🌹 15, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 15, FEBRUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹15, FEBRUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 134 / Kapila Gita - 134 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 18 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 18 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 726 / Vishnu Sahasranama Contemplation - 726 🌹 
🌻726. నైకః, नैकः, Naikaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 687 / Sri Siva Maha Purana - 687 🌹 🌻. త్రిపుర వర్ణనము - 7 / Description of Tripura (the three cities) - 7 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 306 / Osho Daily Meditations - 306 🌹 🍀 308. సిద్ధాంతీకరణ / 308. THEORIZING 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 433 / Sri Lalitha Chaitanya Vijnanam - 433 🌹 🌻 433. 'చాంపేయ కుసుమప్రియా' / 433. 'Chanpeya Kusumapriya' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹15, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 10 🍀*

10. మాయార్థవాచ్యో మయూరప్రభావో
నానాభ్రమార్థం ప్రకరోతి తేన |
తస్మాన్మయూరేశ మథో వదంతి
నమామి మాయాపతి మాసమంతాత్

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కర్మాచరణ పద్ధతి - దైవస్పర్శ పొందిన అంతస్సత్త నుండియే సదా కర్మల నాచరించడం నీవు నేర్చుకోవాలి. బాహ్యసత్త ఉపకరణ మాత్రంగా ఉండి పోవలసినదే. దానిని నీ మనోవాక్కర్మలపై పెత్తనం చలాయించ నివ్వరాదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ నవమి 07:40:35 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: జ్యేష్ఠ 24:46:49 వరకు
తదుపరి మూల
యోగం: వ్యాఘత 10:01:48 
వరకు తదుపరి హర్షణ
కరణం: గార 07:38:34 వరకు
వర్జ్యం: 07:21:02 - 08:51:54
దుర్ముహూర్తం: 12:07:04 - 12:53:24
రాహు కాలం: 12:30:14 - 13:57:05
గుళిక కాలం: 11:03:23 - 12:30:14
యమ గండం: 08:09:42 - 09:36:33
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 16:26:14 - 17:57:06
సూర్యోదయం: 06:42:51
సూర్యాస్తమయం: 18:17:37
చంద్రోదయం: 01:46:18
చంద్రాస్తమయం: 13:03:08
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 24:46:49 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 134 / Kapila Gita - 134 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 18 🌴*

*18. యథా గంధస్య భూమేశ్చ న భావో వ్యతిరేకతః|*
*అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ|*

*తాత్పర్యము : గంధము, పృథ్వినుండియు, రసము జలమునుండియు వేరుకానట్లు, ప్రకృతి-పురుషుడు గూడ ఒకరిని విడిచి మరియొకరు ఉండలేరు.*

*వ్యాఖ్య : లోకములో గంధములేని భూమి, భూమి లేని గంధం ఉండదూ, నీరు లేని రుచి, రుచి లేని నీరు ఉండదు. ఏ పనీ చేయనీ, దేనికీ కర్త కానీ ఆత్మకు బంధమెందుకూ. అన్ని చేస్తున్న ప్రకృతికి బంధమెందుకు. ప్రకృతి పురుషున్ని విడవనప్పుడు జీవునికి మోక్షం ఎలా లభిస్తుంది*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 134 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 18 🌴*

*18. yathā gandhasya bhūmeś ca na bhāvo vyatirekataḥ*
*apāṁ rasasya ca yathā tathā buddheḥ parasya ca*

*MEANING : As there is no separate existence of the earth and its aroma or of water and its taste, there cannot be any separate existence of intelligence and consciousness.*

*PURPORT : The example is given here that anything material has an aroma. The flower, the earth—everything—has an aroma. If the aroma is separated from the matter, the matter cannot be identified. If there is no taste to water, the water has no meaning; if there is no heat in the fire, the fire has no meaning. Similarly, when there is want of intelligence, spirit has no meaning.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 726 / Vishnu Sahasranama Contemplation - 726 🌹*

*🌻726. నైకః, नैकः, Naikaḥ🌻*

*ఓం నైకస్మై నమః | ॐ नैकस्मै नमः | OM Naikasmai namaḥ*

*మాయయా బహురూపత్త్వాన్నైక ఇత్యుచ్యతే హరిః ।*
*ఇన్ద్రో మాయాభిరిత్యాది శ్రుతివాక్యానుసారతః ॥*

*ఒక్కడు కాని వాడు. మాయచే బహు రూపములు కలవాడు. 'ఇన్ద్రో మాయాభిః పురురూప ఈయతే' (బృహదారణ్యకోపనిషత్ 2.5.19) 'ఇంద్రుడు (పరమాత్మ) తన మాయలచే బహు రూపుడగు అనుభవ గోచరుడగుచున్నాడు' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 726🌹*

*🌻726. Naikaḥ🌻*

*OM Naikasmai namaḥ*

मायया बहुरूपत्त्वान्नैक इत्युच्यते हरिः ।
इन्द्रो मायाभिरित्यादिश्रुतिवाक्यानुसारतः ॥

*Māyayā bahurūpattvānnaika ityucyate hariḥ,*
*Indro māyābhirityādiśrutivākyānusārataḥ*

*Not one only. As He is of many forms due to the action of māya vide the śruti 'इन्द्रो मायाभिः पुरुरूप ईयते / indro māyābhiḥ pururūpa īyate' (Br‌hadāraṇyakopaniṣat 2.5.19) meaning 'The Lord diversifies Himself in many forms by the forces of māya'.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥
ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 687 / Sri Siva Maha Purana - 687 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 7 🌻*

వాక్కులతో వర్ణింప శక్యము కానివి, మనస్సుతో ఊహింప శక్యము గానివి అగు ఆ నగరములు పాపాత్ములకెన్నడూ కానరావు. శుభమగు ప్రవర్తన కల్గి పుణ్యవంతులగు మహాత్ములు మాత్రమే వాటిని చూడగల్గుదురు (69). పతిని సేవించు స్వభావము గలవారు, అధర్మమునందు రుచిలేని వారు అగు పతివ్రతాస్త్రీలు ఆ నగర ప్రదేశములను పావనము చేయుచుండిరి (70). మహాత్ములు, వీరులు అగు రాక్షసులు, మరియు శ్రౌతస్మార్తముల తత్త్వము నెరింగి స్వధర్మనిష్ఠులగు బ్రహ్మణులు తమ భార్యాబిడ్డలతో ఆ నగరముల యందు నివసించిరి (71). విశాలమగు వక్షస్ధ్సలము గలవారు, బలిసిన భుజములు గలవారు, సంధికి యుద్ధమునకు కూడ సదా సంసిద్ధులై యుండు వారు, ప్రసన్నమైన వారు, కోపస్వభావము గలవారు, గూనివారు, పొట్టివారు కూడ ఆ నగరములలో నుండిరి (72).

మయునిచే రక్షింపబడి శిక్షణ నీయబడి యుద్ధమునకు తహతహలాడు వారు, నల్లకలువలవలె నల్లగా ప్రకాశించే ఉంగరములు తిరిగిన జుట్టు గలవారు నగు రాక్షసులు ఆ నగరములలో నివసించిరి (73). గొప్ప యుద్ధముల యందభిరుచి గలవారు, అజుడగు శివుని పూజించుటచే పరిశుద్ధమైన పరాక్రమము గలవారు, సూర్యుడు, వాయువు మరియు మహేంద్రునితో సమానమైన వారు, దేవతలను మర్దించే దృడకాయులు అగు దైత్యులు ఆ నగరములలో అంతటా నివసించి యుండిరి (74). వేదశాస్త్ర పురాణములలో ఏయే ధర్మములు కీర్తింపబడినవో, శివునకు ప్రియమగు అట్టి ధర్మములు అచట సర్వత్రా సర్వకాలములలో విలసిల్లినవి (75).

తారకుని పుత్రులగు ఆ రాక్షసులు ఇట్టి నగరములను వరముగా పొంది శివభక్తుడగు మయుని సేవిస్తూ ఆ నగరములలో నివసించిరి(76). వారు సర్వదా శివభక్తి పరాయణులైననూ ముల్లోకములను పీడించి ఆ నగరములను ప్రవేశించి గొప్పగా రాజ్యమును పాలించిరి (77). ఓ మహర్షీ! పుణ్యాత్ములగు ఆ రాక్షసులు చక్కగా రాజ్యమును పాలిస్తూ ప్రీతితో ఆ నగరములలో నివసించు చుండగా చాల కాలము గడిచెను (78).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధ ఖండలో త్రిపురవర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 687🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 Description of Tripura (the three cities) - 7 🌻*

69. There were persons of various types—sinners, virtuous, pious, noble and those of good conduct too.

70. The place was sanctified everywhere by chaste ladies engaged in serving their husbands and averse to evil practices.

71. The cities contained heroic Asuras of great fortune accompanied by their wives, sons and brahmins well versed in the principles and practices of the Vedic and Smārta rites. They were strict adherents to their duties.

72. People had broad chests and bull-like shoulders. Some were of peaceful nature and some of warlike temperament. Some were calm and some furious. Some were hunchbacked, Some were dwarfish.

73. They were protected by Maya. Some had the blue-lily petals. Their hair was curly and dark in hue. Maya had instructed them in the arts of warfare.

74. The cities abounded in people engaged in terrific battles. There were many Asuras whose heroism was sanctified by the worship of Brahmā and Śiva. The Asuras resembled the sun, the Maruts and Mahendra. They were sturdy.

75. Whatever sacred rites are mentioned in Śāstras, Vedas and Purāṇas, as favourites of Śiva, as also the deities, favourites of Śiva, were found there.

76. Thus the Asuras, sons of Tāraka, after acquiring the boons, lived there subservient to Maya, a great devotee of Śiva.

77. Abandoning the other parts in the three worlds they entered the cities and ruled the kingdom following the principles of Śiva.

78. O sage, a long time elapsed even as they were engaged in meritorious activities and living happily ruling over the good kingdom.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 308 / Osho Daily Meditations - 308 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 308. సిద్ధాంతీకరణ 🍀*

*🕉. తత్వవేత్త సత్యాన్ని కనిపెట్టాడు; అది ఆవిష్కరణ కాదు. ఇది తత్వవేత్త యొక్క సొంత మేధో ఆవిష్కరణ. 🕉*

*సత్యాన్ని కనిపెట్టకూడదు. కనిపెట్టినదంతా అసత్యమే అవుతుంది. నిజం ఇప్పటికే ఇక్కడ ఉంది. దానిని వెలికి తీయాలి, కనుగొనాలి. దీన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఏది కనిపెట్టినా అది అబద్ధం అవుతుంది. నిజం ఏమిటో మీకు తెలియదు; మీరు దానిని ఎలా కనిపెట్టగలరు? అజ్ఞానంలో, ఏది కనిపెట్ట బడిందో అది కేవలం అజ్ఞానం యొక్క ఊహాజనితం మాత్రమే అవుతుంది. సత్యం కనిపెట్టబడదు; ఇది మాత్రమే కనుగొన బడుతుంది, ఎందుకంటే ఇది ఇప్పటికే ఉంది.*

*రెండవ విషయం ఏమిటంటే, ఏ పరదా సత్యాన్ని కప్పి ఉంచదు. తెర మీ కళ్లపై ఉంది. నిజం దాచలేదు. నిజం ఖచ్చితంగా స్పష్టంగా ఉంది, మీ ముందు. ఎక్కడ చూసినా నిజమే చూస్తున్నారు. మీరు ఏమి చేసినా, మీరు సత్యం కోసం చేస్తున్నారు. మీకు తెలుసు లేదా మీకు తెలియదు; అది విషయం కాదు. నిజమైన సత్యాన్వేషి అంటే కనిపెట్టని వాడు, ఊహించని వాడు, తార్కిక మధనం చేయనివాడు, కేవలం స్వీకరించేవాడు. బహిరంగంగా ప్రతిస్పందించని వాడు, హాని కలిగించని వాడు మరియు సత్యానికి అందుబాటులో ఉండేవాడు. సత్యాన్ని అన్వేషించే వ్యక్తి ఒక విషయం నేర్చుకోవాలి. అది అనంతంగా, నిష్క్రియంగా మరియు ఓపికగా వేచి ఉండటం. మీరు తెరుచుకుని ఉన్నప్పడు నిజం మీకు జరుగుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 308 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 308. THEORIZING 🍀*

*🕉. The philosopher invents the truth; it is not a discovery. It is the philosopher's own intellectual invention 🕉*

*Truth is not to be invented. All that is invented will be untrue. Truth is already here. One has to uncover it, to discover it. There is no need to invent it, because whatever you invent is going to be false. You don't know what truth is; how can you invent it? In ignorance, whatever is invented will be just a projection of ignorance. Truth cannot beinvented; it can only be discovered, because it is already the case. The second thing is that no curtain is covering truth. The curtain ison your eyes.*

*The truth is not hidden. The truth is absolutely clear, right in front of you. Wherever you look, you are looking at the truth. Whatever you do, you are doing to the truth. You know or you know not; that is not the point. A real seeker of truth is one who will not invent, one who will not guess, one who will not infer, one who will not make a logical syllogism, one who will simply be receptive, open, responding, vulnerable, and available to truth. A seeker of truth has to learn one thing, and that is how to be infinitely passive and patient and waiting. Truth happens to you whenever you are open.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 433 / Sri Lalitha Chaitanya Vijnanam - 433 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।*
*చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀*

*🌻 433. 'చాంపేయ కుసుమప్రియా' 🌻* 

*చంపక పుష్పము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము. చాంపేయ కుసుమ మనగా పద్మరాజము. పద్మరాజములు ఇతర పద్మముల కన్న శ్రేష్ఠమైనవి. అవి బంగారు కాంతితో కూడిన శ్వేత పద్మములు. దళముల మొదలు నడిమి భాగములు బంగారు కాంతి కలిగి దళముల కొసభాగము క్రమముగ స్వచ్ఛమగు తెల్లని కాంతి కలిగి యుండును. ఇట్టి పుష్పములన్న శ్రీమాతకు చాల ప్రియము. పుష్ప సుగంధము పరిసరముల యందు వ్యాప్తి చెందియుండును. భక్తులు పుష్పములతో పూజించునపుడు శ్రేష్ఠమగు పుష్పముల నెంచుకొని పూజింపవలెను. వాడినవి, కళావిహీనమైనవి, రెక్కలు విరిగినవి, మురికితో కూడినవి వినియోగింపరాదు. శ్రీమాత కుసుమ ప్రియ యగుటచే శ్రేష్ఠమైన కుసుమములను మాత్రమే వినియోగింప వలెను. పూజ ఫలించుట కిదియొక ఉపాయము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 433 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh*
*Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻*

*🌻 433. 'Chanpeya Kusumapriya' 🌻*

*The champaka flower is Most beloved to Srimata. Champeya Kusuma means King of Flowers (Padmarajam). Padmarajams are superior to other lotuses. They are white lotuses with golden light. The upper part of the body has a golden light and the lower part of the body has a pure white light. These flowers are very dear to the Srimata. The fragrance of flowers spreads in the surroundings. When the devotees worship with flowers, they should pick the best flowers and worship them. Do not use used, unsightly, broken wings, dirty ones. Because Srimata is Kusuma Priya one should only use the best flowers. It is a trick to make the puja bear fruit.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శివ సూత్రములు - 040 / Siva Sutras - 040


🌹. శివ సూత్రములు - 040 / Siva Sutras - 040 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 13. ఇచ్ఛా శక్తి ఉమా కుమారి - 2🌻

🌴. యోగి సంకల్పం శివుని శక్తి. దానిని ఉల్లాసభరితమైన ఉమ మరియు కుమారి అంటారు 🌴


ఇక్కడ ఉమా అంటే శివుని స్వతంత్ర శక్తి లేదా అధికారం అని అర్థం, దీనిని అతని స్వాతంత్ర్య శక్తి అని పిలుస్తారు. కాబట్టి, ఉమను అతని భార్యగా భావించకూడదు. ఒక విధంగా, అతని స్వాతంత్ర్య శక్తి అమ్మని(శక్తి) సూచిస్తుంది, ఎందుకంటే ఆమె అతని స్వాతంత్ర్య శక్తిని ఉపయోగించడానికి అధికారాన్ని కలిగి ఉంది. యోగి యొక్క సంకల్పాన్ని ఇక్కడ కుమారి అంటారు.

కుమారి ఇక్కడ మాయ నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వ అవగాహనను నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. కుమారి అనే పదాన్ని ఎంచుకున్నందుకు, సరైన కారణం లేకుండా కాదు. ఒక కన్య వలె, యోగి యొక్క చైతన్యం శివునితో ఉండడానికి స్వచ్ఛంగా ఉండాలి. యోగి యొక్క సంకల్ప శక్తి (అతని ఇచ్ఛా శక్తి) ఏ విధమైన బాధాకరమైన ఆలోచనలు లేకుండా (కుమారి వంటిది) శివునిపై మాత్రమే (శివాన్ని పొందేందుకు తపస్సు చేసిన ఉమ వలె) దృష్టి కేంద్రీకరించాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 040 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 13. Icchā śaktir umā kumārī - 2 🌻

🌴. Yogi's will is the energy of Lord Śiva. It is called Playful Umā and Kumāri 🌴


Umā here means the independent energy or authority of Shiva which is known as His svātantrya śaktī (the power of autonomy). Therefore, Umā should not be construed as His consort. Though in a way, His svātantrya śaktī refers to Śaktī (His consort), as She holds His power of attorney to use His svātantrya śaktī. The will of the yogi is called here as kumārī.

Kumārī here refers to the energy that destroys differentiated perception arising out of māyā. The word kumārī is chosen, not without a proper reasoning. Just like a maiden, the yogi’s consciousness has to be pure to remain with Shiva. The will power of the yogi (his īcchā śaktī ) has to be focused on Shiva alone (like Umā who did penance to attain Shiva, with single pointed focus), without any afflicted thoughts (like kumārī).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 303


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 303 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. 🍀


రేపు ఎప్పుడూ రేపే. ఈ రోజు కాదు. దాన్ని ఒక్కలాగే వుండాలని వూహించ కూడదు. అట్లా వూహించడం ప్రమాదకరం. రేపు ఎప్పుడూ ఈ రోజు కాదు. అందువల్ల నువ్వు చిరాకుపడతావు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ రోజులాగే రేపు జరిగితే నీకు విసుగు వస్తుంది. చిరాకు ఆనందం కాదు, విసుగు ఆనందం కాదు. భవిష్యత్తు ద్వారాలు తెరుచుకోనీ. దానిపైన ఎట్లాంటి ఆశలూ పెట్టుకోకు. దాన్ని అజ్ఞాతమయిందిగానే వదిలిపెట్టు. అనూహ్యమయిందిగానే వదిలిపెట్టు. విషయాల్ని శాశ్వతమయినవిగా వుండేలా ప్రయత్నించకు. జీవనతత్వం మారేది. మనం ప్రకృతిని బట్టి సాగాలి. తావో'ని బట్టి సాగాలి.

అస్తిత్వానికి చెందిన అంతిమ చట్టమది. నువ్వు లోపల, బయట ఎట్లాంటి అంచనాలు లేకుంటే అద్భుతంగా, సంపన్నంగా వుంటావు. ప్రతిక్షణం పరవశాన్ని తీసుకొస్తుంది. కొత్త కాంతి, కొత్త జీవితం, కొత్త దైవత్వం ఆవిష్కారమవుతాయి. నిరంతరం ప్రేమ ప్రవహించే వ్యక్తి, దేనితోనూ ఘర్షించని వ్యక్తి విశాలమవుతాడు. ఆకాశమంత అవుతాడు. విశాలత్వంలో అస్తిత్వమంటే ఏమిటో అతనికి తెలిసి వస్తుంది. ఆ విశాలత్వమే అస్తిత్వం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 38 - 7. Life is a Continuity / నిత్య ప్రజ్ఞా సందేశములు - 38 - 7. జీవితం ఒక కొనసాగింపు


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 38 / DAILY WISDOM - 38 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 7. జీవితం ఒక కొనసాగింపు 🌻


జీవితం ఒక కొనసాగింపుతో ఉంటుంది. దానిలో మనం ఒక భాగం. మనం ఇక్కడ కూర్చున్న ఒక పేరు మాత్రమే కాదు. నిజానిజాలు తెరిచి చూస్తే ఇప్పటిదాకా మూర్ఖపు జీవితం గడుపుతున్న మనం ఇప్పుడు గంభీరంగా ఉండాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. మనకి సమయం తక్కువగా ఉంది. నేర్చుకోవలసినది చాలా ఉంది. సాధించడానికి చాలా ఉంది. అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు కాలయాపన చేయడానికి సమయం లేదు.

మనం విషయాలను తేలికగా తీసుకోలేము. జీవితం విలువైనది. మనం దానిని హాస్యాస్పదంగా తీసుకోలేము. సమయం యొక్క ప్రతి క్షణం బంగారం లాంటిది. ఎందుకంటే ప్రతి సాగుతున్న ప్రతిక్షణం మన జీవితవ్యవధిలో నష్టం తప్ప మరొకటి కాదు. మోగిన ప్రతి గంట మనం ఒక గంట కోల్పోయామని చెబుతుంది. ఇది సంతోషకరమైన విషయం కాదు. మనం కోరుకునే దానిలో అంతర్దృష్టిని పొందేందుకు మన ప్రయత్నం దృఢంగా ఉండాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 38 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 7. Life is a Continuity 🌻


There is a continuity, which is life, of which we are a part, and we are not just X, Y, Z or A, B, C sitting here; it is not like that. If we open our eyes to fact, we will be surprised that we have been living a foolhardy life up to this time, and now the time has come when we have to be serious. Our time is short, and there is so much to learn, and a lot to achieve. Obstacles are too many, and we have no time to wool-gather, sleep or while away our time as if there is eternity before us.

We cannot take things lightly. Life is precious. We cannot take it as a joke. Every moment of time is as gold because every moment is nothing but a little loss of this span of our life. Every bell that rings tells us that we have lost one hour. It is not a happy thing. Tenacious has to be our effort at gaining insight into that which we seek.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 53

🌻. లింగాది లక్షణములు - 3 🌻


బ్రహ్మ భాగము నందు లింగము ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్థాపనముచేసి, దానిపైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిండిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో అది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసిన దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే ''బాహుల్యమును'' ఏర్పరుప వలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను.

దీనికి ''విక రాజ్గము'' అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించవలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వ్రేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువైపు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము.

అగ్ని పురాణమందు లింగాది లక్షణమును ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 173 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 53

🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 3 🌻


14. After having known the commencing portion of the liṅga and height, the part (belonging) to Brahman should be well placed by the learned person on the stone (pedestal).

15. Then having known the height (of the liṅga) the different dimensions of the pedestal should be made. The base (of the liṅga) should be twice the height and length commensurate with that of the liṅga.

16. The central part of the pedestal should be hewn and divided into three parts. Its breadth should be one-sixth part of its length.

17. The girth should measure one-third part of its breadth, and the depth (of cavity) should be equal to that of the girth. It should be sloping gradually.

18. Or the depth (of the cavity) should be one sixteenth part of that of the girth. The height of the base should be deviated.

19. One part of the base should remain imbedded in the ground. One part of it will be (the height of) the stool proper. Three such parts (will be the height) of the neck portion. The first step should be one such part.

20. The second step should be of two such parts in height while the remaining steps should have a height of such a single part until one reaches the neck portion step by step.

21. Outlets to the breadth of such a part should be set apart on each one of the steps till the last one. They should be cut into three parts by the three outlets.

22. It should measure a tip of the finger in breadth at the base and one-sixth (of a finger) at their ends. Their beds should be a little inclined towards the eastern side. These are considered to be the general characteristics of the liṅga along with the pedestal.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 326: 08వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 326: Chap. 08, Ver. 16

 

🌹. శ్రీమద్భగవద్గీత - 326 / Bhagavad-Gita - 326 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 16 🌴

16. ఆబ్రహ్మభువనాల్లోకా: పునరావర్తినోర్జున |
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

🌷. తాత్పర్యం :

భౌతికజగము నందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యు భరితమైన దుఃఖప్రదేశములే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.

🌷. భాష్యము :

కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటివారు శ్రీకృష్ణుని దివ్యదామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున (కృష్ణభక్తిరసభావన యందు) పూర్ణత్వమును బడయవలసియే ఉండును.

దేవతాలోకములైన ఉన్నతలోకములను పొందినవారు సైతము జన్మ, మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నతలోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుచుందురు.

బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసెడి “పంచాగ్నివిద్య” యను యజ్ఞము చాందోగ్యోపనిషత్తు నందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తిరసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసివచ్చును.

ఉన్నతలోకములందు కృష్ణభక్తిభావనను కొనసాగించువారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వ ప్రళయసమయమున ఆధ్యాత్మికజగమునకు చేరుదురు. ఈ విషయమున శ్రీధరస్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానము నందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి.

బ్రాహ్మణే సహ తే సర్వే సమ్ప్రా ప్తే ప్రతిసంచరే |
పరిస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్

“విశ్వప్రళయము సంభవించినపుడు కృష్ణభక్తిభావన యందు సంతతమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికల ననుసరించి ఆధ్యాత్మికజగము నందలి వివిధలోకములను చేరుచుందురు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 326 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 16 🌴

16 . ā-brahma-bhuvanāl lokāḥ punar āvartino ’rjuna
mām upetya tu kaunteya punar janma na vidyate


🌷 Translation :

From the highest planet in the material world down to the lowest, all are places of misery wherein repeated birth and death take place. But one who attains to My abode, O son of Kuntī, never takes birth again.

🌹 Purport :

All kinds of yogīs – karma, jñāna, haṭha, etc. – eventually have to attain devotional perfection in bhakti-yoga, or Kṛṣṇa consciousness, before they can go to Kṛṣṇa’s transcendental abode and never return.

Those who attain the highest material planets, the planets of the demigods, are again subjected to repeated birth and death.

As persons on earth are elevated to higher planets, people on higher planets such as Brahmaloka, Candraloka and Indraloka fall down to earth.

The practice of sacrifice called pañcāgni-vidyā, recommended in the Chāndogya Upaniṣad, enables one to achieve Brahmaloka, but if, on Brahmaloka, one does not cultivate Kṛṣṇa consciousness, then he must return to earth.

Those who progress in Kṛṣṇa consciousness on the higher planets are gradually elevated to higher and higher planets and at the time of universal devastation are transferred to the eternal spiritual kingdom. Baladeva Vidyābhūṣaṇa, in his commentary on Bhagavad-gītā, quotes this verse:

brahmaṇā saha te sarve samprāpte pratisañcare
parasyānte kṛtātmānaḥ praviśanti paraṁ padam

“When there is devastation of this material universe, Brahmā and his devotees, who are constantly engaged in Kṛṣṇa consciousness, are all transferred to the spiritual universe and to specific spiritual planets according to their desires.”

🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹14, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. జానకి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Good Wishes on Janaki Jayanti to All 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : జానకి జయంతి, Janaki Jayanti 🌻

🍀. అపరాజితా స్తోత్రం - 6 🍀


11. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

12. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : కర్మాచరణ : దైవసన్నిధి - కర్మ నాచరించేటప్పుడు దైవసన్నిధి గుర్తులో ఉండడం ప్రారంభ దశలో సులభం కాదు. కాని, కర్మాచరణం పూర్తియైన వెన్వెంటనే అది గుర్తుకు రావడం జరుగుతూ వుంటే ఫరవాలేదు. కొంతకాలానికి కర్మాచరణ సమయంలో కూడా దైవసన్నిధి దానంతటదే గుర్తుకు రాగలదు. 🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ అష్టమి 09:05:17

వరకు తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: అనూరాధ 26:02:52

వరకు తదుపరి జ్యేష్ఠ

యోగం: ధృవ 12:26:19 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: కౌలవ 09:02:16 వరకు

వర్జ్యం: 06:31:10 - 08:04:50

దుర్ముహూర్తం: 09:02:06 - 09:48:22

రాహు కాలం: 15:23:44 - 16:50:28

గుళిక కాలం: 12:30:16 - 13:57:00

యమ గండం: 09:36:48 - 11:03:32

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53

అమృత కాలం: 15:53:10 - 17:26:50

సూర్యోదయం: 06:43:20

సూర్యాస్తమయం: 18:17:13

చంద్రోదయం: 00:45:00

చంద్రాస్తమయం: 12:10:29

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి

26:02:52 వరకు తదుపరి ముద్గర

యోగం - కలహం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹