🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జైమినిమహర్షి - 8 🌻
42. మనం అది చదివితే ఏమనిపిస్తుందంటే, ఆ యజ్ఞం త్యాగంకోసమే ఏర్పడింది అనేది. ఏదీ మిగుల్చుకోకుండా త్యాగంచేయాలనేది. తాను ఏది మిగులచుకున్నా, ఆ యాగమ్యొక్క ఫలం అతడికి రాదు అని మనకనిపిస్తుంది.
43. అయితే అందులో కొంచెం మిగుల్చుకుంటే ఫరవాలేదు అంటే, ఎంతవరకు? ఎంత వరకు ఉంచుకుంటే ఫరవాలేదని అర్థం? కావలసినన్ని పెట్టుకుని మిగిలింది దానంచేస్తే, ఇంక దానంచేసేది ఏముంది? ఎందుకంటే, ప్రతీదానికీ ఒక హద్దు ఉంటుంది. ఇలా అయితే త్యాగంచేసేది ఏముంది. కనుక ఉన్నది చేస్తేనే యజ్ఞానికి ఫలంవస్తుంది. అది ఒక ఉత్తమ లక్షణం. దాతృత్వలక్షణం అది.
44. దానం కంటే త్యాగం ఇంకా సులభం అని కూడా ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుచేతనంటే, ఉన్నది ఉండగానే తన భాగం మాత్రం తీసుకుని ఎవరికో దానంచేసి, తాను అక్కడినుంచి వెళ్ళిపోవటం అనేది దానం కంటే సులభమైన త్యాగం. మళ్ళీ వెనక్కు తిరిగిచూడకుండా వెళ్ళిపోవచ్చు.
45. కాబట్టి అలా చేసినటువంటి క్రతువులే ఉత్తమ ఫలాన్నిస్తాయి. కాని జైమిని వ్యాఖ్యానం వచ్చేటప్పటికి, ఆయన సూత్రలలోనే, వేదంయొక్క పరమార్థం అంతా త్యాగంచెయ్యమనేనని అనుకోవాల్సివస్తుంది.
46. ఇక మన సంగతి. మనందరికీ ఈశ్వరుడు తప్పక ఉన్నాడు. జైమిని చెప్పిన సంపూర్ణ త్యాగంతోకూడిన కర్మ, తీవ్రమైన మోక్షేఛ్ఛ అన్నీ కలిపి మోక్షప్రదమే అవుతాయి. అట్టి ఫలితానికి ఈశ్వరుడే కారణం కాగలడు. ఈశ్వరారాధనతో నిమిత్తంలేని మోక్షమార్గం ఉందని జైమిని భావం.
47. ఆ తర్వాత కాలంలో, అంటే, నేటికి ఇరువది అయిదు శతాబ్దాలకు పూర్వం, బుద్ధుడు ఈశ్వరుడితో నిమిత్తంలేక; జైమిని చెప్పిన కర్మ, త్యాగము ఈ రెంటితోనూకూడా సంబంధంలేక కేవలం తీవ్రమైన మోక్షేఛ్ఛ, అంతర్దృష్టితో నిర్వాణం సాధించాడు.
48. ఆ మార్గాలు జైమినికి, బుద్ధుడికి మాత్రమే ఫలప్రదమైనాయి. వారికి లభించిన ముక్తి సృష్టికర్త అయిన ఈశ్వరశాసనము, అనుగ్రహము వీటివల్లనే లభించాయని చెప్పడంలో విప్రతిపత్తిలేదు. కావున మనందరికీ నేడు ఈశ్వరప్రణిధానమే శరణ్యం. ఇది సత్యం, సత్యం, న సంశయః.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
No comments:
Post a Comment