🌹 28, JULY 2023 FRIDAYDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 28, JULY 2023 FRIDAYDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, JULY 2023 FRIDAYDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 212 / Kapila Gita - 212🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 22 / 5. Form of Bhakti - Glory of Time - 22 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804 🌹 
🌻804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765 🌹
🌻. విష్ణు జలంధర యుద్ధము - 1 / The fight between Viṣṇu and Jalandhara - 1 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 019 / Osho Daily Meditations - 019 🌹 
🍀 19. సహజత్వం / 19.  SPONTANEITY🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹 
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 3 / 466. 'Sukshmarupini' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 28, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 02 🍀*

*03. ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।*
*హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥*
*04. నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।*
*సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశుద్ధ స్థాయిలో చేతనా ప్రతిష్ఠ- అంతస్సత్తయం దెచ్చటనో, అస్పష్టమైన ఆశాభంగం పొందిన హేతువు చేతనే, సామాన్యంగా అనేకులు అధ్యాత్మిక జీవనంలోనికి మళ్ళడం, లేక నెట్టబడడం జరుగుతూ వుంటుంది. కొందరిలో అది వైరాగ్యరూపం ధరించి మోక్షసాధనకై ప్రేరేపిస్తుంది కాని, పూర్ణ యోగసాధనలో ముఖ్యంగా జరుగవలసినది మాత్రం, అంతస్సత్తయందలి ఈ కలగాపులగపు స్థితి తొలగి విశుద్ధస్థాయిలో చేతన సుప్రతిష్ఠితం కావడం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-దశమి 14:52:18 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 24:56:59
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శుక్ల 11:57:33 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 14:45:18 వరకు
వర్జ్యం: 05:23:30 - 06:57:18
మరియు 30:13:06 - 31:43:42
దుర్ముహూర్తం: 08:29:24 - 09:21:12
మరియు 12:48:25 - 13:40:13
రాహు కాలం: 10:45:23 - 12:22:31
గుళిక కాలం: 07:31:07 - 09:08:15
యమ గండం: 15:36:46 - 17:13:54
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 14:46:18 - 16:20:06
సూర్యోదయం: 05:54:01
సూర్యాస్తమయం: 18:51:01
చంద్రోదయం: 14:35:10
చంద్రాస్తమయం: 01:03:23
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 24:56:59 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 212 / Kapila Gita - 212 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 22 🌴*

*22. యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మా నమీశ్వరమ్|*
*హిత్వార్చాం భజతే మౌఢ్యాద్భస్మన్యేవ జుహోతి సః॥*

*తాత్పర్యము : సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడే. మోహవశమున (అజ్ఞానముచే) ఈ విషయమును మరచి, ప్రాణులయెడ ఉపేక్షాభావము వహించుచు, కేవలము దైవము యొక్క అర్చా మూర్తిని సేవించుట బూడిదలో హోమము చేయుటవంటిది.*

*వ్యాఖ్య : నేను అందరిలో ఉన్నా అన్న సంగతి మరచిపోయి "నాకు మాత్రమే ఆరాధనార్హత ఉంది. నేను మాత్రమే భగవానుని పొందుతాను" అంటారు. అర్చావతారముండాలి, కానీ భాగవతోత్తములని అవమానించే భగవదారాధన చేయాలి. ఒకవేళ భగవదారాధనలో ఆచార్యులు వస్తే, భగవదారాధన ఆపి, ఆచార్యులని ఆరాధించాలి. అది పూజ ఆపినట్లు కాదు. భాగవతారాధన కూడా భగవదారాధనలో భాగమే. అది తెలుసుకోని వారి పూజ, అగ్నిహోత్రములో వేసిన బూడిద లాంటిది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 212 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 22 🌴*

*22. yo māṁ sarveṣu bhūteṣu santam ātmānam īśvaram*
*hitvārcāṁ bhajate mauḍhyād bhasmany eva juhoti saḥ*

*MEANING : One who worships the Deity of Godhead in the temples but does not know that the Supreme Lord, as Paramātmā, is situated in every living entity's heart, must be in ignorance and is compared to one who offers oblations into ashes.*

*PURPORT : It is stated clearly herein that the Supreme Personality of Godhead, in His plenary expansion of Supersoul, is present in all living entities. The living entities have 8,400,000 different kinds of bodies, and the Supreme Personality of Godhead is living in every body both as the individual soul and as the Supersoul. Since the individual soul is part and parcel of the Supreme Lord, in that sense the Lord is living in every body, and, as Supersoul, the Lord is also present as a witness. In both cases the presence of God in every living entity is essential. Therefore persons who profess to belong to some religious sect but who do not feel the presence of the Supreme Personality of Godhead in every living entity, and everywhere else, are in the mode of ignorance. If, without this preliminary knowledge of the Lord's omnipresence, one simply attaches himself to the rituals in a temple, church or mosque, it is as if he were offering butter into ashes rather than into the fire. One offers sacrifices by pouring clarified butter into a fire and chanting Vedic mantras, but even if there are Vedic mantras and all conditions are favorable, if the clarified butter is poured on ashes, then such a sacrifice will be useless.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804🌹*

*🌻804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ🌻*

*ఓం మహాగర్తాయ నమః | ॐ महागर्ताय नमः | OM Mahāgartāya namaḥ*

గర్తవదస్య మహతీ మాయా విష్ణోర్దురత్యయా ।
ఇతి సోఽయం మహాగర్త ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
మాయా దురత్యయేతి శ్రీకృష్ణేన స్వయమీరణాత్ ।
నైరుక్తైర్వా గర్తశబ్దో రథపర్యాయ ఇష్యతే ॥
మహారథో మహాగర్త ఇతి తస్మాత్‍స ఉచ్యతే ।
అస్య మహార్థత్వం తు ప్రసిద్ధం భారతాదిషు ॥

*గోయి వలె మిగుల లోతయినది, చాల పెద్దది అగు మాయ ఎవ్వనిదియో అట్టివాడు. 'మమ మాయా దురత్యయ' (భగవద్గీత 7.14) - నా మాయ దాటరానిది అను భగవద్వచనము ఇట ప్రమాణముగా గ్రహించబడగియున్నది. లేదా 'గర్త' శబ్దమునకు 'రథము' అను అర్థము కలదని నిరుక్త కారులు చెప్పియున్నారు. అందువలన గొప్పదియగు రథము ఎవనికి కలదో అట్టివాడు. ఈతడు అట్టి మహారథము కల వీరుడను విషయము భారతాదులయందు ప్రసిద్దమే.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 804🌹*

*🌻804. Mahāgartaḥ🌻*

*OM Mahāgartāya namaḥ*

गर्तवदस्य महती माया विष्णोर्दुरत्यया ।
इति सोऽयं महागर्त इति सङ्कीर्त्यते बुधैः ॥
माया दुरत्ययेति श्रीकृष्णेन स्वयमीरणात् ।
नैरुक्तैर्वा गर्तशब्दो रथपर्याय इष्यते ॥
महारथो महागर्त इति तस्मात्‍स उच्यते ।
अस्य महार्थत्वं तु प्रसिद्धं भारतादिषु ॥

Gartavadasya mahatī māyā viṣṇorduratyayā,
Iti so’yaṃ mahāgarta iti saṅkīrtyate budhaiḥ.
Māyā duratyayeti śrīkr‌ṣṇena svayamīraṇāt,
Nairuktairvā gartaśabdo rathaparyāya iṣyate.
Mahāratho mahāgarta iti tasmātˈsa ucyate,
Asya mahārthatvaṃ tu prasiddhaṃ bhāratādiṣu.

*Like a great chasm, His māya or illusionary force is difficult to get over. So, He is Mahāgartaḥ vide the Lord's assertion*

*'मम माया दुरत्यय / Mama māyā duratyaya' (Bhagavadgīta 7.14) - My māya is difficult to get over.*

*Lexicographers say that garta is a synonym of ratha or chariot. So Mahāgartaḥ means Mahārathah - a great charioteer. That He is a great charioteer is celebrated in the great epic Mahābhārata and other works. Mahārathah is the highest distinction of the general of an army.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴*

*🌻. విష్ణు జలంధర యుద్ధము - 1 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు మహావీరులగు రాక్షసులు భయముతో కల్లోలపడిన మనస్సు గల దేవతల నందరినీ శూలములతో, గొడ్డళ్లతో, పట్టిశములతో హింసించ మొదలిడిరి (1). రాక్షసుల ఆయుదములచే కొట్టబడిన దేహములు గల ఇంద్రాది దేవతలు అందరు భయముచే కల్లోల పడిన మనస్సులు గలవారై యుద్ధరంగమునుండి పరుగులెత్తిరి (2). ఇంద్రియములకు ప్రభువగు విష్ణువు పారిపోవుచున్న దేవతలను గాంచి గరుడుని అధిష్ఠించిన వాడై వెంటనే యుద్ధమునకు ముందునకురికెను (3). భక్తులకు అభయమునిచ్చు విష్ణువు అంతటా ప్రకాశించే కాంతులు గల సుదర్శన చక్రముతో విరాజిల్లు, పద్మము వంటి హస్తము గలవాడై ప్రకాశించెను (4).*

*శంఖమును, ఖడ్గమును, గదను, శార్‌ఙ్గమను ధనస్సును ధరించిన వాడు, బయంకరమగు అస్త్రములు గలవాడు, మహావీరుడు, అన్ని విధముల యుద్ధమునందు నిపుణుడు అగు విష్ణువు మిక్కిలి కోపించెను (5). విష్ణువు శార్‌ఙ్గధనస్సుపై బాణము నెక్కుపెట్టి సింహనాదమును చేసెను. ఓ మునీ! ఆ గొప్ప నాదముచు ముల్లోకములు నిండెను (6). దుఃఖముచే కల్లోలమైన మనస్సు గల విష్ణుభగవానుడు శారఞ్గధనస్సు నుండి బయల్వెడలిన బానములతో కోట్ల సంఖ్యలో రాక్షసుల తలలు తెగవేసెను (7).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 765🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴*

*🌻 The fight between Viṣṇu and Jalandhara - 1 🌻*

Sanatkumāra said:—
1. Then the heroic Asuras hit and struck the gods distressed and terrified, with the spears, axes and clubs.

2. With their bodies cut and pierced by the weapons of the Asuras, the gods including Indra became distressed in mind by fear and they fled from the battle.

3. On seeing the gods fleeing, Viṣṇu hastened to the battle ground seated on his vehicle Garuḍa.

4. By means of his discus Sudarśana he diffused his splendour all round. He shone with the brilliant lotus in his hand and offered fearlessness to his devotees.

5. Holding the conch, sword, mace and the bow, the heroic deity was very furious. He was efficient in the battle using fierce weapons.

6. He produced the twanging sound from his bow and roared aloud. O sage, all the three worlds were filled with its loud sound.

7. The lord Viṣṇu who was highly infuriated cut off the heads of countless Asuras by means of the arrows discharged from his bow.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 19 / Osho Daily Meditations  - 19 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 19. సహజత్వం 🍀*

*🕉. మీరు ఏది చేసినా, వీలైనంత పూర్తిగా చేయండి. మీరు నడకను ఆస్వాదిస్తే, మంచిది! అకస్మాత్తుగా 'మీకు ఇకపై కదలాలనే కోరిక లేదా కోరిక లేదని మీరు గ్రహిస్తే, వెంటనే కూర్చోండి; నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయకూడదు. 🕉*

*ఏది జరిగినా, అంగీకరించి ఆనందించండి; మరియు దేనినీ బలవంతం చేయవద్దు. మీకు మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడండి. మీరు నిశ్శబ్దంగా ఉండాలని భావిస్తే, మౌనంగా ఉండండి కేవలం భావనతో కదలండి. ఒక్క క్షణం కూడా బలవంతం చేయవద్దు, ఎందుకంటే ఒకసారి మీరు దేనినైనా బలవంతం చేస్తే మీరు రెండుగా విభజించబడి సమస్యను సృష్టిస్తారు, అప్పుడు మీ జీవితం మొత్తం విడిపోతుంది. మానవాళి మొత్తం దాదాపుగా స్కిజోఫ్రెనిక్‌గా మారింది, ఎందుకంటే మనకు బలవంతం చేయడం నేర్పించబడింది.*

*నవ్వాలని కోరుకునే భాగం మరియు మిమ్మల్ని నవ్వనివ్వని భాగం వేరు, ఆపై మీరు విభజించబడ్డారు. మీరు టాప్ డాగను మరియు అండర్ డాగ్‌ని సృష్టించారు, కాబట్టి సంఘర్షణ ఉంది. సంఘర్షణ సృష్టించే చీలిక మరింత పెద్దదిగా మరియు పెద్దదిగా మారుతుంది. కాబట్టి సమస్య ఏమిటంటే ఆ చీలికను ఎలా తగ్గించాలి మరియు ఇకపై దానిని ఎలా సృష్టించకూడదు. జెన్‌లో వారికి చాలా అందమైన సామెత ఉంది: కూర్చోండి, కూర్చోండి. వాకింగ్, కేవలం నడవండి. అన్నింటికంటే మించి, చలించకండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 19 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 19.  SPONTANEITY 🍀*

*🕉  Whatever you do, just do it as totally as possible. if you enjoy walking, good! if suddenly "you realize that you no longer have the urge or desire to move, then sit down immediately; not even a single step should be taken against your will. 🕉*

*Whatever happens, accept and enjoy it; and don't force anything. If you feel like talking, talk. If you feel like being silent, be silent just move with the feeling. Don't force in any way, not even for a single moment, because once you force anything you are divided in twoand that creates the problem, then your whole life becomes split. The whole of humanity has become almost schizophrenic, because we have been taught to force, things.*

*The part that wants to laugh and the part that doesn't allow you to laugh become separate, and then you are divided. You create a top dog and an underdog, so there is conflict. The rift that the conflict creates can become bigger and bigger and bigger. So the problem is how to bridge that rift, and how not to create it anymore. In Zen they have a very beautiful saying: Sitting, just sit. Walking, just walk. Above all, don't wobble.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 466 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 466  - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 3 / 466. 'Sukshmarupini' - 3🌻* 

*ఆరోహణ క్రమమున మరల స్థూలము నుండి సూక్ష్మమునకు పరిణామము చెందుచుండును.  ఆవిరి నీరు అగుట, నీరు మంచుగడ్డ అగుట, మరల మంచుగడ్డ నీరగుట, నీరు ఆవిరి యగుటగా ప్రకృతి సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు మార్పు చెందుచుండును. జీవులు దేహధారణము చేయుటకు ముందు సూక్ష్మరూపులే. దేహధారణమున స్థూల రూపులగుదురు. మరల స్థూల దేహముల నుండి సూక్ష్మమునకు చనుచుందురు. జీవునకు స్థూలదేహము విడచుటయే యుండును గాని మరణించుట యుండదు. అట్లే నిజమునకు జన్మించుట కూడ యుండును. ఇట్టి జీవ రూపములు కూడ శ్రీమాతయే.  శ్రీమాత చేయు ఏడు లోకముల సృష్టిని స్థూలముగను, స్థూల సృష్టిగాను, సూక్ష్మ సృష్టిగను, కారణ సృష్టిగను, తదతీతమైన స్థితిగను జ్ఞానులు దర్శింతురు. సూక్ష్మము, స్థూలమున కాధారము. ఒక పాదము స్థూలమై యుండగ మూడు పాదములు దివ్యమై అమృతమై యున్నవని పురుష సూక్తము కీర్తించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 466 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 466. 'Sukshmarupini' - 3 🌻*

*In the ascending order it again evolves from the gross to the subtle. Steam turns into water, water turns into ice, ice turns into water, water turns into steam, and nature changes from the gross to the subtle, from the subtle to the gross. Living beings are subtle forms before taking on a body. They take a gross body when they take form. They again move from the gross bodies to the subtle. A living being has the concept of leaving a gross body but does not have death. In the same way, there is no birth either. These living forms are also Sri Mata. The creation of the seven worlds by Srimata is seen by the sages as gross, the gross creation, the subtle creation, the causal creation and the transcendent state. Subtle is dependency for the gross. The Purusha sukta extols that one foot is gross while three feet are divine and eternal.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 118 : 2-07. Mātrkā chakra sambodhah - 21 / శివ సూత్రములు - 118 : 2-07. మాతృక చక్ర సంబోధః - 21


🌹. శివ సూత్రములు - 118 / Siva Sutras - 118 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 21 🌻

🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴


ఆ విధంగా, సృష్టించబడిన సృష్టికి తాను విశ్వం అని గ్రహించగలిగే చైతన్యంతో నింపబడాలి. ఇది సాధకుడికి అహం ఇదమ్ అని చెప్పుకునేలా చేస్తుంది, అంటే నేను ఇది, ఇక్కడ ఇది అంటే విశ్వం. శివ సంకల్పం అయిన శక్తి యొక్క అభివ్యక్తి వలన ఆధ్యాత్మిక అన్వేషకుడు ఈ దశను పొందుతాడు. ఈ చర్చ శివుడు మరియు శక్తి స్వతంత్రంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి ఒకే అస్తిత్వం అని కూడా నిరూపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక అభిలాషిలో, ఈ వ్యక్తీకరణలన్నీ అతని కుండలినీ శక్తి ద్వారా జరుగుతాయి, ఇది నేను శివుడిని అని ధృవీకరించే ముగింపుకు అతన్ని నడిపిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 118 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-07. Mātrkā chakra sambodhah - 21 🌻

🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴


Thus, the creation having been made is to be infused with consciousness that is capable of making one realise that he is the universe. This makes the aspirant to say aham idam, which means I am this, where this means the universe. A spiritual seeker attains this stage because of the manifestation of Śaktī, the will of Śiva. This discussion also goes to prove that Śiva and Śaktī, though appear to be independent, in reality They are single entity. In a true spiritual aspirant, all these manifestations happen through his kuṇḍalinī energy, which leads him to the logical conclusion of affirming I am Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 382


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమించడం. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. 🍀


స్నేహంలో ఆధ్యాత్మికత వుంది. ప్రేమ శరీర సంబంధి. స్నేహం ఆధ్యాత్మికం. ప్రేమ స్నేహంగా మారకుంటే దాని గుండా అతను బాధపడాల్సి వుంటుంది. ఆనందం కన్నా అతను బాధల్ని ఎక్కువ పొందుతాడు. దానికి కారణం ప్రేమ శక్తిలో లేదు. ప్రేమ స్వచ్ఛంగా మార్చక పోవడంలో వుంది. కళాత్మకంగా లేకపోవడంలో వుంది. అది నీకు అందిందని అనుకోవడంలో వుంది.

నీ ప్రేమ స్నేహంగా వుండనీ. నీ ప్రేమ ప్రార్థనగా వుండనీ.

అక్కడ రెండు అవకాశాలున్నాయి. నువ్వు స్నేహంగా వున్న వ్యక్తి పట్ల ప్రేమగా వుంటే నువ్వు ఎందర్నో ప్రేమించగలవు. నీ సరిహద్దు విస్తరిస్తుంది. విశాలమవుతుంది. దాని వల్ల నువ్వు ప్రేమతో యితర్లని అంటుకుపోవడం అంటూ జరగదు. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమిస్తుంది. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. అట్లా వుంటే ప్రార్థన అన్నది మతమవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 116 : 25. The Foundation of the Philosophy of Law / నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 : 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది 🌻


ధర్మం అనేది ఒక అతీతమైన శక్తి. ఇది సంపూర్ణత యొక్క పరాకాష్టకు చేరుకునే వరకు చైతన్యం యొక్క క్రమబద్ధమైన ఏకీకరణను కోరుతుంది. ఈ విధంగా, ధర్మం అనేది వివిధ దశల్లో, సంపూర్ణత స్థాయిల్లో విశ్వం పని చేసే విధానం. ఇది సమగ్ర విశ్వ ఏకత్వం నుంచి అణు సముదాయ కదలికల వరకు పని చేస్తుంది. కాబట్టి సామాజిక చట్టాలు మరియు రాజకీయ పరిపాలనా వ్యవస్థల పట్ల ధర్మం పని చేయకుండా పోదు.

విశ్వాన్ని నడిపించే ఈ ధర్మం మాత్రమే వ్యక్తులకు వారి చర్యలు మరియు ప్రతిచర్యలకు తగిన ప్రతిఫలాన్ని, శిక్షని ఇస్తుంది. మానవ ప్రవర్తనలన్నింటికీ ఇదే ఆధారం. మానవులు పరస్పర ప్రేమ మరియు సహకారం కోసం పరితపిస్తూనే తోటివారి పట్ల అపనమ్మకంతో, దాడి చేయడానికి సిద్ధంగా ఉండే అర్థంకాని ప్రవర్తనకు కారణం ఇదే. ఇక్కడ మనకు, బహుశా, చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది ఉంది. నీతి మరియు నైతికతకు ధర్మం వల్ల విలువ ఉంది. ధర్మానికి ఒక అర్థం ఉంది. అది తనకు మించిన సత్యాన్ని సూచిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 116 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 25. The Foundation of the Philosophy of Law 🌻

Law is a transcendent, connotative significance or force which demands a gradational integration of consciousness, both in quantity and quality simultaneously, until it reaches its culmination, which is known as the Absolute. Law is, thus, an operation of the system of the Absolute, in different evolutionary degrees of comprehensiveness and perfection, right from the Ultimate Causality of the universe down to the revolution of an atom or the vibration of an electron. Social laws and political systems of administration cannot, therefore, be separated from the requisitions necessitated by the law of the Absolute.

It is just this Universal Transcendent Principle that either rewards or punishes individuals by its gradational actions and reactions, and it is this, again, that is the basis of all human behaviour, looking so inscrutable, and this is the explanation as to why individuals strive for mutual love and cooperation, and, at the same time, keep themselves ready with a knife hidden in their armpits. Here we have, perhaps, the foundation of the philosophy of law. Ethics and morality have, thus, a necessary value. Law has a meaning, and it points to a truth beyond itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 7 🌻


ఆత్మ - ద్రవ్య - మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, ''ఓం హాం గణపతయే నమః'' అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు ''ఓం హాం గురుభ్యో నమః'' అని చెప్పుచు గురు - పరమగురు - పరాత్పరగురు - పరమేష్ఠిగురువులను గురుపరంపరను పూజించవలెను. కూర్మరూప మగు శిలపై ఉన్న అంకురతుల్య మగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని ''ఓం హాం అనన్తాయ నమః'' అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా నున్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహాకారమున విచిత్రముగా నుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట నున్నదాని పృష్ఠభాగమును చూచు చుండును. ఇవి సత్య - త్రేతా - ద్వాపర - కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశలలో నున్న ధర్మ - జ్ఞాన - వైరాగ్య - ఐశ్వర్యములను పూజింవలెను. వీటి రంగులు వరుసగ కర్పూర - కుంకుమ - సువర్ణ - కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగు కాళ్ళకును పూజ చేసి ఆసనముపై నున్న అష్టదలకమలము నందలి క్రింది దళములను, పై దళములను మొత్తము కలమలమును పూజించి, ''ఓం హాం కర్షికాయై నమః'' అను మంత్రముతో కర్ణికామధ్య భాగమును పూజించవలెను.

ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్యభాగమునందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించి యుందురు. వరద - అభయముద్రలు కూడ ఉండును. వామా-జ్యేష్ఠా-రౌద్రీ-కాలీ-కలవికారిణీ - బలవికారిణీ - బలప్రమథనీ - సర్వభూతదమనీ - మనోన్మనీ ఆను ఎనమండుగురు శక్తులను అష్టదలముల పైనను. మనోన్మని యను శక్తిని కమలకేసరములందును ''హాం కామాయై నమః'' ఇత్యాది మంత్రము లుచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధవిద్యాదేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్ధవిద్యను, తత్త్వవ్యాపక ఆసనమును పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ఠ చేయవలెను. ఆయనకు పది భుజము లుండును. శిరస్సున అర్ధచంద్రు ఉండును. కుడి చేతులలో శక్తి - ఋష్టి - శూల - ఖట్వాంగ - వరదముద్ర లుండును. ఎడమ చేతులలో డమరు - బీజపూర - సర్పన - అక్షసూత్ర - నీలకమలము లను ధరించి యుండును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 251 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 7 🌻

44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.

46. Then the worshipper should worship righteousness, knowledge, detachment and prosperity, towards the south-east as possessing the hues of camphor, saffron, gold and collyrium respectively.

47-48. At the centre of the lotus-shaped diagram and in its petals in the east etc. one should worship the energy goddesses—Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kālavikariṇī, Balavikaraṇī and Balapramathanī in order as holding the chowries and as conferring boons and offering protection.

49. One should worship (the goddesses)—Hāṃ, (salutations) to Sarvabhūtadamanī, (salutations) to Manonmanī, to Kṣiti, to Śuddhavidyā at the extremities of the petals (of the lotus diagram) as also the seat as spread over the component parts of the universe.

50-51. The lord of white complexion, possessing five faces and ten arms, all-pervasive, bearing the crescent moon and carrying weapons—spear, sword, lance, and staff in the right hands and a drum, citron, blue lotus, a string and a waterlily in the left hands should be located on the lion-seat.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 404: 10వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 404: Chap. 10, Ver. 32

 

🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 32 🌴

32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున |
ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాద: ప్రవదతామహమ్ ||


🌷. తాత్పర్యం : ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.

🌻. భాష్యము : భౌతికతత్త్వముల సృష్టి యనునది సృష్టులలో ఆదియైనది. పూర్వము వివరింపబడినట్లు విశ్వము మహావిష్ణువుచే (గర్భోదకశాయివిష్ణువు మరియు క్షీరోదకశాయివిష్ణువు) సృష్టినొంది, పోషింపబడి, పిదప శివునిచే లయమొందింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గౌణసృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి, స్థితి, లయకారకులందరును కృష్ణుని భౌతిక గుణావతారములు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వసృష్టులకు ఆది, మధ్యము, అంతమునై యున్నాడు. ఉన్నతవిజ్ఞానము కొరకు నాలుగువేదములు, షడంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు ఆది పలుగ్రంథములు గలవు.

మొత్తము మీద ఉన్నతవిజ్ఞానము కొరకు పదునాలుగు విభాగముల గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను ఒసగునట్టి గ్రంథము (ముఖ్యముగా వేదాంతసూత్రము) శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. తార్కికుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాడమునే బలపరచువాదము జల్పమనవడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. కాని వాస్తవతత్త్వ నిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 404 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 32 🌴

32. sargāṇām ādir antaś ca madhyaṁ caivāham arjuna
adhyātma-vidyā vidyānāṁ vādaḥ pravadatām aham

🌷 Translation : Of all creations I am the beginning and the end and also the middle, O Arjuna. Of all sciences I am the spiritual science of the self, and among logicians I am the conclusive truth.

🌹 Purport : Among the created manifestations, the first is the creation of the total material elements. As explained before, the cosmic manifestation is created and conducted by Mahā-viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu, and then again it is annihilated by Lord Śiva. Brahmā is a secondary creator. All these agents of creation, maintenance and annihilation are incarnations of the material qualities of the Supreme Lord. Therefore He is the beginning, the middle and the end of all creation.

For advanced education there are various kinds of books of knowledge, such as the four Vedas, their six supplements, the Vedānta-sūtra, books of logic, books of religiosity and the Purāṇas. So all together there are fourteen divisions of books of education. Of these, the book which presents adhyātma-vidyā, spiritual knowledge – in particular, the Vedānta-sūtra – represents Kṛṣṇa. Among logicians there are different kinds of argument. Supporting one’s argument with evidence that also supports the opposing side is called jalpa. Merely trying to defeat one’s opponent is called vitaṇḍā. But the actual conclusion is called vāda. This conclusive truth is a representation of Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


27 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 27, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 15 🍀

29. నిర్వికల్పః సురశ్రేష్ఠో హ్యుత్తమో లోకపూజితః |
గుణాతీతః పూర్ణగుణీ బ్రహ్మణ్యో ద్విజసంవృతః

30. దిగంబరో మహాజ్ఞేయో విశ్వాత్మాఽఽత్మపరాయణః |
వేదాంతశ్రవణో వేదీ కలావాన్నిష్కలత్రవాన్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మానవ సంబంధాల నిస్సారతా భావం - ప్రాణకోశపు బాహ్యతల మందలి ఆశాభంగం వల్లనో, ఇతరులు తనను ప్రేమించడం మానివేసి నందువల్లనో, తనచే ప్రేమించ బడేవారు తాను మొదట్లో అనుకున్న దాని కంటే వేరు విధంగా ఉన్నట్టు తరువాత తెలుసు కున్నందు వల్లనో - ఇట్లెన్నో స్పష్టమైన కారణాలను పురస్కరించుకొని మానవ సంబంధాలను నిస్సారములుగా భావించడం ఒక్కొక్కప్పుడు

జరగవచ్చు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల-నవమి 15:49:33 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: విశాఖ 25:29:17 వరకు

తదుపరి అనూరాధ

యోగం: శుభ 13:38:49 వరకు

తదుపరి శుక్ల

కరణం: కౌలవ 15:41:33 వరకు

వర్జ్యం: 06:51:58 - 08:29:06

మరియు 29:23:30 - 30:57:18

దుర్ముహూర్తం: 10:12:54 - 11:04:45

మరియు 15:23:59 - 16:15:49

రాహు కాలం: 13:59:44 - 15:36:56

గుళిక కాలం: 09:08:06 - 10:45:18

యమ గండం: 05:53:40 - 07:30:53

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 16:34:46 - 18:11:54

సూర్యోదయం: 05:53:40

సూర్యాస్తమయం: 18:51:22

చంద్రోదయం: 13:35:23

చంద్రాస్తమయం: 00:20:00

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ

ఫలం 25:29:17 వరకు తదుపరి

ఆనంద యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹