25-JULY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-69 / Bhagavad-Gita - 1-69 - 2 - 22🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 637 / Bhagavad-Gita - 637 - 18-48🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 461 462 / Vishnu Sahasranama Contemplation - 461, 462🌹
4) 🌹 Daily Wisdom - 144🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 118🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 50🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 294 / Sri Lalita Chaitanya Vijnanam - 294🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 69 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 22 🌴*

22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాటి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాస్య అన్యాని సంయాతి నవాని దేహీ ||

🌷. తాత్పర్యం :
*మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.*

🌷. భాష్యము :
ఆత్మ దేహములను మార్చుననెడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, దేహమునందు జరిగెడి మార్పులను అంగీకరించియే తీరవలెను. 

శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యౌవనము వరకు, యౌవనము నుండి ముసలితనము వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసియున్నది. ముసలితనము పిమ్మట మార్పు అనునది వేరొక దేహమును కలుగజేయును. ఈ విషయమును ఇదివరకే పూర్వశ్లోకము(2.13) నందు వివరింపబడినది.

ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యపడుచున్నది. స్నేహితుని కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చు రీతి, ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును. 

ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొనియున్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి(ఆత్మ) వృక్షఫలములను ఆరగించుచుండగా, వేరొక పక్షి (శ్రీకృష్ణుడు) తన మిత్రుని గాంచుచున్నది. 

ఈ పక్షులు రెండును గుణరీతిని ఏకమైనను, అందొకటి భౌతికవృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములను కేవలము సాక్షిగా నిలిచియున్నది. ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షియై యున్నాడు. వారివురు స్నేహితులే అయినను అందులో ఒకరు గురువు కాగా, రెండవవాడు శిష్యుడై యున్నాడు. 

ఈ సంబంధమును మరచుటయే ఆత్మ ఒక వృక్షము నుండి వేరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమై యున్నది. అనగా దేహమనెడి వృక్షముపై జీవాత్మ తీవ్రప్రయాస నొందుచుండును. కాని అది చెంతనే ఉన్న మిత్రుడైన వేరొక పక్షిని గురువుగా అంగీకరించినంతనే శీఘ్రముగా సర్వశోకముల నుండి ముక్తినొందగలదు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 69 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 22 🌴*

22. vāsāṁsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro ’parāṇi tathā
 śarīrāṇi vihāya jīrṇāny anyāni saṁyāti navāni dehī

🌻 Translation :
*As a person puts on new garments, giving up old ones, the soul similarly accepts new material bodies, giving up the old and useless ones.*

🌻 Purport :
Change of body by the atomic individual soul is an accepted fact. Even the modern scientists who do not believe in the existence of the soul, but at the same time cannot explain the source of energy from the heart, have to accept continuous changes of body which appear from childhood to boyhood and from boyhood to youth and again from youth to old age. From old age, the change is transferred to another body. This has already been explained in a previous verse (2.13).

Transference of the atomic individual soul to another body is made possible by the grace of the Supersoul. The Supersoul fulfills the desire of the atomic soul as one friend fulfills the desire of another. 

The Vedas, like the Muṇḍaka Upaniṣad (3.1.2), as well as the Śvetāśvatara Upaniṣad (4.7), compare the soul and the Supersoul to two friendly birds sitting on the same tree. One of the birds (the individual atomic soul) is eating the fruit of the tree, and the other bird (Kṛṣṇa) is simply watching His friend. 

Of these two birds – although they are the same in quality – one is captivated by the fruits of the material tree, while the other is simply witnessing the activities of His friend. Kṛṣṇa is the witnessing bird, and Arjuna is the eating bird. Although they are friends, one is still the master and the other is the servant. Forgetfulness of this relationship by the atomic soul is the cause of one’s changing his position from one tree to another, or from one body to another. 

The jīva soul is struggling very hard on the tree of the material body, but as soon as he agrees to accept the other bird as the supreme spiritual master the subordinate bird immediately becomes free from all lamentations.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 638 / Bhagavad-Gita - 638 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 49 🌴*

49. ఆసక్తబుద్ధి: సర్వత్ర జితాత్మా విగతస్పృహ: |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం : 
ఆత్మనిగ్రహము కలవాడును, అనాసక్తుడును, భౌతికసుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్న్యాసము ద్వారా కర్మఫల విముక్తి యనెడి అత్యున్నత పూర్ణత్వస్థాయిని బడయగలడు.

🌷. భాష్యము :
తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు, తత్కారణముగా తన కర్మఫలముల ననుభవించు అధికారము తనకు లేదనియు ప్రతియొక్కరు తలచవలెను. నిజమైన సన్న్యాసము యొక్క భావమిదియే. 

వాస్తవమునకు అతడు శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అతని కర్మల ఫలములన్నియును శ్రీకృష్ణుని చేతనే అనుభవనీయములై యున్నవి. ఇదియే నిజమైన కృష్ణభక్తిరసభావనము. అనగా కృష్ణభక్తిభావన యందు వర్తించువాడు నిజముగా సన్న్యాసియే. అతడు సన్న్యాసాశ్రమము నందున్నట్టివాడే. 

అటువంటి భావనలో వర్తించువాడు కృష్ణుని ప్రీత్యర్థమై వర్తించుచున్నందున సదా సంతృప్తుడై యుండగలడు. భౌతికవిషయముల యెడ అనురక్తుడు గాక అట్టివాడు భగవానుని దివ్యసేవానందమునకు అన్యమైన ఆనందమును పొందుట యందు అలవాటు లేకుండును. వాస్తవమునకు సన్న్యాసియైనవాడు పూర్వకర్మఫలముల నుండి ముక్తుడై యుండవలెను. కాని కృష్ణభక్తిభావనాయుతుడైన మనుజుడు నామమాత్ర సన్న్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పూర్ణత్వమును బడయగలడు. 

అటువంటి మన:స్థితియే “యోగారూఢత్వము” అనబడును. అదియే యోగమునందలి పూర్ణస్థితి. తృతీయాధ్యాయమున నిర్ధారింపబడినట్లు “యస్త్వాత్మరతి రేవ స్యాత్ – ఆత్మ యందే తృప్తి నొందువానికి ఎటువంటి కర్మఫలముల భయముండదు.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 638 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 49 🌴*

49. asakta-buddhiḥ sarvatra
jitātmā vigata-spṛhaḥ
naiṣkarmya-siddhiṁ paramāṁ
sannyāsenādhigacchati

🌷 Translation : 
One who is self-controlled and unattached and who disregards all material enjoyments can obtain, by practice of renunciation, the highest perfect stage of freedom from reaction.

🌹 Purport :
Real renunciation means that one should always think himself part and parcel of the Supreme Lord and therefore think that he has no right to enjoy the results of his work. Since he is part and parcel of the Supreme Lord, the results of his work must be enjoyed by the Supreme Lord. This is actually Kṛṣṇa consciousness. The person acting in Kṛṣṇa consciousness is really a sannyāsī, one in the renounced order of life. By such a mentality, one is satisfied because he is actually acting for the Supreme. 

Thus he is not attached to anything material; he becomes accustomed to not taking pleasure in anything beyond the transcendental happiness derived from the service of the Lord. A sannyāsī is supposed to be free from the reactions of his past activities, but a person who is in Kṛṣṇa consciousness automatically attains this perfection without even accepting the so-called order of renunciation. 

This state of mind is called yogārūḍha, or the perfectional stage of yoga. As confirmed in the Third Chapter, yas tv ātma-ratir eva syāt: one who is satisfied in himself has no fear of any kind of reaction from his activity.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 461, 462/ Vishnu Sahasranama Contemplation - 461, 462 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻461. మనోహరః, मनोहरः, Manoharaḥ🌻*

*ఓం మనోహరాయ నమః | ॐ मनोहराय नमः | OM Manoharāya namaḥ*

యో నిరతిశయానందరూపత్వాత్ పరమేశ్వరః ।
మనోహరతి స మనోహర ఇత్యుచ్యతే బుధైః ॥

తన కంటె గొప్పది లేని ఆనందమే తన స్వరూపముగా కలవాడు కావున ఎల్లవారి మనస్సులను హరించి తన వైపునకు త్రిప్పుకొనువాడు.

యో వై భూమా తత్ సుఖం - నాల్పే సుఖ మస్తి (ఛాందోగ్యోపనిషత్ 7.23.1)

ఏది అన్నిటికంటెను పెద్దదియో అదియే సుఖస్వరూపమును సుఖ కరమును. అంతకంటెను చిన్నదియగు దేనియందును సుఖము లేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 461🌹*
📚. Prasad Bharadwaj

🌻461. Manoharaḥ🌻*

*OM Manoharāya namaḥ*

Yo niratiśayānaṃdarūpatvāt parameśvaraḥ,
Manoharati sa manohara ityucyate budhaiḥ.

यो निरतिशयानंदरूपत्वात् परमेश्वरः ।
मनोहरति स मनोहर इत्युच्यते बुधैः ॥

One who attracts or sways the minds by His incomparable and extraordinary blissful nature.

Yo vai bhūmā tat sukhaṃ - nālpe sukha masti (Chāndogyopaniṣat 7.23.1) / यो वै भूमा तत् सुखं - नाल्पे सुख मस्ति (छान्दोग्योपनिषत् ७.२३.१) That which is vast is bliss; there is no joy in the small.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 462 / Vishnu Sahasranama Contemplation - 462🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻462. జితక్రోధః, जितक्रोधः, Jitakrodhaḥ🌻*

*ఓం జితక్రోధాయ నమః | ॐ जितक्रोधाय नमः | OM Jitakrodhāya namaḥ*

శ్రీహరిర్వేదమర్యాదాస్థాపనార్థం సురద్విషః ।
హంతి సర్వయుగేష్వేష న తు కోపవశాదితి ।
జితః క్రోధో యేన విష్ణుస్స జితక్రోధ ఉచ్యతే ॥

ఎవని చేత క్రోధము జయించ బడినదియో అట్టివాడు. ఎవరియందును ఆయనకు క్రోధము లేదని అర్థము. సుర శత్రువులను చంపును కదా అట్లు చంపుట వారియందు కోపముండుట చేతనే కదా అనిన ఆయన వేదమర్యాదాస్థాపనార్థము దేవశత్రువులను చంపునే కానీ కోపవశమున కాదు అని సమాధానము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 462🌹*
📚. Prasad Bharadwaj

*🌻462. Jitakrodhaḥ🌻*

*OM Jitakrodhāya namaḥ*

Śrīharirvedamaryādāsthāpanārthaṃ suradviṣaḥ,
Haṃti sarvayugeṣveṣa na tu kopavaśāditi,
Jitaḥ krodho yena viṣṇussa jitakrodha ucyate.

श्रीहरिर्वेदमर्यादास्थापनार्थं सुरद्विषः ।
हंति सर्वयुगेष्वेष न तु कोपवशादिति ।
जितः क्रोधो येन विष्णुस्स जितक्रोध उच्यते ॥

He by whom anger has been conquered. He kills the enemies of the devas to establish the Vedic way but not swayed by anger.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 144 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. The Aim of Life is the Attainment of Moksha 🌻*

The central aim of the philosophy of Swami Sivananda is the living of the highest life, a life fixed in the knowledge of the principles which are the ultimate regulators of all things. 

An enlightened life of peace and joy is the goal of his sublime philosophy. And this blessedness can be attained only in the Divine Being. Dharma, the ethical value; artha, the material value; and kama, the vital value, are all based on moksha which is the supreme value of existence. 

The aim of life is the attainment of moksha. Swami Sivananda’s system is a specimen of a type of philosophy that arises on account of a necessity felt by all in life, and not because of any curiosity characteristic of thinkers who have only a speculative interest and no practical aspiration. 

The sight of evil and suffering, pain and death, directs one’s vision to the causes of these phenomena; and this, in its turn, necessitates an enquiry into the reality behind life as a whole. It is not an academic interest in theoretical pursuits, but a practical irresistible urge to contact Reality, that leads to the glorious enterprise of true philosophy.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 118 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 95. విటమినులు 🌻*

ప్రస్తుత కాలమున విటమినులను విపరీతముగ భుజించు చున్నారు. దేహపోషణమునకు అవి అత్యావశ్యకములని వైద్యశాస్త్రము యొక్క నమ్మిక. విటమినుల స్వీకరణము కారణముగ ప్రాణశక్తి (Vital Force) పెరుగునని నమ్మకము. మిటమినుల విషయమున మాదొక
అవగాహన యున్నది. మా అనుభవమున ప్రాణశక్తిని పెంపొందించు విటమినులు జీవుని యందే యున్నవి. జీవునియందలి సద్గుణమలే నిజమగు విటమినులు. సద్గుణములు ప్రాణమును పెంపొందించి నంతగ మిటమినులు పెంపొందింపలేవు. 

సద్గుణవంతులు మిక్కుట ముగ ప్రాణశక్తి కలిగి యుందురు. వారహర్నిశలు పనిచేయుచున్నను ప్రాణము నీరసింపదు. తెలివికి సద్గుణంబుల బలిమి గూర్చినచో అంతకు మించిన విటమినులు, టానిక్కులు లేవు. సద్గుణములే సమస్త మిటమినులకు నివాస స్థానము. సద్గుణములు లేనివారికి యీ స్థావరములు మూతబడవు. వారు విటమినులు తినుచున్నను ప్రాణమంతంత మాత్రముగనే యుండును.

సాధారణ మానవునకు విటమినులు పనిచేయపోవుటకు కారణము వారియందు సద్గుణముల కొలుతయే. మా దృష్టిలో విశ్వాసము మొట్టమొదటి సద్గుణము. విశ్వాసము మూఢ నమ్మకము కాదు. అది ఆత్మవిశ్వాసము. తనయందు తనకు నమ్మకమున్న వానికి ఇతరులయందు కూడ నమ్మకముండును. 

ఇతరుల యందు అప నమ్మకము తమ యందలి అపనమ్మకము యొక్క ప్రతిబింబమే. అపనమ్మకము ప్రాణమునకు శత్రువు. నమ్మకము ప్రాణమునకు మిత్రుడు. నమ్మినవాడు చెడడని ఆర్యోక్తి. నమ్మి చెడినవాడు లేడని మరియొక ఆర్యోక్తి. అనుమానము, అపనమ్మకము గలవారు విటమినులుగొనుట నిష్ప్రయోజనము. అట్టివారికి విటమినులు అపాయమని కూడ మా నమ్మకము. విటమినులను గొని అపనమ్మిక శక్తి పెరుగునే కాని ప్రాణము పెరుగదు. అపనమ్మకము, అనుమానములకు సహాయనిరాకరణము (Non-co-operation) తోడైనచో ఇక అట్టివారికి ఔషధములు, విటమినులు పనిచేయుట కష్టము. ఇది తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 50 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. సత్యం, చైతన్యం, పరమానందం, ఇవి దేవుడికి మూడు ముఖాలు. త్రిమూర్తిమత్వం. నువ్వు సంపూర్తిగా ప్రశాంతంగా వున్న క్షణం, నిశ్చలంగా వున్న క్షణం ఈ త్రిముఖాలూ నీవే -🍀*

ధ్యానమంటే ఏమీ కాకుండా పోవడం. ఎవరూ కాకుండా మారతాం. అంటే నిన్ను నువ్వు సమస్తంలో అదృశ్యం చేసుకోవడం. నిన్ను వేరుగా నిలపడం కాదు. ఆటంక పరచడం కాదు. మాయం చెయ్యడం. సంపూర్ణంతో జరిగే ప్రేమ వ్యవహారమది. సంపూర్ణంతో సేంద్రియ సమన్వయమది. సంపూర్ణత ముందు, అనంతం ముందు మనం ఏమీ కామనుకో. అనంతం ముందు మనం సముద్రం ముందు మనం నీటి బిందువులాంటి వాళ్ళం. అనంతం ముందు నీ అల్పత్వాన్ని అంగీకరిస్తే ఆ విషయాన్ని ఆహ్లాదంగా ఆమోదించు.

దాన్నించే ఉపసంహరించు కోవడం కాదు. దాన్ని గురించి ఆనందించు. ఎందుకంటే అహం అదృశ్యమయితే అన్ని ఉద్వేగాలు, భయంతో అదృశ్యమవుతాయి. నువ్వు అహాన్ని వదిలిన మరుక్షణం మరణ భయం కూడా మాయమవుతుంది. అప్పుడు కేవలం అహం మాత్రమే మరణిస్తుంది. నీ యధార్థం శాశ్వతత్వమే. అన్ని వుద్వేగాలూ, భయాలూ అదృశ్యమయితే నువ్వు సంపూర్ణ విశ్రాంతిలో వుంటావు. 

అహం లేకపోవడమన్నది ధ్యానానికి ఆరంభం. విశ్రాంతి సంతృప్తికి ఆస్కారమిస్తుంది. నువ్వు గాఢమయిన విశ్రాంతోలో వుంటే ఏదీ నిన్ను కదిలించలేదు. ఎందుకంటే నీ యింటికి నువ్వొచ్చావు. ప్రాచ్యం దాన్ని 'సచ్చిదానందం' అన్నది. సత్యం, చైతన్యం, పరమానందం, ఇవి దేవుడికి మూడు ముఖాలు. త్రిమూర్తిమత్వం. నువ్వు సంపూర్తిగా ప్రశాంతంగా వున్న క్షణం, నిశ్చలంగా వున్న క్షణం ఈ త్రిముఖాలూ నీవే - నువ్వు దైవత్వానివి. నువ్వెప్పుడూ దైవత్వానివే అనుకో. యిప్పుడు దాన్ని కనుక్కున్నావు. చూశావు. 


సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 294 / Sri Lalitha Chaitanya Vijnanam - 294 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*

*🌻 294. 'భువనేశ్వరీ' 🌻* 

పదునాలుగు లోకములతో కూడిన భువనమునకు ఈశ్వరి అని అర్థము. భువనమనగా ఏడు ఊర్ధ్వలోకములు, ఏడు అధోలోకములతో కూడిన సృష్టి. ఇన్ని లోకముల సృష్టి జీవుల పరిణామమును బట్టి ఏర్పడును. ఇన్ని లోకముల రూపము, అందలి జీవుల రూపము, ఆయా జీవుల స్వభావము, ప్రాణము శ్రీమాత ఆధారముగనే ఏర్పడుచూ వర్తించుచూ ఉన్నవి. 

వెండితెర ఆధారముగనే ప్రేక్షకులు పౌరాణికములు, జానపదములు, సాంఘికములైన చిత్రములను చూచు చున్నారు కదా! కుట్రలు, హత్యలు, మోసములు, దోపిడీలు, యుద్ధములు, నవరసభరితములైన సన్నివేశములు, విశ్వాసము, భక్తి ఇత్యాది వన్నియూ వెండితెర ఆధారముగనే జరుగుచుండును. 

ఈ వెండి తెరయే శ్రీమాత. అన్ని జీవులయందు వెండితెరవలె యుండి, వారికి ప్రాణము, తెలివి నందించి, వారి స్వభావములకు, రూపములకు ఆధారముగా నుండును. ఇట్లు రూపము, రంగు, శబ్దము, అంకె అను నాలుగు అంశముల కాధారమై వాని నధిష్ఠించి ఐదవదిగా తానుండును. అంతటి పైన తన ఆధిపత్య ముండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 294 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*

*🌻 Bhuvaneśvarī भुवनेश्वरी (294) 🌻*

Bhuvana means the universe. She is the ruler (Īśvari) of this universe. Seven worlds below the planet earth including earth and seven worlds above the earth are together called universe. These fourteen represent the products of the five tattva-s and antaḥkaraṇa.  

“hrīṃ” (ह्रीं) is known as Bhuvaneśvari bīja, also known as māyā bīja. This bīja has the potency of creation and is considered as one of the powerful bīja-s, as it is the combination of Śiva bīja (ह), Agni (रं) bīja and kāmakalā (ईं). When She is enjoying all the luxuries, She ought to be a great ruler and this is what is stressed here. Bhuvaneśvara is Śiva and His wife is Bhuvaneśvarī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹