శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 / Sri Lalitha Chaitanya Vijnanam - 243

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 / Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀

🌻 243. 'చారుచంద్ర కళాధరా'🌻

వృద్ధి, క్షయ రహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధి క్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళల కతీతముగ మనోభావమున వృద్ధి క్షయములు లేక యుండును. జ్ఞానాగ్ని మనో వికారము లన్నింటిని దగ్ధము చేయును. అట్టి జ్ఞాన వంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై యుండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు.

ఈ కళను ఎప్పుడునూ ధరించి యుండునది శ్రీదేవి. ఆ జ్ఞానమున కామెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి. జ్ఞాన స్వరూప. జ్ఞానమును ప్రసాదించునది కూడ ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి యున్నది అనుటలో విశేషము నిజమున కేమియూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణ గాథ యున్నది.

చంద్రకళ అను రాజకుమారి యుండెడిది. ఆమె కాశీరాజు కుమార్తె. సర్వ లక్షణ సంపన్న. ఆమెకు శశికళ అనుపేరు కూడ కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప నర్హత గల రాజ కుమారుడు చాల కాలము కానరాకుండెను.చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగ ఆమె కమితమగు దుఃఖము కలిగినది.

శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది "పుత్రీ! చంద్రకళా! నీవు దిగులు చెంద నవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లి యాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. నిశ్చలమగు ఈశ్వరోపాసకుడే నిన్ను పరిణయ మాడగలడు. సుదర్శనుడను రాజపుత్రుడు కామరాజ బీజ ఉపాసకుడు, పరమ శివుడే కామరాజు. అతనీ బీజాక్షరీ ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవతనిని వరునిగా వరింపుము.

అతనిని మహేశ్వరు డావరించి యున్నాడు. అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి యుందును. నీయందతనికి నాకళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు.

నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారుచంద్ర కళాధరా అను అష్టాక్షరీ నామము నా కేర్పడగలదు.” పై కారణముగ శ్రీదేవి చారుచంద్ర కళాధరా అయినది.

పూర్ణచంద్రుని కళ చారుచంద్రకళ, ఇట్టి పూర్ణ జ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింప గలదు. ఆమె సాన్నిధ్యమున ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి యుండును. ఇది శ్రీదేవి అనుగ్రహము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Cāru-candra-kalādharā चारु-चन्द्र-कलाधरा (243) 🌻

She is wearing the crescent moon in Her crown. Cāru means moon light. All the above nāma-s deal with the moon. The full moon represents supreme consciousness. If She is meditated upon on the full moon night, one will attain mantra siddhi at the earliest. On full moon days, sattvic guṇa becomes predominant.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

గీతోపనిషత్తు -177

🌹. గీతోపనిషత్తు -177 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 19

🍀 19. యతచిత్తము - గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యందనాసక్తి, సంకల్ప సన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము నేర్వవలెను. 🍀

యథా దీపో నివాతస్థా నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః|| 19

గాలి తగులని దీపమెట్లు నిశ్చలముగ నుండునో అట్టి స్థిర చిత్తముతో 'నేను' అను వెలుగును భ్రూమధ్యమున యోగి దర్శించు చుండును. నివాతస్థ దీపమనగ గాలి సోకని దీపము. గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము.

చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యథాలాపముగ ఏమియు చేయరాదు. చేయుపని ఏదైనను దానియందే పూర్ణచిత్తము నియోగించవలెను.

దంత ధావనము, స్నానము, వస్త్రధారణము, భోజనము వంటి కార్యములు యథాలాపముగ చేయక మనసు పెట్టి నిర్వర్తించవలెను. శ్రద్ధగ చేయవలెను. అక్షరాభ్యాస సమయము నుండి ఈ అభ్యాసము ప్రారంభించిన వారికి యతచిత్త మేర్పడుట సులభము. దైనందిన కార్యములందు యథాలాపముగ నుండువారు ధ్యానము నేర్చుటకు చాల శ్రమపడవలసి వచ్చును.

ప్రస్తుతమున మనస్సు నిలుపుట, ఇతర ఆలోచనలు రాకుండుట జరుగవలెను. విను చున్నపుడు పూర్తిగ వినవలెను. చూచుచున్నపుడు పూర్తిగ చూడవలెను. అనగ మనస్సు పెట్టవలెను. అట్లే తినుచున్నపుడు, తిరుగు చున్నపుడు కూడ. ప్రస్తుతమున మనస్సు నిలచుట ప్రధానము. ఉదాహరణకు ఒక పాట వినుచున్నపుడు పాటను పూర్తిగ వినువారు అరుదు. ఆ నిమిషములోనే అనేకానేక భావములు కలిగి పాట వినుట జరుగదు.

యతచిత్తము గూర్చి భగవానుడు చాలమార్లు పలికినాడు. అట్టి యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యం దనాసక్తి, సంకల్పసన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము ఇత్యాది వెన్నియో గీతయందు తెలుపబడినవి. ఇవి ఏవియును పాటింపక, సరాసరి ధ్యానమందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకమే అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 377

🌹 . శ్రీ శివ మహా పురాణము - 377🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 12

🌻. శివహిమాచల సంవాదము - 2 🌻

హిమవంతుడిట్లనెను-

ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)

ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20).

హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).

మహేశ్వరుడిట్లు పలికెను-

హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25).

హిమవంతుడిట్లు పలికెను-

ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).

శంభుడిట్లు పలికెను-

ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).

ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

మాస్టర్ ఇ.కె సందేశాలు - 5

🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 5 🌹

✍🏼. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు

🌻. భాగవతము 4-288. ధ్రువోపాఖ్యానము 🌻

భగవంతునికి నమస్కరించువారు తాము మంచిదనుకొను దానిని పొందుటకై నమస్కరించుచున్నారు. కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు. (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు తామేమియు కోరకున్నారు.) వారే నిష్కాములు.

అట్టి వారికి రాజ్య పరిపాలనము మున్నగు ప్రయోజనములు సిద్ధించినను , వారు తమ పరిపాలనము రూపమున జీవులకు సర్వ ప్రయోజనములను సిద్ధించుటకు యత్నించుచు ఆ జీవుల రూపమున‌ భగవంతుని పాదసేవయే చేసికొనుచున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సత్యానుభూతి - చతుర్విధ నిశ్చయార్థకములు 🌻

739. ఆత్మ నాల్గు స్థితుల ద్వారా పురోగమించగా సత్య సంబంధమగు నిత్య సత్యానుభూతిని సేకరించును.

740. చతుర్విధ నిశ్చయార్థకములు

1. అంతరానుభూతుల నుండి, దృశ్యముల నుండి లేక ఆధ్యాత్మిక అనుభవముల నుండి (అవి మార్గమందలి అనుభవములు కానీ లేక అన్యము కానీ) కలిగిన నిస్సంశయము.

2. సాక్షీభూతమైన నిస్సంశయము. సర్వత్రా భగవంతుని ప్రత్యక్షముగా చూపుట వలన కలిగిన నిస్సంశయము.

3. భగవదైక్యము వలన కలిగిన నిస్సంశయము.

4. మానవునిలోగల దివ్యత్వ పరిపూర్ణత్వమునకు సంబంధించిన అనుభవముతో కూడిన నిస్సంశయము. దీని వలన ఆతడు భగవంతుని యొక్క, విశ్వము యొక్క రహస్యములను ఎఱుంగును.

ఈ శక్తి ఒక్క సార్వభౌమిక మనస్సునకే (మహాకారణ శరీరము) గలదు. ఇది సమస్త దివ్య విచారమునకు పీఠము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Sri Lalita Sahasranamavali - Meaning - 54

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 54. మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54 ॥🍀

🍀 212. మహారూపా -
గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.

🍀 213. మహాపూజ్యా -
గొప్పగా పూజింపబడునది.

🍀 214. మహాపాతక నాశినీ -
ఘోరమైన పాతకములను నాశనము చేయునది.

🍀 215. మహామాయా -
మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.

🍀 216. మహాసత్వా - 
మహిమాన్వితమైన ఉనికి గలది.

🍀 217. మహాశక్తిః -
అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.

🍀 218. మహారతిః -
గొప్ప ఆసక్తి గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹

📚. Prasad Bharadwaj

🌻 54. mahārūpā mahāpūjyā mahāpātaka-nāśinī |
mahāmāyā mahāsattvā mahāśaktir mahāratiḥ || 54 || 🌻

🌻 212 ) Maha roopa -
She who is very big

🌻 213 ) Maha poojya -
She who is fit to be worshipped by great people

🌻 214 ) Maha pathaka nasini -
She who destroys the major misdemeanors

🌻 215 ) Maha maya -
She who is the great illusion

🌻 216 ) Maha sathva -
She who is greatly knowledgeable

🌻 217 ) Maha sakthi -
She who is very strong

🌻 218 ) Maha rathi -
She who gives great happiness

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

29 Mar 2021

29-MARCH-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 177🌹  
2) 🌹. శివ మహా పురాణము - 377🌹 
3) 🌹 Light On The Path - 126🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -5 🌹
5) 🌹 Seeds Of Consciousness - 324🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Lalitha Sahasra Namavali - 54🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 54 / Sri Vishnu Sahasranama - 54🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -177 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 19

*🍀 19. యతచిత్తము - గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యందనాసక్తి, సంకల్ప సన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము నేర్వవలెను. 🍀*

యథా దీపో నివాతస్థా నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః|| 19

గాలి తగులని దీపమెట్లు నిశ్చలముగ నుండునో అట్టి స్థిర చిత్తముతో 'నేను' అను వెలుగును భ్రూమధ్యమున యోగి దర్శించు చుండును. నివాతస్థ దీపమనగ గాలి సోకని దీపము. గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. 

చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యథాలాపముగ ఏమియు చేయరాదు. చేయుపని ఏదైనను దానియందే పూర్ణచిత్తము నియోగించవలెను. 

దంత ధావనము, స్నానము, వస్త్రధారణము, భోజనము వంటి కార్యములు యథాలాపముగ చేయక మనసు పెట్టి నిర్వర్తించవలెను. శ్రద్ధగ చేయవలెను. అక్షరాభ్యాస సమయము నుండి ఈ అభ్యాసము ప్రారంభించిన వారికి యతచిత్త మేర్పడుట సులభము. దైనందిన కార్యములందు యథాలాపముగ నుండువారు ధ్యానము నేర్చుటకు చాల శ్రమపడవలసి వచ్చును. 

ప్రస్తుతమున మనస్సు నిలుపుట, ఇతర ఆలోచనలు రాకుండుట జరుగవలెను. విను చున్నపుడు పూర్తిగ వినవలెను. చూచుచున్నపుడు పూర్తిగ చూడవలెను. అనగ మనస్సు పెట్టవలెను. అట్లే తినుచున్నపుడు, తిరుగు చున్నపుడు కూడ. ప్రస్తుతమున మనస్సు నిలచుట ప్రధానము. ఉదాహరణకు ఒక పాట వినుచున్నపుడు పాటను పూర్తిగ వినువారు అరుదు. ఆ నిమిషములోనే అనేకానేక భావములు కలిగి పాట వినుట జరుగదు.

యతచిత్తము గూర్చి భగవానుడు చాలమార్లు పలికినాడు. అట్టి యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యం దనాసక్తి, సంకల్పసన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము ఇత్యాది వెన్నియో గీతయందు తెలుపబడినవి. ఇవి ఏవియును పాటింపక, సరాసరి ధ్యానమందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకమే అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 377🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 12

*🌻. శివహిమాచల సంవాదము - 2 🌻*

హిమవంతుడిట్లనెను-

ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)

ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20). 

హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).

మహేశ్వరుడిట్లు పలికెను-

హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25). 

హిమవంతుడిట్లు పలికెను-

ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).

శంభుడిట్లు పలికెను-

ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).

ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 126 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. Seek it by testing all experiences - 2 🌻*

477.When the centre of consciousness has separated itself from the body of desire and moved to the manasic plane, a considerable advance has been made. 

The man no longer looks on the body of desire as himself, but as merely a vehicle. Yet its vibrations can still affect him, for it has a life of its own, and sometimes it is as if the horses had run away with him. That is the stage spoken of in the Kathopanishat, when the driver has reined in the horses and they are going quietly, but are still liable to rush away now and then. The disciple knows when they have run away by the excitement of the senses. 

It is a stage of great trial. The whole nature of the man is shamed and pained by the degradation; he cannot yield without suffering. In his normal condition of consciousness the senses do not attract him, he does not feel the temptations of the body, which are really astral. Yet times come when he does feel them. This happens because the old mould of desire is not broken up, and it has been vivified from outside. 

The channel has not disappeared, though it is wearing out, and the danger exists that it may suddenly be filled from the outside, and then the desire-form is revivified. Astral influences cause vibrations in it strong enough to affect the man’s consciousness again; left to itself it would not affect him; but he comes to a place, time or person on account of which strong influences from outside vibrate through him and revivify this old form.

478. They are to be recognized as coming from outside, not from himself, so the disciple ought to understand what they are. With shame, degradation and horror he feels this thing, and wonders how he can feel it. The answer is that there is a stage in growth when seductions coming from the senses may be experienced but need not be yielded to. The man then passes them by. He says: “I feel you; I recognize you; I weigh you; but I refuse to be moved.” 

That is the meaning of the passage in the Kathopanishat, where it says the man has come to the point where he can hold the horses in. He can hold the senses under control. It is the last lesson with regard to the temptation of the senses. When it is learned, their power over the man has passed for ever. Never again will they have the power to affect him; it is the last struggle with them, and when it is over the soul has escaped.

479. When that time of struggle comes, and it will come to every one, after the centre of consciousness is moved on to the manasic plane, it is an immense help to realize its nature and to know how to deal with it, to be able to say: “It is not I; it is simply a vibration from the lower nature sent out to me; I reject it; that is my answer.” 

The moment you repudiate it, the sense of horror goes; you refuse to feel its influence. When you have done that, you can test yourself, and see what part of your nature it is working upon. Then you will wait with patience for the time when you will feel it no more. 

You trust in the law; you sit down and patiently wait, and presently it will be unable to set up any vibrations; the senses cannot make you respond to them. You say: “I can wait patiently for the time when I shall not feel this thing. It is a dead form revivified that I feel, and it will soon be broken up and will fade away.” 

There is nothing left but to wait so – perhaps for months or for years. The victory is won when you are able to do that – the mould is broken. Recognition of your patience gives the last blow to shatter it, and never again can it affect you, unless you turn your back upon the goal, which seems an impossibility.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 5 🌹
✍🏼. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు

🌻. భాగవతము 4-288. ధ్రువోపాఖ్యానము 🌻

భగవంతునికి నమస్కరించువారు తాము మంచిదనుకొను దానిని పొందుటకై నమస్కరించుచున్నారు. కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు. (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు తామేమియు కోరకున్నారు.) వారే నిష్కాములు.

అట్టి వారికి రాజ్య పరిపాలనము మున్నగు ప్రయోజనములు సిద్ధించినను , వారు తమ పరిపాలనము రూపమున జీవులకు సర్వ ప్రయోజనములను సిద్ధించుటకు యత్నించుచు ఆ జీవుల రూపమున‌ భగవంతుని పాదసేవయే చేసికొనుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకె #MasterEK
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 324 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 173. Understand this 'I am' business and stand apart from it, transcend it. Just be. 🌻*

The Guru is indeed very generous: see how stubbornly he persists with you. He knows your potential and also knows that at least theoretically you understand his teaching. 

By repeatedly hammering away at the teaching he wants you to get stabilized in the 'I am', for only then do you stand a chance to transcend it. He is constantly urging you or trying to push you into the 'Turiya' or fourth state. 

This he does tirelessly and relentlessly with anyone who comes to him and in whom he senses a genuine seeker. So, after expounding everything, he says 'now that you have understood everything, just be'.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సత్యానుభూతి - చతుర్విధ నిశ్చయార్థకములు 🌻*

739. ఆత్మ నాల్గు స్థితుల ద్వారా పురోగమించగా సత్య సంబంధమగు నిత్య సత్యానుభూతిని సేకరించును. 

740. చతుర్విధ నిశ్చయార్థకములు

1. అంతరానుభూతుల నుండి, దృశ్యముల నుండి లేక ఆధ్యాత్మిక అనుభవముల నుండి (అవి మార్గమందలి అనుభవములు కానీ లేక అన్యము కానీ) కలిగిన నిస్సంశయము.

2. సాక్షీభూతమైన నిస్సంశయము. సర్వత్రా భగవంతుని ప్రత్యక్షముగా చూపుట వలన కలిగిన నిస్సంశయము.

3. భగవదైక్యము వలన కలిగిన నిస్సంశయము.

4. మానవునిలోగల దివ్యత్వ పరిపూర్ణత్వమునకు సంబంధించిన అనుభవముతో కూడిన నిస్సంశయము. దీని వలన ఆతడు భగవంతుని యొక్క, విశ్వము యొక్క రహస్యములను ఎఱుంగును.

ఈ శక్తి ఒక్క సార్వభౌమిక మనస్సునకే (మహాకారణ శరీరము) గలదు. ఇది సమస్త దివ్య విచారమునకు పీఠము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 / Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀*

*🌻 243. 'చారుచంద్ర కళాధరా'🌻*

వృద్ధి, క్షయ రహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధి క్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళల కతీతముగ మనోభావమున వృద్ధి క్షయములు లేక యుండును. జ్ఞానాగ్ని మనో వికారము లన్నింటిని దగ్ధము చేయును. అట్టి జ్ఞాన వంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై యుండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు. 

ఈ కళను ఎప్పుడునూ ధరించి యుండునది శ్రీదేవి. ఆ జ్ఞానమున కామెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి. జ్ఞాన స్వరూప. జ్ఞానమును ప్రసాదించునది కూడ ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి యున్నది అనుటలో విశేషము నిజమున కేమియూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణ గాథ యున్నది. 

చంద్రకళ అను రాజకుమారి యుండెడిది. ఆమె కాశీరాజు కుమార్తె. సర్వ లక్షణ సంపన్న. ఆమెకు శశికళ అనుపేరు కూడ కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప నర్హత గల రాజ కుమారుడు చాల కాలము కానరాకుండెను.చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగ ఆమె కమితమగు దుఃఖము కలిగినది. 

శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది "పుత్రీ! చంద్రకళా! నీవు దిగులు చెంద నవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లి యాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. నిశ్చలమగు ఈశ్వరోపాసకుడే నిన్ను పరిణయ మాడగలడు. సుదర్శనుడను రాజపుత్రుడు కామరాజ బీజ ఉపాసకుడు, పరమ శివుడే కామరాజు. అతనీ బీజాక్షరీ ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవతనిని వరునిగా వరింపుము. 

అతనిని మహేశ్వరు డావరించి యున్నాడు. అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి యుందును. నీయందతనికి నాకళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు.
నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారుచంద్ర కళాధరా అను అష్టాక్షరీ నామము నా కేర్పడగలదు.” పై కారణముగ శ్రీదేవి చారుచంద్ర కళాధరా అయినది.

పూర్ణచంద్రుని కళ చారుచంద్రకళ, ఇట్టి పూర్ణ జ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింప గలదు. ఆమె సాన్నిధ్యమున ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి యుండును. ఇది శ్రీదేవి అనుగ్రహము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Cāru-candra-kalādharā चारु-चन्द्र-कलाधरा (243) 🌻*

She is wearing the crescent moon in Her crown. Cāru means moon light. All the above nāma-s deal with the moon. The full moon represents supreme consciousness. If She is meditated upon on the full moon night, one will attain mantra siddhi at the earliest. On full moon days, sattvic guṇa becomes predominant.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 54 / Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 54. మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।*
*మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54 ॥🍀*

🍀 212. మహారూపా - 
గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.

🍀 213. మహాపూజ్యా - 
గొప్పగా పూజింపబడునది.

🍀 214. మహాపాతక నాశినీ - 
ఘోరమైన పాతకములను నాశనము చేయునది.

🍀 215. మహామాయా -
 మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.

🍀 216. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.

🍀 217. మహాశక్తిః - 
అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.

🍀 218. మహారతిః - 
గొప్ప ఆసక్తి గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 54 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 54. mahārūpā mahāpūjyā mahāpātaka-nāśinī |*
*mahāmāyā mahāsattvā mahāśaktir mahāratiḥ || 54 || 🌻*

🌻 212 ) Maha roopa -   
She who is very big

🌻 213 ) Maha poojya -   
She who is fit to be worshipped by great people

🌻 214 ) Maha pathaka nasini -   
She who destroys the major misdemeanors

🌻 215 ) Maha maya -   
She who is the great illusion

🌻 216 ) Maha sathva -   
She who is greatly knowledgeable

🌻 217 ) Maha sakthi -   
She who is very strong

🌻 218 ) Maha rathi -   
She who gives great happiness

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 54 / Sri Vishnu Sahasra Namavali - 54 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*🌻54. సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |*
*వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ‖ 54 ‖ 🌻*

*చిత్త నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

 🍀. 503) సోమప: - 
యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.

🍀. 504) అమృతప: - 
ఆత్మానందరసమును అనుభవించువాడు.

🍀. 505) సోమ: - 
చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.

🍀. 506) పురుజిత్: - 
ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.

🍀. 507) పురుసత్తమ: - 
ఉత్తములలో ఉత్తముడైనవాడు.

🍀. 508) వినయ: - 
దుష్టులను దండించి, వినయము కల్గించు వాడు.

🍀. 509) జయ: - 
సర్వులను జయించి వశపరుచుకొనువాడు.

🍀. 510) సత్యసంధ: - 
సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.

🍀. 511) దాశార్హ: - 
దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.

🍀. 512) సాత్వతాంపతిః - 
సత్వగుణ సంపన్నులకు ప్రభువు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 54 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Chitta 2nd Padam*

*🌻 54. sōmapōmṛtapaḥ sōmaḥ purujit purusattamaḥ |*
*vinayō jayaḥ satyasandhō dāśārhassātvatāṁ patiḥ || 54 ||*

🌻 503. Sōmapaḥ: 
One who drinks the Soma in all Yajnas in the form of the Devata.

🌻 504. Amṛtapaḥ: 
One who drinks the drink of immortal Bliss which is of one's own nature.

🌻 505. Sōmaḥ: 
One who as the moon invigorates the plants.

🌻 506. Purujit: 
One who gains victory over numerous people.

🌻 507. Purushottamaḥ: 
As His form is of cosmic dimension He is Puru or great, and as He is the most important of all, He is Sattama.

🌻 508. Vinayaḥ: 
One who inflicts Vinaya or punishment on evil ones.

🌻 509. Jayaḥ: 
One who is victorious over all beings.

🌻 510. Satyasandhaḥ: 
One whose 'Sandha' or resolve becomes always true.

🌻 511. Dāśārhaḥ: 
Dasha means charitable offering. Therefore, He to whom charitable offerings deserve to be made.

🌻 512. Sātvatāṁ-patiḥ: 
'Satvatam' is the name of a Tantra. So the one who gave it out or commented upon it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹