శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana - 35 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. భారతము యొక్క వర్ణనము - 1 🌻
అగ్ని పలికెను.
కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూ భారమును హరించెను.
విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి. యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. అతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. అతని వంశమునందు శంతనువు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద- విచిత్రలు పుట్టిరి.
శంతనువు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగుదుని, చిత్రాంగదుడనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరాజు కుమార్తెలైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్థుడయ్యెను.
సత్యవతి అనుమతిచో వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలికయందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును. వాయుదేవునివలన భీముడును. దేవేంద్రునివలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి అతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -35 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 13 - Bharatam
🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 1 🌻
Agni said:
1. I shall narrate the (story of) Bhārata (which has) the description of the greatness of Kṛṣṇa. Viṣṇu removed heavy oppression on the earth having Pāṇḍavas as the instrumental cause.
2. Brahmā was born of the lotus in the navel of Viṣṇu. (Sage) Atri was the son of Brahmā. From Atri was born Soma. From Soma, Budha was born. From him (Budha) was born Aila—Purūravas.
3-4. Āyu (was born) from him. King Nahuṣa was then (born). Then Yayāti, then Puru (were born successsively). In his race (was born) Bharata. Then king Kuru (was born). In that race (was born) Śantanu. From him (was born) Bhīṣma (as) the son of the Ganges. (His) brothers Citriiṅgada and Vicitra (vīrya) were born to Śantanu through Satyavatī.
5-8. After Śantanu’s death, Bhīṣma who had no wife, (governed and) protected his brother’s kingdom. The young Citrāṅgada was killed by the Gandharva Citrāṅgada. The two daughters of Kāśirāja, Ambikā and Ambālikā brought (as captives) by Bhīṣma, the conqueror of the foes, (became) the wives of Vicitravīrya, He (Vicitravīrya) died on account of consumption. With the consent of Satyavatī, from Vyāsa, King Dhṛtarāṣṭra was (born) through Ambikā and Pāṇḍu through Ambālikā as sons. From Dhṛtarāṣṭra through Gāndhārī hundred sons (were born) with Duryodhana as the first.
9. By the curse of a sage[1] then he (Pāṇḍu) died on account of union with his wife at the hermitage of Śataśṛṅga, then Yudhiṣṭhira (was born) to Pāṇḍu through Kuntī from Dharma (Yama).
10. (Similarly) Bhīma from Vāta (God of wind), Arjuna from Śakra (were born) and through Mādri, Nakula and Sahadeva from the Aśvini kumāra. Pāṇḍu died when (he was) in union with Mādrī.37
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment