శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 173 / Agni Maha Purana - 173 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 53

🌻. లింగాది లక్షణములు - 3 🌻


బ్రహ్మ భాగము నందు లింగము ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్థాపనముచేసి, దానిపైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిండిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో అది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసిన దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే ''బాహుల్యమును'' ఏర్పరుప వలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను.

దీనికి ''విక రాజ్గము'' అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించవలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వ్రేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువైపు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము.

అగ్ని పురాణమందు లింగాది లక్షణమును ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 173 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 53

🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 3 🌻


14. After having known the commencing portion of the liṅga and height, the part (belonging) to Brahman should be well placed by the learned person on the stone (pedestal).

15. Then having known the height (of the liṅga) the different dimensions of the pedestal should be made. The base (of the liṅga) should be twice the height and length commensurate with that of the liṅga.

16. The central part of the pedestal should be hewn and divided into three parts. Its breadth should be one-sixth part of its length.

17. The girth should measure one-third part of its breadth, and the depth (of cavity) should be equal to that of the girth. It should be sloping gradually.

18. Or the depth (of the cavity) should be one sixteenth part of that of the girth. The height of the base should be deviated.

19. One part of the base should remain imbedded in the ground. One part of it will be (the height of) the stool proper. Three such parts (will be the height) of the neck portion. The first step should be one such part.

20. The second step should be of two such parts in height while the remaining steps should have a height of such a single part until one reaches the neck portion step by step.

21. Outlets to the breadth of such a part should be set apart on each one of the steps till the last one. They should be cut into three parts by the three outlets.

22. It should measure a tip of the finger in breadth at the base and one-sixth (of a finger) at their ends. Their beds should be a little inclined towards the eastern side. These are considered to be the general characteristics of the liṅga along with the pedestal.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment