శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🌻 364-2. 'చిదేక రసరూపిణీ' 🌻


చక్కెర తనకు తాను తీపి కాదు. జీవుల నాలుకకు తీపి. నాలుక తనకు తాను తీపి కాదు. నాలుకపై చక్కెర పడినపుడు తీపి అనుభూతి కలుగును. ఇట్లు జీవుడు దేవుడే అయిననూ జీవుడిగా విడిపడి దేవునితో అనుసంధానము చెందిన మధురానుభూతి చెందును. అది యొక తీపి అనుభవము. తాదాత్మ్యము చెందును. దేవునితో యోగమున పొందు అనుభూతి అనందానుభూతికి పరాకాష్ఠ. దానిని బ్రహ్మానంద మందురు. తాను బ్రహ్మమే అయిపోయినచో యిక అనుభూతి యుండదు. శ్రీమాత ఈశ్వరునితో కూడియుండుట, బ్రహ్మముతో కూడి యుండుట చేయునని శాస్త్రములు తెలుపుచున్నవి.

అట్లు కూడి యుండి ఆమె శాశ్వత రసానందమున నున్నది. బ్రహ్మమనగా అకరృత్వ ధర్మము కలవాడు. అది తత్త్వము. తత్త్వము వుండుటయే గాని చేయునదేమియు లేదు. బ్రహ్మము సృష్టికి ఆవల యుండును. పరమై యుండును. అందులకే పరబ్రహ్మ మందురు. ఈశ్వరుడు కూడ బ్రహ్మమే. అతడు సృష్టి యందు వుండును. సృష్టికి స్వామి యతడు. అతని అధ్యక్షతనే సృష్టి జరుగును. సృష్టి మొత్తమునకు అతడే ప్రభువు. అతనికి కర్తృత్వ ధర్మ మున్నది. ఇట్టి ఈశ్వరునితో ఎప్పుడునూ కూడి యుండునది శ్రీమాత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 364-2. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻

This nāma says that She is not different from Cit (nāma 362) or That (nāma 363), the qualities of the Brahman. There is no difference between conditioned and unconditioned Brahman as any modifications take place purely at the will of Brahman for the purpose of creation, sustenance and dissolution.

When knowledge is extracted, the essence of knowledge is obtained, possibly from its gross form to its subtle form. But, the foundational nature of both gross and subtle forms of knowledge is not different. This can be compared to milk and its derivatives.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Apr 2022

No comments:

Post a Comment