శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 / Sri Lalitha Chaitanya Vijnanam - 243


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 243 / Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀

🌻 243. 'చారుచంద్ర కళాధరా'🌻

వృద్ధి, క్షయ రహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధి క్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళల కతీతముగ మనోభావమున వృద్ధి క్షయములు లేక యుండును. జ్ఞానాగ్ని మనో వికారము లన్నింటిని దగ్ధము చేయును. అట్టి జ్ఞాన వంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై యుండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు.

ఈ కళను ఎప్పుడునూ ధరించి యుండునది శ్రీదేవి. ఆ జ్ఞానమున కామెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి. జ్ఞాన స్వరూప. జ్ఞానమును ప్రసాదించునది కూడ ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి యున్నది అనుటలో విశేషము నిజమున కేమియూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణ గాథ యున్నది.

చంద్రకళ అను రాజకుమారి యుండెడిది. ఆమె కాశీరాజు కుమార్తె. సర్వ లక్షణ సంపన్న. ఆమెకు శశికళ అనుపేరు కూడ కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప నర్హత గల రాజ కుమారుడు చాల కాలము కానరాకుండెను.చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగ ఆమె కమితమగు దుఃఖము కలిగినది.

శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది "పుత్రీ! చంద్రకళా! నీవు దిగులు చెంద నవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లి యాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. నిశ్చలమగు ఈశ్వరోపాసకుడే నిన్ను పరిణయ మాడగలడు. సుదర్శనుడను రాజపుత్రుడు కామరాజ బీజ ఉపాసకుడు, పరమ శివుడే కామరాజు. అతనీ బీజాక్షరీ ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవతనిని వరునిగా వరింపుము.

అతనిని మహేశ్వరు డావరించి యున్నాడు. అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి యుందును. నీయందతనికి నాకళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు.

నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారుచంద్ర కళాధరా అను అష్టాక్షరీ నామము నా కేర్పడగలదు.” పై కారణముగ శ్రీదేవి చారుచంద్ర కళాధరా అయినది.

పూర్ణచంద్రుని కళ చారుచంద్రకళ, ఇట్టి పూర్ణ జ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింప గలదు. ఆమె సాన్నిధ్యమున ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి యుండును. ఇది శ్రీదేవి అనుగ్రహము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 243 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Cāru-candra-kalādharā चारु-चन्द्र-कलाधरा (243) 🌻

She is wearing the crescent moon in Her crown. Cāru means moon light. All the above nāma-s deal with the moon. The full moon represents supreme consciousness. If She is meditated upon on the full moon night, one will attain mantra siddhi at the earliest. On full moon days, sattvic guṇa becomes predominant.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2021

No comments:

Post a Comment