శ్రీ లలితా సహస్ర నామములు - 169 / Sri Lalita Sahasranamavali - Meaning - 169


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 169 / Sri Lalita Sahasranamavali - Meaning - 169 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 169. సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ ।
స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా ॥ 169 ॥ 🍀

🍀 909. సవ్యాపసవ్యమార్గస్థా :
వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది

🍀 910. సర్వాపద్వినివారిణీ :
అన్ని ఆపదలను నివారించునది

🍀 911. స్వస్థా :
మార్పులేకుండా ఉండునది

🍀 912. స్వభావమధురా :
సహజమైన మధురస్వభావము కలది

🍀 913. ధీరా :
ధైర్యము కలది

🍀 914. ధీరసమర్చితా :
ధీరస్వభావము కలవారిచే ఆరాధింప బడునది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 169 🌹

📚. Prasad Bharadwaj

🌻 169. Savyapasavyamargasdha sarva padvi nivarini
Svasdha svabhavamadhura dhira dhirasamarchita ॥ 169 ॥ 🌻

🌻 909 ) Savyapa savya margastha - 
She who is birth, death and living or She who likes the priestly and tantric methods

🌻 910 ) Sarva apadvi nivarini - 
She who removes all dangers

🌻 911 ) Swastha - 
She who has everything within her or She who is peaceful

🌻 912 ) Swabhava madura - 
She who is by nature sweet

🌻 913 ) Dheera - 
She who is courageous

🌻 914 ) Dheera samarchida - 
She who is being worshipped by the courageous


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 6 🌻

లోక కల్యాణమునకై పనిచేయుట సత్యమునందు జీవించుట అనియు, లోకోద్ధరణమునకై పనిచేయుట భ్రాంతిలో జీవించుట అనియు గ్రహించితిమి. అయినచో లోక కల్యాణమునకై పనిచేయుట వలన నాకేమి లభించును? అను ప్రశ్న కలి ప్రేరితుడై, జీవితమును వ్యాపారముగా మార్చుకొన్న వాని యందు ఉదయించును.

లోక కల్యాణమునకై ప్రకృతి, అందలి ఆకాశము, గాలి, నీరు, సూర్యచంద్రులు, నేల పని చేయుచుండుట మనకు కనపడుతున్న సత్యము. వీరికే పై ప్రశ్న పుట్టినచో ఈ జగత్తు యొక్క గమనము లేదు, మానవుని మనుగడ లేదు. ప్రకృతిని అనుసరించుటయే మానవుని కర్తవ్యము. దీనినే యజ్ఞార్థ కర్మ అందురు. ఇదియే నరజాతికి భద్రత చేకూర్చు భవ్యపథము‌.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

వివేక చూడామణి - 169 / Viveka Chudamani - 169


🌹. వివేక చూడామణి - 169 / Viveka Chudamani - 169 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -16 🍀

551. ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి శరీర జ్ఞానమును కోల్పోయి, జ్ఞానేంద్రియ వస్తు సముదాయము వెంట తిరుగుచున్నప్పటికి, ప్రారబ్దము వలన తాను అనుభవించుచున్న అట్టి వస్తువుల వలన పొందే ఆనందములకు అతీతముగా అతడు తన శరీరమును కేవలము సాక్షి మాదిరిగా, మానసికమైన కదలికలు లేకుండా జీవిస్తుంటాడు. ఏవిధముగా అయితే కుమ్మరి తన చక్రమును ఇరుసు మీద త్రిప్పుచున్నాడో అలాగా.

552. యోగి తాను తన జ్ఞానేంద్రియాలను తత్ సంబంధమైన వస్తువులపై మరల్చ కుండా వాటికి అతీతముగా సంబంధము లేని ప్రేక్షకుని వలె గమనిస్తుంటాడు. అతనికి తన పనుల ఫలితముల మీద ఎట్టి దృష్టి ఉండదు. ఎందువలనంటే తన మనస్సు పూర్తిగా వాటిపై విముక్తి చెంది తాను అనుభవిస్తున్న జ్ఞానామృతములో నిమగ్నమై ఉంటుంది.

553. ఎవరైతే ఈ వస్తువు తనకు అవసరమా, అనవసరమా అని తలచకుండా, ధ్యానములోని వస్తు సముదాయమును గమనించుచున్నట్లు సాక్షిగా తానే బ్రహ్మముగా, శివునిగా, బ్రహ్మజ్ఞానులలో తానే ఉత్తమునిగా భావిస్తుంటాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 169 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -16 🌻

551. The man of realisation, bereft of the body-idea, moves amid sense-enjoyments like a man subject to transmigration, through desires engendered by the Prarabdha work. He himself, however, lives unmoved in the body, like a witness, free from mental oscillations, like the pivot of the potter’s wheel.

552. He neither directs the sense-organs to their objects nor detaches them from these, but stays like an unconcerned spectator. And he has not the least regard for the fruits of actions, his mind being thoroughly inebriated with drinking the undiluted elixir of the Bliss of the Atman.

553. He who, giving up all considerations of the fitness or otherwise of objects of meditation, lives as the Absolute Atman, is verily Shiva Himself, and he is the best among the knowers of Brahman.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 492


🌹 . శ్రీ శివ మహా పురాణము - 492 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 39

🌻. శివుని యాత్ర - 2 🌻

ఓ మునిశ్రేష్ఠా! తరువాత శంభుడు హర్షముతో నిండిన మనస్సుగలవాడై లోకాచారమును ప్రదర్శించువాడై శుభవచనములతో ఆనందమును కలిగిస్తూ నీతో నిట్లనెను (12).

ఓ మునిశ్రేష్ఠా! నేను నీకు చెప్పెదను. నీవిపుడు ప్రీతితో వినుము. నీవు గొప్ప భక్తులలో అగ్రగణ్యుడవు, నాకు ప్రియుడవు. కావుననే నీకు చెప్పుచున్నాను (13). పార్వతీదేవి నీ ఆదేశముచే గొప్ప తపస్సును చేసినది. నేను సంతోషించి ఆమెను వివాహమాడెదనని వరము నిచ్చితిని (14). భక్తికి వశుడనయ్యే నేను ఆమెను వివాహమాడెదను. ఈ కార్యమును సప్తర్షులు సాధించినారు. వారు వివాహ లగ్నమును కూడా నిర్ణయించినారు (15). ఓ నారదా! ఈ నాటి నుండి ఏడవనాడు వివాహము సంపన్నము కాగలదు. నేను లోకాచారము ననుసరించి గొప్ప ఉత్సవమును చేయగలను (16).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ కుమారా! శంకర పరమాత్మ యొక్క ఆ మాటను విని, ప్రసన్నమగు మనస్సు గల నీవు ఆ ప్రభునకు నమస్కరించి ఇట్లు పలికితివి (17).

నారదుడిట్లు పలికెను -

ఇది నీ వ్రతము. నీవు భక్తులకు అధీనుడవని చెప్పెదరు. పార్వతియొక్క మనస్సులోని కోరికను తీర్చి నీవు మంచి పనిని చేసితివి (18). హే విభో! నీవు నన్ను నీ సేవకునిగా తలంచి, నాకు తగిన కార్యమునందు నియోగించుము. నాయందు దయను చూపుము. నీకు నమస్కారమగును గాక! (19)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు ఇట్లు పలుకగా, భక్తవత్సలుడగు శివశంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై సాదరముగా నీతో నిట్లనెను (20).

శివుడిట్లు పలికెను-

ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలను, మునులను, సిద్ధులను మరియు ఇతరులనందరినీ కూడా నామాటగా తప్పని సరిగా నీవు ఆహ్వానించుము (21). అందరు నా శాసనమునందలి ఆదరముతో ఉత్సాహవంతులై సర్వశోభలను కలిగియున్నవారై భార్యపుత్రులతో పరివారముతో గూడా ప్రీతితో వచ్చెదరు గాక! (22) ఓ మునీ! దేవతలు మొదలగు వారు ఎవరైతే ఈ వివాహమహోత్సవమునకు హాజరు కారో, వారిని నేను నా వారు అని భావించలేను (23).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

గీతోపనిషత్తు -293


🌹. గీతోపనిషత్తు -293🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 17-4

🍀 17-4. ప్రణవ స్వరూపుడు - భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము. మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. 🍀

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.

వివరణము : నామము రూపము లేని భగవతత్త్వమునకు ఓంకారము ప్రథమనాదము. అందలి నాదము ప్రథమ రూపము. భగవంతుని ప్రప్రథమ నామ రూపములు ఓంకారముగ ఋషులు దర్శించిరి. మరియొక ఉదాహరణముగ “మూడు వేదములు నేనే" అని దైవము పలికినాడు. ఋక్, సామ, యజుర్వేదములు మూడు ప్రధానమగు వేదములు. ఉచ్చారణ, ప్రాణ స్పందనము, కర్మ నిర్వహణము సృష్టి యందుకల మూల త్రికోణము.

మన యందు సంకల్ప ముచ్చరింపబడగ, దానిని ప్రాణ బలముతో, బుద్ధి బలముతో నిర్వర్తించు చుందుము. ఇందు సంకల్పము ఋగ్వేదము. తాళ లయాత్మకముగ సాగు ప్రాణస్పందనము సామ వేదము. బుద్ధి బలముతో సంకల్పమును ప్రాణశక్తి సహాయమున నిర్వర్తించుట యజుర్వేదము. ఈ మూడును నిత్యము మన యందు జరుగుచు నుండును. సంకల్పములు మనయందు అవతరించుచు నుండును. వానిని ప్రాణబలము, బుద్ధిబలముతో నిర్వర్తించుచు నుందుము. సంకల్పము ఇచ్ఛాశక్తి స్వరూపము. ప్రాణము జ్ఞానశక్తి స్వరూపము. బుద్ధి క్రియాశక్తి స్వరూపము. ఓంకారము రూపమున ఈ మూడింటికిని బలము కూర్చి ఈశ్వరుడు సృష్టి నిర్వహణము చేయుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

మార్గశిర పౌర్ణమి - కోరల పౌర్ణమి విశిష్టత


🌹. మార్గశిర పౌర్ణమి - కోరల పౌర్ణమి విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి 'కోరల' పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు.

మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.

ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.

చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.

కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగి పోతాయి.

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021

అన్నపూర్ణ జయంతి , ప్రాముఖ్యత , వ్రత కథ Annapurna Jayanti, Importance, Vrat Katha

🌹. అన్నపూర్ణ జయంతి , ప్రాముఖ్యత , వ్రత కథ 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

అన్నపూర్ణ వ్రతం హిందువుల ముఖ్యమైన పండుగ. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అవసరం. ఆ ఆహారానికి ప్రతీకగా హిందూ దేవత అయిన అన్నపూర్ణ దేవికి అంకితం చేయబడింది.

హిందీలో 'అన్నా' అనే పదానికి 'ఆహారం' అని అర్ధం , 'పూర్ణ' 'మొత్తాన్ని' ఊహించబడినది.

అన్నపూర్ణ జయంతి ఒక శుభమైన మరియు పురాతనకాలం నుండి జరుపుకుంటున్న హిందూ పండగ.

ఈ పండుగను ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణేశ్వరికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నపూర్ణ జయంతి సందర్భంగా పండగ జరుపుకోవడమే కాదు , ఆ దేవతను ప్రశంసిపబడుతారు.

ఈ రోజు జీవనాధారమైన అన్నపూర్ణ దేవత పుట్టింది. పార్వతి దేవికి మరో రూపం అన్నపూర్ణ అంటారు. మీరు ఈ పవిత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని మరియు అన్నపూర్ణ దేవత ఆశీర్వాదం పొందాలనుకుంటే , అన్నపూర్ణ వ్రతం చేయాలి.

అన్నపూర్ణ జయంతిని ఆచార హిందూ షెడ్యూల్‌లో 'మార్గశీర్ష' నెల 'పూర్ణిమ' (పౌర్ణమి రోజు) లో జరుపుకుంటారు. ఈ గుర్తింపు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో వస్తుంది. ఈ రోజున హిందువులు అన్నపూర్ణ దేవిని పూర్తి నిబద్ధతతో , భక్తితో పూజిస్తారు. మహిళలు తప్పనిసరిగా ఈ వ్రతం రోజున పూజలు ఆచారాలను పాటిస్తారు.

పశ్చిమ బెంగాల్ భూభాగంతో సహా భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో సాంప్రదాయకంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు , అన్నపూర్ణ జయంతి హిందూ నెల 'చైత్ర'లో కనిపిస్తుంది. దక్షిణ భారత అభయారణ్యాలలో అధికభాగంలో , అన్నపూర్ణ దేవిని శుభ దుర్గా నవరాత్రి వేడుకల 'చతుర్థి' (నాల్గవ రోజు) లో పూజిస్తారు. ప్రత్యేక పూజలు మరియు ఆచారాలతో , అన్నపూర్ణ వ్రతాన్ని స్త్రీలు జరుపుకుంటారు. వారణాసి , కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ లో అనేక అన్నపూర్ణ దేవత ఆలయాలు ఉన్నాయి.


🍀. అన్నపూర్ణ వ్రత కథ

హిందూ ఇతిహాసాలు సూచించినట్లుగా , భూమి నుండి ఆహారం క్షీణించడం ప్రారంభించినప్పుడు , బ్రహ్మ మరియు విష్ణువులతో పాటు అందరు దేవుళ్ళు పరమ శివుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో పార్వతి దేవి మార్గాశిర్షా నెలలోని 'పూర్ణిమ' లో అన్నపూర్ణ దేవతగా అవతరించింది మరియు భూమిపై ఆహారాన్ని ఆశీర్వదించింది.

ఆ సమయం నుండి, ఈ రోజు అన్నపూర్ణ జయంతి అని ప్రశంసించబడింది.

అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. 'అన్నపూర్ణే , సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే' అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతటివాడికే అమ్మయై భిక్ష వేసింది.

ఆమె సంతానంలాటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నితాన్నిస్తుంది. ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారంయొక్క స్వరూపమే.

ఆహారాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక , రాజస , తామసాలు.

శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోను అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు…. అన్నమే బ్రహ్మగా వర్ణించాయి.

(అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌) అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువంటి అన్నాన్ని నిందించడం , పరీక్షించడం , వదిలిపెట్టడం వంటి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెపుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని (అన్నాన్ని) స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.

సాత్వికమైన హిత , మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరు ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నమాటే.

ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం.

అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్‌ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం కొబ్బరి అన్నం. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది. గుండె నీరసాన్ని తగ్గిస్తుంది. కఫ , పైత్యములను తగ్గిస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. కడుపులో తాపాన్ని పోగొడుతుంది. కిడ్ని వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.


🌻. అన్నపూర్ణ వ్రత ఆచారాలు:

ఈ రోజున చేసే ఆచారాలన్నీ దశల వారీగా ప్రస్తావించబడ్డాయి.

హిందూ భక్తులు తమ ఇంటిలో పూజా వేడుకలు చేస్తారు. ఒక చిన్న మండపం తయారు చేసి , మరియు అన్నపూర్ణ దేవత యొక్క చిహ్నం పూజ స్థలంలో ఉంచబడుతుంది.

అన్నపూర్ణ జయంతి నాడు దేవతను 'షోడశోపాచార్' తో పూజిస్తారు. భక్తులు అన్నపూర్ణ దేవికి 'అన్నాభిషేకం' అర్పించినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ దేవిని సంతృప్తి పరచడానికి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి స్త్రీలు అన్నపూర్ణ జయంతి జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. రోజు గడుస్తున్న కొద్దీ వారు ఏమీ తినరు , త్రాగరు. అన్నపూర్ణ దేవతను పూజించిన తరువాత , రాత్రి సమయంలో ఉపవాసం తీర్చుకుంటారు.

అన్నపూర్ణ దేవి అష్టకం పఠనం ఈ రోజున చాలా ఆశీర్వాదంగా భావించబడుతుందని నమ్ముతారు.

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🙏లకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌹 🌹 🌹 🌹 🌹


19 Dec 2021