నిర్మల ధ్యానాలు - ఓషో - 226

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 226 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అస్తిత్వంలో లోభత్వం లేదు. అది నిరాటంకంగా యిస్తుంది. నువ్వు ఏది చేసినా అది నీకు తిరిగి జరుగుతుంది. వేలరెట్లుగా జరుగుతుంది. నీ దగ్గర ఏమి వుంటే అది యివ్వు. దానివల్ల నువ్వు ఏమీ లేనివాడివి కావు. నువ్వు సంపూర్ణుడవుతావు. 🍀

అస్తిత్వంలో లోభత్వం లేదు. అది నిరాటంకంగా యిస్తుంది. కానీ అది నువ్వు అప్పటికే యిస్తేనే యిస్తుంది. నువ్వు యిచ్చినదాన్ని పదింతలు చేస్తుంది. కాబట్టి ప్రతిదీ నీ మీద ఆధారపడి వుంది. నీకు ఆనందం కావాలంటే ప్రతి ఒక్కరిమీదా ఆనందాన్ని వర్షించు. ప్రతిదాని మీద పరవశాన్ని వర్షించు. ప్రేమ కావాలంటే ప్రేమించు. కోరుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. ఆచరించి చూడు. కార్యరూపానికి తీసుకురా.

అప్పుడు నీకు అద్భుతం జరుగుతుంది. నువ్వు ఏది చేసినా అది నీకు తిరిగి జరుగుతుంది. వేలరెట్లుగా జరుగుతుంది. నీ దగ్గర ఏమి వుంటే అది యివ్వు. దానివల్ల నువ్వు ఏమీ లేనివాడివి కావు. నువ్వు సంపూర్ణుడవుతావు. సంపన్నుడివి అవుతావు. అది నీ వూహకందదు. నువ్వు కలలో కూడా వూహించలేవు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

16 Aug 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 326 - 21. భారతదేశానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది / DAILY WISDOM - 326 - 21. India has the Blessing of God

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 326 / DAILY WISDOM - 326 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ

🌻 21. భారతదేశానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది 🌻

భారతదేశానికి దేవుని ఆశీర్వాదం ఉంది. ఇది ఇతర దేశాల లాగా తన ఉనికిని కోల్పోలేదు, అంత సులభంగా కోల్పోయేలా కనిపించట్లేదు. భారతదేశం తాను చేసిన ఒక్క తప్పిదం వల్ల కొన్ని శతాబ్దాల పాటు దాని స్వాతంత్య్రాన్ని కోల్పోయి నష్టపోయింది. ఇది భౌతిక ఉనికి యొక్క విలువను త్రుణీకరించి, కేవలం అభౌతిక ఉనికికి చాలా విలువను ఇవ్వడం వలన అంటే, భౌతిక కర్మానుచరణను త్యజించి భగవంతుని భౌతిక సృష్టిని కించపరచడం వల్ల, ప్రాపంచిక శక్తుల చేత దాడి చేయబడింది. అవి దాడి చేసినప్పుడు దేవుడు సహాయం చేయడానికి రాలేదు. ఎందుకంటే భారతదేశ ప్రజలు దేవుణ్ణి రెండు భాగాలుగా విభజించారు- సృష్టికర్త మరియు సృష్టి
దేశం ఆర్థికంగా, సైనికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా నష్టపోయింది.

కానీ, తన ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల సమగ్రమైన ఏకత్వ అవగాహన లేనప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల అచంచల శ్రద్ధ ఉన్నందువల్ల భారతదేశ ఆత్మ, తన రక్షణ కోసం తన దగ్గర చెప్పుకోదగ్గవి ఏమి లేనప్పటికీ , తన ఎదుగుదల కోసం తాపత్రయ పడుతూ, ఇంకా మనుగడలోనే ఉంది. భారతదేశంలోని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు అతీతమైన సృష్టికర్త యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రపంచాన్ని మరియు భగవంతుడిని సామరస్య స్థితిలోకి తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 DAILY WISDOM - 326 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻 21. India has the Blessing of God 🌻

India has the blessing of God, somehow. It has not died like other nations, and it does not appear that it is going to die easily. India has suffered due to one mistake that it has committed. It lost its independence for some centuries because it discredited the value of Earthly existence, and gave too much credit to a transcendental existence. That is, the love for God was not equally commensurate with the duty to the world, and so the worldly forces attacked, and God did not come to help because people segmented God Himself into two parts—the Creator and the created.

The country suffered economically, militarily, and even in its concept of spirituality. Yet, in its aspiration for the transcendent, though it was not conceived properly in an integral fashion (it was segmented because it was separated from the world's existence), the intensity of the longing for the transcendent was such that its soul is still surviving, though economically, and from the point of view of defense forces, it is not possessed of much that can be admired. Most of the religious people in India asserted the importance of the transcendent Creator, and it was not so easy to bring together into a state of harmony the world and God.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Aug 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 647 / Vishnu Sahasranama Contemplation - 647

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 647 / Vishnu Sahasranama Contemplation - 647🌹

🌻647. త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ🌻

ఓం త్రిలోకేశాయ నమః | ॐ त्रिलोकेशाय नमः | OM Trilokeśāya namaḥ

త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ

త్రయోలోకాస్తదాజ్ఞప్తా వర్తన్తే స్వేషు కర్మసు ।
ఇతి విష్ణుస్త్రిలోకేశ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

మూడు లోకములును ఆతనిచే ఆజ్ఞానింపబాడినవగుచు తమ తమ కృత్యముల యందు ప్రవర్తిల్లుచున్నవిగనుక మూడు లోకములకును ఆ విష్ణుదేవుడు ప్రభువు. త్రిలోకేశః.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::

సీ.పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయసోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మతే.సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూపకాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)

లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేద సంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములు గలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతము లేని వాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 647🌹

🌻647.Trilokeśaḥ🌻

OM Trilokeśāya namaḥ

त्रयोलोकास्तदाज्ञप्ता वर्तन्ते स्वेषु कर्मसु ।
इति विष्णुस्त्रिलोकेश इति सङ्कीर्त्यते बुधैः ॥

Trayolokāstadājñaptā vartante sveṣu karmasu,
Iti viṣṇustrilokeśa iti saṅkīrtyate budhaiḥ.

Subject to His command, the three worlds perform their respective actions because of which Viṣṇu is called the Lord of three worlds or Trilokeśaḥ.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::

सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24

Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.

My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

16 Aug 2022

శ్రీమద్భగవద్గీత - 248: 06వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 248: Chap. 06, Ver. 15

🌹. శ్రీమద్భగవద్గీత - 248 / Bhagavad-Gita - 248 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 15 🌴

15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస: |
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ||

🌷. తాత్పర్యం :

దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము మియమించుచు యోగియైన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును (కృష్ణధామమును) పొందును.

🌷. భాష్యము :

యోగాభ్యాసపు అంతిమలక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతికసౌక్యకరము పొందుట కొరకు గాక భౌతికస్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్యవృద్ధి చేసికొనుటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగుననే భౌతికస్థితి నుండి విరమణము మనుజుని “శూన్యము” నందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై యున్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనునది లేదు. వాస్తవమునాకు భౌతికస్థితి నుండి ముక్తి మనుజిని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మికజగము నందు యాని లోకములు కూడా భౌతికాకాశము నందలి సూర్యుని వలె స్వయంప్రకాశమానములై యుండును. సృష్టియంతయు భగవద్రాజ్యమేయైనను, ఆధ్యాత్మికాకాశము మరియు దాని యందలి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును.

కృష్ణుని గూర్చిన సంపూర్ణజ్ఞానమును కలిగిన పూర్ణయోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి (మచ్చిత్త:, మత్పర:, మత్స్థానం) నిజమైన శాంతిని పొంది, అంత్యమున గోలోకబృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. “గోలోక ఏవ నివసిలాత్మభూత: శ్రీకృష్ణుభగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను, తన దివ్యశక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవహృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు” అని బ్రహ్మసంహిత (5.37) తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణభగవానుని సంపూర్ణావగాహనము మరియు అతని సంపూర్ణాంశయైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజగత్తునందు గాని (వైకుంటాము) లేదా భగవద్ధామమునందు గాని (గోలోకబృందావనము) ప్రవేశింపలేరు.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 248 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 15 🌴

15. yuñjann evaṁ sadātmānaṁ yogī niyata-mānasaḥ
śāntiṁ nirvāṇa-paramāṁ mat-saṁsthām adhigacchati

🌷 Translation :

Thus practicing constant control of the body, mind and activities, the mystic transcendentalist, his mind regulated, attains to the kingdom of God [or the abode of Kṛṣṇa] by cessation of material existence.

🌹 Purport :

The ultimate goal in practicing yoga is now clearly explained. Yoga practice is not meant for attaining any kind of material facility; it is to enable the cessation of all material existence. One who seeks an improvement in health or aspires after material perfection is no yogī according to Bhagavad-gītā. Nor does cessation of material existence entail one’s entering into “the void,” which is only a myth. There is no void anywhere within the creation of the Lord. Rather, the cessation of material existence enables one to enter into the spiritual sky, the abode of the Lord. The abode of the Lord is also clearly described in the Bhagavad-gītā as that place where there is no need of sun, moon or electricity. All the planets in the spiritual kingdom are self-illuminated like the sun in the material sky. The kingdom of God is everywhere, but the spiritual sky and the planets thereof are called paraṁ dhāma, or superior abodes.

A consummate yogī, who is perfect in understanding Lord Kṛṣṇa, as is clearly stated herein by the Lord Himself (mat-cittaḥ, mat-paraḥ, mat-sthānam), can attain real peace and can ultimately reach His supreme abode, Kṛṣṇaloka, known as Goloka Vṛndāvana. In the Brahma-saṁhitā (5.37) it is clearly stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: the Lord, although residing always in His abode called Goloka, is the all-pervading Brahman and the localized Paramātmā as well by dint of His superior spiritual energies. No one can reach the spiritual sky (Vaikuṇṭha) or enter into the Lord’s eternal abode (Goloka Vṛndāvana) without the proper understanding of Kṛṣṇa and His plenary expansion Viṣṇu.

🌹 🌹 🌹 🌹 🌹

మేరా భారత్ మహాన్ - Mera Bharat Mahan - The Great India

మేరా భారత్ మహాన్ - Mera Bharat Mahan - The Great India

16 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹16, AUGUST ఆగస్టు 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగపంచమి, Nag Pancham (Gujarat)🌻

🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 5 🍀

8. రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : కాళీ ఉపాసన ద్వారా భగవత్సాక్షాత్కారం - నిన్ను చంపే వాని యందు, నీవు చంపవలసి వచ్చేవాని యందు ఆ మరణ సమయంలో సైతం భగవత్సాక్షాత్కారమే నీవు పొందగలిగి వుండాలి. అదే పరమమైన దివ్యజ్ఞానసిద్ధి. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ పంచమి 20:19:17 వరకు

తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: రేవతి 21:08:21 వరకు

తదుపరి అశ్విని

యోగం: శూల 21:48:55 వరకు

తదుపరి దండ

కరణం: కౌలవ 08:36:12 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 08:31:37 - 09:22:26

రాహు కాలం: 15:30:50 - 17:06:06

గుళిక కాలం: 12:20:17 - 13:55:33

యమ గండం: 09:09:44 - 10:45:00

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: -

సూర్యోదయం: 05:59:10

సూర్యాస్తమయం: 18:41:23

చంద్రోదయం: 22:00:48

చంద్రాస్తమయం: 09:53:28

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మీనం

శుభ యోగం - కార్య జయం 21:08:21

వరకు తదుపరి అమృత యోగం -

కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 16 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

 🌹 16 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, మంగళవారం, ఆగస్టు 2022 భౌమ వాసరే  Tuesday 🌹
2) 🌹 కపిల గీత - 56 / Kapila Gita - 56 🌹 సృష్టి తత్వము - 12
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 95 / Agni Maha Purana - 95 🌹
4) 🌹. శివ మహా పురాణము - 611 / Siva Maha Purana -611 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 230 / Osho Daily Meditations - 230 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹16, AUGUST ఆగస్టు 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ మంగళవారం, Tuesday,  భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు  :  నాగపంచమి, Nag Pancham (Gujarat)🌻*

*🍀. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - 5 🍀*

*8. రంభావనవిహారాయ గంధమాదనవాసినే |*
*సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కాళీ ఉపాసన ద్వారా భగవత్సాక్షాత్కారం - నిన్ను చంపే వాని యందు, నీవు చంపవలసి వచ్చేవాని యందు ఆ  మరణ సమయంలో సైతం భగవత్సాక్షాత్కారమే నీవు పొందగలిగి వుండాలి. అదే పరమమైన దివ్యజ్ఞానసిద్ధి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ పంచమి 20:19:17 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: రేవతి 21:08:21 వరకు
తదుపరి అశ్విని
యోగం: శూల 21:48:55 వరకు
తదుపరి దండ
కరణం: కౌలవ 08:36:12 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:31:37 - 09:22:26
రాహు కాలం: 15:30:50 - 17:06:06
గుళిక కాలం: 12:20:17 - 13:55:33
యమ గండం: 09:09:44 - 10:45:00
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: -
సూర్యోదయం: 05:59:10
సూర్యాస్తమయం: 18:41:23
చంద్రోదయం: 22:00:48
చంద్రాస్తమయం: 09:53:28
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
శుభ యోగం - కార్య జయం 21:08:21
వరకు తదుపరి అమృత యోగం -
కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 248 / Bhagavad-Gita -  248 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 15 🌴*

*15. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస: |*
*శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి ||*

🌷. తాత్పర్యం :
*దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము మియమించుచు యోగియైన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును (కృష్ణధామమును) పొందును.*

🌷. భాష్యము :
యోగాభ్యాసపు అంతిమలక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసము ఎటువంటి భౌతికసౌక్యకరము పొందుట కొరకు గాక భౌతికస్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్యవృద్ధి చేసికొనుటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగుననే భౌతికస్థితి నుండి విరమణము మనుజుని “శూన్యము” నందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యయై యున్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమనునది లేదు. వాస్తవమునాకు భౌతికస్థితి నుండి ముక్తి మనుజిని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామమునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరము లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మికజగము నందు యాని లోకములు కూడా భౌతికాకాశము నందలి సూర్యుని వలె స్వయంప్రకాశమానములై యుండును. సృష్టియంతయు భగవద్రాజ్యమేయైనను, ఆధ్యాత్మికాకాశము మరియు దాని యందలి లోకములు మాత్రము పరంధామమని పిలువబడును.

కృష్ణుని గూర్చిన సంపూర్ణజ్ఞానమును కలిగిన పూర్ణయోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి (మచ్చిత్త:, మత్పర:, మత్స్థానం) నిజమైన శాంతిని పొంది, అంత్యమున గోలోకబృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకమును చేరగలడు. “గోలోక ఏవ నివసిలాత్మభూత: శ్రీకృష్ణుభగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించియున్నను, తన దివ్యశక్తులచే సర్వత్రా వ్యాపించియున్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవహృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు” అని బ్రహ్మసంహిత (5.37) తెలియజేయుచున్నది. అట్టి శ్రీకృష్ణభగవానుని సంపూర్ణావగాహనము మరియు అతని సంపూర్ణాంశయైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవ్వరును ఆధ్యాత్మికజగత్తునందు గాని (వైకుంటాము) లేదా భగవద్ధామమునందు గాని (గోలోకబృందావనము) ప్రవేశింపలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 232 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 15 🌴*

*15. yuñjann evaṁ sadātmānaṁ yogī niyata-mānasaḥ*
*śāntiṁ nirvāṇa-paramāṁ mat-saṁsthām adhigacchati*

🌷 Translation :
*Thus practicing constant control of the body, mind and activities, the mystic transcendentalist, his mind regulated, attains to the kingdom of God [or the abode of Kṛṣṇa] by cessation of material existence.*

🌹 Purport :
The ultimate goal in practicing yoga is now clearly explained. Yoga practice is not meant for attaining any kind of material facility; it is to enable the cessation of all material existence. One who seeks an improvement in health or aspires after material perfection is no yogī according to Bhagavad-gītā. Nor does cessation of material existence entail one’s entering into “the void,” which is only a myth. There is no void anywhere within the creation of the Lord. Rather, the cessation of material existence enables one to enter into the spiritual sky, the abode of the Lord. The abode of the Lord is also clearly described in the Bhagavad-gītā as that place where there is no need of sun, moon or electricity. All the planets in the spiritual kingdom are self-illuminated like the sun in the material sky. The kingdom of God is everywhere, but the spiritual sky and the planets thereof are called paraṁ dhāma, or superior abodes.

A consummate yogī, who is perfect in understanding Lord Kṛṣṇa, as is clearly stated herein by the Lord Himself (mat-cittaḥ, mat-paraḥ, mat-sthānam), can attain real peace and can ultimately reach His supreme abode, Kṛṣṇaloka, known as Goloka Vṛndāvana. In the Brahma-saṁhitā (5.37) it is clearly stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: the Lord, although residing always in His abode called Goloka, is the all-pervading Brahman and the localized Paramātmā as well by dint of His superior spiritual energies. No one can reach the spiritual sky (Vaikuṇṭha) or enter into the Lord’s eternal abode (Goloka Vṛndāvana) without the proper understanding of Kṛṣṇa and His plenary expansion Viṣṇu.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 647 / Vishnu  Sahasranama Contemplation - 647🌹*

*🌻647. త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ🌻*

*ఓం త్రిలోకేశాయ నమః | ॐ त्रिलोकेशाय नमः | OM Trilokeśāya namaḥ*

త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ

*త్రయోలోకాస్తదాజ్ఞప్తా వర్తన్తే స్వేషు కర్మసు ।*
*ఇతి విష్ణుస్త్రిలోకేశ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥*

*మూడు లోకములును ఆతనిచే ఆజ్ఞానింపబాడినవగుచు తమ తమ కృత్యముల యందు ప్రవర్తిల్లుచున్నవిగనుక మూడు లోకములకును ఆ విష్ణుదేవుడు ప్రభువు. త్రిలోకేశః.*

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ.పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయసోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మతే.సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూపకాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)

*లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేద సంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములు గలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతము లేని వాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 647🌹*

*🌻647.Trilokeśaḥ🌻*

*OM Trilokeśāya namaḥ*

त्रयोलोकास्तदाज्ञप्ता वर्तन्ते स्वेषु कर्मसु ।
इति विष्णुस्त्रिलोकेश इति सङ्कीर्त्यते बुधैः ॥

*Trayolokāstadājñaptā vartante sveṣu karmasu,*
*Iti viṣṇustrilokeśa iti saṅkīrtyate budhaiḥ.*

*Subject to His command, the three worlds perform their respective actions because of which Viṣṇu is called the Lord of three worlds or Trilokeśaḥ.*

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.

My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 326 / DAILY WISDOM - 326 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 21. భారతదేశానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది 🌻*

*భారతదేశానికి దేవుని ఆశీర్వాదం ఉంది. ఇది ఇతర దేశాల లాగా తన ఉనికిని కోల్పోలేదు, అంత సులభంగా కోల్పోయేలా కనిపించట్లేదు. భారతదేశం తాను చేసిన ఒక్క తప్పిదం వల్ల కొన్ని శతాబ్దాల పాటు దాని స్వాతంత్య్రాన్ని కోల్పోయి నష్టపోయింది. ఇది భౌతిక ఉనికి యొక్క విలువను త్రుణీకరించి, కేవలం అభౌతిక ఉనికికి చాలా విలువను ఇవ్వడం వలన అంటే, భౌతిక కర్మానుచరణను త్యజించి భగవంతుని భౌతిక సృష్టిని కించపరచడం వల్ల, ప్రాపంచిక శక్తుల చేత దాడి చేయబడింది. అవి దాడి చేసినప్పుడు  దేవుడు సహాయం చేయడానికి రాలేదు.  ఎందుకంటే భారతదేశ ప్రజలు దేవుణ్ణి రెండు భాగాలుగా విభజించారు- సృష్టికర్త మరియు సృష్టి*

*దేశం ఆర్థికంగా, సైనికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా నష్టపోయింది.
కానీ, తన ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల సమగ్రమైన ఏకత్వ అవగాహన లేనప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల అచంచల శ్రద్ధ ఉన్నందువల్ల భారతదేశ ఆత్మ, తన రక్షణ కోసం తన దగ్గర చెప్పుకోదగ్గవి ఏమి లేనప్పటికీ , తన ఎదుగుదల కోసం తాపత్రయ పడుతూ, ఇంకా మనుగడలోనే ఉంది. భారతదేశంలోని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు అతీతమైన సృష్టికర్త యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రపంచాన్ని మరియు భగవంతుడిని సామరస్య స్థితిలోకి తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 326 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 21. India has the Blessing of God 🌻*

*India has the blessing of God, somehow. It has not died like other nations, and it does not appear that it is going to die easily. India has suffered due to one mistake that it has committed. It lost its independence for some centuries because it discredited the value of Earthly existence, and gave too much credit to a transcendental existence. That is, the love for God was not equally commensurate with the duty to the world, and so the worldly forces attacked, and God did not come to help because people segmented God Himself into two parts—the Creator and the created.*

*The country suffered economically, militarily, and even in its concept of spirituality. Yet, in its aspiration for the transcendent, though it was not conceived properly in an integral fashion (it was segmented because it was separated from the world's existence), the intensity of the longing for the transcendent was such that its soul is still surviving, though economically, and from the point of view of defense forces, it is not possessed of much that can be admired. Most of the religious people in India asserted the importance of the transcendent Creator, and it was not so easy to bring together into a state of harmony the world and God.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 226 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  అస్తిత్వంలో లోభత్వం లేదు. అది నిరాటంకంగా యిస్తుంది. నువ్వు ఏది చేసినా అది నీకు తిరిగి జరుగుతుంది. వేలరెట్లుగా జరుగుతుంది. నీ దగ్గర ఏమి వుంటే అది యివ్వు. దానివల్ల నువ్వు ఏమీ లేనివాడివి కావు. నువ్వు సంపూర్ణుడవుతావు. 🍀*

*అస్తిత్వంలో లోభత్వం లేదు. అది నిరాటంకంగా యిస్తుంది. కానీ అది నువ్వు అప్పటికే యిస్తేనే యిస్తుంది. నువ్వు యిచ్చినదాన్ని పదింతలు చేస్తుంది. కాబట్టి ప్రతిదీ నీ మీద ఆధారపడి వుంది. నీకు ఆనందం కావాలంటే ప్రతి ఒక్కరిమీదా ఆనందాన్ని వర్షించు. ప్రతిదాని మీద పరవశాన్ని వర్షించు. ప్రేమ కావాలంటే ప్రేమించు. కోరుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. ఆచరించి చూడు. కార్యరూపానికి తీసుకురా.*

*అప్పుడు నీకు అద్భుతం జరుగుతుంది. నువ్వు ఏది చేసినా అది నీకు తిరిగి జరుగుతుంది. వేలరెట్లుగా జరుగుతుంది. నీ దగ్గర ఏమి వుంటే అది యివ్వు. దానివల్ల నువ్వు ఏమీ లేనివాడివి కావు. నువ్వు సంపూర్ణుడవుతావు. సంపన్నుడివి అవుతావు. అది నీ వూహకందదు. నువ్వు కలలో కూడా  వూహించలేవు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹