శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🌻 364-2. 'చిదేక రసరూపిణీ' 🌻

చక్కెర తనకు తాను తీపి కాదు. జీవుల నాలుకకు తీపి. నాలుక తనకు తాను తీపి కాదు. నాలుకపై చక్కెర పడినపుడు తీపి అనుభూతి కలుగును. ఇట్లు జీవుడు దేవుడే అయిననూ జీవుడిగా విడిపడి దేవునితో అనుసంధానము చెందిన మధురానుభూతి చెందును. అది యొక తీపి అనుభవము. తాదాత్మ్యము చెందును. దేవునితో యోగమున పొందు అనుభూతి అనందానుభూతికి పరాకాష్ఠ. దానిని బ్రహ్మానంద మందురు. తాను బ్రహ్మమే అయిపోయినచో యిక అనుభూతి యుండదు. శ్రీమాత ఈశ్వరునితో కూడియుండుట, బ్రహ్మముతో కూడి యుండుట చేయునని శాస్త్రములు తెలుపుచున్నవి.

అట్లు కూడి యుండి ఆమె శాశ్వత రసానందమున నున్నది. బ్రహ్మమనగా అకరృత్వ ధర్మము కలవాడు. అది తత్త్వము. తత్త్వము వుండుటయే గాని చేయునదేమియు లేదు. బ్రహ్మము సృష్టికి ఆవల యుండును. పరమై యుండును. అందులకే పరబ్రహ్మ మందురు. ఈశ్వరుడు కూడ బ్రహ్మమే. అతడు సృష్టి యందు వుండును. సృష్టికి స్వామి యతడు. అతని అధ్యక్షతనే సృష్టి జరుగును. సృష్టి మొత్తమునకు అతడే ప్రభువు. అతనికి కర్తృత్వ ధర్మ మున్నది. ఇట్టి ఈశ్వరునితో ఎప్పుడునూ కూడి యుండునది శ్రీమాత.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 364-2. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻

This nāma says that She is not different from Cit (nāma 362) or That (nāma 363), the qualities of the Brahman. There is no difference between conditioned and unconditioned Brahman as any modifications take place purely at the will of Brahman for the purpose of creation, sustenance and dissolution.

When knowledge is extracted, the essence of knowledge is obtained, possibly from its gross form to its subtle form. But, the foundational nature of both gross and subtle forms of knowledge is not different. This can be compared to milk and its derivatives.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 170. విచారం / Osho Daily Meditations - 170. SADNESS

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 170 / Osho Daily Meditations - 170 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 170. విచారం 🍀

🕉. విచారంగా ఉన్నప్పుడు, నిజంగా విచారంగా ఉండండి, విచారంలో మునిగిపోండి. విచారం అవసరం. ఇది చాలా విశ్రాంతిగా ఉంటుంది. మిమ్మల్ని చుట్టుముట్టే చీకటి రాత్రి అది. అందులో పడుకో. దాన్ని అంగీకరించండి, మరియు మీరు విచారాన్ని అంగీకరించిన క్షణం, అది అందంగా మారడం ప్రారంభిస్తుంది. 🕉

మనము విచారంగా ఉండడాన్ని తిరస్కరించుట వలన కలిగే దుఃఖము వికారమైనది; మీరు దానిని అంగీకరించిన తర్వాత, అది ఎంత అందంగా ఉందో, ఎంత విశ్రాంతిగా ఉందో, ఎంత ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉందో మీరు చూస్తారు. ఎప్పుడూ ఇవ్వలేని ఆనందాన్ని ఇవ్వడానికి దానిలో కావలసినంత సమర్ధత ఉంది. విచారం లోతును ఇస్తుంది. ఆనందం ఔన్నత్యాన్ని ఇస్తుంది. విచారం మూలాలను ఇస్తుంది. ఆనందం శాఖలను ఇస్తుంది. ఆనందం అనేది ఆకాశంలోకి వెళ్లే చెట్టు లాంటిది, మరియు దుఃఖం అనేది భూమి యొక్క గర్భంలోకి వెళ్లే వేర్లు లాంటిది. రెండూ అవసరమే. చెట్టు ఎంత ఎత్తుకు వెళుతుందో, అది ఏకకాలంలో లోతుగా వెళుతుంది. చెట్టు ఎంత పెద్దదైతే దాని మూలాలు అంత పెద్దవిగా ఉంటాయి. నిజానికి, ఇది ఎల్లప్పుడూ సరైన నిష్పత్తిలో ఉంటుంది. అది దాని సహజ సంతులన.

మీరు సంతులనాన్ని తీసుకురాలేరు. మీరు తెచ్చిన సంతులన వల్ల ఉపయోగం లేదు. ఇది బలవంతంగా ఉంటుంది. సంతులనం ఆకస్మికంగా వస్తుంది; ఇది ఇప్పటికే ఉంది. నిజానికి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు అలసి పోయేంత ఉత్సాహంగా ఉంటారు. మీరు చూసారా? గుండె వెంటనే ఇతర దిశలో కదులుతుంది, మీకు విశ్రాంతి ఇస్తుంది. మీరు దానిని విచారంగా భావిస్తారు. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నందున ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఇది ఔషధం మరియు చికిత్స. పగటిపూట కష్టపడి రాత్రిపూట గాఢనిద్రలోకి జారుకున్నట్లే. ఉదయం మీరు మళ్లీ తాజాగా ఉన్నారు. గాఢ విచారం తర్వాత మీరు మళ్లీ తాజాగా ఉంటారు, ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉంటారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 170 🌹

📚. Prasad Bharadwaj

🍀 170. SADNESS 🍀

🕉 When sad, be really sad, sink into sadness. What else can you do? Sadness is needed. It is very relaxing, a dark night that surrounds you. Fall asleep into it. Accept it, and you will see that the moment you accept sadness, it starts becoming beautiful. 🕉

Sadness is ugly because of our rejection of it; it is not ugly in itself. Once you accept it, you will see how beautiful it is, how relaxing, how calm and quiet, how silent. It has something to give that happinesscan never give. Sadness gives depth. Happiness gives height. Sadness gives roots. Happiness gives branches. Happiness is like a tree going into the sky, and sadness is like the roots going down into the womb of the earth. Both are needed, and the higher a tree goes, the deeper it goes, simultaneously. The bigger the tree, the bigger will be its roots. In fact, it is always in proportion. That's its balance.

You cannot bring the balance. The balance that you bring is of no use. It will be forced. Balance comes spontaneously; it is already there. In fact, when you are happy, you become so excited that it is tiring. Have you watched? The heart immediately moves then into the other direction, gives you a rest. You feel it as sadness. It is giving you a rest, because you were getting too excited. It is medicinal, therapeutic. It is just as in the day you work hard and in the night you fall deeply asleep. In the morning you are fresh again. After sadness you will be fresh again, ready to be excited.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 13

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. భారతము యొక్క వర్ణనము - 1 🌻

అగ్ని పలికెను.

కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూ భారమును హరించెను.

విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి. యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. అతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. అతని వంశమునందు శంతనువు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద- విచిత్రలు పుట్టిరి.

శంతనువు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగుదుని, చిత్రాంగదుడనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరాజు కుమార్తెలైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్థుడయ్యెను.

సత్యవతి అనుమతిచో వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలికయందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును. వాయుదేవునివలన భీముడును. దేవేంద్రునివలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి అతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana -35 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 13 - Bharatam

🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 1 🌻

Agni said:

1. I shall narrate the (story of) Bhārata (which has) the description of the greatness of Kṛṣṇa. Viṣṇu removed heavy oppression on the earth having Pāṇḍavas as the instrumental cause.

2. Brahmā was born of the lotus in the navel of Viṣṇu. (Sage) Atri was the son of Brahmā. From Atri was born Soma. From Soma, Budha was born. From him (Budha) was born Aila—Purūravas.

3-4. Āyu (was born) from him. King Nahuṣa was then (born). Then Yayāti, then Puru (were born successsively). In his race (was born) Bharata. Then king Kuru (was born). In that race (was born) Śantanu. From him (was born) Bhīṣma (as) the son of the Ganges. (His) brothers Citriiṅgada and Vicitra (vīrya) were born to Śantanu through Satyavatī.

5-8. After Śantanu’s death, Bhīṣma who had no wife, (governed and) protected his brother’s kingdom. The young Citrāṅgada was killed by the Gandharva Citrāṅgada. The two daughters of Kāśirāja, Ambikā and Ambālikā brought (as captives) by Bhīṣma, the conqueror of the foes, (became) the wives of Vicitravīrya, He (Vicitravīrya) died on account of consumption. With the consent of Satyavatī, from Vyāsa, King Dhṛtarāṣṭra was (born) through Ambikā and Pāṇḍu through Ambālikā as sons. From Dhṛtarāṣṭra through Gāndhārī hundred sons (were born) with Duryodhana as the first.

9. By the curse of a sage[1] then he (Pāṇḍu) died on account of union with his wife at the hermitage of Śataśṛṅga, then Yudhiṣṭhira (was born) to Pāṇḍu through Kuntī from Dharma (Yama).

10. (Similarly) Bhīma from Vāta (God of wind), Arjuna from Śakra (were born) and through Mādri, Nakula and Sahadeva from the Aśvini kumāra. Pāṇḍu died when (he was) in union with Mādrī.37

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 551 / Sri Siva Maha Purana - 551

🌹 . శ్రీ శివ మహా పురాణము - 551 / Sri Siva Maha Purana - 551 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴

🌻. కామ సంజీవనము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

అది అనునకూలమగు సమయమని తలంచిన రతీదేవి మిక్కిలి ప్రసన్నురాలై దీనవత్సలుడగు ఆ శంకరునితో నిట్లనెను (1).

రతి ఇట్లు పలికెను -

పార్వతిని వివాహమాడి నీవు మిక్కిలి దుర్లభమగు సౌభాగ్యమును పొందితివి. స్వార్థము నెరుంగని నా ప్రాణ ప్రియుడగు భర్త భస్మము చేయబడుటకు కారణమేమి? (2) ఈ సమయమలో ఈ నా భర్తను బ్రతికించి నీ యందు ప్రేమ కార్యమును నింపు కొనుము. మనిద్దరకీ సమానముగా కలిగిన వియోగ దుఃఖమును దూరము చేయుము (3). ఓ మహేశ్వరా! ఈ వివాహమహోత్సవములో అందరు జనులు ఆనందముగా నున్నారు. నేనోక్కతెను మాత్రమే భర్త లేని కారణముచే దుఃఖితురాలనై ఉన్నాను (4). ఓ దేవా! నా భర్తను బ్రతికించుము. ఓ శంకరా! ప్రసన్నుడవు కమ్ము. ఓ దీన బంధూ! నీమాటను నీవు కార్యరూపములో పెట్టుము (5).

స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములలో నా దుఃఖమును నశింప చేయ గలవాడు నీవు తక్క మరియొకడు ఎవడు గలడు? ఈ సత్యము నెరింగి నా యందు దయను చూపుము (6). దీనులయందు దయను చూపే ఓ నాథా! సర్వులకు ఆనందమును కలిగించు ఈ నీ వివాహము మహోత్సవముగా జరిగినది. నన్ను కూడ ఉత్సవము గలదానినిగా చేయుము (7). నా భర్త జీవించిన తరువాత ప్రియురాలగు పార్వతితో ఈ నీ విహారము పరిపూర్ణము కాగలదనుటలో సందేహము లేదు (8). పరమేశ్వరుడవగు నీవు సర్వకార్యములను చేయ సమర్థుడవు. ఇన్ని మాటలేల? ఓ సర్వేశ్వరా! ఇపుడు వెంటనే నా భర్తను బ్రతికించుము (9).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి మూట గట్టియున్న మన్మథుని భస్మమును ఇచ్చెను. ఆమె శంభుని యెదుట ' నాథా! నాథా' అని పలుకుతూ రోదించెను (10). రతి యొక్క ఏడుపును విని సరస్వతి మొదలగు దేవీమూర్తులందరు రోదించి దీనాతిదీనముగా నిట్లు పలికిరి (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 551 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴

🌻 The resuscitation of Kāma - 1 🌻

Brahmā said:—

1. At that time, thinking that the hour was favourable, Rati hopefully spoke to Śiva who is favourably disposed towards depressed people.

Rati said:—

2. Why did you reduce my beloved husband to ashes without gaining any interest when he had come near you with Pārvatī? He was my only fortunate possession very rare to get.

3. Give me back my husband, the lord of my journey of life who used to work lovingly with me. Remove my distress caused by separation.

4. O lord Śiva, in the great festival of your marriage, all people are happy. I alone am unhappy without my husband.

5. O lord, make me possessed of my husband. O Śiva, be pleased. O lord, friend of the distressed, please make your words true.

6. Excepting you, who is there in the three worlds including the mobile and immobile creatures who can destroy my sorrow. Knowing this, be merciful.

7. O lord, merciful to the depressed, make me jubilant at the jubilant celebration of your marriage that gives pleasure to everyone.

8. There is no doubt in this, that only when my lord is resuscitated will your sportive dalliance with your beloved Pārvatī be complete and perfect.

9. You are competent to do everything because you are the supreme lord. O lord of all, of what avail is this talk. Please resuscitate my husband quickly.

Brahmā said:—-

10. After saying thus she gave him the ashes of the cupid along with the bag in which they had been contained. “O lord, O lord”, saying thus she lamented much in front of Śiva.

11. On hearing the lamentation of Rati, Sarasvatī and other celestial ladies wept bitterly and spoke in piteous tones.

Continues....

🌹🌹🌹🌹🌹

18 Apr 2022

గీతోపనిషత్తు -353

🌹. గీతోపనిషత్తు -353 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚

🍀 33-3. కూడి యుండుట - "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచు నుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధములు అదృశ్యమగును. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును. 🍀

కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.

వివరణము : ఈ శ్లోకమున మరియొక సత్యమును దైవము ప్రకటించి నాడు. "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచునుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధము లదృశ్యమగును. ఒకనాడాప్తులుగ నున్నవారు మరొకనాడు దూరమగుచు నుందురు. దూరమైన వారిని గూర్చిన ఆరాట ముండునే గాని, వారంతగ ప్రతిస్పందించరు.

తానిష్టపడిన వారందరును వారికిష్టమైన వారితో మెలగుచు నిరాశ, నిస్పృహ కలిగింతురు. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. సంబంధ బాంధవ్యములు నీటి మీద వ్రాతలవలె ఏర్పడుచు, అదృశ్య మగుచుండును. వాటిని గూర్చిన భావన అసుఖమునే ఇచ్చును. అంతేకాదు అవి అనిత్యములు కూడ. ఒకప్పటి తండ్రి తాతలు ఇప్పుడు లేరు. అట్లే కొంతకాలమునకు మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Apr 2022

18 - APRIL - 2022 సోమవారం ఇందు వాసరే Monday MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, సోమవారం, ఏప్రిల్ 2022 ఇందు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 33-3 - 353 - కూడి యుండుట🌹 
3) 🌹. శివ మహా పురాణము - 551 / Siva Maha Purana - 551 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 170 / Osho Daily Meditations - 170 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 18, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 19 🍀*

*37. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!*
*నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!*
*38. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!*
*నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చెడు గుణాలను సవరించు కోవడానికి పూజ, జపం, ఉపాసన మొదలైన వాటికంటే ఆత్మ శోధన ఎంతో గొప్పది, విలువైనది. - సద్గురు శ్రీరామ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: కృష్ణ విదియ 19:25:59 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: విశాఖ 27:39:06 వరకు
తదుపరి అనూరాధ
యోగం: సిధ్ధి 20:24:04 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: తైతిల 08:43:52 వరకు
వర్జ్యం: 10:43:10 - 12:11:30
దుర్ముహూర్తం: 12:40:43 - 13:31:01
మరియు 15:11:37 - 16:01:56
రాహు కాలం: 07:32:36 - 09:06:55
గుళిక కాలం: 13:49:53 - 15:24:12
యమ గండం: 10:41:14 - 12:15:34
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 19:33:10 - 21:01:30
సూర్యోదయం: 05:58:16
సూర్యాస్తమయం: 18:32:51
చంద్రోదయం: 20:16:36
చంద్రాస్తమయం: 07:01:47
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: తుల
మిత్ర యోగం - మిత్ర లాభం 27:39:06
వరకు తదుపరి మానస యోగం 
- కార్య లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -353 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚*
 
*🍀 33-3. కూడి యుండుట - "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచు నుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధములు అదృశ్యమగును. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును. 🍀*

*కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |*
*అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33*

*తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.*

*వివరణము : ఈ శ్లోకమున మరియొక సత్యమును దైవము ప్రకటించి నాడు. "ఈ లోకము అనిత్యము, అసుఖము. కావున నన్ను సేవించుచు నాతో యుండుము" అని తెలిపినాడు. లోకము నందలి లోకులు సంబంధములు బంధములు పెంచుకొను చుందురు. నా ఇల్లాలని, నా కుమారుడని, నా బంధువులని, నా మిత్రులని భావించుచు సేవ చేయుచునుందురు. కాని ఋణము తీరిన వెంటనే సంబంధము లదృశ్యమగును. ఒకనాడాప్తులుగ నున్నవారు మరొకనాడు దూరమగుచు నుందురు. దూరమైన వారిని గూర్చిన ఆరాట ముండునే గాని, వారంతగ ప్రతిస్పందించరు.*

*తానిష్టపడిన వారందరును వారికిష్టమైన వారితో మెలగుచు నిరాశ, నిస్పృహ కలిగింతురు. ఈ సంబంధములు శాశ్వతము కాదని తెలిసియు జీవుడారాటపడుచు సుఖమును కోల్పోవును. సంబంధ బాంధవ్యములు నీటి మీద వ్రాతలవలె ఏర్పడుచు, అదృశ్య మగుచుండును. వాటిని గూర్చిన భావన అసుఖమునే ఇచ్చును. అంతేకాదు అవి అనిత్యములు కూడ. ఒకప్పటి తండ్రి తాతలు ఇప్పుడు లేరు. అట్లే కొంతకాలమునకు మనమీ లోకము నుండి నిష్క్రమించి మరల ప్రవేశించునపుడు ఆత్మ సంబంధము లేమియు గుర్తురావు. అంతయు నూతనముగ నుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 551 / Sri Siva Maha Purana - 551 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴*

*🌻. కామ సంజీవనము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -
అది అనునకూలమగు సమయమని తలంచిన రతీదేవి మిక్కిలి ప్రసన్నురాలై దీనవత్సలుడగు ఆ శంకరునితో నిట్లనెను (1).

రతి ఇట్లు పలికెను -

పార్వతిని వివాహమాడి నీవు మిక్కిలి దుర్లభమగు సౌభాగ్యమును పొందితివి. స్వార్థము నెరుంగని నా ప్రాణ ప్రియుడగు భర్త భస్మము చేయబడుటకు కారణమేమి? (2) ఈ సమయమలో ఈ నా భర్తను బ్రతికించి నీ యందు ప్రేమ కార్యమును నింపు కొనుము. మనిద్దరకీ సమానముగా కలిగిన వియోగ దుఃఖమును దూరము చేయుము (3). ఓ మహేశ్వరా! ఈ వివాహమహోత్సవములో అందరు జనులు ఆనందముగా నున్నారు. నేనోక్కతెను మాత్రమే భర్త లేని కారణముచే దుఃఖితురాలనై ఉన్నాను (4). ఓ దేవా! నా భర్తను బ్రతికించుము. ఓ శంకరా! ప్రసన్నుడవు కమ్ము. ఓ దీన బంధూ! నీమాటను నీవు కార్యరూపములో పెట్టుము (5).

స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములలో నా దుఃఖమును నశింప చేయ గలవాడు నీవు తక్క మరియొకడు ఎవడు గలడు? ఈ సత్యము నెరింగి నా యందు దయను చూపుము (6). దీనులయందు దయను చూపే ఓ నాథా! సర్వులకు ఆనందమును కలిగించు ఈ నీ వివాహము మహోత్సవముగా జరిగినది. నన్ను కూడ ఉత్సవము గలదానినిగా చేయుము (7). నా భర్త జీవించిన తరువాత ప్రియురాలగు పార్వతితో ఈ నీ విహారము పరిపూర్ణము కాగలదనుటలో సందేహము లేదు (8). పరమేశ్వరుడవగు నీవు సర్వకార్యములను చేయ సమర్థుడవు. ఇన్ని మాటలేల? ఓ సర్వేశ్వరా! ఇపుడు వెంటనే నా భర్తను బ్రతికించుము (9).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి మూట గట్టియున్న మన్మథుని భస్మమును ఇచ్చెను. ఆమె శంభుని యెదుట ' నాథా! నాథా' అని పలుకుతూ రోదించెను (10). రతి యొక్క ఏడుపును విని సరస్వతి మొదలగు దేవీమూర్తులందరు రోదించి దీనాతిదీనముగా నిట్లు పలికిరి (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 551 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴*

*🌻 The resuscitation of Kāma - 1 🌻*

Brahmā said:—

1. At that time, thinking that the hour was favourable, Rati hopefully spoke to Śiva who is favourably disposed towards depressed people.

Rati said:—

2. Why did you reduce my beloved husband to ashes without gaining any interest when he had come near you with Pārvatī? He was my only fortunate possession very rare to get.

3. Give me back my husband, the lord of my journey of life who used to work lovingly with me. Remove my distress caused by separation.

4. O lord Śiva, in the great festival of your marriage, all people are happy. I alone am unhappy without my husband.

5. O lord, make me possessed of my husband. O Śiva, be pleased. O lord, friend of the distressed, please make your words true.

6. Excepting you, who is there in the three worlds including the mobile and immobile creatures who can destroy my sorrow. Knowing this, be merciful.

7. O lord, merciful to the depressed, make me jubilant at the jubilant celebration of your marriage that gives pleasure to everyone.

8. There is no doubt in this, that only when my lord is resuscitated will your sportive dalliance with your beloved Pārvatī be complete and perfect.

9. You are competent to do everything because you are the supreme lord. O lord of all, of what avail is this talk. Please resuscitate my husband quickly.

Brahmā said:—-

10. After saying thus she gave him the ashes of the cupid along with the bag in which they had been contained. “O lord, O lord”, saying thus she lamented much in front of Śiva.

11. On hearing the lamentation of Rati, Sarasvatī and other celestial ladies wept bitterly and spoke in piteous tones.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 13*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. భారతము యొక్క వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను.
కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూ భారమును హరించెను.

విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి. యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. అతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. అతని వంశమునందు శంతనువు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద- విచిత్రలు పుట్టిరి.

శంతనువు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగుదుని, చిత్రాంగదుడనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరాజు కుమార్తెలైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్థుడయ్యెను.

సత్యవతి అనుమతిచో వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలికయందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును. వాయుదేవునివలన భీముడును. దేవేంద్రునివలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి అతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -35 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 13 - Bharatam*
*🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 1 🌻*

Agni said:

1. I shall narrate the (story of) Bhārata (which has) the description of the greatness of Kṛṣṇa. Viṣṇu removed heavy oppression on the earth having Pāṇḍavas as the instrumental cause.

2. Brahmā was born of the lotus in the navel of Viṣṇu. (Sage) Atri was the son of Brahmā. From Atri was born Soma. From Soma, Budha was born. From him (Budha) was born Aila—Purūravas.

3-4. Āyu (was born) from him. King Nahuṣa was then (born). Then Yayāti, then Puru (were born successsively). In his race (was born) Bharata. Then king Kuru (was born). In that race (was born) Śantanu. From him (was born) Bhīṣma (as) the son of the Ganges. (His) brothers Citriiṅgada and Vicitra (vīrya) were born to Śantanu through Satyavatī.

5-8. After Śantanu’s death, Bhīṣma who had no wife, (governed and) protected his brother’s kingdom. The young Citrāṅgada was killed by the Gandharva Citrāṅgada. The two daughters of Kāśirāja, Ambikā and Ambālikā brought (as captives) by Bhīṣma, the conqueror of the foes, (became) the wives of Vicitravīrya, He (Vicitravīrya) died on account of consumption. With the consent of Satyavatī, from Vyāsa, King Dhṛtarāṣṭra was (born) through Ambikā and Pāṇḍu through Ambālikā as sons. From Dhṛtarāṣṭra through Gāndhārī hundred sons (were born) with Duryodhana as the first.

9. By the curse of a sage[1] then he (Pāṇḍu) died on account of union with his wife at the hermitage of Śataśṛṅga, then Yudhiṣṭhira (was born) to Pāṇḍu through Kuntī from Dharma (Yama).

10. (Similarly) Bhīma from Vāta (God of wind), Arjuna from Śakra (were born) and through Mādri, Nakula and Sahadeva from the Aśvini kumāra. Pāṇḍu died when (he was) in union with Mādrī.37

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 170 / Osho Daily Meditations - 170 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 170. విచారం 🍀*

*🕉. విచారంగా ఉన్నప్పుడు, నిజంగా విచారంగా ఉండండి, విచారంలో మునిగిపోండి. విచారం అవసరం. ఇది చాలా విశ్రాంతిగా ఉంటుంది. మిమ్మల్ని చుట్టుముట్టే చీకటి రాత్రి అది. అందులో పడుకో. దాన్ని అంగీకరించండి, మరియు మీరు విచారాన్ని అంగీకరించిన క్షణం, అది అందంగా మారడం ప్రారంభిస్తుంది. 🕉*
 
*మనము విచారంగా ఉండడాన్ని తిరస్కరించుట వలన కలిగే దుఃఖము వికారమైనది; మీరు దానిని అంగీకరించిన తర్వాత, అది ఎంత అందంగా ఉందో, ఎంత విశ్రాంతిగా ఉందో, ఎంత ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉందో మీరు చూస్తారు. ఎప్పుడూ ఇవ్వలేని ఆనందాన్ని ఇవ్వడానికి దానిలో కావలసినంత సమర్ధత ఉంది. విచారం లోతును ఇస్తుంది. ఆనందం ఔన్నత్యాన్ని ఇస్తుంది. విచారం మూలాలను ఇస్తుంది. ఆనందం శాఖలను ఇస్తుంది. ఆనందం అనేది ఆకాశంలోకి వెళ్లే చెట్టు లాంటిది, మరియు దుఃఖం అనేది భూమి యొక్క గర్భంలోకి వెళ్లే వేర్లు లాంటిది. రెండూ అవసరమే. చెట్టు ఎంత ఎత్తుకు వెళుతుందో, అది ఏకకాలంలో లోతుగా వెళుతుంది. చెట్టు ఎంత పెద్దదైతే దాని మూలాలు అంత పెద్దవిగా ఉంటాయి. నిజానికి, ఇది ఎల్లప్పుడూ సరైన నిష్పత్తిలో ఉంటుంది. అది దాని సహజ సంతులన.*

*మీరు సంతులనాన్ని తీసుకురాలేరు. మీరు తెచ్చిన సంతులన వల్ల ఉపయోగం లేదు. ఇది బలవంతంగా ఉంటుంది. సంతులనం ఆకస్మికంగా వస్తుంది; ఇది ఇప్పటికే ఉంది. నిజానికి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు అలసి పోయేంత ఉత్సాహంగా ఉంటారు. మీరు చూసారా? గుండె వెంటనే ఇతర దిశలో కదులుతుంది, మీకు విశ్రాంతి ఇస్తుంది. మీరు దానిని విచారంగా భావిస్తారు. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నందున ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఇది ఔషధం మరియు చికిత్స. పగటిపూట కష్టపడి రాత్రిపూట గాఢనిద్రలోకి జారుకున్నట్లే. ఉదయం మీరు మళ్లీ తాజాగా ఉన్నారు. గాఢ విచారం తర్వాత మీరు మళ్లీ తాజాగా ఉంటారు, ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉంటారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 170 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 170. SADNESS 🍀*

*🕉 When sad, be really sad, sink into sadness. What else can you do? Sadness is needed. It is very relaxing, a dark night that surrounds you. Fall asleep into it. Accept it, and you will see that the moment you accept sadness, it starts becoming beautiful. 🕉*
 
*Sadness is ugly because of our rejection of it; it is not ugly in itself. Once you accept it, you will see how beautiful it is, how relaxing, how calm and quiet, how silent. It has something to give that happinesscan never give. Sadness gives depth. Happiness gives height. Sadness gives roots. Happiness gives branches. Happiness is like a tree going into the sky, and sadness is like the roots going down into the womb of the earth. Both are needed, and the higher a tree goes, the deeper it goes, simultaneously. The bigger the tree, the bigger will be its roots. In fact, it is always in proportion. That's its balance.*

*You cannot bring the balance. The balance that you bring is of no use. It will be forced. Balance comes spontaneously; it is already there. In fact, when you are happy, you become so excited that it is tiring. Have you watched? The heart immediately moves then into the other direction, gives you a rest. You feel it as sadness. It is giving you a rest, because you were getting too excited. It is medicinal, therapeutic. It is just as in the day you work hard and in the night you fall deeply asleep. In the morning you are fresh again. After sadness you will be fresh again, ready to be excited.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 364-2. 'చిదేక రసరూపిణీ' 🌻* 

*చక్కెర తనకు తాను తీపి కాదు. జీవుల నాలుకకు తీపి. నాలుక తనకు తాను తీపి కాదు. నాలుకపై చక్కెర పడినపుడు తీపి అనుభూతి కలుగును. ఇట్లు జీవుడు దేవుడే అయిననూ జీవుడిగా విడిపడి దేవునితో అనుసంధానము చెందిన మధురానుభూతి చెందును. అది యొక తీపి అనుభవము. తాదాత్మ్యము చెందును. దేవునితో యోగమున పొందు అనుభూతి అనందానుభూతికి పరాకాష్ఠ. దానిని బ్రహ్మానంద మందురు. తాను బ్రహ్మమే అయిపోయినచో యిక అనుభూతి యుండదు. శ్రీమాత ఈశ్వరునితో కూడియుండుట, బ్రహ్మముతో కూడి యుండుట చేయునని శాస్త్రములు తెలుపుచున్నవి.*

*అట్లు కూడి యుండి ఆమె శాశ్వత రసానందమున నున్నది. బ్రహ్మమనగా అకరృత్వ ధర్మము కలవాడు. అది తత్త్వము. తత్త్వము వుండుటయే గాని చేయునదేమియు లేదు. బ్రహ్మము సృష్టికి ఆవల యుండును. పరమై యుండును. అందులకే పరబ్రహ్మ మందురు. ఈశ్వరుడు కూడ బ్రహ్మమే. అతడు సృష్టి యందు వుండును. సృష్టికి స్వామి యతడు. అతని అధ్యక్షతనే సృష్టి జరుగును. సృష్టి మొత్తమునకు అతడే ప్రభువు. అతనికి కర్తృత్వ ధర్మ మున్నది. ఇట్టి ఈశ్వరునితో ఎప్పుడునూ కూడి యుండునది శ్రీమాత.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini*
*Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 364-2. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻*

*This nāma says that She is not different from Cit (nāma 362) or That (nāma 363), the qualities of the Brahman. There is no difference between conditioned and unconditioned Brahman as any modifications take place purely at the will of Brahman for the purpose of creation, sustenance and dissolution.*

*When knowledge is extracted, the essence of knowledge is obtained, possibly from its gross form to its subtle form. But, the foundational nature of both gross and subtle forms of knowledge is not different. This can be compared to milk and its derivatives.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹