భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 162


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 162 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 7 🌻


627. ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో పూర్ణత్వము మూడు విధములుగా నుండును.

1. పరిపూర్ణ మానవుడు

2. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు

3. పరమ పరిపూర్ణుడు.

628. పరిపూర్ణ మానవుడు అప్పటికప్పుడు ఒకనిని మాత్రము తాననుభవించుచున్న ఎరుకతో కూడిన భగవదనుభూతి నివ్వగలడు.

629. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు, అనేక మందిని తనంత వారిని చేయగలడు.

630. పరమ పరిపూర్ణుడు, ఎందరికైన నేమి సమస్త సృష్టికే తన అనుభవము ఇవ్వగలడు.

631. ఆత్మ ప్రతిష్టాపనముతో భగవంతుని రెండవ దివ్యయానము అంత్యమగును.

632. పరిపూర్ణ మానవుడు తాననుభవించు అనంతశక్తులను సద్గురువుల వలె అన్యులకై వినియోగించడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Feb 2021

No comments:

Post a Comment