శ్రీ లలితా సహస్ర నామములు - 18 / Sri Lalita Sahasranamavali - Meaning - 18
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 18 / Sri Lalita Sahasranamavali - Meaning - 18 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 18. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘ్కా |
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ‖ 18 ‖ 🍀
41) ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా -
ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
42) గూఢగుల్ఫా -
నిండైన చీలమండలు గలది.
43) కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా -
తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 18 🌹
📚. Prasad Bharadwaj
🌻 18. indragopa-parikṣipta-smaratūṇābha-jaṅghikā |
gūḍhagulphā kūrmapṛṣṭha-jayiṣṇu-prapadānvitā || 18 || 🌻
41 ) Indra kopa parikshiptha smarathunabha jangika -
She who has forelegs like the cupids case of arrows followed by the bee called Indra kopa.
42 ) Kooda Gulpha -
She who has round ankles.
43 ) Koorma prashta jayishnu prapadanvidha -
She who has upper feet like the back of the tortoise.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 162
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 7 🌻
627. ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో పూర్ణత్వము మూడు విధములుగా నుండును.
1. పరిపూర్ణ మానవుడు
2. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు
3. పరమ పరిపూర్ణుడు.
628. పరిపూర్ణ మానవుడు అప్పటికప్పుడు ఒకనిని మాత్రము తాననుభవించుచున్న ఎరుకతో కూడిన భగవదనుభూతి నివ్వగలడు.
629. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు, అనేక మందిని తనంత వారిని చేయగలడు.
630. పరమ పరిపూర్ణుడు, ఎందరికైన నేమి సమస్త సృష్టికే తన అనుభవము ఇవ్వగలడు.
631. ఆత్మ ప్రతిష్టాపనముతో భగవంతుని రెండవ దివ్యయానము అంత్యమగును.
632. పరిపూర్ణ మానవుడు తాననుభవించు అనంతశక్తులను సద్గురువుల వలె అన్యులకై వినియోగించడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 223
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జైమినిమహర్షి - 8 🌻
42. మనం అది చదివితే ఏమనిపిస్తుందంటే, ఆ యజ్ఞం త్యాగంకోసమే ఏర్పడింది అనేది. ఏదీ మిగుల్చుకోకుండా త్యాగంచేయాలనేది. తాను ఏది మిగులచుకున్నా, ఆ యాగమ్యొక్క ఫలం అతడికి రాదు అని మనకనిపిస్తుంది.
43. అయితే అందులో కొంచెం మిగుల్చుకుంటే ఫరవాలేదు అంటే, ఎంతవరకు? ఎంత వరకు ఉంచుకుంటే ఫరవాలేదని అర్థం? కావలసినన్ని పెట్టుకుని మిగిలింది దానంచేస్తే, ఇంక దానంచేసేది ఏముంది? ఎందుకంటే, ప్రతీదానికీ ఒక హద్దు ఉంటుంది. ఇలా అయితే త్యాగంచేసేది ఏముంది. కనుక ఉన్నది చేస్తేనే యజ్ఞానికి ఫలంవస్తుంది. అది ఒక ఉత్తమ లక్షణం. దాతృత్వలక్షణం అది.
44. దానం కంటే త్యాగం ఇంకా సులభం అని కూడా ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుచేతనంటే, ఉన్నది ఉండగానే తన భాగం మాత్రం తీసుకుని ఎవరికో దానంచేసి, తాను అక్కడినుంచి వెళ్ళిపోవటం అనేది దానం కంటే సులభమైన త్యాగం. మళ్ళీ వెనక్కు తిరిగిచూడకుండా వెళ్ళిపోవచ్చు.
45. కాబట్టి అలా చేసినటువంటి క్రతువులే ఉత్తమ ఫలాన్నిస్తాయి. కాని జైమిని వ్యాఖ్యానం వచ్చేటప్పటికి, ఆయన సూత్రలలోనే, వేదంయొక్క పరమార్థం అంతా త్యాగంచెయ్యమనేనని అనుకోవాల్సివస్తుంది.
46. ఇక మన సంగతి. మనందరికీ ఈశ్వరుడు తప్పక ఉన్నాడు. జైమిని చెప్పిన సంపూర్ణ త్యాగంతోకూడిన కర్మ, తీవ్రమైన మోక్షేఛ్ఛ అన్నీ కలిపి మోక్షప్రదమే అవుతాయి. అట్టి ఫలితానికి ఈశ్వరుడే కారణం కాగలడు. ఈశ్వరారాధనతో నిమిత్తంలేని మోక్షమార్గం ఉందని జైమిని భావం.
47. ఆ తర్వాత కాలంలో, అంటే, నేటికి ఇరువది అయిదు శతాబ్దాలకు పూర్వం, బుద్ధుడు ఈశ్వరుడితో నిమిత్తంలేక; జైమిని చెప్పిన కర్మ, త్యాగము ఈ రెంటితోనూకూడా సంబంధంలేక కేవలం తీవ్రమైన మోక్షేఛ్ఛ, అంతర్దృష్టితో నిర్వాణం సాధించాడు.
48. ఆ మార్గాలు జైమినికి, బుద్ధుడికి మాత్రమే ఫలప్రదమైనాయి. వారికి లభించిన ముక్తి సృష్టికర్త అయిన ఈశ్వరశాసనము, అనుగ్రహము వీటివల్లనే లభించాయని చెప్పడంలో విప్రతిపత్తిలేదు. కావున మనందరికీ నేడు ఈశ్వరప్రణిధానమే శరణ్యం. ఇది సత్యం, సత్యం, న సంశయః.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
శ్రీ శివ మహా పురాణము - 339
🌹 . శ్రీ శివ మహా పురాణము - 339 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
85. అధ్యాయము - 40
🌻. శివదర్శనము -3 🌻
ముముక్షువులకు శరణమైనది, మహాయోగాత్మకము అగు ఆ వటవృక్షముపై కూర్చుండియున్న శివుని విష్ణువు మొదలగు దేవతలందరు గాంచిరి (37). మహాసిద్ధులు, సర్వదా శివభక్తియందు రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూర్తులు అగు బ్రహ్మపుత్రులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి (38).
యక్ష రాక్షసులకు ప్రభువు, మిత్రుడునగు కుబేరుడు, ఆతని జ్ఞాతులు , శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా సేవించుచుండిరి (39). సర్వప్రాణులకు వాత్సల్యమును చూపే మిత్రుడు అగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో ప్రకాశించువాడై తపశ్శాలురకు అభీష్టమగు దివ్యరూపమును ధరించుయుండెను (40).
ఓ మహర్షీ! ఆయన దర్భాసనమునందు గూర్చుండి మహర్షులందరు వినుచుండగా నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ జ్ఞానమును బోధించుచుండెను (41). ఆయన కుడి తొడపై ఎడమ కాలిని, జానువును ఉంచి, బాహువుల నుండి ముంజేతుల నుండి వ్రేలాడుచున్న రుద్రాక్ష మాలలు గలవాడై జ్ఞానముద్రతో కూర్చుండెను (42).
అపుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు దేవతలందరు వినయముతో చేతులు కట్టుకొని శీఘ్రముగా నమస్కరించిరి (43). సత్పురుషులకు గతియగు రుద్రప్రభుడు అచటకు వచ్చిన నన్ను విష్ణువును చూచి లేచి శిరస్సుతో అభివాదమును కూడ చేసెను (44).
విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు గల శివుడు, లోకములకు సద్గతినిచ్చు విష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించిన తీరున, మాకు నమస్కరించెను (45). దేవతలు, సిద్ధులు, గణాధీశులు మరియు మహర్షులచే సాదరముగా నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో గూడి ఇట్లు పలికెను (46).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో శివదర్శన వర్ణనమనే నలుబడి యవ అధ్యాయము ముగిసినది (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
గీతోపనిషత్తు -138
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 23
🍀. 21. స్మరణ - కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము. అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన. 🍀
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।
కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము.
అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును.
శ్లోకము చదివినపుడు “కామ క్రోధముల వేగమును జయించి, యోగమున సుఖపడుము” అన్నట్లు గోచరించును. ఇది సాధ్యపడునది కాదు. యోగమున స్థిరపడి, కామక్రోధములను జయించమనుట యిందలి రహస్యము. చీకటని పారద్రోలి, వెలుగు నేర్పరచుకొనుము అని తెలిపినచో అది సాధ్యపడునది కాదు. వెలుగు నేర్పరచి నంతనే చీకటి అదృశ్యమగును.
'యుక్తః' అను పదము యిందు చాల ముఖ్యము. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన.
భగవంతుని యందు ప్రీతి యున్నచో, స్మరణ భావన నిరంతర మగుచుండును. అట్టి స్మరణ దీపపు వెలుగువంటిది. స్మరణ యను వెలుగు ఉన్నంత సమయము కామక్రోధములను చీకటి క్రమ్మదు.
అట్టి నరునకు సుఖ ముండును. అంతియేగాని కామమును జయింతును, క్రోధమును జయింతును అని అహంకరించువారు శ్రమ చెందుచు దుఃఖ పడుదురు.
ఇచ్చట సమర్థత భగవంతునితో యుక్తము చెందుటయేగాని, కామక్రోధములను జయించుట కాదు. కామక్రోధములు కూడ పై విధముగ శరీరమందుండగనే జయించనిచో మరుజన్మమున గూడ దుఃఖముండును.
అందువలన భగవంతుడు ఈ శరీరమందున్నప్పుడే నాతో యోగము చెంది, కామక్రోధములను హరించి, శాశ్వతముగ సుఖపడుము" అని తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
Labels:
గీతోపనిషత్తు
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 196 / Sri Lalitha Chaitanya Vijnanam - 196
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖
🌻196. 'సర్వజ్ఞా'🌻
సర్వమూ తెలిసినది శ్రీమాత అని అర్థము.
శ్రీమాత, సృష్టి ఎఱుక. సృష్టియందలి సమస్త ప్రాణికోటి యందును ఆమె ఎఱుకయే పని చేయుచుండును. ప్రాణులు, ఎఱుక తమదనుకొందురు. జీవుల యందలి ఎఱుక శ్రీదేవియే. ఆ ఎలుక ఆధారముగ జీవులు తమ తమ స్వభావములను బట్టి భావములను పొంది కార్యములను నిర్వర్తించుచుందురు. ఎఱుక లేనిదే భావన లేదు.
సర్వభావములకూ మూలము ఎఱుకయే. భావములు లేని ఎఱుకను తెలిసినవాడు తనయందు చైతన్య స్వరూపిణిగా శ్రీమాత ఎట్లున్నదో తెలియగలడు. స్వభావమునం దిమిడిన జీవులకు వారి గుణ సముదాయములనుబట్టి భావము లేర్పడుచుండును.
భావముల యేందే తిరుగాడువారు భావములకు మూలమైన ఎఱుకను గుర్తించ లేరు. సినిమా తెరపై బొమ్మలు ఎల్లపుడూ పడుచుండగా, బొమ్మలు లేని వెండితెర నూహించుట కష్టము. భావములు ఎక్కడనుండి పుట్టుచున్నవో దానిని గమనించుట ధ్యానముగ శ్రీకృష్ణుడు భగవద్గీత యందు తెలిపినాడు.
భావములు పుట్టుచున్న చోటును గమనించు మార్గమున క్రమముగ జీవుడు తనయందలి ఎఱుకను గుర్తించును. అట్లు తెలిసినవాడు ఆ ఎఱుకను అన్నిటి యందు దర్శించుటకు ప్రయత్నింప వలెను. ఆ ఎఱుకనుండియే సర్వమునూ పుట్టినవి.
ఎఱుక యందే సకల జీవవ్యాపారములు జరుగుచున్నవి. శ్రీమాత అందరి యందు తాను ఎఱుకగా యున్నది అని ఈ నామము తెలుపుచున్నది. అందువలన ఆమెకు సర్వమునూ తెలిసియే యుండును. ఆమెకు తెలియక సృష్టిలో జరుగున దేమియూ లేదు. ఆమెది సర్వజ్ఞత.
శ్రీమాత తత్త్వము మనయందు యుండుటవలననే ప్రతిమానవుడు “నేనున్నాను” అని భావించుచున్నాడు. ఎఱుకయే లేనిచో ఈ భావనయే లేదు. తానున్నాను అను భావన ఆధారముగ ఇతర భావనలు అల్లుకొన్నవి. ఈ భావములకు అతీతముగ మనయందున్నది శ్రీమాత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 196 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Sarvajñā सर्वज्ञा (196) 🌻
She is omniscient. Only the Brahman alone can be omniscient. Muṇḍaka Upaniṣad (I.1.9) says “That Brahman, which is all-knowing in general way and which is also all-knowing in detail whose austerity is knowledge and from that (para) Brahman comes this (apara) Brahman and also such categories as name, form and food.”
The Upaniṣad specifically uses the word tapaḥ, meaning the highest form of meditation known as penance. Parā Brahman is the nirguṇa Brahman (without attributes) and aparā Brahman is saguṇa Brahman (with attributes).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
శాస్త్రాలకు అందనిది
🌹. శాస్త్రాలకు అందనిది 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
📚. ప్రసాద్ భరద్వాజ
ఇది నిజంగా జీవశాస్తప్రరమైన ఒక గొప్ప తాత్విక సమస్య. ఎందుకంటే, కొన్ని లక్షల వీర్యకణాలలో ఒక్కటే తల్లి గర్భంలోని బీజాన్ని కలుసుకుని జన్మిస్తుంది. అయితే మిగిలిన వీర్యకణాలలో ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నను భారతదేశంలోని హిందూ పండితులు, జనన నియంత్రణను వ్యతిరేకించే వాదనలలో ఒకటిగా వాడుకున్నారు.
వాదన విషయంలో భారతదేశం చాలా తెలివైనది. ‘‘పిల్లలను పుట్టించడం- ఇద్దరా లేదా ముగ్గురా, లేదా- ఎక్కడ ఆపాలి?
‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ తల్లిదండ్రులు పన్నెండు మంది పిల్లలు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణను పాటిస్తే ఆయన పుట్టేవాడే కాదు. కుటుంబ నియంత్రణను పాటిస్తే మనం ఎంతమంది ‘రబీంద్రనాథ్ ఠాగూర్’లాంటి గొప్ప వ్యక్తులను కోల్పోతామో తెలుసా?’’ అనేది వారి వాదన.
అందుకే నేను ఒకసారి ‘‘కేవలం వాదించేందుకు మాత్రమే అయితే మీ వాదనలో అర్థముంది కాబట్టి, దానితో నేను ఏకీభవిస్తాను. కానీ, కుటుంబ నియంత్రణ వల్ల దేశంలోని ప్రజలందరూ కూడు, గుడ్డ లాంటి వౌలిక అవసరాలకు ఎలాంటి లోటులేకుండా హాయిగా జీవిస్తారు. దానికోసం ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’లాంటి గొప్ప వ్యక్తులను వదులుకునేందుకు కూడా నేను సిద్ధమే.
ఎందుకంటే, ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ పదమూడవ సంతానం. మీ లెక్కప్రకారం అందరూ పదమూడు మంది పిల్లలను పుట్టించాలా? మరి పధ్నాలుగు, పదిహేనవ సంతానం సంగతేమిటి? లైంగిక సంయోగంలో పురుషుడు విడుదల చేసిన అనేక లక్షల వీర్యకణాలలో ఎంతమంది మహానుభావులున్నారో మీరు చెప్పగలరా? కేవలం కొంతమంది గొప్ప వ్యక్తులు పుట్టడం కోసం అందరూ జనాభాను పెంచడంవల్ల ఎన్ని కోట్ల మంది ఆకలి చావులు చస్తున్నారో మీకు కనిపించట్లేదా?’’ అంటూ వాదించాను.
నా లెక్కప్రకారం అంతా సవ్యంగా ఉన్న ఒక పురుషుడు తన యుక్తవయసు నుంచి నలభై రెండేళ్ళ వయసు వచ్చేవరకు ఈ భూమి నిండి పొర్లిపోయే జనాభాకు సరిపోయే వీర్యకణాలను విడుదల చెయ్యగలడు. ఇప్పటికే మన భూమి అధిక జనాభాతో అల్లాడిపోతోంది.
అందరిలో సహజంగా ఉండేది మానవత్వమే అయినా, ఎవరి వ్యక్తిత్వం వారిదే. కాబట్టి, పుట్టినప్పటి నుంచే జీవితం ప్రారంభమవట్లేదు. అది ఇంకా ముందు నుంచే ప్రారంభమవుతోంది. అది మీకు కేవలం ఒక ఊహ మాత్రమే అయినా, నాకు మాత్రం అది ఒక అనుభవం. గత జన్మ ముగిసిన చోటునుంచే పునర్జన్మ ప్రారంభమవుతుంది.
మీరు మరణించినప్పుడు అందరూ మీ జీవితం ముగిసిందని భావిస్తారు. కానీ, అది అనంత అధ్యాయాలతో కూడుకున్న జీవిత పుస్తకంలోని ఒక అధ్యాయం మాత్రమే ముగిసినట్లు. అంతమాత్రాన మీ జీవిత పుస్తకం పూర్తిగా ముగిసినట్లు కాదు. పేజీ తిప్పిచూస్తే మరొక అధ్యాయం ప్రారంభమవుతుంది.
మరణిస్తున్న వ్యక్తి తదుపరి జన్మను దర్శించడం ప్రారంభిస్తాడు. అధ్యాయం ముగిసేముందు జరిగేది అదే. ఇది అందరికీ తెలిసిన సత్యమే.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
దేవాపి మహర్షి బోధనలు - 19
🌹. దేవాపి మహర్షి బోధనలు - 19 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 10. సిద్ధాంతము - ఆచరణ 🌻
ఆచరణకు సిద్ధాంతము బీజము. సిద్ధాంతమునకు ఆచరణ శిశువు. ఒకటి బీజము మరియొకటి వృక్షము. అటులనే సంకల్పమునకు మనస్సు తల్లి, మనస్సునకు సంకల్పము పుత్రుడు.
సంకల్పమునకు జ్ఞానము తల్లి, జ్ఞానమునకు సంకల్పము పుత్రుడు. పరిణామము చరిత్ర గర్భమునుండి వెలువడుచుండును. పరిణామము నుండి మరల చరిత్ర వెలువడుచుండును. సృష్టి అంతయు చర్వితచర్వణమే.
అనగా జరిగినదే మరల మరల జరుగుచుండును. కాని జరిగినపుడెల్ల పాతదిగ కాక కొత్తదిగ గోచరించును. దీనినే ఋషులు “నవ” అని పిలిచెదరు. ఎప్పుడును కొత్త దిగనే కొనిరాబడు చున్నది. కావున “నవనీత” మనిరి.
ప్రతిదినము నిద్రలేచుట, పనులు చేయుట, భుజించుట, మాటలాడుట, విశ్రాంతి గొనుటగా జరుగుచున్నను, ప్రతిదినము ప్రత్యేక దినముగ గోచరించుచున్నది కదా!
ఇట్లు సంకల్పముల నుండి ఆచరణములు, ఆచరణముల నుండి మరల సంకల్పములు అనంతముగ చక్రభ్రమణము చేయుచునే యుండును. అయిపోవుట ఏ స్థితి యందు ఉండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
వివేక చూడామణి - 9 / Viveka Chudamani - 9
🌹. వివేక చూడామణి - 9 / Viveka Chudamani - 9 🌹
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 4. వివిధ మార్గాలు - 2 🌻
44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.
45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు.
46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.
47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹VIVEKA CHUDAMANI - 9 🌹
✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 4. Different Ways - 2 🌻
44. There is a sovereign means which puts an end to the fear of relative existence; through that thou wilt cross the sea of Samsara and attain the supreme bliss.
45. Reasoning on the meaning of the Vedanta leads to efficient knowledge, which isimmediately followed by the total annihilation of the misery born of relative existence.
46. Faith (Shraddha), devotion and the Yoga of meditation – these are mentioned by the Shruti as the immediate factors of Liberation in the case of a seeker; whoever abides in these gets Liberation from the bondage of the body, which is the conjuring of Ignorance.
47. It is verily through the touch of Ignorance that thou who art the Supreme Self findestthyself under the bondage of the non-Self, whence alone proceeds the round of births and deaths. The fire of knowledge, kindled by the discrimination between these two, burns up the effects of Ignorance together with their root.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 262, 263 / Vishnu Sahasranama Contemplation - 262, 263
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 262. వర్ధమానః, वर्धमानः, Vardhamānaḥ 🌻
ఓం వర్ధమానాయ నమః | ॐ वर्धमानाय नमः | OM Vardhamānāya namaḥ
విశ్వరూపేణ వర్ధతే ।
జనార్ధనో వాసుదేవో వర్ధమాన ఇతీర్యతే ॥
విశ్వరూపమున వర్ధిల్లుచున్నాడు లేదా వృద్ధినొందుచున్నాడు. ఈ కారణముననే జనార్ధనుడూ, వాసుదేవుడూ అయిన ఆ భగవంతుడు వర్ధమానః అని చెప్పబడుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 262🌹
📚. Prasad Bharadwaj
🌻 262. Vardhamānaḥ 🌻
OM Vardhamānāya namaḥ
Vardhano vardhayati yo / वर्धनो वर्धयति यो
Viśvarūpeṇa vardhate,
Janārdhano vāsudevo vardhamāna itīryate.
विश्वरूपेण वर्धते ।
जनार्धनो वासुदेवो वर्धमान इतीर्यते ॥
Since Lord Janārdhana, Vāsudeva in the form Universe is ever expanding and flourishing, He is known by the name Vardhamānaḥ.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 5
Ambhastu yadreta udāravīryaṃ sidhyanti jīvantyuta vardhamānāḥ,
Lokā yato’thākhilalokapālāḥ prasīdatāṃ naḥ sa mahāvibhūtiḥ. (33)
:: श्रीमद्भागवते अष्टम स्कन्धे पञ्चमोऽध्यायः ::
अम्भस्तु यद्रेत उदारवीर्यं सिध्यन्ति जीवन्त्युत वर्धमानाः ।
लोका यतोऽथाखिललोकपालाः प्रसीदतां नः स महाविभूतिः ॥ ३३ ॥
The entire cosmic manifestation has emerged from water, and it is because of water that all living entities endure, live and develop. This water is nothing but the semen of His. Therefore, may the He, who has such great potency, be pleased with us.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥
Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 263 / Vishnu Sahasranama Contemplation - 263🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 263. వివిక్తః, विविक्तः, Viviktaḥ 🌻
ఓం వివిక్తాయ నమః | ॐ विविक्ताय नमः | OM Viviktāya namaḥ
ఏవం స వర్ధమానోఽపి పృథగేవ హి తిష్ఠతి ।
ఇతివిష్ణుర్వాసుదేవో వివిక్త ఇతి కథ్యతే ॥
వర్ధమానుడై అనగా ప్రపంచరూపమున వృద్ధినందుచుండియు దానితోనూ, అందలి ద్వంద్వములతోను అంటక వానినుండి వేరుగానే యున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 262🌹
📚. Prasad Bharadwaj
🌻 263. Viviktaḥ 🌻
OM Viviktāya namaḥ
Evaṃ sa vardhamāno’pi pr̥thageva hi tiṣṭhati,
Itiviṣṇurvāsudevo vivikta iti kathyate.
एवं स वर्धमानोऽपि पृथगेव हि तिष्ठति ।
इतिविष्णुर्वासुदेवो विविक्त इति कथ्यते ॥
Being Vardhamāna i.e., though in the form of Universe He is ever growing, He remains untouched and unaffected by its duality.
Śrīmad Bhāgavata Canto 5, Chapter 19
Kartāsya sargādiṣu yo na badhyate na hanyate dehagato’pi daihikaiḥ,
Draṣṭurna dr̥gyasya guṇairvidūṣyate tasmai namo’sktaviviktasākṣiṇe. (12)
:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः ::
कर्तास्य सर्गादिषु यो न बध्यते न हन्यते देहगतोऽपि दैहिकैः ।
द्रष्टुर्न दृग्यस्य गुणैर्विदूष्यते तस्मै नमोऽस्क्तविविक्तसाक्षिणे ॥ १२ ॥
He is the master of the creation, maintenance and annihilation of this visible cosmic manifestation, yet He is completely free from false prestige. Although to the foolish He appears to have accepted a material body like us, He is unaffected by bodily tribulations like hunger, thirst and fatigue. Although He is the witness who sees everything, His senses are unpolluted by the objects He sees. Let me offer my respectful obeisances unto that unattached, pure witness of the world, the Supreme Soul.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥
Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
1-FEB-2021 EVENING
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 138🌹
11) 🌹. శివ మహా పురాణము - 338🌹
12) 🌹 Light On The Path - 91🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 223🌹
14) 🌹 Seeds Of Consciousness - 287 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 162🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 18 / Lalitha Sahasra Namavali - 18🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasranama - 18 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -138 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 23
*🍀. 21. స్మరణ - కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము. అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన. 🍀*
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।
కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము.
అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును.
శ్లోకము చదివినపుడు “కామ క్రోధముల వేగమును జయించి, యోగమున సుఖపడుము” అన్నట్లు గోచరించును. ఇది సాధ్యపడునది కాదు. యోగమున స్థిరపడి, కామక్రోధములను జయించమనుట యిందలి రహస్యము. చీకటని పారద్రోలి, వెలుగు నేర్పరచుకొనుము అని తెలిపినచో అది సాధ్యపడునది కాదు. వెలుగు నేర్పరచి నంతనే చీకటి అదృశ్యమగును.
'యుక్తః' అను పదము యిందు చాల ముఖ్యము. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన.
భగవంతుని యందు ప్రీతి యున్నచో, స్మరణ భావన నిరంతర మగుచుండును. అట్టి స్మరణ దీపపు వెలుగువంటిది. స్మరణ యను వెలుగు ఉన్నంత సమయము కామక్రోధములను చీకటి క్రమ్మదు.
అట్టి నరునకు సుఖ ముండును. అంతియేగాని కామమును జయింతును, క్రోధమును జయింతును అని అహంకరించువారు శ్రమ చెందుచు దుఃఖ పడుదురు.
ఇచ్చట సమర్థత భగవంతునితో యుక్తము చెందుటయేగాని, కామక్రోధములను జయించుట కాదు. కామక్రోధములు కూడ పై విధముగ శరీరమందుండగనే జయించనిచో మరుజన్మమున గూడ దుఃఖముండును.
అందువలన భగవంతుడు ఈ శరీరమందున్నప్పుడే నాతో యోగము చెంది, కామక్రోధములను హరించి, శాశ్వతముగ సుఖపడుము" అని తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 339 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
85. అధ్యాయము - 40
*🌻. శివదర్శనము -3 🌻*
ముముక్షువులకు శరణమైనది, మహాయోగాత్మకము అగు ఆ వటవృక్షముపై కూర్చుండియున్న శివుని విష్ణువు మొదలగు దేవతలందరు గాంచిరి (37). మహాసిద్ధులు, సర్వదా శివభక్తియందు రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూర్తులు అగు బ్రహ్మపుత్రులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి (38).
యక్ష రాక్షసులకు ప్రభువు, మిత్రుడునగు కుబేరుడు, ఆతని జ్ఞాతులు , శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా సేవించుచుండిరి (39). సర్వప్రాణులకు వాత్సల్యమును చూపే మిత్రుడు అగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో ప్రకాశించువాడై తపశ్శాలురకు అభీష్టమగు దివ్యరూపమును ధరించుయుండెను (40).
ఓ మహర్షీ! ఆయన దర్భాసనమునందు గూర్చుండి మహర్షులందరు వినుచుండగా నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ జ్ఞానమును బోధించుచుండెను (41). ఆయన కుడి తొడపై ఎడమ కాలిని, జానువును ఉంచి, బాహువుల నుండి ముంజేతుల నుండి వ్రేలాడుచున్న రుద్రాక్ష మాలలు గలవాడై జ్ఞానముద్రతో కూర్చుండెను (42).
అపుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు దేవతలందరు వినయముతో చేతులు కట్టుకొని శీఘ్రముగా నమస్కరించిరి (43). సత్పురుషులకు గతియగు రుద్రప్రభుడు అచటకు వచ్చిన నన్ను విష్ణువును చూచి లేచి శిరస్సుతో అభివాదమును కూడ చేసెను (44).
విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు గల శివుడు, లోకములకు సద్గతినిచ్చు విష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించిన తీరున, మాకు నమస్కరించెను (45). దేవతలు, సిద్ధులు, గణాధీశులు మరియు మహర్షులచే సాదరముగా నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో గూడి ఇట్లు పలికెను (46).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో శివదర్శన వర్ణనమనే నలుబడి యవ అధ్యాయము ముగిసినది (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 91 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 14th RULE
*🌻 14. Desire peace fervently. That sacred peace which nothing can disturb. - 1 🌻*
The peace you shall desire is that sacred peace which nothing can disturb, and in which the soul grows as does the holy flower upon the still lagoons.
354. C.W.L. – This short aphorism is closely connected with the foregoing one. The power which we are told to desire leads to peace; unless we have power over self we can have no peace.
355. Only when we have gained peace can we give it to others; to be able to do that is surely one of the greatest and most beautiful of powers. Most people’s lives are full of worry and anxiety, of jealousy and envy.
All the -time they are just a swirl not only of emotions, but also of unsatisfied desires. Many of those who take up the study of occultism, that is, the study of the reality which lies behind, still expect to be able to go on living that kind of life.
Even some of those who are supposed to have been students of occultism for years, and are trying to draw nearer to the Masters, apparently cannot yet give up their desires. They make no serious attempt to get rid of all their foolish and disturbing emotions, and then they wonder why they do not make progress and why others seem to pass on in front of them.
How can they expect to advance until they have left all these things behind them? Until we are quite free from such disturbances it is absolutely impossible to make any real higher progress. If we want to set up communications with the Master, we must have perfect peace within.
356. It is said that struggle is a necessity for progress. It is certainly true that there is a long stage in the evolution of the soul when it is in a constant state of struggle and strife. On looking back into the past we can see that progress was then more rapid in a life of storm and stress than when the conditions were easier.
In that rough-hewing of the character all the troubles and difficulties which men encounter and the opposition which comes in their way no doubt teach them something; they learn their lessons from them. But at the higher stage at which the disciple has arrived that state of struggle is no longer of value.
For growth of the higher kind, perfect peace is necessary. A Master once wrote: “The law of the survival of the fittest is the law for the evolution of the brute; but the law of sacrifice is the law of the evolution of man.” Many people think they will get peace when their mad desires are satisfied, but they find by experience that it is not so.
They then begin to think what a sad thing it is that they have yielded to them, and they realize that they ought to have risen above them. There is no peace to be gained by the satisfaction of desire. Peace is to be attained in one way only: by putting aside the lower desires and developing the power which makes us “as nothing in the eyes of men.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 223 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జైమినిమహర్షి - 8 🌻*
42. మనం అది చదివితే ఏమనిపిస్తుందంటే, ఆ యజ్ఞం త్యాగంకోసమే ఏర్పడింది అనేది. ఏదీ మిగుల్చుకోకుండా త్యాగంచేయాలనేది. తాను ఏది మిగులచుకున్నా, ఆ యాగమ్యొక్క ఫలం అతడికి రాదు అని మనకనిపిస్తుంది.
43. అయితే అందులో కొంచెం మిగుల్చుకుంటే ఫరవాలేదు అంటే, ఎంతవరకు? ఎంత వరకు ఉంచుకుంటే ఫరవాలేదని అర్థం? కావలసినన్ని పెట్టుకుని మిగిలింది దానంచేస్తే, ఇంక దానంచేసేది ఏముంది? ఎందుకంటే, ప్రతీదానికీ ఒక హద్దు ఉంటుంది. ఇలా అయితే త్యాగంచేసేది ఏముంది. కనుక ఉన్నది చేస్తేనే యజ్ఞానికి ఫలంవస్తుంది. అది ఒక ఉత్తమ లక్షణం. దాతృత్వలక్షణం అది.
44. దానం కంటే త్యాగం ఇంకా సులభం అని కూడా ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుచేతనంటే, ఉన్నది ఉండగానే తన భాగం మాత్రం తీసుకుని ఎవరికో దానంచేసి, తాను అక్కడినుంచి వెళ్ళిపోవటం అనేది దానం కంటే సులభమైన త్యాగం. మళ్ళీ వెనక్కు తిరిగిచూడకుండా వెళ్ళిపోవచ్చు.
45. కాబట్టి అలా చేసినటువంటి క్రతువులే ఉత్తమ ఫలాన్నిస్తాయి. కాని జైమిని వ్యాఖ్యానం వచ్చేటప్పటికి, ఆయన సూత్రలలోనే, వేదంయొక్క పరమార్థం అంతా త్యాగంచెయ్యమనేనని అనుకోవాల్సివస్తుంది.
46. ఇక మన సంగతి. మనందరికీ ఈశ్వరుడు తప్పక ఉన్నాడు. జైమిని చెప్పిన సంపూర్ణ త్యాగంతోకూడిన కర్మ, తీవ్రమైన మోక్షేఛ్ఛ అన్నీ కలిపి మోక్షప్రదమే అవుతాయి. అట్టి ఫలితానికి ఈశ్వరుడే కారణం కాగలడు. ఈశ్వరారాధనతో నిమిత్తంలేని మోక్షమార్గం ఉందని జైమిని భావం.
47. ఆ తర్వాత కాలంలో, అంటే, నేటికి ఇరువది అయిదు శతాబ్దాలకు పూర్వం, బుద్ధుడు ఈశ్వరుడితో నిమిత్తంలేక; జైమిని చెప్పిన కర్మ, త్యాగము ఈ రెంటితోనూకూడా సంబంధంలేక కేవలం తీవ్రమైన మోక్షేఛ్ఛ, అంతర్దృష్టితో నిర్వాణం సాధించాడు.
48. ఆ మార్గాలు జైమినికి, బుద్ధుడికి మాత్రమే ఫలప్రదమైనాయి. వారికి లభించిన ముక్తి సృష్టికర్త అయిన ఈశ్వరశాసనము, అనుగ్రహము వీటివల్లనే లభించాయని చెప్పడంలో విప్రతిపత్తిలేదు. కావున మనందరికీ నేడు ఈశ్వరప్రణిధానమే శరణ్యం. ఇది సత్యం, సత్యం, న సంశయః.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 287 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 136. In the womb the knowledge 'I am' is dormant. It is the birth principle which contains everything. 🌻*
The knowledge 'I am' is an assertive phenomenon which is very strong and prevalent throughout nature. The 'I am' is there in the egg released from the ovum in the female and also in every sperm of the male rapidly running towards the egg in the womb.
When the sperms hover around the egg they are desperate to penetrate it and complete the process of the conception of another 'I am'. Finally one of them manages to enter, fertilization occurs and a new 'I am' is conceived. Thereafter it is a multiplication and differentiation process forming the embryo followed by the fetus in the womb. Each cell of the fetus carries the 'I am' which lies dormant in the womb - and it is the 'I am' that is born.
The 'I am' contains everything and asserts itself strongly throughout the life of the body that is born, of course mistakenly believing itself to be the body!
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 162 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 7 🌻*
627. ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో పూర్ణత్వము మూడు విధములుగా నుండును.
1. పరిపూర్ణ మానవుడు
2. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు
3. పరమ పరిపూర్ణుడు.
628. పరిపూర్ణ మానవుడు అప్పటికప్పుడు ఒకనిని మాత్రము తాననుభవించుచున్న ఎరుకతో కూడిన భగవదనుభూతి నివ్వగలడు.
629. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు, అనేక మందిని తనంత వారిని చేయగలడు.
630. పరమ పరిపూర్ణుడు, ఎందరికైన నేమి సమస్త సృష్టికే తన అనుభవము ఇవ్వగలడు.
631. ఆత్మ ప్రతిష్టాపనముతో భగవంతుని రెండవ దివ్యయానము అంత్యమగును.
632. పరిపూర్ణ మానవుడు తాననుభవించు అనంతశక్తులను సద్గురువుల వలె అన్యులకై వినియోగించడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 18 / Sri Lalita Sahasranamavali - Meaning - 18 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 18. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘ్కా |*
*గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ‖ 18 ‖ 🍀*
41) ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా -
ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
42) గూఢగుల్ఫా -
నిండైన చీలమండలు గలది.
43) కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా -
తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 18 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 18. indragopa-parikṣipta-smaratūṇābha-jaṅghikā |*
*gūḍhagulphā kūrmapṛṣṭha-jayiṣṇu-prapadānvitā || 18 || 🌻*
41 ) Indra kopa parikshiptha smarathunabha jangika -
She who has forelegs like the cupids case of arrows followed by the bee called Indra kopa.
42 ) Kooda Gulpha -
She who has round ankles.
43 ) Koorma prashta jayishnu prapadanvidha -
She who has upper feet like the back of the tortoise.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasra Namavali - 18 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మృగశిర నక్షత్ర 2వ పాద శ్లోకం*
*🍀 18. వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|*
*అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః|| 🍀*
అర్ధము :
🍀 163) వేద్యః -
తప్పక తెలుసుకోదగినవాడు.
🍀 164) వైద్యః -
అన్ని విద్యలు తెలిసినవాడు, సర్వజ్ఞుడు.
🍀 165) సదాయోగీ -
విశ్వముతో ఎల్లప్పుడూ అనుసంధానంతో వుండువాడు.
🍀 166) వీరహా -
మహాబలవంతుడు, దుష్టశక్తులను నాశనము చేయువాడు.
🍀 167) మాధవః -
మనస్సు ద్వారా తెలుసుకోబడువాడు.
🍀 168) మధుః -
అత్యంత ప్రియమైనవాడు, మంగళకరుడు.
🍀 169) అతీంద్రియః -
ఇంద్రియములకు అతీతుడు.
🍀 170) మహామాయః -
మాయను కలిగించువాడు, తొలగించువాడు కూడా అతడే.
🍀 171) మహోత్సాహః -
ఎంతో ఉత్సాహముతో, సహనముతో విశ్వమును పాలించువాడు.
🍀 172) మహాబలః -
అంతులేని బలము కలవాడు, అన్నింటికీ బలమును ప్రసాదించువాడు.
*🌹 Vishnu Sahasra Namavali - 18 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Mrugasira 2nd Padam*
*🌻 18. vedyō vaidyaḥ sadāyōgī vīrahā mādhavō madhuḥ |*
*atīndriyō mahāmāyō mahōtsāhō mahābalaḥ ||18 || 🌻*
🌻 163) Vedyaḥ:
One who has to be known by those who aspire for Mokshas.
🌻 164) Vaidhyaḥ:
One who knows all Vidyas or branches of knowledge.
🌻 165) Sadāyogī: One who is ever experienceble, being ever existent.
🌻 166) Vīrahā:
One who destroys heroic Asuras for the protection of Dharma.
🌻 167) Mādhavaḥ:
One who is the Lord or Master of Ma or knowledge.
🌻 168) Madhuḥ:
Honey, because the Lord gives joy, just like honey.
🌻 169) Atīndriyaḥ:
One who is not knowable by the senses.
🌻 170) Mahāmāyaḥ:
One who can cause illusion even over other great illusionists.
🌻 171) Mahotsāhaḥ:
One who is ever busy in the work of creation, sustentation and dissolution.
🌻 172) Mahābalaḥ:
The strongest among all who have strength.,
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
1-FEB-2021 MORNING
1) 🌹 శ్రీమద్భగవద్గీత - 626 / Bhagavad-Gita - 626🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 262, 263 / Vishnu Sahasranama Contemplation - 262, 263🌹
3) 🌹 Daily Wisdom - 45🌹
4) 🌹. వివేక చూడామణి - 09🌹
5) 🌹Viveka Chudamani - 09 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 19🌹
7) 🌹. శాస్త్రాలకు అందనది 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 16 / Bhagavad-Gita - 16🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 196 / Sri Lalita Chaitanya Vijnanam - 196🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 626 / Bhagavad-Gita - 626 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 43 🌴*
43. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
🌷. తాత్పర్యం :
శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వ మనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 626 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 43 🌴*
43. śauryaṁ tejo dhṛtir dākṣyaṁ
yuddhe cāpy apalāyanam
dānam īśvara-bhāvaś ca
kṣātraṁ karma svabhāva-jam
🌷 Translation :
Heroism, power, determination, resourcefulness, courage in battle, generosity and leadership are the natural qualities of work for the kṣatriyas.
🌻 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 262, 263 / Vishnu Sahasranama Contemplation - 262, 263 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 262. వర్ధమానః, वर्धमानः, Vardhamānaḥ 🌻*
*ఓం వర్ధమానాయ నమః | ॐ वर्धमानाय नमः | OM Vardhamānāya namaḥ*
విశ్వరూపేణ వర్ధతే ।
జనార్ధనో వాసుదేవో వర్ధమాన ఇతీర్యతే ॥
విశ్వరూపమున వర్ధిల్లుచున్నాడు లేదా వృద్ధినొందుచున్నాడు. ఈ కారణముననే జనార్ధనుడూ, వాసుదేవుడూ అయిన ఆ భగవంతుడు వర్ధమానః అని చెప్పబడుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 262🌹*
📚. Prasad Bharadwaj
*🌻 262. Vardhamānaḥ 🌻*
*OM Vardhamānāya namaḥ*
Vardhano vardhayati yo / वर्धनो वर्धयति यो
Viśvarūpeṇa vardhate,
Janārdhano vāsudevo vardhamāna itīryate.
विश्वरूपेण वर्धते ।
जनार्धनो वासुदेवो वर्धमान इतीर्यते ॥
Since Lord Janārdhana, Vāsudeva in the form Universe is ever expanding and flourishing, He is known by the name Vardhamānaḥ.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 5
Ambhastu yadreta udāravīryaṃ sidhyanti jīvantyuta vardhamānāḥ,
Lokā yato’thākhilalokapālāḥ prasīdatāṃ naḥ sa mahāvibhūtiḥ. (33)
:: श्रीमद्भागवते अष्टम स्कन्धे पञ्चमोऽध्यायः ::
अम्भस्तु यद्रेत उदारवीर्यं सिध्यन्ति जीवन्त्युत वर्धमानाः ।
लोका यतोऽथाखिललोकपालाः प्रसीदतां नः स महाविभूतिः ॥ ३३ ॥
The entire cosmic manifestation has emerged from water, and it is because of water that all living entities endure, live and develop. This water is nothing but the semen of His. Therefore, may the He, who has such great potency, be pleased with us.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥
Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 263 / Vishnu Sahasranama Contemplation - 263🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 263. వివిక్తః, विविक्तः, Viviktaḥ 🌻*
*ఓం వివిక్తాయ నమః | ॐ विविक्ताय नमः | OM Viviktāya namaḥ*
ఏవం స వర్ధమానోఽపి పృథగేవ హి తిష్ఠతి ।
ఇతివిష్ణుర్వాసుదేవో వివిక్త ఇతి కథ్యతే ॥
వర్ధమానుడై అనగా ప్రపంచరూపమున వృద్ధినందుచుండియు దానితోనూ, అందలి ద్వంద్వములతోను అంటక వానినుండి వేరుగానే యున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 262🌹*
📚. Prasad Bharadwaj
*🌻 263. Viviktaḥ 🌻*
*OM Viviktāya namaḥ*
Evaṃ sa vardhamāno’pi pr̥thageva hi tiṣṭhati,
Itiviṣṇurvāsudevo vivikta iti kathyate.
एवं स वर्धमानोऽपि पृथगेव हि तिष्ठति ।
इतिविष्णुर्वासुदेवो विविक्त इति कथ्यते ॥
Being Vardhamāna i.e., though in the form of Universe He is ever growing, He remains untouched and unaffected by its duality.
Śrīmad Bhāgavata Canto 5, Chapter 19
Kartāsya sargādiṣu yo na badhyate na hanyate dehagato’pi daihikaiḥ,
Draṣṭurna dr̥gyasya guṇairvidūṣyate tasmai namo’sktaviviktasākṣiṇe. (12)
:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः ::
कर्तास्य सर्गादिषु यो न बध्यते न हन्यते देहगतोऽपि दैहिकैः ।
द्रष्टुर्न दृग्यस्य गुणैर्विदूष्यते तस्मै नमोऽस्क्तविविक्तसाक्षिणे ॥ १२ ॥
He is the master of the creation, maintenance and annihilation of this visible cosmic manifestation, yet He is completely free from false prestige. Although to the foolish He appears to have accepted a material body like us, He is unaffected by bodily tribulations like hunger, thirst and fatigue. Although He is the witness who sees everything, His senses are unpolluted by the objects He sees. Let me offer my respectful obeisances unto that unattached, pure witness of the world, the Supreme Soul.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तश्श्रुतिसागरः ॥ २८ ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః ॥ ౨౮ ॥
Vr̥ṣāhī vr̥ṣabho viṣṇurvr̥ṣaparvā vr̥ṣodaraḥ ।
Vardhano vardhamānaśca viviktaśśrutisāgaraḥ ॥ 28 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 45 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. The World and Ourselves, There is Nothing Else 🌻*
There are only two things that we see in this world: the world and ourselves. There is nothing else. If we look around, we see the vast world of astronomical phenomena and geographical extension, and we are there as small individuals in this mighty world. What else can we see? “I am here, and the world is there.” The individual and the world are the realities.
Perhaps we may say, in a general manner, that we conceive two realities. If this is our concept of what is real, and we are certainly in search of what is real, it would follow from this answer or definition that we are in search of the world, or we are in search of ourselves. Naturally, this should be so, because there are only two things, as we said: We are there, and the world is there.
If we are there as a reality, or the world is there as a reality, we are in search of either of these, or both of them. But, actually, we have not found either of these. Though we seem to be in search of the world, the world is not under our possession.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 9 🌹*
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 4. వివిధ మార్గాలు - 2 🌻*
44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.
45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు.
46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.
47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹VIVEKA CHUDAMANI - 9 🌹*
✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 4. Different Ways - 2 🌻*
44. There is a sovereign means which puts an end to the fear of relative existence; through that thou wilt cross the sea of Samsara and attain the supreme bliss.
45. Reasoning on the meaning of the Vedanta leads to efficient knowledge, which isimmediately followed by the total annihilation of the misery born of relative existence.
46. Faith (Shraddha), devotion and the Yoga of meditation – these are mentioned by the Shruti as the immediate factors of Liberation in the case of a seeker; whoever abides in these gets Liberation from the bondage of the body, which is the conjuring of Ignorance.
47. It is verily through the touch of Ignorance that thou who art the Supreme Self findestthyself under the bondage of the non-Self, whence alone proceeds the round of births and deaths. The fire of knowledge, kindled by the discrimination between these two, burns up the effects of Ignorance together with their root.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 19 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 10. సిద్ధాంతము - ఆచరణ 🌻*
ఆచరణకు సిద్ధాంతము బీజము. సిద్ధాంతమునకు ఆచరణ శిశువు. ఒకటి బీజము మరియొకటి వృక్షము. అటులనే సంకల్పమునకు మనస్సు తల్లి, మనస్సునకు సంకల్పము పుత్రుడు.
సంకల్పమునకు జ్ఞానము తల్లి, జ్ఞానమునకు సంకల్పము పుత్రుడు. పరిణామము చరిత్ర గర్భమునుండి వెలువడుచుండును. పరిణామము నుండి మరల చరిత్ర వెలువడుచుండును. సృష్టి అంతయు చర్వితచర్వణమే.
అనగా జరిగినదే మరల మరల జరుగుచుండును. కాని జరిగినపుడెల్ల పాతదిగ కాక కొత్తదిగ గోచరించును. దీనినే ఋషులు “నవ” అని పిలిచెదరు. ఎప్పుడును కొత్త దిగనే కొనిరాబడు చున్నది. కావున “నవనీత” మనిరి.
ప్రతిదినము నిద్రలేచుట, పనులు చేయుట, భుజించుట, మాటలాడుట, విశ్రాంతి గొనుటగా జరుగుచున్నను, ప్రతిదినము ప్రత్యేక దినముగ గోచరించుచున్నది కదా!
ఇట్లు సంకల్పముల నుండి ఆచరణములు, ఆచరణముల నుండి మరల సంకల్పములు అనంతముగ చక్రభ్రమణము చేయుచునే యుండును. అయిపోవుట ఏ స్థితి యందు ఉండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శాస్త్రాలకు అందనిది 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
📚. ప్రసాద్ భరద్వాజ
ఇది నిజంగా జీవశాస్తప్రరమైన ఒక గొప్ప తాత్విక సమస్య. ఎందుకంటే, కొన్ని లక్షల వీర్యకణాలలో ఒక్కటే తల్లి గర్భంలోని బీజాన్ని కలుసుకుని జన్మిస్తుంది. అయితే మిగిలిన వీర్యకణాలలో ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నను భారతదేశంలోని హిందూ పండితులు, జనన నియంత్రణను వ్యతిరేకించే వాదనలలో ఒకటిగా వాడుకున్నారు.
వాదన విషయంలో భారతదేశం చాలా తెలివైనది. ‘‘పిల్లలను పుట్టించడం- ఇద్దరా లేదా ముగ్గురా, లేదా- ఎక్కడ ఆపాలి?
‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ తల్లిదండ్రులు పన్నెండు మంది పిల్లలు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణను పాటిస్తే ఆయన పుట్టేవాడే కాదు. కుటుంబ నియంత్రణను పాటిస్తే మనం ఎంతమంది ‘రబీంద్రనాథ్ ఠాగూర్’లాంటి గొప్ప వ్యక్తులను కోల్పోతామో తెలుసా?’’ అనేది వారి వాదన.
అందుకే నేను ఒకసారి ‘‘కేవలం వాదించేందుకు మాత్రమే అయితే మీ వాదనలో అర్థముంది కాబట్టి, దానితో నేను ఏకీభవిస్తాను. కానీ, కుటుంబ నియంత్రణ వల్ల దేశంలోని ప్రజలందరూ కూడు, గుడ్డ లాంటి వౌలిక అవసరాలకు ఎలాంటి లోటులేకుండా హాయిగా జీవిస్తారు. దానికోసం ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’లాంటి గొప్ప వ్యక్తులను వదులుకునేందుకు కూడా నేను సిద్ధమే.
ఎందుకంటే, ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ పదమూడవ సంతానం. మీ లెక్కప్రకారం అందరూ పదమూడు మంది పిల్లలను పుట్టించాలా? మరి పధ్నాలుగు, పదిహేనవ సంతానం సంగతేమిటి? లైంగిక సంయోగంలో పురుషుడు విడుదల చేసిన అనేక లక్షల వీర్యకణాలలో ఎంతమంది మహానుభావులున్నారో మీరు చెప్పగలరా? కేవలం కొంతమంది గొప్ప వ్యక్తులు పుట్టడం కోసం అందరూ జనాభాను పెంచడంవల్ల ఎన్ని కోట్ల మంది ఆకలి చావులు చస్తున్నారో మీకు కనిపించట్లేదా?’’ అంటూ వాదించాను.
నా లెక్కప్రకారం అంతా సవ్యంగా ఉన్న ఒక పురుషుడు తన యుక్తవయసు నుంచి నలభై రెండేళ్ళ వయసు వచ్చేవరకు ఈ భూమి నిండి పొర్లిపోయే జనాభాకు సరిపోయే వీర్యకణాలను విడుదల చెయ్యగలడు. ఇప్పటికే మన భూమి అధిక జనాభాతో అల్లాడిపోతోంది.
అందరిలో సహజంగా ఉండేది మానవత్వమే అయినా, ఎవరి వ్యక్తిత్వం వారిదే. కాబట్టి, పుట్టినప్పటి నుంచే జీవితం ప్రారంభమవట్లేదు. అది ఇంకా ముందు నుంచే ప్రారంభమవుతోంది. అది మీకు కేవలం ఒక ఊహ మాత్రమే అయినా, నాకు మాత్రం అది ఒక అనుభవం. గత జన్మ ముగిసిన చోటునుంచే పునర్జన్మ ప్రారంభమవుతుంది.
మీరు మరణించినప్పుడు అందరూ మీ జీవితం ముగిసిందని భావిస్తారు. కానీ, అది అనంత అధ్యాయాలతో కూడుకున్న జీవిత పుస్తకంలోని ఒక అధ్యాయం మాత్రమే ముగిసినట్లు. అంతమాత్రాన మీ జీవిత పుస్తకం పూర్తిగా ముగిసినట్లు కాదు. పేజీ తిప్పిచూస్తే మరొక అధ్యాయం ప్రారంభమవుతుంది.
మరణిస్తున్న వ్యక్తి తదుపరి జన్మను దర్శించడం ప్రారంభిస్తాడు. అధ్యాయం ముగిసేముందు జరిగేది అదే. ఇది అందరికీ తెలిసిన సత్యమే.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 16 / Bhagavad-Gita - 16 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ప్రధమ అధ్యాయము - 16 🌴*
16. అనన్తవిజయం రాజా
కున్తీపుత్రో యుధిష్టిర: |
నకుల: సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ ||
🌷. తాత్పర్యం :
ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి.
🌷. బాష్యము :
పాండుతనయులు మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు.
కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు(ప్రపంచపలుదేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి.
వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనునసరించిన యుక్తి విధానము ప్రోత్సాహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.
*🌹 BhagavadGita as It is - 16 🌹*
✍️ Swami Bhakthi Vedanta Sri Prabhupada
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴 Chapter 1 - Verse 16 🌴*
16. anantavijayaṁ rājā kuntī-putro yudhiṣṭhiraḥ
nakulaḥ sahadevaś ca sughoṣa-maṇipuṣpakau
🌷 Translation :
King Yudhiṣṭhira, the son of Kuntī, blew his conchshell, the Ananta-vijaya, and Nakula and Sahadeva blew the Sughoṣa and Maṇipuṣpaka.
🌷 Purport :
Sañjaya informed King Dhṛtarāṣṭra very tactfully that his unwise policy of deceiving the sons of Pāṇḍu and endeavoring to enthrone his own sons on the seat of the kingdom was not very laudable. The signs already clearly indicated that the whole Kuru dynasty would be killed in that great battle.
Beginning with the grandsire, Bhīṣma, down to the grandsons like Abhimanyu and others – including kings from many states of the world – all were present there, and all were doomed. The whole catastrophe was due to King Dhṛtarāṣṭra, because he encouraged the policy followed by his sons.
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 196 / Sri Lalitha Chaitanya Vijnanam - 196 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |*
*సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖*
*🌻196. 'సర్వజ్ఞా'🌻*
సర్వమూ తెలిసినది శ్రీమాత అని అర్థము.
శ్రీమాత, సృష్టి ఎఱుక. సృష్టియందలి సమస్త ప్రాణికోటి యందును ఆమె ఎఱుకయే పని చేయుచుండును. ప్రాణులు, ఎఱుక తమదనుకొందురు. జీవుల యందలి ఎఱుక శ్రీదేవియే. ఆ ఎలుక ఆధారముగ జీవులు తమ తమ స్వభావములను బట్టి భావములను పొంది కార్యములను నిర్వర్తించుచుందురు. ఎఱుక లేనిదే భావన లేదు.
సర్వభావములకూ మూలము ఎఱుకయే. భావములు లేని ఎఱుకను తెలిసినవాడు తనయందు చైతన్య స్వరూపిణిగా శ్రీమాత ఎట్లున్నదో తెలియగలడు. స్వభావమునం దిమిడిన జీవులకు వారి గుణ సముదాయములనుబట్టి భావము లేర్పడుచుండును.
భావముల యేందే తిరుగాడువారు భావములకు మూలమైన ఎఱుకను గుర్తించ లేరు. సినిమా తెరపై బొమ్మలు ఎల్లపుడూ పడుచుండగా, బొమ్మలు లేని వెండితెర నూహించుట కష్టము. భావములు ఎక్కడనుండి పుట్టుచున్నవో దానిని గమనించుట ధ్యానముగ శ్రీకృష్ణుడు భగవద్గీత
యందు తెలిపినాడు.
భావములు పుట్టుచున్న చోటును గమనించు మార్గమున క్రమముగ జీవుడు తనయందలి ఎఱుకను గుర్తించును. అట్లు తెలిసినవాడు ఆ ఎఱుకను అన్నిటి యందు దర్శించుటకు ప్రయత్నింప వలెను. ఆ ఎఱుకనుండియే సర్వమునూ పుట్టినవి.
ఎఱుక యందే సకల జీవవ్యాపారములు జరుగుచున్నవి. శ్రీమాత అందరి యందు తాను ఎఱుకగా యున్నది అని ఈ నామము తెలుపుచున్నది. అందువలన ఆమెకు సర్వమునూ తెలిసియే యుండును. ఆమెకు తెలియక సృష్టిలో జరుగున దేమియూ లేదు. ఆమెది సర్వజ్ఞత.
శ్రీమాత తత్త్వము మనయందు యుండుటవలననే ప్రతిమానవుడు “నేనున్నాను” అని భావించుచున్నాడు. ఎఱుకయే లేనిచో ఈ భావనయే లేదు. తానున్నాను అను భావన ఆధారముగ ఇతర భావనలు అల్లుకొన్నవి. ఈ భావములకు అతీతముగ మనయందున్నది శ్రీమాత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 196 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Sarvajñā सर्वज्ञा (196) 🌻*
She is omniscient. Only the Brahman alone can be omniscient. Muṇḍaka Upaniṣad (I.1.9) says “That Brahman, which is all-knowing in general way and which is also all-knowing in detail whose austerity is knowledge and from that (para) Brahman comes this (apara) Brahman and also such categories as name, form and food.”
The Upaniṣad specifically uses the word tapaḥ, meaning the highest form of meditation known as penance. Parā Brahman is the nirguṇa Brahman (without attributes) and aparā Brahman is saguṇa Brahman (with attributes).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)