శ్రీ లలితా సహస్ర నామములు - 177 / Sri Lalita Sahasranamavali - Meaning - 177


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 177 / Sri Lalita Sahasranamavali - Meaning - 177 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 177. బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ ।
సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ ॥ 177 ॥ 🍀

🍀 964. బంధూకకుసుమప్రఖ్యా :
మంకెనపూలవంటి కాంతి కలిగినది

🍀 965. బాలా :
12 సంవత్సరముల లోపు బాలిక,,,,బాల

🍀 966. లీలావినోదినీ :
బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది

🍀 967. సుమంగళి :
మంగళకరమైన రూపము కలిగినది

🍀 968. సుఖకరీ :
సుఖమును కలిగించునది

🍀 969. సువేషాఢ్యా :
మంచి వేషము కలిగినది

🍀 970. సువాసినీ :
సుమంగళి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 177 🌹

📚. Prasad Bharadwaj

🌻 177. Bandhuka kusuma prakhya balalila vinodini
Sumangali sukhakari suveshadya suvasini ॥ 177 ॥ 🌻

🌻 964 ) Bhandhooka kusuma prakhya -
She who has the glitter of bhandhooka flowers

🌻 965 ) Bala -
She who is a young maiden

🌻 966 ) Leela Vinodhini -
She who loves to play

🌻 967 ) Sumangali -
She who gives all good things

🌻 968 ) Sukha kari -
She who gives pleasure

🌻 969 ) Suveshadya -
She who is well made up

🌻 970 ) Suvasini -
She who is sweet scented(married woman)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -3 🌻

అవతారమూర్తి ధర్మసాధన మవలంబించుటలో లీలలు చూపి , ప్రవర్తనము ఇట్లుండవలయునని నేర్పును. అపుడెవడైన అహంకారి తాను దేవుడనని చెప్పుకొనదలచినచో తానును గురువు దగ్గర విద్యలు నేర్చుట మున్నగు మంచిపనులు చేసి తీరవలయును. చేసినచో వాని అహంకారము తీరి నిజముగా తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొనును.

🌻 🌻 🌻

యమము అను సద్గుణమును నిర్లక్ష్యము చేయుటవలన జరుగు దండమే యమదండము. దీని ప్రయోజనము పునః పరిశుద్ధియే.

కూడబెట్టిన సంపదలతో సుఖములు అనుభవించుటయే సురలోకము. పుణ్యములకు ఫలితము దేహసౌఖ్యమైనపుడు యమ దండన తప్పదు. దానినుండి తప్పించుకొనుటకై ఇంద్రియములను, మనస్సును దమించుకొని పరబ్రహ్మమును చూడగోరువారు గడుసరులే గాని, మోక్షజీవులు కారు.

ఆత్మసమర్పణ మార్గము నవలంబించి అంతర్యామి అడుగుజాడల ననుసరించు వారే సర్వోత్తములని భాగవత మతము. ఇందు పరిసర జీవుల సద్గుణములే నారాయణుని కల్యాణ గుణములుగా తెలియబడును. మహనీయుల జీవిత సన్నివేశములను ప్రసంగించు కొనుటయే నారాయణ గుణకథ అను అమృత ప్రవాహము.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2022

వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177


🌹. వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 33. బంధనాలు -3 🍀

574. పుట్టుక, చావు లేనిది బ్రహ్మము. దానికి హద్దులు లేవు. అది పెనుగులాడే ఆత్మకాదు. అది విముక్తి తరువాత పొందేది కాదు మరియు విముక్తి పొందినది కాదు అది అంతిమ సత్యము.

575. నేను ఈ రోజు నీకు మరల మరల చెప్పుచున్నాను. నా స్వంత కుమారునిగా నిన్ను భావించుచున్నాను. ఈ గొప్పదైన, అరుదైన రహస్యము, అంతర్గత వేదాంతపరమైన పూర్తి అభిప్రాయము, వేద మూలము యొక్క సారము. నీవు విముక్తుడైన తరువాత సాధకుడివైన వ్యక్తిగా మరకలు తొలగించబడిన పరిశుద్దినిగా ఈ చీకటి ప్రపంచములో మానసిక పరమైన కోరికలు లేని వానిగా భావించుచున్నాను.

576. గురువు యొక్క ఈ మాటలను వింటూ, శిష్యుడు భక్తితో గురువు గారికి సాష్టాంగ నమస్కారము చేసి అతని అనుమతితో తన మార్గములో తాను విముక్తి పొందిన వానిగా ప్రయాణము సాగించినాడు.

577. గురువు గారు తన మనస్సును బ్రహ్మమైన అనంతాత్మలో నిమగ్నము చేసి, అందులో ఈదులాడుతూ ప్రపంచం మొత్తాన్ని పవిత్రము చేస్తూ, తన మనస్సులోని అన్ని విధములైన భేద భావాలను తొలగించుకున్నాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 177 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 33. Attachments -3 🌻

574. There is neither death nor birth, neither a bound nor a struggling soul, neither a seeker after Liberation nor a liberated one – this is the ultimate truth.

575. I have today repeatedly revealed to thee, as to one’s own son, this excellent and profound secret, which is the inmost purport of all Vedanta, the crest of the Vedas – considering thee an aspirant after Liberation, purged of the taints of this Dark Age, and of a mind free from desires.

576. Hearing these words of the Guru, the disciple out of reverence prostrated himself before him, and with his permission went his way, freed from bondage.

577. And the Guru, with his mind steeped in the ocean of Existence and Bliss Absolute, roamed, verily purifying the whole world – all differentiating ideas banished from his mind.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 499


🌹 . శ్రీ శివ మహా పురాణము - 499 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 40

🌻. శివుని యాత్ర - 4 🌻

వికృతమగు ముఖము గల చండి వారిని ఎదుట నుంచుకొని కుతూహలముతో, ఆనందముతో ఉపద్రవమును సృష్టించు చున్నదైనడచెను (39). రుద్రనకు ప్రియమైన భయంకరాకారులగు పదకొండు కోట్ల రుద్ర గణములు అపుడామెను అనుసరించినవి (40). అపుడు ముల్లోకములు డమరు ధ్వనులతో, భేరీఝంకారములతో, శంఖనాదములతో నిండి పోయెను (41). మరియు కోలాహలముగ నున్న దుందుభిధ్వని జగత్తులోని అమంగళములను నశింప జేసి జగత్తును మంగళమయము చేసెను (42).

ఓ మునీ! గణముల వెనుక దేవతలు, సిద్ధులు, లోకాపాలురు మొదలగు వారందరు ఉత్సాహముతో నడిచిరి (43). ఓ మునీ! వారి మధ్యలో గరుడాసనముపై గూర్చుండి లక్ష్మీపతి వెళ్లు చుండెను. ఆయనకు ఛత్రము ధరింపబడెను. ఆయన గొప్పగా ప్రకాశించెను (44). విష్ణు పార్షదులు ఆయనను చుట్టు వారి ప్రకాశించిరి. కొందరు ఆయనకు వింజామరలను వీచు చుండిరి. ఆయన తన అలంకారముల నన్నింటినీ ధరించి యుండెను (45). అదే విధముగా నేను కూడ మార్గములో వెళ్లుచూ శోభిల్లితిని. మూర్తిని దాల్చిన వేదశాస్త్రములతో, పురాణాగమములతో నేను ప్రకాశించితిని (46).

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48). శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

04 Jan 2022

గీతోపనిషత్తు -301


🌹. గీతోపనిషత్తు -301 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-2 📚

🍀 19-2. ద్వంద్వ స్థితులు - సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు. వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. 🍀

తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19

తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.

వివరణము : సృష్టి క్రీడకు ఒకటి రెండు కావలెను. ఒకదాని కొకటి ప్రతి ముఖమై నిలువవలెను. ఒక తండ్రి నుండి పుట్టిన ఇద్దరు కుమారులు ఒకరికొకరు ప్రత్యర్థులై ఆడుకొనుచుండగ, తండ్రి చూచుచు నుండును. ఆడుకొనుటకు ప్రత్యర్థి ఆవశ్యకము. నిజమునకు ఆటయందే కుమారులిద్దరు ప్రత్యర్థుల వలె వర్తింతురు. ఆట అనంతరము ఇరువురును తండ్రి కిరుప్రక్కల చేరి ఆనందింతురు. అట్లు సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు.

వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. ఇప్పుడు కనబడుచున్నది. ఒకప్పుడు లేదు. కొంతకాలము తరువాత ఉండదు. శరీరము నందు పుట్టక ముందు కూడ మనమున్నాము. శరీర మందున్నపుడు కనబడుచున్నాము. శరీరము పోయిన వెనుక కూడ మనమున్నాము. శాశ్వతముగనున్న మనము కనబడినపుడు పుట్టెనని, కనబడనపుడు చచ్చెనని భావింతుమే కాని, మన మెప్పుడునూ యున్నాము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jan 22

04-JANUARY-2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04, మంగళవారం, జనవరి 2022 సౌమ్య వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 301 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 500🌹 
4) 🌹 వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177🌹
🌹 Viveka Chudamani - 177🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -129🌹  
6) 🌹 Osho Daily Meditations - 118 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 177 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 177 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 04, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయుని శ్లోకాలు - 9 🍀*

*ఆమూషీకృత మార్తాండం; గోష్పతీ కృత సాగరం|*
*తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం||*

*భావము:- సూర్య భగవాణుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోనివాడైన ఆంజనేయుడికి నమస్కారము.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల విదియ 17:20:07 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ 10:58:06
వరకు తదుపరి శ్రవణ
యోగం: హర్షణ 21:36:32 వరకు
తదుపరి వజ్ర
కరణం: బాలవ 06:53:00 వరకు
సూర్యోదయం: 06:47:04
సూర్యాస్తమయం: 17:54:45
వైదిక సూర్యోదయం: 06:50:56
వైదిక సూర్యాస్తమయం: 17:50:52
చంద్రోదయం: 08:17:44
చంద్రాస్తమయం: 19:42:22
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
వర్జ్యం: 14:35:20 - 16:02:40
దుర్ముహూర్తం: 09:00:36 - 09:45:07
రాహు కాలం: 15:07:50 - 16:31:18
గుళిక కాలం: 12:20:55 - 13:44:22
యమ గండం: 09:33:59 - 10:57:27
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:42
అమృత కాలం: 05:14:36 - 06:40:12
మరియు 23:19:20 - 24:46:40
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 12:22:59 
వరకు తదుపరి లంబ యోగం - 
చికాకులు, అపశకునం
పండుగలు : చంద్ర దర్శనం, 
Chandra Darshan
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -301 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-2 📚*
 
*🍀 19-2. ద్వంద్వ స్థితులు - సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు. వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. 🍀*

*తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |*
*అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19*

*తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.*

*వివరణము : సృష్టి క్రీడకు ఒకటి రెండు కావలెను. ఒకదాని కొకటి ప్రతి ముఖమై నిలువవలెను. ఒక తండ్రి నుండి పుట్టిన ఇద్దరు కుమారులు ఒకరికొకరు ప్రత్యర్థులై ఆడుకొనుచుండగ, తండ్రి చూచుచు నుండును. ఆడుకొనుటకు ప్రత్యర్థి ఆవశ్యకము. నిజమునకు ఆటయందే కుమారులిద్దరు ప్రత్యర్థుల వలె వర్తింతురు. ఆట అనంతరము ఇరువురును తండ్రి కిరుప్రక్కల చేరి ఆనందింతురు. అట్లు సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు.*

*వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. ఇప్పుడు కనబడుచున్నది. ఒకప్పుడు లేదు. కొంతకాలము తరువాత ఉండదు. శరీరము నందు పుట్టక ముందు కూడ మనమున్నాము. శరీర మందున్నపుడు కనబడుచున్నాము. శరీరము పోయిన వెనుక కూడ మనమున్నాము. శాశ్వతముగనున్న మనము కనబడినపుడు పుట్టెనని, కనబడనపుడు చచ్చెనని భావింతుమే కాని, మన మెప్పుడునూ యున్నాము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 499 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 40

*🌻. శివుని యాత్ర - 4 🌻*

వికృతమగు ముఖము గల చండి వారిని ఎదుట నుంచుకొని కుతూహలముతో, ఆనందముతో ఉపద్రవమును సృష్టించు చున్నదైనడచెను (39). రుద్రనకు ప్రియమైన భయంకరాకారులగు పదకొండు కోట్ల రుద్ర గణములు అపుడామెను అనుసరించినవి (40). అపుడు ముల్లోకములు డమరు ధ్వనులతో, భేరీఝంకారములతో, శంఖనాదములతో నిండి పోయెను (41). మరియు కోలాహలముగ నున్న దుందుభిధ్వని జగత్తులోని అమంగళములను నశింప జేసి జగత్తును మంగళమయము చేసెను (42).

ఓ మునీ! గణముల వెనుక దేవతలు, సిద్ధులు, లోకాపాలురు మొదలగు వారందరు ఉత్సాహముతో నడిచిరి (43). ఓ మునీ! వారి మధ్యలో గరుడాసనముపై గూర్చుండి లక్ష్మీపతి వెళ్లు చుండెను. ఆయనకు ఛత్రము ధరింపబడెను. ఆయన గొప్పగా ప్రకాశించెను (44). విష్ణు పార్షదులు ఆయనను చుట్టు వారి ప్రకాశించిరి. కొందరు ఆయనకు వింజామరలను వీచు చుండిరి. ఆయన తన అలంకారముల నన్నింటినీ ధరించి యుండెను (45). అదే విధముగా నేను కూడ మార్గములో వెళ్లుచూ శోభిల్లితిని. మూర్తిని దాల్చిన వేదశాస్త్రములతో, పురాణాగమములతో నేను ప్రకాశించితిని (46).

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48). శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 177 / Viveka Chudamani - 177 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀 33. బంధనాలు -3 🍀*

*574. పుట్టుక, చావు లేనిది బ్రహ్మము. దానికి హద్దులు లేవు. అది పెనుగులాడే ఆత్మకాదు. అది విముక్తి తరువాత పొందేది కాదు మరియు విముక్తి పొందినది కాదు అది అంతిమ సత్యము.*

*575. నేను ఈ రోజు నీకు మరల మరల చెప్పుచున్నాను. నా స్వంత కుమారునిగా నిన్ను భావించుచున్నాను. ఈ గొప్పదైన, అరుదైన రహస్యము, అంతర్గత వేదాంతపరమైన పూర్తి అభిప్రాయము, వేద మూలము యొక్క సారము. నీవు విముక్తుడైన తరువాత సాధకుడివైన వ్యక్తిగా మరకలు తొలగించబడిన పరిశుద్దినిగా ఈ చీకటి ప్రపంచములో మానసిక పరమైన కోరికలు లేని వానిగా భావించుచున్నాను.*

*576. గురువు యొక్క ఈ మాటలను వింటూ, శిష్యుడు భక్తితో గురువు గారికి సాష్టాంగ నమస్కారము చేసి అతని అనుమతితో తన మార్గములో తాను విముక్తి పొందిన వానిగా ప్రయాణము సాగించినాడు.*

*577. గురువు గారు తన మనస్సును బ్రహ్మమైన అనంతాత్మలో నిమగ్నము చేసి, అందులో ఈదులాడుతూ ప్రపంచం మొత్తాన్ని పవిత్రము చేస్తూ, తన మనస్సులోని అన్ని విధములైన భేద భావాలను తొలగించుకున్నాడు.*

* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 177 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments -3 🌻*

*574. There is neither death nor birth, neither a bound nor a struggling soul, neither a seeker after Liberation nor a liberated one – this is the ultimate truth.*

*575. I have today repeatedly revealed to thee, as to one’s own son, this excellent and profound secret, which is the inmost purport of all Vedanta, the crest of the Vedas – considering thee an aspirant after Liberation, purged of the taints of this Dark Age, and of a mind free from desires.*

*576. Hearing these words of the Guru, the disciple out of reverence prostrated himself before him, and with his permission went his way, freed from bondage.*

*577. And the Guru, with his mind steeped in the ocean of Existence and Bliss Absolute, roamed, verily purifying the whole world – all differentiating ideas banished from his mind.*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -3 🌻*

*అవతారమూర్తి ధర్మసాధన మవలంబించుటలో లీలలు చూపి , ప్రవర్తనము ఇట్లుండవలయునని నేర్పును. అపుడెవడైన అహంకారి తాను దేవుడనని చెప్పుకొనదలచినచో తానును గురువు దగ్గర విద్యలు నేర్చుట మున్నగు మంచిపనులు చేసి తీరవలయును. చేసినచో వాని అహంకారము తీరి నిజముగా తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొనును.*
🌻 🌻 🌻 

*యమము అను సద్గుణమును నిర్లక్ష్యము చేయుటవలన జరుగు దండమే యమదండము. దీని ప్రయోజనము పునః పరిశుద్ధియే.*

*కూడబెట్టిన సంపదలతో సుఖములు అనుభవించుటయే సురలోకము. పుణ్యములకు ఫలితము దేహసౌఖ్యమైనపుడు యమ దండన తప్పదు. దానినుండి తప్పించుకొనుటకై ఇంద్రియములను, మనస్సును దమించుకొని పరబ్రహ్మమును చూడగోరువారు గడుసరులే గాని, మోక్షజీవులు కారు.*

*ఆత్మసమర్పణ మార్గము నవలంబించి అంతర్యామి అడుగుజాడల ననుసరించు వారే సర్వోత్తములని భాగవత మతము. ఇందు పరిసర జీవుల సద్గుణములే నారాయణుని కల్యాణ గుణములుగా తెలియబడును. మహనీయుల జీవిత సన్నివేశములను ప్రసంగించు కొనుటయే నారాయణ గుణకథ అను అమృత ప్రవాహము.*

...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 118 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 118. FRIENDSHIP 🍀*

*🕉 The first friendship has to be with oneself, but very rarely will you find a person who is friendly toward himself or herself We are enemies to ourselves, while hoping in vain that we can be friends to someone else. 🕉*
 
*We have been taught to condemn ourselves. Self-love has been thought of as a sin. It is not. It is the foundation of all other loves. It is only through self-love that altruistic love is possible. Because selflove has been condemned, all other possibilities of love have disappeared from the earth. This has been a very cunning strategy to destroy love. It is as if you were to say to a tree, "Don't nourish yourself through the earth; that is sin. Don't nourish yourself from the moon and the sun and the stars; that is selfishness. Be altruistic serve other trees." It looks logical, and that is the danger. It looks logical:*

*If you want to serve others, then sacrifice; service means sacrifice. But if a tree sacrifices, it will die, it will not be able to serve any other tree; it will not be able to exist at all. You have been taught, "Don't love yourself."That almost has been the universal message of the so-called organized religions. Not of Jesus, but certainly of Christianity; not of Buddha but of Buddhism-- of all organized religions, that has been the teaching: Condemn yourself, you are a sinner, you are worthless. And because of this condemnation the tree of the human being has shrunk, has lost luster, can no longer rejoice. People are dragging themselves along somehow. People don't have any roots in existencethey are uprooted. They are trying to be of service to others and they cannot, because they have not even been friendly to themselves.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 177 / Sri Lalita Sahasranamavali - Meaning - 177 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 177. బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ ।*
*సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ ॥ 177 ॥ 🍀*

🍀 964. బంధూకకుసుమప్రఖ్యా :
 మంకెనపూలవంటి కాంతి కలిగినది

🍀 965. బాలా : 
12 సంవత్సరముల లోపు బాలిక,,,,బాల

🍀 966. లీలావినోదినీ : 
బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది

🍀 967. సుమంగళి : 
మంగళకరమైన రూపము కలిగినది

🍀 968. సుఖకరీ : 
సుఖమును కలిగించునది

🍀 969. సువేషాఢ్యా : 
మంచి వేషము కలిగినది

🍀 970. సువాసినీ : 
సుమంగళి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 177 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 177. Bandhuka kusuma prakhya balalila vinodini*
*Sumangali sukhakari suveshadya suvasini ॥ 177 ॥ 🌻*

🌻 964 ) Bhandhooka kusuma prakhya -   
She who has the glitter of bhandhooka flowers

🌻 965 ) Bala -   
She who is a young maiden

🌻 966 ) Leela Vinodhini -  
She who loves to play

🌻 967 ) Sumangali -  
 She who gives all good things

🌻 968 ) Sukha kari -   
She who gives pleasure

🌻 969 ) Suveshadya -   
She who is well made up

🌻 970 ) Suvasini -   
She who is sweet scented(married woman)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹