🌹 30, APRIL 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 30, APRIL 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 30, APRIL 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 25 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 210 / Agni Maha Purana - 210 🌹 
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 5 / Consecration of doors of the temple and the erection of banner - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 075 / DAILY WISDOM - 075 🌹 
🌻 15. అతీంద్రియ జీవి సంపూర్ణమైనది / 15. The Absolute is Transcendent Being 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 340 🌹
6) 🌹. శివ సూత్రములు - 77 / Siva Sutras - 77 🌹 
🌻2-01. చిత్తం మంత్రః - 4 / 2-01. Cittaṁ mantraḥ - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 30, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 5 🍀*

*9. కామః కారుణికః కర్తా కమలాకరబోధనః |*
*సప్తసప్తిరచింత్యాత్మా మహాకారుణికోత్తమః*
*10. సంజీవనో జీవనాథో జయో జీవో జగత్పతిః |*
*అయుక్తో విశ్వనిలయః సంవిభాగీ వృషధ్వజః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భౌతిక సాధనములు - ఈశ్వరభ క్తికి, ఈశ్వరార్చనకు భౌతిక సాధనములు ఉపయోగకరములే, కేవలం మానప్ప్రకృతి దౌర్బల్యాన్ని బట్టియే కాదు ఈ ఉపయోగార్హత. అంతరాత్మతో ప్రేమించే వానికి వీటితో పని లేదనియూ చెప్పరాదు. సక్రమ పద్ధతిలో వీటి నుపయోగించ గలిగినప్పుడు ఇవి ఈశ్వర సాక్షాత్కార అనుభవానికీ, అంతరాత్మ ప్రబోధం కలిగించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల-దశమి 20:30:37 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: మఘ 15:31:08 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: వృధ్ధి 11:16:06 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 07:27:54 వరకు
వర్జ్యం: 02:10:00 - 03:56:48
దుర్ముహూర్తం: 16:53:55 - 17:44:55
రాహు కాలం: 17:00:17 - 18:35:55
గుళిక కాలం: 15:24:40 - 17:00:17
యమ గండం: 12:13:26 - 13:49:03
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 12:50:48 - 14:37:36
సూర్యోదయం: 05:50:57
సూర్యాస్తమయం: 18:35:55
చంద్రోదయం: 14:08:30
చంద్రాస్తమయం: 02:24:22
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం -
కలహం 15:31:08 వరకు తదుపరి 
ఛత్ర యోగం - స్త్రీ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 363 / Bhagavad-Gita - 363 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 25 🌴*

*25. యాన్తి దేవవ్రతా దేవన్పితౄన్యాన్తి పితృవ్రతా: |*
*భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోపి మాం ||*

🌷. తాత్పర్యం :
*దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు.*

🌷. భాష్యము : 
*చంద్రలోకమునుగాని, సూర్యలోకమునుగాని లేదా వేరే ఇతరలోకమును గాని చేరగోరిచనచో తత్ర్పయోజనార్థమై వేదములందు నిర్దేశింపబడిన “దర్శపౌర్ణమాసి” వంటి విధానములను పాటించుట ద్వారా మనుజుడు తన కోరిన గమ్యమును సాధించగలడు. వేదముల యందలి కర్మకాండభాగములో విశదముగా వివరింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నతలోకములందలి దేవతల కొరకు ప్రత్యేకములైన పూజలను నిర్దేశించుచున్నవి. అదే విధముగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనుజుడు పితృలోకమును చేరవచ్చును లేదా భూత, ప్రేతలోకములను చేరి యక్షునిగా, రాక్షసునిగా లేక పిశాచముగా మారవచ్చును. పిశాచములకు ఒనర్చుపూజ వాస్తవమునకు “క్షుద్రదేవతార్చనము” అని పిలువబడును. అట్టి క్షుద్రదేవతార్చనము కావించువారు పెక్కురు కలరు.*

*వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను ఆ సమస్త కర్మలు నిజమునకు భౌతికములే. అదేవిధముగా దేవదేవునే అర్చించు శుద్ధభక్తుడు వైకుంఠలోకములందు గాని, కృష్ణలోకమును గాని అసంశయముగా పొందును. దేవతలను పూజించుట ద్వారా పితృలోకములను, క్షుద్రదేవతార్చనము ద్వారా పిశాచలోకములను మనుజుడు పొందుచుండ శుద్ధభక్తుడు ఎందులకు వైకుంఠలోకములను లేదా కృష్ణలోకమును పొందకుండునని ఈ అతిముఖ్యమైన శ్లోకము ద్వారా సులభముగ గ్రహింపవచ్చును. కాని శ్రీకృష్ణడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారము పెక్కుమందికి తెలియదు. వాని నెరుగని కారణమున వారు పతితులగుదురు. నిరాకారవాదులు సైతము బ్రహ్మజ్యోతి నుండు పతనము చెందగలరు. కనుకనే కేవలము హరేకృష్ణ మాహా మంత్రమును జపించుట ద్వారా మనుజుడు ఈ జన్మమందే పూర్ణుడై భగవద్దామమును చేరగలడని మహత్తరమైన సందేశమును సమస్త మానవాళికి కృష్ణచైతన్యోద్యమము తెలియపరచుచున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 363 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 25 🌴*

*25. yānti deva-vratā devān pitṝn yānti pitṛ-vratāḥ*
*bhūtāni yānti bhūtejyā yānti mad-yājino ’pi mām*

🌷 Translation : 
*Those who worship the demigods will take birth among the demigods; those who worship the ancestors go to the ancestors; those who worship ghosts and spirits will take birth among such beings; and those who worship Me will live with Me.*

*🌹 Purport :*
*If one has any desire to go to the moon, the sun or any other planet, one can attain the desired destination by following specific Vedic principles recommended for that purpose, such as the process technically known as Darśa-paurṇamāsa. These are vividly described in the fruitive activities portion of the Vedas, which recommends a specific worship of demigods situated on different heavenly planets. Similarly, one can attain the Pitā planets by performing a specific yajña. Similarly, one can go to many ghostly planets and become a Yakṣa, Rakṣa or Piśāca. Piśāca worship is called “black arts” or “black magic.” There are many men who practice this black art, and they think that it is spiritualism, but such activities are completely materialistic. Similarly, a pure devotee, who worships the Supreme Personality of Godhead only, achieves the planets of Vaikuṇṭha and Kṛṣṇaloka without a doubt.*

*It is very easy to understand through this important verse that if by simply worshiping the demigods one can achieve the heavenly planets, or by worshiping the Pitās achieve the Pitā planets, or by practicing the black arts achieve the ghostly planets, why can the pure devotee not achieve the planet of Kṛṣṇa or Viṣṇu? Unfortunately many people have no information of these sublime planets where Kṛṣṇa and Viṣṇu live, and because they do not know of them they fall down. Even the impersonalists fall down from the brahma-jyotir. The Kṛṣṇa consciousness movement is therefore distributing sublime information to the entire human society to the effect that by simply chanting the Hare Kṛṣṇa mantra one can become perfect in this life and go back home, back to Godhead.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 210 / Agni Maha Purana - 210 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*

*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 5 🌻*

*దండముపై జీవసహితు డగు సూత్రాత్మను న్యాసము చేయవలెను. ధ్వజముపై, శ్రీహరిధ్యానము చేయుచు, నిష్కలపరమాత్ముని స్థాపించపవలెను. అతని బలాబలరూపవ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపముపై దానిని స్థాపించి, పూజించి, కుండములలో హోమము చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణచక్రమును, క్రింద నున్న పాదరసములో ముంచి నేత్రపటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.*

*"ఓం క్షౌం నృసింహాయ నమః" అను మంత్రముతో హరిని స్థాపించి పూజిచంవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని అగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. 'ఓం ఫట్‌' అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణస్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళపాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ధ్వజదండమును స్థాపించవలెను. "ముఞ్చామి త్వా" ఇత్యాదిసూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురువేయ) వలెను. ఆచార్యునకు పాత్ర-ధ్వజ-గజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణసాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవాతామంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతు డగు రాజగును.*

*శ్రీఅగ్నిమహాపురాణమునందు ద్వార ప్రతిష్ఠా ద్వజారోహణాదివిధి యను ఆరువదియొకటవ అద్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 210 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 5 🌻*

41. The sakala (endowed with parts) forms should be assigned to the staff as the living soul of it. Lord Hari, the supreme being of the niṣkala (undivided) form should be contemplated and assigned to the flag.

42. The energies Bala and Abala which manifest in the form of the banner should be contemplated. Having placed it in the shed and worshipped it, oblation should be made in the pit.

43. Having placed the golden pitcher over the pitcher and putting five (kinds of) gems (at the top of the temple) a golden disc should be placed underneath that with the mantra of the disc.

44. The disc should be washed with mercury and covered with the eye-cover. The disc should then be placed. Lord Nṛhari (man-lion form of Viṣṇu)should be imagined there in the middle.

45-46. Oṃ, kṣauṃ, salutations to Lord Nṛsiṃha. Lord Hari should be invoked and worshipped. Then the yajamāna (the person who has arranged for the consecration) accompanied by his relatives should hold banner and dip the tip of the banner in a vessel full of curd. The banner should be worshipped with the mantra commencing with dhruvā[4] and ending with phaṭ.

47. Holding that vessel on the head and remembering Lord Nārāyaṇa (the yajamiina) should go around the temple along with auspicious sounds from the tūrī (a musical instrument).

48. The staff should then be placed with (the recitation of) the eight-syllabled mantra[5]. Then the flag should be (hoisted) and unfurled with (the recitation of) the hymn muñcāmi tvā[6] by the learned person.

49. The twice-born (yajamāna) should give the priest the vessel, banner and elephant etc. Mode of consecration of the flag has been thus described in general.

50. The mark which represents a particular god should be planted with the respective mantra. By the offer of a banner one goes to heaven and becomes a strong monarch on the earth (in the next birth).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 75 / DAILY WISDOM - 75 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 15. అతీంద్రియ జీవి సంపూర్ణమైనది.🌻*

*సాధారణ పరిభాషలో విశ్వమనస్సుగా అని పిలువబడే ఉనికి, ఇక్కడ ఒక పరిణామక్రమంలో ఎదిగిన ఉనికిగా పరిగణించబడుతుంది తప్ప సత్యం యొక్క అస్తిత్వంగా కాదు. బ్రహ్మం అనేది సంపూర్ణమైనది. మనస్సు యొక్క ఒక ఆలోచన కాదు. ఇది కారణ స్థితి కూడా కాదు. కారణ స్థితి కూడా నిరాకార పరబ్రహ్మానికి దిగువన భావించబడుతుంది. మనం ఎప్పుడూ ప్రపంచంతో పరబ్రహ్మాన్ని సరితూల్చలేము. ఉపనిషత్తుల్లో చెప్పబడిన పరబ్రహ్మం, లేదా తత్వశాస్త్రంలో చెప్పబడిన అంతిమ సత్యాన్ని మనం సృష్టితో సమానం అని అనుకోలేము. మనం సృష్టితో భగవంతుని అనుబంధించవలసి వచ్చినప్పుడు, దానికి పూర్తిగా కొత్త పదం ఉంటుంది.*

*ఈశ్వరుడు అనేది వేదాంత భాషలో మనం ఉపయోగించే పదం. అటువంటి పదాలు ఉపనిషత్తులలో లేవు. అవన్నీ తరువాతి వేదాంతంలో కనిపిస్తాయి, కానీ అవి ఇక్కడ ఊహించబడ్డాయి. సాంఖ్య మరియు వేదాంత విశ్వోద్భవ వర్ణనలలో, కారణం నుండి ప్రభావం ప్రకటితం అవ్వడంలో వివిధ దశలు ఉన్నాయని చెప్పబడింది. వ్యక్తం చేయనప్పటికీ ప్రతిదీ గుప్తంగా ఉనికిలోనే ఉంది. అంతా విశ్వకారణ స్థితిలో ఉనికిలోనే ఉంది. దాన్నే సాంఖ్య భాషలో ప్రకృతి అంటారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 75 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 15. The Absolute is Transcendent Being 🌻*

*The mind of the cosmos, which is called the Cosmic Mind in usual parlance, is regarded here as an evolute, and not the original Being. The Absolute is Transcendent Being, and not a mind thinking. It is not even a causal state. Even the causal state is supposed to be posterior to the Absolute. We never associate the Absolute with the world. The Brahman of the Upanishad, or the Absolute of philosophy, is the assertion of Being which is unrelated to creation. And, when we have to associate God with creation, we have a new word altogether for it.*

*Ishvara is the word we use in the language of the Vedanta. Such words do not occur in the Upanishads. They are all to be found in the later Vedanta, but they are assumed here. In the Samkhya and the Vedanta cosmological descriptions, we have certain grades mentioned of the coming out of the effect from the cause. Everything was hidden, though not expressed. Everything was in a universal causal state. That is called Prakriti in the Samkhya language.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 340 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దిగులు నిండిన జనం ఎంత అపకారం చేశారంటే చెప్పడానికి వీలుపడదు. మానవజాతికి వాళ్ళు చేసినంత హాని ఎవరూ చేయలేదు. వీళ్ళే మానవత్వానికి శత్రువులు. 🍀*

*గతమంతా దిగులు నిండిన జనమే అధికారం చెలాయించారు. దిగులు నిండి వాళ్ళు అధికారం చెలాయించడంలో ఆనందిస్తారు. వాళ్ళకు యింకో ఆనందం లేదు. యితరుల స్వేచ్ఛని హరించడంలోనే వాళ్ళ ఆనందం. వాళ్ళు సంతోషంగా వున్న వాళ్ళంటే ఈర్ష్య పడతారు. ఆగ్రహిస్తారు. ఆడేవాళ్ళని, పాడేవాళ్లని చూసి కుళ్ళుతారు. దిగులు నిండిన జనం ఎంత అపకారం చేశారంటే చెప్పడానికి వీలుపడదు. మానవజాతికి వాళ్ళు చేసినంత హాని ఎవరూ చేయలేదు. వీళ్ళే మానవత్వానికి శత్రువులు.*

*ఇక్కడ నా ప్రయత్నం నూత్న మానవుణ్ణి సృష్టించడం. నూతన దృష్టి వున్నపుడే నవ్య మానవుడి సృష్టి వీలవుతుంది. నేను ప్రేమ మతాన్ని బోధిస్తాను. నవ్వుని, వుత్సవాన్ని బోధిస్తాను. ఇది నా అనుభవం, నువ్వు ఆనందంగా వుంటే నీకూ అస్తిత్వానికి మధ్య వంతెన ఏర్పడుతుంది. ఆనందాన్ని బోధించు పరమానందాన్ని బోధించు. ఇంకేమీ వద్దు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 077 / Siva Sutras - 077 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 01. చిత్తం మంత్రః - 4 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*

*ఇక్కడ రెండు మంత్రాలు ప్రస్తావించబడ్డాయి. మొదటిది ప్రాసాద మంత్రం, రెండవది ప్రణవ మంత్రం. ప్రాసాద మంత్రం అంటే బీజాక్షరం సౌ: (ప్రసాదం) అని అర్థం. ఇది శివుని గుండె విత్తనంగా పిలువ బడుతుంది మరియు మొత్తం ముప్పై ఆరు తత్వాలను కలిగి ఉంటుంది. ఈ మంత్రం యొక్క అంతర్లీన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే, అతను ప్రపంచ ప్రక్రియకు ఏకైక కారణమైన శివ-శక్తి కలయిక యొక్క ప్రాంగణంలోకి ప్రవేశించడంతో ముక్తి పొందుతాడు. దీని అర్థం అతను ప్రపంచ ప్రక్రియను అధిగమించగలడు మరియు పునర్జన్మ యొక్క బాధాకరమైన ప్రక్రియను వదిలించుకోగలడు. ఇక్కడ ప్రస్తావించబడిన రెండవ మంత్రం ప్రణవం. కానీ ఇక్కడ ప్రస్తావించిన ప్రణవం ఓం కాదని, శైవ ప్రణవం హుం అని చెబుతారు. కేవలం మంత్రోచ్ఛారణ చేయడం వల్ల అభ్యాసకుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని కూడా చెబుతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 077 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 01. Cittaṁ mantraḥ - 4 🌻*
*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*

*There are two mantra-s that are referred here. The first one is prāsāda mantra and the second one ispraṇava mantra. Prāsāda mantra refers to bīja sauḥ (सौः). This is known as the heart seed of Śiva and encompasses all the thirty six tattva-s. If one understands the underlying significance of this mantra, he gets liberated, as he enters the arena of Śiva-Śaktī union, the sole cause for world process. This means that he is able to transcend world process and gets rid of the painful process of transmigration. The second mantra that is referred here is praṇava. It is said that praṇava referred here is not the ॐ, but Śaiva praṇava huṁ हुं. It is also said that mere recitation of mantra-s does not give any benefits to the practitioner.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 452 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 452 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 452 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 452 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 452. ‘లోలాక్షీ’ - 1 / 452. 'Lolakshi' - 1🌻


కామదృష్టి గలది శ్రీమాత అని అర్ధము. కామము లేనిదే సృష్టి లేదు. శ్రీమాత జీవులయందలి కారుణ్యము కారణముగా సృష్టి నేర్పరచి జీవులను ప్రవేశ పెట్టును. జీవులు ప్రళయమున మరల సృష్టింపబడుటకు తహ తహ లాడుచుందురు. అట్టి తహ తహకు కారణము వివిధ దశలలో నున్న జీవుల అపరిపూర్ణత. అపరిపూర్ణులైన జీవులు పరిపూర్ణత కొరకు తపించు చుందురు. వారి తపనను గమనించిన శ్రీమాత కారుణ్య భావమున సృష్టి నేర్పరచును. జీవులకు వారి వారి పరిణామము ననుసరించి అనుగుణమైన దేహముల నేర్పరచును. ఇట్లు ఏడు లోకములందు జీవు లేర్పడుదురు. వారి పోషణమునకు కూడ శ్రీమాత సృష్టి యందు అన్ని సౌకర్యము లేర్పరచును. జీవులను సృష్టించుట, వారికి పోషణా సౌకర్యముల నేర్పరచుట, మనో ఇంద్రియాదులతో బాటు బుద్ధి నొసగుట, ఇట్టి బుద్ధిని వికాసము గావించుటకు విద్యా బోధకుల నేర్పరచుట- ఇట్టి సమస్త కార్యములు కారుణ్యమే కామముగ కన్నుల నుండే సృష్టించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 452 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 452. 'Lolakshi' - 1 🌻


It means that Srimata has the vision of desires. There is no creation without desires. The mercy of the Srimata is the cause of creation and brings in the creatures into creation. Living beings yearn to be re-created after annihilation. The cause of such craving is the imperfection of beings in different stages. Imperfect beings strive for perfection. Seeing their quest, Srimata brings creation into existence out of compassion. According to their evolution, living beings are born in suitable bodies. In these seven worlds the living beings arise. Even for their sustenance, Srimata provides all comforts in creation. Creating living beings, teaching them the facilities for their nurture, granting them intellect along with the senses, arranging the Teachers to develop this intellect - all these works are created by compassion from those desirous eyes.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 342. COMMITMENT / ఓషో రోజువారీ ధ్యానాలు - 342. నిబద్ధత


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 342 / Osho Daily Meditations - 342 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 342. నిబద్ధత / 342. COMMITMENT 🍀

🕉. నిబద్ధతను బలవంతం చేయలేము. మరే ఇతర సంబంధం అవసరం లేదని అతను భావించేంతగా వ్యక్తిని సంతోషపెట్టండి. అయినప్పటికి దీనికి విరుద్ధంగా, చాలా మంది ప్రజలు ఇలాంటి ఇబ్బందులను కలిగి ఉంటారు. ఒకరు మరొక సంబంధం గురించి ఆలోచించకూడదని అనుకున్నా, మరొకరు కేవలం తప్పించుకోవడానికి.అతను దాని గురించి ఆలోచించ వలసి ఉంటుంది 🕉


స్త్రీ-పురుషుల బంధంలో లోతుగా పాతుకు పోయిన సమస్యల్లో ఇది ఒకటి. మనిషికి ప్రేమ కంటే స్వేచ్ఛ అవసరం, మరియు 'స్త్రీకి స్వేచ్ఛ కంటే ప్రేమ ఎక్కువ అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి జంటకు ఇది ఒక సమస్య. స్త్రీ స్వేచ్ఛ గురించి అస్సలు చింతించదు. మరొకరిని తనకు బానిసగా చేయగలిగితే ఆమె బానిసగా మారడానికి సిద్ధంగా ఉంటుంది. మరొకరు కూడా బలవంతంగానైనా నిబద్ధతలోకి వస్తే ఆమె ఎలాంటి నిబద్ధతకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉంటుంది. మరొకరు చీకటి గదిలో జీవించడానికి సిద్ధంగా ఉంటే ఆమె జైలులో జీవించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనిషి తన స్వేచ్ఛకు చాలా ప్రమాదకరమైతే ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అతను ఒంటరిగా నైనా సరే బహిరంగ ఆకాశంలో జీవించాలి అనుకుంటాడు.

అతను ప్రేమపూర్వక సంబంధంలో ఉండాలను కుంటాడు, కానీ అది చీకటిగా మరియు జైలు శిక్షగా మారుతుంది. కాబట్టి అది ఇబ్బంది. ఎక్కువ నిబద్ధత కోసం లేదా ఎక్కువ స్వేచ్ఛ కోసం అడగడం రెండూ అపరిపక్వత అని తెలుసుకోవాలి. ఎక్కడో ఒక చోట మరొకరితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మనిషికి మరింత స్వేచ్ఛ అవసరమని మీరు అర్థం చేసుకున్న తర్వాత, మీరు నిబద్ధత కోసం మీ డిమాండ్లను అణిచి వేయగలుగుతారు. స్త్రీకి నిబద్ధత అవసరమని పురుషుడు అర్థం చేసుకున్న తర్వాత, అతను స్వేచ్ఛ కోసం ఉన్న తన పట్టును సడలించ గలుగుతాడు. అంతే. మీరు ప్రేమిస్తే, మీరు కొంచెం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమించకపోతే విడిపోవడమే మేలు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 342 🌹

📚. Prasad Bharadwaj

🍀 342. COMMITMENT 🍀

🕉. Commitment cannot be forced. Make the person happy so he feels there is no need for any other relationship. But on the contrary, most people make such trouble that even if the other was not thinking of another relationship, he will have to think of it--just to escape. 🕉


This is one of the deep-rooted problems in any man-woman relationship. Man has more need of freedom than of love, and 'woman has more need of love than of freedom. It is a problem all over the world with every couple. The woman is not worried about freedom at all. She is ready to become a slave if only she can make the other a slave also. She is ready to move into any commitment if the other is also forced into a commitment. She is ready to live in a prison if the other is ready to live in a dark cell. And the man is ready even to sacrifice love if it becomes too risky to his freedom. He would like to live in the open sky, even alone.

He would like to be in a loving relationship, but it becomes dark and an imprisonment. So this is the trouble. One has to become aware that this asking for too much commitment or for too much freedom are both immaturities. Somewhere one has to come to terms with the other person. Once you understand that the man needs more freedom, you put down your demands for commitment. Once the man understands that the woman needs commitment, he puts down his demand for freedom, that's all. If you love, you are ready to sacrifice a little. If you don't love, it is better to separate.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 723 / Sri Siva Maha Purana - 723


🌹 . శ్రీ శివ మహా పురాణము - 723 / Sri Siva Maha Purana - 723 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 08 🌴

🌻. రథ నిర్మాణము - 3 🌻


లోకాలోకపర్వతము రథమునకు నలుపైలా ఉపసోపానమయెను. మానసాది సరోవరములు దానికి బటక ఉండే సుందరమగు విషమ స్థానము ఆయెను (22) వర్ష పర్వతములన్నియు ఆ రథమునకు నలువైపులా ఉండే త్రాళ్లు అయెననె చెప్పబడెను. పాతాళాది అధోలోకములయందు నివసించు ప్రాణులన్నియు ఆరధములకు ఉపరితములు అయెను (23).

బ్రహ్మదేవుడు సారథియై కళ్లెములను పట్టు కొనెను. బ్రహ్మ అధిష్టాన దేవతగా గల ఓంకారము ఆ బ్రహ్మకు చేతి కొరడా ఆయెను (24). ఆకారము పెద్ద గొడుగు ఆయెను. మందర పర్వతము ప్రక్కన ఉండే నిలువు కమ్మీ ఆయెను. హిమవంతుడు శివునకు ధనస్సు కాగా, నాగరాజగు శేషుడు దాని నారిత్రాడు ఆయెను (25). వేదస్వరూపిణి యగు సరస్వతీ దేవి ఆ ధనస్సునకు గంట ఆయెను. మహాతేజశ్శాలి యగు విష్ణువు బాణము కాగా, అగ్ని ఆ బాణము యొక్క వాడి మొన ఆయెనని మహర్షులు చెప్పిరి (26). ఓ మహర్షీ! నాల్గు వేదములు ఆ రథమునకు నాల్గు గుర్రములు ఆయెను. మిగిలియున్న నక్షత్రాది తేజః పిండములు ఆ గుర్రములకు ఆబరణములాయెను (27). విషము నుండి పుట్టిన పదార్థములు సేన కాగా, వాయువులు వాద్యగాళ్లు ఆయెను. వ్యాసాది మహర్షులు ఆ గుర్రములకు సంరక్షకులుగా నుండిరి (28). ఓ మహర్షీ! ఇన్ని మాటలేల? కొద్ది మాటలలో చెప్పెదను. బ్రహ్మాండములో నుండే సర్వవస్తువులు ఆ రథము నందు ఉండెనని చెప్పెదరు (29). ఇట్లు బుద్ధిమంతుడగు ఆ విశ్వకర్మ బ్రహ్మ విష్ణువుల యాజ్ఞచే శుభకరమగు ఆ రథమును చక్కగా నిర్మించెను (30).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో రథ నిర్మాణ వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 723🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 08 🌴

🌻 The detailed description of the chariot etc. - 3 🌻


22. The Lokāloka mountain[3] formed its side steps. The lake mānasa etc. constituted its brilliant outer and oblique steps.

23. The Varṣa mountains constituted the cords and chains all round the chariot. All the residents of the region Tala constituted the bottem surface of the chariot.

24. Lord Brahmā was the charioteer, the gods were holders of the bridle. Praṇava the Vedic divinity constituted the long whip of Brahma.

25. The syllable A constituted the great umbrella, Mandara the side staff. The lord of mountains became his bow and the lord of serpents the bowstring.

26. Goddess Sarasvatī in the form of the Vedas constituted the bells of the bow. The brilliant Viṣṇu became the arrow and Agni the spear-head.

27. O sage, the four Vedas are said to be his horses. The remaining planets became their embellishments.

28. His army came up from water. The winds were his feathers, wings etc. Vyāsa and other sages were the drivers of the vehicle.

29. O great sage, why should I dilate. I shall succinctly say. Everything in the world found a place in the chariot.

30. At the bidding of Brahmā and Viṣṇu the chariot and its adjuncts were created bythe intelligent Viśvakarman.[4]


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 762 / Vishnu Sahasranama Contemplation - 762


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 762 / Vishnu Sahasranama Contemplation - 762🌹

🌻762. వ్యగ్రః, व्यग्रः, Vyagraḥq🌻

ఓం వ్యగ్రాయ నమః | ॐ व्यग्राय नमः | OM Vyagrāya namaḥ


అగ్రం విగత మస్యేతి వ్యగ్ర ఇత్యుచ్యతే హరిః ।
భక్తాభీష్ట ప్రదానేషు వ్యగ్రత్వాద్వా తథోచ్యతే ॥

ఎవని నుండి అయితే అగ్రం - తుది - వినాశము విగతముగా అనగా తొలగినదిగా అయినదో అతడు వ్యగ్రః. నాశరహితుడు. లేదా విశిష్టమగు అగ్రము అనగా తత్పరత కలవాడు వ్యగ్రుడు. భక్తులకు ఈప్సిత ఫలములను ఇచ్చుట విషయమున తత్పరత కలిగిన వ్యగ్రుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 762🌹

🌻762. Vyagraḥq🌻

OM Vyagrāya namaḥ

अग्रं विगत मस्येति व्यग्र इत्युच्यते हरिः ।
भक्ताभीष्ट प्रदानेषु व्यग्रत्वाद्वा तथोच्यते ॥

Agraṃ vigata masyeti vyagra ityucyate hariḥ,
Bhaktābhīṣṭa pradāneṣu vyagratvādvā tathocyate.


The One for whom agra or end/destruction has vanished is Vyagraḥ. The indestructible One.

Or Vyagraḥ can also mean the One who is ever eager. In the matter of fulfilling the desires of devotees, He is ever intent.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr‌ṣo dyutidharassarvaśastrabhr‌tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr‌ṅgo gadāgrajaḥ ॥ 81 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 170 / Kapila Gita - 170


🌹. కపిల గీత - 170 / Kapila Gita - 170 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 24 🌴

24. ఊరూ సుపర్ణ భుజయోరధి శోభమానౌ ఓజోనిధీ అతసికాకుసుమావభాసౌ|
వ్యాలంబిపీతవరవాససి వర్తమాన కాంచీకలాప పరిరంభినితంబబింబమ్॥


తాత్పర్యము : శ్రీహరియొక్క ఊరువులు (తొడలు) అవిసె పూవుల వలె నీలివర్ణ శోభితములై బలిష్ఠములై విలసిల్లుచుండును. అవి గరుత్మంతుని భుజములపై విరాజిల్లుచుండును. ఆ స్వామి నితంబములను ధ్యానింప వలెను. ఆ స్వామియొక్క పట్టు పీతాంబరము మణికట్టు వరకు వ్రేలాడుచు, మొలయందు గల స్వర్ణమయ కటి సూత్రముతో చెలిమి చేయుచు నితంబములను అంటి పెట్టుకొని యుండును. కనుక, భక్తుడు భగవంతుని యొక్క ఆ ఊరుద్వయమును, నితంబములను అనగా తొడలను తన హృదయమునందు ధ్యానించవలెను.

వ్యాఖ్య : భగవంతుని వ్యక్తిత్వం సర్వశక్తికి నిక్షేపం, మరియు అతని శక్తి అతని అతీంద్రియ శరీరం యొక్క తొడలపై ఉంటుంది. అతని శరీరం అంతా ఐశ్వర్యంతో నిండి ఉంది: సమస్త సంపదలు, సమస్త బలం, కీర్తి, అందం, జ్ఞానం మరియు త్యజించడం. అరికాళ్ళ నుండి ప్రారంభించి, క్రమంగా మోకాళ్ల వరకు, తొడల వరకు పైకి లేచి చివరకు ముఖానికి చేరుకునేలా భగవంతుని అతీంద్రియ స్వరూపాన్ని ధ్యానించమని యోగికి సూచించబడింది. పరమాత్మను ధ్యానించే విధానం ఆయన పాదాల నుండి ప్రారంభమవుతుంది.

భగవానుని అతీంద్రియ రూపం యొక్క వర్ణన ఖచ్చితంగా ఆలయాలలోని విగ్రహమైన అర్కా-విగ్రహంలో సూచించ బడుతుంది. సాధారణంగా, భగవంతుని విగ్రహం యొక్క శరీరం యొక్క దిగువ భాగం పసుపు పట్టుతో కప్పబడి ఉంటుంది. అది వైకుంఠ వేషం, లేదా ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుడు ధరించే దుస్తులు. ఈ వస్త్రం భగవానుని యొక్క చీలమండల వరకు విస్తరించి ఉంటుంది. ఆ విధంగా, యోగి ధ్యానం చేయడానికి చాలా అతీంద్రియ లక్ష్యాలను కలిగి ఉన్నందున, అతను ఏదో ఊహాత్మకంగా ధ్యానం చేయడానికి ఎటువంటి కారణం లేదు, అలాగే యోగులు అని పిలవబడే వారి లక్ష్యం వ్యక్తిత్వం లేనిది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 170 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 24 🌴

24. ūrū suparṇa-bhujayor adhi śobhamānāv ojo-nidhī atasikā-kusumāvabhāsau
vyālambi-pīta-vara-vāsasi vartamāna- kāñcī-kalāpa-parirambhi nitamba-bimbam


MEANING : Next, the yogi should fix his mind in meditation on the Personality of Godhead's thighs, the storehouse of all energy. The Lord's thighs are whitish blue, like the luster of the linseed flower, and appear most graceful when the Lord is carried on the shoulders of Garuḍa. Also the yogī should contemplate His rounded hips, which are encircled by a girdle that rests on the exquisite yellow silk cloth that extends down to His ankles.

PURPORT : The Personality of Godhead is the reservoir of all strength, and His strength rests on the thighs of His transcendental body. His whole body is full of opulences: all riches, all strength, all fame, all beauty, all knowledge and all renunciation. The yogī is advised to meditate upon the transcendental form of the Lord, beginning from the soles of the feet and then gradually rising to the knees, to the thighs, and finally arriving at the face. The system of meditating on the Supreme Personality of Godhead begins from His feet.

The description of the transcendental form of the Lord is exactly represented in the arcā-vigraha, the statue in the temples. Generally, the lower part of the body of the statue of the Lord is covered with yellow silk. That is the Vaikuṇṭha dress, or the dress the Lord wears in the spiritual sky. This cloth extends down to the Lord's ankles. Thus, since the yogī has so many transcendental objectives on which to meditate, there is no reason for his meditating on something imaginary, as is the practice of the so-called yogīs whose objective is impersonal.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సీతా నవమి శుభాకాంక్షలు Good Wishes on Sita Navami


🍀. సీతా నవమి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sita Navami to All. 🍀

ప్రసాద్ భరద్వాజ

29 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

🍀. సీతా నవమి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sita Navam to All. 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సీతా నవమి, Sita Navami🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 17 🍀

31. శ్రీమహాభైరవస్యేదం స్తోత్రసూక్తం సుదుర్లభమ్ |
మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్య ప్రదాయకమ్

32. యః పఠేన్నిత్యమే కాగ్రం పాతకైః స విముచ్యతే |
లభతే చామలాలక్ష్మీమష్టైశ్వర్య మవాప్నుయాత్

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : దివ్యప్రేమ : భౌతిక సాధనలు - అంతరాత్మతో ప్రేమించే ప్రేమకు గాని, దివ్యప్రేమకు గాని భౌతిక సాధనలు సరిపడవని చెప్పరాదు. భౌతిక సాధనలపై ఇవి ఆధారపడని మాట నిజమే, అవి లేకపోయినచో వీటికి ఏమాత్రమూ లోపము కలుగదు. అయినను ఆ సాధనలు విశుద్ధములైన పక్షములో వాటిని ఇవి మహదానందముతో వినియోగించుకొంటాయి. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: శుక్ల-నవమి 18:23:17

వరకు తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: ఆశ్లేష 12:48:10

వరకు తదుపరి మఘ

యోగం: దండ 10:31:12 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: కౌలవ 18:21:17 వరకు

వర్జ్యం: 00:14:48 - 02:02:24

మరియు 26:09:30 - 27:56:22

దుర్ముహూర్తం: 07:33:24 - 08:24:21

రాహు కాలం: 09:02:33 - 10:38:04

గుళిక కాలం: 05:51:31 - 07:27:02

యమ గండం: 13:49:05 - 15:24:36

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38

అమృత కాలం: 11:00:24 - 12:48:00

సూర్యోదయం: 05:51:31

సూర్యాస్తమయం: 18:35:37

చంద్రోదయం: 13:18:49

చంద్రాస్తమయం: 01:47:07

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: మానస యోగం - కార్య లాభం

12:48:10 వరకు తదుపరి పద్మ యోగం

- ఐశ్వర్య ప్రాప్తి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹