అమ్మోరు తల్లి నీ కన్న పెద్ద తల్లి లోకాన ఏడుంది కరుణించి కాపాడవే Ammoru Thali Protect Us



https://youtube.com/shorts/qFt7GrPW0mk


🌹 అమ్మోరు తల్లి నీ కన్న పెద్ద తల్లి లోకాన ఏడుంది కరుణించి కాపాడవే AMMORU THALI PROTECT US 🌹


ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

4వ పాశురము Part 2 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika


https://youtube.com/shorts/vpYwvJqMExY


🌹 4వ పాశురము Part 2 - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 4th Pasuram Part 2 - Tiruppavai Pasuras Bhavartha Gita Malika 🌹

🍀 4వ పాశురం part 2 - కరుణా వర్ష ప్రార్థన గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. ఈ 4వ పాశురంలో మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. 🍀

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి Today is the last new moon day of this year...


🌹 ఈ ఏడాదిలో ఆఖరి అమావాస్య నేడు.. ఇలా పూజిస్తే పితృదేవతలకు ఆత్మ శాంతి 🌹

ప్రసాద్ భరద్వాజ

సంవత్సరంలో ఆఖరి అమావాస్య నేడు. శుక్రవారం తెల్లవారుజామున 4.59గంటల నుంచి శనివారం ఉదయం 7.12 గంటల వరకూ అమావాస్య తిథి ఉన్నట్లు పండితులు తెలిపారు.

ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగేలా పూజించడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని చెప్తున్నారు. అంతేకాదు.. ఈ రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. శూలయోగం ఉదయం 3.47 గంటలకు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈ రోజుత సమానంగా ఉండటంతో పాటు.. సూర్యుడు, కుజుడు కూడా కలిసి ఉండనున్నారు. ద్రిక్ పంచాంగం.. అమావాస్య రోజున నదీస్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల పూర్వీకులు ఆనందిస్తారని చెప్తోంది. ఉదయం 5.19 గంటల నుంచి 6.14 గంటల్లోగా నదీస్నానం చేసి, దానం చేసేందుకు శుభసమయంగా ఉంది. జాతకంలో కాలసర్పదోష నివారణకు సైతం అమావాస్య రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి.. స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలిపి చేయడం శుభప్రదం. ఆ తర్వాత దక్షిణం వైపు ముఖం చేసి.. పూర్వీకులను ప్రార్థించి, నీటిలో నల్లనువ్వుల్ని కలిపి.. ఆ నీటిని నేలపై నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుందని విశ్వాసం. సూర్యోదయం సమయంలో రాగికుండలో నీరు, ఎర్రచందనం, ఎర్రటి పువ్వుల్ని సమర్పించి సూర్యుడికి అర్పించాలి. ఆ తర్వాత రాగిచెట్టును పూజించి దీపం వెలిగించాలి. సాయంత్రం రాగి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. బ్రాహ్మణుడికి ధాన్యాలు, దుస్తులు, దుప్పట్లు, నువ్వులు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని విశ్వాసం.

🌹🌹🌹🌹🌹