గీతోపనిషత్తు -107

🌹. గీతోపనిషత్తు -107 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 39 - 2

🍀 34 - 2. తదేక నిష్ఠ :

భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును. ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును. అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. 🍀

భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును.

ఆసక్తి కలుగుట, కలుగకపోవుట స్వభావము పై ఆధారపడి యుండును. స్వభావమున కనుగుణమైన పని స్వధర్మమగును. అందువలన స్వధర్మము నాచరించువారికి సహజముగ కొంత ఆసక్తి యుండును. ఆ ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును.

అనగ అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. బుద్ధిని దైవముపై లగ్నము చేయుచుండగ, చిత్తము చెప్పు పైకి ప్రసరించుట సర్వసామాన్యము. అట్టివారు ఖండ ప్రజ్ఞ గలవారై, కార్యములందు విఫలు లగుచుందురు.

అంతఃకరణ ప్రజ్ఞ అఖండమై, కార్యములందు ప్రయోగించి నపుడు సర్వసామాన్యముగ కార్యసిద్ధి కలుగును. అట్టివారు జ్ఞానము పై మనసు నిడినపుడు చిత్తము, మనసు, బుద్ధి, తాను (అహంకారము) జ్ఞానము నుపాసించుటచే జ్ఞాను లగుదురు. కర్మల నుపాసించునపుడు కూడ శాంతిగ నుందురు.

పనులు చేయుచుండుట వలన వారికి శాంతి కరవు కాదు. పనులు చేయుచు కూడ పరమశాంతితో నుందురు. విస్తారమగు కార్యములు నిర్వర్తించుచు, ప్రశాంతముగ ఏమియు చేయని వారివలె గోచరించు వారు శ్రద్ధాళువులు, తత్పరులు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 307

🌹 . శ్రీ శివ మహా పురాణము - 307 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

75. అధ్యాయము - 30

🌻. సతీదేహత్యాగము - 1 🌻

నారదుడిట్లు పలికెను -

శంకరుని పత్నియగు ఆ సతి మౌనమును వహించిన పిదప, అచట జరిగిన వృత్తాంతమెయ్యది? బ్రహ్మా! దానిని ఆదరముతో చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను(2). ఆమె యథావిధిగా జలముతో ఆచనమును చేసి, వస్త్రముతో కప్పుకొని, శుచియై కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగమార్గమును ప్రవేశించెను (3).

స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి, తరువాత ఉదానమును నాభి చక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్థాపనము చేసెను (4). శంకరునకు ప్రాణములకంటె ప్రియురాలు, దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థ్స లమను స్థానము నందుంచి, తరువాత కంఠ మార్గము గుండా కనుబొమల మధ్య లోనికి తీసుకొని వెళ్లెను (5).

ఆమె ఈ తీరున దక్షునియందలి కోపము వలన తన దేహమును త్యజించ గోరినదై, వెంటనే యోగమార్గము ననుసరించి దేహమునందు వాయువును, అగ్నిని ధరించెను (6). అపుడు యోగమార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్తయొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరమును దేనినీ చూడలేదు (7).

ఓ మహర్షీ !వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కెకు అనుగుణముగా ఆ అగ్ని చే భస్మము చేయబడి క్రిందబడెను (8). భూమియందు, ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలగించె, మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను, చిత్రముగను ఉండెను (9).

అయ్యో !శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను (10). ఆశ్చర్యము !చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు, బ్రహ్మగారి కుమారుడు అగు ఈ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును (11).

అయ్యో! మానవతి, వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలు అగు ఆ సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయెను (12). దుష్ట హృదయుడు, పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడు అగు ఆ దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు (13).

ఏలయనగా,శంభుని ద్వేషించు ఆ దక్షుడు తన దేహమునుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. ఆతడు మరణించిన మహానరకము ననుభవించగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు (14). సతీదేవి ప్రాణములను వీడుట అను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా, వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకి ఎత్తి లేచి నిలబడిరి (15).

ద్వారమునందు అరవై వేల గణములు నిలబడియుండిరి. శంకర ప్రభుని సేవకులగు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి (16). 'మాకు నిందయగు గాక !అని' పలుకుచూ, వీరులగు శివగణ నాయకులందరు పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి (17).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. దధీచిమహర్షి-సువర్చల - 1 🌻

జ్ఞానం:

1. దేవతలు పుణ్యమూర్తులేకాని, వారిని మించిపోయినటువంటి స్థితి మనుష్యులకు వస్తే, “వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించవలసిన వాళ్ళే కదా!” అనే భావన ఒకటి దేవతలకు ఉంటుందని అన్ని పురాణాలలోనూ మనకు తెలుస్తుంది. ఆ కారణంచేత ఆ తపస్సును భంగంచేసి వాళ్ళు అంత ఎత్తుకు ఎద్గకుండా చూడాలని దేవతలకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనేకమంది తపస్సులు భంగంచేస్తారు వాళ్ళు.

2. నదియందు ఒక వ్యక్తిత్వం భావించటం ఆర్యసంప్రదాయంలో ఎప్పుడూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ దేవతల దివ్యశక్తులు పంచభూతములలోనూ ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీకూడా-ఆ భూతములందుండే విశేషములైన వేరువేరు లక్షణములేవైతే ఉన్నాయో, వాటిని భాసింపచేస్తూ ఈశ్వరాజ్ఞగా ఆ కార్యాన్ని నెరవేరుస్తూ; ఆ నిర్వహణలో ఒక వ్యక్తిత్వము, అహంకారము ఎప్పుడయితే వచ్చిందో – ఆ దేవతలు ఇతర జీవులతో ఏవో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి-కోపమో, ప్రేమో-వాటియందు(ఆ దేవతాశక్తులవలన ఆ భూతములయందు) అలా పుట్టటం జరుగుతుందని పురాణం చెబుతుంది. దాన్ని మన పెద్దలు అలా గుర్తించారు.

3. దివ్యశక్తులను దేవతలుగా గుర్తించారు. అందుకనే వారికి అంత విలువ ఉంది. ఉదాహరణకు నది ఉన్నది. పర్వతం ఉన్నది. వాటికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, భూదేవికొక వ్యక్తిత్వం, వృక్షానికొక వ్యక్తిత్వం ఉన్నయి. మంత్రములతో వాటిని వ్యక్తులవలే భావించి మంత్రమూలకంగా వాటిని ఆరాధించటము, వరాలు అడిగి తీసుకోవటము మన హిందువులకు తెలిసిన విషయమే! అంటే మనుష్యులు మాత్రమే జీవులు కాదు.

4. ఈ పంచ భూతములలోపల ప్రవేశించినటువంటి దివ్యశక్తులు-అవికూడా వ్యక్తిత్వంతో ఉన్నాయి. వాటికి నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. మనుష్యులు వాటిని ఆరాధించాలి. ఈ సంభంధం మొదటినుండీ ఆర్యుల దృషిలో వాళ్ళకు ముఖస్థంగా కంటికి కనబడి, ప్రత్యక్షంగా వాళ్ళకు అనుభూతమైన విషయమిది.

5. ఆర్యసంస్కృతిలో విదేశీయులకు అర్థంకాని విషయం ఇది. ‘మీరంతా రాళ్ళురప్పలు, చెట్లుచేమలు, పుట్టలకు పూజచేస్తుంటారు” అని అంటారు విదేశీయులు. దానియందు ఒకానొక తేజస్సుంది. దానియందు వ్యక్తిత్వం ఉంది. నదికి, పర్వతానికి అలా వాటివాటి వ్యక్తిత్వాలు వాటికిఉన్నాయి.

6. ఈ విషయం వాళ్ళకు అర్థంకాదు. దానికి అర్థంచేసుకున్నవాడు, ఈ సృష్టిలో జడపదార్థమంటూ లేదు. పదార్థంలో దృశ్యమానంగా ఉండేది, జడములో అంతర్యామిగా ఉండేది చైతన్యము. చనిపోతే ఈ శరీరముకూడా జడమే! జడపదార్థం అంటే ఏమిటి? అందులో చైతన్యం ఉండదు.సృష్టిలో జడపదార్థంకూడా నశిస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 131

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 131 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 10 🌻

536. ఆదిలో ఆత్మగా నుండెను.

మధ్యలో జీవాత్మగా మారెను.

అంత్యములో పరమాత్మ అయ్యెను.

537. ఆత్యయనెడి బిందువునకు, పరమాత్మయనెడి సాగరమందలి నీటిమట్టముపై బుద్బుద (బుడగ) రూపమేర్పడినప్పుడు, ఆ బుడగ ద్వారా తాను వేరనియు సాగరము వేరనియు భావించుటలో స్వయముగా పరిమితిని, రూపమును, రూపము ద్వారా స్పృహ పూర్వకమగు అజ్ఞానమును సేకరించు చున్నది.

538. అజ్ఞాన మనెడి ఆ బుడగ చితికిపోయినప్పుడు బిందువు సాగరములో కలిసిపోయి సాగరమే అయిపోయినది. కనుక, ఆత్మ పరమాత్మలో నుండుటయేగాక వాస్తవమునకు ఆత్మయే పరమాత్మ.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 95 / Sri Vishnu Sahasra Namavali - 95

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 95 / Sri Vishnu Sahasra Namavali - 95 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శతభిషం నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 95. అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ‖ 95 ‖ 🍀

🍀 886) అనంత: -
అంతము లేనివాడు.

🍀 887) హుతభుక్ -
హోమద్రవ్యము నారిగించువాడు.

🍀 888) భోక్తా -
భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.

🍀 889) సుఖద: -
భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.

🍀 890) నైకజ: -
అనేక రూపములలో అవతరించువాడు.

🍀 891) అగ్రజ: -
సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.

🍀 892) అనిర్వణ్ణ: -
నిరాశ నెరుగనివాడు.

🍀 893) సదామర్షీ -
సజ్జనుల దోషములను క్షమించువాడు.

🍀 894) లోకాధిష్టానం -
ప్రపంచమంతటికి ఆధారభూతుడు.

🍀 895) అధ్బుత: -
ఆశ్చర్య స్వరూపుడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 95 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Sathabisham 3rd Padam

🌻 95. anantō hutabhugbhōktā sukhadō naikajōgrajaḥ |
anirviṇṇaḥ sadāmarṣī lōkādhiṣṭhānamadbhutaḥ || 95 || 🌻

🌻 886. Anantaḥ:
One who is eternal, all-pervading and indeterminable by space and time.

🌻 887. Hutabhuk:
One who consumes what is offered in fire sacrifices.

🌻 888. Bhoktā:
One to whom the unconscious Prakruti is the object for enjoyment.

🌻 889. Sukhadaḥ:
One who bestows liberation (Miksha) on devotees.

🌻 890. Naikajaḥ:
One who takes on birth again and again for the preservation of Dharma.

🌻 891. Agrajaḥ:
One who was born before everything else, that is, Hiranyagarbha.

🌻 892. Anirviṇṇaḥ:
One who is free from all sorrow, because he has secured all his desires and has no obstruction in the way of such achievement.

🌻 893. Sadāmarṣī:
One who is always patient towards good men.

🌻 894. Lōkādhiṣṭhānam:
Brahman who, though without any other support for Himself, supports all the three worlds.

🌻 895. Adbhutaḥ:
The wonderful being.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 186, 187 / Vishnu Sahasranama Contemplation - 186, 187

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 186, 187 / Vishnu Sahasranama Contemplation - 186, 187 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻186. సురానందః, सुरानन्दः, Surānandaḥ🌻

ఓం సురానందాయ నమః | ॐ सुरानन्दाय नमः | OM Surānandāya namaḥ

సురాన్ ఆనందయతి దేవతలను ఆనందపరచువాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::

సీ. స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేఉడును గలఘోషణముల మేఘంబు లుఱిమె,

గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ

గమ్మని చల్లని గాలి మెల్లన వీచె, హోమమానలంబు చెన్నొంది వెలిఁగెఁ

గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ, బ్రవిమలతోయలై పాఱె నదులు,

తే. వరపుర గ్రామఘోషయై వసుధ యొప్పె, విహగ రవ పుష్పఫలముల వెలసె వనము,

లలరుసోనలు గురిసి ర య్యమరవరులు దేవదేవుని దేవకీదేవి గనఁగ. (106)

క. పాడిరి గంధర్వోత్తము, లాడిరి రంభాదికాంత, లానందమునం

గూడిరి సిద్ధులు, భయములు, వీడిరి చారణులు, మొరసె వేల్పులు భేరుల్‍. (107)

దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశము గ్రహాలతోనూ, తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపొయాయి. చల్లనిగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది.

ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూవున్న హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తామరఫులతోనూ, వాటిలో ఝంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కళకళ లాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలరావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు.

విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒకచోట చేరారు. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 186🌹

📚. Prasad Bharadwaj

🌻186. Surānandaḥ🌻

OM Surānandāya namaḥ

Surān ānaṃdayati / सुरान् आनंदयति He who causes joy to the Surās or gods.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 3

Mumucurmunayo devāḥ sumanāṃsi mudānvitāḥ,

Mandaṃ mandaṃ jaladharā jagarjuranusāgaram. (7)

Niśīthe tamaudbhūte jāyamāne janārdane,

Devakyāṃ devarūpiṇyāṃ viṣṇuḥ sarvaguhāśayaḥ,

Avirāsīdyathā prācyāṃ diśīnduriva puṣkalaḥ. (8)

:: श्रीमद्भागवते - दशम स्कन्धे, पूर्वार्धे, तृतीयोऽध्यायः ::

मुमुचुर्मुनयो देवाः सुमनांसि मुदान्विताः ।

मन्दं मन्दं जलधरा जगर्जुरनुसागरम् ॥ ७ ॥

निशीथे तमौद्भूते जायमाने जनार्दने ।

देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः ।

अविरासीद्यथा प्राच्यां दिशीन्दुरिव पुष्कलः ॥ ८ ॥

The gods and great saintly persons showered flowers in a joyous mood and clouds gathered in the sky and very mildly thundered, making sounds like those of the ocean's waves. Then Lord Viṣṇu, who is situated in the core of everyone's heart, appeared from the heart of Devakī in the dense darkness of night, like the full moon rising on the eastern horizon, because Devakī was of the same category as Śrī Kṛṣṇa.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 187 / Vishnu Sahasranama Contemplation - 187🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻187. గోవిందః, गोविन्दः, Govindaḥ🌻

ఓం గోవిందాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ

గాం అవిందత్ ఇతి భూమిని తిరిగి పొందెను.

:: మహాభారతము - శాంతి పర్వము, మోక్షధ్రమ పర్వము, 342వ అధ్యాయము ::

నష్టాం వై ధరణీం పూర్వ మవింద ద్య ద్గుహాగతాం ।

గోవింద ఇతి తేనాఽహం దేవై ర్వాగ్భి రభీష్టుతాః ॥ 70 ॥

పూర్వము (పాతాళ) గుహను చేరియున్నదియు అందుచే కనబడకున్నదియు అగు భూమిని ఈతడు మరల పొందెను అను హేతువుచే నేను దేవతలచే వాక్కులతో సమగ్రముగా స్తుతించబడితిని.

:: హరి వంశము - ద్వితీయ స్కంధము, 45 వ అధ్యాయము ::

అహం కిలేంద్రో దేవానాం - త్వం గవా మింద్రతాం గతః ।

గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతమ్ ॥ 45 ॥

నేను దేవులకు ఇంద్రుడుగా ప్రసిద్ధుడను. నీవు గోవులకు ఇంద్రత్వమును పొందితివి. అందుచే లోకములు నిన్ను భూలోకమున శాశ్వతముగా 'గోవిందః' అని స్తుతింతురు.

:: హరి వంశము - తృతీయ స్కంధము, 88 వ అధ్యాయము ::

గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।

గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 187🌹

📚. Prasad Bharadwaj

🌻187. Govindaḥ🌻

OM Govindāya namaḥ

Gāṃ aviṃdat iti / गां अविंदत् इति He who restored Earth.

Mahābhārata - Śāṇti parva, Mokṣadhrama parva, 342th Chapter

Naṣṭāṃ vai dharaṇīṃ pūrva maviṃda dya dguhāgatāṃ ,

Goviṃda iti tenā’haṃ devai rvāgbhi rabhīṣṭutāḥ. (70)

:: महाभारतमु - शांति पर्वमु, मोक्षध्रम पर्वमु, ३४२व अध्यायमु ::

नष्टां वै धरणीं पूर्व मविंद द्य द्गुहागतां ।

गोविंद इति तेनाऽहं देवै र्वाग्भि रभीष्टुताः ॥ ७० ॥

In ancient times, I restored the earth that had sunk down into Pātāla or nether world. So all Devas praised Me as Govinda.

Hari Vaṃśa - Canto 2, Chapter 45

Ahaṃ kileṃdro devānāṃ - tvaṃ gavā miṃdratāṃ gataḥ,

Govinda iti lokāstvāṃ stoṣyaṃti bhuvi śāśvatam. (45)

:: हरि वंश - द्वितीय स्कंध, ४५ अध्याय ::

अहं किलेंद्रो देवानां - त्वं गवा मिंद्रतां गतः ।

गोविंद इति लोकास्त्वां स्तोष्यंति भुवि शाश्वतम् ॥ ४५ ॥

I am the Indra or leader of the Devas. You have attained the leadership of cows. So in the world, men praise you always addressing as Govinda.

Hari Vaṃśa - Canto 3, Chapter 88

Gau reṣā tu yato vāṇī tāṃ ca viṃdayate bhavān,

Goviṃdastu tato deva munibhiḥ kathyate bhavān. (50)

:: हरि वंश - तृतीय स्कंध, अध्याय ८८ ::

गौ रेषा तु यतो वाणी तां च विंदयते भवान् ।

गोविंदस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥

Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 141

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 141 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 71 🌻

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌

మహదోర్‌ మహదహంకారః - అన్నప్పుడు కూటస్థుడుగా వ్యక్తం అయ్యింది.

అలాగే మహదహంకారముగా జ్ఞాతగా వ్యక్తం అయ్యింది. కాబట్టి, బ్రహ్మాండ ప్రతిబింబం అంతా పిండాండం. బింబమేమో బ్రహ్మాండం. ప్రతిబింబమేమో పిండాండం.

ఈ రెండిటి యందు రెండు అహములున్నవి. ఒకటి జ్ఞాత, రెండు కూటస్థుడు. ఈ రెండు అహములు కలిస్తే అఖండంబైన ఎఱుక. కూటస్థుడు అనేది అఖండ ఎఱుక. ఈ రకంగా ఖండ, ఖండాలుగా ఐదైదులు ఇరవై అయిదుగా తోస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా ఒక్కటిగానే ఉన్నది.

ఈ పిండ బ్రహ్మాండములు ఒక్కటే. ఈ రకమైనటువంటి సాంఖ్యవిచారణ క్రమం ద్వారా ఏ మహతత్వ నిరూపణ అయితే అవుతోందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతోందో, ఏ బ్రహ్మమైతే నిర్ణయించబడుతున్నాడో,

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ - అనేటటువంటి సూత్రాన్ని ఆశ్రయించి, సదా ఎల్లకాలము జనన మరణ చక్రములకు లోను కాకుండా, కాలత్రయమునకు లోను కాకుండా, అవస్థాత్రయమునకు లోను కాకుండా, శరీర త్రయానికి లోనుకాకుండా, దేహత్రయానికి లోనుకాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మము నిలబడి ఉన్నదో, అట్టి బ్రహ్మము నేను.

అట్టి పరమాత్మను నేను. అట్టి పరబ్రహ్మనిర్ణయాన్ని నేను. అనేటటువంటి పద్ధతిగా తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశము నందు, ఇట్టి నిర్ణయాన్ని ఎవరైతే పొంది, ఆ నిర్ణయముతో స్థిరముగా ఉన్నారో, వారే ముక్తులు.

ఈ రకంగా ముక్తిని సాంఖ్య తారక అమనస్క విధిగా సాధించాలి అనేటటువంటి సూచనని తెలియజేస్తున్నారు. కాబట్టి, మానవులందరూ హిరణ్య గర్భస్థితిని తప్పక తెలుసుకోవాలి. వ్యష్టి ప్రాణులంతా కూడా ఈ ఆది దైవతం ఆధీనంలో ఉండడం చేత, వీళ్ళందరూ కూడా, అప్పటికి చివరికి వారి యందు చేరి పోతూఉంటారు.

ఇట్లా బుద్ధి గుహయందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము. ధ్యానం చేయడం ద్వారా, నిరంతరాయంగా చేయడం ద్వారా, సహజ సమాధి నిష్ఠులవ్వడం ద్వారా, సహజ ధ్యాన పద్ధతిగా, మానవుడు ఈ స్థితిని సాధించాలి. ఈ స్థితి యందు నిలకడ చెందాలి.

ఇట్లా ఎవరైతే హిరణ్య గర్భుడిని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ఈ ఆరవ కోశాన్ని బాగుగా ఎరుగ గలుగుతున్నారో, ఎవరైతే షడూర్మి రహితంగా ఉంటున్నారో, ఎవరైతే షడ్వికార రహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాసనాత్రయం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే నిర్వాసనామౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే ఈశ్వరీయ మౌనస్థితిలోనికి చేరారో, ఎవరైతే కాలత్రయము చేత బాధింప బడక యున్నారో, ఎవరైతే కర్మత్రయం అనేటటువంటి బంధం లేకుండా ఉన్నారో, ఎవరైతే కర్మఫల ప్రదాతగా ఉన్నారో, అట్టి ఈశ్వరీయమైనటువంటి స్థితిని, సాధుకులందరు తప్పక సాధించాలి.

ఈ రకమైనటువంటి, విశేషమైనటువంటి ఆత్మ విచారణని మానవులు ప్రతి నిత్యమూ, అనుక్షణమూ ఆశ్రయించి, తనను తాను విరమింప చేసుకుని, పృథ్విలో పృథ్వి దగ్గర నుంచి, ఆకాశంలో ఆకాశం అనేటటువంటి ఆధార స్థానం వరకూ, ఆధార ఆధేయ విమర్శ పద్ధతిగా, జడచేతన విమర్శ పద్ధతిగా, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా దీనిని చక్కగా విచారణ చేసి, నేను జ్ఞాతను, నేను కూటస్థుడను, అనే నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరము తప్పక ఉన్నది.

ఈ రకంగా ఇంద్రియాల దగ్గర నుంచి, గోళకముల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి పంచ భూత తన్మాత్రల యొక్క అధిష్టములైన జ్ఞానమునకు, అక్కడి నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహతత్త్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు, ఆ తదుపరి ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి, అభేదత్వానికి మానవుడు సాధన ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది.

ఇట్లా ఎవరైతే ప్రయాణం పూర్తి చేశారో, ఎవరైతే ఈ చిట్టచివరి స్థితికి చేరుకున్నారో, వారే దేశికేంద్రులు. వారే ముక్తులు. వారే జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. వారే మోక్షమును అధివసించినటువంటి వారు.

ప్రశ్న: గురువు గారు ఇక్కడ మీరు ఈశ్వర దర్శనం గురించి చెప్పారు కదా! ఈశ్వర సాకార దర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతి రూపాన్ని వెనుక ఒక భగవద్ శక్తే నడిపిస్తుంది అన్న భావన ఉంది. నిరాకారంతో ఇది వున్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధముగా వుంటుంది అన్నది ఏమన్నా చెబుతారా?

సమాధానం: స్వప్రకాశ దర్శనంగా వుంటుంది. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 15 🍀

ఏక్ నామ హరీ ద్వైత నామ దురీ!
అద్వైత కుసరీ విరళా జాణే!!

సమబుద్ధి మౌతా సమాన్ శ్రీహరీ!
శమ దమావరీ హరీ ఝాలా!!

సర్వా ఘటీ రామ్ దేహాదేహీ ఏక్!
సూర్య ప్రకాశక్ సహస్ర రశ్మీ!!

జ్ఞానదేవా చిలీ హరిపాఠి నేమా!
మాగిలియా జన్మా ముక్తి ఝాలో!!

భావము:

హరినామము ఏక తత్వము కానీ ద్వైత నామాలను దూరము చేసి అద్వైత మార్గమును చేపట్టిన వారు బహు అరుదుగా ఉన్నారు. అని తెలుసుకో..

సమ బుద్ధితో వీక్షించి అంతట సమానముగ శ్రీహరి ఉన్నాడు అని తెలుసుకున్న వెంటనే శమధమాలను అధిగమించి హరి రూపము అయిపోతావు. సూర్యుడు ఒక్కడే కిరణాలు అనేకముగ ఉన్నట్లు దేహమందు దేహిగ సర్వ ఘటాలలో రామ తత్వము ఒక్కటే ఉన్నది.

హరి పాఠనేమమును చిత్తమునందు నిలిపి పఠించే వారి వెనుకటి జన్మలు ముక్తి కాగలవని జ్ఞానదేవులు తెలిపినారు.

🌻. నామ సుధ -15 🌻

హరి ఒక్కడే హరి నామాలనేకము

ద్వైత నామాలను చేయుము దూరము

హరియే సమగ్ర అద్వైత తత్వము

ఎరిగిన భక్తులు బహు దుర్లభము

సమ బుద్ధితో యోచించుము

సమానము శ్రీహరియని గాంచుము

శమ దమాలు ఉడిగిన ఆనంతరము

మిగిలి యుందువు శ్రీహరి రూపము

సర్వ దేహాలలో రామ తత్వము

“దేహి దేహము ఏకరూపము”

సూర్యుడు ఒక్కడే కిరణాలనేకము

నామి ఒక్కడే నామాలనేకము

జ్ఞాన దేవునిది ఏక చిత్తము

నిరంతరము హరిపాఠ నేమము

పూర్వ జన్మ కర్మలు సహితము

ముక్తి నొందునని తెలిపెను వినుము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalitha Chaitanya Vijnanam - 158

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖

🌻158. 'నిర్మదా'🌻

మదరహితురాలు శ్రీదేవి అగుటచే నిర్మదా అని పిలువబడుచున్నది. జీవుడు ప్రత్యగాత్మ అగుటచే అతడు మదమును పొందు అవకాశమున్నది. శ్రీదేవి సదాశివునితో కూడి యుండుటచే ఆమెకు ఆ భావన యుండదు. మదము అజ్ఞాన చిహ్నము. సమర్థులు, అసమర్థులు కూడా అంతో యింతో మదము కలిగి యుందురు. తమనుగూర్చిన దురభిమానమే మదము కలుగుటకు కారణము. అభిమానముండవలెనే గాని దురభిమానముండరాదు.

మితిమీరిన అభిమానము తమపై తమకుండుట వలన మదమెక్కి ప్రవర్తింతురు. అసురుల మదమునకిదియే కారణము. మదము అసుర గుణము. అవకాశమును బట్టి దేవతలను కూడా ఈ గుణము ఆవరించగలదు. అప్పుడు వారు కూడా భంగపడుదురు. కానీ దేవతలు సహజముగ దైవీసంపత్తి కలవారగుటచే మదమావరించినను, భంగపడినపుడు తమ తప్పును తాము తెలుసుకొని శ్రీదేవినో లేక శ్రీమహావిష్ణువునో శరణాగతి జొచ్చెదరు.

మానవులలో కూడా దైవీస్వభావము కలవారు, ఆసురీ స్వభావము కలవారు యుందురు. దైవీస్వభావము కలవారు తమ తప్పులను తాము తెలుసుకొని వానిని సరిదిద్దుకొనుటకు దైవమును ఆశ్రయింతురు. ఆసురీ స్వభావము కలవారు తమ తప్పులను సమర్థించుకొనుచు పతనము చెందుచునుందురు. వారి నాశనమును వారే కొని తెచ్చుకొందురు. ఇట్టివారే దైవముపైనా గ్రహించుట, దూషించుట కూడ చేయుచు నుందురు.

శ్రీదేవి ఆరాధనము సక్రమముగా సాగినచో ఆరాధకులకు మదము తగ్గుట జరుగును. ఆరాధన పెరిగిన కొద్ది మదము పెరుగుట జరిగినచో ఆరాధన ఆసురీ మార్గమున ఉన్నదని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nirmadā निर्मदा (158) 🌻

She is without pride. Mada means pride. When someone has something that others do not have, it gives rise to pride. She has everything and everything comes out of Her (hiranya garbha or the golden egg or womb.

It is the matrix of the imperishable substance, the Brahman. It is said to be the luminous 'fire mist' or ethereal stuff from which the universe was formed and generally applied to Brahma.

This is described in the Rig-Veda as born from a golden egg, formed out of the seed deposited in the waters when they were produced as the first modifications of the Self-existent.) There is no necessity for Her to become proud of something.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

24 Dec 2020

24-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 186 187 / Vishnu Sahasranama Contemplation - 186, 187🌹
3) 🌹 Daily Wisdom - 8 🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 141🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 162🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 86 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalita Chaitanya Vijnanam - 158🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 107🌹 
11) 🌹. శివ మహా పురాణము - 305 🌹 
12) 🌹 Light On The Path - 60🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192 🌹 
14) 🌹. చేతనత్వ బీజాలు - 256 / Seeds Of Consciousness - 256 🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 131🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 96 / Sri Vishnu Sahasranama - 96🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 05 🌴*

05. యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||

🌷. తాత్పర్యం : 
యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మలను ఎన్నడును త్యజింపరాదు. వానిని తప్పక ఒనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞ, దాన, తపములు మహాత్ములను కూడా పవిత్రమొనర్చును.

🌷. భాష్యము :
యోగులైనవారు మానవసమాజ పురోభివృద్ది కొరకై కర్మల నొనరించవలెను. మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు పురోగమింపజేయుటకు పెక్కు పవిత్రీకరణ విధానములు గలవు. ఉదాహరణకు వివాహము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణింపబడినది. అది వివాహయజ్ఞమని పిలువబడును. గృహబంధముల నన్నింటిని విడిచిపెట్టి సన్న్యాసము స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహమును ప్రోత్సహించవచ్చునా యనునది పెద్ద ప్రశ్న. 

అందుకు సమాధానముగా మానవకల్యాణ నిమిత్తమై యున్న ఎట్టి యజ్ఞమునైనను విడువరాదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు. వివాహయజ్ఞము మనుజుని మనస్సును నియమించి, తద్ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోభివృద్ధికై శాంతిమయుడగుటకే ఉద్దేశింపబడినది. కనుక దాదాపు జనులందరికీ ఈ వివాహయజ్ఞము ప్రోత్సాహనీయమైనది. సన్న్యాసియైనవాడు సైతము దీనిని ప్రోత్సహించవచ్చును. 

సన్న్యాసులు స్త్రీతో సాంగత్యమును కలిగియుండరాదన్నచో సన్న్యాసాశ్రమము క్రిందనున్న ఆశ్రమము వారు కూడా వివాహము చేసికొనరాదని భావము కాదు. విధ్యక్తమగు యజ్ఞములన్నియును శ్రీకృష్ణభగవానుని పొందుట కొరకే ఉద్దేశింపబడినవి. కనుకనే ఆరంభస్థితిలో అట్టి విధ్యుక్తధర్మములను విడువరాదు. 

అదేవిధముగా దానము హృదయపవిత్రీకరణకై పేర్కొనబడినది. పూర్వము వివరించినట్లు దానము పాత్రుడైనవానికి ఒసగినచో అది మనుజుని ఆధ్యాత్మికజీవనము వైపునకు నడుపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 588 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 05 🌴*

05. yajña-dāna-tapaḥ-karma na tyājyaṁ kāryam eva tat
yajño dānaṁ tapaś caiva pāvanāni manīṣiṇām

🌷 Translation : 
Acts of sacrifice, charity and penance are not to be given up; they must be performed. Indeed, sacrifice, charity and penance purify even the great souls.

🌹 Purport :
The yogīs should perform acts for the advancement of human society. There are many purificatory processes for advancing a human being to spiritual life. The marriage ceremony, for example, is considered to be one of these sacrifices. It is called vivāha-yajña. 

Should a sannyāsī, who is in the renounced order of life and who has given up his family relations, encourage the marriage ceremony? The Lord says here that any sacrifice which is meant for human welfare should never be given up. Vivāha-yajña, the marriage ceremony, is meant to regulate the human mind so that it may become peaceful for spiritual advancement. 

For most men, this vivāha-yajña should be encouraged even by persons in the renounced order of life. Sannyāsīs should never associate with women, but that does not mean that one who is in the lower stages of life, a young man, should not accept a wife in the marriage ceremony. 

All prescribed sacrifices are meant for achieving the Supreme Lord. Therefore, in the lower stages, they should not be given up. Similarly, charity is for the purification of the heart. If charity is given to suitable persons, as described previously, it leads one to advanced spiritual life.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 186, 187 / Vishnu Sahasranama Contemplation - 186, 187 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻186. సురానందః, सुरानन्दः, Surānandaḥ🌻*

*ఓం సురానందాయ నమః | ॐ सुरानन्दाय नमः | OM Surānandāya namaḥ*

సురాన్ ఆనందయతి దేవతలను ఆనందపరచువాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
సీ. స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేఉడును గలఘోషణముల మేఘంబు లుఱిమె,
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె, హోమమానలంబు చెన్నొంది వెలిఁగెఁ
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ, బ్రవిమలతోయలై పాఱె నదులు,
తే. వరపుర గ్రామఘోషయై వసుధ యొప్పె, విహగ రవ పుష్పఫలముల వెలసె వనము,
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు దేవదేవుని దేవకీదేవి గనఁగ. (106)
క. పాడిరి గంధర్వోత్తము, లాడిరి రంభాదికాంత, లానందమునం
గూడిరి సిద్ధులు, భయములు, వీడిరి చారణులు, మొరసె వేల్పులు భేరుల్‍. (107)

దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశము గ్రహాలతోనూ, తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపొయాయి. చల్లనిగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. 

ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూవున్న హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తామరఫులతోనూ, వాటిలో ఝంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కళకళ లాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలరావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు.

విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒకచోట చేరారు. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 186🌹*
📚. Prasad Bharadwaj 

*🌻186. Surānandaḥ🌻*

*OM Surānandāya namaḥ*

Surān ānaṃdayati / सुरान् आनंदयति He who causes joy to the Surās or gods.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 3
Mumucurmunayo devāḥ sumanāṃsi mudānvitāḥ,
Mandaṃ mandaṃ jaladharā jagarjuranusāgaram. (7)
Niśīthe tamaudbhūte jāyamāne janārdane,
Devakyāṃ devarūpiṇyāṃ viṣṇuḥ sarvaguhāśayaḥ,
Avirāsīdyathā prācyāṃ diśīnduriva puṣkalaḥ. (8)

:: श्रीमद्भागवते - दशम स्कन्धे, पूर्वार्धे, तृतीयोऽध्यायः ::
मुमुचुर्मुनयो देवाः सुमनांसि मुदान्विताः ।
मन्दं मन्दं जलधरा जगर्जुरनुसागरम् ॥ ७ ॥
निशीथे तमौद्भूते जायमाने जनार्दने ।
देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः ।
अविरासीद्यथा प्राच्यां दिशीन्दुरिव पुष्कलः ॥ ८ ॥

The gods and great saintly persons showered flowers in a joyous mood and clouds gathered in the sky and very mildly thundered, making sounds like those of the ocean's waves. Then Lord Viṣṇu, who is situated in the core of everyone's heart, appeared from the heart of Devakī in the dense darkness of night, like the full moon rising on the eastern horizon, because Devakī was of the same category as Śrī Kṛṣṇa.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 187 / Vishnu Sahasranama Contemplation - 187🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻187. గోవిందః, गोविन्दः, Govindaḥ🌻*

*ఓం గోవిందాయ నమః | ॐ गोविन्दाय नमः | OM Govindāya namaḥ*

గాం అవిందత్ ఇతి భూమిని తిరిగి పొందెను.

:: మహాభారతము - శాంతి పర్వము, మోక్షధ్రమ పర్వము, 342వ అధ్యాయము ::
నష్టాం వై ధరణీం పూర్వ మవింద ద్య ద్గుహాగతాం ।
గోవింద ఇతి తేనాఽహం దేవై ర్వాగ్భి రభీష్టుతాః ॥ 70 ॥

పూర్వము (పాతాళ) గుహను చేరియున్నదియు అందుచే కనబడకున్నదియు అగు భూమిని ఈతడు మరల పొందెను అను హేతువుచే నేను దేవతలచే వాక్కులతో సమగ్రముగా స్తుతించబడితిని.

:: హరి వంశము - ద్వితీయ స్కంధము, 45 వ అధ్యాయము ::
అహం కిలేంద్రో దేవానాం - త్వం గవా మింద్రతాం గతః ।
గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతమ్ ॥ 45 ॥

నేను దేవులకు ఇంద్రుడుగా ప్రసిద్ధుడను. నీవు గోవులకు ఇంద్రత్వమును పొందితివి. అందుచే లోకములు నిన్ను భూలోకమున శాశ్వతముగా 'గోవిందః' అని స్తుతింతురు.

:: హరి వంశము - తృతీయ స్కంధము, 88 వ అధ్యాయము ::
గౌ రేషా తు యతో వాణీ తాం చ విందయతే భవాన్ ।
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్ ॥ 50 ॥

ఈ వాణికి (వక్కునకు) గౌః అని వ్యవహారము. నీవు ప్రాణులచే వాక్కును పొందింతువు (ప్రాణులకు వానికి వానికి తగిన వాక్కును అందజేయువాడవు నీవే). అందువలన దేవా నీవు మునులచేత గోవిందః అని చెప్పబడుచున్నావు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 187🌹*
📚. Prasad Bharadwaj 

*🌻187. Govindaḥ🌻*

*OM Govindāya namaḥ*

Gāṃ aviṃdat iti / गां अविंदत् इति He who restored Earth.

Mahābhārata - Śāṇti parva, Mokṣadhrama parva, 342th Chapter
Naṣṭāṃ vai dharaṇīṃ pūrva maviṃda dya dguhāgatāṃ ,
Goviṃda iti tenā’haṃ devai rvāgbhi rabhīṣṭutāḥ. (70)

:: महाभारतमु - शांति पर्वमु, मोक्षध्रम पर्वमु, ३४२व अध्यायमु ::
नष्टां वै धरणीं पूर्व मविंद द्य द्गुहागतां ।
गोविंद इति तेनाऽहं देवै र्वाग्भि रभीष्टुताः ॥ ७० ॥

In ancient times, I restored the earth that had sunk down into Pātāla or nether world. So all Devas praised Me as Govinda.

Hari Vaṃśa - Canto 2, Chapter 45
Ahaṃ kileṃdro devānāṃ - tvaṃ gavā miṃdratāṃ gataḥ,
Govinda iti lokāstvāṃ stoṣyaṃti bhuvi śāśvatam. (45) 

:: हरि वंश - द्वितीय स्कंध, ४५ अध्याय ::
अहं किलेंद्रो देवानां - त्वं गवा मिंद्रतां गतः ।
गोविंद इति लोकास्त्वां स्तोष्यंति भुवि शाश्वतम् ॥ ४५ ॥

I am the Indra or leader of the Devas. You have attained the leadership of cows. So in the world, men praise you always addressing as Govinda.

Hari Vaṃśa - Canto 3, Chapter 88
Gau reṣā tu yato vāṇī tāṃ ca viṃdayate bhavān,
Goviṃdastu tato deva munibhiḥ kathyate bhavān. (50)

:: हरि वंश - तृतीय स्कंध, अध्याय ८८ ::
गौ रेषा तु यतो वाणी तां च विंदयते भवान् ।
गोविंदस्तु ततो देव मुनिभिः कथ्यते भवान् ॥ ५० ॥

Speech is called 'go'. You confer it. So the holy men proclaim you as Govinda.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 7 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. Change is the Quality of Untruth 🌻*

Change is the quality of untruth and the Upanishads assert that Reality is Self-satisfied, Self-existent, non-dual, tranquil and utterly perfect. An appeal to the inwardness of consciousness expanded into limitlessness is the burden of the song of the Upanishads.

 In this respect the Upanishads are extremely mystic, if mysticism does not carry with it an idea of irrationalism or a madness of spirit. 

The transcendental mysticism of the Upanishads is not the effect of an emotional outburst, but a calm transcendence of intellect and reason through a development into the integral consciousness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 141 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 71 🌻*

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌
మహదోర్‌ మహదహంకారః - అన్నప్పుడు కూటస్థుడుగా వ్యక్తం అయ్యింది. 

అలాగే మహదహంకారముగా జ్ఞాతగా వ్యక్తం అయ్యింది. కాబట్టి, బ్రహ్మాండ ప్రతిబింబం అంతా పిండాండం. బింబమేమో బ్రహ్మాండం. ప్రతిబింబమేమో పిండాండం.

ఈ రెండిటి యందు రెండు అహములున్నవి. ఒకటి జ్ఞాత, రెండు కూటస్థుడు. ఈ రెండు అహములు కలిస్తే అఖండంబైన ఎఱుక. కూటస్థుడు అనేది అఖండ ఎఱుక. ఈ రకంగా ఖండ, ఖండాలుగా ఐదైదులు ఇరవై అయిదుగా తోస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా ఒక్కటిగానే ఉన్నది.

 ఈ పిండ బ్రహ్మాండములు ఒక్కటే. ఈ రకమైనటువంటి సాంఖ్యవిచారణ క్రమం ద్వారా ఏ మహతత్వ నిరూపణ అయితే అవుతోందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతోందో, ఏ బ్రహ్మమైతే నిర్ణయించబడుతున్నాడో,

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ - అనేటటువంటి సూత్రాన్ని ఆశ్రయించి, సదా ఎల్లకాలము జనన మరణ చక్రములకు లోను కాకుండా, కాలత్రయమునకు లోను కాకుండా, అవస్థాత్రయమునకు లోను కాకుండా, శరీర త్రయానికి లోనుకాకుండా, దేహత్రయానికి లోనుకాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మము నిలబడి ఉన్నదో, అట్టి బ్రహ్మము నేను. 

అట్టి పరమాత్మను నేను. అట్టి పరబ్రహ్మనిర్ణయాన్ని నేను. అనేటటువంటి పద్ధతిగా తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశము నందు, ఇట్టి నిర్ణయాన్ని ఎవరైతే పొంది, ఆ నిర్ణయముతో స్థిరముగా ఉన్నారో, వారే ముక్తులు. 

ఈ రకంగా ముక్తిని సాంఖ్య తారక అమనస్క విధిగా సాధించాలి అనేటటువంటి సూచనని తెలియజేస్తున్నారు. కాబట్టి, మానవులందరూ హిరణ్య గర్భస్థితిని తప్పక తెలుసుకోవాలి. వ్యష్టి ప్రాణులంతా కూడా ఈ ఆది దైవతం ఆధీనంలో ఉండడం చేత, వీళ్ళందరూ కూడా, అప్పటికి చివరికి వారి యందు చేరి పోతూఉంటారు.

    ఇట్లా బుద్ధి గుహయందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము. ధ్యానం చేయడం ద్వారా, నిరంతరాయంగా చేయడం ద్వారా, సహజ సమాధి నిష్ఠులవ్వడం ద్వారా, సహజ ధ్యాన పద్ధతిగా, మానవుడు ఈ స్థితిని సాధించాలి. ఈ స్థితి యందు నిలకడ చెందాలి. 

ఇట్లా ఎవరైతే హిరణ్య గర్భుడిని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ఈ ఆరవ కోశాన్ని బాగుగా ఎరుగ గలుగుతున్నారో, ఎవరైతే షడూర్మి రహితంగా ఉంటున్నారో, ఎవరైతే షడ్వికార రహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాసనాత్రయం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే నిర్వాసనామౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే ఈశ్వరీయ మౌనస్థితిలోనికి చేరారో, ఎవరైతే కాలత్రయము చేత బాధింప బడక యున్నారో, ఎవరైతే కర్మత్రయం అనేటటువంటి బంధం లేకుండా ఉన్నారో, ఎవరైతే కర్మఫల ప్రదాతగా ఉన్నారో, అట్టి ఈశ్వరీయమైనటువంటి స్థితిని, సాధుకులందరు తప్పక సాధించాలి.
    
ఈ రకమైనటువంటి, విశేషమైనటువంటి ఆత్మ విచారణని మానవులు ప్రతి నిత్యమూ, అనుక్షణమూ ఆశ్రయించి, తనను తాను విరమింప చేసుకుని, పృథ్విలో పృథ్వి దగ్గర నుంచి, ఆకాశంలో ఆకాశం అనేటటువంటి ఆధార స్థానం వరకూ, ఆధార ఆధేయ విమర్శ పద్ధతిగా, జడచేతన విమర్శ పద్ధతిగా, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా దీనిని చక్కగా విచారణ చేసి, నేను జ్ఞాతను, నేను కూటస్థుడను, అనే నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరము తప్పక ఉన్నది. 

ఈ రకంగా ఇంద్రియాల దగ్గర నుంచి, గోళకముల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి పంచ భూత తన్మాత్రల యొక్క అధిష్టములైన జ్ఞానమునకు, అక్కడి నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహతత్త్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు, ఆ తదుపరి ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి, అభేదత్వానికి మానవుడు సాధన ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది. 

ఇట్లా ఎవరైతే ప్రయాణం పూర్తి చేశారో, ఎవరైతే ఈ చిట్టచివరి స్థితికి చేరుకున్నారో, వారే దేశికేంద్రులు. వారే ముక్తులు. వారే జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. వారే మోక్షమును అధివసించినటువంటి వారు.

ప్రశ్న: గురువు గారు ఇక్కడ మీరు ఈశ్వర దర్శనం గురించి చెప్పారు కదా! ఈశ్వర సాకార దర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతి రూపాన్ని వెనుక ఒక భగవద్ శక్తే నడిపిస్తుంది అన్న భావన ఉంది. నిరాకారంతో ఇది వున్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధముగా వుంటుంది అన్నది ఏమన్నా చెబుతారా?

సమాధానం: స్వప్రకాశ దర్శనంగా వుంటుంది. - విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 15 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 15 🍀*

ఏక్ నామ హరీ ద్వైత నామ దురీ!
అద్వైత కుసరీ విరళా జాణే!!
సమబుద్ధి మౌతా సమాన్ శ్రీహరీ!
శమ దమావరీ హరీ ఝాలా!!
సర్వా ఘటీ రామ్ దేహాదేహీ ఏక్!
సూర్య ప్రకాశక్ సహస్ర రశ్మీ!!
జ్ఞానదేవా చిలీ హరిపాఠి నేమా!
మాగిలియా జన్మా ముక్తి ఝాలో!!

భావము:
హరినామము ఏక తత్వము కానీ ద్వైత నామాలను దూరము చేసి అద్వైత మార్గమును చేపట్టిన వారు బహు అరుదుగా ఉన్నారు. అని తెలుసుకో..

సమ బుద్ధితో వీక్షించి అంతట సమానముగ శ్రీహరి ఉన్నాడు అని తెలుసుకున్న వెంటనే శమధమాలను అధిగమించి హరి రూపము అయిపోతావు. సూర్యుడు ఒక్కడే కిరణాలు అనేకముగ ఉన్నట్లు దేహమందు దేహిగ సర్వ ఘటాలలో రామ తత్వము ఒక్కటే ఉన్నది. 

హరి పాఠనేమమును చిత్తమునందు నిలిపి పఠించే వారి వెనుకటి జన్మలు ముక్తి కాగలవని జ్ఞానదేవులు తెలిపినారు.

*🌻. నామ సుధ -15 🌻*

హరి ఒక్కడే హరి నామాలనేకము
ద్వైత నామాలను చేయుము దూరము
హరియే సమగ్ర అద్వైత తత్వము
ఎరిగిన భక్తులు బహు దుర్లభము
సమ బుద్ధితో యోచించుము
సమానము శ్రీహరియని గాంచుము
శమ దమాలు ఉడిగిన ఆనంతరము
మిగిలి యుందువు శ్రీహరి రూపము
సర్వ దేహాలలో రామ తత్వము
“దేహి దేహము ఏకరూపము”
సూర్యుడు ఒక్కడే కిరణాలనేకము
నామి ఒక్కడే నామాలనేకము
జ్ఞాన దేవునిది ఏక చిత్తము
నిరంతరము హరిపాఠ నేమము
పూర్వ జన్మ కర్మలు సహితము
ముక్తి నొందునని తెలిపెను వినుము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 162 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
154

Sri Maha Ganapataye Namah Sri Sarasvatyai Namah Sri Pada Vallabha Narasimha Sarasvati Sri Guru Dattatreyaya Namah

Sloka: 
Svayam taritu maksamah parannistarayet katham | Dure tam varjayet prajno dhirameva samasrayet ||

If he doesn’t get salvation for himself, how can he get it for others? It is also said that if he cannot climb up to the pot of curd hanging from the ceiling, how can he climb up to heaven? How will such a person uplift you? A wise man should keep away from such people and approach only a Sadguru who is courageous.

A lot of people don’t understand many spiritual truths. Many of them don’t want to admit that they don’t know, so they provide baseless explanations for those concepts. They don’t know anything. And they pass on these ignorant explanations to their disciples.
Once again, saluting the Guru who is of the form of Knowledge, Existence and Bliss, they are concluding this scripture in 3 slokas.

Sloka: 
Saccidananda rupaya vyapine paramatmane | Namassri gurunathaya prakasananda murtaye ||

Obeisance to the Guru who is All Pervasive, the embodiment of the Absolute, the embodiment of Knowledge and the embodiment of Bliss.

Sloka: 
Sacchidananda rupaya krsnaya klesaharine | Namo vedanta vedyaya gurave buddhi saksine ||

Obeisance to Sadguru, the image of Sachchidananda, who is an embodiment of Lord Vishnu, destroyer of all sorrows and miseries, and who is revealed through Upanishads, a witness to all the actions of the mind and intellect.

Sloka: 
Yasya prasadadahameva vishnuh mayyeva sarvam parikalpitam ca | Ittham vijanami sadatma tattvam tasyanghri padmam pranatosmi nityam ||

Obeisance to the lotus feet of Sachchidananda Sadguru whose grace has enabled me to grasp the principle of Supreme Truth and attain knowledge that I am Vishnu, that I am the all-pervasive soul and that the whole universe is conceived in me.

Sloka: Iti sri skanda purane uttara khande umamahesvara samvade sri guru gita samapta ||

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 86 / Sri Lalitha Sahasra Nama Stotram - 86 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 158 / Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*

*🌻158. 'నిర్మదా'🌻*

మదరహితురాలు శ్రీదేవి అగుటచే నిర్మదా అని పిలువబడుచున్నది. జీవుడు ప్రత్యగాత్మ అగుటచే అతడు మదమును పొందు అవకాశమున్నది. శ్రీదేవి సదాశివునితో కూడి యుండుటచే ఆమెకు ఆ భావన యుండదు. మదము అజ్ఞాన చిహ్నము. సమర్థులు, అసమర్థులు కూడా అంతో యింతో మదము కలిగి యుందురు. తమనుగూర్చిన దురభిమానమే మదము కలుగుటకు కారణము. అభిమానముండవలెనే గాని దురభిమానముండరాదు. 

మితిమీరిన అభిమానము తమపై తమకుండుట వలన మదమెక్కి ప్రవర్తింతురు. అసురుల మదమునకిదియే కారణము. మదము అసుర గుణము. అవకాశమును బట్టి దేవతలను కూడా ఈ గుణము ఆవరించగలదు. అప్పుడు వారు కూడా భంగపడుదురు. కానీ దేవతలు సహజముగ దైవీసంపత్తి కలవారగుటచే మదమావరించినను, భంగపడినపుడు తమ తప్పును తాము తెలుసుకొని శ్రీదేవినో లేక శ్రీమహావిష్ణువునో శరణాగతి జొచ్చెదరు.

మానవులలో కూడా దైవీస్వభావము కలవారు, ఆసురీ స్వభావము కలవారు యుందురు. దైవీస్వభావము కలవారు తమ తప్పులను తాము తెలుసుకొని వానిని సరిదిద్దుకొనుటకు దైవమును ఆశ్రయింతురు. ఆసురీ స్వభావము కలవారు తమ తప్పులను సమర్థించుకొనుచు పతనము చెందుచునుందురు. వారి నాశనమును వారే కొని తెచ్చుకొందురు. ఇట్టివారే దైవముపైనా గ్రహించుట, దూషించుట కూడ చేయుచు నుందురు.

శ్రీదేవి ఆరాధనము సక్రమముగా సాగినచో ఆరాధకులకు మదము తగ్గుట జరుగును. ఆరాధన పెరిగిన కొద్ది మదము పెరుగుట జరిగినచో ఆరాధన ఆసురీ మార్గమున ఉన్నదని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 158 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirmadā निर्मदा (158) 🌻*

She is without pride. Mada means pride. When someone has something that others do not have, it gives rise to pride. She has everything and everything comes out of Her (hiranya garbha or the golden egg or womb. 

It is the matrix of the imperishable substance, the Brahman. It is said to be the luminous 'fire mist' or ethereal stuff from which the universe was formed and generally applied to Brahma. 

This is described in the Rig-Veda as born from a golden egg, formed out of the seed deposited in the waters when they were produced as the first modifications of the Self-existent.) There is no necessity for Her to become proud of something.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 499 / Bhagavad-Gita - 499 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 9 🌴*

09. సత్త్వం సుఖే సంజయతి రజ: కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమ: ప్రమాదే సంజయత్యుత ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశస్థుడా! సత్త్వ గుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనత యందు అతనిని బంధించును.

🌷. భాష్యము :
తత్త్వవేత్తగాని, విజ్ఞానశాస్త్రవేత్తగాని లేదా విద్యనొసగు అధ్యాపకుడుగాని తన జ్ఞానరంగమందు నియుక్తుడై తద్ద్వారా సంతృప్తుడై యుండునట్లు, సత్త్వగుణము నందున్నవాడు తన కర్మచే లేదా జ్ఞానసముపార్జనా యత్నముచే తృప్తుడై యుండును. 

రజోగుణము నందున్నవాడు కామ్యకర్మల యందు రతుడై శక్త్యానుసారముగా ధనమును కూడబెట్టును. పిదప అట్టి ధనమును సత్కార్యములకై వినియోగించుటకు అతడి కొన్నిమార్లు వైద్యశాలలను నిర్మించుట, ధర్మసంస్థలకు దానమిచ్చుట వంటి కర్మల నొనరించుచుండును. 

ఇట్టి కార్యములన్నియును రజోగుణము నందున్నవాని లక్షణములు. ఇక తమోగుణలక్షణము మనుజుని జ్ఞానమును కప్పివేయుట. అట్టి తమోగుణము నందు మనుజుడు ఏది ఒనరించినను అది అతనికిగాని, ఇతరులకుగాని మేలును చేయజాలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 499 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 09 🌴*

09. sattvaṁ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata
jñānam āvṛtya tu tamaḥ pramāde sañjayaty uta

🌷 Translation : 
O son of Bharata, the mode of goodness conditions one to happiness; passion conditions one to fruitive action; and ignorance, covering one’s knowledge, binds one to madness.

🌹 Purport :
A person in the mode of goodness is satisfied by his work or intellectual pursuit, just as a philosopher, scientist or educator may be engaged in a particular field of knowledge and may be satisfied in that way.

 A man in the mode of passion may be engaged in fruitive activity; he owns as much as he can and spends for good causes. Sometimes he tries to open hospitals, give to charity institutions, etc. 

These are signs of one in the mode of passion. And the mode of ignorance covers knowledge. In the mode of ignorance, whatever one does is good neither for him nor for anyone.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -107 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 39 - 2

*🍀 34 - 2. తదేక నిష్ఠ : 
భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును. ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును. అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. 🍀*

భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును. 

ఆసక్తి కలుగుట, కలుగకపోవుట స్వభావము పై ఆధారపడి యుండును. స్వభావమున కనుగుణమైన పని స్వధర్మమగును. అందువలన స్వధర్మము నాచరించువారికి సహజముగ కొంత ఆసక్తి యుండును. ఆ ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును. 

అనగ అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. బుద్ధిని దైవముపై లగ్నము చేయుచుండగ, చిత్తము చెప్పు పైకి ప్రసరించుట సర్వసామాన్యము. అట్టివారు ఖండ ప్రజ్ఞ గలవారై, కార్యములందు విఫలు లగుచుందురు.  

అంతఃకరణ ప్రజ్ఞ అఖండమై, కార్యములందు ప్రయోగించి నపుడు సర్వసామాన్యముగ కార్యసిద్ధి కలుగును. అట్టివారు జ్ఞానము పై మనసు నిడినపుడు చిత్తము, మనసు, బుద్ధి, తాను (అహంకారము) జ్ఞానము నుపాసించుటచే జ్ఞాను లగుదురు. కర్మల నుపాసించునపుడు కూడ శాంతిగ నుందురు. 

పనులు చేయుచుండుట వలన వారికి శాంతి కరవు కాదు. పనులు చేయుచు కూడ పరమశాంతితో నుందురు. విస్తారమగు కార్యములు నిర్వర్తించుచు, ప్రశాంతముగ ఏమియు చేయని వారివలె గోచరించు వారు శ్రద్ధాళువులు, తత్పరులు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 307 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
75. అధ్యాయము - 30

*🌻. సతీదేహత్యాగము - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

శంకరుని పత్నియగు ఆ సతి మౌనమును వహించిన పిదప, అచట జరిగిన వృత్తాంతమెయ్యది? బ్రహ్మా! దానిని ఆదరముతో చెప్పుము (1). 

బ్రహ్మ ఇట్లు పలికెను -

సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను(2). ఆమె యథావిధిగా జలముతో ఆచనమును చేసి, వస్త్రముతో కప్పుకొని, శుచియై కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగమార్గమును ప్రవేశించెను (3). 

స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి, తరువాత ఉదానమును నాభి చక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్థాపనము చేసెను (4). శంకరునకు ప్రాణములకంటె ప్రియురాలు, దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థ్స లమను స్థానము నందుంచి, తరువాత కంఠ మార్గము గుండా కనుబొమల మధ్య లోనికి తీసుకొని వెళ్లెను (5).

ఆమె ఈ తీరున దక్షునియందలి కోపము వలన తన దేహమును త్యజించ గోరినదై, వెంటనే యోగమార్గము ననుసరించి దేహమునందు వాయువును, అగ్నిని ధరించెను (6). అపుడు యోగమార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్తయొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరమును దేనినీ చూడలేదు (7). 

ఓ మహర్షీ !వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కెకు అనుగుణముగా ఆ అగ్ని చే భస్మము చేయబడి క్రిందబడెను (8). భూమియందు, ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలగించె, మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను, చిత్రముగను ఉండెను (9).

అయ్యో !శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను (10). ఆశ్చర్యము !చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు, బ్రహ్మగారి కుమారుడు అగు ఈ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును (11). 

అయ్యో! మానవతి, వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలు అగు ఆ సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయెను (12). దుష్ట హృదయుడు, పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడు అగు ఆ దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు (13).

ఏలయనగా,శంభుని ద్వేషించు ఆ దక్షుడు తన దేహమునుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. ఆతడు మరణించిన మహానరకము ననుభవించగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు (14). సతీదేవి ప్రాణములను వీడుట అను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా, వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకి ఎత్తి లేచి నిలబడిరి (15). 

ద్వారమునందు అరవై వేల గణములు నిలబడియుండిరి. శంకర ప్రభుని సేవకులగు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి (16). 'మాకు నిందయగు గాక !అని' పలుకుచూ, వీరులగు శివగణ నాయకులందరు పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 60 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 5 🌻*

253. One whose consciousness works on the buddhic plane during meditation finds that although he is one with all the wonderful consciousness of the plane, yet there is a little circle of emptiness shutting him out from the rest. This little barrier is, of course, the causal body. In order that the buddhic vehicle shall be developed, even that must disappear. Then the man feels the reality of unobstructed Life in a way impossible to describe down here. 

Madame Blavatsky expressed the idea as a circle with its centre everywhere and its circumference nowhere – a very beautiful and expressive description.1 (1 Ante., Vol. II, p. 67.) Of course it is a paradox, but all things that can be said about these higher conditions must necessarily be paradoxical.

254. When the unity is fully realized the man feels, however paradoxical it may sound, as though his vehicle at that level filled the whole of the plane, as though he could transfer his point of consciousness to any place within that plane and still be the centre of the circle. It is an experience which is quite indescribable. 

Along with that feeling, permeating and accompanying it always, is a sense of the most intense bliss – bliss of which we can have no conception at all on these lower planes – something vivid, active, fiery beyond all imagination. Most bliss down here, at the rare moments when we feel anything deserving of the name, consists chiefly in the absence of pain. We are happy and blissful down here when, for a moment, we are free from fatigue and pain, when we can relax and feel that we are taking in pleasant influences. That is rather a negative feeling. 

The bliss of the buddhic plane is the most intensely active, vivid feeling. I do not know in the least how to express it. If you could imagine the most intense activity that you have ever felt and then replace that vivid and strenuous activity by a feeling of bliss, then somehow raise it – spiritualize it – to an altogether higher plane, to the nth power, it would convey some idea of what that feeling is.

255. It is an active reality which is quite overpowering in its strength. There is nothing at all passive about it; one is not resting. Down here we live lives of so much strain and strenuousness that rest is always a very prominent part of any ideal we may have; but there it is not in the least a feeling that one is resting or wanting to rest. 

One is a tremendous incarnate energy whose expression is to pour itself forth, and the idea of rest or the need of rest is entirely outside one’s consciousness. What to us here seems rest would seem a kind of negation up there. We have become one with the expression of the divine power, and that divine power is active life. 

People talk of the rest of nirvana – but that is from the lower point of view. It is the intensity of power that is the real characteristic of this higher life – a power so intense that it does not show itself in any sort of ordinary movement at all, but rather in one vast resistless sweep which might look like rest when viewed from below, but which means the consciousness of absolute power. 

It is impossible to express all this in words. When we have achieved this we have finally conquered the giant weed – the great enemy, the sense of separateness. It is the hardest task, on the whole, that is before us, because it involves everything else.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దధీచిమహర్షి-సువర్చల - 1 🌻*

జ్ఞానం:

1. దేవతలు పుణ్యమూర్తులేకాని, వారిని మించిపోయినటువంటి స్థితి మనుష్యులకు వస్తే, “వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించవలసిన వాళ్ళే కదా!” అనే భావన ఒకటి దేవతలకు ఉంటుందని అన్ని పురాణాలలోనూ మనకు తెలుస్తుంది. ఆ కారణంచేత ఆ తపస్సును భంగంచేసి వాళ్ళు అంత ఎత్తుకు ఎద్గకుండా చూడాలని దేవతలకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనేకమంది తపస్సులు భంగంచేస్తారు వాళ్ళు.

2. నదియందు ఒక వ్యక్తిత్వం భావించటం ఆర్యసంప్రదాయంలో ఎప్పుడూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ దేవతల దివ్యశక్తులు పంచభూతములలోనూ ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీకూడా-ఆ భూతములందుండే విశేషములైన వేరువేరు లక్షణములేవైతే ఉన్నాయో, వాటిని భాసింపచేస్తూ ఈశ్వరాజ్ఞగా ఆ కార్యాన్ని నెరవేరుస్తూ; ఆ నిర్వహణలో ఒక వ్యక్తిత్వము, అహంకారము ఎప్పుడయితే వచ్చిందో – ఆ దేవతలు ఇతర జీవులతో ఏవో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి-కోపమో, ప్రేమో-వాటియందు(ఆ దేవతాశక్తులవలన ఆ భూతములయందు) అలా పుట్టటం జరుగుతుందని పురాణం చెబుతుంది. దాన్ని మన పెద్దలు అలా గుర్తించారు.

3. దివ్యశక్తులను దేవతలుగా గుర్తించారు. అందుకనే వారికి అంత విలువ ఉంది. ఉదాహరణకు నది ఉన్నది. పర్వతం ఉన్నది. వాటికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, భూదేవికొక వ్యక్తిత్వం, వృక్షానికొక వ్యక్తిత్వం ఉన్నయి. మంత్రములతో వాటిని వ్యక్తులవలే భావించి మంత్రమూలకంగా వాటిని ఆరాధించటము, వరాలు అడిగి తీసుకోవటము మన హిందువులకు తెలిసిన విషయమే! అంటే మనుష్యులు మాత్రమే జీవులు కాదు. 

4. ఈ పంచ భూతములలోపల ప్రవేశించినటువంటి దివ్యశక్తులు-అవికూడా వ్యక్తిత్వంతో ఉన్నాయి. వాటికి నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. మనుష్యులు వాటిని ఆరాధించాలి. ఈ సంభంధం మొదటినుండీ ఆర్యుల దృషిలో వాళ్ళకు ముఖస్థంగా కంటికి కనబడి, ప్రత్యక్షంగా వాళ్ళకు అనుభూతమైన విషయమిది.

5. ఆర్యసంస్కృతిలో విదేశీయులకు అర్థంకాని విషయం ఇది. ‘మీరంతా రాళ్ళురప్పలు, చెట్లుచేమలు, పుట్టలకు పూజచేస్తుంటారు” అని అంటారు విదేశీయులు. దానియందు ఒకానొక తేజస్సుంది. దానియందు వ్యక్తిత్వం ఉంది. నదికి, పర్వతానికి అలా వాటివాటి వ్యక్తిత్వాలు వాటికిఉన్నాయి. 

6. ఈ విషయం వాళ్ళకు అర్థంకాదు. దానికి అర్థంచేసుకున్నవాడు, ఈ సృష్టిలో జడపదార్థమంటూ లేదు. పదార్థంలో దృశ్యమానంగా ఉండేది, జడములో అంతర్యామిగా ఉండేది చైతన్యము. చనిపోతే ఈ శరీరముకూడా జడమే! జడపదార్థం అంటే ఏమిటి? అందులో చైతన్యం ఉండదు.సృష్టిలో జడపదార్థంకూడా నశిస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 256 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻105. To do away with body-mind sense or identity, imbibe or dwell in the 'I am'. Later the 'I am' will merge into the ultimate nature. 🌻*

When the 'I am' dawned on you, in its very early stages it did not identify with the body. You will have to apply your mind, go back, and try to recollect that phase when only the pure 'I am' existed with no adjuncts. It is much later and very gradually that the 'I am' starts identifying with the body initially, and mind also, together with time. 

All this occurs with you yourself being quite unaware of it; parents, teachers, friends, relatives and surroundings contribute to the process and strengthen the verbal 'I am'- resulting in a well developed, so-called 'personality'. If you are lucky enough, at some stage of your life, you will come across the right Guru who will point out the fallacy of this mistaken identity. 

He now explains this knowledge 'I am' to you and asks you to abide in it, to do away with the body-mind sense or your present identity. By and by a moment will come when the 'I am' will merge into your true ultimate nature.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 131 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 10 🌻*

536. ఆదిలో ఆత్మగా నుండెను.
మధ్యలో జీవాత్మగా మారెను.
అంత్యములో పరమాత్మ అయ్యెను.

537. ఆత్యయనెడి బిందువునకు, పరమాత్మయనెడి సాగరమందలి నీటిమట్టముపై బుద్బుద (బుడగ) రూపమేర్పడినప్పుడు, ఆ బుడగ ద్వారా తాను వేరనియు సాగరము వేరనియు భావించుటలో స్వయముగా పరిమితిని, రూపమును, రూపము ద్వారా స్పృహ పూర్వకమగు అజ్ఞానమును సేకరించు చున్నది.

538. అజ్ఞాన మనెడి ఆ బుడగ చితికిపోయినప్పుడు బిందువు సాగరములో కలిసిపోయి సాగరమే అయిపోయినది. కనుక, ఆత్మ పరమాత్మలో నుండుటయేగాక వాస్తవమునకు ఆత్మయే పరమాత్మ.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 95 / Sri Vishnu Sahasra Namavali - 95 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*శతభిషం నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 95. అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |*
*అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ‖ 95 ‖ 🍀*

 🍀 886) అనంత: - 
అంతము లేనివాడు.

🍀 887) హుతభుక్ - 
హోమద్రవ్యము నారిగించువాడు.

🍀 888) భోక్తా - 
భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.

🍀 889) సుఖద: - 
భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.

🍀 890) నైకజ: - 
అనేక రూపములలో అవతరించువాడు.

🍀 891) అగ్రజ: - 
సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.

🍀 892) అనిర్వణ్ణ: - 
నిరాశ నెరుగనివాడు.

🍀 893) సదామర్షీ - 
సజ్జనుల దోషములను క్షమించువాడు.

🍀 894) లోకాధిష్టానం - 
ప్రపంచమంతటికి ఆధారభూతుడు.

🍀 895) అధ్బుత: - 
ఆశ్చర్య స్వరూపుడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 95 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Sathabisham 3rd Padam* 

*🌻 95. anantō hutabhugbhōktā sukhadō naikajōgrajaḥ |*
*anirviṇṇaḥ sadāmarṣī lōkādhiṣṭhānamadbhutaḥ || 95 || 🌻*