🌹 04, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 04, MAY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 04, MAY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 212 / Agni Maha Purana - 212 🌹 
🌻. లక్ష్మీ స్థాపనము. - 2 / Mode of installation of the image of Goddess Lakṣmī - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 077 / DAILY WISDOM - 077 🌹 
🌻 17. విశ్వం అనే 'నేను' / 17. The Cosmic “I-am”🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 342 🌹
6) 🌹. శివ సూత్రములు - 79 / Siva Sutras - 79 🌹 
🌻 2-02. ప్రయత్నః సాధకః - 1 / 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 04, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. నరసింహ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Narasimha Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : నరసింహ జయంతి, Narasimha Jayanti 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 4 🍀*

*7. శ్రీరామమంత్రవిఖ్యాతో రామమంత్రాబ్ధిపారగః |
రామభక్తో రామసఖా రామవాన్ రామహర్షణః
8. అనసూయాత్మజో దేవదత్త శ్చాత్రేయనామకః |
సురూపః సుమతిః ప్రాజ్ఞః శ్రీదో వైకుంఠవల్లభః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జగన్మాత ప్రేమ ప్రసారం - దైవానికి నిన్ను నీవు నిశ్శేషంగా ఇచ్చుకోడం నేర్చితే దైవం కూడా నీకు తనను తాను నిరర్గళంగా ఇచ్చుకోడం జరుగుతుంది. ఇది నీ అంతరంగంలో అనుభవానికి రాగల విషయం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 23:45:00
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: చిత్ర 21:36:19
వరకు తదుపరి స్వాతి
యోగం: వజ్ర 10:36:18 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: గార 11:48:20 వరకు
వర్జ్యం: 05:10:40 - 06:49:12
మరియు 27:12:56 - 28:49:12
దుర్ముహూర్తం: 10:04:56 - 10:56:09
మరియు 15:12:15 - 16:03:28
రాహు కాలం: 13:49:01 - 15:25:03
గుళిక కాలం: 09:00:55 - 10:36:57
యమ గండం: 05:48:51 - 07:24:53
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 15:01:52 - 16:40:24
సూర్యోదయం: 05:48:51
సూర్యాస్తమయం: 18:37:06
చంద్రోదయం: 17:28:24
చంద్రాస్తమయం: 04:41:45
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు : చర యోగం - దుర్వార్త
శ్రవణం 21:36:19 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴*

*27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |*
*యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||*

🌷. తాత్పర్యం :
*ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.*

🌷. భాష్యము : 
*ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.*

*ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 365 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴*

*27. yat karoṣi yad aśnāsi yaj juhoṣi dadāsi yat*
*yat tapasyasi kaunteya tat kuruṣva mad-arpaṇam*

🌷 Translation : 
*Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.*

🌹 Purport :
*Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.*

*Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 212 / Agni Maha Purana - 212 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 62*

*🌻. లక్ష్మీ స్థాపనము. - 2 🌻*

*పిమ్మట "అర్ద్రాం పుష్కరిణీమ్‌" ఇద్యాదిమంత్రముతో గంధ మర్పించి, "అర్ద్రాం యః కరిణీమ్‌ ఇత్యాదిమంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. పిమ్మట "తాం మ ఆవహా జాతవేదః" ఇత్యాదిమంత్రముతోను, "ఆనన్దః" ఇత్యాదిశ్లోకములతోను మిగిలన ఉపచారములన్నియు సమర్పింపవలెను. 'శ్రాయన్తీ' ఇత్యాదిమంత్రము చదువుచు శయ్యపై పరుండపెట్టవలెను. శ్రీసూక్తము పఠించుచు సంనిధీకరణము చేసి, లక్ష్మీబీజముతో (శ్రీం) చిచ్ఛక్తి విన్యాసము చేసి మరల పూజింపవలెను. పిదప శ్రీసూక్తముతో మండపముపైనున్న కుండములలో కమలముతో గాని, కరవీరపుష్పములతో గాని వెయ్యి లేదా వంద హోమములు చేయవలెను. గృహోపకరణాది సమస్తపూజాసామగ్రి మొదటి నుండియు శ్రీసూక్తమంత్రములతోడనే సమర్పింపవలెను. వెనుకటి వలె ప్రాసాదమునకు సంస్కారము చేసి, లక్ష్మికి పిండికానిర్మాణము చేయవలెను. పిమ్మట పిండికపై లక్ష్మిని ప్రతిష్ఠచేసి, శ్రీసూక్తముతో సంనిధీకరణము చేయుచు వెనుకటి వలె శ్రీసూక్తమునందలి ఒక్కొక్క ఋక్కును జపించవలెను. మూలమంత్రముచే చిచ్ఛక్తిని జాగృత మొనర్చి మరల సంనిధీకరణము చేయవలెను. పిమ్మట ఆచార్యునకు, బ్రహ్మకు, ఇతరఋత్విక్కులకు, బ్రహ్మణులకు భూ-సువర్ణ-వస్త్ర-గోదానాదులు చేయవలెను. ఈ విధముగ అందరి దేవులను స్థాపించినవాడు-రాజ్య-స్వర్గాదులను పొందును.*

*శ్రీ అగ్నిపురాణమునందు లక్ష్మీస్థాపన మను ఆరువదిరెండవ అధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 212 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 62*
*🌻Mode of installation of the image of Goddess Lakṣmī - 2 🌻*

8. (The priest should worship the image) with perfumes accompanied by ārdrām puṣkariṇīm[13], with flowers accompanied by tāṃ ma āvaha[14] and ya ānanda.[15]

9. The goddess should be worshipped in the bed with (the mantra) śāyantī[16] yena and her presence is accomplished by śrīsūkta[17]. Her consciousness is invoked and worshipped again with. the principal mantra of the goddess.

10. Thousand or hundred lotus flowers or karavīra flowers. should be offered in the fire pit at the shed accompanied by śrīsūkta.[17]

11. Household furniture should be offered with the śrīsūkta[17] itself. Then the consecration of edifice should be performed as described earlier.

12. The pedestal should be made with (the recitation of) the mantra. The installation of the goddess is done subsequently. Her presence is accomplished with the śrīsūkta.[17] Everyone of the hymns (stated earlier)) should be recited as before.

13. Having invoked consciousness in the image, her presence is accomplished by the principal mantra. The priest and the brahmins should be presented with land, gold, clothes, cow and food. The images of all other forms of goddesses should be installed in the same way. One who invokes (and consecrates) in this way is held as going to heaven.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 77 / DAILY WISDOM - 77 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 17. విశ్వం అనే 'నేను' 🌻*

*మనం వేదాంతంలో పిలిచే, విశ్వమనస్సు లేదా హిరణ్యగర్భం అనేది విశ్వ స్వీయ అస్తిత్వం. ఇది విశ్వం యొక్క స్వీయచైతన్యం. విశ్వం యొక్క పరిపూర్ణ, స్వచ్ఛమైన అస్తిత్వం. అన్ని విధాలైన వైవిధ్యాలు ఇక్కడ నుంచే పుడతాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం ఈ విశ్వ మనస్సులో భాగాలు అని చెప్పవచ్చు, కానీ అది పూర్తిగా నిజం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనల్ని మనం పరమాత్మలో భాగాలుగా పరిగణించలేము. మనం మన కళ్లతో చూసే ఏదీ పరమాత్మకు నిజమైన ప్రాతినిధ్యంగా పరిగణించబడదు. కాబట్టి, మనం హిరణ్యగర్భంలో కూడా భాగాలు కాదని అర్థం చేసుకోవాలి. మనం దానికంటే చాలా తక్కువ.*

*మనం హిరణ్యగర్భం మరియు విరాట్ స్థితుల కంటే చాలా దిగువన ఉన్నాము. దాని కారణాలు వల్ల మనం త్వరలో చూద్దాం. ప్రస్తుతానికి ఈ శ్లోకం అసలు అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. సాంఖ్యం ప్రకృతి అని, వేదాంతులు మాయ లేదా మూల ప్రకృతి అని పిలిచే ఈ వాస్తవికత యొక్క ఒక పూర్తి విధ్వంసం మరియు మృత్యువు జరిగింది. అది మహత్ మరియు విశ్వ అహంకారం అని పిలువబడే విశ్వ మనస్సు యొక్క అభివ్యక్తికి బీజం అవుతుంది. వేదాంతము దానిని హిరణ్యగర్భం మరియు విరాట్ అని పిలుస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 77 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 17. The Cosmic “I-am” 🌻*

*The Cosmic Mind, Hiranyagarbha, as we call it in the Vedanta, is the Cosmic “I-Am”. It is Self-Consciousness, Pure Universality. And, here is the seed of all diversity. In a sense, we may say that we are parts of this Cosmic Mind, but not, indeed, correctly. As I pointed out, we cannot regard ourselves as parts of the Absolute. Nothing that we see with our eyes can be regarded as a real representation of the Absolute. Thus, we have to understand that we are not parts, even of the Hiranyagarbha. We are much less than that.*

*We are far down below the condition of Hiranyagarbha and Virat, for reasons we shall see shortly. For the time being, it is enough if we understand the actual meaning of this passage. There was a destruction, a Mrityu, a complete abolition of Reality, which is what the Samkhya calls Prakriti, and the Vedantins call Maya, Mula-Prakriti, etc., the Potential Being, the Matrix of the universe. That becomes the seed for the manifestation of the Cosmic Mind, known as Mahat and Cosmic Ahamkara. The Vedanta calls them Hiranyagarbha and Virat.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 342 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. శరీరానికి పరిమితి వుంది అందుకే మరణ భయం. అందుకనే భయం, ఆందోళన, ఆగ్రహం. మనల్ని చుట్టు ముట్టిన శరీరం నించీ మనసు నించీ మనం క్రమక్రమంగా వేరు కావాలి. ప్రతి ఒక్కడూ ఆ పని చేయడానికి సమర్థుడు. 🍀*

*శరీరానికి పరిమితులున్నాయి. అది జీవన్మరణాలకు మధ్యలో వుంది. మనసుకయినా అంతే. మనసు శరీరం నించీ వేరు కాదు. అది దాని లోపలి కోణం. శరీరానికి లోపల మనసు వుంది. మనసుకు బయట శరీరముంది. భాష ఈ రెండు వేరు వేరనే తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తుంది. శరీరం, మనసు అంటుంది. నిజానికి శరీర మనసు అనాలి. అది ఒకే పదం, ఒకే వాస్తవం. నాణేనికి రెండు వైపు లేట్లాగో అట్లాగా మనసుకు పరిమితి వుంది. శరీరానికి పరిమితి వుంది అందుకే మరణ భయం. శరీరం భయపడదు, కారణం అది అచేతనం. కానీ మనను భయపడుతుంది. వణుకుతుంది.*

*భయమేమిటంటే ఈ రోజో రేపో ఫులుస్టాఫ్ వస్తుంది. సమస్య ఏమిటంటే మనమింకా ఏమీ సాధించలేదు. కానీ జీవితం ముగిసిపోతోంది. ప్రతిక్షణ క్షణం మరణం సమీపాన్ని కొస్తోంది. జీవితం చేజారిపోతోంది. అందుకనే భయం, ఆందోళన, ఆగ్రహం. మనల్ని చుట్టు ముట్టిన శరీరం నించీ మనసు నించీ మనం క్రమక్రమంగా వేరు కావాలి. అది వీలవుతుంది. ఆ పని చేయాలి. ప్రతి ఒక్కడూ ఆ పని చేయడానికి సమర్థుడు. అది అసాధ్యం కాదు. కష్టమయిందే కానీ అసాధ్యం కాదు. అది కష్టమయింది కావడం మంచిదే. అది మనకు సవాలు నిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 079 / Siva Sutras - 079 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-02. ప్రయత్నః సాధకః - 1 🌻*
*🌴. నిరంతర ధ్యాన పూర్వక ప్రయత్నంతో, యోగి తన చైతన్యంలో మరియు మంత్రాలలో దాగి ఉన్న శక్తులకు ప్రభువుగా మారి, భగవంతుని చైతన్యాన్ని పొందుతాడు. 🌴*

*ప్రయత్నః – నిరంతర ప్రయత్నం; సాధకః - సాక్షాత్కార ప్రయోజనం కోసం స్వీకరించ బడిన సాధన.*

*మంత్రం మరియు దాని దేవతతో అతని ఆలోచనా విధానాన్ని సమలేఖనం చేయడానికి నిరంతర ప్రయత్నం మరియు అంకితమైన అభ్యాసం అవసరం. ఒకరు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నప్పుడు, అతను తన ఆలోచన విధానాన్ని దేవత యొక్క మంత్రంతో సమలేఖనం చేయాలి. ఈ సంబంధం స్థాపించబడక పోతే, అభ్యాసకుడికి సమర్థవంతమైన ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. పరమ సత్యమైన శివుడిని గ్రహించడానికి ఒకరి చైతన్యం లేదా అవగాహన యొక్క ప్రాముఖ్యతను శివ సూత్రాలు పదేపదే నొక్కిచెప్పాయి. మునుపటి సూత్రం ఇక్కడ మరింత విస్తరించబడింది. మునుపటి సూత్రంలో ప్రవాస మంత్రం తర్వాత, ఈ సూత్రం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 079 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 🌻*
*🌴. By Persistent meditative effort, Yogi becomes the master of the forces latent in his consciousness and mantras and attains God consciousness. 🌴*

*Prayatna – continued effort; sādhaka – adapted for the purpose of realization.*

*Persistent effort and dedicated practice is necessary to align his thought process with mantra and its deity. When one desires to advance spiritually, he has to align his thought process with the mantra of the deity. If this union is not established, there cannot be an effective spiritual progression of the practitioner. Śiva Sūtra-s have repeatedly emphasized the importance of one’s consciousness or awareness to realize Śiva, the Ultimate Reality. The previous sūtra is further expanded here. After having expatiated mantra in the previous sūtra, this sūtra provides practical guidance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 452 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 452 -3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 452 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 452 -3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 452. ‘లోలాక్షీ’ - 3 🌻


ఇట్లు సృష్టి లోలత్వము నుండి పరలోకము వరకు అన్ని శ్రేణులయందు జీవులు వసించుచు, వున్న శ్రేణి నుండి పై శ్రేణికి కృషి సలుపుచుందురు. లోలాక్షము ద్వారా అట్టి గమ్యములను చేరుచుందురు. జీవులు వారి దృష్టి ననుసరించి పురోగమించుటయో, తిరోగమించుటయో చేయుదురు. స్వభావమును బట్టి దృష్టి యుండును. స్వభావమును సంస్కరించుకొనుచు ఉత్తమమగు దృష్టి సారించి ఊర్ధ్వలోకములను చేరుట మానవుల కర్తవ్యము. ఇట్లు క్రమముగ లోకానుభవమును పొందుచు పరమునకు సాగుటలో క్రమముక్తి, పూర్ణానుభవము యేర్పడును. ఇట్లు లోలాక్షి జీవుల ఉద్ధారణకు జీవుల వెలుపల, లోపల కూడ కృషి సలుపుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 452 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 452. 'Lolakshi' - 3 🌻


Like this in creation, living beings live in all levels, from the lowest level to the heavens, and work from the existing level to the higher level. By means of desire, such destinations are reached. Living beings progress or regress according to their vision. Vision depends on their nature. It is the duty of human beings to reform their nature and reach the higher worlds with a focus on the divine. In this way, attaining the worldly experience gradually, progressing to the divine will lead to liberation and Absolute experience. For the upliftment of these living beings, efforts are being made both outside and within the living beings by Lolakshi.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 344. PATIENCE / ఓషో రోజువారీ ధ్యానాలు - 344. సహనం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 344 / Osho Daily Meditations - 344 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 344. సహనం 🍀

🕉. ప్రేమయే సహనం, మరియు మిగతావన్నీ అసహనం. అభిరుచి అసహనం, ప్రేమ సహనం. ఓపికగా ఉండటమంటే ప్రేమగా ఉండటమని, ఓపికగా ఉండటమంటే ప్రార్థనలో ఉండటమని ఒకసారి అర్థం చేసుకుంటే, అంతా అర్థమవుతుంది. ఎలా వేచి ఉండాలో నేర్చుకోవాలి. 🕉


చేయలేని కొన్ని పనులు ఉన్నాయి; అవి జరుగుతాయి మాత్రమే. చేయగలిగేవి ఉన్నాయి, కానీ అవి ప్రపంచానికి చెందినవి. చేయలేని పనులు దేవునికి చెందినవి లేదా ఇతర ప్రపంచానికి చెందినవి, లేదా మీరు దానిని ఎలా పేరు పెట్టారో. కానీ చేయలేని పనులు - ఇవి మాత్రమే నిజమైన విషయాలు. అవి ఎల్లప్పుడూ మీకు జరుగుతాయి; మీరు స్వీకరించే ముగింపు అవుతారు-అదే లొంగుబాటు యొక్క అర్థం.

స్వీకరించే ముగింపుగా మారండి ... ఓపికగా ఉండండి మరియు వేచి ఉండండి. లోతైన ప్రేమతో, ప్రార్థనతో, కృతజ్ఞతతో వేచి ఉండండి - ఇప్పటికే జరిగిన దానికి కృతజ్ఞతతో మరియు జరగబోయే దాని కోసం ఓపికగా ఉండండి. సాధారణంగా, మానవ మనస్సు దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎప్పుడూ జరగని దాని కోసం గుసగుసలాడుతూ ఉంటుంది, అది జరగడం పట్ల ఎప్పుడూ అసహనంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తుంది, ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండదు. ఇది ఎల్లప్పుడూ కోరుకునేది మరియు స్వీకరించే సామర్థ్యాన్ని ఎప్పుడూ సృష్టించదు. స్వీకరించే సామర్థ్యం మీకు లేకుంటే కోరిక వ్యర్థం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 344 🌹

📚. Prasad Bharadwaj

🍀 344. PATIENCE 🍀

🕉. Love is patient, and everything else is impatient. Passion is impatient, love is patient. And once you understand that to be patient is to be loving, and to be patient is to be in prayer, then everything is understood. One has to learn how to wait. 🕉


There are some things that cannot be done; they only happen. There are things that can be done, but those things belong to the world. Things that cannot be done belong to God or belong to the other world, or however you name it. But things that cannot be done--only these are the real things. They always happen to you; you become the receiving end-and that is the meaning of surrender.

Become a receiving end ... be patient and just wait. Wait with deep love, prayerfu1lness, gratitude--gratitude for that which has already happened, and patience for that which is going to happen. Ordinarily the human mind does just the opposite. It is always grumbling for that which has not happened, and it is always too impatient for it to happen. It is always complaining, never grateful. It is always desiring, and never creating the capacity to receive. A desire is futile if you don't have the capacity to receive.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 725 / Sri Siva Maha Purana - 725


🌹 . శ్రీ శివ మహా పురాణము - 725 / Sri Siva Maha Purana - 725 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴

🌻. శివుని యాత్ర - 2 🌻


అపుడు భగవాన్‌ బ్రహ్మ చేతి యందు కొరడాను బట్టి గుర్రముల నదలించి శివుని మాటచే ఆ శ్రేష్ఠరథమును నిలబెట్టెను (10). అపుడు బ్రహ్మ శ్రేష్ఠమగు ఆ రథమునందు కూర్చున్నవాడై మనో వేగ వాయు వేగములు గల, వేదరూపములైన, ఆ రథమునకు పూర్చబడి యున్న గుర్రములను తోలెను (11). మహావీరులగు ఆ రాక్షసుల యొక్క, ఆకసము నందుండే మూడు నగరములను లక్ష్యముగా చుసుకొని బ్రహ్మ మహేశ్వరునిచే అధష్ఠింపబడిన ఆ రథమును నడుపును (12). అపుడు మంగళకరుడగు రుద్ర భగవానుడు దేవతల వైపు చూచి 'నాకు పశుపతిత్వమును కల్పించినచో, నేను రాక్షసులను సంహరించెదను' అని పలికెను (13).

ఓ దేవశ్రేష్ఠులారా ! దేవతలకు మరియు ఇతర జీవులకు వేర్వేరుగా పశుత్వమును కల్పించినచో, ఆ రాక్షసులు సంహరింపబడెదరు. అట్లు గానిచో, ఆ రాక్షసవీరుల సంహరింపబడరు (14).


సనత్కుమారుడిట్లు పలికెను -

ధీమంతుడు, దేవదేవుడునగు శివుని ఆ మాటను విని అందరు పశుభావమును గూర్చి శంక గలవారై దుఃఖమును పొందిరి (15). దేవదేవుడు, పార్వతీపతి యగు శంభుడు ఆ దేవతల మనోగతము నెరింగి నవ్వి వారిని ఉద్దేశించి దయతో నిట్లనెను (16).


శంభుడు ఇట్లు పలికెను -

ఓ దేవశ్రేష్ఠులారా ! మీరు పశుభావమును పొందిననూ పతనమును పొందరు. పశుభావము నుండి విముక్తిని పొందే ఉపాయమును గురించి విని, ఆ విధముగా ఆచరించుడు (17). ఎవడైతే దివ్యమగు పాశుపత వ్రతమునాచరించునో, ఆతడు పశుత్వము నుండి విముక్తిని పొదగలడు. ఇది సత్యము. నేను ప్రతిజ్ఞను చుయుచున్నాను. గమనించుడు (18). ఓ దేవశ్రేష్ఠులారా ! మీరే గాక ఇతరులైననూ నా ఈ పాశుపతవ్రతము నాచరించినచో పశుత్వము నుండి విముక్తులగుదురనుటలో సందియము లేదు (19). ఎవడైతే జీవితకాలమంతయూ, లేదా పన్నెండు సంవత్సరములు, లేక ఆరు సంవత్సరములు, లేక మూడు సంవత్సరములు శుశ్రూషను చేయునో, వానికి పశుత్వము నుండి ముక్తి కలుగును (20). ఓ దేవ శ్రేష్ఠులారా ! కావున ఈ శ్రేష్ఠమగు దివ్యవ్రతము నాచరింపుడు. మీకు నిస్సంశయముగా పశుత్వమునుండి విముక్తి కలుగును (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 725🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴

🌻 Śiva’s campaign - 2 🌻



Sanatkumāra said:—

10-12. But the lord touched the bridle and steadied the horses. Then Brahmā seated in the excellent chariot drove the excellent chariot with the velocity of mind and wind, at the bidding of the lord towards the three cities of the valiant Asuras. The cities were then in the sky. Lord Śiva was seated inside.

13. Then lord Śiva looked at the gods and said—“Give me the lordship of the animals. Then I shall kill the Asuras.

14. O excellent gods, the excellent Asuras can be killed only after assigning separate animalhood to the gods and others. Not otherwise.”


Sanatkumāra said:—

15. On hearing these words of the intelligent lord of the gods, they became dispirited growing suspicious of animalhood.

16. On knowing what was passing through their minds, Śiva, the lord of the gods, the consort of Pārvatī sympathised with the gods and laughingly said.


Śiva said:—

17. “O excellent gods, you will not fall even in your animalhood. Let it be heard, and let the process of release from animalhood be practised.

18. He who performs the divine rite of Pāśupata[1] will be released from animalhood. I promise this to you. Be attentive.

19. O excellent gods, there is no doubt about it that those who perform my Pāśupata rite will become liberated.

20. He who renders service perpetually or for twelve years, becomes relieved of animalhood.

21. Hence O excellent gods, perform this divine rite. You will be released from animalhood. There is no doubt about this.”


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 764 / Vishnu Sahasranama Contemplation - 764


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 764 / Vishnu Sahasranama Contemplation - 764🌹

🌻764. గదాగ్రజః, गदाग्रजः, Gadāgrajaḥ🌻

ఓం గదాగ్రజాయ నమః | ॐ गदाग्रजाय नमः | OM Gadāgrajāya namaḥ


మన్త్రేణ నిగదేనాగ్రే జాయతే యో జనార్దనః ।
నిశబ్దలోపఙ్కృత్వా స గదాగ్రజః ఇతీర్యతే ॥

శ్రీ వాసుదేవావరజో గదో నామమహాయశాః ।
తస్మా దగ్రే జాయత ఇత్యపి విష్ణుస్తథోచ్యతే ॥

(ని)గదేన అగ్రే జాయతే అనగా నిగదము

మంత్ర రూపమున ముందుగానే జనియించినవాడు. నిత్య తత్త్వమగు శబ్ద బ్రహ్మము అందరికంటెను ముందే జనించి స్వతః సిద్ధమై యుండును కదా! ఇందు 'నిగద' శబ్దమునందలి 'ని' అను నిపాతము లోపింపజేయబడునపుడు నిగదము అను అర్థమున 'గద' శబ్దమే ఇచ్చట ఉచ్చరించబడినది.

లేదా శ్రీకృష్ణావతారమున తన తమ్ముడగు గదుని కంటె ముందే జనించినవాడు.గదుడు వసుదేవ రోహిణులకు శ్రీ కృష్ణిని తరువాత జన్మించినవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 764🌹

🌻764. Gadāgrajaḥ🌻

OM Gadāgrajāya namaḥ

मन्त्रेण निगदेनाग्रे जायते यो जनार्दनः ।
निशब्दलोपङ्कृत्वा स गदाग्रजः इतीर्यते ॥

श्री वासुदेवावरजो गदो नाममहायशाः ।
तस्मा दग्रे जायत इत्यपि विष्णुस्तथोच्यते ॥


Mantreṇa nigadenāgre jāyate yo janārdanaḥ,
Niśabdalopaṅkr‌tvā sa gadāgrajaḥ itīryate.

Śrī vāsudevāvarajo gado nāmamahāyaśāḥ,
Tasmā dagre jāyata ityapi viṣṇustathocyate.


(नि)गदेन अग्रे जायते / (ni)gadena agre jāyate

In the form of nigada i.e., mantra He is born before everything. As śabda brahma, He originated before anything. The letter ni in nigadāgraja is dropped and it becomes Gadāgrajaḥ instead of Nigadāgrajaḥ.

Or since the name of Lord Kr‌ṣna's younger brother born of Vasudeva from Rohiṇi, is Gada, He is called Gadāgrajaḥ i.e., the elder born to Gada.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr‌ṣo dyutidharassarvaśastrabhr‌tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr‌ṅgo gadāgrajaḥ ॥ 81 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 172 / Kapila Gita - 172


🌹. కపిల గీత - 172 / Kapila Gita - 172 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 26 🌴

26. వక్షోఽధివాసమృషభస్య మహావిభూతేః పుంసాం మనోనయన నిర్వృతిమాదధాన్|
కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోకనమస్కృతస్య॥


తాత్పర్యము : అనంతరము ఆ పురుషోత్తముని యొక్క వక్షస్థలమును ధ్యానింపవలెను. అది సకలలోక సంపదలకు కాణాచియైన లక్ష్మీదేవికి నివాసస్థానము. అది తనలో కొత్తరకమైన వైభవముచే సకల మానవాళియొక్క మనస్సులను, నేత్రములను పరవశింపజేయునట్టి తేజోనిధానము. అఖిలలోకములకు వంద్యుడైన ఆ పురుషోత్తముని కంఠదేశమును ధ్యానింపవలెను. ఆ స్వామి ధరించిన కౌస్తుభమణి కాంతులకు వన్నెచిన్నెలు దిద్దునట్టిది అతని కంఠము కనుక ఆ దేవదేవుని వక్షస్థలమును, అద్భుత కంఠప్రదేశమును హృదయముస నిల్పుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానింపవలెను.

వ్యాఖ్య : భగవంతుని యొక్క వివిధ శక్తులు సృష్టించడానికి, నాశనం చేయడానికి మరియు నిర్వహించడానికి పని చేస్తున్నాయని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఈ అనూహ్యమైన శక్తి రకాలు భగవంతుని వక్షస్థలంలో నిల్వ చేయబడతాయి. ప్రజలు సాధారణంగా చెప్పినట్లు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ పరాక్రమాన్ని భగవంతుని అతీంద్రియ స్వరూపం యొక్క వక్షస్థలం మీద ఉన్న అన్ని శక్తులకు మహా-లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుంది. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై సంపూర్ణంగా ధ్యానం చేయగల యోగి అనేక భౌతిక శక్తులను పొందగలడు, ఇది యోగ వ్యవస్థలోని ఎనిమిది పరిపూర్ణతలను కలిగి ఉంటుంది.

భగవంతుని మెడ అందం కౌస్తుభ రత్నం యొక్క అందాన్ని పెంచుతుందని ఇక్కడ పేర్కొనబడింది. కాబట్టి యోగి భగవంతుని మెడపై ధ్యానం చేయాలని సిఫార్సు చేయబడింది. భగవంతుని అతీంద్రియ స్వరూపాన్ని మనస్సులో ధ్యానించవచ్చు లేదా ప్రతిమ రూపంలో ఆలయంలో ఉంచవచ్చు మరియు ప్రతి ఒక్కరూ దానిని ఆలోచించే విధంగా అలంకరించవచ్చు. ఆలయ ఆరాధన, కాబట్టి, భగవంతుని రూపాన్ని ధ్యానించ గలిగేంత అభివృద్ధి చెందని వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. నిరంతరం ఆలయాన్ని సందర్శించడం మరియు భగవంతుని అతీంద్రియ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం మధ్య తేడా లేదు; అవి సమాన విలువను కలిగి ఉంటాయి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 172 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 26 🌴

26. vakṣo 'dhivāsam ṛṣabhasya mahā-vibhūteḥ puṁsāṁ mano-nayana-nirvṛtim ādadhānam
kaṇṭhaṁ ca kaustubha-maṇer adhibhūṣaṇārthaṁ kuryān manasy akhila-loka-namaskṛtasya


MEANING : The yogī should then meditate on the chest of the Supreme Personality of Godhead, the abode of goddess Mahā-Lakṣmī. The Lord's chest is the source of all transcendental pleasure for the mind and full satisfaction for the eyes. The yogī should then imprint on his mind the neck of the Personality of Godhead, who is adored by the entire universe. The neck of the Lord serves to enhance the beauty of the Kaustubha gem, which hangs on His chest.

PURPORT : In the Upaniṣads it is said that the various energies of the Lord are working to create, destroy and maintain. These inconceivable varieties of energy are stored in the bosom of the Lord. As people generally say, God is all-powerful. That prowess is represented by Mahā-Lakṣmī, the reservoir of all energies, who is situated on the bosom of the transcendental form of the Lord. The yogī who can meditate perfectly on that spot on the transcendental form of the Lord can derive many material powers, which comprise the eight perfections of the yoga system.

It is stated herein that the beauty of the neck of the Lord enhances the beauty of the Kaustubha gem rather than vice versa. The gem itself becomes more beautiful because it is situated on the neck of the Lord. A yogī is therefore recommended to meditate upon the Lord's neck. The Lord's transcendental form can either be meditated upon in the mind or placed in a temple in the form of a statue and decorated in such a way that everyone can contemplate it. Temple worship, therefore, is meant for persons who are not so advanced that they can meditate upon the form of the Lord. There is no difference between constantly visiting the temple and directly seeing the transcendental form of the Lord; they are of equal value.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, మే, May 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 21 🍀

21. విశ్వాత్మికా బ్రహ్మమయీ హి బుద్ధిః
తస్యా విమోహప్రదికా చ సిద్ధిః |

తాభ్యాం సదా ఖేలతి యోగనాథః
తం సిద్ధిబుద్ధీశమథో నమామి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : నిక్కమైన దైవభక్తి

నిక్కమైన దైవభక్తి ఆత్మార్పణ పూర్వకమైనది. ఏ కోర్కెలనూ అది కోరదు. ఏ హక్కులనూ ప్రకటించు కొనదు, ఏ షరతులనూ విధించదు, ఏ బేరాలనూ ఆడదు, ఏ విపరీతోద్వేగాలకూ లోనుగాదు, గర్వానికి, క్రోధానికి తావీయదు. ఇవన్నియూ దాని తత్త్వానికి కేవలం విరుద్ధములు. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: శుక్ల త్రయోదశి 23:51:35

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: హస్త 20:57:24 వరకు

తదుపరి చిత్ర

యోగం: హర్షణ 11:27:05 వరకు

తదుపరి వజ్ర

కరణం: కౌలవ 11:35:35 వరకు

వర్జ్యం: 04:32:54 - 06:13:50

మరియు 29:10:00 - 30:48:36

దుర్ముహూర్తం: 11:47:30 - 12:38:39

రాహు కాలం: 12:13:04 - 13:49:00

గుళిక కాలం: 10:37:09 - 12:13:04

యమ గండం: 07:25:17 - 09:01:13

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38

అమృత కాలం: 14:38:30 - 16:19:26

సూర్యోదయం: 05:49:21

సూర్యాస్తమయం: 18:36:47

చంద్రోదయం: 16:36:17

చంద్రాస్తమయం: 04:06:47

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు : ఆనంద యోగం - కార్య

సిధ్ధి 20:57:24 వరకు తదుపరి

కాలదండ యోగం - మృత్యు భయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹