisailam


🌹 శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో 12వ తేదీ నుంచి ప్రారంభం. 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Makar Sankranti Brahmotsavam in Srisailam starts from 12th with Panchahnika Diksha. 🌹
Prasad Bhardwaj


ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది అయిన శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు జనవరి 12న ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ నుంచి మల్లన్న స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. భక్తులకు కనువిందు చేసేలా ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మకర సంక్రాంతి పర్వదినమైన 15వ తేదీన స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చెంచు గిరిజన భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానం అందించింది. చెంచు సంప్రదాయాలను గౌరవిస్తూ, వారి సమక్షంలో కళ్యాణం జరగడం శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, చండీ-రుద్ర పారాయణం వంటి యాగాలు జనవరి 12 నుంచి 18 వరకు నిరంతరంగా జరుగుతాయి. అయితే, ఉత్సవాల కారణంగా ఈ కాలంలో ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవ, ఏకాంత సేవలు, స్వామి-అమ్మవారి కళ్యాణం, ఇతర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 12 నుంచి 18 వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్ నిర్వహణ, అన్నదానం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 12న ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు.

13 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 17న యాగ పూర్ణాహుతి, 18న పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంక్రాంతి రోజైన 15న జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12నుంచి 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేశారు.

🌹 🌹 🌹 🌹 🌹