🌹 గోదా కల్యాణం 🌹
ప్రసాద్ భరద్వాజ
విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది.
ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.
🌹 🌹 🌹 🌹 🌹
Showing posts with label Ranganatha Swamy. Show all posts
Showing posts with label Ranganatha Swamy. Show all posts
భోగి పండుగ శుభాకాంక్షలు, గోదా దేవత మరియు రంగనాథ స్వామి వివాహం మరియు షట్థిల ఏకాదశి శుభాకాంక్షలు Greetings on Bhogi festival, on Wedding of Goddess Goda and Ranganatha Swamy, and for Shatthila Ekadashi
🌹 భోగిపండుగ, గోదాదేవి రంగనాధుల కళ్యాణం, షట్తిల ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹
🍀 భోగి పండుగ - బాహ్య భోగం నుంచి ఆంతర భోగానికి ప్రయాణం 🍀
✍️ ప్రసాద్ భరద్వాజ
🌹 Happy Bhogi festival, best wishes for the wedding of Goddess Goda and Ranganatha, and for Shatthila Ekadashi to everyone 🌹
🍀 Bhogi festival - A journey from external pleasures to inner bliss 🍀
✍️ Prasad Bharadwaj
మనకు లభించే అనేక పర్వదినాలలో భోగిపండుగ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ‘భోగం’ అనగా సుఖాన్ని అనుభవించడం. ఈ పండుగను బాహ్యంగా పరిశీలిస్తే, మన శరీర పోషణకు అవసరమైన ధాన్యం, జీవన సౌఖ్యానికి దోహదపడే సంపద సమృద్ధిగా లభించే కాలాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పండుగకు ‘భోగి’ అనే నామం వచ్చింది.
భోగి మంటల్లో వేయాల్సింది పంచ పల్లవాలు.
భోగి పండుగ రోజు భోగి మంటలు వేసే సమయంలో ఆవు పిడకలు వేసి అవి మండటానికి ఆవు నెయ్యి వేయాలి. ఇలా ఆవు నెయ్యి, ఆవు పిడకలతో కలిసి అగ్ని మథనం జరగడం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ వెలువడుతుంది. పంచ పల్లవాలు అంటే మర్రి, మేడి, జువ్వి, మోదుగ, మామిడి ఈ ఐదు వృక్షాల కట్టెలను భోగి మంటలో వేసినట్లయితే వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములన్నీ సంహరించబడతాయి.
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సుఖాలను ప్రసాదించమని భగవంతుణ్ని కోరుకునే రోజు ఇది. ఇన్నాళ్లూ తమను పట్టి పీడించిన దారిద్య్రాన్ని తరిమికొడుతూ, కష్టాలన్నిటినీ అగ్నిలో ఆహుతి చేస్తూ భోగిమంటలను వేయడం ఆచారం.
ఈ పండుగ ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ సూచకంగా నిలుస్తుంది. అయితే భోగిపండుగ యొక్క అసలైన విశేషం బాహ్య అర్థానికి మించి ఆంతరార్థంలో దాగి ఉంది. మకర సంక్రాంతికి ముందు రోజు, దక్షిణాయన పుణ్యకాలానికి చివరి రోజుగా భోగిపండుగ వస్తుంది. ఇది ఆంతర సాధన ఫలితాన్ని ప్రకటించే దినంగా భావించ బడుతుంది.
ఆధ్యాత్మికంగా చూస్తే, భోగి అంటే కేవలం లౌకిక సుఖం కాదు. మనిషి ఆంతరంగా అనుభవించే మోక్షానందమే నిజమైన భోగం. భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించు కోవడానికి అనుకూలమైన కాలమిది. లౌకిక కోరికలను విడిచిపెట్టి, ఈశ్వరస్మరణలో జీవించాలనే సంకల్పానికి ఇది సూచిక. అందుకే భోగి రోజున భోగిమంట వేస్తారు. అందులో కట్టెలు, ఆవుపేడతో చేసిన పిడకలను వేయడం ద్వారా లౌకిక కామనలను అగ్నికి ఆహుతి చేసి, ఈశ్వర కామనను పెంపొందించు కోవాలనే భావన వ్యక్తమవుతుంది. భగవంతుడు అనుగ్రహించిన సంపదను ప్రసాదంగా భావించి అనుభవించడమే ఈ పండుగ యొక్క అంతరార్థం.
లౌకిక కోరికలు దగ్ధమై, ఈశ్వరాభిలాష మాత్రమే మిగిలినప్పుడు, అది నిరతిశయ భక్తిగా మారుతుంది. ఆ భక్తితో చేసిన కర్మాచరణం చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. చిత్తశుద్ధి పాత్రతను కలిగిస్తుంది. ఆ పాత్రత వల్ల జ్ఞానం జనిస్తుంది. ఆ జ్ఞానమే భోగి – అంటే ఈశ్వరునితో ఐక్యమై మోక్షాన్ని అనుభవించుట.
🍒 భోగి పండ్లు పిల్లలపై ఎందుకు పోస్తారు? 🍒
ఇంకా ఒక విశేషమైన సంప్రదాయం ప్రకారం, భోగిపండుగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులో నివసిస్తుందని విశ్వాసం. చిన్నపిల్లలకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగించడానికి పెద్ద యజ్ఞయాగాదులు చేయలేని పరిస్థితిలో, పెద్దలు రేగుపండ్లు, బంతిపూలు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు, చిల్లర పైసలు కలిపి పిల్లల మీదనుంచి విడిచిపెడతారు.
ఈ విధంగా చేయడం వల్ల భోగిపీడ తొలగి, అనారోగ్యాలు మరియు అపశకునాలు దూరమై, పిల్లలు సుఖసంతోషాలతో జీవించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని నమ్మకం. అందుకే భోగిపండుగను భోగిపీడ నివారణకు అద్భుతమైన పర్వదినంగా భావిస్తారు.
ఈ విధంగా భోగిపండుగ మనకు బాహ్య భోగంతో పాటు ఆంతర భోగాన్ని, లౌకిక సుఖంతో పాటు ఆధ్యాత్మిక పరమార్థాన్ని గుర్తు చేసే మహత్తరమైన పండుగగా నిలుస్తుంది.
మకర సంక్రాంతి మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. ఈ రోజున భోగి మంటలు వేసి పాతదాన్ని విడిచి కొత్త జీవనాన్ని ఆహ్వానిస్తారు. సాయంత్రం సమయంలో చిన్న పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆనందంగా చేసే ముఖ్యమైన సంప్రదాయం.
భోగి పండ్లు అంటే రేగు పండ్లు, చిన్న చెరకు ముక్కలు, బంతిపూల రేకులు, అక్షతలు, చిల్లర నాణేలు మొదలైన శుభ సూచక వస్తువుల సమాహారం. కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతారు.
పిల్లలపై భోగి పండ్లు పోయడం వెనుక ప్రధాన ఉద్దేశం దిష్టి తొలగించి, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకోవడం. పురాణాల ప్రకారం రేగు పండ్లు బదరీ ఫలంగా భావిస్తారు. నరనారాయణులపై దేవతలు ఈ ఫలాలను కురిపించారని విశ్వాసం. పిల్లలను నారాయణ స్వరూపంగా భావించి ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తారు. అలాగే ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లు సూర్యుడిని సూచిస్తాయని, సూర్యానుగ్రహం పిల్లలపై ఉండాలనే భావన కూడా ఉంది.
భోగి రోజు సాయంత్రం పిల్లలకు స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి ముందు పండ్లు పోస్తుంది. ఆ తర్వాత ఇతర పెద్దలు ఆశీర్వదిస్తారు. చివరగా హారతి ఇస్తారు.
భోగి పండ్లు పోసిన తర్వాత పడిన పండ్లను శుభ్రం చేసి ఆవులకు ఇవ్వడం శుభకరం. ఈ సంప్రదాయం పిల్లలకు శుభం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షును అందించాలని కోరుకునే తల్లిదండ్రుల ప్రేమకు ప్రతీక.
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali
🌹 శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali 🌹
ప్రసాద్ భరధ్వాజ
ఓం శ్రీరంగశాయినే నమః |
ఓం శ్రీకాన్తాయ నమః |
ఓం శ్రీప్రదాయ నమః |
ఓం శ్రితవత్సలాయ నమః |
ఓం అనన్తాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం జేత్రే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం జగద్గురవే నమః | ౯
ఓం సురవర్యాయ నమః |
ఓం సురారాధ్యాయ నమః |
ఓం సురరాజానుజాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం హరయే నమః |
ఓం హతారయే నమః |
ఓం విశ్వేశాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం శంభవే నమః | ౧౮
ఓం అవ్యయాయ నమః |
ఓం భక్తార్తిభంజనాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం వీరాయ నమః |
ఓం విఖ్యాతకీర్తిమతే నమః |
ఓం భాస్కరాయ నమః |
ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం దైత్యశాస్త్రే నమః |
ఓం అమరేశ్వరాయ నమః | ౨౭
ఓం నారాయణాయ నమః |
ఓం నరహరయే నమః |
ఓం నీరజాక్షాయ నమః |
ఓం నరప్రియాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మకృతే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మాంగాయ నమః |
ఓం బ్రహ్మపూజితాయ నమః | ౩౬
ఓం కృష్ణాయ నమః |
ఓం కృతజ్ఞాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం అఘనాశనాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం జితారాతయే నమః |
ఓం సజ్జనప్రియాయ నమః | ౪౫
ఓం ఈశ్వరాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః |
ఓం త్రయ్యర్థాయ నమః |
ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం కాకుత్స్థాయ నమః |
ఓం కమలాకాన్తాయ నమః |
ఓం కాళీయోరగమర్దనాయ నమః |
ఓం కాలామ్బుదశ్యామలాంగాయ నమః | ౫౪
ఓం కేశవాయ నమః |
ఓం క్లేశనాశనాయ నమః |
ఓం కేశిప్రభంజనాయ నమః |
ఓం కాన్తాయ నమః |
ఓం నన్దసూనవే నమః |
ఓం అరిన్దమాయ నమః |
ఓం రుక్మిణీవల్లభాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం బలభద్రాయ నమః | ౬౩
ఓం బలానుజాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం పూతాయ నమః |
ఓం పుణ్యజనధ్వంసినే నమః |
ఓం పుణ్యశ్లోకశిఖామణయే నమః |
ఓం ఆదిమూర్తయే నమః | ౭౨
ఓం దయామూర్తయే నమః |
ఓం శాంతమూర్తయే నమః |
ఓం అమూర్తిమతే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పావనాయ నమః |
ఓం పవనాయ నమః |
ఓం విభవే నమః |
ఓం చంద్రాయ నమః | ౮౧
ఓం ఛన్దోమయాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం సంసారామ్బుధితారకాయ నమః |
ఓం ఆదితేయాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం భానవే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం ఊర్జితాయ నమః | ౯౦
ఓం మహేశ్వరాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహాశక్తయే నమః |
ఓం మహత్ప్రియాయ నమః |
ఓం దుర్జనధ్వంసకాయ నమః |
ఓం అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ నమః |
ఓం పక్షీన్ద్రవాహనాయ నమః |
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం క్షీరాబ్ధిశయనాయ నమః | ౯౯
ఓం విధవే నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం జగద్ధేతవే నమః |
ఓం జితమన్మథవిగ్రహాయ నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం శంఖధారిణే నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం ఖడ్గినే నమః |
ఓం గదాధరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Posts (Atom)