శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం మరియు అధిక పాఠం - స్తోత్రం - భావము (Sri Adi Shankaracharya - Jaagratha Panchakam and Addon Verses Stotra Song and Meaning)



🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం మరియు అధిక పాఠం - స్తోత్రం - భావము 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/Yz0hxqsTvBg



శ్రీ ఆది శంకరాచార్యులచే రచింపబడిన జాగ్రత పంచకం మరియు అధిక పాఠం స్తోత్రం, మనుషులు తమ జీవితములో ఎలాంటి భ్రమలలో ఉన్నారో, వాటి నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు ఉపదేశిస్తుంది. ఈ లోకంలో సంపదలు, బంధువులు, వయస్సు అన్నీ క్షణికమని, మానవ జన్మ దుర్లభమని తెలిపి, జాగ్రత్త వహించమని శంకరాచార్యులు హెచ్చరిస్తారు. జీవితంలోని అవాస్తవములను గ్రహించి, దానిని ధన్యంగా మార్చుకోవడమే ఈ స్తోత్రం యొక్క ప్రధాన ఉద్దేశం.

🌹🌹🌹🌹🌹



Sri Adi Shankaracharya - Jaagratha Panchakam and Addon Verses Stotra Song and Meaning


🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam and Addon Verses Stotra Song and Meaning 🌹

Prasad Bharadwaj

https://youtu.be/c0GiaHYhICs


Śrī Ādi Śaṅkarācārya's Jāgrata Pañchakam and additional verses emphasize the impermanence of life, relationships, and material wealth. This ancient hymn serves as a reminder to stay vigilant and mindful, highlighting the transient nature of existence. Understanding these teachings helps humans recognize the futility of attachment and prepares them for a life of wisdom and spiritual awareness.

🌹🌹🌹🌹🌹



श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम और अतिरिक्त श्लोक - स्तोत्र और अर्थ (Sri Adi Shankaracharya - Jaagratha Panchakam and Addon Verses Stotra Song and Meaning)



🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम और अतिरिक्त श्लोक - स्तोत्र और अर्थ 🌹

प्रसाद भारद्वाज

https://youtu.be/B0_EavjB4wg


श्री आदि शंकराचार्य के जाग्रत पंचकम और अतिरिक्त श्लोक जीवन, संबंधों और भौतिक संपत्ति की नश्वरता पर जोर देते हैं। यह प्राचीन स्तोत्र सावधानी और सतर्कता बनाए रखने का स्मरण कराता है, जो अस्तित्व की अस्थिर प्रकृति को उजागर करता है। इन शिक्षाओं को समझकर मनुष्य आसक्ति की व्यर्थता को पहचानते हैं और ज्ञान एवं आध्यात्मिक चेतना के लिए तैयार होते हैं।

🌹🌹🌹🌹🌹



ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి! (For each Tithi, there is a presiding deity)




🌹ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి! 🌹


ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.


తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.



పాడ్యమి:

అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.



విదియ:

అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.




తదియ:

అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.




చవితి:

అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.




పంచమి:

అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.




షష్టి :

అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.




సప్తమి:

అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.




అష్టమి:

అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.




నవమి:

అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.




దశమి:

అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.




ఏకాదశి:

అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.




ద్వాదశి:

అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.




త్రయోదశి:

అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.




చతుర్దశి:

అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.




అమావాస్య:

అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.




పౌర్ణమి:

అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

🌹☘️🪷☘️🌹