1) 🌹 15, JANUARY 2023 SUNDAY,ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. మకర సంక్రాంతి విశిష్టత - మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀*
2) 🌹 కపిల గీత - 119 / Kapila Gita - 119 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 03 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 03 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 711 / Vishnu Sahasranama Contemplation - 711 🌹 🌻711. అనలః, अनलः, Analaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 672 / Sri Siva Maha Purana - 672 🌹 🌻. గణేశ వివాహోపక్రమము - 1 / Gaṇapati’s marriage - 1 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 293 / Osho Daily Meditations - 293 🌹 🍀 293. ఆశ్చర్యం / SURPRISE🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹 🌻 425. 'తత్త్వమయీ’ - 1 / 'Tattvamayi' - 1🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹15, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మకర సంక్రాంతి పొంగల్, Pongal Makar Sankranti 🌻*
*🍀. సూర్య మండల స్త్రోత్రం - 4 🍀*
*యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |*
*త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |*
*సమస్త తేజోమయ దివ్యరూపం |*
*పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సకల మానవ హృదంతరాళము లందునూ సనాతన వేదరహస్యం గర్భితమై వున్నది. పూర్ణయోగ దర్శనంలో దానికే 'శాస్త్రం' అని పేరు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ అష్టమి 19:46:53 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: చిత్ర 19:12:05 వరకు
తదుపరి స్వాతి
యోగం: సుకర్మ 11:50:38 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 07:39:28 వరకు
వర్జ్యం: 02:34:00 - 04:13:48
మరియు 24:50:48 - 26:27:36
దుర్ముహూర్తం: 16:31:45 - 17:16:34
రాహు కాలం: 16:37:21 - 18:01:22
గుళిక కాలం: 15:13:21 - 16:37:21
యమ గండం: 12:25:18 - 13:49:19
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 12:32:48 - 14:12:36
సూర్యోదయం: 06:49:14
సూర్యాస్తమయం: 18:01:22
చంద్రోదయం: 00:07:31
చంద్రాస్తమయం: 12:07:55
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 19:12:05 వరకు తదుపరి
లంబ యోగం - చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మకర సంక్రాంతి విశిష్టత 🌹*
*🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
*జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.*
*సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.*
*సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.*
*మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.*
*మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.*
*🌹. కనుము విశిష్టత 🌹*
*సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి 'సువాసి' పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.*
*మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 119 / Kapila Gita - 119🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 03 🌴*
*03. తేన సంసారపదవీమవశోऽభ్యేత్యనిర్వృతః*
*ప్రాసఙ్గికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు*
*ఆ అభిమాన కారణముగా దేహ సంబంధమైన పుణ్యపాప కర్మల దోషముచే, అతడు (ఆ జీవుడు) అస్వతంత్రుడై శాంతిని కోల్పోవును. ఇట్లు దేహాభిమాన కారణముగనే అతడు ఉత్తమ, మధ్యమ, నీచయోనుల యందు జన్మించుచు సంసార చక్రమున పరిభ్రమించు చుండును.*
*ఇది దేవ రాక్షస మానవ (సదసన్మిశ్రయోనిషు - సత్ - అసత్ మిశ్రయోనిషు). ఆత్మ పుట్టదు. శరీరం చేసిన పని నాదే అనుకున్న పాపానికి, ఆ శరీరానికి ఏ శిక్ష పడాలో దానికి తగ్గ శరీరం వస్తుంది. మానవుడి శరీరం తట్టుకొనే కష్ట సుఖాలను క్రిమి కీటకాలు తట్టుకోలేవు. మనం ఎంత పాపం చేస్తే అంత చిన్న శరీరం వస్తుంది. ఎలాంటి పాపం చేస్తే నాకిలాంటి శరీరం వచ్చింది అని ఆలోచించే కాలము కూడా లేని శరీరం వస్తుంది.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 119 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 03 🌴*
*03. tena saṁsāra-padavīm avaśo 'bhyety anirvṛtaḥ*
*prāsaṅgikaiḥ karma-doṣaiḥ sad-asan-miśra-yoniṣu*
*The conditioned soul therefore transmigrates into different species of life, higher and lower, because of his association with the modes of material nature. Unless he is relieved of material activities, he has to accept this position because of his faulty work.*
*Here the word karma-doṣaiḥ means "by faulty actions." This refers to any activity, good or bad, performed in this material world—they are all contaminated, faulty actions because of material association. The foolish conditioned soul may think that he is offering charity by opening hospitals for material benefit or by opening an educational institution for material education, but he does not know that all such work is also faulty because it will not give him relief from the process of transmigration from one body to another. It is clearly stated here, sad-asan-miśra-yoniṣu. This means that one may take birth in a very high family or he may take his birth in higher planets, among the demigods, for his so-called pious activities in the material world. But this work is also faulty because it does not give liberation. One who desires material liberation has to turn his activities to devotional service. There is no alternative.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 711 / Vishnu Sahasranama Contemplation - 711🌹*
*🌻711. అనలః, अनलः, Analaḥ🌻*
*ఓం అనలాయ నమః | ॐ अनलाय नमः | OM Analāya namaḥ*
*అలం న విద్యతే యస్య పర్యాప్తిః శక్తిసమ్పదాం ।*
*స మహావిష్ణురనల ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥*
*అలం అనగా పర్యాప్తి; ఇంతతో ముగియును అను అవధి. అట్టి అవధి లేని వాడు అనలః. ఎవని శక్తులకును సంపదలకును అలం లేనివాడు అనలః. అపరిమిత శక్తులును సంపదలును కలవాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 711🌹*
*🌻711. Analaḥ🌻*
*OM Analāya namaḥ*
अलं न विद्यते यस्य पर्याप्तिः शक्तिसम्पदां ।
स महाविष्णुरनल इति सङ्कीर्त्यते बुधैः ॥
*Alaṃ na vidyate yasya paryāptiḥ śaktisampadāṃ,*
*Sa mahāviṣṇuranala iti saṅkīrtyate budhaiḥ.*
*Alaṃ signifies limit; Analaḥ means limitless. There is no limit or sufficiency to His power or wealth so He is Analaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’drpto durdharo’thāparājitaḥ ॥ 76 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 672 / Sri Siva Maha Purana - 672 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴*
*🌻. గణేశ వివాహోపక్రమము - 1 🌻*
నారదుడిట్లు పలికెను -
తండ్రీ! సర్వోత్తమమగు గణేశ జన్మ గాథను, గొప్ప ప్రరాక్రమముతో ప్రకాశించు ఆయన దివ్య చరితమును చక్కగా వింటిని (1). తండ్రీ! దేవ దేవా! తరువాత ఏమాయెను? మహానందమును కలిగించునది, గొప్ప ప్రకాశము గలది అగు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని వర్ణించి శివతత్త్వమును వివరించుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! దయా స్వభావము గల నీవు చక్కగా ప్రశ్నించితివి. చెవులను అప్పగించి వినుము. ఓ బుషిశ్రేష్ఠా!నేను చెప్పెదను (3). ఓ విప్రశ్రేష్ఠా! ఇద్దరు కుమారుల పరమ లీలలను చూడగా పార్వతీ పరమేశ్వరులకు వారిపై గొప్ప ప్రేమ ఏర్పడెను(4). తల్లి దండ్రులు సర్వదా ప్రేమతో లాలించు చుండగా ఆ ఇద్దరు బాలకులు మిక్కిలి సుఖముగా పెరుగుతూ, ఎక్కువగా ఆటల నాడుచుండిరి (5). ఓ మహర్షీ ! వారిద్దరు బాలకులు గొప్ప భక్తితో గూడిన సమయములో తల్లి దండ్రులకు పరిచర్యలను కూడ చేసిరి (6).
ఆ తల్లి దండ్రులకు కుమార స్వామి యందు మరియు గణేశుని పైన మహాప్రేమ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ది గాంచెను (7). ఓ దేవర్షీ! ఒకప్పుడు ప్రేమ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతము నందుండి దీర్ఘముగా ఆలోచించుచుండిరి (8).
పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -
బాలకు లిద్దరు వివాహమునకు యోగ్యమగు వయస్సును పొందిరి. ఈ ఇద్దరు కుమారులకు శుభకరమగు వివాహమును చేయట ఎట్లు? (9) కుమార స్వామి అత్యంత ప్రీతి పాత్రుడు. గణేశుడు కూడా అంతే. లీలలతో ఆనందించే ఆ దంపతుల వారి గురించి ఈ తీరున ఆలోచించు చుండిరి (10).
ఓ మునీ! ఆ ఇద్దరు కుమారులు తమ త్లి దండ్రుల మనోగతము నెరింగి వారి ఇచ్ఛచే వివాహము కొరకు తహతహలాడ జొచ్చిరి (11). 'నేను వివాహమాడెదను' అని ఒకరు అంటే, 'నేను వివాహమాడెదను' అని మరియొకరు అంటూ వారిద్దరు ఒకరితోనొకరు నిత్యము వివాద పడుచుండిరి (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 672🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴*
*🌻 Gaṇapati’s marriage - 1 🌻*
Nārada said:—
1. O dear father, the excellent story of the nativity and the divine conduct embellished by valour, of Gaṇeśa has been heard well.
2. O dear father, O lord of gods, what happened thereafter? Please narrate it. The great glory of Pārvatī and Śiva confers great delight.
Brahmā said:—
3. O excellent sage, you have asked well with a sympathetic mind. Listen attentively, O excellent sage, I shall narrate.
4. O excellent brahmin, seeing frequently the divine sports of both the sons, Pārvatī and Śiva had their love increased.
5. The happiness of the parents knew no bounds. The son too used to sport in joy and love.
6. O great sage, the sons rendered great service to their parents with great devotion.
7. The love and affection of the parents towards the six-faced lord and Gaṇeśa increased to a great extent like the moon in the bright half of the month.
8. O celestial sage, once the loving parents Pārvatī and Śiva held a secret talk and discussion.
Śiva and Pārvatī said:—
9. They thought that the two sons had attained to marriageable age and how best their marriage should be celebrated now.
I 0. The sixfaced lord Kārttikeya was their great beloved son. Gaṇeśa too was likewise. Thinking thus they were worried as well as delighted.
11. O sage, coming to know of their parents’ opinion, the sons too were eager to get married.
12. “I shall marry, I shall marry” saying thus to each other they always quarrelled with each other.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 293 / Osho Daily Meditations - 293 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 293. ఆశ్చర్యం 🍀*
*🕉. అందమైనవి మరియు నిజమైనవి ఎల్లప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆశ్చర్యపడే సామర్థ్యాన్ని కలిగి ఉండండి. జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటే అది ఒకటి. 🕉*
*ఒకసారి మీరు ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని కోల్పోతే, మీరు చనిపోతారు. విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే, మీరు ఇంకా బతికే ఉన్నారు. మీరు విషయాలను చూసి ఎంత ఆశ్చర్యపోతారో, మీరు అంతగా సజీవంగా ఉంటారు. అది పిల్లల సజీవత్వం; వారు అత్యంత ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ చెట్టు, లేదా పక్షి, లేదా కుక్క, లేదా పిల్లి, లేదా ఒడ్డున ఉన్న గులకరాయి వంటి వాటిని చూసి ఆశ్చర్యపోతారని కూడా ఎవరూ నమ్మలేరు. మీరు కోహినూర్ అనే గొప్ప వజ్రాన్ని కనుగొంటే మీ కంటే పిల్లలు చాలా ఆశ్చర్యపోతారు - అప్పుడు కూడా మీరు ఆశ్చర్యపోరు. కానీ పిల్లలకు ఆశ్చర్యం పోయే సామర్థ్యం ఉన్నందున, ప్రతి గులకరాయి వజ్రం అవుతుంది.*
*మీరు ఆశ్చర్యపోక పోతే, వజ్రం కూడా సాధారణ గులకరాయి అవుతుంది. మీరు ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని కలిగి ఉన్నంత మాత్రాన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి తెరచుకుని ఉండండి. జీవితం అనంతం అని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి. ఇది ఎల్లప్పుడూ కొనసాగుతున్న ప్రక్రియ; అది ఎప్పటికీ ముగింపుకు రాదు. ఇది శాశ్వతమైన ప్రయాణం, మరియు ప్రతి క్షణం కొత్తది, ప్రతి క్షణం అసలైనది. ప్రతి క్షణం అసలైనదని నేను చెప్పినప్పుడు, ప్రతి క్షణం మిమ్మల్ని మీ మూలానికి తిరిగి పంపుతుంది, . ప్రతి క్షణం మిమ్మల్ని మళ్లీ చిన్నపిల్లలుగా చేస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 293 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 293. SURPRISE 🍀*
*🕉. All that is beautiful and true always comes as a surprise. So retain the capacity to be surprised. That is one if the greatest blessings of life. 🕉*
*Once you lose the capacity to be surprised, you are dead. If things can surprise you, you are still alive. And the more you are surprised by things, the more alive you are. That is the aliveness of children; they are surprised by trivia. One cannot even believe they are surprised--by just an ordinary tree, or bird, or dog, or cat, or a pebble on the shore. Children are even more surprised than you would be if you were to find a Kohinoor, a great diamond--even then you won't be surprised. But because children have the capacity to become surprised, each pebble becomes a diamond.*
*If you are not surprised, even a diamond becomes an ordinary pebble. Life carries as much meaning as you carry the capacity to be surprised, the capacity to wonder. So always remain open. Remind yourself again and again that life is infinite. It is always an ongoing process; it never comes to an end. It is an eternal journey, and each moment is new, each moment is original. When I say each moment is original, I mean each moment throws you back to your origin, .each moment makes you a child again.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥🍀*
*🌻 425. 'తత్త్వమయీ’ - 1🌻*
*తత్త్వమే తానుగా నున్నది శ్రీమాత అని అర్థము. 'తత్త్వ మనగా తత్ అనెడి పురుష, ప్రకృతుల సమాగమ ప్రజ్ఞ. అదే శాశ్వత సత్యము. అది అనిర్వచనీయమైనది. అనన్య మగుటచే దానిని గూర్చి తెలుపుట అసాధ్యము. *మరొకరు లేని స్థితి యందు అది ఎట్లు వున్నదో తెలుపుట ఎట్లు సాధ్యము? శ్రీమాత అట్టి తత్త్వము.*
*ఆ తత్త్వముతో అనుసంధానము చెందుట ధ్యానము యొక్క పరమావధి. అనుసంధానము జరుగుచున్న సందర్భమున ధ్యానము చేయువాడు ఆ తత్త్వము లోనికి ఆకర్షింపబడి తా నుండక తత్త్వమే యుండును. అట్టి స్థితిని చేరుటకే శ్రీమాత ఆరాధనము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91🌻*
*🌻 425. 'Tattvamayi' - 1🌻*
*Srimata itself is wisdom (tattva). The meaning of Tattva(Wisdom) is the amalgamation of Nature and Consciousness in equilibrium. It is the divine knowledge ( Pragnya). That is the eternal truth. It is indefinable. It is impossible to tell about it due to its uniqueness. How is it possible to express what it is in the absence of another? Srimata is such philosophy.*
*Connecting with that philosophy is the ultimate meditation. When the connection is taking place, the meditator is drawn into that Tattva and becomes Tattva without himself. To reach such a state is the worship of Srimata.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj