24వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 24rd Pasuram - Tiruppavai Bhavartha Gita


https://youtu.be/W_SVkLAY6Yc


🌹 24వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 24rd Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 అవతార లీల స్తుతి - మంగళహారతి గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 24వ పాశురంలో, దుష్ట శిక్షణకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని లీలలు కొని యాడుతూ శ్రీహరి చరణారవిందాలకు మంగళహారతినిస్తూ పాడుతున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


మాఘ మేళ Magh Mela



🌹 ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద 44 రోజుల పాటు ఘనంగా జరిగే "మాఘ మేళ" 🌹

🍀 సంగమ స్నానం..పుణ్యఫలాల సాధనగా విశ్వాసం - కల్పవాసం..కఠిన నియమాలతో ఆత్మశుద్ధి - సాధువుల సమాగమంతో ఆధ్యాత్మిక శోభ 🍀

ప్రసాద్ భరద్వాజ



🌹 The grand "Magh Mela" held for 44 days at the Triveni Sangam in Prayagraj 🌹

🍀 Bathing in the Sangam...a belief in attaining spiritual merit - Kalpavas...self-purification through strict observances - Spiritual splendor with the gathering of sadhus 🍀

Prasad Bharadwaj




ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో గతేడాది మహా కుంభమేళా జరగ్గా.. ప్రస్తుతం మరో మాఘ మేళా మొదలైంది. మొత్తం 44 రోజుల పాటు సాగే ఈ మాఘ మేళా.. పౌష పూర్ణిమ నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో కోట్లాది మంది భక్తులు సంగమ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మాఘ మేళాకు విచ్చేసే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, రవాణా ఏర్పాట్లు చేసింది. కుంభమేళా స్థాయి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రశాంతమైన వాతావరణంలో పొందాలనుకునే వారికి ఈ మేళా సరైన వేదిక అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

పవిత్ర త్రివేణి సంగమం వద్ద మాఘ మేళా 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 3వ తేదీన పౌష పూర్ణిమ పుణ్యస్నానంతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి వరకు మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది. కుంభమేళాతో పోలిస్తే తక్కువ రద్దీ.. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవశ్యాన్ని పొందేవారికి ఇది ఒక చక్కని అవకాశంగా మారనుంది.

గంగ, యమున, అంతర్వాహిని అిన సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాఘ మేళా ప్రారంభ తొలి రోజు అయిన పౌష పూర్ణిమ నాడే సుమారు 21.5 లక్షల మంది భక్తులు సంగమ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

ఈ మేళాలో ఆరు ప్రధాన స్నాన దినాలు ఉన్నాయి. మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 18), వసంత పంచమి (జనవరి 23), మాఘీ పూర్ణిమ (ఫిబ్రవరి 1), మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో ఎక్కువమంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు.



🌻 కుంభమేళాకు, మాఘ మేళాకు తేడా ఏమిటి? 🌻

ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి అత్యంత భారీ స్థాయిలో జరిగేది కుంభమేళా. అయితే ఈ మాఘ మేళా మాత్రం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. కుంభమేళాలో ఉండే సాధువుల సమాగమం, దానధర్మాలు, హారతులు, ఆధ్యాత్మిక చర్చలు అన్నీ మాఘ మేళాలోనూ ఉంటాయి. కానీ కుంభమేళాతో పోల్చితే.. మాఘ మేళాలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉండి.. ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుంటుంది.

త్రివేణి సంగమంలో మాఘ మేళ వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర ప్రాంతం మాఘ మేళ సందర్భంగా ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందుతోంది. నదీతీరాలు భక్తుల జయజయధ్వానాలతో, వేదమంత్రాల నాదంతో మారుమోగుతున్నాయి.

మాఘ మేళలో ముఖ్య ఆకర్షణగా నిలిచేది త్రివేణి సంగమంలో చేసే పవిత్ర స్నానం. గంగా, యమునా, అదృశ్యంగా ప్రవహించే సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మాఘ మాసంలో చేసే సంగమ స్నానానికి విశేష పుణ్యఫలం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి ప్రత్యేక తిథుల్లో లక్షలాది మంది భక్తులు ఒకేసారి నదిలోకి దిగుతూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ దృశ్యం భక్తిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా కనిపిస్తోంది.

మాఘ మేళలో మరో ప్రత్యేక ఆచారం 'కల్పవాసం'. నెలరోజుల పాటు నదీతీరంలో నివసిస్తూ కఠిన నియమాలు పాటిస్తూ జీవనం సాగించడమే కల్పవాసం. బ్రహ్మచర్యం, నియమిత ఉపవాసాలు, జపతపాలు, దానధర్మాలు వంటి ఆచారాలతో భక్తులు తమ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకుంటారు. కల్పవాసం ద్వారా ఆత్మశుద్ధి కలిగి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని విశ్వసిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తాత్కాలిక ఆశ్రమాలు, గుడారాల్లో నివసిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.

మాఘ మేళ సందర్భంగా త్రివేణి సంగమ ప్రాంతం సాధువులు, మహానుభావుల సమాగమంతో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సన్యాసులు ధ్యానం, ప్రవచనాలు, యజ్ఞయాగాలతో భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. వారి సందేశాలు భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. భజనలు, కీర్తనలు, హరికథలతో సంగమ ప్రాంతం నిత్యం పవిత్ర నాదంతో నిండిపోతోంది. మాఘ మేళ మొత్తం కాలంలో త్రివేణి సంగమం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. మహాశివరాత్రి నాటికి ఈ మేళ పరాకాష్టకు చేరనుండగా, భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తున్నారు.

🌹🌹🌹🌹🌹

స్వామియే శరణం అయ్యప్ప 41 రోజుల నిష్ఠా దీక్ష Ayyappa Swamy



https://youtube.com/shorts/rDiYWAUuv8Q


🌹 స్వామియే శరణం అయ్యప్ప 41 రోజుల నిష్ఠా దీక్ష Ayyappa Swamy 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


23వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 23rd Pasuram - Tiruppavai Bhavartha Gita Malika



https://youtube.com/shorts/1bcO2utG4co


🌹 23వ పాశురము - 23rd Pasuram 🌹

🌻 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - Tiruppavai Bhavartha Gita Malika 🌻

🍀 యదుసింహుని మేల్కొలుపు - దివ్య స్వాగత గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 23వ పాశురంలో, గుహలో నిద్రించే సింహం ఒళ్ళు విరుచుకొని, ధూళి దులుపుకుంటూ బయటికి వస్తున్నట్లు కృష్ణుడు నిద్ర లేచి వస్తున్నట్లు కనిపించింది గోపికలకు. ఈ పాశురంలో వారు పరమాత్మకు స్వాగతం పలుకుతున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹

23వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 23rd Pasuram - Tiruppavai Bhavartha Gita



https://youtu.be/uLk7po73VwQ


🌹 23వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 23rd Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 23వ పాశురం - యదుసింహుని మేల్కొలుపు - దివ్య స్వాగత గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 23వ పాశురంలో, గుహలో నిద్రించే సింహం ఒళ్ళు విరుచుకొని, ధూళి దులుపుకుంటూ బయటికి వస్తున్నట్లు కృష్ణుడు నిద్ర లేచి వస్తున్నట్లు కనిపించింది గోపికలకు. ఈ పాశురంలో వారు పరమాత్మకు స్వాగతం పలుకుతున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


శుభ బుధవారం మిత్రులందరికీ Happy Wednesday


🌹 అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 With the divine blessings of Lord Ayyappa, Lord Ganesha, and Lord Subrahmanya, a blessed Wednesday to all my friends 🌹

Prasad Bhardwaj



దివ్య క్షేత్రం కుంభకోణం / The divine pilgrimage site of Kumbakonam


🌹 దివ్య క్షేత్రం కుంభకోణం - తప్పక చూడాల్సిన అద్బుత దేవాలయం. 🌹

🌻 భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే శారంగపాణి స్వామి, దేవి కోమలవల్లి తాయారు అమ్మవారు. 🌻

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 The divine pilgrimage site of Kumbakonam - a must-see magnificent temple. 🌹

🌻 Lord Sarangapani Swamy and Goddess Komalavalli Thayar, who bestow immense spiritual peace upon devotees. 🌻

Prasad Bharadwaj



108 దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కుంభకోణం తిరు కుడందై క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని, ప్రశాంతతను ప్రసాదిస్తుంది.

అనేక ఆలయాల సమాహారంగా విరాజిల్లే ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఉంది. ఇక్కడ స్వామివారు శారంగపాణి స్వామిగా, అమ్మవారు కోమలవల్లి తాయారుగా భక్తుల పూజాభిషేకాలు అందుకుంటున్నారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆలయంలో అడుగుపెట్టగానే దివ్యత్వం, భక్తి, చరిత్ర అన్నీ ఒకే చోట అనుభూతి కలిగిస్తాయి.

ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గర్భగుడి మొత్తం రథం ఆకారాన్ని పోలి ఉండటం ఇక్కడి ప్రధాన విశేషం. ఇది విష్ణువు ఆకాశ రథంపై భక్తులకు దర్శనమిచ్చే తాత్పర్యాన్ని సూచిస్తుందని పండితులు వివరిస్తారు. ఆలయానికి ఉత్తర వాకిలి, దక్షిణ వాకిలి అనే రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. సాధారణంగా దక్షిణ వాకిలి ద్వారా భక్తులు దర్శనానికి ప్రవేశిస్తారు. అయితే ఉత్తరాయణ కాలంలో మాత్రమే ఉత్తర వాకిలిని తెరవడం ఆనవాయితీగా వస్తోంది. ఇది అత్యంత పుణ్యప్రదమైన ఘట్టంగా భావిస్తారు. ఈ సమయంలో దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

స్థలపురాణం ప్రకారం, ఒకప్పుడు సూర్యభగవానుడు సుదర్శన చక్రంతో పోటీ పడి తన తేజస్సును కోల్పోయాడని చెబుతారు. తేజస్సు హీనుడైన సూర్యుడు ఈ క్షేత్రంలో శారంగపాణి స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాడు. స్వామి అనుగ్రహంతో సూర్యభగవానుడు తిరిగి తన ప్రకాశాన్ని పొందాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని "భాస్కర క్షేత్రం" అని కూడా పిలుస్తారు. సూర్యభగవానుడి అభ్యర్థన మేరకే శారంగపాణి స్వామి ఇక్కడ అవతరించాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ ఆలయంలో మరో విశేషంగా పాతాళ శ్రీనివాసుడి సన్నిధి ఉంది.

భూమికి సుమారు 10 అడుగుల లోతులో స్వామివారు కొలువై ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఈ సన్నిధిని దర్శించాల్సిందేనని భావిస్తారు. పెరియాళ్వార్, పేయాళ్వార్, పూదత్తాళ్వార్, నమ్మాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వంటి మహానుభావులు ఈ స్వామిని తమ పాశురాలలో కీర్తించారు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించడంతో సమస్త పాపాలు నశించి, సకల శుభాలు చేకూరుతాయని భక్తుల అచంచల విశ్వాసం. ఆధ్యాత్మికత, చరిత్ర, భక్తి సమన్వయంగా నిలిచిన ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర స్థలంగా నిలుస్తోంది.

🌹🌹🌹🌹🌹



తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 12 - పాశురాలు 23 & 24 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 12 - Pasuras 23 & 24



https://youtu.be/SmGPfVXruyY?si=5nuP28zQrdL8wF_U


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 12 - పాశురాలు 23 & 24 Tiruppavai Pasuras Bhavartha Gita Series 12 - Pasuras 23 & 24 🌹

🍀 23వ పాశురం - యదుసింహుని మేల్కొలుపు - దివ్య స్వాగత గీతం. 24వ పాశురం - అవతార లీల స్తుతి - మంగళహారతి గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 23వ పాశురంలో, గుహలో నిద్రించే సింహం ఒళ్ళు విరుచుకొని, ధూళి దులుపుకుంటూ బయటికి వస్తున్నట్లు కృష్ణుడు నిద్ర లేచి వస్తున్నట్లు కనిపించింది గోపికలకు. ఈ పాశురంలో వారు పరమాత్మకు స్వాగతం పలుకుతున్నారు. 24వ పాశురంలో, దుష్ట శిక్షణకు అవతరించిన ఆ శ్రీమన్నారాయణుని లీలలు కొని యాడుతూ శ్రీహరి చరణారవిందాలకు మంగళహారతినిస్తూ పాడుతున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹