1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, మే 2022 సోమవారం, ఇందు వాసరే 🌹🌹. శని జయంతి, సోమావతి అమావాస్య శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 209 / Bhagavad-Gita - 209 - 5- 05 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 608 / Vishnu Sahasranama Contemplation - 608🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 287 / DAILY WISDOM - 287🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 187 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 126🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సోమావతి అమావాస్య, శని జయంతి,
శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 30, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైశాఖ అమావాస్య, శని జయంతి సావిత్రి వ్రతం, Vaishakha Amavasya, Shani Jayanti, Vat Savitri Vrat🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 25 🍀*
*49. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!*
*నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!*
*50. శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!*
*ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఎంతటి ప్రమాదకర వ్యక్తులైనా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదురుగా నిలచినా ఆత్మ విశ్వాసం కలవారిని అవి ఏమీ చేయలేవు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: అమావాశ్య 17:01:44 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: కృత్తిక 07:13:32 వరకు
తదుపరి రోహిణి
యోగం: సుకర్మ 23:38:51 వరకు
తదుపరి ధృతి
కరణం: నాగ 17:01:44 వరకు
వర్జ్యం: 25:05:40 - 26:52:56
దుర్ముహూర్తం: 12:39:48 - 13:32:09
మరియు 15:16:51 - 16:09:11
రాహు కాలం: 07:19:11 - 08:57:20
గుళిక కాలం: 13:51:47 - 15:29:56
యమ గండం: 10:35:29 - 12:13:38
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 04:33:42 - 06:19:54
మరియు 30:27:28 - 32:14:44
సూర్యోదయం: 05:41:03
సూర్యాస్తమయం: 18:46:13
చంద్రోదయం: 05:21:48
చంద్రాస్తమయం: 18:47:05
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృషభం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
07:13:32 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శనైశ్వర జయంతి విశిష్టత 🌹*
30-5-2022
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.
దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.
ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.
*🌻. చేయవలసిన పూజలు 🌻*
శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.
అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.
దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.
తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.
ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.
అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.
శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.
నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.
*🍀. శని దేవుడి ప్రాముఖ్యత 🍀*
సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
*🌹. శని శాంతి మంత్ర స్తుతి 🌹*
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.
*🍀. శని జయంతి తేదీ, సమయం: 🍀*
ఈ ఏడాది శని జయంతి 30 మే 2022, సోమవారం వచ్చింది. శుభ సమయం మే 29 ఆదివారం మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమవుతుంది. మే 30వ తేదీ సాయంత్రం 4:59 వరకు కొనసాగుతుంది. ఈసారి అయితే ఉదయమే తిథి రావడంతో మే 30న శని జయంతి జరుపుకోనున్నారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 209 / Bhagavad-Gita - 209 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 05 🌴*
*05. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |*
* ఏకం సాంఖ్యం చ యోగం చ య: పశ్యతి స పశ్యతి ||*
🌷. తాత్పర్యం :
*సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థదృష్టి కలిగిన వాడగును.*
🌷. భాష్యము :
జీవితపు చరమలక్ష్యమును కనుగొనుటయే తత్త్వపరిశోధనల ముఖ్యప్రయోజనమై యున్నది. జీవిత ముఖ్యలక్ష్యము ఆత్మానుభవమైనందున ఈ రెండుమార్గముల యందలి నిర్ణయములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్యతత్త్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతికజగత్తుయొక్క అంశ కాదనియు, పూర్ణుడైన పరమాత్ముని అంశమేననియు మనుజుడు నిర్ధారణకు వచ్చును. శుద్ధాత్మకు భౌతికజగత్తుతో సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నియును కృష్ణపరములుగా నుండవలెననియు అంతట మనుజుడు తెలిసికొనగలుగును. అట్టి భావనలో అతడు కర్మనొనరించినచో తన నిజస్థితి యందు నిలిచినవాడే కాగలడు.
మొదటి పద్ధతియైన సాంఖ్యములో మనుజుడు భౌతికపదార్థము నుండి విడివడవలసియుండగా, రెండవ పద్ధతియైన భక్తియోగమునందు కృష్ణభక్తిరసభావితకర్మల యందు సంపూర్ణముగా మగ్నుడు కావలసియుండును. బాహ్యమునాకు ఒకదాని యందు అసంగత్వము ఇంకొక దాని యందు సంగత్వము గోచరించినను వాస్తవమునకు రెండు పద్ధతులు ఏకమే అయియున్నవి. భౌతికత్వము నుండి విముక్తి మరియు కృష్ణుని యెడ అనురక్తి ఏకమేననెడి విషయమును గాంచగలిగినవాడు యథార్థదృష్టిని పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 209 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 05 🌴*
*05. yat sāṅkhyaiḥ prāpyate sthānaṁ tad yogair api gamyate*
*ekaṁ sāṅkhyaṁ ca yogaṁ ca yaḥ paśyati sa paśyati*
🌷 Translation :
*One who knows that the position reached by means of analytical study can also be attained by devotional service, and who therefore sees analytical study and devotional service to be on the same level, sees things as they are.*
🌹 Purport :
The real purpose of philosophical research is to find the ultimate goal of life. Since the ultimate goal of life is self-realization, there is no difference between the conclusions reached by the two processes. By Sāṅkhya philosophical research one comes to the conclusion that a living entity is not a part and parcel of the material world but of the supreme spirit whole. Consequently, the spirit soul has nothing to do with the material world; his actions must be in some relation with the Supreme.
When he acts in Kṛṣṇa consciousness, he is actually in his constitutional position. In the first process, Sāṅkhya, one has to become detached from matter, and in the devotional yoga process one has to attach himself to the work of Kṛṣṇa consciousness. Factually, both processes are the same, although superficially one process appears to involve detachment and the other process appears to involve attachment. Detachment from matter and attachment to Kṛṣṇa are one and the same. One who can see this sees things as they are.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 608 / Vishnu Sahasranama Contemplation - 608🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻608. శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ🌻*
*ఓం శ్రీనిధయే నమః | ॐ श्रीनिधये नमः | OM Śrīnidhaye namaḥ*
*శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ*
*అఖిలాః శ్రీయో నిధీయన్తే సర్వశక్తిమయే హరౌ ।*
*ఇతి స శ్రీనిధిరితి ప్రోచ్యతే విదుషాం వరైః ॥*
*సకల శ్రీవిభూతుల నిధి గనుక శ్రీనిధిః. సర్వ శక్తిమయుడగు ఈతని యందే సకల శ్రీలును నిలుపబడి యున్నవి గనుక ఆ హరికి శ్రీనిధిః అను నామము గలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 608🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻608. Śrīnidhiḥ🌻*
*OM Śrīnidhaye namaḥ*
अखिलाः श्रीयो निधीयन्ते सर्वशक्तिमये हरौ ।
इति स श्रीनिधिरिति प्रोच्यते विदुषां वरैः ॥
*Akhilāḥ śrīyo nidhīyante sarvaśaktimaye harau,*
*Iti sa śrīnidhiriti procyate viduṣāṃ varaiḥ.*
*In Lord Hari, who is all powerful, all the Śrī or every kind of opulence i.e., treasures are deposited and Hence He is called Śrīnidhiḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 287 / DAILY WISDOM - 287 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 13. మనసుకు వైవిధ్యం అవసరం 🌻*
*మనస్సుకు వైవిధ్యం అవసరం, సందేహం లేదు మరియు వైవిధ్యం లేకుండా అది ఉనికిలో ఉండలేదు. ఇది ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటుంది. మార్పులేని ఆహారాన్ని మనస్సు మెచ్చుకోదు, కాబట్టి గ్రంధాలు, ప్రత్యేకించి ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, తంత్రాలు మొదలైన పెద్ద గ్రంథాలు మనస్సుకు వాటి వైవిధ్యంలో విశాలమైన కదలికను అందించడంతో సంతృప్తి చెంది ఆ వైవిధ్యంలో తీరికగా తిరుగుతుంది. గొప్ప సాధువులు మరియు ఋషుల కథలను చదవడం మరియు అవతారాల వృత్తాంతాల ద్వారా చాలా పులకరించినట్లు అనిపిస్తుంది.*
*కానీ అదే సమయంలో, ఆ వైవిధ్యం లో ఒక ఏకత్వం ఉంటుందని మనం గమనించాలి. ఉదాహరణకు, శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాలలో వైవిధ్యం యొక్క ప్రదర్శనలో నమూనా, నిర్మాణం మరియు లక్ష్యం యొక్క ఏకత్వం ఉంది. 18,000 శ్లోకాలు అన్ని రకాల వివరాలను తెలియజేస్తున్నాయి - విశ్వ సృష్టి మరియు వాటి స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం మొదలైన వాటి యొక్క అభివ్యక్తి ప్రక్రియల గురించి ప్రతి రకమైన కథలు అక్కడ కనిపిస్తాయి. ఇది చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందమైన పోలికలు మొదలైన అనేక రకాల వివరాలతో వెళుతున్నప్పుడు మనస్సు ఎంతో ఆనందిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 287 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 13. The Mind Needs Variety 🌻*
*The mind needs variety, no doubt, and it cannot exist without variety. It always wants change. Monotonous food will not be appreciated by the mind, and so the scriptures, especially the larger ones like the Epics, the Puranas, the Agamas, the Tantras, etc., provide a large area of movement for the mind wherein it leisurely roams about to its deep satisfaction, finds variety in plenty, reads stories of great saints and sages, and feels very much thrilled by the anecdotes of Incarnations, etc.*
*But at the same time, with all its variety, we will find that it is a variety with a unity behind it. There is a unity of pattern, structure and aim in the presentation of variety in such scriptures as the Srimad Bhagavata, for instance. There are 18,000 verses giving all kinds of detail—everything about the cosmic creation and the processes of the manifestation of different things in their gross form, subtle form, causal form, etc. Every type of story is found there. It is very interesting to read it. The mind rejoices with delight when going through such a large variety of detail with beautiful comparisons, etc.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 187 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సమాజం హృదయాన్ని నిర్లక్ష్యం చేసింది. మరచిపోయింది. కారణం హృదయం చాలా ప్రమాదకరమైన విషయం. మేదస్సు యంత్రం. యంత్రాలు తిరగబడవు. అవి కేవలం ఆజ్ఞల్ని పాలిస్తాయి. 🍀*
*సమాజ ప్రయత్నమంతా హృదయానికి వ్యతిరేకమయిందే. అది మెదడుకు శిక్షణ నిస్తుంది. మెదడు క్రమశిక్షణ కలిగిస్తుంది. విద్యాబోధన చేస్తుంది. సమాజం హృదయాన్ని నిర్లక్ష్యం చేసింది. మరచిపోయింది. కారణం హృదయం చాలా ప్రమాదకరమైన విషయం. మేదస్సు యంత్రం. యంత్రాలు తిరగబడవు. అవి కేవలం ఆజ్ఞల్ని పాలిస్తాయి. యంత్రాలు అట్లా చూస్తే మంచివే. అవి చెప్పనట్లు చేస్తాయి.*
*అందువల్ల రాజ్యం, తల్లిదండ్రులు అందరూ మేథస్సు అంటే యిష్టపడతారు. హృదయం రాజ్యానికి ప్రమాదకరం. సమాజానికి ప్రమాదకరం. స్వార్థాలకు ప్రమాదకరం. మెదడు లాజిక్గా పని చేసేది. దాన్ని ఒప్పించవచ్చు. దాన్ని హిందూగా, కమ్యూనిస్టుగా, ఫాసిస్టుగా, సోషలిస్టుగా ఎలాగైనా మార్చవచ్చు. 'తల'తో ఏ పనయినా చెయ్యవచ్చు. తెలివయిన విద్యా విధానం, మోసపూరిత వ్యూహం వుంటే చాలు. కంప్యూటర్లకు ఫీడ్ చేసినట్టు తలకు చెయ్యవచ్చు. నువ్వు ఫీడ్ చేసింది అది తిరిగి తిరిగి చెబుతూ వుంటుంది. కొత్తది ఒక్కటీ అది ప్రదర్శించలేదు. దానికి ఒరిజినాలిటీ వుండదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 126 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 98. అశ్వఘోషుడు - 1🌻*
*యోగసాధన యందు తీవ్ర తపన కలవానిని 'అవకరుడు' అని బోధించెదము. అవకరమనగా వంకరయని అర్థము కాదు. 'అవకరుడన’గా సాధన రూపమున సమస్త మలినములను నిర్మూలించు కొనువాడు. అజ్ఞానమును, అసంగమను అస్త్రముతో ఖండించువాడు. అవకరణకు ప్రకృతి అందమే స్ఫూర్తినందించుచుండును. ప్రకృతి అందమును సృష్టియందు దర్శించగలవాడు సమర్థుడు. అశ్వఘోషుడు అట్లు దర్శించెను.*
*అశ్వఘోషుడు రహదారి కూడలిలో నిలబడి చిత్రలేఖనము చేసెడివాడు. అతని చిత్రములన్నియు సమకాలిక మానవులకు స్ఫూర్తి కలిగించుచుండెడివి. స్ఫూర్తి కలవారే స్ఫూర్తినందివ్వగలరు. అందము నారాధించుట వలన అశ్వఘోషున కట్టి స్ఫూర్తి కలిగినది. ఆట, పాట రంగులు ఆనందము కలిగించనిచో ఆ జీవికి స్ఫూర్తినందు అవకాశము తక్కువ. వాని కొఱకు ప్రత్యేకముగ మీరేర్పరచుకొనిన సినిమా థియేటర్లకు మేము కూడ అప్పుడప్పుడు (టిక్కెట్టు కొని) వచ్చుచుందుము. సినిమాలు దర్శించినపుడు, వాని ఆవశ్యకత జాతికి తగుమాత్రమే అనిపించుచుండును.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹