మనోశక్తి - Mind Power

Image may contain: 1 person, close-up
 
🌹. మనోశక్తి  - Mind Power - 1 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

Q1:- మైండ్ (mind) లేదా మనోశక్తి (mind power)కి మెదడు (brain) కి మధ్య తేడాలేంటి ? ఇవి నిర్వహించే పనులు ఏంటి? 

A. 1) brain (మెదడు) అనేది దేహంలో ఒక అవయవం.
గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్నమెదడు, పెద్దమెదడు, మెడుల్లాఅబ్లాంగేట, ఎడమ మెదడు, కుడి మెదడు, అని అనేక పేర్లు పెట్టారు.

2) మైండ్ లేదా మనోశక్తి ఆత్మశక్తికి అంతర్ ప్రపంచానికి సంబంధించింది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు. శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు.

3) మెదడు దేహంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది, మరియు దేహంలోని నాడులన్నింటికి అనుసంధానింపబడి ఉంటుంది.

4) మైండ్ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణవ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలను నడిపించడానికి మైండ్ మెదడు అనే సాధనాన్ని ఉపయోగించుకుంటుంది.

5) ఆలోచనా తరంగాలు (thought waves) మైండ్ లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ ని కణవిభజన చేయగలడు కాని , ఆ మెదడులోకి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం చెప్పలేడు.

6) దేహం ఏర్పడక ముందే ఆత్మ మరియు మైండ్ రెండు ఉన్నాయి. దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ మరియు మైండ్ రెండూ ఉంటాయి.

7) మైండ్ యొక్క ఊహాశక్తి నుండి జనించిందే ఈ దేహం, ఈ దేహం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మపరంపరలుగా, మనతోనే ఉంది.జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని, అనుభవాల్ని, చైతన్యశక్తిని, మైండ్ మోసుకొస్తూ ఉంది.

8) గత కోటానుకోట్ల జన్మల తాలూకూ జ్ఞానాన్ని కూడా మైండ్ లో నిక్షిప్తం అయి ఉంది. మరణించిన తర్వాత దేహాన్ని వదిలేస్తాము. కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి సంస్కారాలు, అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అవి తర్వాత కూడా continue అవుతాయి.

9) ప్రతి జన్మకు మైండ్ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మపరంపర పరిసమాప్తి అయిన తర్వాత ఆత్మ మరో లోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాల్ని, పొందుతూ వ్యాకోచం చెందుతుంది.

10) ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలెక్ట్రాన్, ప్రతీది చైతన్యశక్తి మరియు మైండ్ ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి.

11)మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే భూమికి, భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మైండ్ ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మైండ్ ఉంటాయి.

12) సీతాకోకచిలుక, సాలెపురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటున్నాయి. పక్షులు వేల మైళ్ళు వెళ్లి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు జీవజాతులన్ని, ప్రకృతి వైపరిత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారానే సాధ్యం.

13) సంకల్పం, ఊహాశక్తి, ఇంటలిజెన్స్, తర్కం, విశ్లేషణ, స్వప్నాలు, ఆలోచనాశక్తి, clairvoyance, telepathy, సహజావబోధన, జ్ఞాపకశక్తి, ఈ ప్రక్రియలన్ని మైండ్ ద్వారానే జరుగుతున్నాయి.

14) మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అనేవి మైండ్ కి సంబంధించినవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం, లాంటివన్ని మైండ్ నుండి పడుతున్నాయి.

జీవరాసులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రం లో మనిషి ఒకానొక అల మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/May/2020

------------------------------------ x ------------------------------------

No photo description available.
🌹. మనోశక్తి  - Mind Power - 2 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనము : శ్రీ వైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

Q 2 :-- దేహం ఎలా ఏర్పడింది?

A:-- భూమి అనే దేహాన్ని ఒకానొక ఆత్మ సృష్టించుకుంది, సూర్యుడు అనే దేహాన్ని ఇంకొక ఆత్మ సృష్టించుకుంది. మన subconscious మైండ్ ద్వారానే మనం మన దేహాన్ని సృష్టించుకున్నాం, subconscious మైండ్ వల్లనే పదార్ధం సృష్టించబడింది, ప్రభావితం చేయబడుతుంది.

మన దేహం అందంగాగాని, వికారంగగాని, ఆరోగ్యం గా గాని, అనారోగ్యంగాగాని, చురుగ్గాగాని, నెమ్మదిగాగానీ,  ఉందని judgement చేస్తాం. 

కానీ అది మన మనోశక్తి నుండి వచ్చిన ఆలోచనలుకి అనుగుణంగా మనం జన్మ తీసుకోక మునుపే తల్లిదండ్రులు ను ఎంచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే దేహాన్ని సృష్టించుకోవడం జరిగింది.

🌻. మన ఆలోచన,భావోద్వేగాల ద్వారానే మన దేహం యొక్క సృష్టి జరిగింది. 🌻
          
మన మనోశక్తి ద్వారా ఏది ఊహించుకుంటామో దానికనుగుణంగా పరమాణువులు, అణువులు, సముదాయంతో దేహ నిర్మాణం జరుగుతుంది. మన మనోశక్తి నుండి ఊహాశక్తి యొక్క image దేహంగా రూపుదిద్దుకుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 3 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

Q 3:-- భౌతిక పదార్ధం ఎలా సృష్టించ బడుతుంది?

A:-- మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు ఎంత సాంద్రత తో, ఎంత తీవ్రతతో, ఉన్నాయో దాన్ని బట్టి చైతన్యశక్తి భౌతిక పదార్ధంగా రూపాంతరం చెందుతుంది.

       మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు బలహీనమైతే దానికనుగుణంగా మిధ్యా భౌతిక రూపం (pseudo physical form) ఏర్పడుతుంది. ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రతలకు సరిపడే లోకంలో అక్కడ పరిస్థితులుకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది.

అంతేకాని మన మైండ్ నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు నశించిపోవడం గాని,మటుమాయమైపోవడం గాని జరుగదు.
       
మన ఆలోచనలు భౌతిక వాస్తవం పొందాలంటే మన మైండ్ లో,మన మనో ప్రపంచంలో, ఎంత గాఢంగా వాంచిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది.
       
మన ఆలోచనల తీవ్రత,ఫీలింగ్స్,ఎమోషన్స్, ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన నమ్మకపు వ్యవస్ధ ఎలా ఉంది, అనేది ముఖ్యమైంది.
        
మన మనోశక్తి ద్వారా మన దేహాన్ని సృష్టించుకున్నామన్నది ఎంత నిజమో,మన ఆలోచనలు వాస్తవ రూపం పొందుతాయన్నది కూడా అంతే నిజం.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 4 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

Q 4 :-- టెలిపతీ telepathy అంటే ఏమిటి?

A:-- మనం ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినపుడు, మన ఆలోచనా తరంగాలు ఆ వ్యక్తిని చేరుతాయి. అతని మనోశక్తి ఆ ఆలోచనా తరంగాలు ను పసిగట్టగలుగుతుంది. దీనినే టెలిపతి అంటారు.
       
Telepathy ద్వారా జంతువులతో, పక్షులతో, వృక్షాలు తో సముద్రంతో, భూమితో, అలా ఏ వస్తువుతో నైనా సంభాషించవచ్చు. ఈ విశ్వంలో ప్రతి ప్రాణితో telepathy ద్వారా సంభాషించగలం.

మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్,పదార్ధాన్ని దాని భౌతిక స్వరూపంతో కాకుండా, దాని చైతన్య శక్తి తో సంభాషించగలగడం.

పూర్వపు నాగరికతల్లో మానవజాతి జంతుజాతి, వృక్షజాతి, పక్షిజాతి, ఇలా అన్నిటితోను సంభాషించేవారు.
   
  మొక్కలతో సంభాషించి ఎన్నో ఔషధాలను మన ఋషులు మనకు అందించారు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 5 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి  🌷

Q 5 :-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయి?

A:-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు కాంతి వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తాయి.

ఆలోచనా తరంగాల వేగం లెక్కకట్టేంత పరిజ్ఞానం ఇంకా మన సైన్స్ కు లేదు.
మనం సంకల్పించిన వెంటనే మన ప్రతిరూపం (counter self) వేరే గాలక్సీ లోని వేరే లోకం లోకి అయిన అక్కడ ప్రత్యక్షీకరించబడుతుంది.

ఆలోచనాతరంగాలు విద్యుదాయస్కాంత శక్తిని కలిగివుండి చైతన్యశక్తితో (consciousness) తో ప్రయాణిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 6 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 6 :-- higher ఫ్రీక్వెన్సీ లో ఉన్న లోకాల వారు వారి ఆలోచనలను ఎలా ఉపయోగిస్తారు?

A:--1) higher energy,  higher frequency గల ఉన్నత లోకాలలో వారు telepathy కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు. అనగా మనం ఒకటి సంకల్పిస్తే ఆ ఆలోచన తరంగాలు ఆ ఎదుటివ్యక్తి యొక్క మనోశక్తి గ్రహించగలుగుతుంది. ఆ విధంగా సంభాషించుకుంటారు.

2) వారికి ఎంతో పారదర్శకత ఉంటుంది, ఒకరి మైండ్ లోని ఆలోచనలు మరొకరు సులభంగా పసిగట్టగలరు.
ఏది దాచిపెట్టలేరు.

3) వినాశకర ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు.

4) అక్కడి జీవజాతులు ఉన్నతమైన ఆలోచనలను వెలువరించడం ద్వారా ఉన్నత రీతిలో పరిణామం చెందుతున్నారు.

5) వారికి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు దాని పర్యవసానాలు బాగా తెలుసు.
కావున జీవజాతులు మధ్య పరస్పర సహకారం ఉంటుంది.

6) సంభావ్య ఆత్మలు అనగా మనం ఆలోచించిన ప్రతిసారి మన ద్వారా మనం ఒక అంశాత్మను సృష్టిస్తున్నాం అన్నమాట. మన ఆలోచన ద్వారా సృష్టించబడ్డ అంశాత్మ ఆ ఫ్రీక్వెన్సీ గల లోకంలో అనుభవాలను పొందుతూ చైతన్య వికాసం చెందుతుంటుంది.

7) ఉన్నత ఆత్మలు వారి సంభావ్య ఆత్మలతో telepathy ద్వారా ఆలోచనలు పంచుకుంటూ అభివృద్ధి చెందుతుంటారు.

8) చైతన్యశక్తి యొక్క డైనమిక్స్ తెలిసినప్పుడు ఆలోచనలను వినాశకర రీతిలో ఉపయోగించరు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 7 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. Q 7:-- conscious mind (చేతనాత్మక మనస్సు), subconscious mind (ఉపచేతనాత్మక మనస్సు) అంటే ఏమిటి ?

A:-- 1) conscious మైండ్ ఎరుకలో ఉంటుంది, ఉపచేతనాత్మక మనస్సు ఎరుకలో ఉండదు.

2) మన మైండ్ అనంతమైన పోరలను కలిగి ఉందని ఊహించుకుంటే, ఉపరితలంలో పైన ఉండే పొర conscious మైండ్ గా పిలవబడుతుంది. 

అంతరాంతరాలలో అపరిమితమైన పొరలను  ఉపచేతనాత్మక మనస్సు అని చెప్పవచ్చు. మైండ్ అంటే పొరలు అని కాదు, అర్థమవ్వడానికి అలా చెప్పడం జరిగింది.

3) మహాసముద్రమంత మైండ్ లో conscious మైండ్ ఒక అల. అలజడి మాత్రమే. conscious మైండ్ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి అంతర ప్రపంచానికి ఒక మార్గంగా పనిచేస్తుంది.

4) అంతర్ ప్రపంచం లేదా అంతర్ శక్తి లేదా subconscious మైండ్ ను మహాసముద్రం తో పోల్చవచ్చు.దీనిని సూపర్ conscious మైండ్ అని కూడా అనవచ్చు.వాస్తవానికి మైండ్ కి పేర్లు లేవు.

4) ఆత్మజ్ఞానం పెరిగేకొద్దీ subconscious మైండ్ open అవుతుంది.

5) జన్మపరంగా సంప్రాప్తించుకున్న జ్ఞానం అంతా subconscious మైండ్ లో store అవుతుంది.

6) conscious మైండ్ యొక్క ఉప ఉత్పత్తి గర్వం.ఇది బాహ్యప్రపంచం లో సంపాదించుకున్న జ్ఞానం వల్ల పుడుతుంది.అహం వల్ల మనస్సు విజృంభిస్తుంది.దీనివలన దుఃఖం పుడుతుంది.

7) conscious మైండ్ కి అంతర్వాణి మరియు విచక్షణ జ్ఞానం తోడైతే ఆ వ్యక్తులుకు positive thinking ఉంటుంది.

8) conscious మైండ్ ని తప్పుడు అభిప్రాయాల వల్ల, సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల బాహ్యప్రపంచపు పరిమిత జ్ఞానం వల్ల, మానసిక సోమరితనం వల్ల అసాధారణ రీతిలో ఉపయోగించు కోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 8 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 8 :-- conscious మైండ్ మనకున్న తప్పుడు అభిప్రాయాలతో మనల్ని పరిధుల్లో ఎలా ఉంచుతుంది?

A:-- 1) జీవితం దుఃఖమయం, గతజన్మ పాపం వల్ల దేహం తీసుకోవడం జరిగింది. నాకు మహిమాన్విత శక్తి లేదు. గతంలో చేసిన కర్మల వల్ల దుఃఖిస్తున్నాను.

 పరిస్థితులు ముందు నేను నిస్సహాయుడ్ని, వాటిని అదుపులో ఉంచలేను. నా వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండి వచ్చింది. దానిని నేను మార్చలేను.

2) అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, నేను గొప్పవాడ్ని. నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికి తెలియదు. నా తెగవాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వారందరు హీనమైనవారు.

3) వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు
అవుతుంది.

4) నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు.

5) దురదృష్టం ఎప్పుడు నన్ను వెంటాడుతూవుంటుంది. ధనం వల్ల వచ్చే లాభం ఏమి లేదు.ఆశాపూరితులే ధనార్జన చేస్తారు, ధన సంపాదన వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఆనందంగా జీవించలేరు.

6) పూర్వీకుల జీన్స్ ద్వారా నాకు అనారోగ్యం, ఊబకాయం వచ్చింది.ఏ పనిని సక్రమంగా చేయను,నా స్వభావమే అంత,నన్ను ఎవరు ఇష్టబడరు.

ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో మనం ఎన్నో పరిమితులతో conscious మైండ్ ని ఉపయోగించుకోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 9 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 9 :--వర్తమానంలో ఉండడం వల్ల లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించవచ్చు? మరియు భవిష్యత్తును ఎలా మలచుకోవచ్చు?

A:-- 1) వర్తమానమే బహుమానం. గతంలో ఏమైనా వర్తమానం మన చేతుల్లో ఉంది.

2) వర్తమానాన్ని చక్కపెడితే భవిష్యత్తు automatic గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తు లో ఏమి జరగాలో ముందే నిర్ణయించబడదు.

3) భవిష్యత్తు ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. for ex:--బంకమట్టిని తీసుకుందాం. దానిని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. అదేవిధంగా వర్తమానాన్ని సరిచేస్తే భవిష్యత్తు కూడా మారుతుంది.

4) chess game ని పరిశీలిద్దాం.
పావులను కదపడంలో కొన్ని తప్పులు చేసామనుకోండి, అలాగని ఆట గతం లో లేదు.  ఇప్పుడు మనం వర్తమానంలో ఆ పావులను సక్రమంగా కదుపుతున్నామో లేదా అనే దానిపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట automatic గా మారుతుంది.అప్పుడు భవిష్యత్తు యొక్క గెలుపు, ఓటములు కూడా automatic గా మారుతాయి.

అంటే ఇక్కడ ఏమయ్యింది, వర్తమానం గతాన్ని పునర్నిర్మించింది, భవిష్యత్తుని కూడా సృష్టించింది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించలేదు.

5) గతకాలంలో చేసిన తప్పులు, గతజన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరువెయ్యడం అర్థరహితం.

ఎందుకంటే మనం ఎన్నో జన్మలు దాటుకుని, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాము. దానిని వర్తమానంలో implement చేస్తే చాలు. గతం తుడిచి పెట్టుకుపోతుంది. భవిష్యత్తు మలచబడుతుంది.

6) ఒకవేళ గతంలోకి చూడవలసివస్తే, ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను, ఇస్తాయి.

7) మనలో ఏమన్నా లోపాలున్నాయని మనం గుర్తిస్తే, మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాలవైపు కేంద్రీకరిస్తే చాలు, ఆ లోపం సరిదిద్దబడి, విజయాన్ని పొందుతాము.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 10 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 10 :-- ఆలోచన అంటే ఏమిటి?

Ans ):--
1)మన అంతర్ ప్రపంచం నుండి ఏర్పడే ప్రతి ఫీలింగ్,భావన,కోరిక,ఊహ,కల.... వీటన్నింటిని ఆలోచన గా పరిగణించవచ్చు.

2) మన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది, for ex:-- t.v (టెలివిజన్) ని తీసుకుందాం, t. v లో కనిపించే ప్రతిబింబాలన్ని విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి.

అలాగే భూమి మీద కూడా పదార్ధంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు , భౌతిక వాతావరణం అన్నీ అంతర్ ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచనా తరంగాలు నుండి బాహ్యప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి.

3) మన ఆలోచనా తరంగాల యొక్క శక్తితీవ్రత ఎంత ఉంటే అంతకాలం భౌతిక వాస్తవం పొందిన వస్తువు, లేదా భౌతిక సంఘటన జీవించిఉంటుంది.

4) బలహీనమైన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది.

5) భూమి మీద భౌతిక సంఘటన అనగా మన జీవితంలో కి ప్రవేశించిన భౌతిక సంఘటన ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఆ ఆలోచనా తరంగాలుకు మనం ఎంత బలాన్నిచ్చి ప్రభావితం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు ఆలోచనలు మనలో ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది.

5) అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమమేమి లేదు,వాటి ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉన్న ఇతర dimensions లో రూపాంతరం చెందుతాయి.

6) ఆలోచనలను వైరస్ తో పోల్చవచ్చు,వైరస్ లు మన దేహంపై చర్యలు జరిపి వాటి చర్యలు ద్వారా దేహంలో జీవరసాయనిక మార్పులు ఎలా తేగలవో, అలానే ఆలోచనలు కూడా మన దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు.

7) వైద్య శాస్త్రానికి అంతుచిక్కని జీవరసాయనాలను, enzymes ని ఆలోచనాశక్తి పుట్టిస్తుంది.

8) ఆలోచనల నుండి feelings, emotions పడుతున్నాయి, దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయో, అలానే ఆలోచన తరంగాలు ఒక తరహా నిర్మాణం కలిగి భౌతిక సంఘటనలు ఏర్పరుస్తున్నాయి.

9) +ve ఆలోచనలు ఇతర +ve ఆలోచనలను ఆకర్షిస్తాయి,౼ve ఆలోచనలు ఇతర ౼ve ఆలోచనలను ఆకర్షిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 11 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 11) ఆలోచన అంటే ఏమిటి? ఆలోచన యొక్క విశిష్టత ఏంటి?

Ans. )
1) ఆలోచనలు, feelings,  emotions అన్ని అహం నుండి పడుతున్నాయి. 
అహం మన వ్యక్తిత్వం నుండి, సంఘం నుండి ఏర్పడిన బుద్ధి వల్ల వస్తుంది. 

మనం మన సాధనతో, conscious మైండ్కి suggestions ఇవ్వాలి. అంతర్ ప్రపంచం తనకు తానుగా ఏది మనకు ఇవ్వదు.

2) వాయువును మన కళ్ళతో చూడలేము, కానీ ఇంద్రియాలు పసిగట్టగలవు. అలాగే ఆలోచనలు కూడా మన కళ్ళకు కనపడవు. వీటిని telepathy ద్వారా పసిగట్టవచ్చు.

3) ఆలోచనలకు బలమైన ఉక్కు కడ్డీలను వంచే శక్తి, laser కిరణాలను కేంద్రీకరించి ఏ వస్తువునైనా రెండు ముక్కలుగా చేసే శక్తి ఉంది. 
for ex:--ezypt లో పెద్ద పెద్ద టన్నుల బరువున్న రాళ్లను అప్పటి కాలంలో వారి ఆలోచనా శక్తిని కేంద్రీకరింపచేసి ఆ రాళ్లను ఎత్తి పిరమిడ్ లను నిర్మించారు.

4) ఒక ప్రాంతంలోని వారంతా వర్షాలు రావాలని సంకల్పిస్తే భౌతిక వాతావరణం మారి వర్షాలు కురుస్తాయి. for ex:--యజ్ఞాలు.... యోగులు, ఋషులు వారి ఆలోచనాశక్తితో వర్షాలు రావాలని సంకల్పిస్తే వర్షాలు వస్తున్నాయి.

5) మన ఆలోచనలకు బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంది. దాని ద్వారా ఇతరుల ఆలోచనలును ప్రభావితం చేయవచ్చు. అలాగని మన ఆలోచనలు ద్వారా ఇతరులకి హాని చేయడం, ప్రమాదం తలపెట్టడం, లాంటివి జరగవు. వాళ్ళ సంకల్పం లేనిదే ఆలోచనలు వారిని ప్రభావితం చేయలేవు.

6) మనం మన ఆలోచనలును,నమ్మకాలను పరిశీలించాలి. ఆలోచనల పట్ల ఎరుక ఉండాలి. ఆలోచనలను పరిశీలన, పరీక్షించడం, ద్వారా సక్రమమైన రీతిలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

7) ఆలోచన ఒక్కసారి మన మైండ్ నుండి వెలువడితే దానిని ఉపసంహరించడం మన చేతిలో లేదు, అది ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం చెందుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 12 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 12) ఆలోచన యొక్క విశిష్టత ఏంటి?

Ans)
1) మన ఆలోచనలను t.v ప్రోగ్రామ్ నచ్చకపోతే ఇంకో ప్రోగ్రామ్ మార్చే ఎలా మారుస్తామో అదే విధంగా జీవితంలో కొన్ని పరిస్తితులు, అనుభవాలు నచ్చకపోతే వాటి స్థానంలో వేరే అనుభవాల్ని, పరిస్థితులని ప్రవేశపెట్టవచ్చు.

2) మన ఆలోచనలను భావోద్వేగాలతో, ఫీలింగ్స్తో మైండ్ నుండి, విడుదల చేస్తే, అవి చంద్రమండలానికి, రాకెట్ ని తీసికెళ్లేంత శక్తి ఉంది.

3) బలమైన ఆలోచనా తరంగాలు ఉక్కు కంటే సాంధ్రత ను కలిగి ఉంటాయి. ఆలోచనలకు ఏ యానకం అవసరం లేదు, ఏ పదార్ధంలోనైనా చొచ్చుకొని పొగలవు. పదార్ధ స్వభావాన్ని రసాయనిక చర్యలు చెందించి మార్చగలవు.

4) ఆలోచనలకు కాలం, దూరం పరిమితులు లేవు.

5) ఆలోచనలు telepathy ద్వారా పసిగట్టవచ్చు. 
for ex:--మన table మీద పుస్తకం కూడా ఆలోచనలను పసిగట్టగలుగుతుంది. కానీ అది పసిగట్టగలిగే విధానం వేరుగా ఉంటుంది. మన ఆలోచనల విద్యుదయస్కాంత శక్తి పుస్తకాన్ని స్పృశిస్తుంది.

6) సృష్టిలో నిర్జీవమైంది ఏది లేదు. 
for ex:-- రాయిలో కూడా నిరంతరం పరమాణువులు, పరమాణువులలో electrons, ప్రోటోన్స్ మరియు సూక్ష్మ కణాలకు కూడా చైతన్యశక్తి ఉంది.

అవి కూడా నిరంతర శక్తితో ప్రకంపిస్తున్నాయి. కాకపోతే రాయి యొక్క చైతన్య స్థాయి వేరుగా ఉంటుంది. రాయి కూడా చైతన్య స్థాయిలో పరిణామం చెందుతూ ఉంటుంది. 

for ex:-- రాయి , చైతన్యపరిణామం చెందాక స్పటికం, తరువాత, బంగారం ఈ విధంగా సృష్టిలో ప్రతి ఒక్కటీ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది.

7) సాధన పెంచడం ద్వారా మన ఆలోచనా తరంగాలను చూడగలుగుతాము. చెట్లలోని ఫలాలను, పుష్పాలను చూస్తున్నంత స్పష్టంగా ఆలోచనా తరంగాలను చూడగలుగుతాము.

8) స్థిరమైన వస్తువులాగా ఆలోచనలను అతేంద్రియాలతో చూడవచ్చు.

9) మన ఫీలింగ్స్ కి కదలిక ఉంటుంది, నీటి ప్రవాహం,వాయు ప్రవాహం, విద్యుత్ ప్రవాహం లాగా ఫీలింగ్స్ కి కదలిక, రంగు ఉంటాయి, మన ఫీలింగ్స్ మారే కొద్దీ రంగులు మారుతాయి.

for ex:--ఆరా పరిశీలిస్తే అర్థమవుతుంది, మన ఆలోచన బట్టి ఆరా రంగులు మారుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 13 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 13) intelligence అంటే ఏమిటి?

Ans) : 
1)ఇంటెలిజెన్స్ అనేది conscious మైండ్ పరిధిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, తర్కం (logic),
విశ్లేషణ (analysys), reasoning ఇవన్నీ intelligence ద్వారా పుడతాయి.

2) అహం intelligence ని ప్రభావితం చేస్తూవుంటుంది.

3) మనం ఎవరైనా ఎక్కువ logic తో ఆలోచించినా, ఎక్కువ విశ్లేషణ (analysis) చేసినా ఆ వ్యక్తిని తెలివైనవాడిగా గుర్తిస్తాము.

ఎక్కువ వాక్చాతుర్యం ఉన్న ఆ వ్యక్తిని తెలివైన వాడిగా గుర్తిస్తాము. కానీ ఈ measurements అన్ని సరైనవి కావు. ఎవరైతే అంతర్ ప్రపంచం ద్వారా వచ్చే భావనలను అర్థం చేసుకుని ఆచరిస్తారో, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.

4) intelligence పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోలిస్తే అంతర్ ప్రపంచం లోని మైండ్ ని అనగా subconscious మైండ్ ని సూర్యుడి వెలుగుతో పోల్చవచ్చును.

5) ప్రకృతిలో అన్ని జీవరాసులు సమానమే, ప్రకృతికి తెలివైనవాళ్ళు, పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం (mentally retarded) కలవారు అందరూ సమానమే. అందరిలో ఉన్న మైండ్, అంతర్ ప్రపంచం ఒక్కటే. చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే.

6) ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళు logic, analysys తో అంతర్ ప్రపంచం మాట వినరు. పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం కలవారు అంతర్ ప్రపంచం మాట విని మన కంటే ఆధ్యాత్మికంగా వారే చైతన్య వికాసం చెందుతున్నారు. కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో వారు జన్మ తీసుకోవడం జరుగుతుంది.

7)  దొంగ పాత్రలో ఉన్న వ్యక్తి, పోలీస్ పాత్రలో ఉన్న వ్యక్తితో దెబ్బలు తినడం, భౌతిక ప్రపంచంలో ఈ drama బాధాకరంగా ఉంటుంది. 

కానీ ఆత్మ పరంగా ఇది ఒక సవాల్. ఈ అనుభవం ద్వారా దొంగలు పాఠాలు నేర్చుకుని మనోశక్తిని వ్యాకోచింప చేసుకుంటారు.

8) car drivers, పర్వతారోహకులు (mountainers), sportsmen వీరు ఎంచుకున్న లక్ష్యాలు వీరికి సవాళ్లు గాను ఇతరులకు బాధాకరంగాను ఉంటాయి.

9) అంగవైకల్యం తో జన్మించే వ్యక్తి చైతన్య శక్తిని ఒక దిశలో కేంద్రీకరింపచేసి కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం కోసం అలాంటి జన్మ తీసుకోవడం జరుగుతుంది....

అలానే జన్మించాలనే rule ఏమి లేదు. ఈ విశ్వంలో ఏ శక్తి మనల్ని నియంత్రించడం గాని,శాసించడం కానీ చెయ్యదు. అంతా మన ఇష్టానుసారంగానే జరుగుతుంది.

10) ఆధ్యాత్మికంగా ఎదగడం, అనుభవాల ద్వారా మనోశక్తిని విస్తరించడం అంటే అంతర్ ప్రపంచం లో ఉన్న అనంత జ్ఞానాన్ని వినియోగంలోకి తేవడం అని అర్థం.మన జ్ఞానం పెరిగేకొద్ది మన subconscious మైండ్ వినియోగం లోకి వస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 14 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q14) intelligence అంటే ఏమిటి? అనంత జ్ఞానం దానితో సాధించ వచ్చా? 

A:--
1) intelligence అంటే conscious మైండ్ని సరిఅయిన రీతిలో వినియోగించడం అని అర్థం.

2) మనకు తెలిసినంతవరకు తర్కం(logic), విశ్లేషణ(analysys), జ్ఞాపకశక్తిని మాత్రమే intelligence అనుకుంటాం. 

అయితే మరి కోటానుకోట్ల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అవి చైతన్య పరిణామం చెందుతున్నాయి. 

ఒక్క మనిషే గొప్పగా చైతన్య పరిణామం చెందుతుంది అని మనం భావిస్తాము అలా అయితే ఒక్క మనిషి సృష్టే ఉంటే సరిపోతుంది కదా. ఇన్ని జీవజాతుల సృష్టి ఎందుకు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి?

ఎందుకంటే మనకంటే జంతువులే చైతన్య పరిణామంలో ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్నాయి.మనిషి మనుగడ ఇతర జీవజాతుల సహకారంతోనే సాధ్యమవుతుంది,అందరూ తెలుసుకోండి.

3) మనం మన దేహం లో జరిగే ప్రక్రియలన్ని గమనిద్దాం, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ, వీటన్నింటికి intelligence తో అవసరమేముంది. 

ఇవన్నీ జీవజాతులన్నింటిలో ఎంతో సక్రమంగా జరుగుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుంది... మనల్ని మనం ప్రశ్నించుకోవాలి... వీటన్నింటిని అంతర్ ప్రపంచం నడిపిస్తున్నదని తెలుసుకోండి.

4) ఒక మనిషి తనలాంటి మరో మనిషిని సృష్టించగలిగాడా? లేదు.....ఎప్పుడైతే మనిషి సాధనతో తన అంతర్ ప్రపంచాన్ని వాడుకోగలుగుతాడో, అప్పుడే మనిషి మనుగడ, intelligence లో అభివృద్ధి జరుగుతుంది.

5) ఒక చిన్న విత్తనం మహా వృక్షంగా ఎలా ఎదుగుతుంది, electron గమనం, భూమి, సౌరవ్యవస్థ గమనం, ఇవన్నీ క్రమ పద్ధతిలో ఎలా పరిభ్రమిస్తున్నాయి, ఆలోచించండి. ఇవన్నీ అంతర్ ప్రప్రంచం ద్వారానే సాధ్యమవుతున్నాయి.

6) మన సంఘం ఇచ్చిన జ్ఞానపరిధిలోనే మన intelligence ఎదిగి ఉంది,మనం ఎప్పుడైతే సంకల్పశక్తి, ఊహాశక్తి, ద్వారా అంతర్ ప్రయాణం చేస్తామో అప్పుడే అనంత జ్ఞానం అనుభవం లోకి వస్తుంది.

7) స్వప్నాల ద్వారా astral travel ద్వారా మాత్రమే మనం అపారమైన జ్ఞానాన్ని, అపరిమిత జ్ఞానాన్ని ఈ భూమి పైకి తేగలము.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 15 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 15) విశ్వశక్తి , మనోశక్తి,
ఊహాశక్తి  ఏ విధంగా పనిచేస్తాయి?

Ans:--
1) ఒక వ్యక్తి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని బలంగా సంకల్పించినప్పుడు దానికనుగుణంగా విశ్వమయ మనోశక్తి (universal మైండ్) ప్రతిస్పందించి ...... విశ్వశక్తి (cosmic energy) మన లక్ష్యం కేంద్రంగా మనవైపు ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహానికి మన లక్ష్యం కేంద్రంగా ఏర్పడి ఆకర్షిస్తుంది.

2) ఈ విశ్వచైతన్యంలో ప్రతి ఆత్మ శకలం ఒక కేంద్రబిందువే. కేంద్ర బిందువు పరిధి పెరిగే కొద్ది విశ్వచైతన్య శక్తి పరిధి కూడా విస్తరిస్తూ ఉంటుంది.

3)for ex:--
మనం మన ఇంటి గోడ ద్వారా ప్రయాణించాలనుకున్నాం అనుకోండి. conscious మైండ్ పరిధిలో reasoning మైండ్ కి ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆత్మశక్తి పరిధిలో అది చాలా సులభమని మన మనోశక్తికి తెలుసు.

ఈ విశ్వమంతా శక్తిమయమే. మన కళ్ళకు కనిపించే గోడ ఘనపదార్ధంగా reasoning మైండ్ నిర్ధారించుకుంటుంది. వాస్తవానికి ఆ గోడ భౌతిక పదార్ధ రూపంలో ఉన్న శక్తి స్వరూపం.

మనం పూర్తిగా విశ్వసించి గోడ గుండా ప్రయాణం చేయాలని సంకల్పిస్తే మన దేహం దానికనుగుణంగా ప్రతిస్పందించి శక్తి స్వరూపంగా మారి గోడ గుండా ప్రయాణించడం జరుగుతుంది. శక్తి ప్రసారానికి ఈ విశ్వంలో ఏ యానకమూ(medium)అవసరం లేదు.

మన ఆత్మశక్తి సూక్ష్మశరీర సముదాయం (astral body) సహాయంతో పర్వతాలు,గొళాలు, నక్షత్రాలు గుండా చొచ్చుకునిపోయి ఆనంతదూరాన్ని క్షణ కాలంలో ప్రయాణించగలదు. కాంతి తరంగాలు ఏ మీడియం లేకుండా అనంత దూరం ప్రయాణిస్తాయి కదా.

4) శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి కోల్పోయిన అవయవం తిరిగి పొందినట్టు బలంగా సంకల్పించి మనోశక్తి ద్వారా ఊహించుకుంటే, అందుకనుగుణంగా భౌతిక పరిస్థితులు ఏర్పడి సంకల్పం నెరవేరుతుంది. 

ఒకవేళ ఆ అవయవాన్ని అమర్చడానికి వైద్య శాస్త్రం అభివృద్ధి చెంది ఉండకపోతే అతని బలమైన సంకల్పానికి అనుగుణంగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందించబడుతుంది.

ఒకవేళ అతని సంకల్పం బలహీనంగా ఉంటే అతనికి అతని అంతర్ శక్తి మీద నమ్మకం లేకపోతే అతని లక్ష్యం తాలూకు ఆలోచనా తరంగాలు ఇంకో dimension లోకి ప్రయాణించి అక్కడ వాస్తవాన్ని పొందుతాయి.

5)for ex:--
ఒక స్త్రీ తన వైవాహిక జీవితంలో అసంతృప్తిగా,నిరాశామయమైన జీవితం అనుభవిస్తుంటే, ఆమె తన ఊహా శక్తి ద్వారా తన వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్నట్లు, తన జీవిత భాగస్వామితో ప్రేమను పంచుకుంటున్నట్లు, అనేక విధాలుగా, అనేక కోణాలతో ఊహించుకుంటే, అదే ఆమె జీవితంలో సృష్టించబడుతుంది. 

ఆమె జీవిత భాగస్వామి ఆమె యొక్క ఊహాశక్తికి ప్రభావితం అవుతాడు,అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. దూరం కాలంకి అతీతంగా మన ఊహాశక్తి జీవితాన్ని మార్చేస్తుంది. ఊహాశక్తి పనిచేస్తుందా అనే సందేహాలు పెట్టుకోవద్దు. బలమైన నమ్మకపు వ్యవస్థని అలవర్చుకోండి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 16 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 16) దేహం తనకు వచ్చిన వ్యాధిని ఎలా నయం చేసుకోగలదు?

Ans :
1)మన దేహం కోటానుకోట్ల జీవకాణాలతో ఏర్పడింది.ప్రతి జీవకాణానికి ఆత్మ,మైండ్ ఉంటాయి.అన్ని వ్యక్తిగత మైండ్స్ కలిసి ఒక సామూహిక మైండ్ గా మారి మన సంకల్పశక్తి,ఊహాశక్తి కి అనుగుణంగా స్పందిస్తాయి.

2)కొన్ని సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లైతే ఆ వ్యక్తి ఆ వ్యాధి నాయమవ్వాలని,సంకల్పిస్తే అతను ఆ వ్యాధి నాయమైనట్లు,దేహం ఆరోగ్యంగా ఉన్నట్లు అతను ఊహాశక్తితో కలలు కంటే,తక్షణమే దేహంలోని జీవకాణాల సామూహిక మైండ్ దానికి స్పందించి దేహంలో సరికొత్త జీవరసాయనాలు,విద్యుదయస్కాంత శక్తి విడుదలై ఆ వ్యాధి నయం చేయబడుతుంది.

3) మన ఊహాశక్తి, emotions, feelings, ఆశయాలు,భయాలు,సంకల్పాలు,ద్వారా విద్యుదాయస్కాంత శక్తిని మెదడు సంగ్రహించి మైండ్ కి చేరవేస్తుంది.

4) దేహాన్ని విడిచి పెట్టిన తర్వాత కూడా మైండ్ continue అవుతుంది.కానీ మెదడు భౌతిక పదార్ధం తో తయారుచేయబడింది కాబట్టి దేహం మరణించిన వెంటనే మెదడు పంచభూతాలలో కలిసిపోతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 17 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 17) Conscious మైండ్ vs Multidimensionality

స్వప్నావస్థ vs జాగృదావస్థ
(Dream state vs awakening state )

Ans :--
1) Conscious మైండ్ మల్టిడిమెన్షనల్ గా చైతన్య పరిణామం చెందుతుంటుంది.

2) Multidimensional గా ఉన్న మనోశక్తిని మెదడు అనే సాధనం ద్వారా 3D (3డైమెన్షనల్)  తలమైన భూభౌతిక ప్రపంచంతో సంయోగం చెందించి ప్రత్యక్ష సంబంధం ఉండేటట్లు చేస్తుంది.

3) అంతర్ ప్రపంచం నుండి మైండ్ పంపే సందేశాలను సంకేతాలను మన మెదడు ద్వారా channeling చేసి బాహ్యప్రపంచం లోకి భౌతిక సంఘటనలతో మనకు సంబంధాన్ని కలుగజేస్తుంది. అలానే భౌతిక ప్రపంచంలో సమాచారాన్ని సందేశాల్ని మెదడు ద్వారా channeling చేసి అంతర్ ప్రపంచానికి అందించడం జరుగుతుంది.

4) multidimensional వ్యవస్థ లో ఆత్మశక్తికి ప్రతీది సాధ్యమే.

5) 3 dimensional తలంలో ఆత్మ జీవాత్మగా జన్మించినప్పుడు, కాలం-దూరం అనే చట్రంలో కొన్ని నమ్మకాలకు, విశ్వాసాలకు లోనై తన అంతర్ ప్రపంచం లో గల అపారమైన అనంత శక్తిని మర్చిపోవడం జరుగుతుంది.

6) ఆత్మ తనకు గల అపారమైన అంతర్ శక్తిని మర్చిపోయి 3D తలంలో కాలం-దూరం అనే చట్రంలో ఇరుక్కుని పరిమిత జ్ఞానంతో కూడిన నమ్మకాలతో బుద్ధిని కోల్పోవడాన్ని భ్రాంతి అంటారు.

7) మనం multidimensional ఆత్మ అని తెలుసుకోవాలి.ఏక కాలంలో అనేకానేక దేహాలతో అనేకానేక లోకాలలో చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మలం మనం అని తెలుసుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 18 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 18 ) స్వప్నావస్థ మరియు జాగృదావస్థ ఎలా ఉపయోగపడతాయి? 

Ans : - - 
1) మనం భూమి మీద జన్మ తీసుకున్న క్షణం నుండి జాగృదావస్థ మరియు స్వప్నావస్థ లలో చైతన్య పరిణామం చెందుతుంటాము.

జాగృదావస్థలో మన పురోగతి గోరంత అయితే స్వప్నావస్థ లో ఆత్మ పురోగతి, జ్ఞాన సముపార్జన కొండంత అని చెప్పవచ్చు. స్వప్నావస్థ లో జాగృదావస్థ కంటే కొన్ని లక్షల రెట్లు పురోగతి ఉంటుంది.

2) బాహ్య ప్రపంచంలో ఒక జీవిత కాలంలో మనం పొందిన జ్ఞాన సముపార్జన + 
జీవితానుభవాలు  స్వప్నావస్ధ లో ఒక గంట కాల వ్యవధిలో పొందవచ్చు.

3) దేహం యొక్క ఆరోగ్యస్థితి జాగృదావస్థ కంటే స్వప్నావస్థ లో ఎక్కువ మెరుగుపడుతుంది.

4) జాగృదావస్థ లో జీవరసాయినిక చర్యలు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను పతిష్టపరచలేవు. స్వప్నావస్థలో దేహం శక్తిని ఉత్తేజాన్ని పొందుతుంది.

5) అన్ని స్థితిలలోని జీవితానుభవాల్ని మైండ్ తన సాధనమైన మెదడు ద్వారా రికార్డ్ చేసుకుంటుంది.

6) ప్రతి జీవాత్మ తన అంతర్ ప్రపంచం తో అనుసంధానం అవ్వాలి. నిద్ర ప్రక్రియ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

7) నిద్రలో ఇతర లోకాల,ఇతర dimensions యొక్క జ్ఞాన సముపార్జన శక్తి సముపార్జన జరుగుతుంది.

8) 3D తలంలో ప్రతి జీవాత్మ నిద్ర పోవాల్సిందే.లేకపోతే మనుగడ లేదు.

9)ఈ భౌతిక ప్రప్రంచం లో జీవాత్మ తన జీవితాన్ని కొనసాగిస్తున్నంతకాలం మైండ్ మెదడు అనే సాధనాన్ని వినియోగించుకుంటుంది.

10) మనిషికి మేధస్సు మైండ్ ద్వారా వస్తుంది .మెదడు అనేది మేధస్సును సృష్టింపదు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 19 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 19:--మానవుడు భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాడు?

Ans:--
1)భౌతిక పదార్ధాన్ని,భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులును,భౌతిక వాస్తవాన్ని,మానవ చైతన్య వికాసాన్ని...... సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని జ్ఞానపరిధిని విస్తరింప చేసుకోవడానికి భూమి మీద జన్మ తీసుకున్నాడు.

2) ఆత్మ చైతన్య వికాసాన్ని అనేక కోణాలలో వ్యాపింప చేసుకోవడానికి,అన్ని శక్తి సామర్ధ్యాలు, మన అంతర్ శక్తిలో ఇముడ్చుకుని భూమి అనే ప్రయోగశాలలో ప్రవేశించడం జరిగింది.

3) భూమి పైన జన్మ తీసుకోకముందే మనకు అనంతమైన అవకాశాలను వినియోగించుకుని చైతన్య పరిణామం చెందగల సర్వ సమర్ధతలు మనము కలిగి ఉన్నాము. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువుగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది.

4) మనం కోరుకోకుండా ఏ భౌతిక సంఘటన,మన జీవితంలోకి ప్రవేశించడం జరుగదు.మనము ఏవైతే కోరుకుంటున్నామో అవే మనం భౌతిక పరిస్థితులగా ఎదుర్కుంటున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 20 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 20)  విధిరాత, లలాట లిఖితం అంటుంటాము. ఇది సత్యమా? ఒక వ్యక్తి రోగాలను అధ్యయనం చేయడం కోసం జన్మలు ఎలా తీసుకుంటాడు?

Ans :--
1) విధిరాత, లలాట లిఖితం అనేది ఏ ప్రాణికి ముందుగానే నిర్ణయింపబడి ఉండదు.

Forex:-- ఒక వ్యక్తి ఒక రోగాన్ని జీవితాంతం అనుభవిస్తున్నాడంటే అతను జన్మ తీసుకోకముందే ఆ రోగాన్ని ఎంచుకోవడం జరిగింది. 

కానీ ఇప్పుడు గనుక అతను తీవ్రంగా ఆ రోగాన్ని నయం చేసుకోవాలని సంకల్పిస్తే దేహం దానికి తగ్గ జీవరసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ లోకంలో ఏ జీవాత్మ గతం యొక్క దాయాదాక్షిణ్యాలపై జీవించాల్సిన అవసరం లేదు.

2) ఇదే వ్యక్తి ఒక జన్మలో డాక్టర్ గా వుంటూ ఆ వ్యాధి రావడానికి మూలకారణాన్ని కనుక్కుని, శాస్త్ర చికిత్సను కనుగొనవచ్చు. ఈ విధంగా ప్రతి జన్మ కూడా మనమే ఎంచుకున్నాము అని గుర్తుంచుకోండి.

3) ఈ విశ్వంలో ఏ cosmic డైరెక్టర్, లేదా ఏ దేవుడో మన జీవితాన్ని శాసించట్లేదని తెలుసుకోండి.

4) పిల్లలు లేకుండా ఒక జన్మ,పిల్లలతో ఒక జన్మ,స్త్రీగా,పురుషుడిగా, భిక్షగాడిగా, రాజుగా, రైతుగా, అలా అనేకానేక జన్మలు మనం స్వతంత్రంగా ఎంచుకుంటాము.

5) జీవిత శాస్త్రాన్ని అనేక కోణాల్లో దర్శించి అధ్యయనం చెయ్యడం కోసం ,ప్రతి ఆత్మ తన ఇష్టానుసారం జన్మ తీసుకుంటుంది.

6) ప్రతి ప్రాణి ప్రకృతి ఒడిలో క్షేమంగా ఉంది.ఒక వృక్షం తన ఆహారం కోసం భూమి నుండి భిక్షం అడగడం లేదు. సూర్యకిరణాలు కోసం పడిగాపులు కాయడం లేదు. వృక్షానికి కావలసిన వనరులన్నింటిని ప్రకృతి సమకూరుస్తుంది.

అలానే ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కావలసిన వనరులన్నింటిని ప్రకృతి సమకూరుస్తుంది. మనం చేయాల్సింది ప్రకృతిని విశ్వసించడమే.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 21 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 


Q 21) అంతర్ ప్రపంచం మనకు ఎలా సహాయ పడుతుంది?

Ans :--
1) మనము సంగీతం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి.ఆ వాంఛ మన అంతర్ ప్రపంచంలో కలిగిందనుకోండి. ఈ వాంఛ బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందేందుకు గల సర్వ సామర్ధ్యాలు మన అంతర్ శక్తిలో ఉన్నప్పుడే మనకు ఆ idea వస్తుంది.

2) ఉదాహరణకు ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తి ఆ పేదరికాన్ని గట్టి సంకల్పంతో వదిలించుకోవాలన్న వాంఛ కలిగిందనుకోండి. ఆ పేదరికాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన భౌతిక పరిస్థితులు సృష్టింపబడతాయి.

3) నేను ఫలానా పని చేయగలను అనే స్పందన మనలో కలిగిందంటే ఆ పనిని సాధించగల సామర్ధ్యం మన అంతర్ ప్రపంచంలో కలిగి ఉన్నామని అర్థం. మన అంతర్ ప్రపంచానికి అసాధ్యం అంటూ ఏది ఉండనే ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 22🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 22 :--మన ఆలోచనలు భౌతిక ప్రపంచంలో ఎలా వాస్తవ రూపం చెందుతాయి?

Ans :--
మన అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుందని మనం గుర్తుంచుకోవాలి.మన మైండ్ నుండి ప్రతి క్షణము అనేక ఆలోచనలు వెలువడుతూ ఉంటాయి.

ఆలోచన తీవ్రమైనదైతే మనం పదే పదే ఆ ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నామంటే ఆ ఆలోచనకు శక్తిని అందిస్తున్నామనమాట. 

మన ఆలోచన యొక్క తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆలోచన భౌతిక తలంలో(physical plane)లో వాస్తవ రూపం చెందుతుంది.
     
బలహీనమైన ఆలోచనలు కు శక్తి సరిపోకపోవడం వల్ల అవి ఆ శక్తి, frequency తగ్గ లోకాలలో వాస్తవ రూపం పొందుతాయి.

ఇక్కడ మనలో ఒకేసారి 3 ఆలోచనలు వచ్చాయనికోండి. అవి ఎలా వాస్తవ రూపం పొందుతాయో గమనిద్దాం.

1) ఆలోచన 1:--
మనం రేపు సాయంకాలం 4 గంటలకు telephone bill కట్టాలనుకుందాం.

2) ఆలోచన 2 :--
మనకు ఇంకో ఆలోచన వచ్చింది.
రేపు సాయంత్రం 4 గంటలకు friend ని కలవాలనుకున్నాం.

3) ఆలోచన 3 :--
రేపు సాయంత్రం 4 గంటలకు movie కి వెళదాం అనుకున్నాం.

పై మూడు ఆలోచనలు రేపు 4 గంటలకు సంబంధించినవి.

వీటిని మైండ్ లో ఏర్పడిన సంభావ్య క్రియలుగా పరిగణించడం జరుగుతుంది. పై మూడు ఆలోచనలలో మనం ఒకదాని పట్లే శక్తిని కేంద్రీకరింపబడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క ఆలోచనే భౌతికంగా సృష్టింపబడింది.అంటే ఆ ఆలోచన మాత్రమే జరిగింది.

మరి మిగతా రెండు ఆలోచనలు ఏమయ్యాయి అని doubt రావచ్చు. మిగతా రెండు ఆలోచనలకు మనం శక్తిని ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు ఆలోచనలు ఆ శక్తి,frequency ఉన్న లోకాలలో వాస్తవం పొందుతాయి.

కాబట్టి మనలో కలిగే ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుంది. కావున అద్భుతమైన ఆలోచనలు ఆలోచించండి. ఆలోచన పట్ల ఎరుకను సాధించండి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 23 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 23:--సంభావ్య క్రియలు అంటే ఏమిటి?

Ans :--
 మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా మొదట సంభావ్య క్రియగా మన మైండ్ లో ఉద్భవిస్తుంది.

1) ఒక artist ....పేపర్ పై బొమ్మలు గీయాలనుకున్నాడనుకోండి.
అప్పుడు first అతను paper పై ఏ బొమ్మలు గీయాలో conscious మైండ్ లో నిర్ణయించుకుంటాడు.

అప్పుడు అతని సంకల్పం ప్రకారం అతని అంతర్ ప్రపంచం అతని చిత్ర రచనకు కావాల్సిన శక్తి సామర్ధ్యాలను అతనికి అందిస్తుంది. క్షణ కాలంలో ఎన్నో సంభావ్యక్రియలు మైండ్ లో ఏర్పడతాయి. వాటిలో ఎక్కువ శక్తిని తీసుకున్న సంభావ్య క్రియలు కాగితంపై బొమ్మలుగా వేయడం జరుగుతుంది. 

కాగితంపై బొమ్మలను తన ఇష్టమొచ్చిన రీతిలో చిత్రకారుడు గీస్తాడు. అలాగే మన జీవిత చిత్రపటాన్ని మనమే మనకిష్టమొచ్చిన రీతిలో రచించుకోవచ్చు.

మన మైండ్ లో అనంతమైన సంభావ్య క్రియలలో కొన్నింటిని ఎంచుకుని వాటిపై చైతన్యశక్తి ని సంకల్పాల ద్వారా కేంద్రీకరించినప్పుడు అవి మనకు వాస్తవాలుగా రూపుదిద్దుకుంటాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 24 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 24:--మన నమ్మకాన్ని బట్టే మన జీవితం ఉంటుంది అది ఎలా?

Ans :
ఒక ఉదాహరణ తో దీనిని పరిశీలిద్దాం. 

ఒలింపిక్ గేమ్స్ లో క్రీడాకారులు  చేసే విన్యాసాలన్ని మనకు అద్భుతంగా మరియు ఆ విన్యాసాలన్ని కొద్దిమంది చేయగలరని దానికి ఎంతో ట్రైనింగ్ కావాలని మనం భావిస్తుంటాం. 

కానీ  మానవ జాతిలో పుట్టిన ప్రతి మానవుడికి ఆ విన్యాసాలన్ని సునాయాసంగా చేయగల ప్రతిభను వున్నారు.

       మన నమ్మకపు వ్యవస్థలో మనం ఆ గేమ్ ని ఎంతో ట్రైనింగ్ ఉంటే గాని చేయలేమని నమ్మకాన్ని కలిగివుండడం వల్ల మన నమ్మకపు వ్యవస్థ కు అనుగుణంగా దేహం ప్రతిస్పందించి ఆ క్రీడను ఆడలేమంటుంది.

    మన belief సిస్టం ని మారిస్తే ఈ భూమి మీద మానవుడు సాధించలేనిదంటూ ఏది లేదని తెలుసుకోండి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 25 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 25:--వర్తమానంలో జీవించడం వల్ల గతాన్ని,భవిష్యత్తు ను సరిచేయచ్చు?

Ans : 
1) గతంలో జరిగిన సంఘటనల ప్రభావం ... వర్తమానంలో మనం ఎదుర్కొనే పరిస్తితులపై ఉండదు. అది ఎలాగో గమనిద్దాం.

1) ప్రస్తుతం మనం తీసుకునే నిర్ణయమే మన జీవితం యొక్క గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది.

2) ఒక దేశం, ప్రపంచం యొక్క అభివృద్ధి, చైతన్య వికాసం ఆ దేశం,ప్రపంచంలో గల మానవాళి అందరి వ్యక్తిగత సంకల్పాల సముదాయం మీద ఆధారపడి ఉంటుంది.

3) అంతర్ ప్రపంచం నుండే సృష్టి జరుగుతుందని తెలిసాక -ve గా ఆలోచించడం, అభద్రతా భావం కలిగి ఉండడం, భయానికి లోను కావడం అర్థరహితం.

4) ఒక శిల్పి తనకు ఇష్టమొచ్చిన రీతిలో శిల్పాన్ని మలిచినట్లు, మన జీవితాన్ని మనం మలచుకోవచ్చు.

5) గత జన్మలో చేసిన కర్మలు ప్రస్తుతం మనల్ని శాసించి వెంటాడడం లేదు.

6) మనం ఈ జన్మలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని భూమి మీద జన్మ తీసుకున్నాం. ఎంతో జ్ఞానాన్ని కూడా ఈ జన్మలో సంపాదించుకున్నాం. ఆ జ్ఞానంతో వ్యవహరించినట్లైతే గతం, భవిష్యత్తు రెండు సరిచేయబడతాయి.

7) జీవితంలో సమస్యలనేవి లేవు. ఉన్నవన్ని సవాళ్లే. 100 మైళ్ళ నడక ఒకరికి సవాలుగా, ఒకరికి సమస్యగా ఉంటుంది.

8) సమస్య, పరిష్కారం నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ, బొరుసు లాంటివి. మనకు ఒక సమస్య వచ్చిందంటే దానిని పరిష్కరించే శక్తి మనకు ఉందని అర్థం చేసుకోవాలి.

జ్ఞానంతో వ్యవహరించడం వల్ల సమస్య పరిష్కరింపబడడం జరుగుతుంది. అలానే కర్మ ఏర్పడదు. అప్పుడు మనం గతాన్ని తుడిచిపెట్టేసాం. భవిష్యత్తును కొత్తగా రాశాం.

మన చేతుల్లోనే భవిష్యత్తు ఉందని అందరూ తెలుసుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 26 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 26:--సమస్య ఎదురైనప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటి?

Ans : 
1) సమస్య గురించి బాధపడటం గాని, దుఃఖించడం గాని మానేయాలి.

2) వర్తమానం లొనే సమస్య + పరిష్కారం రెండూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

3) ఒక సమస్య ఎదురయ్యిందంటే దానిని పరిష్కరించగల సామర్ధ్యం మనలో ఉందని తెలుసుకోవాలి.

4) అంతర్ ప్రపంచానికి అనంతమైన శక్తి ఉందని నమ్మాలి.

5) అంతర్ ప్రయాణం అనగా ధ్యానం ద్వారా, స్వప్నాల ద్వారా, ఇంకేదైన రూపంలో సమస్య యొక్క పరిష్కారం లభిస్తుందని విశ్వసించాలి.

మన అంతర్ ప్రపంచం ఎప్పటికి మోసం చేయదని విశ్వసించాలి.

6) మన శక్తికి మించే ఏ సమస్య జీవితంలో ఎదురవ్వదు. అని తెలుసుకోవాలి.

7) +ve result వస్తుందని నమ్మకం కలిగి ఉండాలి.

8) Reasoning మైండ్, పరిమిత intellect మానసిక సోమరితనాన్ని విడిచిపెట్టి, అంతర్ ప్రపంచం ఇచ్చే సూచనలు ఆచరణలో పెట్టాలి.

9) మన యొక్క ప్రతి సమస్యకు సమాధానాలు అంతర్ ప్రపంచం నుండి లభిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 27 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 27:--మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ఏ జాతినైన ప్రేమించగలుగుతాం?

Ans : 
1) మనల్ని మనం ప్రేమించుకోలేదంటే మన జీవితాన్ని మన శక్తి సామర్ధ్యాలను మన ఆత్మ చైతన్య పరిణామాన్ని ఈ విశ్వంలో మనకు గల విశిష్ట స్థానాన్ని జీవిత పరమార్థకతను అగౌరవ పరచుకుంటున్నామని అర్థం చేసుకోవాలి.

2) మన జీవితం దుఃఖమయంగా ఉన్నప్పుడు ఇతరుల జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని, చూడలేము.

3) తనను తాను హింసించుకునేవాడే ఇతర ప్రాణికోటి పట్ల హింసాత్మక0గా ఉండగలడు.

4) మన దేహాన్ని మనం ప్రేమించుకోలేనప్పుడు ఇతరుల దేహాలు అందంగా ఉన్నాయా, అందవిహీనంగా ఉన్నాయా అని చూస్తుంటాము.

5) మనలో లేని లక్షణాలు ఇతరులపై రుద్దాలనుకుంటే కూడా వాళ్ళను ప్రేమించలేము.

6) మనల్ని మనం దైవంగా భావించినప్పుడే ఇతర ప్రాణికోటి ని కూడా దైవంగా చూడగలము.

7) జీవితాల్ని హీనపరుచుకునే వారే ఇతర జంతుజాతిని చంపగలరు. జీవితాన్ని అత్యున్నతంగా ప్రేమించేవాళ్ళు జంతుజాతిని, ఇతర జాతుల్ని హింసించలేరు.

8) మన శాస్త్రవేత్తలకు జీవితం యొక్క పరమార్ధం, విలువ తెలియదు, అందుకే జంతువుల్ని ప్రయోగశాలలో వాడుకుంటున్నారు.

9) ఈ విశ్వంలో మానవులు ఎంత ప్రాముఖ్యమో ఇతరులు కూడా అంత ప్రాముఖ్యమే.

10) ఎలక్ట్రాన్, atom,  molecule, చీమ, కప్ప, రాయి, చెట్టు, జంతువు, మనిషి,అన్నియు మనిషి ఎంత ప్రాముఖ్యాన్ని కలిగివున్నాయో అంతే ప్రాముఖ్యాన్ని అవీ కలిగి ఉన్నాయి.

దైవం దృష్టిలో మనం ప్రత్యేకంగా గుర్తింపబడి,ఇతర ప్రాణులు గుర్తింపబడక పోవడం లాంటివి ఉండవు. అందరూ సమానమే.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 28 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 28:--అంతర్ ప్రపంచం నుండి బాహ్యప్రపంచం ,పరిస్తితులు ఎలా సృషింపబడతాయి?

Ans:--
1)మనము ఏది ఆలోచిస్తామో అదే సృష్టిస్తాము.మన ఆలోచనలే మన జీవితము.

2) మనము conscious గా గాని, unconscious గా గాని  గట్టిగా సంకల్పించుకున్నవి మాత్రమే మన అంతర్ ప్రపంచం మనకు +ve situations గా గాని, -ve situations గా గాని మనము పొందుతాము.

3) మన మనోశక్తి ఆత్మశక్తి నుండి పుట్టింది.మనం ఎదుర్కొనే పరిస్థితులు, మనకు కనబడే వస్తువులు, మనం ప్రతిరోజు మన ముందు జరిగే సంఘటనలు అన్నీ ఈ భూభౌతిక పదార్ధంతో ముడిపడి, మన మనోశక్తి ఎప్పుడైతే భూమి ఫ్రీక్వెన్సీ స్థాయికి చేరుతుందో అప్పుడు 3d తలమైన ఈ భూమి పైన మనము అవే పరిస్థితులు ఎదుర్కుంటున్నాము. వాటినే జీవితానుభవాలుగా పొందుతున్నాము.

అనగా మన ఆలోచన తీవ్రత భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కి సరిపోతే వాటినే జీవితానుభవాలుగా మనము పొందుతుంటాము.

4) మనము మన ఆలోచనకు ఇచ్చే శక్తిని బట్టి ఆ పరిస్థితిని ఎదుర్కుంటుంటాము. ఎప్పుడైతే ఆ విషయాన్ని ఆలోచించమో, అప్పుడు ఆ ఆలోచనకు శక్తి తగ్గి ఇంక ఆ ఆలోచన భూమి పైన మనుగడ సాగించడానికి వీలుకాదు.

5) ప్రకృతి నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది, ఏది శాశ్వతంగా నిలిచిపోదు.

6) మన పరిమిత ఇంటెలిజెన్స్, విశ్లేషణ, లాజికల్ మైండ్ తో మనమే అడ్డంకులు ఏర్పరుచుకుంటున్నాము.

7) కారణం లేనిదే కార్యం జరుగదు అంటాము.
అంతరప్రపంచం (కారణం+సృష్టి) = బాహ్యప్రపంచం (కార్యం+సృష్టి) అవుతుంది.

8) మన అంతర్ ప్రపంచం ముల్టిడైమెన్షనల్....మన భూమి 3 dimensional.

9) మన ఆలోచన ఎక్కువ frequency తో ఉంటే ఆ frequency కి తగ్గ లోకంలో సృషింపబడుతుంది.

10) ఒకవేళ మన ఆలోచన తక్కువ ఫ్రీక్వెన్సీ తో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ భూమికి గనక సరిపోతే భూమి పైన ఆ పరిస్థితి సృష్టింపబడుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 29 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 29:--ఎయిడ్స్(aids) వ్యాధి సంక్రమించడానికి గల కారణాలు అనగా spiritual cause ఏమిటి ?

Ans) 
వ్యాధులను దేహం తనంతట తాను నయం చేసుకోగలదు.మన ఆలోచనలు -ve గా ఉన్నందువల్లే వ్యాధులు సంక్రమిస్తాయి.మనం గనుక వ్యాధి నాయమౌతుందని బలంగా,తీవ్రంగా విశ్వసిస్తే దేహం కొన్ని అద్భుతమైన జీవ రసాయనాలను విడుదల చేసి వ్యాధిని నిర్మూలిస్తుంది.

Spiritual cause for aids
(Aids సంక్రమించడానికి గల కారణాలు గమనిద్దాం).

1) homo sexuals(స్వలింగ లై0గిక సంపర్కం)వల్ల ముఖ్యంగా ఈ వ్యాధి భూమి మీద సృషింపబడింది.

2) homo sexuals జాతిని ఇతర మానవజాతి అసహ్యంగా,చులకనగా treat చెయ్యడం వల్ల వారిలో ఆత్మహత్య ధోరణి ప్రబలి ఆరోగ్య వ్యవస్థను వారు విచ్చిన్నం చేసుకున్నారు.

3) ఆ జాతివారు మమ్మల్ని అసహ్యించుకోవద్దని,చులకన చేయవద్దని,అంతకంటే మమ్మల్ని చంపేయండని, తీవ్రంగా దాని గురించి ఆలోచించి,బాధపడటం వల్ల ఈ వ్యాధిని మానవులు భూమి మీద సృష్ఠించడం జరిగింది.

4) ఆత్మహత్య దృక్పధం గల ఆలోచనావ్యవస్థ ఉండడం వల్ల ఎయిడ్స్ సంక్రమిస్తుంది.

5) జీవితంలో అభివృద్ధి ఉండదని భావించడం,
జీవితాశక్తి కోల్పోవడం నిరాశా నిస్పృహ లకు లోనుకావడం వల్ల ఇది సంభవిస్తుంది.

6) మానవజాతిలో ఒక ప్రాంతం, ఒక మతం లేదా ఒక రంగు ఇలా మత వైషమ్యాలు, కొన్ని తెగలను అసహ్యించుకోవడం,
వారి పట్ల తీవ్ర అసంతృప్తి చూపించడం చేస్తుంటారు.
అలాంటి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

7) జీవజాతుల పట్ల ప్రేమ,అనురక్తి లేకపోవడం,జీవజాతుల పట్ల చిన్న చూపు ఉండడం వల్ల కూడా సంభవిస్తుంది.

8) కోపం,ద్వేషం,అసహ్యం, పగ,ప్రతీకారం, హింసాత్మక, వినాశకర ధోరణి ఉండడం వల్ల ఇది సంక్రమిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 30 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 30:-- కలరా,ప్లేగు, విషజ్వరాలు, వైరస్ లు, బాక్టీరియాలు, ఇలాంటి అంటువ్యాధులు ఎలా వస్తున్నాయి?

Ans : 
ఇలాంటి వ్యాధులు తొందరగా చెలరేగి ఎక్కువ జనాభాను చంపి వేయడం జరుగుతుంటుంది.

1) ఒక ప్రాంతంలో నివసిస్తున్న జనాభాలో ఎక్కువ శాతం మంది మత వైషమ్యాలతో, జాతి వైషమ్యాలతో, ఆత్మహత్య ధోరణితో, జీవితం పట్ల విరక్తి , జీవితార్ధం కోల్పోవడం ఇలాంటివన్నీ వారి మనసులో ఉండడం వల్ల ఇలాంటి వ్యాధులు ప్రబలి ఎక్కువ జనాభా చనిపోవడం జరుగుతుంది.

2). ప్రకృతి ప్రళయాలు భూకంపాలు, సునామి, తుఫాను, ఇవన్నీ కూడా అలాంటి దృక్పధం జనాభాలో ఎక్కువ శాతం ఉండడం వల్ల ఆ ప్రదేశాల్లో సంభవిస్తాయి.

3) viruses, బాక్టీరియా లాంటి అంటువ్యాధులు మన నమ్మకాలు, emotions వల్ల మనం వాటిని ఆహ్వానిస్తాము అనగా ఆ వ్యాధి ఎవరికన్న వస్తే నాకు కూడా ఆ వ్యాధి సంక్రమిస్తుందేమోనన్న భయం ఎక్కువుగా ఉండడం వల్ల , దానిని పదే పదే తలచుకుంటూ ఆ ఆలోచనకు మనమే శక్తిని ఇస్తాము అది మనకు సంక్రమిస్తుంది.

     కావున జీవితాన్ని ఒక గొప్ప అవకాశంగా, సాహసంగా భావించి అర్థవంతంగా జీవించండి. నిరాశ, నిస్పృహలకు లోనుకాకండి.

     నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను అనే మాటను అనేక సార్లు రోజు స్మరించండి.

    మన అంతర్ ప్రపంచం దేహాన్ని సమతుల్యంలో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగల రక్షణ వ్యవస్థని సిద్ధం చేస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 31 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 31:--అంతర్ ప్రపంచం యొక్క విశిష్టతను తెలుసుకుందాం?

Ans :--
1) బాహ్య ప్రపంచంలో ధ్వని,కాంతి ఎలా ఉన్నాయో అంతర్ ప్రపంచం లో ధ్వని,కాంతి ఉన్నాయి.

2) మన ఆలోచనలు, సూచనలు, సంకల్పాలు, భయాలు, సందేహాలు conscious మైండ్ ద్వారా అంతర్ ప్రపంచానికి చేరి అంతర్ ధ్వని, అంతర్ కాంతి గా మార్పు చెందుతాయి. ఆత్మశక్తే ఈ మార్పును కలుగజేస్తుంది. 

అంతర్ ప్రపంచంలో కలిగిన ఈ మార్పులు బాహ్యప్రపంచం లో భౌతిక సంఘటన గా ప్రకటితం కావడానికి సిద్ధంగా తయారై ఉంటాయి..... సరిపడా శక్తి తీవ్రత, ఫ్రీక్వెన్సీ స్థాయి భౌతిక ప్రపంచానికి సమానమైనప్పుడు, బాహ్య ప్రపంచంలో మన కళ్ల ముందే జీవితానుభవాలుగా మల్చబడతాయి.

3) మన కలలు,ఊహలు చాలా బలమైనవి.వాటికి స్పష్టమైన మైండ్ picture అంతర్ ధ్వని,అంతర్ కాంతి తోడైనప్పుడు ఆత్మశక్తి నుండి బాహ్యప్రపంచం లోకి మన సంకల్పాలు, భయాలు,భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతాయి.

4) భౌతిక పదార్ధం,భౌతక సంఘటన,వాస్తవం పొందే ముందే అంతర్ ప్రపంచంలో వాటి images ఏర్పడి ఆ images  సృష్టించబడతాయి.

5) మన scientists కి,science కి అందని కాంతి తరంగాలు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి.

6) మన సైంటిస్ట్స్ కు ఒక వర్ణపటం(solar spectrum) మాత్రమే తెలుసు.ఈ విశ్వ కాంతి కిరణాలు లెక్కలేనన్ని వర్ణ పటాలు ఉన్నాయి.

7) మన కళ్ళకు భౌతిక పదార్ధం తో కూడిన దేహం మాత్రమే కనబడుతుంది.  మన కళ్ళకు కనిపించని దేహాలు మన భౌతిక దేహంలోనే ఎన్నో వున్నాయి.  ఈ దేహాలను కేవలం మన అంతరేంద్రియాలతోనే పసిగట్టగలం.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 32 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 32:--మహిమాన్విత మైన మన మానవ దేహం గురించి తెలుసుకుందాం?

Ans:--
1)మానవ దేహం ఎన్నో కోట్ల అణువులతో ఏర్పడింది.మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని మనకు తెలుసు,అలానే మన దేహంలోని ప్రతి అణువు తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటుంది.అలానే దేహంలోని ప్రతి భాగం కూడా సామూహిక అణువులతో తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటుంది.మరియు అలానే దేహంలో ఉన్న ఆత్మశకలం యొక్క వాస్తవాన్ని సృష్ఠించడంలో సహకారం అందిస్తుంది.ఈ విధంగా ప్రతి అణువు దాని ఉనికిని కాపాడుకుంటూ దేహవ్యవస్థ మొత్తం చైతన్య శక్తి పరిణామం లో పాలుపంచుకుంటుంది.

2)పరమాణువులు, అణువులతో తయారైన మన దేహం ప్రతిక్షణము తనను తాను పునర్నిర్మాణం చేసుకుంటుంది.క్షణంలో ఎన్నో పరమాణువులు,అణువులు మృతి చెంది వాటి స్థానంలో కొత్త అణువులు పరమాణువులు పడుతున్నాయి.

3)భూమి మీద ఏ ఏ మూలకాలు ఉన్నాయో అన్నీ మన దేహంలో కూడా ఉన్నాయి.అలాగే ఇతర జీవజాతుల్లో కూడా ఉన్నాయి.

4)దేహంలోని జీవకణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పిస్తే జీవకణాలన్నీ అందుకు బదులుగా మన దేహం ఆరోగ్యంగా ఉండాలని సంకల్పిస్తాయి.

5)దేహంలోని జీవకణాలన్నీ తమ సొంత వ్యక్తిత్వాలను కలిగి వుంటూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి.

6)జీవితంలో కొన్ని ప్రత్యేక లక్ష్యాలు సాధించాలని,కొన్ని ప్రత్యేక అనుభవాలు పొందాలని ఆత్మ అంగవైకల్యం తో ఉన్న దేహాన్ని ఎంచుకుంటుంది.అంతేకాని గత జన్మలో చేసిన పాపాలకు శిక్షగా ఈ జన్మ అంగవైకల్యం, అనారోగ్యం సంభవించదు.
ఈ విశ్వంలో ఏ శక్తి ఫలానా జన్మను తీసుకోవాలి అని మనల్ని శాసించదు.

7)మనం ఎరుకలో వున్నప్పుడు ,లేనప్పుడు కూడా మనలో కలిగివున్న నమ్మకాలు,భయాలు వల్ల ప్రతిక్షణము మనం అంతర్ ప్రపంచానికి సూచనలు ఇస్తుంటాం.

8)మనం నమ్మకాలు మార్చుకున్న క్షణమే అనారోగ్యం నుండి ఆరోగ్యానికి ఊబకాయం నుండి తేలిక శరీరానికి బద్ధకం నుండి చురుకుకి మార్పులు మన దేహం చేసుకుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 33 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 33:-- భౌతిక వాతావరణం భూమి మీద ఎలా సృష్టించబడతుంది?

Ans :--
1)మన ఆలోచనలు, ఎమోషన్స్,నమ్మకాలు యొక్క దృశ్యరూపమే భౌతిక వాతావరణం. మన ఆలోచనలకు, ఎమోషన్స్, నమ్మకాలకు భౌతిక పరిస్థితులను తారుమారు చేయగల సామర్ధ్యం ఉంది.  ఇతర జీవజాతులు కూడా ఈ ప్రక్రియ లో తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నాయి.

2) భూమి పైన మన దేహం ఒక ఘనపదార్ధంగా కనిపిస్తుంది. electrons, atoms, molecules గ్రూపులుగా ఏర్పడి జీవకణాలుగా మారి,ఈ జీవకణాలు గ్రూపులుగా మారి దేహంలోని అవయవాలు ఏర్పడ్డాయి.

3) శక్తి యొక్క రూపాంతరమే మన దేహ పదార్ధం.మన దేహంలోని electrons, పరమాణువులు నిరంతరం ఆత్మభ్రమాణం, పరిభ్రమణం చేస్తున్నాయి. ఇవి నిరంతరం కదలుతూ క్రియారూపాన్ని కలిగిస్తూ చైతన్య శక్తితో నడుపబడుతున్నాయి.

4) మనకు మాంసంగా కనిపించే దేహంలో electrons, పరమాణువులు ... ఆత్మభ్రమణం + పరిభ్రమణం వల్ల శక్తి ఉత్పన్నమై అవి శక్తిని నిరంతరం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.

5) బాహ్య వాతావరణం లో కూడా ఇలాగే శక్తి ప్రవాహం, ఇవే molecules, ఇవే electrons ఉన్నాయి.

బాహ్య వాతావరణం లోని పరమాణువులు ,మన దేహ నిర్మాణంలోని పరమాణువులు మధ్య కూడా శక్తి ప్రవాహం నిరంతరం జరుగుతూ ఉంటుంది.

6) మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు బయట గాలి లోపలికి, లోపల గాలి బయటకీ వెళ్తుంటుంది. అలాగే దేహంలోని శక్తి బయట వాతావరణానికి, బయట వాతావరణం లోని శక్తి దేహంలోకి ప్రసరిస్తూ ఉంటుంది.

7) బయట వాతావరణం లో ఉన్న పరమాణువులు మధ్య విద్యుదాయస్కాంత శక్తి రసాయనిక శక్తి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ప్రవాహం లేకపోతే జీవశక్తీ అనేది భూభౌతిక ప్రపంచంలో మనుగడ సాగించలేదు.

8) అంతర్ శక్తి కూడా లోపలికి బయటకు ప్రవహిస్తుంది.మన దేహంలో ఉన్న అడ్రెనలిన్ గ్రంధి దేహాన్ని ఉత్తేజపరచడమే కాకుండా బాహ్య ప్రపంచ వాతావరణం లోకి విద్యుదయస్కాంత శక్తిని వేదజల్లుతుంది.

9) మన ఫీలింగ్స్, emotions నమ్మకాలు దేహంలో హార్మోన్స్ .... రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు బయట వాతావరణం తో అనుసంధానింపబడి ఉంటాయి. పెంపుడు జంతువులు మనం ఎంత దూరంలో ఉన్న అవి మనల్ని పసిగట్టగలవు.

10) దేహంలోని ప్రతి అణువు,పరమాణువు,electron, అన్ని ఆత్మను కలిగి ఉన్నాయి. దేహంలోని అన్ని పరమాణువులు ఉమ్మడిగా చైతన్య పరిణామం చెందుతున్నాయి. అన్ని పరమాణువులు వాటి అంతర్ ప్రపంచంలో అనుసంధానింపబడి ఉన్నాయి.

11) భూమి మీద అన్ని జీవాత్మలు ఉమ్మడి భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తూ చైతన్య పరిణామం చెందుతున్నాయి.

భూమి మీద భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో అన్ని జీవాత్మలు విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 34 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

Q 34:--జంతుజాతి యొక్క విశిష్టత మరియు చైతన్య పరిణామం గురించి తెలుసుకుందాం?

Ans:--
1) జంతుజాతి పరిణామ క్రమంలో భాగంగా ఒక జాతి జంతువు మరో జాతి జంతువును చంపి తినడం జరుగుతుంది.

ఈ ప్రక్రియ ప్రకృతి సమతుల్యంలో ఒక భాగం. కానీ మానవ జాతి చైతన్య పరిణామ క్రమంలో ఒక ప్రాణిని చంపడం వారి చైతన్య పరిణామాన్ని నాశనం చేసుకోవడమే.

2) ఏ జంతువు కూడా తన ఆహార అవసరానికి మించి ఇతర జంతువుల్ని విచక్షణ రహితంగా చంపడం జరుగదు. ప్రకృతి ధర్మాన్ని జంతువులు ఎప్పుడూ పాటిస్తాయి.

3) మన దేహంలోని వైరస్లు,బాక్టీరియా క్రిములు కూడా ప్రకృతి చైతన్య ధర్మాలను పాటిస్తున్నాయి. వైరస్ లు బాక్టీరియా విచక్షణా రహితంగా దేహంలోని జీవకాణాలను చంపుకుంటూ పోతే మన దేహాలు ఎప్పుడో విచ్చిన్నమై ఉండేవి.

4) chromozomes సంఖ్య , జీవకాణాల సంఖ్య రక్తకణాల సంఖ్య ఒక క్రమమైన లెక్క ప్రకారమే దేహంలో ఉంటున్నాయి. వాటి సంఖ్యను గతి తప్పకుండా మన అంతర్ శక్తి నియంత్రిస్తుంది.

5) జంతుజాతిలో జనాభా విపరీతంగా పెరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించడానికి మిగతా జంతువులు వాటిని సంహరించడం జరుగుతుంది. భూమి పైన జంతువులు ఇప్పటివరకు హద్దు మీరలేదు. వాటి చైతన్య పరిణామం సహజంగా,
సవ్యంగా సాగుతుంది.

6) మానవజాతి చైతన్య పరిణామం సరైన రీతిలో ఉండటం లేదు. అందుకే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
అందుకే అధిక జనాభా నియంత్రించడానికి వ్యాధులు, యుద్ధాలు, ప్రకృతి భీభత్సాలు సంభవిస్తున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 35 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 35:--  పూర్ణాత్మ - అంశాత్మ ?

Ans :--
1) మన దేహాన్ని ఒక పెద్ద జీవకణం గా ఊహించుకుందాం,ఆ జీవకణంతో పాటు కొన్ని కోట్ల జీవకణాలు ఆ దేహంలో వుంటూ పరిణామం చెందుతూ ఉంటాయి.

2) ఆ పెద్ద దేహానికి ఆత్మ ఉంది,అలానే పెద్దదేహంలో పరిణామం చెందుతున్న మనకు ఒక ఆత్మ ఉంది. అలానే ఇతర జీవకణాల కు ఆత్మ ఉంది.

3) మన దేహంలో ఉన్న ఏ జీవకణం తన విశిష్టత ను వ్యక్తిత్వాన్ని కోల్పోవడం లేదు. ఆ పెద్ద దేహంలో ఇమిడి ఉన్న ఆత్మలో ఈ జీవకణాల ఆత్మలన్నీ ఇమిడి ఉన్నాయి.

4) పెద్ద దేహంలో ఉన్న ఆత్మ పూర్ణాత్మ అయితే, ఆ జీవకణాలలో ఉన్న ఆత్మలన్నీ అంశాత్మలు.ఇక్కడ జీవకణం,దేహం రెండూ వేరు కాదు రెండూ ఒక్కటే. అలానే పూర్ణాత్మ, అంశాత్మ ఒక్కటే. కానీ దేని వ్యక్తిత్వం దానిదే, దేని విశిష్టత దానిదే.

5) దేహంలోని జీవకాణాలన్నీ తమ స్వతంత్రతను, ఉనికిని
కోల్పోకుండా తాము చైతన్య పరిణామం చెందుతూ పూర్ణాత్మ చైతన్య పరిణామాన్ని పెంచుతున్నాయి.

6) దేహంలో క్షణ కాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతున్నాయి. మళ్ళీ కొత్త జీవకణాలు పుడుతున్నాయి. అలానే మన అంశాత్మలమైన మనం పుడుతూ చస్తూ ఉంటాం. జనన మరణ చట్రాలలో పరిణామం చెందుతూ ఉంటాం.

7)  పూర్ణాత్మ ... అంశాత్మలు సాధించిన ప్రగతితో తాను పరిణామం చెంది ... చైతన్యాన్ని వ్యాకోచింప చేసుకుంటుంది. అలానే అంశాత్మ జ్ఞాన పరంగా ఎదిగితే అంశాత్మ తన చైతన్యాన్ని వ్యాకోచింప చేసుకుంటుంది. అంశాత్మ చైతన్య పరిణామం చెంది అనగా జ్ఞానాన్ని సముపార్జించి ఆచరించి అద్వైతానికి చేరి పూర్ణాత్మగా తయారవుతుంది. అంతే గాని ఏ అంశాత్మ పూర్ణాత్మ తో విలీనం అవ్వడం జరుగదు. జ్ఞాన సముపార్జన వివిధ frequency గల లోకాలలో అంశాత్మలు జన్మ తీసుకుని సంపాదిస్తాయి.

8) మన దేహంలో ఎలా అయితే జీవకణాలు... ఆ జీవకాణాలన్నింటిలో ఆత్మ వుందనుకుంటున్నామో, అలానే
భూమి పైన మానవులు, ఇతర జంతుజాతి, పక్షి జాతి.....etc...  మధ్య సహకారంతో భూమి అనే ఆత్మ చైతన్య పరిణామం చెందుతుంది. అనగా భూమి మీద నివశించే మానవ జాతి ఇతర జంతుజాతి చైతన్య పరిణామం చెందితే పూర్ణాత్మ అయిన భూమి చైతన్య పరిణామం చెందుతుంది. అనగా మన దేహంలో వైరస్ లు బాక్టీరియా ఎలాగో, భూమి పైన మానవులు, ఇతర జంతుజాతులు అలానే.

9) మన దేహంలో కోట్ల electrons, పరమాణువులు, అణువులు, వైరస్ లు బాక్టీరియా లు అన్ని కలిసి వాటి సహకారంతో మన దేహం ఎలా నిలబడుతుందో, అలానే భూమి పైన మానవ జాతి, జంతుజాతి, రాళ్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్ని కలిసి భూమి అనే దేహాన్ని నిలిపివుంచుతున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 36 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 36:--వృద్ధాప్యం

Ans :--
1)భూభౌతిక ప్రపంచంలో మనకు మనమే కొన్ని నైతిక విలువల్ని ఆపాదించుకుని ఆ చట్రంలో ఎన్నో పరిమితులకు లోబడి బ్రతుకుతున్నాము.

2) యవ్వనం అద్భుతమైందని, వృద్ధాప్యం శాపమని, పేదరికం ఆధ్యాత్మిక తకు దగ్గర దారని కొన్ని నమ్మకాలను మనమే ఆపాదించుకున్నాము.

 3) ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని మనకు మనమే సృష్టించుకున్నాం. ఉన్నత చైతన్యం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. కానీ కట్టుబాట్లు అన్ని మానవుడు సృష్టించుకున్నాడు. అనాది కాలం నుండి, ఎన్నో పరిమితులతో నమ్మకపు వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు.

ఎప్పుడైతే ఆ నమ్మకపు వ్యవస్థను చేధిస్తాడో మానవుడు అప్పుడే ఎదుగుతాడు.

3) ఆధ్యాత్మికత యవ్వనంలో అవసరం లేదని, వృద్ధాప్యంలో నే అవసరమని, అమెరికా లో పుట్టడం అదృష్టమని, సోమాలియా లో పుట్టడం శాపం అని ఇలా ఎన్నో నమ్మకాలను పరిమిత జ్ఞానం తో మానవుడు ఏర్పరుచుకున్నాడు.

4) జీవితంలో యవ్వనం,వృద్ధాప్యం రెండు దశలు, రెండు ముఖ్యమే. అమెరికా లో,సోమాలియా లో గాని ఎక్కడ ఏ దేశంలో పుట్టినా భూమి ఒక్కటే. జన్మ తీసుకోక ముందే మన చైతన్య పరిణామానికి అనుగుణంగా, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సంకల్పించి భూమి మీద మానవుడు జన్మ తీసుకుంటాడు.

ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, భూమి మీద అన్ని దేశాలు, ప్రాంతాలు ఒకే స్థితిని కలిగి ఉన్నాయి. అంటే మన దేహంలో ఏ part ముఖ్యం అంటే ఎలా చెప్పగలం. అన్ని భాగాలు ముఖ్యమైనవే. అలానే భూమి అనే దేహంలో అన్ని countries, అన్ని భాగాలు ముఖ్యమైనవే.

5) వృద్ధాప్యం లో ఉన్నవారిని నిరాదరణతో చూడటం, చులకనగా చూడటం, ఇవన్నీ ఆధ్యాత్మిక లోపం వల్ల జరుగుతుంది.

6) దేహం వృద్ధాప్యంలో ప్రత్యేక మైన enzymes, harmones ఆధ్యాత్మికంగా, మానసికంగా అత్యున్నతంగా రాణించడానికి విడుదల చేస్తుంది, మన నమ్మకపు వ్యవస్థ వల్ల వార్ధక్యంలో పొందవలసిన ఆనందం, ఆధ్యాత్మిక పరిణామం చెందలేకపోతున్నాము.

7) యుక్త వయస్సులో వున్నప్పుడు వృద్ధాప్యం గురించి, మృత్యువు గురించి భయపడుతున్నాము. వృద్ధాప్యంలో దేహం తన శక్తిని కోల్పోతుందని, చూపు మందగిస్తుందని, చెవులు వినికిడి శక్తిని కోల్పోతాయని ముందుగానే మైండ్ లో ఊహించుకుని hypnotise చేసుకుంటున్నాము. 

అందువల్ల అదే భౌతిక వాస్తవంగా మనం సృష్టించుకుంటున్నాం, ఎందుకనగా మన ఆలోచనలే మన జీవితం గనుక, యద్భావం తద్భవతి గనుక....
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 37 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 
 
Q 37:-- రాత్రి - పగలు

Ans :--
మన ప్రాచీన నాగరికత ల్లో, రాత్రి చాలా అద్భుతమైంది గా భావించారు. 

రాత్రిళ్ళు ఎక్కువ కాలం చైతన్య పరిణామ వికాసానికి అంతర్ ప్రయాణానికి కేటాయించేవాళ్ళు. 

చైతన్యశక్తి, అంతరశక్తి గురించి పరిశోధన చేసేవాళ్ళు. రాత్రి పరిశోధన, పగలు ఆచరణ.

🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 38 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 38:-- నిద్ర, స్వప్నావస్థ

Ans :--
1)మనకు జాగృదావస్థ కంటే స్వప్నావస్థ ముఖ్యమైనది,స్వప్నావస్థ లో అఖండజ్ఞానం మనకు అందుతుంది, ఈ అఖండ జ్ఞానాన్ని మనం గుర్తు పెట్టుకోవాలంటే 2గంటల నిద్ర మరియు బ్రేక్ తీసుకుని మరల 2 గంటల నిద్ర పోవాలి.దీనివల్ల స్వప్నాలు బాగా గుర్తుంటాయి.

2)8 గంటల నిద్ర దేహానికి గాని,ఆరోగ్యానికి గాని చైతన్య పరిణామానికి గాని ఎటువంటి మేలు చేయదు.

3) 4గంటల నిద్ర జాగృదావస్థ లో మన దేహాన్ని ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంచుతుంది. conscious, subconscious మైండ్ లను అందుబాటులోకి తెస్తుంది.

4) అంతర్వాణి, స్వప్నాల ద్వారా మనకు జ్ఞాన సముపార్జన లభిస్తుంది. 4 గంటల నిద్ర జీవితంలో ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది.

5) దేహంలో కావలసిన హార్మోన్స్, enzymes రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. దేహానికి గల బద్ధకాన్ని మనోశక్తికి గల బద్ధకం వదులుతుంది.

6) conscious మైండ్ easy గా వ్యాకోచం చెందుతుంది.మనోవికాశం పెరుగుతుంది. అంతర్ ప్రపంచం గురించి అవగతమవుతుంది.

7) మనం దేహం మాత్రమే కాదు అపారమైన అంతర్ శక్తితో కూడిన ఆత్మని తెలుస్తుంది. మృత్యు భయం పోతుంది.

8) జంతుజాతిని గమనిస్తే తెలుస్తుంది అవి చాలా తక్కువ నిద్ర పోతాయి. అందుకే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి.

9) మానవులు డాక్టర్స్ ని సృష్టించుకొన్నారు, కానీ జంతువులకు డాక్టర్స్ తో పనిలేదు. జంతువులు వైద్యులు ను సృష్టించుకోలేదు.

10) అంతర్ శక్తి , భౌతిక వాస్తవం గురించి తెలుసుకుంటే డాక్టర్స్ తో పనిలేదు. 2గంటల నిద్ర+ break+ 2గంటల నిద్ర వలన నరాల వ్యాధులు, నాడిమాండల వ్యాధులు, మానసిక వ్యాధులు సంక్రమించవు.

11) మన దేహానికి ఏది సహజమైన ఆహారమో స్పష్టంగా తెలుస్తుంది.

12) రాత్రి సమయంలో ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్య రీత్యా అవసరం.  కానీ మన నమ్మకపు వ్యవస్థ దానికి వ్యతిరేకంగా ఉంది.

13) జంతుజాతులు నిద్రావస్థలో దేహం,మైండ్ కి విశ్రా0తి పొందుతూ చైతన్య శక్తి పరంగా alert గా వుండగలుగుతున్నాయి.ప్రకృతి ప్రళయాలను, ప్రమాదాలను చాలా బాగా పసిగట్టగలుగుతున్నాయి.

14) జాగృదావస్థ లో ఏఏ విషయాలలో రాణించాలో, ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో, మన స్వప్నావస్థ లో తెలియజేయ బడుతుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

15) ఊహాశక్తి, కలలు కనడం, అంతర్ ప్రయాణం, ఇవన్నీ ఇప్పటి సమాజంలో వృధాగా అనిపిస్తుంటాయి. ఇవే ఆత్మ పురోగతికి ముఖ్యమని గుర్తించాలి. సమాజంలో యువతను రెచ్చగొట్టి పోటీతత్వం పెంచుతున్నారు.అవన్నీ అనవసరమైనవి.

🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 39 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 
 
Q 39:--ఆధ్యాత్మిక పురోగతి ?

Ans :
1) జంతువుల్ని వధించడం, వాటి మాంసాన్ని ఆహారంగా భుజించడం ఆధ్యాత్మిక పురోగతికి, చైతన్య పరిణామానికి ఏ మాత్రం సరిపడదు.

2) ఆధ్యాత్మిక పురోగతికి మనమే చొరవ తీసుకోవాలి, ప్రయత్నించందే ఏది మన దరికి చేరదు.

3) మన సంకల్పం కారణమైతే దాని భౌతిక వాస్తవం కార్యం అవుతుంది. మన నోటి నుండి వచ్చే మాటలు, మనస్సు నుండి వచ్చే ఆలోచనలు, దేహం ద్వారా జరిగే చేష్టలు కారణం అయితే వాటి పర్యవసానాలు కార్యం అవుతాయి. 

4) జీవితంలో అన్ని కోణాలను దర్శించి భౌతిక సంఘటనలను జీవితానుభవాలుగా మార్చి చైతన్యశక్తి పరిణామం చెందడానికి జీవాత్మలు గా వివిధ రకాల జన్మలు తీసుకోవడం ?జరిగింది. అంగవైకల్యం తో కొన్ని జన్మలు, దీర్ఘకాలిక వ్యాధులతో కొన్ని జన్మలు తీసుకోవడం జరిగింది. అంతేకాని పాపానికి పరిహారంగా జన్మలు తీసుకోవడం జరగలేదు.

5) జన్మ పరంపర ద్వారా ఆధ్యాత్మిక పురోగతి, చైతన్యశక్తి వికాసం విస్తరిస్తూ ఉంటుంది. తిరోగమనం ఎప్పుడూ ఉండదు. ఒక్కొక్క జన్మ ఆధ్యాత్మిక పరిణితిని పెంచుతుంది.

6) ఆత్మ అనేది మల్టిడిమెన్షనల్ స్వరూపం. ఒక దేహానికి లేదా ఒక లోకానికి పరిమితం కావడం లేదు. అనేక లోకాలలో అన్ని dimensions లో అన్ని దేహాలతో  వుంటూ విస్తరిస్తూ వికాసం చెందుతుంది. ఆత్మ ప్రాచీనమైంది, సనాతనమైంది.

7) ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం ఒక కోణంలో జీవితాన్ని దర్శించి అనుభూతులు పొందుతూ విస్తరిస్తూ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ లోకం తర్వాత లోకం అలా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆనంతకాలం ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.

8) ఆత్మకు positive మరియు negative అనే జన్మలు ,
తక్కువ మరియు ఎక్కువ జన్మలు ఉండవు. అన్ని జన్మలు చైతన్య పరిణామం చెందడం కోసమే.

9) మన జీవితంలో ప్రతి కదలిక ఆధ్యాత్మికతను ప్రభావితం చేయాలి.ఆకర్మణత్వం అనేది ఏ జీవాత్మకు ఉండదు. ప్రతి ఆత్మ కూడా తనను తాను చైతన్య వికాసం చెందించుకోవాలి.

10) ఈ సృష్టిలో జీవాత్మలన్ని విశిష్టమైనవే ఏవి తక్కువగాని, ఎక్కువగాని ఉండవు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power - 40 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 40:-- మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుంది? spiritual cause ఏమిటి?

Ans :--
1) నేను భౌతికంగా, ప్రాపంచికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నాను అనే భావన లేని వారికి మూర్ఛవ్యాధి వస్తుంది. ఇలాంటి భావన మానవులకు లేకపోతే మన దేహానికి మూర్ఛవ్యాధి వస్తుంది.

     ఈ భావన మిగతా ఇతర జీవజాతులుకు కూడా లేకపోతే భూకంపం వస్తుంది.

      మన దేహంలో రక్తనాళాలలో రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో ఈ భూమి అనే దేహంలో గాలి ప్రవాహం, అలా జరుగుతుంది. రక్త ప్రవాహం దేహం లోపల జరుగుతుంది, గాలి ప్రవాహం భూమి అనే దేహం వెలుపల జరుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 41 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 41:-- భూకంపం, అగ్ని పర్వత విస్ఫోటనం ఎలా సంభవిస్తాయి?  

Ans:--
spiritual cause :--
భూమి మీద ఏ ప్రాంతంలో అయితే మానవజాతి ఓర్పు, సహనం లాంటివి నశించి ....పగ, ద్వేషాలతో రగిలి పోతుంటారో అక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 42 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 42:--జల ప్రళయాలు, వ్యాధులు ఎందుకు వస్తాయి? 

Ans :--
spiritual cause:--
జీవితాశక్తి కోల్పోవడం, లైఫ్ ని negative గా తీసుకోవడం కుట్ర,మోసం,దగా,ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో జీవిత విలువలు నశించినప్పుడు జలప్రళయాలు సంభవిస్తాయి.

1) మానవజాతికి సామూహికంగా ఆత్మహత్య ధోరణి ఉన్న ప్రాంతాల్లో జలప్రళయాలు భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి.

2) మానవజాతికి  సామూహిక0గా సహనం నశించినప్పుడు,అశాంతి ప్రబలినప్పుడు,భూప్రపంచ చైతన్య పరిణామంలో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. ఆ సర్దుబాట్లు వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.

3) భూమి మీద ఒక ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు దాని ప్రభావం ఆధ్యాత్మికంగా, మానసికంగా భౌతికంగా, చైతన్య శక్తి పరంగా అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది.

4) నిర్మాణాత్మకంగా గాని వినాశకర0గా గాని ఏ భౌతిక సంఘటన జరిగిన దాని ప్రభావం భూమండలమంతా వ్యాపిస్తుంది.

5) ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా వాటిని మన అంతరేంద్రియాలు ముందుగానే పసిగట్టగలవు.

6) వాతావరణ పీడనం,వాతావరణం పై అయస్కాంత క్షేత్ర ప్రభావం,విద్యుత్ క్షేత్ర ప్రభావం వైరస్,వీటన్నింటిని మన చర్మం స్వతహాగా పసిగట్టగలరు.

7) దేహానికి ఎదురయ్యే వ్యాధులు అంతరేంద్రియాల ద్వారా పసిగట్టి నివారణ పొందే శక్తి సామర్ధ్యాలు మనకున్నాయి.

8) మన దేహంలో రక్త ప్రవాహం మాదిరిగా,భూమి అనే దేహంలో నీరు ప్రవహిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 43 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 43:--కరువుకాటకాలు, ప్రాణాంతక వ్యాధులు, విప్లవాలు ఎందుకు సంభవిస్తాయి?

Ans :-- కరువు కాటకాలు
Spiritual cause:--
ప్రాణం అంటే విలువ లేనిదిగా భావించే ప్రాంతంలో, పగ ప్రతీకారం లాంటి భావనలు వుండే ప్రాంతాల్లో కరువుకాటకాలు సంభవిస్తాయి.

🌻. ప్రాణాంతక వ్యాధులు:--
Spiritual cause:--

1) ఒక ప్రాంతంలో నివసిస్తున్న మానవజాతికి ప్రత్యేకంగా ఆడవారికి ఓర్పు,సహనం నేర్పేందుకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలి అవి లక్షల మందికి సంక్రమించడం జరుగుతుంది. వారికి ఆత్మహత్య ధోరణి గనక ఉంటే వారు మరణించడం కూడా జరుగుతుంది.

🌻. విప్లవాలు :--
Spiritual cause:--

1) మానవ జాతిలో అణిచిపెట్టబడిన emotions, feelings బాహ్యంగా ప్రకటితం అయ్యేందుకు విప్లవాలు సంభవిస్తాయి. 

2) మన భావనలలో కసి,ప్రతీకారం చోటు చేసుకున్నప్పుడు ఆ విప్లవాలు హింసాత్మకంగా మారుతాయి.

3) car engine ఎక్కువ వెడైతే చల్లార్చడానికి నీళ్లు ఎంత అవసరమో మానవ జాతిలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు వాటిని బాలన్స్ చేయడం కూడా అవసరం.ప్రకృతి వైపరీత్యాలు, epedimic diseases ప్రకృతిని సమతుల్యం చేయడానికి వస్తుంటాయి.

4) వీటినే energy baths అంటారు. స్నానంతో మనం దేహాన్ని ఎలా శుద్ధి చేసుకుంటామో, భూమి ప్రకృతి సమతుల్యం చేసుకోవడానికి ప్రళయాలు సృష్టించుకుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 44 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 44:--భూమి, దాని ఆరోగ్యం

Ans :--
1) మన దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలుంటాయో భూమి యొక్క ఆరోగ్యం క్షీణించడానికి అన్ని కారణాలుంటాయి.

2) యుద్ధాలు కూడా ఒకరకమైన వ్యాధులే, మన దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధమనే వ్యాధి కూడా కొంతకాలం తర్వాత నయమవుతుంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో జీవితాన్ని ఎలా గౌరవించాలో ప్రాణం విలువ కూడా తెలుస్తుంది.

3) ప్రకృతి వైపరీత్యాలు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని అనుకుంటాం. కానీ అవి మనలో నిద్రాణమై ఉన్న అంతరశక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని మనమే సృష్టించినప్పటికి దీనివల్ల కొంతజ్ఞానం వస్తుందని అంతరాత్మకు తెలుసు, అందుకే వీటిని సంభవించేలా చేస్తున్నాం.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 45 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 45:-- యుక్త వయస్సులో చనిపోవడం ఎందుకు జరుగుతుంది?

Ans :--
1) వీరు వృద్ధాప్యం పట్ల హీనమైన భావన కలిగివుంటారు.

2) వృద్ధాప్యంలో దేహం శుష్కించిపోయి ఎందుకు దేహం ఉపయోగపడదనే భావనను కలిగివుంటారు.

3) భూకంపం వస్తే చనిపోతాం. accident ఎక్కడన్నా జరిగిందని తెలిస్తే అది మనకు కూడా జరుగుతుందేమోనన్న భయం. 

ఎవరికో ఏదో జరిగితే అది మనకు కూడా జరుగుతుందని భయపడటం ఇలా వారు మరణాన్ని ఆహ్వానిస్తారు.

4) Conscious మైండ్ ఉపరితలంలో అహం వల్ల దీనిని గుర్తించం,కానీ అంతరాలలో ఈ భయాల వల్ల మరణాన్ని ఆకర్షిస్తున్నాం. అదే  భౌతిక వాస్తవం అవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 46 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 46 :-- Time సమయం మల్టీ డైమెన్షన్ అంటే 

A:-- multidimension అంటే అనంతమైన కోణాలలో విస్తరించిన తలాలు అని అర్థం.

1) మన జీవితాన్ని,మన జన్మ పరంపరలకనుగుణంగా(అంటే ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ అలాగ) చూస్తే టైం అనేది మనకు ఏక దిశలో (uni directional) ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా పరిగణించినట్లైతే కర్మ సిద్ధాంతం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ టైం అనేది మన 3d intelligence కి అందే స్థితిలో లేదు.టైం అనేది ఒక భ్రమ.

2) time అనేది multidimensional రాశి. అలానే ఆత్మ కూడా multidimensional.

3) ఆత్మ యొక్క జన్మలు గతం,వర్తమానం,భవిష్యత్తు అన్నీ ఏకకాలంలో ఒకేసారి సంభవిస్తుంటాయి.

4) భూమి మీద మనం జీవించేకాలం ..... కాస్మిక్ టైం స్కేల్ లో చూస్తే ..... దేహంలో ప్రతి క్షణం అణువులు పుడుతూ చస్తూ ఉన్నంత కాలం మాత్రమే. అనగా కాస్మిక్ టైం స్కేల్ ప్రకారం 100 సంవత్సరాల మనం బతికాం అనుకుంటే మన దేహంలో డైలీ పుడుతూ చనిపోతూ ఉన్న అణువులు ఎంత కాలం జీవిస్తున్నాయో అంతకాలం మనం జీవించినట్టన మాట అంటే కనీసం ఒక్క సెకను కూడా జీవించనట్టు.

5) మన అంతర్ ప్రపంచం ఇంటెలిజెన్స్ తో పోలిస్తే మన 3d ఇంటెలిజెన్స్ సముద్రంలో నీటిబొట్టంత.

6) ఏకదిశలో మనం కర్మ తర్వాత జన్మ అని పరిగణిస్తే ఆత్మ ఒక్కొక్క మెట్టు ఎదగాలి. అనగా past లైఫ్ లో 8వ తరగతి పాస్ అయినట్లయితే ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి lessons అనగా జీవిత పాఠాలు పాస్ అవ్వాలి అనమాట.

7) ఆత్మ అనేది multidimensional. ఆత్మ ఒక్క దేహానికే పరిమితం కాదు అని తెలుసుకుంటే ఇక కర్మసిద్ధాంతం వర్తించదు.

8) మన అంశాత్మలు కోటానుకోట్ల లోకాల నుండి గడించిన జ్ఞానం మనం మన అంతరప్రపంచం నుండి ఈ క్షణమే పొందవచ్చు.ఏక కాలంలో అనేక దేహాలతో మనమున్నాము అనే విషయాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ వుంటే multidimensional కోణంలో ఉన్న అవకాశాలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి.

9) సర్వకళలు, సకల శాస్త్రాలు అపరిమితమైన జ్ఞానం,నిరంతర ప్రవాహం వలే అంతర్ ప్రపంచాన్ని చేరుకుంటుంది.అన్ని కళలు, సకల శాస్త్రాలకు సంబందించిన జ్ఞానాన్ని మనం సంకల్పిస్తే ఈ క్షణమే మనం అందుకోగల సర్వ సమర్ధతలను మనం కలిగివున్నాము.

10) multidimensional ఆత్మగా పరిణామం చెందుతున్న మనకు multidimensional రాశి అయిన టైం లో అన్ని జన్మలు ఒకేసారి సంభవిస్తున్నాయి.

11) 🕸 చక్రాన్ని గమనించండి

మధ్యలో dot మన ఆత్మ.
ఆ dot(చుక్క) దెగ్గర నుండి 12 గీతలు ఉన్నాయని ఊహించుకోండి.ఆ బొమ్మలో 7 గీతలు మాత్రమే ఉన్నాయి.
12 గీతలు 12 కాలాలుఅంటే గతకాలం వర్తమానం,భవిష్యత్తు అలాగ
(క్రీస్తుపూర్వం (100bc,110bcఅలాగ) క్రీస్తుశకం (120ac,130ac) అనుకుందాం.

1) ఆ 12 గీతలు మనం తీసుకున్న జన్మలు.గతం,వర్తమానం,భవిష్యత్తు.....ఇలా అన్నీ జన్మలు ఒకేసారి తీసుకుంటున్నాము.అంటే ఆత్మ ఒక్కటే,అంశాత్మ లుగా మనం డాక్టర్ గాను ,engineer గాను,పేదవాడు గాను,దనికుడిగాను,అంగవైకల్యంతో ఇలా అన్ని జన్మలు ఏకకాలంలో తీసుకుని అన్ని అనుభవాలను ఒకేసారి పొందుతున్నాము.అంటే ఆత్మకు అన్ని జన్మల తాలూకు జ్ఞానం ఉంటుంది.

           మనకు సంగీతం నేర్చుకోవాలనిపించింది అనుకోండి. already మన అంశాత్మ వేరే dimension లో సంగీతవిద్వాంసురాలనుకోండి, ఆ జ్ఞానాన్ని మనం మన అంతర్ ప్రపంచం ద్వారా పొందవచ్చు.

12) ఒక గోళాన్ని (🏀)
గమనిద్దాము.
ఈ గోళంలో అనంతమైన గత జన్మలు,అనంతమైన భవిష్యత్తు జన్మలు,అనంతమైన వర్తమానం జన్మలు ఏకకాలంలో ఈ క్షణంలోనే అనంతమైన జన్మలు తీసుకుని ఉన్నాము.అంటే అనంతమైన అనుభవాలు,అనంతమైన జ్ఞానం ఈ క్షణమే మనకు ఉంది అని అర్థం చేసుకోండి.

13) ఒక సైకిల్ చక్రం ఒక దిశలో వెనుకకు ముందుకు మాత్రమే కదలగలదు.ఒక గోళం ఏ దిసలోనైన దొర్లగలదు. అలా ఎన్ని దిశలలోనైన దాని గమనం ఉంటుంది.

     అలా టైం ని మనం ఒక నిర్దిష్ట దిశలో కాకుండా ఏ దిసలోనైన ఉంటుందని అర్థం చేసుకోండి.
ఒక సెకను ని పది లక్షల భాగాలుగా విభజిస్తే ఒక భాగంలోని కాలంలో ఈ విశ్వం లోని మూల చైతన్యం కొన్ని కోట్ల రెట్లు వ్యాకోచం చెంది ఉంటుంది. ఆ కాల వ్యవధిలో కోటానుకోట్ల లోకాలు సృష్టింపబడి ఉంటాయి. ఆ సృష్టి లో ఉన్న అనంతమైన dimensions లో అన్ని లోకాలు చైతన్య పరిణామం చెందుతున్నాయి.ఈ బ్రహ్మాండం లో మనం లీనమయ్యేదంటూ ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 47 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 47:--దైవం ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు?

Ans :--
1) సముద్రంలో కెరటాలు ప్రతి క్షణం కోటానుకోట్ల పడుతుంటాయి, మరల అందులోనే కలిసిపోతుంటాయి. ప్రతి కెరటం యొక్క pattern ప్రత్యేకంగా ఉంటుంది. దేని ప్రత్యేకత దానికుంటుంది.

సముద్రం ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది దాన్ని చూడాలని ఉంది అని ప్రతి కెరటం అనుకుంటుంటుంది. కానీ ఆ కెరటానికి తెలియదు అది ఆ సముద్రంలోని ఉందని. 

అలాగే దేవుడు ఎక్కడ వున్నాడు,ఎలా ఉంటాడు నేను చూడాలి అనుకుంటూ ఉంటాము. సముద్రం ఎలా వుందో అలాగే అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో మనము అలానే ఉన్నాము.

2) ఒక లోకంలో జన్మని కొనసాగించి అనుభవాలు గడించి, మరో లోకంలో జన్మ తీసుకుని అక్కడ అనుభవాలు గడిస్తూ అలా అనంతమైన లోకాలలో మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మన ప్రయాణానికి ముగింపు ఎప్పుడూ ఉండదు.

3) మన పిల్లలకు మనం జన్మ ఇవ్వగలమే కానీ వారికి ప్రాణశక్తి మనం ఇవ్వలేదు. ఆత్మ జన్మ తీసుకునేటప్పుడే ఆనంతమూల చైతన్యం నుండి ప్రాణశక్తి పొందుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️

🌹. మనోశక్తి  - Mind Power  - 48 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 48:-- మనం చేసే కర్మలు ఎలా వాస్తవం పొందుతాయి?

Ans :--
1) మనం పుస్తకం చదివేటప్పుడు ఫోన్ రింగ్ అయ్యిందనుకోండి, మన ఫ్రెండ్ 5 గంటలకు కలుస్తానన్నాడనుకోండి,
అప్పుడు మన మైండ్ లో ఆలోచనలు మొదలవుతాయి.

ఆలోచన 1:-కలవనని చెప్పి ఇంట్లోనే ఉందాం అనుకోవడం.

ఆలోచన 2:--కలవనని చెప్పి షాపింగ్ గాని లేదా ఇంకో పని చేయడం.

ఆలోచన 3:--కలుస్తానని చెప్పి కలవడం.
ఇప్పుడు 3 ఆలోచనలు ఒకే చైతన్య ధర్మాన్ని కలిగివున్నాయి.

ఒకే frequency తో ఉన్నాయి.భౌతిక వాస్తవంగా రూపాంతరం చెందగల శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. మూడింటిలో ఒకదాన్ని ఎంచుకుని దానివైపు చైతన్య శక్తిని కేంద్రీకరించడం వల్ల ఒక్క ఆలోచన మాత్రమే భౌతిక వాస్తవం పొందుతుంది. మనం ఒక ఆలోచననే ఎంచుకుని దానివైపు emotions, ఫీలింగ్స్, విశ్వాసం బలంగా కేంద్రీకరించడం వల్ల మన ఆలోచనల తాలూకు విద్యుదయస్కాంత శక్తి ఆ ఆలోచన వైపు ప్రవహించి 3d తలంపై ప్రవేశించింది.  మిగతా రెండు ఆలోచనలు సంభావ్యత తలాలు (probable worlds)లోకి ప్రవేశించి అక్కడ వాస్తవం చెందుతాయి. ఒక ఆలోచన భౌతిక వాస్తవం చెందడం ఎంత నిజమో, 
మిగతా రెండు ఆలోచనలు కూడా సంభావ్యత తలాల్లో వాస్తవం చెందుతాయి అన్నది కూడా అంతే నిజం.

2) మన మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు ఎటువంటి పరిస్థితుల్లో నశింపబడవు.
ఎందుకంటే అవి విద్యుదయస్కాంత 
తరంగాలు గనుక.

3) మనం ఒక తలంలో cricketer,గా ఒక తలంలో రోగిగా, ఒక తలంలో business man గా, అలా ఆత్మ వివిధ లోకాలలో వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంటుంది.

4) చైతన్య పరిణామం చెందడానికి ఎన్ని combinations, అయిన ఎన్ని probabilities అయిన ఎంచుకోగలదు.

5) ఆత్మ భూమి మీద అనేక శకలాలుగా విడిపోయి ఒక చోట ధనికుడిగా, ఒక చోట పేదవాడిగా, ఒక చోట స్త్రీగా, ఒక చోట పురుషుడిగా, ఒకచోట డాక్టర్ గా, ఒక చోట pastorగా, వివిధ దేహాలతో ఉంటుంది.

     ఒక నది అనేక పాయలుగా చీలి, అనేక చోట్ల ప్రవహిస్తుంది అలాగే ఆత్మ అనేక శకలాలుగా విడిపోయి అనేక జీవాత్మలు గా జన్మలు తీసుకుంటుంది. ఈ ఆత్మశకలాలన్నింటి మధ్య telepathy ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది.

6) మనం మేలుకొని వున్నప్పుడు మన దృష్టి అంతా భౌతిక విషయాలపై ఉండడం వల్ల ఆత్మ ధరించిన ఇతర దేహాలు గురించి తెలుసుకోలేక పోతున్నాము.

7) స్వప్నాలు,అంతర్ ప్రయాణం,ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. మన నుండి విడిపోయిన ఆత్మ శకలాలన్నింటిలో ఎదైన ఆత్మ ఆత్మ పురోగతి సాధించితే మనం దానిని telepathy ద్వారా గ్రహిస్తాం.
🌹 🌹 🌹 🌹 🌹


🌹. మనోశక్తి  - Mind Power  - 48 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

Q 48:-- మనం చేసే కర్మలు ఎలా వాస్తవం పొందుతాయి?

Ans :--
1) మనం పుస్తకం చదివేటప్పుడు ఫోన్ రింగ్ అయ్యిందనుకోండి, మన ఫ్రెండ్ 5 గంటలకు కలుస్తానన్నాడనుకోండి,
అప్పుడు మన మైండ్ లో ఆలోచనలు మొదలవుతాయి.

ఆలోచన 1:-కలవనని చెప్పి ఇంట్లోనే ఉందాం అనుకోవడం.

ఆలోచన 2:--కలవనని చెప్పి షాపింగ్ గాని లేదా ఇంకో పని చేయడం.

ఆలోచన 3:--కలుస్తానని చెప్పి కలవడం.
ఇప్పుడు 3 ఆలోచనలు ఒకే చైతన్య ధర్మాన్ని కలిగివున్నాయి.

ఒకే frequency తో ఉన్నాయి.భౌతిక వాస్తవంగా రూపాంతరం చెందగల శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. మూడింటిలో ఒకదాన్ని ఎంచుకుని దానివైపు చైతన్య శక్తిని కేంద్రీకరించడం వల్ల ఒక్క ఆలోచన మాత్రమే భౌతిక వాస్తవం పొందుతుంది. మనం ఒక ఆలోచననే ఎంచుకుని దానివైపు emotions, ఫీలింగ్స్, విశ్వాసం బలంగా కేంద్రీకరించడం వల్ల మన ఆలోచనల తాలూకు విద్యుదయస్కాంత శక్తి ఆ ఆలోచన వైపు ప్రవహించి 3d తలంపై ప్రవేశించింది.  మిగతా రెండు ఆలోచనలు సంభావ్యత తలాలు (probable worlds)లోకి ప్రవేశించి అక్కడ వాస్తవం చెందుతాయి. ఒక ఆలోచన భౌతిక వాస్తవం చెందడం ఎంత నిజమో,
మిగతా రెండు ఆలోచనలు కూడా సంభావ్యత తలాల్లో వాస్తవం చెందుతాయి అన్నది కూడా అంతే నిజం.

2) మన మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు ఎటువంటి పరిస్థితుల్లో నశింపబడవు.
ఎందుకంటే అవి విద్యుదయస్కాంత
తరంగాలు గనుక.

3) మనం ఒక తలంలో cricketer,గా ఒక తలంలో రోగిగా, ఒక తలంలో business man గా, అలా ఆత్మ వివిధ లోకాలలో వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంటుంది.

4) చైతన్య పరిణామం చెందడానికి ఎన్ని combinations, అయిన ఎన్ని probabilities అయిన ఎంచుకోగలదు.

5) ఆత్మ భూమి మీద అనేక శకలాలుగా విడిపోయి ఒక చోట ధనికుడిగా, ఒక చోట పేదవాడిగా, ఒక చోట స్త్రీగా, ఒక చోట పురుషుడిగా, ఒకచోట డాక్టర్ గా, ఒక చోట pastorగా, వివిధ దేహాలతో ఉంటుంది.

     ఒక నది అనేక పాయలుగా చీలి, అనేక చోట్ల ప్రవహిస్తుంది అలాగే ఆత్మ అనేక శకలాలుగా విడిపోయి అనేక జీవాత్మలు గా జన్మలు తీసుకుంటుంది. ఈ ఆత్మశకలాలన్నింటి మధ్య telepathy ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది.

6) మనం మేలుకొని వున్నప్పుడు మన దృష్టి అంతా భౌతిక విషయాలపై ఉండడం వల్ల ఆత్మ ధరించిన ఇతర దేహాలు గురించి తెలుసుకోలేక పోతున్నాము.

7) స్వప్నాలు,అంతర్ ప్రయాణం,ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. మన నుండి విడిపోయిన ఆత్మ శకలాలన్నింటిలో ఎదైన ఆత్మ ఆత్మ పురోగతి సాధించితే మనం దానిని telepathy ద్వారా గ్రహిస్తాం.
🌹 🌹 🌹 🌹 🌹


🌹. మనోశక్తి  - Mind Power  - 49 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

Q 49:-- సంభావ్య ఆత్మలు, ప్రత్యామ్నాయ ఆత్మలు, సమాంతర ఆత్మలు అంటే ?

Ans :--
1) మన ఆలోచనల ద్వారా మనం 3 రకాల ఆత్మలను సృష్టిస్తాము.

1) సంభావ్య ఆత్మ (probable soul)
2) ప్రత్యామ్నాయ ఆత్మ(alternate సోల్)
3) సమాంతర ఆత్మ(parallel soul)

1) సమాంతర ఆత్మ :--
భూమి frequency కి సరిపోయే ఇతర తలాలను parallel వరల్డ్స్ అంటారు. ఆత్మ భూమి మీద లేదా భూమికి సరిపోయే ఇతర frequency ఉన్న ఇతర లోకాలలో కూడా జన్మ తీసుకుంటుంది. దానిని సమాంతర ఆత్మ అంటారు.

ఆత్మ అనేక dimensions లో అంటే వివిధ లోకాలలో సంభావ్య ఆత్మలుగా,
సమాంతర ఆత్మలుగా ప్రత్యామ్నాయ ఆత్మలుగా జన్మలు తీసుకుంటూ చైతన్య పరిణామం చెందుతుంటుంది.

2) సంభావ్య ఆత్మలు సంభావ్య లోకాలలో, ప్రత్యామ్నాయ ఆత్మలు ప్రత్యామ్నాయ లోకాలలో, సమాంతర ఆత్మలు సమాంతర లోకాలలో జన్మ తీసుకుంటాయి.

3) మన భూమికి కూడా సంభావ్య భూలోకమూ, ప్రత్యామ్నాయ భూలోకమూ, సమాంతర భూలోకమూ ఉన్నాయి.

4) మనము భూమి మీద సంగీతం నేర్చుకుంటున్నాము. సంభావ్య లోకంలో డాన్స్ నేర్చుకుంటున్నాము. అలాగ ఒక్కో తలంలో ఒక్కో కళను అభ్యసిస్తున్నాము. అన్ని కళలు శాస్త్రాలకు సంబందించిన జ్ఞానం మన చైతన్యశక్తి అనే internet ద్వారా నేర్చుకొంటూ telepathy ద్వారా పంచుకుంటాము.

5) భూమి మీద 3d కళలు,3d శాస్త్రాలు ఉన్నాయి. కానీ కోటానుకోట్ల లోకాలలో కోటానుకోట్ల కళలు ఉన్నాయి. వివిధ dimensions లో ఆ frequency కి తగ్గట్లు మనకు వివిధ దేహాలు ఉన్నాయి.

అక్కడ ఆ లోకాలలో లెక్కలేనన్ని కళలను అభ్యసిస్తున్నాము. ఇదంతా అంతర్ ప్రపంచం నుండి కమ్యూనికేషన్ జరుగుతుంది.

6) మన కర్మలన్నింటికి మనమే బాధ్యత వహించాలి. అనగా ఆలోచనలన్నింటికి మనమే బాధ్యత వహించాలి.

7) మన ఆలోచనలకు అనుగుణంగా సంభావ్య దేవుళ్లను కూడా మనమే సృష్టించాము.

8) దేవుడు సర్వశక్తిమంతుడు,
ఆయనకు అనేక గుణాలుంటాయని విశ్వసించడం వలన సంభావ్య దేవుడు ఒకానొక సంభావ్య లోకానికి చేరి అక్కడ చైతన్య పరిణామం చెందుతుంటాడు.

9) మనం భూత, ప్రేత,
పిశాచాలను నమ్మినట్లైతే సంభావ్య భూత, ప్రేత పిశాచాలు సంభావ్య లోకాలలో వాస్తవం పొంది అక్కడ మనుగడ సాగిస్తుంటాయి.
వినాశకర ఆలోచనలు గాని, నిర్మాణాత్మక ఆలోచనలు గాని అన్నీ మన నుండే సృష్టింపబడతాయి.

10) మనం drawing నేర్చుకోవాలనుకున్నాము మనం సంభావ్య లోకంలో మన అ0శాత్మ అందులో నైపుణ్యం సంపాదించిందనుకోండి. మనం మన అంతర్ ప్రపంచం నుండి సంగ్రహించడం జరుగుతుంది.

మనం ఒక లక్ష్యం ఏర్పరుచుకుంటే దానికి సంబంధించిన నైపుణ్యమే సంగ్రహించడం జరుగుతుంది. వేరే ఆలోచనల నైపుణ్యం సంగ్రహించలేము.

కావున లక్ష్యం ఏర్పరుచుకోవడం నేర్చుకోండి. లక్ష్యం లేనిదే ఎదుగుదల అసంభవం.
🌹 🌹 🌹 🌹 🌹


🌹. మనోశక్తి  - Mind Power  - 50 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

Q 50:--    God దైవం అంటే?

Ans :--
1) ఈ విశ్వం అనంతమైంది,
కోటానుకోట్ల galaxies ఈ విశ్వంలో ఉన్నాయి,.

ఒక్కొక్క galaxy లో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడిగా పరిగణింప బడుతుంది. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు కలిపి ఒక సౌరకుటుంబం అంటారు. అలా కోటానుకోట్ల సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు ఏ మాత్రం అందదు

2) ఇనుముని పరిశీలిస్తే ఇనుము ఘనరూపంలో, ద్రవరూపంలో వాయురూపంలో ఉంటుంది. అంటే frequency  పెరిగే కొద్దీ సాంద్రత
పెరుగుతుంది. అలాగే higher frequency లోకాలు అందుకే కనపడవు. ఎలా అయితే వాయువును మనం చూడలేమో అలానే ఉన్నత లోకాలను మనము చూడలేము.

భూమి మీద కూడా ఎన్నో కనపడని higher frequency లోకాలు ఉన్నాయి ఉదాహరణకు శంబాల. అలా మన సౌర వ్యవస్థలో కనపడని ఎన్నో higher frequency లోకాలు ఉన్నాయి.

3) దైవము మానవ రూపంలో ఉంటాడని మహిమాన్విత శక్తి ఉంటుందని లోకసంరక్షకుడు అంటారు. అలా మనం 3d తలమైన భూమికి మాత్రమే అన్వయించు కుంటున్నాము. మన మనస్సులో వుండే భావాలకు అనుగుణంగా దేవుడిని ఊహించుకుంటున్నాము.

4) ఆయన దీనజన బాంధవుడని, పాహిమాం అని ఆర్తనాదాలు చేస్తే కాపాడుతాడని భ్రమ పడుతుంటాము. పాపాత్ములని శిక్షిస్తాడు, భక్త వత్సలుడు భక్తుల కోర్కెల్ని తీరుస్తాడని  అనుకుంటాము .

ఆయన నిర్గుణుడు. ప్రార్థనలు ద్వారా భజనలు ద్వారా పూజల ద్వారా ప్రసన్నుడవుతాడు, ఇలా మనం మానవుడి గుణాలన్నింటిని దేవునికి ఆపాదిస్తుంటాము.

5) మన ఆత్మను పరిశీలిస్తే ఆత్మ ఎన్నో లోకాలలో ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంది. మరి 3d తలంలో మానవుని నిర్వచనాలకు దేవుడికి వర్తిస్తాయా ఒక్కసారి ఆలోచించండి.

6) ఈ విశ్వంలో కోటానుకోట్ల లోకాలున్నాయి అనంత బ్రహ్మా0డ విశ్వాన్ని మహాసముద్రంతో పోలిస్తే నీటి బొట్టంత పరిమాణం కూడా లేని భూమి మీద ఉండే మానవ జాతి నిర్వచనాలకు దైవము అందుతాడా.

7) ఈ విశ్వాన్ని భూగోళంతో పోలిస్తే గుండు సూది మోనంత కూడా లేని భూమిలో నివసించే మానవుని యొక్క భక్తి పారవశ్యానికి దాసోహమవుతాడా దేవుడు ఆలోచించండి.

8) మన ప్రార్ధనలకు పూజలకు సంతోషిస్తాడా, కోటానుకోట్ల లోకాలలో కోటానుకోట్ల రకాల జీవరాసులున్నాయి. మరి వాటి సంగతేంటి.

9) పాపాత్ములని శిక్షిస్తాడు అంటున్నాము మరి దేవుడికి మానవుని గుణాలు ఉండాలి కదా.

10) అనంత బ్రహ్మా0డ విశ్వంలో కూసంత కూడా లేని భూమి మీద ఉండే మానవుని రూపంలో దేవుడుంటాడు  అనేది ఆధ్యాత్మిక లోపం వల్లనే మసనవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు.

11) దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించివున్నమూలచైతన్యం.

12) దేవుడంటే పురుషుడు కాదు,స్త్రీ కాదు,దేవుడంటే శక్తిస్వరూపం, కోటానుకోట్ల లోకాలు, ఆ లోకాలలో ఉన్న జీవాత్మలు అన్నీ దైవమే.

13) దైవము కోటానుకోట్ల గుణాలతో చైతన్య పరిణామం చెందుతూ తనను తాను విస్తరించుకుంటూ ఉంది.

14) అనంత బ్రహ్మాండ మైన మూలచైతన్యం అనంతమైన గుణాలను అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంది.
🌹 🌹 🌹 🌹 🌹


Prasad Bharadwaj, [02.07.20 16:44]
🌹. మనోశక్తి  - Mind Power  - 51 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

Q 51:-- మూల చైతన్యం - 1

Ans :--
రాళ్లు, కొండలు, పర్వతాలు, గ్రహాలు, galaxies అన్నిటికి ఆత్మ ఉంది. విశ్వమంతా ఆవరించి ఉన్న ఆత్మయే అనంత బ్రహ్మాండ మూలచైతన్యం.

1) భూమి మీద ఒక వ్యక్తి చైతన్య పరిణామం చెందినా విస్తరించిన, కదలిక ఏర్పడిన దాని ప్రభావం మూలచైతన్యంలో multidimensional కోణాలతో అనంత దిశలు ప్రతిస్పందిస్తుంది.

2) ప్రతి సెకనులో పది లక్షల వంతు సమయంలో మూలచైతన్యం అనంతమైన combinations అనంతమైన సంభావ్యతలతో అనంత రూపాలతో అనంత దేహాలతో తనను తాను సృష్టించుకుంటుంది. ఈ అనంత తత్వాన్ని దర్శించాలంటే అంతర్ ప్రయాణం, ధ్యానం ఒక్కటే మార్గం.

3) భూమి, భూమి పైన నివసించే మానవజాతి జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు ఉన్నాయి.

for ex:-మనం అమెరికా నుండి ఇంగ్లాండ్ వెళ్ళడానికి లెక్కలేనన్ని మార్గాలను ఎంచుకోవచ్చు.

రోడ్ ద్వారా గాని,జల మార్గం ద్వారా గాని, ఆకాశమార్గం ద్వారా గాని ఎన్నో సంభావ్యతలును  ఎంచుకుంటాము. మనం ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మన వాస్తవం అవుతుంది.

కానీ మన అంతర్ ప్రపంచం ద్వారా అనంతమైన సంభావ్యత లు ఎంచుకుని చైతన్య పరిణామం ఏకకాలంలో పొందుతున్నాము.  మనం  చైతన్య పరిణామం చెందాలంటే ఈ క్షణమే అనంతమైన సంభావ్యత లు కలిగివున్నాము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 75 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 72 :-- పునర్జన్మ vs స్త్రీపురుషులు 🌻

Ans :--
గతజన్మల చైతన్య పరిణామం జాగృదావస్థ లో మనకు ఎరుకలో ఉండదు.కానీ అనుభూతులు అంతర్ ప్రపంచంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

2) ఆత్మ ఇప్పుడు పురుష జన్మ తీసుకుని ఉందనుకోండి, ఆ ఆత్మ విచక్షణ కోల్పోయి స్త్రీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందనుకోండి, అచేతనా స్థితిలో మనలో దాగి ఉన్న స్త్రీ జన్మ తాలూకూ చైతన్య శక్తి మనల్ని నియంత్రించడం జరుగుతుంది. అచేతనా స్థితిలో పురుషుడు స్త్రీ మూర్తిత్వ చైతన్యశక్తి వైపు గుంజబడతాడు. మరో వైపు చేతనావస్థలో పురుష జన్మ తాలూకూ చైతన్యశక్తి సంఘర్షణ వైపు గుంజబడుతుంది. ఈ సంఘర్షణ ద్వారా వచ్చే ఆలోచనలతో భౌతిక సంఘటనలు ఏర్పడతాయి.

3) చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మకు ప్రారంభదశలో లింగవిభజన తో కూడిన జన్మలు అవసరమవుతాయి. జన్మ పరిసమాప్తి పొందే దశలో లింగ విచక్షణ మటుమాయమవుతుంది. రాగద్వేషాలకు భూభౌతిక వాసనలకు వ్యామోహాలకు అతీతమైన స్థితిలో వుంటారు.

4) ఆఖరి జన్మలో స్త్రీ అయిన పురుషుడు గా జన్మించినా రెండు ఒక్కటే.ఆఖరి జన్మల్లో స్త్రే పురుష చైతన్య శక్తి ధర్మాలు రెండు కలిసిపోతాయి.

5) ఆఖరి జన్మల్లో ఉంటే సకల ప్రాణికోట్ల పట్ల ప్రేమ అనురక్తి ఉంటుంది. సకల జీవజాతులు పట్ల రాగద్వేషాలు మటుమాయమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/Jul/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: one or more people
🌹. మనోశక్తి  - Mind Power  - 76 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 70 :--పునర్జన్మ vs కుమారుడు 🌻

Ans :--
గత జన్మలో శత్రువు ఈ జన్మలో కుమారుడిగా లేదా కుమార్తె గా జన్మిస్తుంది. వీరు ప్రేమ సృజనాత్మకత జీవితం విలువలు ఆధ్యాత్మికతను గురించి జ్ఞాన సముపార్జన చేస్తారు.

2) మన ఎమోషన్స్ మనకు బంధాలను కలుగజేస్తాయి.

ఒకవేళ ఈ జన్మలో ఒక వ్యక్తితో emotional గా బంధాన్ని కొనసాగిస్తే దాని గురించిన dynamics అర్థం చేసుకోకుండానే మరణిస్తే తర్వాతి జన్మలో కూడా అదే బంధాన్ని కొనసాగించి ఆ dynamics పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక emotion ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.

ఆ ఎమోషన్ ని కొనసాగించడానికి ఆ వ్యక్తినే ఎంచుకోవచ్చు లేదా అదే frequency ఉన్న మరో వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం విస్తారంగా పెరిగినపుడు emotion పరంగా పెంచుకున్న బంధాల సంకెళ్ళు అన్నీ పటాపంచలు అవుతాయి.

ఇంక ఎమోషన్స్ కోసం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ప్రతి ఆత్మ జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలకు భోదించకుండా వారిని ఆత్మజ్ఞానులు చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరుగదు. 

ప్రస్తుతం భూమి మీద ఎవరైతే విరివిగా ఆత్మజ్ఞానం భోదిస్తున్నారో వారందరు ఆఖరిజన్మల్లో ఉన్నారని సేత్ తెలియజేస్తున్నారు. ఎమోషనల్ గా బంధాన్ని పూర్తిగా ఆస్వాదించి దాని dynamics అధ్యయనం చేయడానికి కవల పిల్లలుగా జన్మిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Aug/2020

------------------------------------ x ------------------------------------

No photo description available.
🌹. మనోశక్తి  - Mind Power  - 77 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 73 :-- Code language (కోడ్ లాంగ్వేజ్) 🌻

Ans :--
1) onion కి అనేక పొరలున్నట్లే మన దేహం కూడా అనేక పొరలను కలిగి ఉంది.

ఇప్పుడు మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నా స్త్రీగాగాని, పురుషుడుగగాని గతజన్మలకు సంబందించిన దేహాలు ఆ జన్మలలో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ లాంగ్వేజ్ అనగా విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంతర్ శక్తిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మనం ఆ దేహాలను ఆ కోడ్ లాంగ్వేజ్ ని అంతరేంద్రియాల ద్వారా దర్శించే వీలుంది.

2) ఇప్పుడు మనం ధరించి ఉన్న దేహం యొక్క genetic నిర్మాణం గత జన్మల్లో మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి ఉంటుంది. మన దేహంలోని జీవకణాలన్నీ అనేకానేక జన్మల్లో పొందిన జ్ఞానాన్నంతటిని కోడ్ లాంగ్వేజ్ రూపంలో దాచుకుని ఉన్నాయి.

3) ఉల్లిపాయను గమనిద్దాం, ఉపరితలం లో ఉన్న పొర మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపల పొరలు కనిపించవు. ఉల్లిపాయకు ఉన్న ప్రతి పొరలో విద్యుదయస్కాంత శక్తి,జీవరసాయినిక శక్తి ఉండటం వల్ల ఉల్లిపాయకు ఒక ఆకారం ఏర్పడింది. ఉల్లిపాయకు గల రుచి,దాని ఘాటు వాసనలు దానిలో ఉన్న చైతన్య శక్తి వల్ల వచ్చింది. 

అలాగే వర్తమానంలో మనకు దేహం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అనేకానేక జన్మలలోని దేహాలు అదృశ్యపొరలు వలె మన దేహంలోనే ఇమిడి వున్నాయి .ఈ దేహాలన్నీ చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి.

4) అనేకానేక జన్మల్లో ధరించిన దేహాలు ఆధ్యాత్మిక జ్ఞానం చైతన్య పరిణామం అంతా ఆత్మశక్తి కి వారసత్వంగా సంక్రమిస్తుంది.

5) మనం అనారోగ్యం తో ఉన్నామనుకోండి,గత జన్మలో మన ఆరోగ్యకరమైన దేహం యొక్క జెనెటిక్ కోడ్ లాంగ్వేజ్ ని ప్రస్తుత దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

6) ఈ జన్మలో మనకు ధైర్యం లేదనుకోండి,గత జన్మలో ధైర్యవంతుడిగా మనం పొందిన అనుభవాల ద్వారా ధైర్యాన్ని మనకు మనమే ప్రాప్తించుకోవచ్చు.

7) ఈ కోడ్ లాంగ్వేజ్ transfer చేసుకోవడానికి స్వప్నాలు,అంతర్ ప్రపంచం మనకు ఉపయోగపడతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person, standing
🌹. మనోశక్తి  - Mind Power  - 78 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 75:-- మానవుడు vs జంతుజాతి 🌻
Ans :--
1) భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవజాతిని వేర్లుగానూ, ఇతర జీవజాతుల్ని చెట్టులోని ఇతర భాగాలతో పోల్చవచ్చు.

2) చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా ఆ బాధ చెట్టంతా భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరుని నరికి వేసిన చెట్టుకి నష్టం వాటిల్లుతుంది.

3) భూమి మీద మానవుడు నేటి సమాజంలో అగ్రభాగాన వున్నాడు, అలాగని అతడికి భూమి మీద ఏ జీవజాతిని చంపే అధికారం లేదు.
మానవుడు ఏ జీవాత్మ ను చంపినా భూమి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ ని అందుకోలేడు.

4) జీవహింసకు పాల్పడేవాడు దేవుని మార్గంలోకి ప్రవేశించలేడు, మనం ఒక జీవాత్మను చంపితే మనల్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.

5) జీవహింస వల్లే మతవిద్వేషాలు యుద్ధాలు పేరిట మానవజాతి ఒకరిని ఒకరు చంపుకుంటుంది. అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడిదే. 
ఎప్పుడైతే మానవుడు జీవహింస మానివేస్తాడో అప్పుడే పురోగతి ని సాధిస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 79 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 76:--telepathy 🌻

Ans :--
1) కుక్క, పిల్లి, ఆవు ఇలా కొన్ని పెంపుడు జంతువులు మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాల్ని పసిగట్టగలవు.

2) పసిపిల్లలు, పెంపుడు జంతువులు telepathy ద్వారా ప్రతి రోజు సంభాషించుకుంటాయి.

3) మానవజాతి సహజ ప్రవృత్తి లోకి మారాలి.
మానవజాతి, జంతుజాతి పరస్పర సహకారంతో చైతన్య పరిణామం చెందవలసి ఉంది.

4) వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్ని మన దేహం పసిగట్టగలుగుతుంది.మనం గమనిస్తే ఇది మన మైండ్ ద్వారా జరుగుతుంది అని గుర్తించవచ్చు. అలానే మానవుల ఆలోచనా తరంగాల్ని జంతువులు, వృక్షాలు ఇతర వస్తువులు ఫీలింగ్స్ ని కూడా మన మైండ్ పసిగట్టగలదు.

5) మన మైండ్ ఆలోచనా తరంగాల్నే కాదు ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలు కూడా పసిగట్టగలదు.

6) మన ఇంట్లో ఉన్న chair, table కూడా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనల్ని పసిగట్టగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

05/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: text that says "Brahmanda 1) Satya-loka 2) Taparloka 3) Jana-loka 4) Mahar-loka 5) Svar-loka 6) Bhuvar-loka Cancer 7) Bhür-loka Shuvario Rudras Aries, c Dyuloka Capricorm Libra 8) Atala-loka 9) Vitala-loka 10) Sutala-loka 11) Talatala-loka 12) Mahatala-loka atala 13) Rasatala-loka 14) Patala-loka"
🌹. మనోశక్తి - Mind Power - 80 🌹
Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 1 🌻
(system of solar spectrum)

Ans :--
1) సౌరవ్యవస్థ అనగా సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు అని అర్థం.

ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట్ల సౌరవ్యవస్థలు ఉన్నాయి. అందులో మానవుడు ఒక సౌరవ్యవస్థ ను మాత్రమే కనుగొన్నాడు.

2) ఒక సౌరవ్యవస్థకు సంబంధించిన కొన్ని లక్షల వర్ణవ్యవస్థలను మన అతీంద్రియాల ద్వారా మనం చూడవచ్చు.

3) ఒక సౌరవ్యవస్థ లో విద్యుదయస్కాంత తరంగాలు ఒక range లో ఉంటాయి. మనము ఇతర జంతుజాతి ఒక సౌరవ్యవస్థలో ఒక range లో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్నాము.

4) వేరే range లో,వేరే విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్న జీవజాతులు,వాటి దేహాలు మనకు కనిపించవు. మానవుడు కనిపెట్టిన ఏ శాస్త్రపరికరాలు వాటిని పసిగట్టలేవు.

5) భూమి యొక్క చైతన్యశక్తి range ని బట్టి భూమిపై జీవించే జీవరాసులు, వాటి అణువుల నిర్మాణం, కాంతి విలువలు ఉంటాయి.

6) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థలో ఒక్కొక్క range కి తగ్గ విద్యుదయస్కాంత తరంగాల వలయాలు ఉంటాయి.

7) ఒక్క భూమి మీదే కొన్ని కోట్ల సౌరవర్ణవ్యవస్థలు వున్నప్పుడు ఒక galaxy లో ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇది మన మానవుని ఇంటెలిజెన్స్ కి అందేది కాదు.

8) ఒక సౌరవర్ణవ్యవస్థ లో ఈ వ్యవస్థ కు తగ్గట్టు చైతన్యశక్తి,కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఎలా అయితే ఇండియాలో ప్రతి స్టేట్ కి language ఉన్నట్లు, అలాగే ప్రతి లోకానికి దానికి సంబంధించి లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లోకానికి సంబంధించిన information అంతా code language రూపంలో ఆకాశిక్ record లో పొందుపరచబడి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

06/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: text that says "SELVAGE"
🌹. మనోశక్తి - Mind Power - 81 🌹
Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 2 🌻
(system of solar spectrum)

9) మనం ధ్యానం ద్వారా మన frequency ని పెంచుకున్నప్పుడు ఇతర సౌరవర్ణవ్యవస్థ లోకి ప్రయాణించవచ్చు. అక్కడి జ్ఞానాన్ని కూడా మనం సంగ్రహించవచ్చు.

10) మనం ఇతర సౌరవర్ణవ్యవస్థ లోకి ప్రయాణించగలిగితే మానవ చైతన్య పరిణామం స్థాయి పెరిగినట్లే.

11) మన భూలోకం range 10 నుండి 1000 వరకు ఉందనుకోండి. మానవజాతి బుద్ధి వికాసం చెందినట్లైతే మన చైతన్యశక్తి విస్తరిస్తుంది, అప్పుడు మన సౌరవర్ణవ్యవస్థ యొక్క range (10 నుండి 7000)వరకు పెరుగుతుంది. అప్పుడు ఆ లోకంలోని జ్ఞానాన్ని మానవజాతి ఇతర జీవజాతులు అందుకోగలవు.

12) మన range ని పెంచుకోవడం వల్ల మన బుద్ధి ... వికాసం చెందడమే కాకుండా ఇతర జీవజాతుల బుద్ధి వికాసం మనోవికాసం జీవిత విలువలు కూడా పెరుగుతాయి.

13) బుద్ధుడు, jesus, కృష్ణుడు అందరూ చేసిన పని ఇదే,
Jesus నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అన్నారు. అంటే ఆయన అంతర్ ప్రయాణం ద్వారా ఇతర సౌరవర్ణవ్యవస్థ లోని లోకాలను దర్శించాడనమాట.

14) ఒక range లో మానవ దేహం ఒక లాగా, మరో రేంజ్ లో మానవ దేహం మరో లాగా ఉంటుంది. 

15) మనకంటే higher range లో మానవ దేహం మరో లాగా ఉంటుంది. వారి science n technology వారు ఎంచుకున్న పరిణామ దశలు వారి కళలు, వారి భౌతిక వాస్తవం చాలా భిన్నంగా ఉంటాయి.

16) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థ ఒక్కొక్క dimension గా చెప్పబడుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

07.Aug.2020

------------------------------------ x ------------------------------------

No photo description available.
🌹. మనోశక్తి - Mind Power - 82 🌹
Know Your Infinite Mind


🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

చివరి భాగం
🌻 Q 79:--పూర్ణాత్మ vs దేహం 🌻

Ans :--

1) మనం మన దేహాన్ని ఒక పూర్ణాత్మ గా పరిగణిస్తే దేహంలోని జీవకాణాలన్నీ అంశాత్మలు గా పరిగణించవచ్చు. కాబట్టి అంశాత్మల చైతన్య పరిణామం పూర్ణాత్మ చైతన్య పరిణామం అవుతుంది.

2) దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. జీవకణాలు మృతి చెంది మరలా పడుతుంటాయి. అలాగే అంశాత్మలు మరణిస్తూ పునర్జన్మ తీసుకుంటుంటాయి. కానీ అంశాత్మలు సాధించిన జ్ఞానం, పురోగతికి సంబందించిన information స్టోర్ అవుతుంటుంది.

3) జీవకణం కొంత time జీవించివుంటుంది.దాని అభివృద్ధి అయ్యాక మరణిస్తుంది. మరల జన్మ తీసుకుంటుంది.అలాగే శరీరానికి కొంత టైం ఉంటుంది, సమిష్టిగా జీవకణాలన్నీ(అంశాత్మలన్ని)అభివృద్ధి చెందాక దేహం నశిస్తుంది.

4) మన దేహంలోని భాగాలను గమనిద్దాం. ముక్కు యొక్క అనుభవాలు ఏముంటాయి.... చెడు లేదా మంచి వాసనలు పసిగట్టగలగడం. అలాగే దేహం లోని ప్రతిభాగానికి ఇలాగే వాటి లక్ష్యాలుంటాయి, అనుభవాలు వుంటాయి. ఈ విధంగా దేహంలోని ప్రతి జీవకణం యొక్క అనుభవాల information ఆత్మలో store అవుతుంది. అలాగే total దేహంలో ఉన్న ఆత్మ యొక్క అనుభవం పూర్ణాత్మ యొక్క అనుభవం అవుతుంది.

5) అంశాత్మలు అభివృద్ధి చెంది పూర్ణాత్మ లు అవుతాయి.లీనమవ్వడం అనేది ఈ సృష్టిలో లేనేలేదు.ఏదైనా అనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

6) పూర్ణాత్మ యొక్క అంశాత్మలు higher లోకాలలో, lower లోకాలలో జన్మ తీసుకుని ఉంటాయి, ఈ అంశాత్మలన్ని కలసి సాధించిన ప్రగతి ఒక పూర్ణాత్మ ప్రగతి అవుతుంది. అంశాత్మలన్ని చైతన్యశక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంటాయి. కావున ప్రతి అంశాత్మ ఎలాంటి జ్ఞానం కావాలన్నా అంతర్ ప్రయాణం ద్వారా పొందవచ్చు.

7) web system =

పూర్ణాత్మ + అంశాత్మలు.

ప్రతి అంశాత్మను ఒక website అనుకుందాం.

అంశాత్మ = google, facebook, youtube ఈ websites అన్నీ internet ద్వారానే పనిచేస్తాయి.ఇక్కడ internet అంటే చైతన్యశక్తి.

ఒక అంశాత్మ సాధించిన పురోగతి ఇతర అంశాత్మలుకు కూడా చేరవేయబడుతుంది.

8) websystem= 

భూమి+దానిపైన ఉన్న లోకాలు+ఇతర జీవజాతులు ఇక్కడ భూమి పై నివసించే మానవులు ఇతర జీవజాతులు యొక్క పురోగతి భూమి యొక్క పురోగతి అవుతుంది.

భూమి ఇతర లోకాలన్నీ web system కి internet (చైతన్యశక్తి)ద్వారా connect అయి ఉంటాయి.

ఈ విధంగా భూమి పై నివసించే జీవరాసులన్నీ ఈ websystem కి కనెక్ట్ అయితే ఇతర లోకాల ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవచ్చు.అలాగే మన లోకం గురించి తెలుసుకోవాలంటే ఇతర లోకాలవాళ్ళు వాళ్లు కూడా websystem కి connect అయితే మన information వారు తెలుసుకోవచ్చు.

ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
🌻. సమాప్తం... 🌻

🌹 🌹 🌹 🌹 🌹
------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------


No comments:

Post a Comment