నిర్మల ధ్యానాలు - ఓషో - 187


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 187 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమాజం హృదయాన్ని నిర్లక్ష్యం చేసింది. మరచిపోయింది. కారణం హృదయం చాలా ప్రమాదకరమైన విషయం. మేదస్సు యంత్రం. యంత్రాలు తిరగబడవు. అవి కేవలం ఆజ్ఞల్ని పాలిస్తాయి. 🍀


సమాజ ప్రయత్నమంతా హృదయానికి వ్యతిరేకమయిందే. అది మెదడుకు శిక్షణ నిస్తుంది. మెదడు క్రమశిక్షణ కలిగిస్తుంది. విద్యాబోధన చేస్తుంది. సమాజం హృదయాన్ని నిర్లక్ష్యం చేసింది. మరచిపోయింది. కారణం హృదయం చాలా ప్రమాదకరమైన విషయం. మేదస్సు యంత్రం. యంత్రాలు తిరగబడవు. అవి కేవలం ఆజ్ఞల్ని పాలిస్తాయి. యంత్రాలు అట్లా చూస్తే మంచివే. అవి చెప్పనట్లు చేస్తాయి.

అందువల్ల రాజ్యం, తల్లిదండ్రులు అందరూ మేథస్సు అంటే యిష్టపడతారు. హృదయం రాజ్యానికి ప్రమాదకరం. సమాజానికి ప్రమాదకరం. స్వార్థాలకు ప్రమాదకరం. మెదడు లాజిక్గా పని చేసేది. దాన్ని ఒప్పించవచ్చు. దాన్ని హిందూగా, కమ్యూనిస్టుగా, ఫాసిస్టుగా, సోషలిస్టుగా ఎలాగైనా మార్చవచ్చు. 'తల'తో ఏ పనయినా చెయ్యవచ్చు. తెలివయిన విద్యా విధానం, మోసపూరిత వ్యూహం వుంటే చాలు. కంప్యూటర్లకు ఫీడ్ చేసినట్టు తలకు చెయ్యవచ్చు. నువ్వు ఫీడ్ చేసింది అది తిరిగి తిరిగి చెబుతూ వుంటుంది. కొత్తది ఒక్కటీ అది ప్రదర్శించలేదు. దానికి ఒరిజినాలిటీ వుండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


30 May 2022

No comments:

Post a Comment