శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 545. ‘పులోమజార్చితా’ - 1 🌻


పులోమజచే అర్చింపబడినది శ్రీమాత. పులోమజ అనగా పులోమకు పుట్టినది. పులోమాదేవికి పుట్టిన కుమార్తె శచీదేవి. ఆమె యింద్రాణి. శచీదేవి నిత్యమూ శ్రీమాతను అర్చించు చుండును. శ్రీమాత కరుణవలెననే ఇంద్రునికి స్వర్గాధిపత్యము నిలచును. యింద్రాణీదేవి చేయు పూజలు, ఇంద్రునికట్లు సహకరించును. పతివ్రత లందరునూ కూడ శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించి, తమ భర్తల ఔన్నత్యమునకు భంగము కలుగకుండ కాపాడుకొనిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 545. 'Pulomazarchita' - 1 🌻


Shrimata is worshipped by Pulomaja. Pulomaja means born of Puloma. Pulomadevi's daughter was Sachidevi. She is a goddess of the sky. Shachi Devi always worshipped Shrimata. Indra sustains his position as Lord of the heavens due to the benevolence of Srimata. Indrani devi's devotion thus helps her husband Indra. The pious wives thus worshiped Sri Mata with devotion and protected their husbands' eminence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Desire / ఆకాంక్ష


🌹 ఆకాంక్ష / Desire🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ


ఆకాంక్ష లేదా కోరిక ఏ రకమైనదైనా, సంఘం కోసం గాని, వ్యక్తిగత మోక్షం కోసం గాని, ఆత్మసిద్ధి కోసం గాని, తక్షణం చర్య తీసుకోకుండా తప్పించు కునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే. ఏదో అవాలనీ, ఏదో చెయ్యాలనీ కోరటం అంటే, ప్రస్తుతం దాని గురించి ఏవిధమైనా చర్యా తీసుకోవడం లేదనే. కానీ రేపటి కన్న ఇప్పటికే విలువ ఎక్కువ. ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది. ఇప్పుడు అనే దాన్ని అర్ధం చేసుకోవడమే కాలం నుంచి విముక్తి పొందడం. పరిణామమంటే దుఃఖం; అంటే కాలం మరొక రూపంలో కొనసాగడం. పరిణామంలో ఆస్తిత్వానికి తావు లేదు. అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. పరిణామం అంటే కొద్ది మార్పులు మాత్రమే ఉన్న కొనసాగింపు. పర్తమానంలోనే - ఉన్న స్థితిలోనే సమూల పరివర్తనం ఉంటుంది.




🌹 Desire 🌹

Prasad Bharadwaj

Desire or Aspiration of any kind, whether for community, personal salvation or self-satisfaction, avoids immediate action. Desire is always about the future. Wanting to be or do something means not taking any action about it right now. Today is more valuable than tomorrow. All time is in the now. To understand the now is to be freed from time. Evolution is sorrow; It means that time continues in another form. Property has no place in evolution. Present is Existence. Being in existence is the highest transformation. Evolution means continuity with little change. Radical transformation takes place in the present - in the existing state.

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 62 Siddeshwarayanam - 62


🌹 సిద్దేశ్వరయానం - 62 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


కాళీ యోగి : కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించిన తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు. అక్కడ మీఅమ్మ ఇంకా జీవించి ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె బ్రతికున్నంత కాలమూ సేవచేయి. ఆ పవిత్ర ధామంలో రాధాకృష్ణులను నిరంతరం సేవించు. అక్కడకు వెళ్ళిన తరువాత రాధామంత్రాన్ని నీవు జపించవలసి ఉంటుంది. నీవు నేను మరికొందరు గోలోకానికి చెందినవారము. రసదేవత అయిన రాధాదేవి సంకల్పమువల్లనే మన జన్మపరంపర కొనసాగుత్నుది. ఆమె యొక్క మరొక రూపమే కాళీ. అక్కడ నీ చెల్లెలు పెరిగి పెద్దదయి ఇప్పటికే కృష్ణ భక్తిని హృదయంలో నింపుకొన్నది. మధురభక్తి మార్గంలో ఆమె జీవితం తరిస్తుంది. కృష్ణుడు తనను విడిచిపోతాడేమో అన్న భయంతో తాను పూజించే కృష్ణవిగ్రహాన్ని ఎప్పుడూ కొంగుకు ముడివేసుకు ఉంచుకుంది. కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం ఆ అమ్మాయికి ఉండదు.

నీ కాళీభక్తిక సాధనలు ఆ అమ్మాయికి నచ్చవు. ఈ ప్రపంచంలో ఎవరిమార్గం వారిది. అయిదేండ్ల తరువాత నీ వక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరూ ఏమీ అనరు. మీ తల్లికి సేవచేసి మాతృఋణం తీర్చుకొన్న తరువాత కాశీకి వెళ్ళు. అక్కడ త్రైలింగస్వామిని దర్శనం చేసుకో. ఆ మహానుభావుడు నాకు పరమాప్తుడు. ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేయి. క్షేత్రపాలకుడయిన కాలభైరవుడు కాళీసహితుడై అక్కడ ఉన్నాడు. వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. అనంతరం కొంతకాలము తీర్ధయాత్రలు చేయి. కొందరు సాధకులకు నీవలన ఉపకారము జరుగవలసి ఉన్నది. కాళీదేవి అనుగ్రహం కోసం సాధన చేస్తున్నటువంటి యువకులు కొందరికి నీ మార్గదర్శనము, సహాయము అవసరమవుతుంది. వారెవరన్నది దివ్వ చక్షువు వికసించటంవల్ల నీవు తెలుసుకోగలుగుతావు. వారిలో చివరివాడు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిర పూజారి 'గదాధరుడు' అన్న యువకుడు. అతని చేత తాంత్రిక సాధనలు చేయించు. ఆ తరువాత నన్ను మళ్ళీ కలుసుకో గలుగుతావు. ఇప్పుడు నీ వయస్సు 21వ సంవత్సరము నడుస్తున్నది. దాదాపు 45 సంవత్సరముల తరువాత నన్ను మళ్ళీ చూడగలుగుతావు”.

యోగేశ్వరి: స్వామీ! నా కప్పటికి షుమారు 70సం॥ సమీపిస్తుంటవి. వృద్ధత్వంలో ఉండే నేను మిమ్ము గుర్తుపట్టటం ఎలా? మీరు దివ్యశరీరంతో ఉంటారా లేక మానవ శరీరంలో ఉంటారా?.

యోగి: ఈ శరీరాన్ని వదలిన తరువాత పది సంవత్సరాలు ఊర్ధ్వ భూమికలలో ఉంటాను. కాళీదేవి పరివారంలో ఉండి మళ్ళీ ఆమె ఆజ్ఞవల్ల దక్షిణ దేశంలో పుట్టి ఒక ఆంధ్ర కుటుంబంలో పెరిగి పెద్దవాడనయిన తరువాత దక్షిణా పధమంతా సంచరించి మళ్ళీ ఈ కాళీ దేవి దగ్గరకు వస్తాను. అప్పటికి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన వృద్ధుడు, యువకుడు కాళీదేవిని సేవిస్తూ ఉంటారు. ఆ వృద్ధుడు కూడా సామాన్యుడు కాడు. కేవల భక్తిచేత తీవ్రసాధనలు లేకుండానే దీర్ఘాయువు సాధించిన వాడు. అతని కుమారుడు మాత్రం తీవ్రసాధనలు చేస్తాడు. ఆ వివరాలు ప్రస్తుతం నీకు అక్కరలేదు. నీవు మాత్రం ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఇక్కడకు వచ్చి ఎన్నాళ్ళుండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండవచ్చు.

నీవు చేసిన తాంత్రిక సాధనలవల్ల ఆకాశగమన శక్తిరాలేదుకాని, అలసట లేకుండా ఎంతదూరమైన వేగంగా నడచి పోగలశక్తి వచ్చింది. అలానే ముసలితనం గురించి ప్రస్తావించావు. నిన్ను వృద్ధురాలిగా చూడటం నాకు ఇష్టములేదు ఈ శరీరములో నీవున్నంతకాలం ఇప్పుడున్నట్లుగానే ఉంటావు. ముసలి తనం నిన్ను సమీపించదు. ఇది నేను ప్రత్యేకంగా నీకిస్తున్న వరం. ఇక నా అగ్నిప్రవేశ సమయమాసన్నమయింది.

యోగేశ్వరి: మహాత్మా! బృందావనంలో నన్ను రాధామంత్రం చేయమన్నారు. నేను మిమ్ము తప్ప మరెవరినీ గురువుగా స్వీకరించలేను. దయతో నాకు రాదామంత్రాన్ని ఉపదేశించండి.

యోగి: ఇప్పుడు సమయం చాలదు. నీవు బృందావనం వెళ్ళిన తరువాత భాద్రపద శుద్ధ అష్టమినాడు రాధాజయంతి వస్తుంది. ఆ రాత్రి నన్ను స్మరించు, నిద్రించు. నేను స్వయంగా వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాను. నీకు శుభమగునుగాక!.

యోగేశ్వరి: గురుదేవా! మీ శిష్యురాలిని, దాసురాలిని, మీ రెప్పుడూ నన్ను కనిపెట్టి ఉండండి. భవిష్యత్లో నేను మిమ్ము గుర్తించ లేకపోవచ్చు. యోగీశ్వరులైన మీరే నన్నుగుర్తించి దగ్గరకు తీసుకోవాలి. నా అభ్యర్ధనను అనుగ్రహించండి.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీ శివ మహా పురాణము - 886 / Sri Siva Maha Purana - 886

🌹 . శ్రీ శివ మహా పురాణము - 886 / Sri Siva Maha Purana - 886 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 1 🌻

సనత్కుమారుడిట్లు పలికెను- తన సైన్యములో ప్రముఖభాగము నశించుటయు, తనకు ప్రాణముతో సమమైన వీరులు సంహరింప బడుటను గాంచి అపుడా దానవుడు మిక్కిలి కోపించెను (1). అతడు శంభునితో, 'నేను యుద్ధములో నిలబడి యున్నాను. నీవు కూడ నిలబడుము. వీరిని సంహరించుట వలన లాభమేమి గలదు? ఇపుడు నాఎదుట నిలబడి యుద్ధమును చేయుము' అని పలికెను (2). ఓ మునీ! ఆ దానవవీరుడు ఇట్లు పలికి దృఢనిశ్చయము చేసుకొని యుద్ధమునకు సన్నద్ధుడై శంకరుని ఎదుట నిలబడెను (3). ఆ దానవుడు మహారుద్రునిపై దివ్యములగు అస్త్రములను, బాణములను, మేఘము నీటిని వలె, వర్షించెను (4). దేవతలలో, గణములలో గల శ్రేష్ఠులందరు కూడ ఊహింప శక్యము కాని, కంటికి కానరాని, భయంకరములగు అనేక మాయలను ఆతడు ప్రదర్శించెను (5). అపుడు శంకరుడు వాటిని గాంచి గొప్ప దివ్యమైన, మాయలన్నింటినీ నశింపజేయు మహేశ్వరాస్త్రమును అవలీలగా ప్రయోగించెను (6). అపుడు దాని తేజస్సుచే వాని మాయలన్నియు శీఘ్రమే అదృశ్యమగుటయే గాక వాని దివ్యాస్త్రములు కూడ తేజోవిహీనములాయెను (7).

అపుడా యుద్ధములో మహాబలుడగు మహేశ్వరుడు ఆతనిని వధించుటకై గొప్ప తేజశ్శాలురకు కూడ నివారింప శక్యము గాని శూలమును వెంటనే పట్టుకొనెను (8). అదే కాలములో ఆ ప్రయత్నమును అడ్డుకొనుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ శంకరా! ఇపుడు నాప్రార్తనను విని శూలమును ప్రక్కన పెట్టుము (9).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 886 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 1 🌻


Sanatkumāra said:—

1. On seeing the important and major portion of his army killed, including heroes as dear to him as his life, the Dānava became very furious.

2. He spoke to Śiva. “I am here standing ready. Be steady in the battle. What is it to me, if these are killed? Fight me standing face to face”.

3. O sage, after saying this and resolving resolutely the king of Dānavas stood ready facing Śiva.

4. The Dānava hurled divine missiles at him and showered arrows like the cloud pouring rain.

5. He exhibited various kinds of deceptive measures invisible and inscrutable to all the excellent gods and Gaṇas and terrifying as well.

6. On seeing that, Śiva sportively discharged thereat the excessively divine Māheśvara missiles that destroy all illusions.

7. All the illusions, were quelled rapidly by its brilliance. Though they were divine missiles they became divested of their brilliance.

8. Then in the battle, the powerful lord Śiva suddenly seized his trident which could not be withstood even by brilliant persons, in order to slay him.

9. In order to prevent him then, an unembodied celestial voice said—“O Śiva, do not hurl the trident now. Please listen to this request.


Continues....

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 532: 14వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 532: Chap. 14, Ver. 08

 


🌹. శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 8 🌴

08. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్లదేహధారులకు మోహకారణమని యెరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి.

🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి “తు” అను ప్రత్యేక పదప్రయోగమునకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. జీవునికి తమోగుణము ఒక అత్యంత విచిత్ర లక్షణమని తెలియజేయుటయే దాని భావము. వాస్తవమునకు తమోగుణము సత్వగుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. సత్త్వగుణమునందు జ్ఞానాభివృద్ది కారణముగా మనుజుడు ఏది యెట్టిదో తెలియగలుగుచుండ, తమోగుణమునందు దానికి వ్యతిరేకఫలములను పొందుచుండును. అనగా తమోగుణమునందున్న ప్రతివాడును బుద్ధిహీనతను కలిగియున్నందున ఏది యెట్టిదో ఎరుగకుండును. తత్కారణముగా ప్రగతికి బదులు పతనము నొందును.

అట్టి తమోగుణము వేదవాజ్మయము నందు “వస్తుయాథాత్మ్య జ్ఞానావరకం విపర్యయ జ్ఞానజనకం తమ:” అని నిర్వచింప బడినది. అనగా అజ్ఞాన కారణముగా మనుజుడు దేనిని కూడా యథాతథముగా అవగాహనము చేసికొనజాలడు. ఉదాహరణమునకు ప్రతియొక్కడు తన తాత మరణించు యుండెననియు, తానును మరణింతుననియు, మానవుడు మరణించు స్వభావము కలవాడనియు ఎరిగియుండును. అలాగుననే అతని సంతానము సైతము మరణించును. అనగా మరణమనునది అవివార్యము. అయినప్పటికిని జనులు నిత్యమైన ఆత్మను పట్టించుకొనక రేయింబవళ్ళు కష్టపడచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు. ఇదియే బుద్ధిహీనత యనబడును. ఇట్టి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి యెడ విముఖులై యుందురు. అట్టివారు అతి సోమరులై యుందురు. ఆధ్యాత్మికావగాహనకై సత్సంగమునకు ఆహ్వానించినప్పుడు వారు ఆసక్తిని చూపరు.

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 532 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 08 🌴

08. tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām
pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata


🌷 Translation : O son of Bharata, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence and sleep, which bind the conditioned soul.

🌹 Purport : In this verse the specific application of the word tu is very significant. This means that the mode of ignorance is a very peculiar qualification of the embodied soul. The mode of ignorance is just the opposite of the mode of goodness. In the mode of goodness, by development of knowledge, one can understand what is what, but the mode of ignorance is just the opposite. Everyone under the spell of the mode of ignorance becomes mad, and a madman cannot understand what is what. Instead of making advancement, one becomes degraded. The definition of the mode of ignorance is stated in the Vedic literature. Vastu-yāthātmya-jñānāvarakaṁ viparyaya-jñāna-janakaṁ tamaḥ: under the spell of ignorance, one cannot understand a thing as it is. For example, everyone can see that his grandfather has died and therefore he will also die; man is mortal.

The children that he conceives will also die. So death is sure. Still, people are madly accumulating money and working very hard all day and night, not caring for the eternal spirit. This is madness. In their madness, they are very reluctant to make advancement in spiritual understanding. Such people are very lazy. When they are invited to associate for spiritual understanding, they are not much interested. They are not even active like the man who is controlled by the mode of passion. Thus another symptom of one embedded in the mode of ignorance is that he sleeps more than is required. Six hours of sleep is sufficient, but a man in the mode of ignorance sleeps at least ten or twelve hours a day. Such a man appears to be always dejected and is addicted to intoxicants and sleeping. These are the symptoms of a person conditioned by the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 19, MAY 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 19, MAY 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 43 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 43 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 886 / Sri Siva Maha Purana - 886 🌹
🌻. శంఖచూడుని వధ - 1 / The annihilation of Śaṅkhacūḍa - 1 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 62 🌹
4) 🌹 ఆకాంక్ష / Desire🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 545 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 545 - 1 🌹 
🌻 545. ‘పులోమజార్చితా’ - 1 / 545. 'Pulomazarchita' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 8 🌴*

*08. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |*
*ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ||*

*🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్లదేహధారులకు మోహకారణమని యెరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి.*

*🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి “తు” అను ప్రత్యేక పదప్రయోగమునకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. జీవునికి తమోగుణము ఒక అత్యంత విచిత్ర లక్షణమని తెలియజేయుటయే దాని భావము. వాస్తవమునకు తమోగుణము సత్వగుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది. సత్త్వగుణమునందు జ్ఞానాభివృద్ది కారణముగా మనుజుడు ఏది యెట్టిదో తెలియగలుగుచుండ, తమోగుణమునందు దానికి వ్యతిరేకఫలములను పొందుచుండును. అనగా తమోగుణమునందున్న ప్రతివాడును బుద్ధిహీనతను కలిగియున్నందున ఏది యెట్టిదో ఎరుగకుండును. తత్కారణముగా ప్రగతికి బదులు పతనము నొందును.*

*అట్టి తమోగుణము వేదవాజ్మయము నందు “వస్తుయాథాత్మ్య జ్ఞానావరకం విపర్యయ జ్ఞానజనకం తమ:” అని నిర్వచింప బడినది. అనగా అజ్ఞాన కారణముగా మనుజుడు దేనిని కూడా యథాతథముగా అవగాహనము చేసికొనజాలడు. ఉదాహరణమునకు ప్రతియొక్కడు తన తాత మరణించు యుండెననియు, తానును మరణింతుననియు, మానవుడు మరణించు స్వభావము కలవాడనియు ఎరిగియుండును. అలాగుననే అతని సంతానము సైతము మరణించును. అనగా మరణమనునది అవివార్యము. అయినప్పటికిని జనులు నిత్యమైన ఆత్మను పట్టించుకొనక రేయింబవళ్ళు కష్టపడచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు. ఇదియే బుద్ధిహీనత యనబడును. ఇట్టి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి యెడ విముఖులై యుందురు. అట్టివారు అతి సోమరులై యుందురు. ఆధ్యాత్మికావగాహనకై సత్సంగమునకు ఆహ్వానించినప్పుడు వారు ఆసక్తిని చూపరు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 532 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 08 🌴*

*08. tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām*
*pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata*

*🌷 Translation : O son of Bharata, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence and sleep, which bind the conditioned soul.*

*🌹 Purport : In this verse the specific application of the word tu is very significant. This means that the mode of ignorance is a very peculiar qualification of the embodied soul. The mode of ignorance is just the opposite of the mode of goodness. In the mode of goodness, by development of knowledge, one can understand what is what, but the mode of ignorance is just the opposite. Everyone under the spell of the mode of ignorance becomes mad, and a madman cannot understand what is what. Instead of making advancement, one becomes degraded. The definition of the mode of ignorance is stated in the Vedic literature. Vastu-yāthātmya-jñānāvarakaṁ viparyaya-jñāna-janakaṁ tamaḥ: under the spell of ignorance, one cannot understand a thing as it is. For example, everyone can see that his grandfather has died and therefore he will also die; man is mortal.*

*The children that he conceives will also die. So death is sure. Still, people are madly accumulating money and working very hard all day and night, not caring for the eternal spirit. This is madness. In their madness, they are very reluctant to make advancement in spiritual understanding. Such people are very lazy. When they are invited to associate for spiritual understanding, they are not much interested. They are not even active like the man who is controlled by the mode of passion. Thus another symptom of one embedded in the mode of ignorance is that he sleeps more than is required. Six hours of sleep is sufficient, but a man in the mode of ignorance sleeps at least ten or twelve hours a day. Such a man appears to be always dejected and is addicted to intoxicants and sleeping. These are the symptoms of a person conditioned by the mode of ignorance.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 886 / Sri Siva Maha Purana - 886 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴*

*🌻. శంఖచూడ వధ - 1 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను- తన సైన్యములో ప్రముఖభాగము నశించుటయు, తనకు ప్రాణముతో సమమైన వీరులు సంహరింప బడుటను గాంచి అపుడా దానవుడు మిక్కిలి కోపించెను (1). అతడు శంభునితో, 'నేను యుద్ధములో నిలబడి యున్నాను. నీవు కూడ నిలబడుము. వీరిని సంహరించుట వలన లాభమేమి గలదు? ఇపుడు నాఎదుట నిలబడి యుద్ధమును చేయుము' అని పలికెను (2). ఓ మునీ! ఆ దానవవీరుడు ఇట్లు పలికి దృఢనిశ్చయము చేసుకొని యుద్ధమునకు సన్నద్ధుడై శంకరుని ఎదుట నిలబడెను (3). ఆ దానవుడు మహారుద్రునిపై దివ్యములగు అస్త్రములను, బాణములను, మేఘము నీటిని వలె, వర్షించెను (4). దేవతలలో, గణములలో గల శ్రేష్ఠులందరు కూడ ఊహింప శక్యము కాని, కంటికి కానరాని, భయంకరములగు అనేక మాయలను ఆతడు ప్రదర్శించెను (5). అపుడు శంకరుడు వాటిని గాంచి గొప్ప దివ్యమైన, మాయలన్నింటినీ నశింపజేయు మహేశ్వరాస్త్రమును అవలీలగా ప్రయోగించెను (6). అపుడు దాని తేజస్సుచే వాని మాయలన్నియు శీఘ్రమే అదృశ్యమగుటయే గాక వాని దివ్యాస్త్రములు కూడ తేజోవిహీనములాయెను (7).*

*అపుడా యుద్ధములో మహాబలుడగు మహేశ్వరుడు ఆతనిని వధించుటకై గొప్ప తేజశ్శాలురకు కూడ నివారింప శక్యము గాని శూలమును వెంటనే పట్టుకొనెను (8). అదే కాలములో ఆ ప్రయత్నమును అడ్డుకొనుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ శంకరా! ఇపుడు నాప్రార్తనను విని శూలమును ప్రక్కన పెట్టుము (9).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 886 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴*

*🌻 Śaṅkhacūḍa is slain - 1 🌻*

Sanatkumāra said:—
1. On seeing the important and major portion of his army killed, including heroes as dear to him as his life, the Dānava became very furious.

2. He spoke to Śiva. “I am here standing ready. Be steady in the battle. What is it to me, if these are killed? Fight me standing face to face”.

3. O sage, after saying this and resolving resolutely the king of Dānavas stood ready facing Śiva.

4. The Dānava hurled divine missiles at him and showered arrows like the cloud pouring rain.

5. He exhibited various kinds of deceptive measures invisible and inscrutable to all the excellent gods and Gaṇas and terrifying as well.

6. On seeing that, Śiva sportively discharged thereat the excessively divine Māheśvara missiles that destroy all illusions.

7. All the illusions, were quelled rapidly by its brilliance. Though they were divine missiles they became divested of their brilliance.

8. Then in the battle, the powerful lord Śiva suddenly seized his trident which could not be withstood even by brilliant persons, in order to slay him.

9. In order to prevent him then, an unembodied celestial voice said—“O Śiva, do not hurl the trident now. Please listen to this request.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 62 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*

*కాళీ యోగి : కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించిన తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు. అక్కడ మీఅమ్మ ఇంకా జీవించి ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె బ్రతికున్నంత కాలమూ సేవచేయి. ఆ పవిత్ర ధామంలో రాధాకృష్ణులను నిరంతరం సేవించు. అక్కడకు వెళ్ళిన తరువాత రాధామంత్రాన్ని నీవు జపించవలసి ఉంటుంది. నీవు నేను మరికొందరు గోలోకానికి చెందినవారము. రసదేవత అయిన రాధాదేవి సంకల్పమువల్లనే మన జన్మపరంపర కొనసాగుత్నుది. ఆమె యొక్క మరొక రూపమే కాళీ. అక్కడ నీ చెల్లెలు పెరిగి పెద్దదయి ఇప్పటికే కృష్ణ భక్తిని హృదయంలో నింపుకొన్నది. మధురభక్తి మార్గంలో ఆమె జీవితం తరిస్తుంది. కృష్ణుడు తనను విడిచిపోతాడేమో అన్న భయంతో తాను పూజించే కృష్ణవిగ్రహాన్ని ఎప్పుడూ కొంగుకు ముడివేసుకు ఉంచుకుంది. కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం ఆ అమ్మాయికి ఉండదు.*

*నీ కాళీభక్తిక సాధనలు ఆ అమ్మాయికి నచ్చవు. ఈ ప్రపంచంలో ఎవరిమార్గం వారిది. అయిదేండ్ల తరువాత నీ వక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరూ ఏమీ అనరు. మీ తల్లికి సేవచేసి మాతృఋణం తీర్చుకొన్న తరువాత కాశీకి వెళ్ళు. అక్కడ త్రైలింగస్వామిని దర్శనం చేసుకో. ఆ మహానుభావుడు నాకు పరమాప్తుడు. ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేయి. క్షేత్రపాలకుడయిన కాలభైరవుడు కాళీసహితుడై అక్కడ ఉన్నాడు. వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. అనంతరం కొంతకాలము తీర్ధయాత్రలు చేయి. కొందరు సాధకులకు నీవలన ఉపకారము జరుగవలసి ఉన్నది. కాళీదేవి అనుగ్రహం కోసం సాధన చేస్తున్నటువంటి యువకులు కొందరికి నీ మార్గదర్శనము, సహాయము అవసరమవుతుంది. వారెవరన్నది దివ్వ చక్షువు వికసించటంవల్ల నీవు తెలుసుకోగలుగుతావు. వారిలో చివరివాడు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిర పూజారి 'గదాధరుడు' అన్న యువకుడు. అతని చేత తాంత్రిక సాధనలు చేయించు. ఆ తరువాత నన్ను మళ్ళీ కలుసుకో గలుగుతావు. ఇప్పుడు నీ వయస్సు 21వ సంవత్సరము నడుస్తున్నది. దాదాపు 45 సంవత్సరముల తరువాత నన్ను మళ్ళీ చూడగలుగుతావు”.*

*యోగేశ్వరి: స్వామీ! నా కప్పటికి షుమారు 70సం॥ సమీపిస్తుంటవి. వృద్ధత్వంలో ఉండే నేను మిమ్ము గుర్తుపట్టటం ఎలా? మీరు దివ్యశరీరంతో ఉంటారా లేక మానవ శరీరంలో ఉంటారా?.*

*యోగి: ఈ శరీరాన్ని వదలిన తరువాత పది సంవత్సరాలు ఊర్ధ్వ భూమికలలో ఉంటాను. కాళీదేవి పరివారంలో ఉండి మళ్ళీ ఆమె ఆజ్ఞవల్ల దక్షిణ దేశంలో పుట్టి ఒక ఆంధ్ర కుటుంబంలో పెరిగి పెద్దవాడనయిన తరువాత దక్షిణా పధమంతా సంచరించి మళ్ళీ ఈ కాళీ దేవి దగ్గరకు వస్తాను. అప్పటికి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన వృద్ధుడు, యువకుడు కాళీదేవిని సేవిస్తూ ఉంటారు. ఆ వృద్ధుడు కూడా సామాన్యుడు కాడు. కేవల భక్తిచేత తీవ్రసాధనలు లేకుండానే దీర్ఘాయువు సాధించిన వాడు. అతని కుమారుడు మాత్రం తీవ్రసాధనలు చేస్తాడు. ఆ వివరాలు ప్రస్తుతం నీకు అక్కరలేదు. నీవు మాత్రం ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఇక్కడకు వచ్చి ఎన్నాళ్ళుండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండవచ్చు.*

*నీవు చేసిన తాంత్రిక సాధనలవల్ల ఆకాశగమన శక్తిరాలేదుకాని, అలసట లేకుండా ఎంతదూరమైన వేగంగా నడచి పోగలశక్తి వచ్చింది. అలానే ముసలితనం గురించి ప్రస్తావించావు. నిన్ను వృద్ధురాలిగా చూడటం నాకు ఇష్టములేదు ఈ శరీరములో నీవున్నంతకాలం ఇప్పుడున్నట్లుగానే ఉంటావు. ముసలి తనం నిన్ను సమీపించదు. ఇది నేను ప్రత్యేకంగా నీకిస్తున్న వరం. ఇక నా అగ్నిప్రవేశ సమయమాసన్నమయింది.*

*యోగేశ్వరి: మహాత్మా! బృందావనంలో నన్ను రాధామంత్రం చేయమన్నారు. నేను మిమ్ము తప్ప మరెవరినీ గురువుగా స్వీకరించలేను. దయతో నాకు రాదామంత్రాన్ని ఉపదేశించండి.*

*యోగి: ఇప్పుడు సమయం చాలదు. నీవు బృందావనం వెళ్ళిన తరువాత భాద్రపద శుద్ధ అష్టమినాడు రాధాజయంతి వస్తుంది. ఆ రాత్రి నన్ను స్మరించు, నిద్రించు. నేను స్వయంగా వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాను. నీకు శుభమగునుగాక!.*
*యోగేశ్వరి: గురుదేవా! మీ శిష్యురాలిని, దాసురాలిని, మీ రెప్పుడూ నన్ను కనిపెట్టి ఉండండి. భవిష్యత్లో నేను మిమ్ము గుర్తించ లేకపోవచ్చు. యోగీశ్వరులైన మీరే నన్నుగుర్తించి దగ్గరకు తీసుకోవాలి. నా అభ్యర్ధనను అనుగ్రహించండి.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఆకాంక్ష / Desire🌹*
✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

ఆకాంక్ష లేదా కోరిక ఏ రకమైనదైనా, సంఘం కోసం గాని, వ్యక్తిగత మోక్షం కోసం గాని, ఆత్మసిద్ధి కోసం గాని, తక్షణం చర్య తీసుకోకుండా తప్పించు కునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే. ఏదో అవాలనీ, ఏదో చెయ్యాలనీ కోరటం అంటే, ప్రస్తుతం దాని గురించి ఏవిధమైనా చర్యా తీసుకోవడం లేదనే. కానీ రేపటి కన్న ఇప్పటికే విలువ ఎక్కువ. ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది. ఇప్పుడు అనే దాన్ని అర్ధం చేసుకోవడమే కాలం నుంచి విముక్తి పొందడం. పరిణామమంటే దుఃఖం; అంటే కాలం మరొక రూపంలో కొనసాగడం. పరిణామంలో ఆస్తిత్వానికి తావు లేదు. అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. పరిణామం అంటే కొద్ది మార్పులు మాత్రమే ఉన్న కొనసాగింపు. పర్తమానంలోనే - ఉన్న స్థితిలోనే సమూల పరివర్తనం ఉంటుంది.*

*🌹 Desire 🌹*
*Prasad Bharadwaj*

*Desire or Aspiration of any kind, whether for community, personal salvation or self-satisfaction, avoids immediate action. Desire is always about the future. Wanting to be or do something means not taking any action about it right now. Today is more valuable than tomorrow. All time is in the now. To understand the now is to be freed from time. Evolution is sorrow; It means that time continues in another form. Property has no place in evolution. Present is Existence. Being in existence is the highest transformation. Evolution means continuity with little change. Radical transformation takes place in the present - in the existing state.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 545 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 545 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 545. ‘పులోమజార్చితా’ - 1 🌻*

*పులోమజచే అర్చింపబడినది శ్రీమాత. పులోమజ అనగా పులోమకు పుట్టినది. పులోమాదేవికి పుట్టిన కుమార్తె శచీదేవి. ఆమె యింద్రాణి. శచీదేవి నిత్యమూ శ్రీమాతను అర్చించు చుండును. శ్రీమాత కరుణవలెననే ఇంద్రునికి స్వర్గాధిపత్యము నిలచును. యింద్రాణీదేవి చేయు పూజలు, ఇంద్రునికట్లు సహకరించును. పతివ్రత లందరునూ కూడ శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించి, తమ భర్తల ఔన్నత్యమునకు భంగము కలుగకుండ కాపాడుకొనిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 545 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 545. 'Pulomazarchita' - 1 🌻*

*Shrimata is worshipped by Pulomaja. Pulomaja means born of Puloma. Pulomadevi's daughter was Sachidevi. She is a goddess of the sky. Shachi Devi always worshipped Shrimata. Indra sustains his position as Lord of the heavens due to the benevolence of Srimata. Indrani devi's devotion thus helps her husband Indra. The pious wives thus worshiped Sri Mata with devotion and protected their husbands' eminence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj