6-July-2020 messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 419 / Bhagavad-Gita - 419 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 207 / Sripada Srivallabha Charithamrutham - 207 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 71 🌹
4) 🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 50 / Dasarathi Satakam - 50 🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 110 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 27 🌹 
7) 🌹. పంచకోశములు - మనోమయకోశము 🌹
8) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87🌹 
9) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 58 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 58 🌹 
10)  🌹. సౌందర్య లహరి - 34 / Soundarya Lahari - 34 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹
12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 163 🌹 
13) 🌹. VEDA UPANISHAD SUKTHAM - 50 🌹
14)  🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 🌹
15) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 40 🌹
16) 🌹 Seeds Of Consciousness - 115 🌹
17)  🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹
18) 🌹. మనోశక్తి - Mind Power - 53 🌹
19)
20) 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీమద్భగవద్గీత - 419 / Bhagavad-Gita - 419 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 28 🌴

28. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||

🌷. తాత్పర్యం : 


🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 419 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 28 🌴

28. yathā nadīnāṁ bahavo ’mbu-vegāḥ
samudram evābhimukhā dravanti
tathā tavāmī nara-loka-vīrā
viśanti vaktrāṇy abhivijvalanti

🌷 Translation : 
As the many waves of the rivers flow into the ocean, so do all these great warriors enter blazing into Your mouths.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 207 / Sripada Srivallabha Charithamrutham - 207 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 36
🌻. ఆత్మ ఏక - బహు శరీరగతమా? 🌻

సరే, వేదపండితగోష్ఠి ప్రారంభమయింది. అందులో ఆది శంకరా చార్యులు చనిపోయిన మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేయడం, వారి శరీరాన్ని రాణి ఆదేశంతో కాల్చబోవడం, కాలి పోతున్న తమ శరీరాన్ని రక్షించు కోవడం కోసం శంకరాచార్యులు రాజు శరీరాన్ని వదిలి తిరిగి తమ శరీరంలో ప్రవేశించడం గురించి ప్రస్తావించారు. 

అది విన్న శ్రీపాదులు, “ఆత్మ అనేది ఒకసారి ఒకే శరీరంలోనే ఉండగలదా? ఆత్మ ఒకేసారి మూడు, నాల్గు శరీరాలలో ఉండి మూడు, నాల్గు జన్మల కర్మ ఫలాలని పోగోట్టు కోలేదా?” అని ప్రశ్నించారు. 

దానికి ఆ సభలోనివారు అటువంటి దాఖలాలు ఎక్కడా లేవని చెప్పారు. అందుకు వారు, “దాఖలాలు లేకేమి? ఉన్నాయి, కాని మీకు తెలియదు,” అని చెప్పి, "దేవేంద్రుడు శాపవశాత్తు పంచపాండవులుగా జన్మించి నపుడు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయింది. శచీ, పురందరులిద్దరూ జన్మించినా వారి మూలతత్వం స్వర్గం లోనే ఉంది,

దేవతాధర్మాలు, మనుష్య ధర్మాలు, జంతు ధర్మాలు వేరు వేరు. అన్నిటిని కలగాపులగం చేయకూడదు," అని చెప్పారు. 

పురాణ కాలంలో ఇటువంటివి జరిగి ఉండవచ్చు కాని నేటి కాలంలో జరుగవని నేను చెప్పాను. దానికి వారు నీవు ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకున్నావు, మరి ఒక స్త్రీకూడా ముగ్గురు పురుషులని వివాహం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. 

దానికి నేను, "మగవాడు ఎందరి స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చు, కాని స్త్రీలకు అటువంటె హక్కు లేదు," అని చెప్పాను. అపుడు శ్రీపాదులు, “మండోదరి మహా పతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉన్నపుదు శరీరాణువులు వేరు. 

రావణాసురుని భార్యగా ఉన్నపుడు శరీరాణువులు వేరు. విభీషణునకు భార్యగా ఉన్నపుడు శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది కనుక దేనితోను సంగమం ఉండదు కనుక అది నిత్యశుద్ధము, అత్యంత పవిత్రము,” అని వివరించారు. 

నేను కొంచెంసేపు ఆలోచించి, “అయితే బహు భర్తృత్వం కూడా అంగీకరించాలా? అని ప్రశ్నించాను. దానికి వారు ధర్మ విరుద్ధమైన బాంధవ్యాలు ఏర్పడినపుడు ఆసురీ శక్తులు విజృంభించి అవాంతర కులాలు ఏర్పడుతున్నవి. 

అందువల్ల అసుర ధ్వంసం చేయవలసి ఉంది. అందరు విధిగా కులగోత్రాలు, వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 207 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21
🌴 Dandiswami comes to Kukkuteswara Temple Sadaka should have purity of place and purity of ‘bhava’ 🌴

In accordance with the order of Sri Maha Guru, I started for darshan of Maanchaala village along with Gurucharana. On the way we were discussing Sripada’s leelas.  

I learnt many things related to spiritual matters from Gurucharana. I asked Gurucharana ‘Sir! Sripada said that a person with the ‘amsa’ of Vasishta would come to His Maha Samsthan as pujari.  

Who is that great fortunate person? When will he come?” Gurucharana said ‘Sir! Shankar Bhatt! He Himself said that Maha Samsthan would be established in His name after many centuries. Sripada’s ‘will’ is that one great tapaswi should come as pujari in that Maha Samsthan.  

It is not possible for great tapaswis to come without the ‘will’ of God. Doing dhyana, araadhana (worship), chanting of sacred mantras and worship with devotion and concentration will make the atmosphere (vayu mandalam) pure. 

 From the depths of universe on all sides, the thought vibrations will be always radiating. People with sacred thoughts will receive the sacred vibrations. People with impure thoughts will receive impure vibrations.  

If the thought vibrations in the vayumandalam of a particular place become highly powerful, they touch the chaitanyam of mind of great purushas and with some wonderful methods, will attract them to that place.  

There is nothing to wonder in this. If impure mental vibrations accumulate in a particular place, they touch the mental chaitanyam of cruel people and attract them to that place in different strange methods. So a ‘sadhaka’ should live in a place of purity.  

He should also have purity of thought. He should make friendship with such people only. One should take money or food only from people having purity of money.  

Many people who thought themselves to be great pundits in Vedas and Vedangas (upanishats), could not get the grace of Sripada. Poorly read but having purity of mind could get great benefit from Him. 

 I went to Puri Jagannadha Kshetra in Orissa on business purpose. There I saw Sripada in place of Jagannadha. Three or four Sripada devotees were with me.  

He granted them the darshan of their “chosen Gods” and taught silently that He was the form of all Gods and Goddesses. 

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 3* 🌻

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇదే ఆరాధన విశేషం అంటే. అది ఈ‌ దేశంలోనే మొట్టమొదట పుట్టింది. 

నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగే దరిద్రం ఉన్నన్నాళ్ళు మంచిరోజులు ఏ ఒక్కడికి కూడా రావు. ప్రపంచానికి మనం ఏం చేయగలం? ప్రపంచశాంతి జరగాలంటే మన కృషి కూడా ఎంత చేయాల్సి ఉన్నది? అని ఆలోచించిన రోజున మనకు రోగాలు తగ్గుతాయి దారిద్ర్యం పోతుంది. 

దృష్టి అటు మారినపుడు సమస్తము మనలను వరిస్తుంది. మనకు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? అని దృష్టి ఉన్నంతసేపూ ఏనాడూ మంచిరోజులు రాలేదు. 

బ్రహ్మవిద్యను అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు, క్రమశిక్షణ పొందుతున్న వాళ్ళు చేస్తున్నవి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పవిత్రమైన మందిరం ఒకటి పెట్టుకొన్న పాశ్చాత్యులు కొన్ని వేల మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. రోజూ ఓంకారం, వేదాధ్యయనములు కూడా వినపడుతున్నవి. ఉదయం 6 నుండి 6.15 వరకు అనేకాశ్రమములలో "ఓం నమో భగవతే రామకృష్ణాయ" అను మంత్రం ఉచ్చరింపబడుతున్నది. 

రామకృష్ణ పరమహంస పేరు మనము ఎడాదికొకమాటన్నా, ఎప్పుడన్నా తలచుకొంటున్నామో తలచుకోమో తెలియదు. ప్రతినిత్యము మనం గమనించి చూచినట్లయితే వాళ్ళ ఆశ్రమాల్లో మనకు (వేదాధ్యయనాదులు) వినిపిస్తుంటాయి. 

స్వామి శివానందాశ్రమములు, స్వామి సచ్చిదానందాశ్రమములు, రామకృష్ణ మఠములు ఒక్క బ్రస్సెల్స్ నగరంలోనే సుమారు 700 ఆశ్రమాలు ఉన్నాయి. లండన్ లోను, ప్యారిస్ లోను, కొన్ని వందల ఆశ్రమాలు కలవు. 

ఇన్నింటిలోను ఉదయం 6 గంటలకు ఓంకారనాదం వినిపిస్తుంటుంది. భారత దేశంలోని ఎన్ని దేవాలయాల్లో మనం ఓంకార నాదం విపిస్తున్నాం? తప్పనిసరిగా సుప్రభాతాలు చేయాలి అనే దేవాలయాల్లో కూడా సుప్రభాతం టేప్ రికార్డింగ్ చేసి వినిపిస్తున్నాము‌ శనివారాల్లో రేడియోలో సుప్రభాతం వినిపిస్తుంటుంది‌. మనం ఇళ్ళలో ఎంతమందిమి చేసికొంటున్నాము. 

మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు..
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 71 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

ఫలకం సదాశివమయం
ప్రణౌమి సిన్దూర రేణు కిరణాభమ్ I
ఆరభ్యాఙ్గేశీనాం
సదనాత్ కలితఞ్చ తత్త్వసోపానమ్ II 153 II

పుష్పోపధాన గణ్డక
చతుష్టయ స్ఫురిత పాటలా స్తరణమ్ I
పర్యఙ్కోపరి ఘటితం
ప్రాతు చిరం హంస తూలికా శయనమ్ II 154 II

తస్యోపరి నివసన్తం
తారుణ్యశ్రీ నిషేవితం సతతమ్ I
ఆవృన్త ఫుల్ల హల్లక
మరీచికాపుఞ్జ మఞ్జుల చ్ఛాయమ్ II 155 II

సిన్దూర శోణ వసనం
శీతాంతు స్తబక చుమ్బిత కిరీటమ్ I
కస్తూరీ తిలక మనోహర
కుటిలాలక భరిత కుముదబన్ధు శిశుమ్ II 156 II

పూర్ణేన్దు బిమ్బవదనం
ఫుల్ల సరోజాత లోచన త్రితయమ్ I
తరళాపాఙ్గ తరఙ్గిత
స్మరాఙ్గనా శాస్త్ర సమ్ప్రదాయార్థమ్ II 157 II

మణిమయ కుణ్డల పుష్య
న్మరీచి కల్లోల మాంసల కపోలమ్ I
విద్రుమ సహోదరాధర
విసృమర స్మితకిశోర సఞ్చారమ్ II 158 II

ఆమోద కుసుమ శేఖర
మానీల భ్రూలతా యుగ మనోజ్ఞమ్ I
వీటీ సౌరభ వీచి
ద్విగుణిత వక్త్రారవిన్ద సౌరభ్యమ్ II 159 II

పాశాఙ్కు శేక్షు చాప
ప్రసవ శర స్ఫురిత కోమలకరాబ్జమ్ I
కాశ్మీర పఙ్కిలాఙ్గం
కామేశం మనసి కుర్మహే సతతమ్ II 160 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 50 / Dasarathi Satakam - 50 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 99వ పద్యము : 
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
ఉత్తముడే సత్యవాది. యుద్ధమున జంకని వాడే ధీరుడు. అర్ధిని వెనుకకు పంపనివాడే దాత మిమ్ము సేవించువాడే మంచి మనసుకలవాడు.

🌻. 100వ పద్యము : 
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
భ్రమర కీటక న్యాయమున నీ నామస్మరణ మమ్ముల పరమాత్మ స్వరూపునిగా జేయును. కీటకము చుట్టూ పరిభ్రమించి, భ్రమరము దానిని కూడా భ్రమరము చేయును. అట్లే నీ నామస్మరణ మా దుఃఖములనెడి అంధకారములను పారద్రోలును. 
భద్రాచల రామదాసు తన భక్త్యావేశముతో రాముని పరి పరి విధాల వేడు కొనటమే ఈ శతక ముఖ్యోద్దేశము. రామ నామ మాధుర్యము చేత రామా! రామా! అని ఎన్నిమార్లు ఉచ్చరించిననూ విసుగు కలగదు. తృప్తి కలగదు. ఆ నామమే తిరిగి తిరిగి పునశ్చరణ చెయుదమని రామదాసు ఉవాచ. ఆ రామనామ మాధుర్యమును ఎన్నో రకాలుగా కీర్తించినాడు.

సమాప్తం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 50 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 99th Poem : 
boMkanivADeyOgyuDari bRuMdamu lettina cOTajivvakuM 
jaMkanivADejOdu raBasaMbuna narthi karaMbusAcinaM 
goMkanivADedAta mimu golciBajiMcina vADepO nirA 
taMkamanasku Denna ganu dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
One who never tells lies is noble ; one who is fearless in battle field is a hero ; one who never refuses help to those seeking it is a benefactor. A person who worships you is rid of all Thapathrayas

🌻 100th Poem : 
BramaramugITakaMbu goni pAlpaDi JaMkaraNOpakAriyai 
BramaramugAnonarcunani palkuTa jEsi BavAdi duHKasaM 
tamanameDalci Baktisahi taMbuga jIvuni viSvarUpa ta 
ttvamunadhariMcu TEmarudu dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
People say that a honey bee (black carpenter) picks an insect, keeps it in its nest and teaches it jhunkara and the insect is transformed to a honey bee. If a honey bee can do it what is so surprising about you enlightening a person with spiritual knowledge and relieving him from suffering and pain?

The End 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 27 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 16

🌻 16. పూజాదిష్వనురాగ ఇతిపారాశర్యః - 1 🌻

            పరాశర మతం ప్రకారం, భక్తుడు మొదట పూజాది కర్మకాండలు జరుపగా జరుపగా, ఆ భగవత్సేవ ఒక నాటికి అనురాగంగా మారుతుంది. అట్టి అనురాగమే పరాభక్తి అవుతుంది.

            ఈ భక్తి ముందుగా కాయిక, వాచిక, మానసిక భక్తిగా మూడు విధాలు. ఇవి తామసిక, రాజసిక, సాత్విక భక్తిగా ఉంటాయి. కనుక దీనిని గౌణభక్తిగా పేర్కొంటారు. సహజమైన అనురాగం లేక భగవత్ప్రీతి కలిగాక ఈ గౌణభక్తి ముఖ్యభక్తిగా మారుతుంది. 

అప్పుడు పూజాది బాహ్యభక్తి క్రియలు వాటంతట అవే ఆగిపోయి కాయిక, వాచిక, మానసిక భక్తి అనేది హృదయపూర్వకమై నిరంతరంగా ఉండే సహజస్థితిని సంతరించు కుంటుంది.

            గౌణభక్తి కోరికలతో కూడినది కాకుండా నిష్కామంగా ఉండాలి. తన కోసంగా కాక భగవంతుని కోసంగా ఉండాలి. 

భగవంతుని ప్రేమించ కుండా ఉండలేని స్థితిలో ‘‘భక్తి కోసమే భక్తి’’గా ఉండాలి. అప్పుడు కాయిక, వాచిక భక్తి మానసిక భక్తిగా రూపాంతరం చెందుతుంది. 

చివరికి మానసిక భక్తి హృదయ పూర్వకంగా పరిణమిస్తుంది. హృదయ పూర్వకంగా మారిన భక్తితో కాయిక, వాచిక, మానసిక భక్తి క్రియలు వాటంతట అవే ఆగిపోతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. పంచకోశములు - ఆనందమయ కోశము 🌹 
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

ఆనందము అంటే అనంతము , పరిపూర్ణము అని అర్థము. అంతేకాని వర్ణనాతీతమైన సుఖము అని కాదు.
 
అనుభవములోనికి వచ్చు ఏ సుఖమైన ఒక మనో వృత్తి విశేషమే. మనో వృత్తుల వలన కలిగే సుఖమునే ఆనందము అని భ్రమిస్తున్నాము కాబట్టి ఆనందమయము కోశమైనది.
 
ప్రియము, మోదము, ప్రమోదము ఆనందమయ కోశ లక్షణములు. ఆనందములో కలుగు తారతమ్యములను బట్టి ఈ మూడుగా విభజించటమైనది.

 ప్రియము - ఇష్ట వస్తు సందర్శనము వలన కలుగు మనో వృత్తి
 మోదము - ఇష్ట వస్తు ప్రాప్తి వలన కలుగు మనో వృత్తి
ప్రమోదము- ఇష్ట వస్తును అనుభవించుట వలన కలుగు మనో వృత్తి  
 
జీవులకు అనుభవములోనికి వచ్చు ఆనందము పుణ్యకర్మ ఫలము
 
ఆనందమము ఇష్ట వస్తు ప్రాప్తి వలన కలుగు చున్నది. ఆ వస్తువు దూరమగుట వలన తొలగు చున్నది. అనగా వస్తువుపై ఆనందమము ఆధారపడి ఉన్నది. ఆత్మ స్వధారము. కనుక ఆనందమయ కోశము ఆత్మ కాదు.
 
వస్తువుల వలన కలుగు ఆనందమము కొంత సమయము మాత్రమే ఉంటున్నది. కాలబద్ధమైనది. ఆత్మ కాలబద్ధముకానిది. కనుక ఆనందమయ కోశము ఆత్మ కాదు.
 
ఈ విధముగా పంచకోశములను నిరసించిన పిదప ఏదైతే శేషించి ఉన్నదో ఆ సాక్షి చైతన్యమే ఆత్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 58 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 58 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

  🌸. పడవను రక్షించడం 🌸

      ఒకసారి ప్రభువు దర్బారులో గాదిపై కూర్చున్నపుడు అకస్మాత్తుగా రెండు చేతులు పైకి ఎత్తి కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జుబ్బా మాత్రమే ఉంది. ఏదో అజ్ఞాత వస్తువును చేతితో ఆధారం ఇవ్వడానికి అన్నట్లుగా కనిపించింది. ప్రభు ఇలా ఎందుకు చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవ్వరికీ కలుగలేదు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 

కొంత సమయం తరువాత ప్రభువు తన చేతులను క్రిందికి దించారు. అప్పుడు ప్రభు చేతిలో నుండి నీళ్ళు ధారాపాతంగా రాసాగాయి. శరీరంపై ఉన్న జుబ్బా పూర్తిగా తడిసిపోయింది. జనులకు ఇలా ఎందుకు జరిగిందో, ప్రభు ఇంత చెమటతో ఎందుకు తడిసిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు.

   ప్రభు శరీరంపై నుండి జుబ్బా తీసివేశారు. శిష్యులలో ఒకరు దానిని పిండగానే చాలా ఉప్పు నీరు వచ్చింది. కొద్దిమంది ఆ నీటిని రుచి చూసారు. వారు ప్రభువుతో, మహారాజా! నీరు సముద్రం నీటిలాగా ఉప్పగా ఉన్నాయన్నారు. కానీ ప్రభువు ఏమీ మాట్లాడలేదు.

   కొన్ని నెలలు తరువాత ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రభు దర్బార్ కు వచ్చారు. పూర్వం మొక్కుకున్న మొక్కు తీర్చడానికి అతను తీసుకువచ్చిన డబ్బును ప్రభువు ముందు గుమ్మరించారు. అప్పుడు పైన జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. 

లక్షలలో వ్యాపారం చేసే ఒక వ్యాపారి తన పడవలో లక్షల రూపాయల సరుకు నింపుకొని పోరుబందరు నుండి ముంబై వస్తుండగా అకస్మాత్తుగా గాలివాన మొదలై, పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ సంకట స్థితిలో తనకు ప్రమాదంతో పాటు నష్టం జరుగుతుందని భయపడి ఏం చేయాలో వ్యాపారికి తోచలేదు. పడవ మునిగిపోతే ప్రాణం పోయినట్లే. అపుడు దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టారు. 

ఇంతలో ఒక గృహస్థు, "హుమానాబాద్ మాణిక్ ప్రభువుకు మొక్కుకోండి. ప్రస్తుతం నడుస్తూ మాట్లాడే ప్రత్యక్షదైవం, భక్తకార్య కల్పద్రుమ బిరుదును కలిగిన వారు. వారు మాత్రమే ఈ సంకట స్థితి నుండి కాపాడగలరన్నారు." 

అది విని విశ్వాసంతో ప్రభువును తలుచుకొని మొక్కుకున్నారు. అలా తలుచుకోగానే ఇక్కడ ప్రభువుకు ఎవరో అర్ధిస్తున్నట్లుగా అనిపించింది. "అంతఃకరణ నుండి వచ్చిన తన భక్తుని పిలుపుకు ప్రభువు మనసు ద్రవించి కూర్చున్న దగ్గరే చేతులు పైకెత్తి పడవను మునగకుండా కాపాడారు."

    ప్రభువు ముందు రూపాయలు కట్టలుగా వేసి పూజ చేయడానికి ముందు, జరిగింది వివరించి, ప్రేమతో పూజ, ఆరతి చేశారు. మీరు మొక్కుకున్న పూర్తి ధనం ఉందా? అని ప్రభువు అడిగారు. వ్యాపారి గాబరా పడిపోయాడు. తక్కువ ఉన్నట్లు తెలుసుకొని ధనాన్ని భర్తీ చేసి సంతృప్తిగా ప్రభు పూజ చేశారు. లెక్క విషయంలో ప్రభువుకు ఎలా తెలిసిందో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది.

   ☘️. గమనిక ☘️

   పడవ మునిగిపోతుంటే, ఆ సమయంలో ప్రభువు పేరు చెప్పిన గృహస్థు ఒక ముసల్మాన్.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 58 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 15. Shri Siddharaj Manik Prabhu (1939 – 2009) - 4 🌻

He was a great mystic, which is evident from the Bhajans composed by him. 

 What he spoke was heard with attention because it came straight from his heart. He belonged to the tradition of Tukaram, Tulsidas, Kabir, Rohidas, whose every word speaks love and adoration of the Lord.  

His emphasis on Bhakti and Bhajans is because of the disinclination of the modern generation to philosophical learning.  

In one of the Bhajans composed by him he speaks of his great devotion to Shri Manik Prabhu Maharaj: When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? Who, verily, is That One, whose be that power, When he is your Self, why search for another. 

Why such thoughts should for me appear, When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? 

Pleasures, sorrows or the worldly woes, Of wealth or of the senses as they arose, Why should these thoughts make me morose, When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? 

By Yoga, by Shakti or Shakta austerities, By Mantras or Tantras or such entreaties, When I, in such Bliss, revel with uncertainties, When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? 

The Vedas, Upanishads, Shrutis and the Scriptures, All speak of One Lord, varied though be the scriptures, Why should I, in my Bliss, confuse my Lord in raptures, When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? 

Austerities may bring merit and also demerit, Having faith in my Teacher’s auspicious feet, Symbolised as Shri Siddha Sakalamat Seat, When Shri Prabhu Maharaj is near, Why need there be for me, any fear? 

His presence inspired such close affinity that many persons tended to be familiar with him, when they should have remained quiet and respectful.  

Often devotees played on his patience when his intention was to be compassionate and shed his love.  

His love for music made each one participant of the NaadBrahman and made each one forget himself and made each one feel that they were the closest to him.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 14 🌴

14. సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతా: |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||

🌷. తాత్పర్యం :
ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.

🌷. భాష్యము : 
సామాన్యమానవునికి అధికారికముగా ముద్రవేయుట ద్వారా మహాత్ముడు కాజాలడు. 

మహాత్ముని లక్షణములు ఇట వర్ణింపబడినవి. మాహాత్ముడైనవాడు సదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుట యందే నిమగ్నుడై యుండును. దానికి అన్యమైన కర్మ ఏదియును లేకుండా ఆ భక్తుడు కీర్తనమందే సదా నియుక్తుడై యుండును. అనగా అతడెన్నడును నిరాకారవాది కాడు. 

కీర్తనమను విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని పవిత్రనామమును, దివ్యరూపమును, దివ్యగుణములను, అసాధారణలీలలను కీర్తించుటకే ఉపయోగించవలెను. 

అవన్నియును ప్రతియోక్కరిచే కీర్తనీయములు కనుకనే మహాత్ముడైనవాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురక్తుడై యుండును.

శ్రీకృష్ణభగవానుని నిరాకారరూపమైన బ్రహ్మజ్యోతి యెడ అనురక్తుడై యుండెడివాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడినాడు. 

శ్రీమద్భాగవతమున తెలుపబడినట్లు మహాత్ముడైనవాడు విష్ణువు యొక్క శ్రవణ, కీర్తనములను కూడిన భక్తియుతసేవ యందు సదా నిమగ్నుడై యుండును. 

అతడు శ్రీకృష్ణభగవానుని సేవలోనే నిలుచునుగాని, దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు. ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి(శ్రవణం, కీర్తనం, విష్ణో: స్మరణం) యనబడును. 

దివ్యమైన ఐదు భక్తిరసములలో ఏదేని ఒక భక్తిరసము ద్వారా అంత్యమున అ భగవానునితో నిత్య సాహచార్యమును పొందవలెనని ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగయుండును. 

దాని యందు జయమును పొందుట అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటిని ఆ దేవదేవుని సేవ యందే నియోగించును. అదియే సంపూర్ణ కృష్ణభక్తిరస భావనమని పిలువబడుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 333 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 14 🌴

14 . satataṁ kīrtayanto māṁ
yatantaś ca dṛḍha-vratāḥ
namasyantaś ca māṁ bhaktyā
nitya-yuktā upāsate

🌷 Translation : 
Always chanting My glories, endeavoring with great determination, bowing down before Me, these great souls perpetually worship Me with devotion.

🌹 Purport :
The mahātmā cannot be manufactured by rubber-stamping an ordinary man. 

His symptoms are described here: a mahātmā is always engaged in chanting the glories of the Supreme Lord Kṛṣṇa, the Personality of Godhead. 

He has no other business. He is always engaged in the glorification of the Lord. In other words, he is not an impersonalist. 

When the question of glorification is there, one has to glorify the Supreme Lord, praising His holy name, His eternal form, His transcendental qualities and His uncommon pastimes. 

One has to glorify all these things; therefore a mahātmā is attached to the Supreme Personality of Godhead.

One who is attached to the impersonal feature of the Supreme Lord, the brahma-jyotir, is not described as mahātmā in the Bhagavad-gītā. He is described in a different way in the next verse. 

The mahātmā is always engaged in different activities of devotional service, as described in the Śrīmad-Bhāgavatam, hearing and chanting about Viṣṇu, not a demigod or human being. 

That is devotion: śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ and smaraṇam, remembering Him. Such a mahātmā has firm determination to achieve at the ultimate end the association of the Supreme Lord in any one of the five transcendental rasas. 

To achieve that success, he engages all activities – mental, bodily and vocal, everything – in the service of the Supreme Lord, Śrī Kṛṣṇa. That is called full Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 163 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ - 3 🌻

పునరాచమనం కృత్వా త్రివారం మంత్ర పూర్వకమ్‌ | ఏకం వాథ ప్రకుర్యాచ్చ గంగా బిందురితి బ్రువన్‌ || 23

అన్నోదకం తథా తత్ర శివపూజార్థ మహారేత్‌ | అన్యద్వస్తు చ యత్కించి ద్యథా శక్తి సమీపగమ్‌ || 24

కృత్వా స్థేయం చ తత్రైవ ధైర్యమాస్థాయ వై పునః | అర్ఘ్య పాత్రం తథా చైకం జలగంధాక్షతైర్యుతమ్‌ || 25

దక్షిణాంసే తథా స్థాప్యముప చారస్య క్లప్తయే | గురోశ్చ స్మరణం కృత్వా తదను జ్ఞామవాప్య చ || 26

సంకల్పం విధివత్‌ కృత్వా కామనాం చ నియుజ్య వై | పూజయేత్పరయా భక్త్యా శివం సపరివారకమ్‌ || 27

మరల మంత్రపూర్వకముగా మూడుసార్లుగాని, ఒకసారి గాని ఆచమనము చేయవలెను. తరువాత శివపూజ కొరకై జలమును గంగా నదిని స్మరించి (23) 

తీసుకురావలెను. మరియు పూజకు కావలసిన ఇతర వస్తువులను కూడా యథాశక్తిగా దగ్గర నుండి తెచ్చుకొనవలెను (24). 

తరువాత ఆసనము పై స్థిరముగా ధైర్యముతో కూర్చుండవలెను. తరువాత ఒక అర్ఘ్య పాత్రను జలముతో నింపి, గంధముతో అక్షతలతో అలంకరించి (25) 

కుడివైపున స్థాపించి, ఆ జలముతో ఉపచారమును చేయవలెను. గురువును స్మరించి, వారి అనుజ్ఞను పొంది (26) 

యథావిధిగా సంకల్పమును చేసి, మనస్సులోని కామనను కూడ ప్రకటించి, గొప్ప భక్తితో పరివారముతో గూడిన శివుని పూజించవలెను (27).

ముద్రామేకాం ప్రదర్శ్యైవ పూజయేద్విఘ్నహారకమ్‌ | సిందురాది పదార్థైశ్చ సిద్ధిబుద్ధి సమన్వితమ్‌ || 28

లక్ష లాభయుతం తత్ర పూజయిత్వా నమేత్పనః | చతుర్థ్యం తైర్నామపదైర్న మోంతైః ప్రణవాదిభిః || 29

క్షమాపై#్యనం తదా దేవం భ్రాత్రా చైవ సమన్వితమ్‌ | పూజయేత్పరయా భక్త్యా నమస్కుర్యాత్పునః పునః || 30

ద్వారపాలం సదా ద్వారి తిష్ఠంతం చ మహోదరమ్‌ | పూజయిత్వా తతః పశ్చాత్పూజయేద్గిరిజాం సతీమ్‌ || 31

ఒక ముద్రను ప్రదర్శించి, సిద్ధి బుద్ధులతో కూడిన విఘ్నేశ్వరుని సిందూరము మొదలగు పదార్ధములతో పూజించవలెను (28). 

లెక్కలేనన్ని లాభములను కలుగుజేయు విఘ్నేశ్వరుని, ఓం కారముతో ఆరంభ##మై చతుర్థీ విభక్తి కలిగి నమః తో అంతమయ్యే నామములతో పూజించి మరల నమస్కరించవలెను (29). 

కుమార స్వామితో కూడియున్న విఘ్నేశ్వరునికి అపరాధ క్షమాపణను ప్రకటించి, గొప్ప భక్తితో పూజించి అనేక పర్యాయములు నమస్కరించవలెను (30) 

ఎల్లవేళలా ద్వారమునందు నిలబడియుండు మహోదరుడను ద్వారపాలుని పూజించి, తరువాత గిరిజాదేవిని పూజించవలెను (31).

చందనైః కుంకుమైశ్చైవ ధూపైర్దీపై రనేకశః | నైవేద్యైర్వివిధైశ్చైవ పూజయిత్వా తతశ్శివమ్‌ || 32

నమస్కృత్య పునస్తత్ర గచ్ఛేచ్చ శివసన్నిధౌ | యది గేహే పార్థివీం వా హైమీం వా రాజతీం తథా || 33

ధాతుజన్యాం తథైవాన్యాం పారదాం వా ప్రకల్పయేత్‌ | నమస్కృత్య పునస్తాం చ పూజయేద్భక్తితత్పరః || 34

తస్యాం తు పూజితాయాం వై సర్వే స్యుః పూజితాస్తథా | స్థాపయేచ్చ మృదా లింగం విధాయ విధిపూర్వకమ్‌ || 35

తరువాత గంధములు, కుంకుమములు, ధూపములు, అనేక దీపములు, మరియు వివిధములైన నైవేద్యములతో శివుని పూజించవలెను (32). 

మరల శివునికి నమస్కరించి శివాలయమునకు వెళ్లవలెను. లేదా ఇంటియందు మట్టితో గాని, బంగారముతో గాని, వెండితో గాని (33), 

ఇతర ధాతువులతో గాని, లేదా పాదరసముతో గాని శివుని ప్రతిమను నిర్మించవలెను. ఆ ప్రతిమకు భక్తితో నమస్కరించి మరల పూజించవలెను (34). 

శివుని ప్రతిమను పూజించినచో దేవతలనందరినీ పూజించినట్లే యగును. మట్టితో యథావిధిగా లింగమును నిర్మించి స్థాపించవలెను (35).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. VEDA UPANISHAD SUKTHAM - 50 🌹
🌻 1. Annapurna Upanishad - 11 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-1. Has the Jivanmukta characteristic like the power to fly in space, etc? If so, great sage, it is not present in the perfected man (described above). 

IV-2. O Brahmin, a non-knower of the Self, still in bondage, achieves (the powers) to fly in space, etc., by virtue of (specific) substances, incantations, practices and potencies of time. 

IV-3. This is not the concern of the Self-knower. One having contentment in one's Self never hankers after (the phenomena of) nescience. 

IV-4. Whatever objects are present in the world are (held to be) of the stuff of nescience. How can the great Yogin, who has dispelled nescience, plunge into them? 

IV-5. Whichever confounded person or man of little understanding desires the group of Yogic powers achieves them, one by one, through set practices, instrumental to them. 

IV-6. Substances, incantations, actions applied at (the right) time, yield Yogic powers all right. None of them lifts man to the status of God.

IV-7. Only influenced by some desire does man work for miraculous powers. The perfect man, seeking nothing, can have no desire whatsoever. 

IV-8. When all desires dry up, O sage, the Self is won. How can the mindless (sage) desire miraculous powers?

 IV-9. The man liberated in life would feel no surprise were the sun to radiate cool light, the moon scorching rays or the fire to blaze downwards. 

IV-10. (The whole world) is superimposed on the supreme Reality, the Ground, as the snake is on the rope. No curiosity is aroused as regards these superimposed wonders.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 14
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారత వ్యాఖ్యానము - 6 🌻

పుత్రహీనాం ద్రౌపదీం తాం రుదన్తీమర్జున స్తతః | శిరోమణిం చ జగ్రాహ ఐషీకాస్త్రేణ తస్య చ. 22

పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషీకాస్త్రముచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.

అశ్వత్థామాస్త్రనిర్దగ్థం జీవయామాస వై హరిః | ఉత్తరాయాస్తతో గర్భం స పరీక్షిదభూన్నృపః . 23

శ్రీ కృష్ణుడు అశ్వత్థామాస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భన్ధశిశువు పరీక్షిన్మహారాజు ఆయెను.

కృతవర్మా కృపో ద్రౌణిస్త్రయోముక్తాన్తతో రణాత్‌ | పాణ్డావాః సాత్యకిః కృష్ణః సప్తముక్తా న చాపరే. 24

ఆ యుద్దమునుండి, కృతవర్మ కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.

స్త్రియశ్చార్తాః సమాశ్వాస్య భీమాద్యైః స యుధిష్ఠిరః | సంస్కృత్య ప్రహతాన్వీరాన్దత్తోదకధనాదికః 25

భీష్మాచ్ఛాన్తనవాచ్ఛ్రుత్వా ధర్మాన్‌ సర్వాంశ్చ శాన్తిదాన్‌ |

రాజధర్మాన్‌ మోక్షధర్మాన్‌ దానధర్మాన్నృపో7భవత్‌. 26

అశ్వమేధ దదౌ దానం బ్రహ్మణభ్యో7రి మర్దనః |

యుధిష్ఠిరుడు దుఃఖర్తాలైన స్త్రీలను ఓదార్చి, భీమాదినమేతుడై, మరణించిన వీరు లందరికిని ప్రేత సంస్కారములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారుడైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యెను. éశత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను.

శ్రుత్వార్జునాన్మౌసలేయం యాదవానాం చ సంక్షయమ్‌ | రాజ్యే పరీక్షితం స్థాప్య సానుజః స్వర్గమాప్తవాన్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ చతుర్దోశో7ధ్యాయః

ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును అర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తను రాజ్యాభిషిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను.

అగ్ని మహాపురణమునందు మహాభారతఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 40 🌹
Chapter 12 
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 The Force of the Whim - 2 🌻

The Reality i s infinite, and so also is Its shadow.  

Each drop therefore must ask itself the question, "Who Am I?" but an infinite number of times and its shadow must reply with false answers an infinite number of times.  

Because of this infinite number of questions and the infinite number of false answers, there is no chance for any drop to know itself as Ocean!  

Thus steps in the Avatar, and according to divine law, the Avatar works for the universe and he gives a push to every stage of consciousness in creation.  

It is b "Who Am I?" y his push that he makes it possible for the drops to get the real answer to the question, Only by understanding what this push is can the work of the Avatar be understood. His push is the chance each of us gets.  

We do not have a chance, yet he makes possible the impossible; but to make the impossible possible he must come age after age and work for each of us. 

In other words, at every advent each of us gets a push directly from him, and this push enables us to have a chance to realize him. 

The Avatar, in this manner, gives force to the whim within each drop, that force which was weakened because of the force of illusion. 

 But when the whim within the drop receives the renewed force of Reality, the drop again stirs with the Ocean. process of evolution and involution attains the right direction. 

Thus the entire Through the Avatar's efforts each drop gets a push, and when evolution and involution are again moving in the right direction, it is the culmination of the Avatar's work.  

This is his for the evolution of the universe, and awakening for mankind toward the realization of Reality.  

Manifestation is that time when Reality rules over the illusion illusion become feebl — e and the Voice of Reality becomes powerful.  

During the mani the forces of festation mankind starts paying heed to the Voice of Reality and the attractions of illusion become empty. 

A virus can penetrate through thick stone walls, and a virus can travel at the speed of three miles per second, or ten thousand, eight hundred miles per hour.  

A virus germ is a thousand times thicker than any sanskara, and therefore it is not impossible for the sanskaras to penetrate through rocks or stones. 

But this e xample of speed and fineness of sanskaric matter has only to do with physical matter and the physical body.  

To understand the release of yogayoga sanskaras and how one's own sanskaric nature receives these sanskaras of the Avatar, one must understand the n ature of the universal mind.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 49 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి-అహల్య - 2 🌻

రుద్రుడిని ‘స్తేనానం పతయే నమః’ , ‘కులుంచానాం పతయే నమః’ ఇత్యాది నామాలతో రుద్రం స్తుతిస్తుంది. 

అంటే, దుష్టస్వభావులైనటువంటి, లోకులను బాధలు పెట్టే వాళ్ళందరినీ కూడా ఈశ్వర స్వరూపంగా ధ్యానంచేసి, సమంత్రకంగా భావన చేస్తే, మనను బాధించేటటువంటి లక్షణం కలిగినవాళ్ళలో-ఆ బాధించే లక్షణంపోయి; ఐశ్వర్యం (ఈశ్వరతత్వం) అనే లక్షణము పుట్టి చక్కగా మన యందు మైత్రితో, సుహృద్భావంతో ప్రవర్తిస్తారు. 

మన సంఘంలో నాస్తికుడు, దుష్టుడు, పాషండుడు, విశ్వాసంలేని వాడు, క్రూరుడు, స్వార్థపరుడు, తీవ్ర ధనలోభం కలిగినవాడు, మ్లేఛ్ఛుడు మొదలైన సంఘవ్యతిరేక శక్తులు, ఇంకా ఈటువంటి ఇతరులెవరివలన మనం ఈ బాధలుపడుతున్నామో; భారతీయసంస్కృతి అంతా బాధపడుతోందో,వారందరిలో కూడా సాక్షిగా ఉన్న రుద్రభవానుడిని పైదృష్టితో మన రక్షణకై ప్రార్ధించాలి. 

ఒకడు సంఘానికి వ్యతిరేకంగా, మరొకడు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే సంఘవ్యతిరేకి అవుతాడు. ధర్మంలోఉండే సంఘానికి వ్యతిరేకశక్తి కాబట్టి, వాడు అందరినీ బాధిస్తాడు. 

పదకొండు రకాలయిన దుష్టులను గురించి చెప్పబడింది ఆ రుద్రమంత్రంలో. వాళ్ళందరినీ కూడా మనకు సుఖప్రదులుగా సుముఖులుగా ఈ సంఘంలో మార్చుకోవటమే మన ధ్యేయం. 

కాబట్టి అలాగ మనం ఆ భావనతో చేసేటట్లయితే అది సాధ్యమవుతుంది. (వసోర్ధారా మంత్రం చెపుతున్నంతసేపూ ధారగా ఎలాగ ఆజ్యంపోస్తామో, రుద్రనమకంలో కూడా అనువాదం చెబుతున్నంతసేపూ అలా ధారగాపోయటం ఒక పద్ధతి. 

చమకానికి వసోర్ధార అని కూడా పేరు. అసలు వసోర్ధారామంత్ర స్వరూపంగానే చమకమంతాకూడా ఉంది).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 55

219. మహాభోగా - 
గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.

220. మహైశ్వర్యా - 
విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.

221. మహావీర్యా - 
అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.

222. మహాబలా - 
అనంతమైన బలసంపన్నురాలు.

223. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.

224. మహాసిద్ధిః - 
అద్వితీయమైన సిద్ధి గలది.

225. మహాయోగేశ్వరేశ్వరీ - 
గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 25 🌻

219 ) Maha bhoga -   
She who enjoys great pleasures

220 ) Mahaiswarya -   
She who has great wealth

221 ) Maha veerya -   
She who has great valour

222 ) Maha bala -   
She who is very strong

223 ) Maha bhudhi -   
She who is very intelligent

224 ) Maha sidhi -   
She who has great super natural powers

225 ) Maha yogeswareswari -   
She who is goddess of great yogis.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 Seeds Of Consciousness - 115 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 DO NOT STRUGGLE WITH YOUR MEMORIES AND THOUGHTS.. 🌻

Q: How am I to think myself out when my thoughts come and go as they like. Their endless chatter distracts and exhausts me.

M: Watch your thoughts as you watch the street traffic. People come and go; you register without response. It may not be easy in the beginning, but with some practice you will find that your mind can function on many levels at the same time and you can be aware of them all.

It is only when you have a vested interest in any particular level, that your attention gets caught in it and you black out on other levels. Even then the work on the blacked out levels goes on, outside the field of consciousness.

Do not struggle with your memories and thoughts; try only to include in your field of attention the other, more important questions, like 'Who am l?' 'How did I happen to be born?' 'Whence this universe around me?'.

 'What is real and what is momentary?' No memory will persist, if you lose interest in it, it is the emotional link that perpetuates the bondage.

You are always seeking pleasure, avoiding pain, always after happiness and peace. Don't you see that it is your very search for happiness that makes you feel miserable? 

Try the other way: indifferent to pain and pleasure, neither asking, nor refusing, give all your attention to the level on which 'I am' is timelessly present.

Soon you will realise that peace and happiness are in your very nature and it is only seeking them through some particular channels, that disturbs. 

Avoid the disturbance, that is all. To seek there is no need; you would not seek what you already have. You yourself are God, the Supreme Reality.

To begin with, trust me, trust the Teacher. It enables you to make the first step -- and then your trust is justified by your own experience.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మనోశక్తి - Mind Power - 53 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 51:-- మూల చైతన్యం - 3 🌻 

7) రెండు జీవకణాల కలయికకు జీవరసాయనికశక్తి,ఆ కణాల ఆకర్షణ కు విద్యుదయస్కాంత
శక్తి ఈ ప్రక్రియ అంత జరగడానికి చైతన్య శక్తి అవసరం అవుతుంది.

8) ప్రతి క్షణం ఎన్నో జీవకణాలు మృతి చెంది ఎన్నో పడుతుంటాయి. మన దేహం క్షణం క్షణం మార్పు చెందుతుంటుంది.మన కళ్ళను పరిశీలిద్దాం. పోయిన సంవత్సరం ఉన్నట్లు ఈ సంవత్సరం ఉండదు, కాని పోయిన సంవత్సరం చూసిన దృశ్యాలు అనుభవాలు మాత్రం మన అంతర్ ప్రపంచంలో నిక్షిప్తమై ఉంటాయి. మన కంటిపాపతో చూసిన దృశ్యం కంటిపాపలో చైతన్య శక్తి ఉండడంవల్ల మనోశక్తి ద్వారా ఆత్మశక్తిలో record అవుతుంది.

9) ప్రతి జీవకణం వాటి విశిష్టత, ప్రత్యేకత ను కాపాడుకుంటూ నిలుపుకుంటుంటాయి. చైతన్య శక్తి ద్వారానే జీవకణాల మధ్య అనుసంధానం ఉంటుంది. ఈ జీవకణాల యొక్క సమిష్టి చైతన్య పరిణామం మన దేహం యొక్క చైతన్య పరిణామం గా మారుతుంది.

10) మృతి చెందిన జీవకణాల యొక్క information చైతన్యపరిణామం ఆత్మశక్తిలో record అవుతుంది. ఈ record అయిన information ని subconscious మైండ్ ద్వారా ప్రతిక్షణము తెలుకోగల సామర్ధ్యాన్ని కలిగివున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹