DAILY WISDOM - 116 : 25. The Foundation of the Philosophy of Law / నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 : 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది 🌻


ధర్మం అనేది ఒక అతీతమైన శక్తి. ఇది సంపూర్ణత యొక్క పరాకాష్టకు చేరుకునే వరకు చైతన్యం యొక్క క్రమబద్ధమైన ఏకీకరణను కోరుతుంది. ఈ విధంగా, ధర్మం అనేది వివిధ దశల్లో, సంపూర్ణత స్థాయిల్లో విశ్వం పని చేసే విధానం. ఇది సమగ్ర విశ్వ ఏకత్వం నుంచి అణు సముదాయ కదలికల వరకు పని చేస్తుంది. కాబట్టి సామాజిక చట్టాలు మరియు రాజకీయ పరిపాలనా వ్యవస్థల పట్ల ధర్మం పని చేయకుండా పోదు.

విశ్వాన్ని నడిపించే ఈ ధర్మం మాత్రమే వ్యక్తులకు వారి చర్యలు మరియు ప్రతిచర్యలకు తగిన ప్రతిఫలాన్ని, శిక్షని ఇస్తుంది. మానవ ప్రవర్తనలన్నింటికీ ఇదే ఆధారం. మానవులు పరస్పర ప్రేమ మరియు సహకారం కోసం పరితపిస్తూనే తోటివారి పట్ల అపనమ్మకంతో, దాడి చేయడానికి సిద్ధంగా ఉండే అర్థంకాని ప్రవర్తనకు కారణం ఇదే. ఇక్కడ మనకు, బహుశా, చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది ఉంది. నీతి మరియు నైతికతకు ధర్మం వల్ల విలువ ఉంది. ధర్మానికి ఒక అర్థం ఉంది. అది తనకు మించిన సత్యాన్ని సూచిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 116 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 25. The Foundation of the Philosophy of Law 🌻

Law is a transcendent, connotative significance or force which demands a gradational integration of consciousness, both in quantity and quality simultaneously, until it reaches its culmination, which is known as the Absolute. Law is, thus, an operation of the system of the Absolute, in different evolutionary degrees of comprehensiveness and perfection, right from the Ultimate Causality of the universe down to the revolution of an atom or the vibration of an electron. Social laws and political systems of administration cannot, therefore, be separated from the requisitions necessitated by the law of the Absolute.

It is just this Universal Transcendent Principle that either rewards or punishes individuals by its gradational actions and reactions, and it is this, again, that is the basis of all human behaviour, looking so inscrutable, and this is the explanation as to why individuals strive for mutual love and cooperation, and, at the same time, keep themselves ready with a knife hidden in their armpits. Here we have, perhaps, the foundation of the philosophy of law. Ethics and morality have, thus, a necessary value. Law has a meaning, and it points to a truth beyond itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment