🅼🅴🆂🆂🅰🅶🅴🆂 🅵🆁🅾🅼 1 🆃🅾 61 . . . 🅲🅾🅼🅸🅽🅶 🆂🅾🅾🅽
𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮𝓼 𝓯𝓻𝓸𝓶 1 𝓽𝓸 61 . . . 𝓒𝓸𝓶𝓲𝓷𝓰 𝓢𝓸𝓸𝓷 . . .
------------------------------------ x ------------------------------------

🌹. నారద భక్తి సూత్రాలు - 62 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 36
🌻. 36. అవ్యావృత భజనాత్ ॥ - 2 🌻
చైతన్యప్రభు మతం ప్రకారం శ్రీకృష్ణ సంకీర్తనం వలన సర్వోత్కృష్టమైన ఆత్మానందం కలుగుతుంది. ఒక్కసారి ఆత్మానందానుభూతి కలిగితే
(1) అద్దం పై ధూళి తుడిచినట్లు చిత్త మాలిన్యం తుడిచి వేయబడుతుంది.
(2) ప్రాపంచిక విషయ భోగవాంఛలు చల్లారిపోతాయి.
(3) శుభప్రదమైన భక్తిపుష్ప వికసన జరిగి భగవదనుగ్రహం పొందుతాడు.
(4) భగవంతుడిని తెలుసుకొని భాగవతుడవుతాడు.
(5) ఆనంద సాగరంలో తేలియాడుతాడు.
(6) భక్తుడు పలికె ప్రతి పదం అమృతాన్ని పంచి పెడుతుంది.
(7) సకల జీవాత్మల శుద్ధి జరుగుతుంది.
(8) అది అద్వితీయ, నిరతిశయ ఆనందమే.
(9) సాధనయందు విజయాన్ని
చెకూరుస్తుంది. ఫలితంగా భక్తి ప్రతిష్టతమవుతుంది..
హృదయపూర్వక సంకిర్తనలో మైమరచిన వాడికి అలసట ఉండదు.
మానసికాన్ని దాటే వరకే ఆవృత భజన అవసరమవుతుంది. భక్తి సాధన ఏ ఒక్కటైనా సరె దానికది ఉత్తమ ఫలితాన్నిస్తుంది. అయితే చిత్త శుద్ధితో ప్రయత్నం చేస్తేనే అది ఫలిస్తుంది.
ఆ వృత్తిః అసకృ దుపదెశాత్
- బ్రహ్మ సూత్రం
అనగా సాధనను పదే పదే చేయమని బోధిస్తుంది. దీనినె భగవద్దీత అభ్యాస యోగం అంటుంది. పదె పదే చెసి అలవాటు చేసుకొని, సహజం చెసుకొంటే అదే అభ్యాస యోగమవుతుంది. అనగా భక్తిని శీలించడం అని కూడా అంటారు.
శ్రీమత్ భాగవతాన్ని పరీక్షిన్మహారాజు శ్రీశుకుని వద్ద నిరంతర శ్రవణం చేయడం వలన ముక్తుడయ్యాడు. నిరంతర భగవన్నామ సంకిర్తన వలన తుంబురుడు, తెంపులిని నారాయణ నామ స్మరణ వలన నారదుడు ముక్తులయ్యారు.. విడువకుండా విష్ణుపాద సేవనం వలన లక్ష్మిదేవి ఆయనతో సాయుజ్యం పొందింది..
పృథు చక్రవర్తి అర్చన చెస్తూ చేస్తూ శివైక్కత పొందాడు. నిరంతర వందనం వలన ఆక్రూరుడు, దాస్య భక్తివలన హనుమంతుడు, సఖ్యంచేత అర్జునుడు, ఉద్ధవుడు మోక్షమందిరి. వీరందరూ ఏదో ఒక సాధన నిర్విరామంగా జరపడం వలన సహజ భక్తులైరి. తుదకు ముక్తి పొందారు.
మనమైతే ఏదో ఒక సాధన చెసి తరించడం కష్టం గనుక అన్ని మార్తాలను ప్రయత్నం చెస్తూ కొన్నింటిని ఆవృతం చేసుకుంటే మంచిది. కించిత్ విరామం ఇస్తే అథోగతేనని ఈ సూత్రం హెచ్చరిస్తున్నది.
న్వాధ్యాయా ద్యోగమాసీత యోగా త్స్వాధ్యాయమావ సేత్
స్వాధ్యాయ యోగ సంపత్వా పరమాత్మ ప్రకాశతే |
-విష్టు పురాణం
తాః స్వాధ్యాయం, పవిత్ర గ్రంథాలను పఠించడం, యోగం, సమాధానం, ధ్యానం, మయొదలగునవి నిరంతరం చెస్తూ రాగా, పరమాత్మ దర్శనమౌతుంది..
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11.Aug.2020
------------------------------------ x ------------------------------------

🌹. నారద భక్తి సూత్రాలు - 63 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 37
🌻. 37. లోకేశపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ॥ - 1 🌻
లోకంలో ఉన్నంత వరకు నిత్య కర్మలు, నైముత్తిక కర్మలు ఉంటూనే ఉంటాయి కదా! ఉద్యోగ, వ్యాపార , వ్యవసాయ, వృత్తి ఏదో ఒకటి ఉంటుంది కదా! .గృహస్తాశమంలో చేయవలసిన విధ్యుక్త ధర్మాలుంటాయి కదా! ఇక నిర్విరామ భజన ఏ విధంగా కుదురుతుంది? నిజమే, ప్రారంభంలో కాయిక, వాచిక భజనలకు పై చెప్పిన కర్మలు, వృత్తులు ఆటంక పరుస్తాయి.
ఎప్పుడైతే భక్తి మానసికంగా మారుతుందో అప్పుడు ఏ పని చేస్తున్నా మనసులో భగవత్ చింతన మానవలసిన అవసరం లేదు. పనులు లేనప్పుడు కాయిక, వాచిక భజనలు సలుపుతూ, పనులలో ఉన్నప్పుడు మానసిక భజన చేయాలి. అప్పుడే అది నిర్విరామ సాధన అవుతుంది.
చేయవలసిన పనులు కర్షానుసారంగా భగవంతుని గుర్తు తెచ్చెవిగా వచ్చాయని భావించాలే గాని, ఫలితాన్ని ఆశించి పనులు చేయకూడదు. కర్మ ఫలితం మనసుకు పడితే మానసిక భక్తి కుదరదు. చేసే పనుల ఫలితాన్ని భగవదర్పణ చేస్తే మనసు భక్తి నుండి జారిపోదు.
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై
యారంభించి పరిత్యజించి రురువివ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
వ్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
తా: ప్రారబ్దం వల్ల వచ్చిన వానిని లెక్క చేయక వాటిని భగవత్ చింతనతో ఆచరిస్తూ, ముక్తి పథానికి మెట్లుగా భావించి ఉత్సాహంతో, ప్రశాంతంగా భగవత్సాక్షాత్మారం పొందేందుకు సమాయత్తమవుతారు నిజమైన సాధకులు. నీచ మానవులైతే విఘ్నాలు కలుగుతాయని అనేక శంకలతో అసలు ప్రారంభించరు.
చిత్తం కాసేపైనా వృత్తి శూన్యంగా ఉండలేదు. పదె పదే విషయ చింతన చేస్తూనె ఉంటుంది. అందువలన చిత్తాన్ని భగవంతుని మిద లగ్నం చెస్తే అది విషయాకారానికి బదులుగా భగవదాకారం పొందుతుంది.
చిత్తాన్ని భగవంతుని కల్యాణగుణ కీర్తన, మొదలగు భక్తి ప్రక్రియలలో నిరంతరం ఉంచితే అది భగవదాకారం పొందుతుంది. కాని చిత్తం భగవంతునిమీద నిలబడాలంటే రజోగుణం ఉన్న వారివల్ల కాదు.
సత్వగుణం, సదాచారం, సత్మర్మాచరణ, అనువ్వన పద్దతిలో భగవంతుని సేవించడం వంటివి ఉంటే శుభవాసనలు ఎర్పడతాయి. అశుభ వాసనలున్న వారికి భక్తిలో ఏకాగ్రత నిలువదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
------------------------------------ x ------------------------------------

🌹. నారద భక్తి సూత్రాలు - 64 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 37
🌻. 37. లోకేశపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ॥ - 2 🌻
సత్మర్మలనగా దానధర్మాలు, వ్రతాలు, క్రతువులు, జపతవాలు, నవవిధ బాహ్య భక్తి మార్గాలు అవలంటంచుట మొదలైనవి. ఇవన్నీ నేరుగా ముక్తినీయవు గానీ, శుభ వాసనలు కలిగి, రజోగుణం తగ్గి ఏకాగ్రత నిలుస్తుంది. సుకృతం ఎర్పడుతుంది.
మంత్ర, మంత్రార్దాలు తెలియక, తత్త్వచింతన చేయక పై చెప్పబడిన నియమాలు లేకుండా చేసే జపం, వగైరాలు గంధపు చెక్కలు మోసే గాడిద జ్ఞానంతో సమానం అని నిరుక్తం తెలియజేస్తున్నది.
మంత్రానికి శబ్దం ప్రాణం కాదు. మంత్రార్జ జ్ఞానం మంత్రోత్తిషతత్వ విశేషమే ప్రాణం. భజన ఎట్టిదైనా భావస్ఫురణ ప్రధానం. భాష ముఖ్యం కాదు. భావశుద్ధి ప్రధానం. జపం వలన భగవంతుని కల్యాణ గుణ విశేషాలు భక్తి సాధనలో భాగంగా సాధకునిలో వృద్ధి చెందుతాయి.
ధ్వ్యేయమైన భగవంతుడెలాగో ధ్వాతయైన భక్తుదూ అలాగే. కాబట్ట కల్యాణ గుణాలనే ఆశ్రయించి సాత్విక పద్ధతిని స్వీకరించాలి. భగవంతుని విభూతులు ఐదు విధాలు.
అవి పర, వ్యూహ, విభవ, హార్ద, అర్పా అని చెపారు. గురువులు కూడా భగవద్విభూతులే గనుక వారిని ధ్యేయ మూర్తులుగా స్వీకరించవచ్చును అని శ్వేతాశ్వతరోపనిషత్తు తెలియజేస్తున్నది. పరబ్రహ్మమునే ఆశ్రయించవలెనని నారద, పరాశర బోధ.
కావున అవతారులను, ఆచార్యులను ధ్యేయంగా స్వీకరించవచ్చు. కాని వారిని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన భగవంతునిగా భావించాలి. ఇంద్రియ గోచరం కాని భగవంతుని, అతడి కల్యాణ గుణాలతో ధ్యానించాలి.
అప్పుదు ధ్యాత ధ్యేయం అనే భేదం హరించిపోయి పరాభక్తి సిద్ధిస్తుంది. ఈ సతృ్మర్మలనగా తీర్థాటనలు, క్రతువులు, వ్రతాలు, దానాలు. వీటి వలన శుభ వాసనలు ఏర్పడి, సుకృతం కలుగుతుంది. దాని వలన భగవదనుగ్రహం పొందుతాం. ఆ స్థితిలో సత్కర్మలు నివ్మామంగా జరిగి, చివరకు ఆగిపోతాయి.
క్రతువులు, తీర్ధాగమములు
వ్రతములు, దానములు సేయవలెనా లక్ష్మి పతీ ! మిము దలచిన వారికి
నతులిత పుణ్యములు గలుగుటదా కృష్ణా |
శ్రీకృష్ణునిపై భక్తి కుదిరితే, ఇంకే సత్కర్మలు చేయనవసరం లేదని చెప్తున్నారు. అనగా నిజమైన భక్తికి భగవంతుడు తప్పక చిక్కుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
13.Aug.2020

🌹. నారద భక్తి సూత్రాలు - 65 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
ప్రథమాధ్యాయం - సూత్రము - 37
🌻. 37. లోకేశపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ ॥ - 3 🌻
ప్రహ్లదుడేమన్నాడో చూడండి.
చిక్కడు వ్రతముల గ్రతువుల జిక్కడు దానముల శౌచ శీల తపములం జిక్కడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండి !
మిత్రులారా ! వ్రతాల ద్వారాగాని, క్రతువుల ద్వారాగాని, దానాల వల్లగాని, శౌచ క్రియలు, సచ్చిలం వలన గాని, తవాల వల్లగాని, యుక్తితో గూడిన తర్మ వితర్మాల వలన గాని శ్రీహరి చిక్కడు. ఒకవేళ ఈ విధమైన వాటివలన అతి కష్టంతో చిక్కినా, చిక్కవచ్చునేమో! కాని భక్తి వలన చిక్కినంత సులభంగా మాత్రం ఏ ఇతర సాధనల వలన దొరకడు.
శ్రీహరిని చిక్కించుకోవాలంటే మానసిక భక్తియ నష్టం. బ్రాహ్మణత్వం వలన గాని, విద్యాప్రక్రియల వలన గాని, దెవతల దివ్యత్వంచే గాని, యోగుల ప్రశాంత సాధనలు మొదలైన వాటిచే శ్రీహరిని దొరక పుచ్చుకోవడానికి సరిపోవు.
ఆ శ్రీహరి కేవలం భక్త సులభుడు. భగవత్కళ్యాణ గుణాలను చింతన చేయడం, పలకడం సంకీర్తనమైతే, నామావళిని పఠించడం పారాయణ, ప్రణవ జపం, ఇతర మంత్ర జపాలు కూడా సంకీర్తనలోనే చేరుతాయి.
మననాత్ త్రాణనాచ్చెవ మద్రూపస్యావ బోధనాత్ ।
మంత్ర మిత్యుచ్యతే బ్రహ్మన్ మదధిష్టానతోపివా ॥
-యాజ్ఞవల్క్యోపనిషత్
మనన శక్తి వలన భగవత్తత్త్వం బోధ పడుతుంది. త్రాణశక్తి (ప్రాణ+మనః +బుద్ది) వలన భగవత్సాక్షాత్మారం కలుగుతుంది. కావున మంత్రం భగవన్నిలయం.
వచసా తజ్జపే నిత్యం వపుషా తత్సమభ్యసేత్
మననా తజ్జపే నిత్యం తత్పరం జ్యోతిరోమితి
శుచిర్వాప్య శుచిర్వాపియో జపెత్ ప్రణవం సదా
న సలిష్యతి పాపేన పద్మపత్ర మివాంభసా ॥|
-యోగ చూడామణ్యుపనిషత్
వచసా, మనసా జపం చెయడానికి అందరూ అర్హులే. దీనికి ఏ నియమం లేదు. మానసిక జపంచేత స్వరూపతత్త్వం బోధపడది, పరం జ్యోతిరూప భగవద్దర్శనం కలుగుతుంది.
ప్రణవ జపం భక్తుడిని ఎల్లప్పుడూ బురద అంటని తామర పూవువల స్వచ్చంగా ఉంచుతుంది. సహజంగా ఉంచి, భక్తుదిని భగవత్మెంకర్యానికి తయారు చేస్తుంది. జప యజ్ఞానికి గురూపదేశం అవసరం లేదు. అశుచి దోషముండదు అని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది.
యత్రైకా గ్రతా తత్ర విశేషాత్ !
-బ్రహ్మ సూత్రాలు
ఎక్కడ నిలిపితే బుద్ధి ఏకాగ్రత చెందుతుందో, ఆ చోట జపయజ్ఞం చెసి మనోలయం నాధించమంటున్నది. మానసిక జప స్థితికి చెరుకునెవారు మనో నిరోధం చేసుకోవాలి.
ఇంకను శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, అనిర్వేెదం మొదలగునవి వాటించి సిద్ధిని బడయాలి. ఏటిని పాటించడం వలన భక్తి వృద్ధి అవుతుంది. కార్య విఘ్నాలు హరిస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
------------------------------------ x ------------------------------------

🌹. నారద భక్తి సూత్రాలు - ⑥⑥ 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 38
🌻 38. ముఖ్య తస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశాత్ వా ॥ - 1 🌻
ఈ పరాభక్తికి మహాత్ముల, లేక భగవంతుని అనుగ్రహం కొంచెమైనా ఉండాలి.
ముఖ్యభక్తి సాధనకు ఫలంగా వచ్చి అవకాశముంది. ఎక్కడికక్కడ దైవాను గ్రహం కూడా ఉంటుంది. అయినా పరాభక్తిలో నిలవాలంటే మాత్రం భగవంతుని అనుగ్రహం తప్పనిసరి.
మహాత్ములు కూడా దైవ స్వరూపులె గనుక, మహాత్ముల అనుగ్రహం కూడా దైవానుగ్రహంతో సమానం. పరాభక్తిలో నిలవాలంటే మానవునికి స్వయం శక్తి చాలదు. ఎంత తీవ్ర సాధన జరిగినా, అదంతా అహంకారాదుల అద్దు తొలగించుకొనె వరక. పరాభక్తి సాధ్య వస్తువు కాదు. అది సిద్ద వస్తువు, దానికదే ఫలరూపం.
జ్ఞాన మార్దంలో కూడా ఇదే విధంగా పరాభక్తికి బదులు అపరోక్ష జ్ఞానమంటారు. దీనికి గురు కృప తప్పదంటారు. భక్తి మార్గంలో గురువు అనే పదానికి బదులుగా భాగవతోత్తముదని గాని, ఆచార్యుడని గాని అంటారు. ఇట్టివారు దొరికితే, వారికి సేవ చేసి వారి అనుగ్రహం పొందాలి.
శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఇలా చెప్పాడు. “మానవులకు భగవదున్ముఖత్వం స్వయంగా కలగాలి. అంతదాకా వేచి ఉండి అట్టి వారిని అనుగ్రహిస్తాను. కనుక సాధన వలన భగవదున్ముఖత్వం కలిగితే అట్టి వారిని, వారి సాధన చరమ దశలో భగవంతుడు అనుగ్రహిస్తాడు. తనలో ఐక్య పరచుకుంటాడు.
ఎలాగైతే ఇనుము తుప్పు పోగానే అయస్కాంతం ఆ ఇనుమును ఆకర్షిస్తుందో అంతవరకు తుప్పు వలన అయస్కాంతపు ఆకర్షణ శక్తికి ప్రభావం చెందలెదో, అదె విధంగా భక్తుని చిత్త మాలిన్యం తొలగే దాకా వేచిఉండి మాలిన్యం పోగానే భగవంతుడు భక్తుడిని తనలోకి ఆకర్షించుకొని ఐక్యత సిద్ధింపచేస్తాడు.
భగవదనుగ్రహం సర్వసామాన్యంగా సంసిద్ధమైన భక్తులందరికి అందుబాటులోనె ఉంటుంది. చిత్త మాలిన్యమే అనుగ్రహానికి ఆటంకం. భక్తుల లౌకికమైన అశుభ వాసనలు క్షయమైన వెంటనే, వారు భగవదున్మ్నుఖు అవుతారు. అంతవరకు సాధనలు జరుగుతూనే ఉందాలి.
భక్తులు వారి విషయాలతో కూడిన మనసును వారి మనసుతోనే సాధన చేసి పోగొట్టుకోవాలి. అలాగే జీవుడుగా ఉన్న నేనులో అహంకారాదులను పోగొట్టుకొనే సాధన ఆ నెనే చేయాలి. మనసు పోవడమంటే అది నిర్విియ మవడం. నెను జీవభావం నుండి విడుదలై వేరై ఉంటుంది.
ఇంకా నిర్విషయ మనసు, జీవభావం పోయిన నెను మిగిలే ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించ డానికి భగవదనుగ్రహం కావలసి ఉన్నది. ఈ చరమ దశలో భక్తుడికి సాధనా శక్తి చాలదు. అందువలన చరమ దశలో భగవదనుగ్రహం కొంచెమైనా కావలసి ఉంటుందని ఈ సూత్రం చెప్పన్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15.Aug.2020

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 38
🌻 38. ముఖ్య తస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశాత్ వా ॥ - 2 🌻
మహాత్ములు, లేక గురువులు, లేక భాగవతోత్తముల లక్షణాన్ని ఇలా తెలియచేస్తున్నారు.
సిద్ధం సత్సంప్రదాయె స్థిర ధియ మనఘం
శోత్రియం బ్రహ్మనిష్టం ! సత్వస్థం
సత్యవాచం సమయ నియతాయ
సాధువృత్యా సమేతమ్ ।
దంభాసూయాది ముక్తం జిత విషయగణం దిర్ణబంధుం దయాళుం న్థాలిత్య శాసితారం
స్వపరహిత పరం దేశికం భూష్టు రీప్పేత్ |
అజ్ఞాన ధ్వాంతరోదాదఘ పరిహరణా దాత్మ సామ్యవహత్వాత్ ।
జన్మ ప్రధ్వంసి జన్మ ప్రదగిరి మతయా దివ్య దృష్టి ప్రభావాత్ |
నిష్ప్రత్యూహా నృశంస్యా దనియతర సతయా నిత్య శేషిత్వ
యోగాదాచార్యః సద్భిర ప్రత్యుపకరణ
ధియా దేవవత్ న్వాదువాస్యః
-వేదాంత దేశికులు
తా : (1) ఎవరు సకల భూతాలను ఆత్మ సమంగా చూస్తారో
(2) ఆ భూతాల వలన తమకు బాధ వాటిల్లినా ద్వేషింపక వాటి పట్ల మైత్రినే నెరపుతారో
(3) ఎవరు సకల భూతాలకు అభయ ప్రదానం ఇసారో
(4) ఎవరికి దెహాభిమానం సైతం జనించదో
(5) ఎవరు తమకు ఇంత (దివ్య) ప్రభావం ఉందని అహంకరించరో
(6) ఎవరు సుఖ దుఃఖాలను సమంగా భావిసారో
(7) తిట్టనా కొట్టినా ఎవరు వికారం చెందరో
(8) ఎవరు తమ శరిర పోషణార్ధమై ఆహారాదులు లఖంచినప్పుడు ఎలాగో లభించనప్పుడు కూడా అలాగే సంతుష్టులై ఉంటారో
(9) ఎవరు సమాహిత చిత్తులై శరిరెంద్రియాలను తమ వశంలో ఉంచుకుంటారో
(10) ఎవరు కర్తృ భోక్త్షృ భావాలకు దూరమై తాము సత్‌చిదానంద అద్వితీయ బ్రహ్మమనే దృఢాభివప్రాయం కలిగి, కుతర్కాలకు, వితండ వాదనలకు చలించరో
(11) ఎవరు తమ అంతఃకరణాన్ని శుద్ధ నిర్దుణ బ్రహ్మానికి సమర్చించినట్టి జీవనం కలిగి ఇచ్చా నిర్ణయాలు లేక ఉంటారో
(12) ఎవరు శుద్ధ అక్షర బ్రహ్మావెత్తలవుతారో
(13) ఎవరి వలన లోకానికి కించిత్తు భయం కలుగదో
(14) ఎవరు అద్వైత ధర్ములై పరమ కారుణ్యమూర్తులై, క్షమాశీలురై ఉండటంచేత లోకులు కల్పించే బాధలకు చలించరో
(15) ఎవరికి క్రియా లాభాలకు ఉప్పొంగడం, పరోత్కర్షకు ఓర్వలేకుండటం, క్రూర జంతువుల జూచి భయపడటం ఉండదో సర్వ పరిగ్రహ శూన్యంగా, ఎకాకిగా విజన ప్రదేశంలో ఉండుటకు ఎవరు వ్యాకులపడరో, ఎవరు భోగాలను ఆకాంక్షించరో, ఒక వేళ భోగాలు యాదృచ్చికంగా కలిగినా అపేక్షించరో
(16) బాహ్వాభ్యంతర శౌచవంతులై కర్తవ్యాలను ఎరిగి నిర్వహించే సామర్థ్యం కలిగి పక్షవాత బుద్ధి లేకుండా ఎంత వ్యధనైనా ఎవరు ఓర్చుకుంటారో
(17) ఐహిక ఆముష్మిక ఫలకాంక్ష లేక, శుభాశుభాల రెంటిని పరిత్యజించి సర్వద్వంద్వ సహిష్షువులై మౌనవ్రతం పాటించి నియతి, నివాసం లేక పరమాత్మకు భక్తులై ఉంటారో వారు మహాత్ములనబడతారు.
= భగవద్గీత, భాగవతం, వివేక చూడామణి
ఇట్టి వారిని ఆశ్రయించి భగవత్కపను పొందాలి. ఒక్కరా, పలువురా అనె సందేహం అవసరం లెదు.
పై గుణాలను మాత్రం ఎవరివద్ద ఉంటే వారినుండి గ్రహించి పరిపూర్ణతను పొందడం ప్రధానం. ఏక గురుత్వమున్నను, ఇతరుల వద్దనుండి జ్ఞాన సముపార్జనను నిరాకరించడం మూర్ఖత్వమే అవుతుంది. గురుజన నిరాదరణ భగవన్నిరాదరణే అవుతుంది.
నైకస్మాత్ గురోర్ జ్ఞానం సుస్థిరం న్యాత్ పుష్క్మలమ్ ॥
-భాగవతం, ఏకాదశ స్కంధం
బోధను వినగానే అనుష్టించరాదు. శాస్త్ర సమ్మతమైనదో, కాదో తెలుసుకోవాలి. ఆచార్య సంప్రదాయమో, కాదో విచారించాలి అని యోగ కుండల్యుపనిషత్ తెలియచేస్తున్నది.
కుల, గోత్ర, జాతి, లింగ, వయో భేదాలను పాటించక బ్రహ్మనిష్టను, పరమాత్నానుభూతిని పరిగణించి ఆశ్రయించి సద్గతి పొందాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 39
🌻. 39. మహత్పంగస్తు దుర్లభోః_ గమ్యో_ అమోఘశ్చ ॥ 🌻
మహాత్ముల సాంగత్యం దొరకడమనెది దుర్లభం, అగమ్యం, అమోఘం కూడా. మహాత్ములను సాధారణ మానవులుగా భావించడం జరుగుతుంది. వారు దొరకడమే కష్టం. దొరికినా గుర్తించలేరు. ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు. బాలురవలె క్రీడిస్తారు. పిచ్చివారివలె ప్రవర్తిస్తారు. పిశాచివలె సంచరిస్తారు. భక్తుల పుణ్య విశేషం చెతగాని దొరకరు,గుర్తించబడరు. కాని వారు కోరకనె అనుగ్రహిస్తారు, ఉపదేశిస్తారు. అయితే భక్తుడు దానికి అర్హుదై సంసిద్ధుడై ఉండాలి. వారి చేష్టలు అగమ్య గోచరంగా ఉంటాయి. వారు అనుగ్రహించి విధానం అమోఘం.
మహాత్ములకు న్వార్ధపూరిత మనసు ఉండదు. దైవ ప్రేరణతో పని చెసే మనసుంటుంది. ఆ దివ్యమైన మనసు అదృష్టవంతులైన భక్తులను అనుగ్రహించడం వంటి పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. మహాత్ముడు భగవంతుని నుండి ప్రసరించె అనుగ్రహాన్ని అర్హత కలిగిన భక్తులపైకి ప్రతిఫలింపచెస్తూ ఉంటాడు.
ఉదాహరణకు ఒక ఉపగ్రహం (శాటిలైట్ గా పనిచెస్తూ ఉంటాడు. కొందరు మహాత్ములు భక్తులకు పరీక్షలు పెట్టి తద్వారా పురోగమింపచేస్తారు. భక్తులను పరాభక్తికి సంసిద్దులను చేసారు. కాని వారి అనుగ్రహం భక్తులయెడ పక్షపాతంతో కూడి ఉండదు. భక్తులలో గౌణభక్తి స్థానంలో మఖ్యభక్తి కలిగే స్థాయిని బట్టీ మహాత్ముల సహాయం అందుతూ ఉంటుంది.
వారి కృపకు వాత్రులవక పోవడమనెది భక్తులలోనె లోపముండవచ్చును గాని, మహాత్ముల అనుగ్రహం ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది. సంసిద్ధమైన భక్తులను మహాత్ములు వెతుక్కుంటూ వచ్చి వారిని పరాభక్తిలో నిలుపుతారు. ఈ సంఘటన అమోఘం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
తృతీయాధ్యాయము - సూత్రము - 40
🌻 40. . లభ్యతే౬పి తత్కృపయైవ ॥ 🌻
మహాత్ముల సందర్శనం ఎంత దుర్లభమైనా గాని, భగవదను గ్రహానికి పాత్రులైన భక్తులకది అప్రయత్నంగానె లభిస్తుంది.
పరిపక్వమైన శుద్ధ మనస్కుల చెంతకు భగవానుడు స్వయంగా మహాత్ములను నడిపిస్తాడు. మహాత్ములు వారంతట వారు ఏమీ చేయరు.
భగవంతుని ప్రేరణతోనె వారు చేస్తారు. భగవంతుని ప్రేరణ ఎలా ఉంటుందంటే అంతర్యామి శక్తి మహాత్ములలో పనిచేయడం ద్వారా భక్తునికి మహాత్ముని యొక్క సాంగత్యం లభిస్తుంది.
భక్తుడి సుకృతం వల్ల, భక్తిలో పరిపక్వత వల్ల, అంతర్యామి శక్తివల్ల ఈ అద్భుతం జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ #సద్గురువిజ్ఞానస్వరూప్

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 1 🌻
భగవంతునికి భక్తునికి భేదం లేదు. జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది. ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె..
ఆవరణలెని భగవత్తత్త్వం ఆవరణ కలిగిన భగవత్తత్త్వాన్ని సహజంగాను, నిరంతరంగాను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆవరించబబడ్డ భగవత్తత్త్వమే జీవాహంకారంగా వ్యక్తమైంది. ఆవరణ ఉన్నంతసేపు భగవంతుని ఆకర్షణకు లోబడనేరదు.
జీవాహంకారాన్ని భక్తిసాధన చేత తొలగించుకుంటూ పోతూ భగవంతుడితో అనుష్టాన పూర్వకంగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ పోతే, భగవత్తత్త్వ ఆకర్షణకు అనుకూలత ఏర్పడుతుంది. సాధన చరమాంకంలో భగవదైక్యం లభిస్తుంది.
చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు
పలుకులు హరిగుణ పఠరనమంద
కరములు విష్ణు మందిర మార్దనములంద
చెవులు మాధవకథా శ్రవణ మంద
చూపులు గోవిందరూప వీక్షణ మంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వర గేహ పరిసర్పణములంద
కామంబు చక్రి కైంకర్యమంద
-భాగవతం, అంబరీషోపాఖ్యానం
జీవుడు తన ఇంద్రియాలను, విషయాల మీదికి పోనీయకుండా పై విధంగా భగవత్తత్త్వమందే నిలుపుట చేత జీవుడు కైంకర్య పద్ధతిగా లేకుండా పోయి భగవత్తత్త్వమే మిగులుతుంది. దీనిని భగవదైక్యమని అంటారు.
దీనిలో అన్వయ సాధన, వ్యతిరేక సాధన కనబడుతున్నది. అన్వయ మంటే భగవంతునికి దగ్గరగా జరగడానికి చేసే సాధన.
వ్యతిరేక సాధన అంటే, భగవంతుడిని చెరడానికి అడ్డుగానున్న ఆటంకాలను తొలగించు కోవడం అనగా విరోధంగా ఉండే వాటిని త్యజించడం, కొత్తగా ఆటంకాలు రాకుండా చూసుకోవడం కూడా. ఇటువంటి సాధనకు ఉపాయాలున్నాయి. కొన్ని ఉపాయాలు విశిష్టాద్వైత మతంలో ఇలా చెప్పబడ్డాయి.
భగవంతునికి ఐదు స్వరూపాలున్నాయి.
1. జీవ స్వరూపం :
ఇది జీవాహంకార రూప ఆవరణ కలిగినది.
2, పర స్వరూపం :
ఇది వ్యాపకంగా ఉంది అన్ని లోకాలలో వ్యూహ రూపంగా, భూలోకంలో వివిధ అవతారాల రూపంగా, అంతర్వామిగా, అర్చావతారంగా ఉందే స్వరూపం.
3. ఉపాయ స్వరూపం :
దీనిని అన్వయ సాధనగా వివరించబోతున్నాం.
4. విరోధ స్వరూపం :
దీనిని వ్యతిరేకాన్ని తొలగించుకోవడానికి వివరించ బోతున్నాం.
5. పురుషార్థ స్వరూపం :
జీవుడు భగవంతుని చేరుకోవడానికి ముందస్తుగా ధర్మార్ధ కామాలను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకొని కైవల్యం, లేక పరమపదం పొందే స్వరూపం.
ఈ ఐదింటిని అర్ధ పంచక నిర్ణయమని పేర్కొని, మరింత స్పష్టంగా వివరిస్తారు విశిష్టాద్వైతులు. ముందుగా విరోధ స్వరూపాన్ని వివరించి తరువాత ఉపాయ స్వరూపాన్ని వివరించుకుందాం. ఏటిని విశిష్టాద్వైత పద్ధతి అని గుర్తెరిగి గ్రహిద్దాం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 2 🌻
🌻. విరోధ స్వరూపం :
1) స్వరూప విరోధి :
శరీరమే జీవుడనే భావన. అన్య దేవతా దాస్యం (శ్రీ హరిని కాదని) భగవంతుడెంత గొప్పవాడైతే నాకేమి ? అని, భగవంతుడితో నాకేమి ప్రయోజనం ? అని ఉదాసీన భావన.
2) పరత్వ విరోధి :
శ్రీమన్నారాయణుని తక్కువగా చూడడం, శివ కేశవులు సమానమనడం, అవతార పురుషులను మానవ మాత్రులనుకొనడం, అర్వ్సావతారాలను (ప్రతిమలను, శిలాతామములనుకొని వాటిని భగవంతునిగా (గ్రహించకపోవటం, హరి సర్వోత్తముదని భావించక నిరాకరించడం.
3) పురుషార్ధ విరోధి :
4) మోక్షం కోరకపోవటం :
భగవత్రైంకర్యం ముఖ్య పురుషార్ధమని తలపకపోవటం, శాస్ర్తీయ పద్ధతిని విడచి తనకిష్టమైన పద్ధతిని పాటించడం, కైంకర్యంలో లోపం, మొదలగునవి.
5) ఉపాయ విరోధి :
పురుషోత్తమునియందు ప్రపత్తి చేసితిని గాని, అంత మాత్రం చెతనే మోక్షం లభించునా ? అని సంశయం, నిరుత్సాహపడడం, నావంటి పాపాత్ముడిని ప్రభువు క్షమించునా? అని భయపడడం భగవంతుడు మాత్రమె సిద్దాపాయమనె విశ్వాసం లేకపోవటం.
6) ప్రాప్తి విరోధి :
భగవంతుని యెడల తెలియక చేసిన, తెలిసి చేసిన అపచారాలు, రహస్యంగా చేసిన అపచారాలు, అలాగే భాగవోత్తముల యెడల చేసిన అపచారాలు భగవత్రాప్తిక విరోధాలు. ఈ ఐదింటిని తొలగించుకొంటె భగవంతునికి దూరంగా జరుగం. ఇక దగ్గరగా జరిగే ఉపాయాలు చెప్తున్నారు.
🌻. ఉపాయ స్వరూపం :
1) కర్మ :
వ్రతాలు, దాన ధర్మాలు, యాగ హోమాలు, తపస్సు, స్వాధ్యాయం, తీర్ధాటనం మొదలగు సత్మర్మలను నిష్కామంగా, నిస్వార్ధంగా అమితమైన భక్తి ప్రపత్తులతో చెయాలి. తీర్ధ యాత్రలు వినోద విహార యాత్రలుగా చేయరాదు.
2) జ్ఞానం ;
జ్ఞానం వలన యోగం, యోగ బలంచే వాసుదేవని హృదయ కమలమందు సాక్షాత్మరింప జేసికొని ధ్యానించడం.
3) భక్తి :
సర్వదేశ, సర్వకాలాల్లో సర్వావస్ధల్లో తైలధారవలె తెంపు లేకుండా భగవంతుని యెడల స్మృతి కలిగి సేవించడం. సాంసారిక, ప్రాపంచిక విషయాలందు ప్రీతిని వదలి, భగవంతునియందు ప్రేమ కలిగి ఉండడం. చిత్తం మాధవుని యందు చేర్చి, పురుషోత్తమునితో ఏకీకృత మవడం.
4) ప్రపత్తి :
కర్మ జ్ఞానాదులందు శక్తిని ఉపయోగించలేనివారు దేహాన్ని ఆత్మను రక్షించే భారం శియఃపతి యందుంచడం, తదీయ గుణానుభవాలను భగవత్షైంకర్యం చేసి ఉండటం.
5) ఆచార్యాభిమానం :
జ్ఞానానువాన పరాయణుని ఆశ్రయించి, నిరంతరం ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయన కృపకు పాత్రుడవటం (శబరి మాత శ్రీరాముని ఆశ్రయించినట్ట్లు.)
ఈ విధంగా భక్తులు ఈ ఐదు ఉపాయాల వలన భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇవిగాక, భక్త ప్రహ్లాదుని ఉపాయాన్ని చూడండి. ఇది సర్వుల యెడ భేద భావం హరిస్తున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 3 🌻
సీ, తనయందు నఫీల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి జేరి నమస్కృతుల్ చేయువాడు
కన్ను దోయికి నన్యకాంతలడ్డంబైన
మాతృ భావము సేసి మరలువాడు
తలి దండ్రుల భంగి ధర్మ వత్సలతను
దీనుల గాన జింతించువాడు
తే. సఖుల యెడ సోదర స్థితి జరుపువాడు
దైెవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుదైన ప్రహ్లాదు డధిప!
తా ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తనవంటివెనని, వాని యందు సమ దృష్టి కలిగి, ఉండెను. పెద్దల యెడల దాసుని వలె వినయశీలుడయ్యెను.
పరస్త్రీల యెడల మాతృభావం కలిగి, అడ్డు తొలగేవాడు. దీనులను తల్లిదండ్రులను చూచినట్లు చూచి, ధర్మ బుద్ధితో ఆదరించేవాడు. సాటి మిత్రులతో సోదరభావంతో మెలగేవాడు. గురువులను దైవ సమానులుగా జూచి, సేవించెవాడు. హాస్వానికైనా అబద్దాలాదెవాడు కాదు. ఈ ప్రహ్లాదుడు ఇటువంటి సత్వగుణ సంపన్నుడు. ఇట్టి ఉపాయం తప్పక భగవదనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది.
ఎల్ల శరీరధారులకు నిల్లను చీంకటి నూతిలోపలం
ద్రైళ్ళక వీరు నే మను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవ
ర్తిలక సర్వము న్నతని దివ్య కళామయ మంచు విష్ణునం
దుల్లముం జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ ॥
-భాగవతం
ఈ విధంగా అద్వితీయ ఆత్మ భావనను బోధిస్తున్నాడు. సర్వమందున్న వాడు, దివ్య కళామయుడు అయిన విష్ణువు గురించి తెలియ జేస్తున్నాడు ఆ ప్రహ్లదుడు.
అజ్ఞల్ కొందరు మెము తామనుచు మాయంజెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాల్బ దురన్వయ క్రమములన్ భాషింపగా నెర రా
జిజ్ఞానా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తురే ॥
-భాగవతం
భగవత్తత్తాన్ని కేవలం తెలివితో, వాదంతో తెలుసుకొనడం అసాధ్యం. అలాగైతే వేదవెత్తలైన బ్రహ్మాది దెవతలు ఆ పురుషోత్తముని గ్రహించె వారే కదా! కాని ఆ తత్త్వం దేవతలకు కూడా అందనిది.
ఇక రాక్షస స్వభావంగల వారెట్లు దర్శించగలరు? అయితే నావంటి భక్తుల చిత్తం కరిగి హృషికేశుని సన్నిధిలో కలుస్తున్నది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత వాన విశేషమత్తమైన భక్తునికి, భగవంతునికంటె అన్యత లెదు. అనన్యమెనని నిశ్చయం. ఈ విధంగా ప్రహ్లాదుడు తన తండ్రికి బోధించెను. ఇంకను ఇట్లు పలికెను.
కలడంబోధి గలండు గాలిన్ కల దాకాశంబునం గుంభినిం గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడోంకారమునం ద్రిమూర్తులం ద్రైలింగవ్యక్తులం దంతటం గల దీశుండు గలండు తండ్రీ ! వెదకంగా నేలయీ యా యొదన్
-భాగవతం
పాలింపుము శేముషి - నున్మూలింపుము కర్మ బంధముల సమదృష్టిన్ చాలింపుము సంసారము - కీలింపుము హృద యమందు కేశవ భక్తిన్ అని అద్భుతమైన సలహా ఇచ్చాడా ప్రహ్లాదుడు తన తండ్రికి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 42
🌻 42. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతామ్ || 🌻
భగవంతుని పట్ల ప్రేమ సుస్థిరమవదడానికి ఉపయోగపడె ఏ సాధన అయినా అనుష్టించవలసిందే.
సానుకూలాలను అనుప్టిస్తూ ప్రతికూలాలను వదలివెస్తూ, కొంత సాధన ఈ విధంగా సాగుతున్నప్పుడు మహాత్ములు తారసపడి భగవదనుగ్రహాన్ని కలుగజేస్తారు. నిర్విరామంగా సర్వకాల సర్వావస్థలందు భక్తి ప్రపత్తులు సాధనగా జరుగుతూనే ఉండాలి.
భక్తి సాధనలో లోపాలను సరిదిద్దుకోవాలి. అహంకార మమకారాలను వదలదడంలో పరిక్షలనెదుర్కోవాలి.
అనుగ్రహం లభించే దాకా విసుగు చెందక వేచి ఉండాలి. పూర్తిగా భగవదర్పణ అయ్యారో లెదో పరిక్షించుకోవాలి. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. తాను మిగిలి ఉంటే అది కైంకర్యం కాదు. తాను కూడా లేకపోవడమే కంకర్యం. తను, మన, ధనాదులను సర్వాన్ని సమర్పించడమే కైంకర్యమవుతుంది. కైంకర్యమైన భక్తుడె పరాభక్తుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. నారద భక్తి సూత్రాలు - 74 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 43
🌻. 43. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః ॥ 🌻
ఏ రకమైన దుస్సాంగత్యమైనా సరే, అన్నీ వదలివెయాలి.
సాధనలో ఉన్న భక్తుడు, కోరికలను నిగ్రహిస్తూ ఉండగా, దుస్పాంగత్యం కలిగితే ఆ కోరికలు రెట్టించి, అవకాశాన్ని వినియోగించు కుంటాయి. సాధకుడు పతనమవుతాదు.
కామ్యక కర్మలను చేస్తాడు. ఇంకా దిగజారితే నిషిద్ల కర్మలను కూడా చేస్తాడు. అక్రమ మార్గాల నవలంబిస్తాడు. వీటివల్ల నిగ్రహ శక్తి కోల్పోతాడు.
అహంకార మమకారాలను అడ్డు తొలగించు కోవలసింది పోయి వాటిని పెంచి గట్టి పరచుకుంటాడు. విరోధ ఉపాయం విఫలమవుతుంది. అనుకూల ఉపాయాలకు విఘ్నమేర్పడుతుంది.
అవకాశం కోసం పొంచి ఉండే అరిషడ్వర్గం, సందు దొరకగానె దాడి చేస్తుంది. విషయ సంగత్వం గాఢంగా కలుగుతుంది.
అంతవరకు చేసిన సాధనంతా మంటగలసి పోతుంది. సాధనలో పురోగమనం ఉండకపోగా తిరోగమనం జరుగుతుంది.
దుస్సాంగత్యం వలన పతనమైనవాడు తిరిగి పుంజుకోవడం అరుదు. పశ్చాత్తాప పడినప్పటికీ నైరాశ్యం ఆవరించి ఖిన్నుడవుతాడు. గురువు పర్యవేక్షణలో సాధన చెస్తే శిష్యుడిని సకాలంలో హెచ్చరిస్తాడా గురువు. తిరిగి సన్మార్గంలో పెడతాడు.
ఒక్కోసారి సన్మార్గంలో ఉన్న శిష్యుని దుష్ట సంస్కారాలను బయటికి లాగి గురువు పరిక్ష పెడతాడు. అప్పుడది ముందు జాగ్రత్త చర్య అవుతుంది.
బలహీనమైన మనసు గల శిష్యుడిని హెచ్చరిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. గురు కృప రుచి మరిగిన శిష్యుడైతే, గుర్వాజ్జను పాటిస్తూ, సాధన చేసాడు.
గురువు ప్రత్యక్షంగా లేకపోయినా గురు కృపను గుర్తించలేక పోయినా, శిష్యుడు దుస్సాంగత్యంలో పడిపోయె ప్రమాదమున్నది.
అతనిని ఇక రక్షించేవారే ఉండరు. ఇటువంటి అవాంతరాల విషయాల్లో ముందస్తు జాగ్రత్త అవసరమని ఈ సూత్రం చెప్తున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 75 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 44
🌻 44. _ కామక్రోధమోహ స్మృతిభ్రంశ బుద్దినాశ కారణత్వాత్ ॥ 🌻
దుస్సాంగత్యమంటే, దుష్టులతో సాంగత్యం, నాస్తికులతో సాంగత్యం. కామక్రోధ మోహాలతో సంగత్వం కూడా దుస్పాంగత్యమె. ఇది బుద్ధిలో వివేకం లేకుండా చేస్తుంది.
అందువలన మోక్ష లక్ష్యంగా సాధన చెస్తే శ్రద్ధ కలుగుతుంది గాని, కాలక్షేపంగా చేస్తె పరిస్థితులకు తలొగ్గి మరల కామక్రోధాదుల వలలో పడతాడు.
మనస్సును శుభవాసనలను కలిగించే సాధనలందుంచక ఖాళీగా ఉంచితే పూర్వ అశుభవాసనలు లొంగదీసుకుంటాయి. కనుక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం ఆ సత్సంగాన్ని కొనసాగించాలి. విరామ మివ్వకూడదు.
కాయిక, వాచిక భక్తిని నిరతరం చేస్తూ ఉండాలి. మానసిక భక్తి కుదిరితే, భక్తుడు దుస్సాంగత్యం జోలికి వెళ్ళడు. గౌణభక్తి సాధకుడు పతనమయ్యె ప్రమాదమున్నది.
అతడు విరామమిస్తే దుస్పాంగత్య ప్రమాదంలో పడతాడు. అనగా ప్రలోభాలకు, వ్యసనాలకు బానిసవుతాడు. భక్తుడు కర్తవ్య పాలన అనే ముసుగులో అహంకార మమకారాలను తృప్తి పరుస్తూనే ఉంటాడు. నేను, నాది అనేవి అడ్డు తొలగాల్సింది పోయి, మరింత గట్టిగా అడ్డు పడుతుంటాయి.
అప్పుడతడు పేరుకే భక్తుడు గాని, నిజానికి అతడిలో భక్తి హరించిపోతూ ఉంటుంది. అతడి భక్తి కాపట్యం క్రిందకి వస్తుంది. కనుక భక్తుడు దుస్పాంగత్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ #సద్గురువిజ్ఞానస్వరూప్
24.Aug.2020
🌹. నారద భక్తి సూత్రాలు - 76 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 45
🌻 45. తరంగాయితా అపీమే సంగాత్ సముద్రాయంతే ॥ 🌻
కామ క్రోధాదులనే తరంగాలను పట్టించుకొని, జాగ్రత్త పడకపోతే అవి పెద్దవై ఎగపసిపడుతూ, లేస్తూ, ఘోష పెడతాయి.
ఒక్కొక్క అల పుడుతుండగానే, బుద్ధి కుశలతతో దాన్ని గుర్తించి జాగ్రత్త పడాలి. కామాదులు తనలో అంకురిస్తున్నట్లు కనబడగానే వాటిని మొలకలోనే త్రుంచివేయాలి. కించిత్తు అవకాశం ఇవ్వకూడదు.
పొరపాటున అవకాశం దొరికితే, దానికి తోడు దుష్ట సాంగత్యం కూడా తోడైతే, ఆ కామాదులకు ప్రోత్సాహం లభిస్తుంది. అది ఎంత ప్రమాదమో చెప్పనలవి కాదు. అందువలన సాధకుడు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
25.Aug.2020

🌹. నారద భక్తి సూత్రాలు - 77 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 46
🌻 46. _ కస్తరతి కస్తరతి మాయమ్ ? యః సంగం త్వజతి,
యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి ॥ 🌻
భాగము - 1
ఆ మాయా సముద్రాన్ని ఎవరు దాటగలరు? సంనార బంధాన్ని ఎవరు త్రెంచుకొనగలరు? ఎవరైతే మమకారాన్ని జయించి, మహాను భావులను సేవిస్తారో వారే మాయను దాటగలరు.
విష్ణు మాయకు లోబడిన రాక్షసులు అమృతవానం చేయలేక పోయారు. అది దేవతలకే దక్కింది. కనుక అసుర గుణాలున్నంతవరుకు అమృతమైన మోక్షం దక్కదని తెలుస్తున్నది. దైవి గుణాలున్న వారికి భగవదనుగ్రహం ఉంటుందని ఈ కథ చెప్తున్నది. కథగా చూస్తే విష్ణుమూర్తి మోహినీ రూపంలో రాక్షసులను మోసం చేశాదని, దేవతల పక్షపాతం వహించాదనిపిస్తుంది.
అంతరార్ధం గమనిస్తే విష్ణు మాయ వలన మోహం జనిస్తుందని, అసుర గుణాలున్న వారైతే ఆ మోహానికి లొంగి, మోక్షానికి దూరమవుతారని తెలుస్తుంది. భగవంతునికి శరణాగతి చెందిన సజ్జనులను ఆ భగవంతుడు వారి యెడల మాయను ఉపసంహరిస్తాడు. అదే భగవదనుగ్రహం.
భగవంతుడు అవతరించడానికి కారణమే దుష్ట శిక్ష శిష్ట రక్షణ. అందువల్ల మనం భావించినట్లుగా ఆయన మోసం చేయడం, అనుగ్రహించడం లాంటివి ఆయన అవతార ప్రణాళిక అవుతుంది గాని, ఆయనకు పక్షవాత బుద్దిని అంటగట్టరాదు.
శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అనుకుంటారు. కౌరవులను మోసం చేసినట్లు కనబడుతుంది.
కౌరవులనగా కర్మచక్రమందు తిరిగేవారని అర్ధం. వాందవులనగా సత్వగుణ సంపన్నులు. అందువలన శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అదే దైవానుగ్రహం. ఈ విధంగా మనం కథలోని అంతరార్జాన్ని గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
26 Aug 2020

🌹. నారద భక్తి సూత్రాలు - 78 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 46
🌻 46. _ కస్తరతి కస్తరతి మాయమ్ ? యః సంగం త్వజతి, యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి ॥ 🌻
భాగము - 2
విష్ణమాయ ఎంత బలీయమంటే ఒకసారి విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించినప్పుడు సాక్షాత్తు హరుడే ఆ మోహంలో పడ్డాడు. వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు. అతడే హరిహర సుతుడని పిలువబడే అయ్యప్ప స్వామి అని అందరికీ తెలుసు. అందువలన మాయను దాటటం ఎవరి వశం? అందుకే సంసార భ్రాంతి గురించి హెచ్చరిస్తున్నది ఈ సూత్రం.
మహాత్ముల, అనుభవజ్ఞుల సహాయాన్ని తీసుకోమంటున్నారు. రామ కృష్ణావతారాలు, సద్గురువులు, బుషివర్యులు, భాగవతోత్తములు, ఆచార్యులు వీరందరూ మహానుభావుల క్రిందికి వస్తారు. అవతారకాలం కానప్పుడు కూడా ఎవరో ఒక మహానుభావుడు అన్ని కాలాలలో ఉంటూనే ఉంటాడు.
మహానుభావులు లోక కళ్యాణం కోసం క్రతువులు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. దేవాలయ నిర్మాణాలు చేయిస్తూ, భక్తి మతాన్ని కాపాడుతూ ఉంటారు.
అనేక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. అనేక ఆధ్యాత్మిక మార్గాలను ప్రచారం చెస్తూ ఉంటారు. కొందరికి ప్రేరణ ఇస్తూ పై చెప్పిన కార్యాలు జరిపిస్తూ కూడా ఉంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద స్వామికి స్ఫూర్తినిచ్చి అతని వలన లోకోపకారం జరిపించారు. మహానుభావుల కృప అట్టది.
మహాత్ములు దొరకడమే అరుదు. మనకు సాధన మార్గమందు శ్రద్ధ కలిగి పురోగమిస్తూ ఉంటే, మహాత్ములు అప్రయత్నంగా దొరుకుతారు.
సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్ధం వందనం మోక్ష సాధనం అని మహాత్ముల మహిమ గురించి పెద్దలు చెప్పేవారు. అట్టి వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి.
హఫీజ్ గురువుల విషయంలో ఈ విధంగా చెప్పాడు.
(1) ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేకుండా, అదృష్టవంతుడగు బానిసవలె మహాత్ముని ఆజ్ఞను పాటించాలి.
(2) ఆయన నుండి విన్న దానిని ఎన్నడూ తప్పు అనకు. ఎల అనగా ఆయనను అర్ధం చెసుకోలెని అసమర్ధత, లోపం మనలోనే ఉన్నది.
(3౩) అహంకార మమకారాలతో కూడిన గౌణభక్తి నుండి మనలను విడుదల చెసి ముఖ్యభక్తిలోనికి ప్రవేశపెట్టిన మహానుభావునికి ఏమిచ్చి బుణం తీర్చుకొనగలం?
(4) ఆయన ఏమి చేసినా మనకందరికీ అత్యంత ప్రయోజనకారి అవుతుంది.
(5) “దొరకునా ఇటువంటి సేవ” అని శుశ్రూష (సేవ) చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
27 Aug 2020

🌹. నారద భక్తి సూత్రాలు - 79 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 47
🌻 . 47. యో వివిక్త స్థానం సేవతే యో లోక సంబంధమున్మూలయతి
ఏకాంత ప్రదేశంలో ఉండడం, ముల్లోకాలలోనూ సుఖాభిలాష లెకుండా ఉండడం, మూడు గుణాలకు వశవర్తి కాకుండడం, లేని దానిని సంపాదించి పదిలపరచుకోవాలన్న కాంక్ష లెకుండదడం, ఇవన్నీ ఉన్నవాడు పరమ విరాగి.
ఒంటరిగా ఉందదమంటే మనసును నిర్విియం చెసుకొని అతడు ఎంతమంది మధ్యలో వాల్గొని వ్యవహరిస్తున్నప్పటికి, తన నిరంతర భగవచ్చింతనను బట్టి దెనిసీ పట్టించుకోకపోవడం. ఇహ, స్వర్గలోక సుఖాలను కోరక, భగవంతుడిని ప్రియతముడుగా భావించి తాను డ్రేమికుడుగా మాత్రమె ఉందటం ఒంటరితనమవుతుంది. ఒంటరితనాన్ని శూన్యంగా భావించక, ఆనందాన్ని అనుభవించదమె ఆత్మానందం.
మితాహార, హితాహారాలను స్వీకరిస్తూ, సోమరిగా ఉందక, ఆందోళన చెందక, సహనంతో వ్యవహరించడాన్ని సహజ స్థితిగా చేసుకోవడం పరమ విరాగి లక్షణం. సర్వులందు భగవంతుదె ఉన్నాదను భావంతో, ఇతరుల స్వభావ భేదాలను పట్టించుకొనకుండడమే వైరాగ్యం.
త్రిగుణాలతో వ్యవహరించకపోవడమె పరమ వైరాగ్యం. ఇంకను, అపకారికి ఉపకారం చేసే బుద్ది కలిగి ఉండటం, కీర్తి కాంక్ష లేకుండటం, మానావమానాలను గుర్తించకపోవటం, ఆపదలందు కృంగక పోవటం, సంపదలందు పొంగకవోవటం, ఉన్న దానితో తృప్తిగా ఉండటం, లేనిదాని కొరకు వెంపర్లాడకపోవటం, తొందరపాటు లేకుండటం, తప్పులు జరిగినప్పుడు సిగ్గుపడి, పశ్చాత్తాపపడటం, ఆ తప్పులు మళ్ళీ చేయకుండటం, వివేకంతో నదడచుకోవటం, ప్రాపంచిక వస్తువుల యెడ, ఇంద్రియ భోగాల యొడ వైరాగ్యం కలిగి ఉండటం, ఇవన్నీ పరమ వైరాగ్యం క్రిందికి వస్తాయి.
ఈ విధమైన పరమ వైరాగ్యం భక్తులలో ఉంటే అతడు తన భక్తి సాధనలో పురోగమిసాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
28 Aug 2020

🌹. నారద భక్తి సూత్రాలు - 80 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 48
🌻. 48. యః కర్మ ఫలం త్యజతి, కర్మాణి
సంన్యస్యతి తతో నిర్వంద్వో భవతి ॥| 🌻
ఎవడు కర్మ ఫలాన్ని ఆశించడో, ఎవడు లోకంలో న్వార్ధపూరితమైన కర్మలను చెయడో, ఇతర కర్మలను చెసినా, చేయనివాదుగా ఉంటాడో చెసిన కర్మలను భగవదర్పితం చేసి కర్మ సన్వాసి అవుతాడో అతడు సుఖ దుఃఖాది ద్వంద్వానుభవాలకు అతీతుదవుతాడు.
వ్యవసాయ, వ్యాపారాలలో, ఉద్యోగ, వృత్తులలో ఫలితాన్ని లాభాన్ని జీతాన్ని ఆశిస్తాం. అనుకున్న దానికంటే తక్కువో, ఎక్కువో వస్తుంది. అయినా పురుష ప్రయత్నంగా మన పని మనం చెస్తూ పోవాలి.
ఫలితం కర్మాధథనం కాబట్టి ,అది అలాగే ఉంటుందని సరిపెట్టుకోవాలి. ఈ విధంగా కొంతకాలం అభ్యాసం చేయగా చెయగా, ఫలత్యాగ బుద్ధి దానంతటదే స్థిరమవుతుంది. చివరకు నిష్కామ కర్మయోగం సిద్ధిస్తుంది.
సాధారణంగా మానవుడు జీవభావం ఉన్నంతవరకు నిష్మామకర్మ యోగం చేయలెడు. భగవానునితో అనుసంధానమైనప్పుడు మాత్రమె ప్రకృతికి సంబంధించిన విషయాలు పట్టవు.
భగవంతుని కళ్యాణ గుణాలను సంకీర్తన చేస్తూ, తదర్ధాన్ని తనలో నింపుకుంటూ, యోగి కావాలి. ఇంద్రియ భోగాలకు లోనైనప్పుడల్లా పశ్చాత్తాపపడుతూ తిరిగి భగవంతునికి పునరంకిత మవుతూ ఉండాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
29 Aug 2020

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 49
🌻. 49. (యో) వెదనపి సంన్యస్యతి కేవల మవిచ్చిన్నానురాగం లభతే ॥ 🌻
ఎవడు వేదాలలో కర్మకాండ నిర్దేశించిన విధంగా ధర్మాలను కూడా భగవదర్చణగా చెసుకొని నిష్కామ కర్మయోగి అవుతాడో, చివరికి సన్యసిస్తాడో అతడు నిర్మలమైనట్టి, ఎదడతెగనట్టి అనురాగాన్ని భగవంతుడిపట్ల పొందుతాడు.
ధర్మార్ధ కామ మోక్షాలతో, అర్ధ కామాలను ధర్మయుతంగా నెరవేర్చుకుంటూ పోతే మోక్షానికి దారి సుగమం అవుతుంది. మోక్ష ద్వారం దగ్గరవుతున్న కొద్ది భక్తుడు అర్ధ కామాలతో కూడిన ప్రాపంచిక విషయాలను వదలివెస్తూ, సదా ఈశ్వర చింతనచేత సర్వ కర్మలను సన్యసిస్తూవోయి, చరమాంకంలో ధర్మాన్నుండి కూడా విడుదలవుతాడు. అనగా ధర్మాన్ని కూడా సన్యసిస్తాడు.
వెద విహిత సన్యాసం మూడు విధాలు. ది స్వధర్మ్శ్మమో, యుక్తమో, దానిని స్వీకరించి ప్రతికూలాలను వదలడం మొదట్‌ది. స్వధర్మాచరణను ఈశ్వరారాధనగా చెయడం, ఫలాన్ని భగవదర్పణ చెయడం రెండవది. మూదడవదైన సిద్ధావస్థలో కర్మ ధర్మాలు అవె వదలి పోతాయి. ఈ విధమైన మూడు దశలలో ప్రాథమిక ధర్మాలనుంది, చివరగా వేద విహిత ధర్మాల నుంది కూడా విడదుదలవుతాదు.
ఇది జరగాలంటే భక్తుడు ఎడతెగని అనురాగాన్ని భగవంతునిపై కురిపించగలగాలి. అవిచ్చిన్నానురాగం భగవంతునిపై కలిగి, అది సహజమైతే, అదె ముఖ్యభక్తి అవుతుంది. క్రమంగా పరాభక్తికి దారి తీస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
30.Aug.2020

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 50
🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 1 🌻
అటువంటి పరాభక్తుడు తాను గమ్యం చేరడమే గాక, లోకంలో చాలామంది తరించడానికి ఉపకరణమవుతాడు. ఇట్టివాడు భాగవతోత్తముదై, భగవంతుని చేతిలో పరికరమవుతాడు.
యోగ్యతగల భక్తులకు ఇతని ద్వారా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రనాదిస్తాడు. ఈ రకమైన పరాభక్తులు భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు భగవంతునితో సమానులు.
బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥
- (18:54) భగవద్దిత
తా॥ సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్మ్కుడైన యోగి దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. సమస్త ప్రాణులందు సమభావం ఉన్న యోగి పరాభక్తిని పొందుతాడు. పరే భాగవతోత్తములు.
భక్తుడు యోగ్యుడైతేనె భగవదనుగ్రహం పొందుతాడు. గనుక సాధకుడు సాధించె సాధనా స్థితిగతులను భగవద్గిత తెలియచెస్తున్నది. ఒక్కొక్క స్థితిని ఈ క్రింది విధంగా అధిగమించి, యోగ్యత సంపాదించాలి. చివరకు స్థిరమైన, శాశ్వతమైన పరమప్రేమ స్థితిని పొందుతాడు భక్తుడు.
1) _ ఆత్మ వశ్యైర్విధయాత్మా ప్రసాద మధిగచ్చతి ॥ - (2:64) భగవద్గిత
ఆత్మకు వశమైన బుద్ధితో జీవించడం వల్ల “ప్రసాదం” అనగా ఇచ్చెవాడు, పుచ్చుకునేవాడు అనె విభజన ఉన్న జీవేశ్వర భిన్నత్వం అనె స్థితిని అధిగమిసాడు. ఎ రకంగానూ దుఃఖాన్ని దగ్గరకు చేరకుండా ఉంచే మోదాన్ని ప్రసాదమంటారు. క్రసాద స్థితిలో ఈశ్వరునకు మనసు, బుద్ధి, చిత్తం లొంగి ఉంటాయి.
ఆ బుద్ధి భెద భావాన్ని పాటించదు. మనసు విషయాసక్తం కాదు. ఈ శుద్ధ బుద్ధి ఆత్మ స్థితిని గ్రహించి, దానికి వశమై వర్తిస్తూ జీవేశ్వర భిన్నత్వాన్ని వోగొట్టుకొంటుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
31.Aug.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 50
🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 2 🌻
2) నిర్మమో నిరహంకారః సశాంతి మధిగచ్చతి ॥ - (2:71) భగవద్గీత
మోహం, అహంకారం నిరసిస్తే మిగిలెది శాంతి. ఈ శాంతి యుతమైన బుద్ధి ఆత్మ వశవర్తియై వర్తించాలి. ఎన్ని సళ్ళు సముద్రంలోకి చేరుతున్నట్లు కనిపించినా, సముద్ర మట్టం పెరగదు. కారణం ఆ సీళ్ళన్నీ ఆ సముద్రంలోనుండి వచ్చినవే. విషయాలు, వాంఛలు పొందాలనే భోక్త, నేనె చేస్తున్నాననే కర్త, అంతా మనోభావాలే, ప్రతిబింబాలే. యధార్థంగా ఆత్మయందు ఇవి లేవ. వీటిచే ఆత్మ స్థితిలో ఎల్బీ చలనాలు లేవు.
3) నచ సన్వసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి 11 - (8:4) భగవద్గీత
కర్మ సన్యాసం, కర్మ ఫలత్యాగం అనే రెండు విధాలైన కర్మాచరణ ఆత్మ భావంలో స్థితమైన అంతఃకరణ పొంది స్థితిని సిద్ధి అని తెలిసి, ఆత్మ నిష్టయందున్న ప్రీతిచేత అధిగమించాలి.
4) జ్ఞానం లబ్ద్వా, పరామ్ శాంతి మచిరేణాధిగచ్చతి 1 - (4:99) భగవద్గీత
స్వరూప జ్ఞానం వలన ప్రశాంతత, లేక పరాంశాంతి అనే స్థితిని పొందు తాదు. ఇరువది నాల్లు తత్త్వాలందు వ్యవహరించక, ఇరువది ఐదవది అయిన స్థితిలో కూటస్థమై ఆత్మ స్టితమగుటచెత పొందిన పరమమైన శాంతిని సాధించాలి. ఇంద్రియ గతమైనది అంతా పూర్తిగా శమిస్తుంది.
5) యోగయుక్తో మునిర్బహ్మ నచిరెణాధిగచ్చతి 11 - (5:6) భగవద్గీత
తనయందు తానె రమిస్తూ, మనో మౌనంను పాటించె సాధకుడు బ్రహ్మంతో, లేక పరమాత్మతో అనుసంధానం చేయగలడు. పంచ భూతాలతో కూడిన ప్రకృతి భావాలను నిరసిన్తాడు. సన్యసిన్తాడు.
6) సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో ౨_ధిగచ్చతి ॥
- (5:24) భగవద్గీత
ఇట్టి యోగి పరమాత్మ యందలి ప్రేమచేత తనను తాను అధ్యయనం చేసి తెలుసుకున్న జ్ఞానం చెత విరాట్ స్వరూపమైన బ్రహ్మమందు జరుగుతున్న సంకల్ప, వికల్ప, శూన్య స్థితులను తెలుసుకుంటాడు. తనయందలి అనాహత నాదం, విశ్వమందలి ఓంకార నాదం ఒక్కటెనని తెలుస్తుంది. ఇట్ట నాదాంతాన్ని లక్ష్యంచి, బ్రహ్మీ భూతుడవుతాడు.
7) _ శాంతిం నిర్వాణపరమాం మత్సంస్దా మధిగచ్చతి 11 - (6:15) భగవద్గీత
ఇట్ట పేమానురాగాలు పరమాత్మ యెడల ఏర్పడి విడదీయరాని స్థితి కూడా ఏర్పడి పరం అనునది స్పష్టమై దానియందే శరీర ప్రాణ, మనో వ్యాపకం లయమై తాను సర్వవ్యాపిని అనే స్థిరత్వాన్ని పొంది మరణ భయం వీడి శాంతిని పొందుతాడు.
8) గుణేభ్యశ్చ పరం వేత్తి మధ్యావం సోలి ధిగచ్చతి 11 - (14:19) భగవద్గీత
సర్వ కారణమూ ఈశ్వరుడే అని భావించే స్థితిలో సమస్త ప్రపంచమూ గుణ నిర్మితమై ఉన్నది. పరమాత్మ గుణ రహితుడదని, అట్టి పరమాత్మ యందెే తనకు కలిగిన కారణ రహిత ప్రేమవల్ల సృష్టి కార్యమంతా గుణ విశేషమే గాని, స్వయంగా తాను, అనగా బ్రహ్మం కర్త కాదని ఉపశమించిన స్థితిలో తన యందలి నిస్సంకల్ప స్థితిలోకి ప్రవెశించి ఊరక ఉంటాడు, నిష్టాయుదవుతాదు.
9) _ నైష్మర్యసిద్ధిం పరమాం సన్వ్యాసె నాధిగచ్చతి ॥
- (18:49) భగవద్గీత
సంకల్పాన్ని సన్యసించడం ద్వారా నైష్కర్య్య సిద్ధి అనె పరాభక్తి స్థితిని పొందుతాడు. అనగా క్షరమైన ప్రకృతి భావం తోచదు. అక్షరమైన ఆత్మ భావం పురుషోత్తముదైన పరమాత్మయందు సంయమించబడుతుంది. ఇది బంధరాహిత్యం, పైగా మోక్ష సన్యాస స్థితి కూడా.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
01 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 51, 52
🌻 51. అనిర్వచనీయం ప్రేమ స్వరూపమ్ | 🌻
భగవత్రేమ స్వరూపం ఇట్టిదని నిర్వచించడానికి వీలు కాదు. అది హృదయపూర్వకం, అవాజ్నానస గోచరం. బుద్దికి అతీతం.
గత అధ్యాయాలలో వివరించినది బాహ్య భక్తి లేక గొణభక్తి. అది క్రమంగా సాధన దశలలో పెంపొందించుకునేదిగా చెప్పబడింది.
పరాకాష్టగా ముఖ్యభక్తి కలుగగా భక్తుడు తన ముఖ్యభక్తిలోగాని, పరాభక్తిలో గాని తన భక్తి అనుభవాన్ని ఇల్టది అని వివరించలేడు. అది అతడి ఆంతరంగిక అనుభవం మాత్రమె.
ఈ ముఖ్యభక్తి లేక పరాభక్తిని అతడి బాహ్య నడవడికను బల్బ ఇతరులు అంచనా వేస్తే అది తప్పవుతుంది. అనిర్వచనీయమైన భగవత్రైేమానుభవాన్ని భక్తుడు కూడా
చెప్పలేడు.
🌻 52 మూకాస్వాదనవత్ ॥ 🌻
పదార్ధ రుచిని చూచిన మూగవాడు ఆ రుచిని మాటలలో చెప్పలేడు. అలాగే తన ముఖ్యభక్తి లక్షణాన్ని అనగా భక్తుడి ఆంతరిక అనుభవాన్ని అతడు కూడా మాటలలో చెప్పలెదు.
భగవత్రేమ ఎప్పుడు హృదయాంత రాళంలో స్థిరపడుతుందో అప్పుడు ఆ భక్తుడికి అవగతమౌతుంది. అట్టి ఇతర భక్తుడు కూడా తెలుసుకోగలడు. కాని వారు మాటలలో చెప్పలేరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 53 54
🌻. 53 . ప్రకాశ(శ్య)తే క్వాపి పాత్రే ॥ 🌻
ఆ భగవత్రేమ అంతటా అన్ని కాలాలలో ప్రకాశించదు. అవసరమైన చోట కాలానుగుణ్యంగా బయటకు వస్తుంది. కాని భక్తుని అంతరంగంలో మాత్రం ఎడతెగకుండా ప్రకాశిస్తూనె ఉంటుంది. అది ఆ భక్తుడికి మాత్రమె తెలుస్తుంది. కాని మాటలలో చెప్పడానికి భాష చాలదు.
🌻 54. గుణ రహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్థమానం,
అవిచ్చిన్నం, సూక్ష్మతరం, అనుభవరూపమ్ ॥ 🌻
పరాభక్తిలో సహజమైన ప్రేమ ఉంటుంది. ఇది హృదయానికి సంబంధించింది. మనసుకు సంబంధించినదైతే అది గుణాలతో కూడినది. కనుక మాటలలో వర్ణించగలం. సాధన దశలో ముందుగా మనసుతో ప్రారంభిసాం. మనసుతోనె అభ్యాసం చేస్తాం. అప్పుడా భక్తిని గౌణభక్తి అని అన్నాం.
మనసునుండి విడుదలై హృదయంలోకి చేరేసరికి ఆ భక్తి సహజ సాధన పూర్తయ్యింది. ఇక అది పెరిగేది, తరిగేది కాదు. సహజ మౌతుంది. సిద్ధమైన ప్రమ స్థిరంగా ఉంటుంది. సూక్ష్మతరమైన బుద్దితో గుర్తించబడుతుంది. అది హృదయ పూర్వకమైనది.
ఈ పరాభక్తి ప్రభావం వలన కోరికలు, వాంఛలు మొదలగు గుణ సంబంధమైన వాటినుండి మనసు విడుదలవుతుంది. మనసు తేటపడుతున్న కొద్ది, పరాభక్తి క్రమంగా స్థిరపడె ప్రయత్నం జరుగుతుంది. ప్రతి క్షణం వర్ద్మమానమవుతుంది.
పరాకాష్టలో అది నిరంతరం అలాగే ఉండిపోతుంది. భక్తి అవిచ్చిన్నమై పరాభక్తికి దారితీస్తుంది. భక్తి మనసులో ఉన్నంత సేపు స్థూలంగా ఉంటుంది. హృదయానికి చెరేసరికి సూక్ష్మతరమవుతుంది. తుదకు పరాభక్తిగా పరిణమిస్తుంది.
అప్పుడా పరాభక్తి అతడికి అనుభవైక వెద్యమేగాని, ఆ అనుభవాన్ని మాటలలో చెప్పలెడు. స్ట్రూలరూప అనుభవాన్ని చెప్పగలడు గాని, సూక్ష్మతరమైన దాన్ని చెప్పలెడు. అది అవాజ్బానస గోచరం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
03.Sep.2020
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 55
🌻 55. తత్ ప్రాప్య తదేవాలోక యతి, తదేవ శృణోతి,
(తదేవ భాషయతి) తదేవ చింతయతి ॥| 🌻
ముఖ్యభక్తి లక్షణాల్లో ఆంతరంగిక అనుభవం ఉంటూనే ఆ భక్తి వలన కలిగే ఆవేశం బాహ్యానికి ప్రకటితమవుతుంది.
భక్తుడు భగవత్రైమను అనేక పద్ధతులలో వ్యక్తికరిస్తూ ఉంటాడు. అంతరంగంలో గోచరమవుతున్న భగవంతుడిని, బయట ప్రతి ప్రాణిలోనూ చూస్తాడు. జడ వస్తువులలో కూడా చూస్తాడు. సమస్తం భగవత్స్వరూపంగా చూస్తూ ఉంటాడు. కనుక సమస్తాన్ని ప్రేమిస్తాడు.
అందువలన జీవ లోకానికి అవసరమైన సేవను “నారాయణసేవ”గా చెస్తాడు. ఆ భక్తుడు ఏది చూచినా, దెనిని విన్నా ఎవరితో మాట్లాడినా, దేనిని చింతించినా అంతా భగవంతుడితోటె లోకంగా జీవిస్తాడు.
లోకంలో భగవంతుడు, తాను ఉన్నట్టు, ఇంక మూడవదెది లెనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ముఖ్యభక్తి అనెది పరాభక్తికి ఒక మెట్టు క్రిందిదని గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
04.Sep.2020

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 56
🌻 56. గౌణీ త్రిధా, గుణభేదాత్ ఆర్తిదిభేదా ద్వా ॥ - 1 🌻
ముఖ్యభక్తి లక్షణాన్ని చెప్పి, ఇప్పుడు గౌణభక్తి గురించి చెప్తున్నారు. ఈ గొణభక్తిని సత్వ రజస్సు తమస్సులుగా మూడు విధాలైన భక్తిగా తేడాలను వివరిస్తున్నారు.
మరొక పద్ధతిలో గౌణభక్తిని ఆర్హుడు, అర్జార్థుడు, జిజ్ఞాసువు అనే మూడు రకాలైన భక్తుల విషయంలోని తేడాలను వివరిస్తున్నారు. పై విధంగా భక్తుల స్వభావాన్ని బట్టిగాని, గుణాలను బట్టి గాని వారి ద్వారా ప్రకటితమయ్యె భక్తిని గౌణభక్తి అని అంటారు.
నిజానికి ఈ గుణాలు, తేడాలు భక్తిలో లేవు. భక్తి శుద్ధమే అయినప్పటికీ, సాధకుల గుణ కర్మ స్వభావాలను బట్టి ఈ తేడాలు సాధకులలో ఉంటాయి. అతడి భక్తిని బాహ్యానికి వ్యక్తికరించినప్పుడు ఈ గుణాలు మొదలైనవి ఆ భక్తుడిలో ఉన్నట్లు తెలుస్తుంది.
సంకల్ప భేదాన్ని బట్టి ఈ గౌణభక్తి ఆర్తితో గాని, అర్జార్ధితో గాని జిజ్ఞాసతో గాని కూడి ఉంటుంది.
వీరిలో క్లేశ పరిహారం కోరి చేసేవాడు ఆర్హుడు, పాప పరిహారం కోరి చెసెవాడు అర్దార్ధి, ప్రమాద పరిహారం కోరి చేసెవాడు జిజ్ఞాసువు. అందువలన వీరి సంకల్పాలననుసరించి గౌణభక్తి కూడా మూడు విధాలుగా అభివ్యక్తీకరించ బడుతుంది.
తామసిక భక్తుడు సాధన ఎలా చెయాలో అవగాహన లేకుండా చెసాడు. తన వారసత్వపు ఆచారాలను గ్రుడ్డిగా పాటిస్తాడు, అలవాటుగా చేస్తాడు. శాప్రీయ పద్ధతిని తెలుసుకోడు. పెద్దల మాట వినడు.
రాజసిక భక్తుడు స్వప్రయోజనాన్ని ఆళించి న్వార్ధపూరితంగా ఉంది కాయిక, వాచకంగా భక్తిని ప్రదర్శిస్తాడు. కోరిక తీరకపోతే భగవంతుడిని విస్మరిస్తాడు,
లేక నిందిస్తాడు. భక్తిని సాధనగా తీసుకోడు. ఎప్పుడైనా మానివెస్తాడు. అతడి భక్తి ఆరంభ శూరత్వం, చివరికి వదలివేయడం ఉంటుంది. ఆవేశం ఉన్నంతకాలం
భజనచేసి, చల్లారిపోగానే మానేసాడు.
సాత్విక భక్తిలో సాధనను, లక్ష్యాన్ని అవగాహన చేసుకుంటాడు. సాధనలలో మెలకువలు పాటిస్తాడు. శాస్త్రీయంగా సాధన చేస్తాడు. “భక్తి కోసమే భక్తిగా ఉంటుంది. నిర్మలమమైన భక్తిగా ఉంటుంది. భగప్రీతి కొరకు భక్తి సలుపుతాడు.
సాత్విక భక్తుడు ఆర్హుడైతే అతడి ఆర్తి తనకోసం కాదు. లోకంలోని పాప నివారణ కోసమై ఉంటుంది.
ఉదాహరణకు బుద్ధ భగవానుడు సాత్విక భక్తుడు.అర్ధార్ధియైతె అది లోక కళ్యాణార్ధమై ఉంటుంది. సాత్విక భక్తుడు జిజ్ఞాసులైతే ఆత్మ కల్యాణార్థమై ఉంటుంది.
జిజ్ఞాసువు సత్ పరంగాను, అర్జార్ధి చిత్ పరంగాను, ఆర్హుడు ఆనంద పరంగాను భక్తి సలుపుతాడు. భగవంతుడు ఏక లక్షణమైన సత్‌చిత్ ఆనంద రూపుడు. అందువలన ఈ మూడూ కలిపి ఒకే లక్షణంగా భక్తి సలిపితే అది జ్ఞానపరంగా ఉండి ముఖ్యభక్తికి దారి తీస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
05.Sep.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 57
🌻 57. ఉత్తరన్మా దుత్తజన్మాత్ పూర్వ పూర్వా శ్రేయాయ భవతి ॥ 🌻
భక్తి సాధనలో తామసిక భక్తి ఫలితంగా రాజసిక భక్తి కుదురుతుంది. రాజసిక భక్తి ఫలితంగా నాత్విక భక్తుదవుతాడు. ఆ సాత్విక భక్తుడు మొదట ఆర్హుడై ఆర్త భక్తి ఫలితంగా అర్ధార్ధి అవుతాడు. దాని ఫలితంగా జిజ్ఞాసువవుతాడు. అక్కడ సత్వ గుణం కూడా విడచి భగవల్రైేమను సర్వత్రా కనుగొని తుదకు ఏ గుణం లేని భక్తుదవుతాడు.
అందువలన తామసిక భక్తి నుండి క్రమంగా రాజసిక భక్తుడై, సాత్విక భక్తుడై, ఆ సాత్విక భక్తిలో ఆర్తి, అర్భార్థి, జిజ్ఞాస అనెడి స్వభావపూరితమైన భక్తి నుండి అధిరోహించి, ముఖ్య భక్తుదవుతాడు. గౌణభక్తి నుండి విడుదలవుతాడు.
కనుక పై చెప్పినవన్నీ ఒకదాని కంటె మరొకటి ఆరోహణా క్రమంలో శ్రేష్టం. ఇవన్నీ ముఖ్యభక్తుడవడానికి సాధనా క్రమంలో సోపానాలు.
ఆర్తిలో ఉన్న క్లేశం ఎట్టిదనగా సాధకునకు, భగవంతునికి మధ్య వియోగం ఉన్నందుకు క్లేశం జనిస్తుంది. ఆ క్లేశం భక్తికి ప్రధాన లక్షణం. వియోగం ఏర్పడకుండా ఉండటం కోసం గౌణభక్తిలోనె సాత్వికానికి పురోగమిస్తాడు. అలాగే మనసును భగవంతుని మీద సర్వదా ఏకాగ్రంగా ఉంచుతాడు.
సాత్విక భక్తి కుదిరాక, ఆ భక్తి అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. అంతకుముందు తామసిక, రాజసిక భక్తి సాధనలలో విరామాలు, ఆటంకాలు, తిరోగమనాలు, పునసాధనలు ఉండేవి. సాత్విక భక్తుడు అంత కంటే శ్రేష్టమైన భక్తికి పురోగమించాలి. అందుకోసం శ్రద్ధగా సాధన చేయాలి. విరోధాలను నివారిస్తూ ఉపాయాలను అనుసరిస్తూ పెద్దల సలహాలను పాటిస్తూ సాధనను నిష్కామంగా, మోక్ష లక్ష్యంగా చెయాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
06.Sep.2020

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 58
🌻 58. అన్యస్నాత్ సౌలభ్యం భక్తా ॥ 🌻
ప్రేమించడం అనేది అందరికీ తెలుసు. కాని అది వస్తువులు, బంధు మిత్రులు, భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు మొదలైన నిమిత్త కారణాల పై ఆధారపడిన ప్రేమ. ఈ ప్రేమలో రాగం, అనురాగం ఉంటాయి. ఈ ప్రేమ స్వంత ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. ఇంద్రియ భోగలాలసగా, స్వార్ధ పూరితంగా ఉంటుంది.
ఇతరుల వలన ఆ ప్రయోజనం అందక పోయినా, వ్యతిరేక ఫలితం వచ్చినా, లేక వారు తిరిగి ప్రైమించకపోయినా అది ద్వెషంగా మారుతుంది. ఈ రాగద్వెషాలు నిమిత్త కారణాల మీద ఆధారపడి పుట్టుకొస్తాయి. మనసు మీద వాసనలు ముద్రించ బడతాయి. అవి సంస్కారాలై పునర్జన్మకు హేతువవుతాయి. కనుక ఇట్టి ప్రేమ బంధమవుతుంది.
అదే ప్రేమ నిస్వార్ధం, అకారణం అయినప్పుడు అక్కడ నిమిత్త కారణం భగవంతుడే అయినప్పుడు, ఆ ప్రేమ బంధమవదు. ఒకవేళ అయితే, అది భగవంతునితో బంధమవుతుంది.
భగవంతునితో బంధం పునర్జన్మ హేతువు కాదు. ఆ విధంగా భగవంతునిపై ఉదయించే ప్రేమ లేక రాగం భగవత్ ప్రేమను పెంచుతుంది. అట్టి ప్రేమలో ఆటంకం కలిగితే, విరహంగా మారి ఆ ప్రేమ మరింత పెరుగుతుందే తప్ప భగవంతునిపై ద్వేషంగా మారదు. అందువలన భగవంతుని చేరడానికి అన్య మార్గాల కంటే భక్తి మార్గం సులభం, శ్రేష్టం.
ఒకసారి భగవత్ ప్రేమ నిలబడిపోతెే, అన్య వస్తువులపై రాగం సన్నగిల్లి పోతుంది. చిత్తవృత్తులు వెలవెలవోతాయి. ముఖ్యభక్తి కలగడానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
07.Sep.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 59
🌻 59. ప్రమాణాంతరస్యా నపేక్షత్యాత్ స్వయం ప్రమాణత్వాత్ ॥ 🌻
భక్తిని తెలుసుకోవడానికి స్వయం ప్రమాణమే గాని, ఇతర ప్రమాణాల ఆవశ్యకత ఉండదు. స్వానుభవంలో ఉదయించిన భక్తికి స్వయం ప్రమాణమే సత్యం. ఇతర ప్రమాణాలున్నాా అవి మొదటగా స్వానుభవ ప్రమాణాల ఆధారంగా వచ్చినవే. ఆ విధంగా వచ్చిన ప్రమాణాలు కాకపోతే, ఆ ఇతర ప్రమాణాలకు విలువ లేదు.
శాస్త్ర ప్రమాణం కూడా స్వానుభవజ్ఞుల ద్వారా వచ్చినదే. అందువలన ఏ శాస్తం ముందస్తుగా దానికదే ప్రమాణం కాదు. ఒకవేళ ఆ శాస్తాన్ని ఎవరైనా స్వానుభవం లెకుండా తయారు చేస్తే ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవడానికి వీలులేదు.
ఆగమ ప్రమాణం ద్వారా పుట్టిన శాస్త్రం ప్రమాణమే. అప్పుడది సాధకులకు మార్గదర్శకమవుతుంది. సిద్ధ వస్తువు స్వానుభవమే అయినప్పుడు అన్ని శాస్త్రాలు ఆ స్వానుభవం ముంగిట్లో ఆగిపోతాయి.
పైగా సిద్ధ వస్తువు రెండవ దానికి అవకాశమివ్వనిది గావున పోలికగా చెప్పడానికి కూడా ఎ వస్తువు సరిపోదు. అందుకే భగవంతుడు అప్రమేయం, అనుపమానం. సాధకులకు స్వయంవేద్యం. అందువలన ముఖ్యభక్తికి ఇతర ప్రమాణాలుండవు. దానికదే స్వయం ప్రమాణం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
08.Sep.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 60
🌻 60. శాంతిరూవాత్ పరమానందరూవాశ్చ ॥ 🌻
ముఖ్యభక్తి శాంతరూపం, ముఖ్యరూపం. ఇది కేవలం భక్తునిలో ఆంతరిక అనుభూతి. అతడిలో అది పరమానందరూపమై ఉంటుంది.
బయటి ప్రపంచంతో బంధం లేనప్పటికి లోకాన్ని చూచినప్పుడు భక్తుడికి కరుణ కలుగుతుంది. శిక్షించడం, రక్షించడం భగవంతుని పనేనని తెలిసి కూడా, దీనుల కొరకు సేవచెసే భాగ్యం భగవంతుడు తనకు కల్పించాదని, అందుకు భగవంతునిపై కృతజ్ఞత, విశ్వాసాలతో ఉంటాడు.
అయినప్పటికి అతడు దీనులకు సేవ చెద్దామని సంకల్పించడంలో భగవత్రేరణ ఉంటుంది. అతడికి లోక దుఃఖంతో స్పర్శ ఉండదు. అందువలన ఆ ముఖ్యభక్తుడికి లభించిన శాంతి, పరమానందాలకు విఘ్నం ఉండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
09.Sep.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 61
🌻 61. లోక హానౌ చింతా నకార్యా, నివెదితాత్మ లోకవెద (శీల) త్వాత్ ॥ 🌻
లోకాన్ని గూర్చిన చింతన ఆ భక్తునికి ఉండదు. అతడికి దినుల దుఃఖం ఆకర్షణ కాదు. అది భగవంతుడి లీలగా తలుస్తాడు. అందులో తనకు సేవ చెసే అవకాశం వచ్చిందనే అభిప్రాయం మాత్రం ఉంటుంది. అంతటా భగవంతుడినే దర్శిస్తూ ఉన్నప్పుడు అతడికి ఏ విధమైన భేద భావం ఉండదు. అతడు సత్వ గుణం నుండి కూడా విడుదలై ఉంటాడు. సత్వగుణంలో ఉన్న వాడికైతే సేవ చేస్తున్నట్లు కర్తృత్వ భావముంటుంది. కాని త్రిగుణ రహితుడైన భక్తుడికి కర్షభావం ఉండదు. అందువలన అతడు చెసేది నారాయణసేవ అవుతుంది.
కర్తృత్వభావం లేకుండా అందరిలో భగవంతుడినే దర్శిస్తూ చెసే సేవను మెహెర్‌బాబా సేవలో పరిపూర్ణత” అంటారు.
అవతారులు లోకాన్ని ఉద్ధరించె సేవ కూడా సేవలో పరిపూర్ణత క్రిందికి వస్తుందంటారు. భక్తుడు అవసరమైన వారికి సేవ చేస్తూ పోతూ ఉంటాడు. ఎవరెవరికి చెస్తున్నాడనే గుర్తు ఏర్పడదు. అతడిలో నిరంతరం దైవిభావమె ఉంటుంది. చేస్తున్న పనికి దైవీ ప్రేరణ ఉంటుంది. చేయడంలో సహజమైన ప్రేమ, కరుణ ఉంటాయి. పూర్వ శత్రుత్వం జ్ఞప్తికి రాదు. తాను చేసే సేవలో “తృప్తొ” అనె అనుభూతి కూడా ఉండదు. అతడి ఆంతరంగిక శాంతి, పరమానందానికి సేవ చెయడం అవరోధం కాదు.
అతడిలో నిండి ఉన్న శాంతి, పరమానందాలు అవిచ్చిన్నం గనుక, ప్రాపంచిక విషయాల యెడల అతడు నిర్వికారి. నారాయణసేవ చేస్తూ కూడా అతడు నిర్వికారియె.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
10.Sep.2020
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 62
🌻 62. న తల్సిద్దా లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగః తత్సాధనం చ (కార్యమేవ) || 🌻
భక్తి సిద్ధించాలంటే లోక వ్యవహారం మానాలా ? మానేస్తే ఎలా కుదురుతుంది ? భక్తి సాధన దశలోగాని, భక్తి సిద్ధించిన తరువాత గాని భక్తుడు లోక వ్యవహారం మానవలసిన అవసరం లేదు. సమస్త శుభ కర్మలను చేసూ ఆ కర్మల ఫలితాన్ని భగవదర్పణ చెస్తూ జీవించవచ్చును.
అశుభ కర్మలు చేయడు. ఇతర అత్యవసర కర్మలు చేయక తప్పునప్పుడు భక్త ప్రహ్లాదునివలె, ఏ పని చెస్తున్నా శ్రీహరి స్మరణను వదలక ఉండును. చేసే పని తనకోసం కాదన్నట్లు, తన పనే అయినప్పటికీ, తానొక పని మనిషిగా ఎవరికో చెసి పెట్టినట్లు చేస్తాడు. యజమానిగా భావించడు.
ధనం విషయంలో అది తన కోసమే అయినప్పటికీ, ఎవరి కోసమో అన్నట్లు బ్యాంకు క్యాషియరు వ్యవహరించినట్లు చేస్తారు. గుడి నిర్మాణానికి ట్రస్ట్ వలే, తన పనులకు యజమాని భావన లేకుండా చేస్తాడు. దేనికి స్వతంత్రించడు. “ఒక పని అయిపోయింది” అని అనుకుని ఆ పనిని తలచడు. చెయ్యబోయె పని, మీద పడినట్లుగా భావించి చేస్తాడు. అంత వరకు తలచనే తలచడు.
అసంకల్పిత ప్రతీకార చర్యగా అన్ని పనులూ చేసుకుంటూ పోతాడు. ఎప్పుటి పనికి అప్పుడు క్షణంలో సిద్ధమవుతాడు గాని, ముందస్తు ఆలోచన ఉండదు. భగవచ్చింతనలో ఉంటూ చేసే పనుల్లో పొరపాట్లు కూడా చేయడు.
కర్మను భగవదర్పితంగా చేస్తాడు. కనుక కర్మ ఫలితం తనకు అంటదు. నేను, నాది అనే వాటిని జ్ఞాన మార్గ సాధనలో త్యాగం చేయడం కష్టమేమో గాని, భక్తి సాధకుని విషయంలో మాత్రం భగవదర్పణగా చెస్తాడు గనుక, అది సులభ సాధ్యమవుతుంది.
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యా ద్విద్వాంస్తథాసక్తః చికిర్చుర్లోకసంగ్రహమ్ ॥
- (3:25) భగవద్దిత
అజ్ఞానులు కర్మలందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసులు (అనగా ముఖ్యభక్తులు, జీవన్ముక్తులు, భాగవతోత్తములు, సద్దురువులు, ఆచార్యులు మొదలగువారు) కూడా లోక హితార్థం ఆసక్తి రహితంగా కర్మలను ఆచరిస్తారు. వారి కోసమై వారేమి చేయరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
11.Sep.2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 63
🌻 63. స్తీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్ ॥| 🌻
పురుషులలో శృంగారం ఉదయించడానికి కారణ భూతమైన స్త్రీల కథలను వినరాదు. ఇంద్రియ భోగాలకు, వ్యసనాలకు ఆలవాలమైన ధనంతో ముడిపడిఉన్న విషయాలను వినరాదు. నాస్తికులతో వాదన చేయరాదు. ఈ మూడింటిని శత్రువులుగా చూడవలెను.
స్త్రీ విషయంగా దర్శనం, స్పర్శనం, కేళి, కీరనం, గుహ్యభాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియానివృత్తి అని ఎనిమిది మైధున భావా లున్నాయి. స్త్రీ సంపర్కం చేయకున్నను పై ఎనిమిది వికారాల వలన మనసు చలించి భక్తిభావం విచ్చిన్న మవుతుంది. స్త్రీలపై తృష్ణ భోగ్యతా బుద్ధి విడనాడాలి. అట్లే స్త్రీలు కూడా పురుషుల యెడ ఈ విధమైన వికారాలు కలుగకుండా చూచుకోవాలి.
ధనం వలన చెడు అలవాట్లు కలిగి, వ్యసనాలవాలై విడుదలవడం కష్టమవుతుంది. ఇంద్రియ భోగలాలసకు అవకాశం కలుగుతుంది. ఇక దిగ జారుడు మొదలవుతుంది. కనుక కాంత, కనకాల ప్రస్తావనే రాకూడదని చెప్పన్నారు. ఆ విషయాలు ఎవరైనా చెపితే వినరాదని కూడా చెప్తున్నారు. అత్యంత జాగరూకత అవసరం.
శివ భక్తుడైన రావణుడు స్త్రీ కాంక్ష వల్లనే పతనమయ్యాడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదను మాతవలె భావించారు. భక్త ప్రహ్లాదుడు స్త్రీలు ఎదురైతే మాతృభావంతో అడ్డుతొలగేవాడు. “ప్రతి స్త్రీలో అమ్మను చూచేవాడికి అందనిదంటూ లేదు” అని జిల్లళ్ళమూడి అమ్మ వాక్యం.
స్త్రీలు వలె పురుషులు కూడా వారి శరిర రూప సౌందర్య పోషణ గావించు కోవడం చూస్తుంటాం. ఇట్టి విలాసపరులచే స్త్రీలు ఆకర్షింపబడాలనే కదా ఈ అలంకారం ? ఇట్టి బాహ్యమైన ఆడంబరాల మీద ధ్యాస ఉంటే ఇక భక్తి ఏకాగ్రతలు ఎలా కుదురుతాయి ? ఇదే మాదిరిగా స్రీలు కూడా ఆడంబరాలకు దూరంగా ఉండాలి.
నాస్తిక వాదులతో స్నేహం, వారితో వాదోపవాదాలు చేయడం వలన మనలో ఉన్న ఆస్తిక్య బుద్ధిలో సందేహాలు తలెత్తుతాయి. అంతటితో భక్తిలో ఏకాగ్రత తగ్గటం మొదలవుతుంది. భక్తి పెంపొందే దిశగా సత్సంగ గోష్టిలో పాల్గొంటూ పెద్దల సలహాలను, మార్దదర్శకాలను పాటించాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
12.Sep.2020

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 64
🌻 64. అభిమాన దంభాదికం త్యాజ్యమ్ ॥ 🌻
నేను, నాది అనె స్వార్ధంతో కూడిన అభిమానాన్ని వదలాలి. గర్వం, దురహంకారం, దంభం, దర్పం, ఇవన్నీ భక్తి పెరగడానికి అద్దు వసాయి. దానికి బదులుగా వినయ, విధేయతలతో కూడిన క్షీణించిన అహంకారాన్ని ఆశ్రయించాలి.
నమత భావం, ఇతరుల యెడ గౌరవ భావం, ప్రవర్తనలో సభ్యత సంస్కారాలు, ఇటువంటి వాటిని అలవర్చుకోవాలి. ఇతరులలో ఉచ్చనీచాలను చూడరాదు. అందరి కంటె తానె తక్కువ అని అన్ని విషయాలలో తగ్గి ఉండాలి.
"హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు 'హెచ్చింపబడును” అని బైబిల్ వాక్యం.
లోక కల్యాణం కోసం చెసే సేవలోను, కించిత్ అహంకారం జనించ వచ్చును. “నేను ఈ మంచి పని చేశాను” అని కర్తృ భావం రావచ్చును. అప్పుడు భగవంతుడు నాకి అవకాశం ఇచ్చాడు గనుక అది నా భాగ్యం అని భావిస్తే అభిమాన దంభాలు వోతాయి.
భక్తుడు చెసే సేవ ప్రాచుర్యం కావచ్చును గాని, భక్తుడు మాత్రం తన పేరుకు ప్రాచుర్యం రావాలని కోరుకోకూడదు. తన ప్రమేయం లేకుండా తన కీర్తి వ్యాపిస్తే నిర్లిప్తంగా ఉండాలి. దీనులకు చేసే సేవ భగవత్యెంకర్యంగా ఉండాలి. ముఖ్యభక్తుడైన పిదప ఈ చెప్పినవేమీ పట్టవు. కాని సాధన దశలో ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
13 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 65
🌻 65. తదర్పితాఖీలాచారః సన్ కామ క్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్ ॥ 🌻
భగవంతునికి అర్పణ అయిన భక్తుడు ఇంకనూ తనలో కామక్రోధాభిమానాలు మిగిలి ఉన్నాయని అతడికి తెలిస్తే అవేవో ఇతర జీవుల మీద చూపించకుండా భగవంతుని మీదే చూపిస్తే మంచిది.
ఇతరుల మీద చూపిస్తే బంధమవుతుంది. భగవంతుని మీద చూపిస్తే ఆయన నుండి ఏ ప్రమాదం ఉండదు. భక్తుడు అలా భగవంతుని మీద చూపినందుకు తరువాత బాధ పడతాడు, పశ్చాత్తాపపడతాడు. అందువల్ల అతడిలో భక్తి భావం మరింత పెరుగుతుంది. ఈ ప్రతిస్పందనల వలన కామ క్రోధాభిమానాలు క్రమంగా తగ్గిపోతాయి.
గొప్పు భక్తుడను అని భావించిన వారికి గర్వభంగం జరిగిన ఘటన లెన్నో ఉన్నాయి పురాణాలలో. భక్తురాలైన సత్యభామకు శ్రీకృష్ణ భగవానుడు కేవలం తన వాడనే అహంకారం కలుగగా కృష్ణ తులాభారంతో గర్వ భంగమైన కథ మనకు తెలుసు.
అహంకారంలేని రుక్కిణీ మాత భక్తికి భగవానుడు అధీనమైన సంగతీ తెలుసు. ఆ సత్యభామ తనలోనున్న భక్తి భావం వలన అహంకరించింది గాని, ఇతరులమీద కాదు. అందువలన భగవంతుడు ఆమె అహంకారాన్ని తొలగించి ఉపాయంతో ఆమెను అనుగ్రహించాడు.
కనుక కామక్రోధాభిమానాలను భగవంతుడిపై చూపితే గుణపాఠం జరిగి, మేలు జరుగవచ్చును గాని, అది బంధం కాదు. బంధమే అయినా అది భగవంతునితోనే గనుక ప్రమాదం లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
14 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 66
🌻 66. త్రిరూప భంగపూర్వకం నిత్య దాస్య
నిత్యకాంతా భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవ కార్యమ్ ॥
భక్తి మూడు రూపాలుగా తామసిక, రాజసిక, సాత్వికాలుగా ఉంటుంది. మరల సాత్విక భక్తిలో ఆర్త, అర్ధార్ధి, జిజ్ఞాసు భక్తి అని మూడు రకాలుగా ఉంటుంది.
ఇవన్నీ ఈ చెప్పిన క్రమంలో సోపానాలుగా చెసుకొని ఎక్కి దాటిపోయ పద్ధతిలో భక్తి సాధన ఉంటుంది. చివరకు భక్తి అనేది కేవలం భగవంతుని మీద ప్రేమ చాటడానికే అన్నట్లు స్థిరపడుతుంది. ఇట్టి కేవల భక్తిని సాధించడానికి యజమాని పట్ల సేవకుడు చూపే వినయ విధేయతలు మాదిరి ఉండాలి. దైవేచ్చ ప్రకారం బాధ్యతగా నడచుకోవాలి. ప్రతి ప్రాణిలోను భగవతుడిని దర్శించ గలగాలి. పరోపకార సేవలను భగవదర్పణగా, భగవదారాధనగా భావించాలి.
తన భక్తిని భగవంతుడు అంగీకరిసాడా ? అని అనుమానం రాకూడదు. “భగవంతుడి కోసం ఏమైనా ఇస్తాను, ఏమైనా చేస్తాను, ఎన్ని బాధలనైనా అనుభవిస్తాను” అనే త్యాగబుద్ధితో ఉండాలి.
భగవంతుని నుండి ఏమీ ఆశించ కూడదు, ఒక్క ప్రేమ తప్ప. తను మన ధనాలను అర్పణ చేసి, కర్తృభావం లేకుండా భగవత్సేవను కైంకర్య పద్ధతిగా చేయాలి. భగవంతునిమీద అమితమైన ప్రీతిని పెంచుకోవాలి. ప్రేమార్ధమే భగవంతుని ప్రేమించాలి.
ఈ విధంగా చేస్తే గౌణభక్తి ముఖ్యభక్తిగా మారుతుంది. ముఖ్యభక్తుడి విషయంలో భగవత్సేవలో కైంకర్యం, అకారణ ప్రేమ, ఇవన్నీ సహజంగానే ఉంటాయి, అప్రయత్నంగా జరుగుతాయి.
సాధన దశలో అడుగడుగునా భగవదనుగ్రహం ఉంటుంది. ముఖ్యభక్తుడిని పరాభక్తిలో స్టిరం చేసే భగవదనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది.
పరాభక్తి మాత్రం సాధన యొక్క ఫలితం కాదు. అది సిద్ధమై ఉన్నది. ముఖ్యభక్తి అయితే భక్తి ఫలంగా, ఆత్మ తత్తానుభవంగా సాధ్యమవుతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
15 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 67
🌻 67. భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻
ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు.
భక్తి త్రివిధాలు :
1) బాహ్య భక్తి
(2) అనన్య భక్తి
(3) ఏకాంత భక్తి
1. బాహ్య భక్తి :
ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి.
ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి.
దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.
ముదిత :
భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత.
కరుణ :
దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.
మైత్రి :
దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.
ఉపేక్ష :
పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.
2. అనన్య భక్తి :
సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.
3. ఏకాంత భక్తి :
భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.
ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.
అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః
- భగవద్గీత (12:16)
ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
16 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 68
🌻 68. కంఠావరోధ రోమాశ్చాత్రుభిః పరస్పరం లపమానా 2 పావయని కులాని పృథివీంచ || 🌻
ముఖ్యభక్తి లభించినవారు, ఆ భక్తి విశేషం చేత సంభాషించేటప్పుడు వారి గొంతులో ఆర్ధత జనిస్తుంది. దగ్గుత్తిక కలుగుతుంది. రోమాలు నిక్క పొడుచు కుంటాయి. ఆనంద బాష్పాలు రాలుతాయి. శరీరం గగుర్పాటు చెందుతుంది. ఇవన్నీ బాహ్యంగా కనిపించే సూచనలు.
భక్తుల సర్వావస్థలలో వారు ఏదిచేస్తున్నా భక్తి రసంతో నిండి ఉంటుంది. వీరు భక్తి కథామృతాన్ని గ్రోలుతూ ఉంటారు. వీరీవిధంగా చేస్తూ పాపాత్ములను పునీతులుగా చేస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే భక్తి పారవశ్యంతో భగవంతుని కల్యాణ గుణ కీర్తన చేస్తూ ఉంటారు. దీని వలన ఇతరులు భక్తి మార్గంలో ప్రవేశిస్తారు.
ఇతరులు వారిని బాధలకు గురిచేసినప్పటికీ భక్తిని మానరు. భక్తి ప్రచారం చేస్తూనే ఉంటారు. వారి భక్తిని బట్టి వారిలో వారి చుట్టూ తేజో మండలం వ్యాపించి, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఆకర్షణీయమై ఉంటుంది.
ఈ భాగవతోత్తములు ఎక్కడో గుహాంతరాలలో ఉన్నప్పటికీ సుదూరంలో ఉన్న శుద్ధ మానసుల హృదయాలలో వారి తేజస్సు ప్రతిఫలిస్తూ ఉంటుంది. తద్వారా సామాన్య గౌణభక్తులలో సాధన ఉధృతి కలుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Sep 2020
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 69
🌻 69. తన్మయా ॥ 🌻
ముఖ్యభక్తులక్కడ ఉంటారో అక్కడి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలవుతాయి. వారు న్నాన వానాదులు జరిపిన నదీనదాలు తీర్ధాలవుతాయి. వారు సంచరించె చోటు తపోవనమౌతుంది.
గంగానది పాపాత్ముల పాపాలను హరిస్తుంది. అయితే వారి పాపం గంగానది స్వీకరిస్తే ఆ పాపం ముఖ్యభక్తుల స్పర్శచెత నశిస్తూ ఉంటుంది. ఆ నది తిరిగి పవిత్రమవుతుంది. అలాగే అన్ని తీర్దాలున్నూ. వీరెక్కడ నివసిస్తారో, భగవంతుడూ అక్కదే ప్రతిష్టితుడవుతాడు. అందువలన ఎ దేవాలయానికి వెళ్ళినా భగవద్దర్శనానికంటె ముందు ఆళ్వారు దర్శనం చేయదం ఆనవాయితీగా ఉన్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
18 Sep 2020

🌹. నారద భక్తి సూత్రాలు - 99 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 70
🌻 70. తీర్ధి కుర్వన్త్సి తీర్తాని, సుకర్మి కుర్వన్తి కర్మాణి, సచ్చాస్త్ కుర్వన్తి శాస్తాణి ॥| 🌻
ముఖ్యభక్తులు తీర్ధ న్నానాలకు పవిత్రతను కలిగిస్తారు. సకల కర్మలను పావనం చేస్తారు. సర్వ శాన్తాలకు ప్రమాణత్వం ఆవాదిస్తారు.
ఒక్కొక్క బుషి తపో మహిమచేత ఒక్కొక్క క్షేత్రానికి పవిత్రత కలిగి, అది భక్తుల వావాలను హరిస్తుంది. అక్కడి నదులు తీర్ధాలై భక్తుల పాపాలను కడిగేస్తాయి.
కనుక క్షేత్రాలను సందర్శిస్తూ తీర్థాలను సేవిస్తూ అక్కడి క్షేత్ర మహిమను, దానికి కారణమైన బుషి చరిత్రను తెలుసుకుంటూ, తన భక్తిని పెంచుకోవాలే గాని, ఈ యాత్రలను వినోద, విహార యాత్రగా జరుపరాదు. అప్పుదే తీర్ధాటన ఫలం లభిస్తుంది. భాగవతోత్తముల సద్భక్తిని తెలుసుకొని, తన భక్తితో పోల్చుకుని, తన భక్తిని తగిన విధంగా సవరించు కుంటూ పెంపొందించుకోవాలి.
ఏ క్షేత్రమూ సాధారణ మానవులచెత ఏర్పాటవదు. అలా చేసినా, దానికి పవిత్రత కలుగదు. మహాత్ముల స్పర్శచెతనే పవిత్రత సమువార్దించ బడుతుంది. ఏ క్షేత్రం స్వతంత్రంగా మహిమ కలది కాదు. మహాత్ముల వల్లనే మహిమగలది అవుతుంది.
భాగవతోత్తముల అనుభవమే (రగ్రమాణం. వారి అనుభవాలే శాస్త్ర మయింది. తరువాత శాస్త్రానికి ప్రమాణం ఆవాదమయింది.
స్వతంత్రంగా శాస్త్రానికి ప్రమాణం లేదు. అనుభవజ్ఞుల అనుభవానికి శాస్త్రానికి తేడా వస్తే భాగవతోత్తముని అనుభవమే ప్రమాణం. అప్పుడు శాన్తాన్ని వదలి వెయాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
19 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 71
🌻 71. మోదన్తె పితరో, నృత్యన్తి దేవతాః సనాధాచేయం భూర్భవతి 🌻
ముఖ్యభక్తుని వంశంలోని పితృ దేవతలందరు సంతోషిస్తారు. అతడి కారణంగా దెవతలు ఆనందిసారు. అతడు భూమిమీద నివసించడం వలన భూమి సురక్షితమవుతున్నది. అందువలన భూమిమీద నివసించి అందరూ క్షేమంగా ఉందగలుగుతున్నారు. ప్రకృతి విపత్తులు రావడం లేదు. అతివృష్టి అనావృష్టి వలన నష్టం ఉండటంలేదు. కరువు కాటకాలు లేవు.
పితృ బుణం కర్మకాండగా తీర్చడం లోక సహజం. కాని ముఖ్య భక్తుల విషయంలో అతడి వంశంలోని పితరులందరికీ సర్వవిధ బుణాలు వాటంతట అవే తీరిపోతాయి. ఆ వంశంలో కర్మకాండ అవసరం ఉండదు.
దేవతలు యజ్ఞ యాగాదుల వలన తృప్తి పడతారు. కాని ముఖ్య భక్తుని విషయంలో యజ్ఞ యాగాదులు లేకుండానే తృప్తిచెంది ఉంటారు. యజ్ఞ శేషం దేవతలకు దానంతట అదే చెరుతుంది.
పాపాత్ములను ధరించే ధరణి ఆ పాపాన్ని మోయలెక ఉపద్రవానికి లోనవుతుంది. ముఖ్యభక్తుని ఉనికి వలన ఆ భూమి తిరిగి సురక్షిత మవుతుంది. అప్పుడు ఏ ప్రమాదం ఉండదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
20 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 72
🌻 72. నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధన క్రియాది ఖెదః ॥ 🌻
భగవత్రసన్నత్వం కలిగినప్పుడు జాతి వగైరా భెదాలు ఉండవు. జ్ఞాన అజ్ఞానాలు, కుల భేదం, ధనిక, పెద ఖేదం వృత్తి భేదం క్రియా భిదం వంటివి ఉందవ.
ముఖ్యభక్తి కలిగాక ఎటువంటి ద్వంద్వాలు తోచవు. భగవదనుగ్రహం భక్తి న్ధాయిని బట్టి ఉంటుంది గాని, జాతి, కులం వంటి భేదాన్ని బట్ట ఉందదు.
నందనారు, రవిదాసు, కన్నపు మొదలగు నిమ్న జాతివారు భగవ దనుగ్రహం పొందారు.
మీరాబాయి, ఆందాళ్, అవ్వయ్యారు వంటి స్రీలు భగవనుగ్రహం పొందారు. ప్రథమంలో దురాచారులై, పిమ్మట భక్తులైన వారు కూడా భగవంతుని కృపకు వాత్రులయ్యారు. అజామీళుడు, రత్నాకరుడు (వాల్నీకి), బిళ్వమంగళుడు వీరంతా మొదట దురాచారపరులు. అయినా వారికి భగవంతుని ప్రసన్నత లభించింది. చదువుకోని కబీరు, గురునానక్, తుకారాం ప్రభృతులు భక్తి వలన ముక్తులైనారు. రాక్షసులలో ప్రహ్లాద, బలి చక్రవర్తులు మోక్షం పొందారు.
ఎవరైనా సరే భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, భక్తి ప్రపత్తులు ఉన్నవారు జాతి, మత, లింగ భిదం లేకుండా భగవంతునిచే అనుగ్రహింప బడతారు. భక్తి చేయడానికి గాని, తరించడానికి గాని అందరూ అర్హులే. కాని భక్తి తీవ్రతను బట్టి మాత్రమె భగవంతుని అనుగ్రహం ఉంటుందని గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
21 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73
🌻 73. యత స్తదియా ॥ 🌻
అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.
హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
22 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73
🌻 73. యత స్తదియా ॥ 🌻
అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.
హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
23 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 74
🌻 74. వాదో నావలంబ్యః ॥ 🌻
ముఖ్యభక్తుల విషయంలో వారికి భగవంతుని గురించి గాని, భక్తుల గురించి గాని, శాస్త్రాల గురించి గాని వాదోపవాదాలు చెయాలని అనిపించదు. వారికి వారి అనుభవమే ప్రమాణం.
ఇతరుల విషయంలో సహజంగానే ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్షలు కలుగుతాయి. ఇది బాహ్యానికి మాత్రమె. అంతరంలో సర్వం భగవన్మయంగా ఉంటుంది. అందువలన వాదోపవాదాలకు తావులేదు.
ఒకవేళ వారితో ఎవరైనా వాదానికి దిగితే నాకు తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాను” అంటారు. అహంకార ముందదు గనుక అవమానపదరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
24 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 75
🌻 75. బాహుళ్యావకాశత్వాత్ అనియతత్వాశ్చ ॥ 🌻
పరమార్ధం ఒక్కటే అయినా ఒక్కొక్కరు భగవత్స్వరూపాన్ని ఒక్కొక్క రూపంగా చూదదం కూడా ఉంటుంది.
భక్తి సాధన భగవంతుని నాకారంగా భావించి చేయదం వలన, వారికి ఆ విధమైన సవికల్ప రూవాలు, దర్శనాలు ఉంటాయి. అంతమాత్రం చెత అది సత్యం కాకపోదు. సత్యానికి ఒక పార్వ్వం కావచ్చును. అయితే సంయక్ సత్యం మాత్రం వీటన్నిటినీ కలిపి ఉంచే పరిపూర్ణత. ముఖ్య భక్తుల దర్శనాలు ఇలాగే ఉంటాయి.
ఎలాగంటే ధృవుడికి నారదుడు ఉపదేశించిన విష్ణు రూపం ఎలా ఉందో, ధృవుడికి అలాగే ప్రత్యక్షమైంది. అదెమంటే ధృవుడు శంఖు చక్ర గదా పద్మహస్తుడై, పట్టు పీతాంబర ధారియై నీల మేఘశ్యాముడైన విష్ణు స్వరూపాన్ని దర్శించాడు. పరమాత్మ దర్శనాన్ని దేదీప్వ్యమైన ప్రకాశంగా చూచేవారున్నారు.
శివున్ని పన్నగ భూషణునిగా, త్రిశూల ధమరుక హస్తుడైన వానిగా, గంగా చంద్రులను ధరించిన వానిగా, బూడిద పూసుకున్న నటరాజుగా దర్శించవచ్చును.
పరాభక్తిలో ఈ విధమైన సవికల్పాలుండవు. అది నిర్వకల్ప సత్‌చిదానంద అనుభవంగా ఉంటుంది. పరాభక్తి అంటె పూర్ణం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
25 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 76
🌻 76. భక్తిశాస్తాణి మననీయాని త(దు)ద్బోధక కర్మాణి కరణియాని ॥ 🌻
సాధకులు భగవంతుడి పట్ల భక్తి ప్రేమలను గూర్చి వివరించే శాస్త్రాలను విశ్లేషించి, మననం చెస్తూ ఉండాలి. భక్తి ప్రమలను ప్రబోధించి భగవత్మథలను వినాలి, వారి నిత్య కర్మలలో ఆ ప్రమ ప్రతిఫలించాలి.
భక్తి శాస్త్రమంటెే భాగవతం, భగవద్గీత, నారద పాంచరాత్రం, భక్తి రసనాయనం మొదలగునవి. నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు మొదలగునవి కూదా. భక్తుల చరిత్రలు, పురాణ కాలానివి, ఈ మధ్య కాలానివి కలిపి పఠించాలి. ఈ పఠన, శ్రవణ, మననాల వంటి కర్మలు, పవిత్ర కర్మలవడంచేత శుభవాసన ఎర్పడుతుంది. దానివలన సుకృత విశేషం కలిగి, భక్తి పక్వమై పండుతుంది.
భక్తిక్రియా వివరాలు, సాధనా క్రమం, శాస్త్రియ పద్ధతి మొదలైనవి తెలియడమే గాక, పూర్వ భక్తుల సాధన, సాధ్యాలను ఉదాహరణగా సందేహ రహితంగా, అభ్యాసం చేయడానికి వీలవుతుంది. శ్రద్ధ, విశ్వానాలు కలుగుతాయి.
భాగవత కథాగానం, సంకీర్తనం చేయాలి, వినాలి. కాలక్షేపానికైనా సరే నిరంతరం చేస్తూ పోతె భక్తి దానంతట అదే కలిగి, వృద్ది చెందుతుంది. భక్తి పురోగమనం మాట ఎలా ఉన్నా ఈ క్రియల వలన ఇతరమైన అవాంఛిత కర్మల నుండి దూరమవుతాడు.
ఆళ్వారుల భక్తి కీర్తనలు, గోదా దేవి పాశురాలు, తుకారాం, రామదాసు పాటలు, అన్నమయ్య పదాలు, కబీరు గీతాలు, జయదేవుని అష్టపదులు, త్యాగరాయ కీర్తనలు మొదలైనవి విని, పాడుతూ, అనుసరిస్తూ తన్మయమైతే అదీ భక్తే. ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు మొదలైన భాగవతంలోని భక్తులకు సంబంధించి, శ్రీ బమ్మెర పోతన కవి రచించిన పద్యాలను వల్లె వేస్తే మంచిది. ఉదయాస్తమానం భక్తి రసం పొంగేటట్లు ఏది బాగుంటె దానిని తనకిష్టమైనట్లు భక్తుడు సాధనగా చేస్తే అతడు ముఖ్యభక్తుడవుతాడు. కనుక ఈ విధమైన శుభ కర్మలు నిరంతరం చేస్తూ ఉండాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
26 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 77
🌻 77. సుఖ దుఃఖెచ్చా లాభాది త్వక్తే కాలే ప్రతీ(క్ష్య్ర)క్షమాణ క్షణార్ధమపి వ్యర్థం న నెయమ్ ॥ 🌻
భక్తుడు సుఖ దుఃఖాది ద్వంద్వాలను జయించినప్పుడు అతడికి సామాన్యమైన కర్తవ్యాలు ఏమీ ఉండవు. అప్పుడు ఊరకే ఉండడానికి కాలం భారంగా తోస్తుంది. కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండడానికి భక్తుడు శ్రేయో మార్గాన్ని అవలంపీస్తూ కాలాన్ని వినియోగినాడు.
అలా కాకుండా ఊరక ఉంటే మానసికమైన వ్యాపారాలు జనిస్తాయి. వాటికి సందు ఇస్తే ఆ విషయాలే బలీయమై, భక్తికి ఆటంకం కలిగించడమే కాకుండా భక్తిని చెడగొదడతాయి. అందువలన సాధకులు వారు అందుకున్న స్థాయిని (కిందికి దిగజార్చకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఎంతమంచి ఇత్తడి అయినా ప్రతిరోజూ శుభ్రపరచకపోతే చిలుము పట్టుతుంది కదా ! అలాగే సాధన క్రమంలో పట్టు జారకుండా చూచుకుంటె ఆ భక్తి ప్రవర్ధమానమై తేజరిల్లుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 78
🌻 78. అహింనా సత్య శౌచ దయాస్తిక్వాది చారిత్ర్యాణి పరిపాలనీయాణి ॥ 🌻
అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం మొదలైనవి కూడా భక్తిని నిలుపు కోవడానికి ఉపయోగపదే సాధనలు.
అహింస అంటే తన వలన ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ విధమైన బాధ కలుగకుండుట. ఇతరులు బాధ పెట్టినా, ప్రతీకారంగా చెసేది కూడా హింసే అవుతుంది. ఇతరుల మనస్సుకు భక్తుడి వలన ఎట్టి బాధ కలుగకూడదు. సాధకుడు రజోగుణం విడిచి, సాత్వికుదైతే గాని భక్తి నిలవదు.
సాధకుడి వ్రతం అహింస గనుక, తన కారణంగా ఇతరులకు బాధ కలుగక పోయినా తన తలపులలో కూడా ఇతరులకు బాధను కలిగించే ఆలోచన రాకూడదు. అంతేకాదు, శత్రువును కూడా ప్రేమించ గలగాలి.
జిల్లళ్ళమూడి అమ్మ బాధల గురించి ఏమి నిర్వచించారో చూడండి. “శరీరానికి తగిలితే నొప్పి, మనస్సుకు తగిలితే బాధ. మనస్సుకు బాధ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటె లేదు. సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదు. బాధంటే చైతన్యమే. బాధ లేకపోతే స్థాణువై పోతాడు. బాధలు అనుభవిస్తున్నా అది బాధ అనిపించనప్పుడు సహజ సహనమవుతుంది. సర్వకాల సర్వావస్థలందు సహజ సహనమె సమాధి. సమాధి అంటే మోక్షమే కదా !
అహింసకు అమ్మ చెప్పిన భాష్యమేమంటే బాధలుండడం భగవంతుని దయ. ఎందుకంటె బాధలు సహించుకోవడాన్ని సహజం చేసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరిక్ష కోసమే బాధలున్నాయి. కనుక ప్రతిచర్య హింస అవుతుంది.
సత్యం అంటే అబద్దములాడకుండుట. సత్య వాక్పరిపాలనకు శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు ఉదాహరణీయం. సత్యవ్రతం అంటే సత్యం జ్ఞానం అనంతం అయిన భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. అనిత్య వస్తువుల యెడ ఆసక్తి వీడి, సత్యమైన భగవంతుని మీద అనురాగం పెంచుకోవడం. స్వార్ధాన్ని త్వాగం చేయదం సత్యమే అవుతుంది.
అంతఃకరణ శుద్ధి భక్తికి కావలసిన ఉత్సాహం బాహ్య శౌచం వలన కలుగుతుంది. సర్వ జీవులందు వాటి దీనత్వాన్ని బట్టి కలిగేది దయ. నా వారు, ఇతరులు అనే భేదం లేకుండా కలిగేది దయ.
భక్తి చేసేవాడికి “భగవంతుడున్నాడు, తప్పక అనుగ్రహిస్తాడు” అనె విశ్వాసం ఉండాలి. దీనినే ఆస్తిక్యము అంటారు. ఇట్టి దృఢ విశ్వాసం లేకపోతే భక్తి సఫలం కాదు.
అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం ఉన్నప్పుడు, గొణభక్తి ముఖ్యభక్తిగా పరిణమిస్తుంది. రాగద్వేష అసూయలున్న వారికి భక్తి అనేది, కపట ప్రదర్శనే అవుతుంది. కనుక భక్తిని నిజాయితీగా సలపడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
28 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 79
🌻. 79. సర్వదా సర్వభావేన నిశ్చింతై: (చితైః) భగవానేవ భజనీయః || 🌻
సమస్త వ్యాకులతలను వదలి జీవించి ఉన్నంతకాలం నిరంతరం భగవంతుని భజిస్తూనే ఉండాలి. ముఖ్యంగా వ్యాకులపాటు ఉన్న సమయంలో ఎక్కువగా భజించాలి.
మెహెర్ బాబా సందేశం ఏమంటే "DON'T WORRY, BE HAPPY" ఇది సాధన వాక్యంగా తీసుకుంటే వ్యాకులపాటు వచ్చినప్పుడే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.
సత్య వాక్యంగా తీసుకుంటే “నీవూ భగవంతు డవే. భగవంతుడు ఆనంద స్వరూపుడు గనుక, నీవు కూడా ఎప్పుడూ, ఆనందంగా ఉండు, వ్యాకులపడకు” అని, దైవేచ్ఛ ప్రకారం జీవిస్తున్నామనే భావనలో ఏది జరిగినా భగవంతుని ఇచ్ఛ అనుకోవాలి. బాధలున్నప్పుడు దైవం నాకు పరీక్ష పెట్టి, పిదప అనుగ్రహిస్తాడు అనుకోవాలి.
ఏ పరిస్థితిలో ఉన్నా, దైవం నన్నీ పరిస్థితిలో ఉంచాడు, అది నా మేలుకేనని అనుకోవాలి. భజన నిరంతరం చేస్తూ చేస్తూ, జీవించి ఉండగానే ముఖ్యభక్తుడవాలి.
లేకపోతే భగవంతుని ధ్యానిస్తూ ధ్యానిస్తూ, మరణించాలి. వ్యాకులపాటు లేని భజన వలన భక్తి పుష్పించి, భావ సమాధికి చేరుస్తుంది. అప్పుడు సాధకుడు వెనుదిరగడు. ముఖ్యభక్తిలో స్థిరమవుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group :
https://t.me/ChaitanyaVijnanam
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 80
🌻 80. స కీర్తనీయః (కీర్త్యమానః) శీఘ్రమేవావిర్భవ
త్యనుభావయతి (చ) భక్తాన్ || 🌻
భగవంతుడిని భజిస్తే, భజన తీవ్రతను బట్టి ఆ భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. భక్తుని తనలో మమేకం చేసుకోవడానికి అవసరమైన తత్త్వానుభూతిని అనుగ్రహిస్తాడు. నిశ్చింత భజన వలన భావ సమాధి ప్రాప్తిస్తుంది.
భావ సమాధి ఫలమేమంటే భక్తుడు భగవంతుని ఏ రూపంలో భజిస్తాడో, అదే రూపంలో ఆయన భక్తుల అంతర్దృష్టికి గోచరిస్తాడు. ఇది భావమాత్రం కాదు, ముఖా ముఖిగా ఉంటుంది. దీనిని సాలోక్య ముక్తి అంటారు. సాలోక్య ముక్తిలో భక్తుడు భగవంతునితో నిరంతరం ఉంటూ, ప్రపంచంలో జరిగేవన్నీ భగవంతుని విలాసంగా గ్రహిస్తాడు.
భగవద్విలాసంగా చూస్తూ ఉండడాన్ని సామీప్య ముక్తి అంటారు. భగవంతునితో ఉంటూ, దైవీ విలాసాన్ని చూస్తూ ఉండడంలో భక్తుడు తన్మయమవుతాడు. ఫలితంగా భక్తుడిలో భగవద్వృత్తికి దారి తీస్తుంది. ఇది సారూప్య ముక్తి అనబడుతుంది. భక్తిశాస్త్రం సారూప్య ముక్తిని చరమ ఫలంగా నిర్ణయిస్తుంది. అద్వైతమతం సాయుజ్య ముక్తినే భగవదైక్యంగా చెప్పి దీనిని చరమ ఫలంగా చెప్తుంది.
విశిష్టాద్వైత మతం ప్రకారం, భక్తుడు సాయుజ్యాన్ని కోరడు. భగవంతుని సేవిస్తూ తద్రూపాన్ని అనుభవిస్తూ ఉండిపోవడమే భక్తుడి కోరిక. కాని భక్తుడు కోరకపోయినా, భగవంతుడు సాలోక్యాది పదవులే గాక, సాయుజ్య ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ముఖ్యభక్తి యొక్క పరమావధినే సాయుజ్య ముక్తి అంటారు.
దీనినే ఏకాంత భక్తి అని కూడా అంటారు. ఏకాంత భక్తిని పరాభక్తి లేక పరమప్రేమ అని కూడా అంటారు. మధ్వ మతంలో అనగా ద్వైతమతంలో
1) హరిసర్వోత్తముడు
2) జీవులు అస్వతంత్రులు, పరమాత్మకు సేవకులు
3) మోక్షమంటే పరమాత్మ పదకమలాల జేరి, స్వస్వరూప ఆనందానుభూతిని పొందటం.
4) పరమాత్మునియందు అచంచల భక్తే మోక్ష సాధనం.
విశిష్టాద్వైత మతం ప్రకారం జీవుని స్వరూపాన్ని అయిదు దశలుగా చెప్తారు. 1) నిత్యులు (2) ముక్తులు (3) కేవలులు (4) బద్దులు (5) ముముక్షువులు.
1 నిత్యులు : జనన మరణాది అవస్థలెరుగనివారు. స్వయం ప్రకాశమానులు. నిరంతర భగవదనుభవపరులు. వీరిని నిత్య సూరులు అంటారు. అనగా గరుడ, అనంత, విష్వక్సేనులు మొదలగువారు. వీరు విష్ణు లోకంలో ఉంటూ, విశ్వ పోషణకు విష్ణు మూర్తికి సహాయపడుతూ ఉంటారు. ముక్తి పొందినవారు ఇక్కడికి చేరుతారు. వీరందరూ శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటారు.
2. ముక్తులు : భగవద్భక్తులై, దేహ త్యాగానంతరం పరమపదం జేరి నిత్య సూరులతో కలసి ఆనందిస్తూ ఉంటారు.
3. కేవలులు : జ్ఞాన, యోగ సాధనలచే బంధ విముక్తులై పైన చెప్పిన ముక్త స్థితికి ఆవలివారై కైవల్యం పొంది అనుభవమే తామైన వారుగా ఉంటారు. దీనినే సాయుజ్య ముక్తి అంటారు.
4. బద్ధులు : తమ స్వరూపాన్ని మరచి దేహమే సత్యమని, ఇంద్రియ లోలురై కష్టపడుతూ ఉంటారు. కష్టపడటంలోనే సుఖమున్నదను భ్రాంతి పొందుచు, చివరకు దుఃఖపడుతూ ఉంటారు.
5. ముముక్షువులు : ప్రపంచం విష్ణు మాయ అని, సంసారం బంధమని తెలిసి, భగవద్భాగవతాచార్య కైంకర్యపరులై ఉండువారు. ఈ మతంలో భక్తులు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులనే కోరు కుంటారు. వీరు ఆనంద పరవశాన్ని. భగవత్సేవను మాత్రమే కోరు కుంటారు. సాయుజ్య ముక్తిలో అవి ఉండవు. లడ్డూగా ఉండడం సాయుజ్య మైతే, తీపిననుభవించడం సాలోక్యాది త్రయముక్తులు. వీరు లడ్డూగా ఉంటే ఏ ఆనందం ఉండదు గనుక, ఆ లడ్డూలోని తీపి దనాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండడం ఉత్తమ మంటారు. పైగా భక్తుడూ, భగవంతుడూ ఒక్కటేననే దాన్ని అపచారంగా భావిస్తారు.
సాయుజ్య ముక్తి పొందిన వారెలా ఉంటారంటే నవ యౌవన సుందర కోమలాంగి సర్వాలంకార భూషితయై భర్తను వీడిన వనిత వంటివారు అని అంటారు. ఇట్టి సాయుజ్యాన్ని వారు కోరరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 1
🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 1 🌻
భగవంతునికి భక్తి చేయడం అంటే ఆయనను త్రికరణ శుద్ధిగా ప్రేమించడమే. అలా ప్రియతమ భగవంతుడిని ప్రేమికుడిగా ప్రేమించడం ఉత్తమ భజన అవుతుంది. ముమ్మాటికీ ప్రియతముడు, ప్రేమికుడు అనే పద్ధతిలో ప్రేమించడమే ఉత్తమం.
నామ రూపాలు లేని భగవంతుడిని ఎలా ప్రేమించడం ? లక్షణ వృత్తిగా ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకార్థంగా నిర్ణయించిన నామాలే భగవన్నా మాలు. ఆనృత జడ దుఃఖాలకు వ్యతిరేకార్థంగా సత్ చిత్ ఆనందమని భగవంతుని నామం. ప్రకృతి ఇహం అయితే పరమాత్మ పరం.
ప్రకృతి అనిత్యమయితే ఆయన నిత్యుడు. అలాగే అన్ని నామాలూ, బోధనార్థం భగవంతుడికి పరం, నిత్యం, సత్యం, జ్ఞానం, అనంతం, అద్వయం, నిర్వి కారం, నిరాకారం, అచలం, సనాతనం మొదలైన నామాలతో పిలుస్తారు.
ఈ నామాలు అర్థం చేసుకుంటే ఆయన ఇంద్రియ గోచరం కాదని తెలుస్తుంది. అందువలన ఆయనను ప్రేమించడం ఎలా? మంచిని ప్రేమిస్తాం.
మంచితనం ఎలా కనబడుతుంది? ఆ గుణమున్నవాడు చేసే క్రియలలో మంచితనం తెలుస్తుంది. మంచివాడిని ప్రేమిస్తే మంచితనాన్ని ప్రేమించినట్లే అవుతుంది. మనం దేహాన్ని ప్రేమించడంలేదు. ఆ దేహంలో ఉన్న మంచితనాన్ని ప్రేమిస్తున్నాం. వాడిలో మంచితనం లేకపోతే ఆ దేహం ప్రేమించబడటానికి యోగ్యం కాదు.
అలాగే భగవంతుని ప్రేమించడానికి రామకృష్ణాది అవతార రూపాలను ప్రేమిస్తాం. ఆ అవతార మూర్తులు ఇప్పుడు లేరు కదా అంటే, ఆయా రూపాలలోని దైవత్వం శాశ్వతం కదా! మనం దైవాన్ని ప్రేమిస్తున్నప్పుడు, రూపం అనేది మొదట్లో దైవత్వానికి చిరునామాగా ఉంది. దైవ భావం అర్థం కాగానే చిరునామాతో పనిలేదు కదా ! మన పెద్దలను వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమించామనుకోండి. వారిప్పుడు లేకపోయినా వారి పటాన్ని పెట్టుకొని ప్రేమ వ్యక్తం చేయడం లేదా ? వారికిప్పుడు రూపం లేదు. పటమే వారు కాదు. అయినా వారిపై ప్రేమ వ్యక్తం చేయడానికి ఆ పటం ఆధారమైనట్లే, భగవంతుని అవతార రూపాలు, విగ్రహాలు మనకు ఆధారమవుతాయి. పెద్దల పటం మన ఎదుట లేకపోయినా, ప్రేమించగలం.
అలాగే భగవంతుని రూపం మనస్సులో పెట్టుకొని ఆయనను ప్రేమిస్తాం. బొమ్మలే కదా అని వాటిని పారేస్తే భగవంతుని అవమానించినందుకు భక్తుడు విలపిస్తాడు. త్యాగరాజు ఆరాధించే రాముడు మొదలైన విగ్రహాలను కావేరీ నదిలోకి విసిరేస్తే ఆయన విలపించగా, కావేరి పొంగి ఆ విగ్రహాలు నది ఒడ్డుకు కొట్టుకు వచ్చేటట్లు చేసింది. ఆ విగ్రహాలు దొరకగానే త్యాగరాజ స్వామి ఎంతో ఆనందించారు. మనమైనా, మన పెద్దల పటాన్ని అవమానిస్తే పటమే కదా అని ఊరుకోం కదా ! మన పెద్దలనే అవమానపరచినట్లు భావిస్తాం.
ఈ విధంగా భగవదారాధన ద్వారా భక్తిని పెంచుకోవడమంటే ఆయనను అధికాధికంగా, ఇంకా అధికంగా ప్రేమించడమే. ఈ ఆరాధన కోసం భగవత్స్వరూపాలను అనేక వ్యూహాలుగా, విభవాలుగా నిర్ణయించారు విశిష్టాద్వైతులు. భక్తులకు విభవ రూపాలు ఆరాధ్యం.
వీటిలో పూర్ణావతారం, ఆవేశావతారం, పామరజన మోహనావతారం, అంశావతారం, అర్చావతారం అని అయిదు విధాలు.
1. పూర్ణావతారం : ధర్మ సంస్థాపన కొరకు భూలోకంలో అవతరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణావతారాలుగా చెప్తారు. ఈ అవతారాల వల్లనే భక్తులు ముముక్షువులై భగవదనుగ్రహం పొందుతున్నారు, ముక్తులవు తున్నారు.
2. ఆవేశావతారం : పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశం వలన అవతార కార్యక్రమం నెరవేర్చేవాడు.
3. పామరజన మోహనావతారం : బౌద్ధావతారం పామరులకు ఆకర్షణ.
4. అంశావతారాలు : శివుడు, అర్జునుడు, వ్యాసుడు నారదుడు మొదలగు అవతారాలు.
5. అర్చావతారం : లోహ శిలా రూపాలు, ప్రతిమలు, విగ్రహాలు. దేవాలయాలలో ప్రతిష్ఠించబడినవి కొన్ని, వెలిసిన విగ్రహాలకు దేవాలయాలు నిర్మించబడినవి కొన్ని, భక్తుల గృహమందు పూజింపబడే సాలగ్రాములు మొదలైనవి. భక్తులచే షోడశోపచారాలు స్వీకరించి వారి అభీష్టాలను సిద్ధింపచేసేవి ఈ అవతారాలు.
ఈ విగ్రహాలు జ్ఞానం, శక్తి, ఐశ్వర్యంతో కూడి ఉంటాయని విశ్వసించాలి. ఈ విగ్రహాలను జడమనడం భగవదనుగ్రహానికి విరోధమవుతుందని విరోధోపాయ స్వరూపంలో చెప్పబడింది. అందుకే విగ్రహాలకు పవళింపు సేవలు, మేలుకొలుపులు, కళ్యాణాలను జరుపుతూ ఉంటారు. ఇవన్నీ భక్తులు నామ రూపాలు లేని భగవంతుని ప్రేమించడానికి తగిన ఉపాయాలుగా తీసుకోవాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
01 Oct 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 2
🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 2 🌻
ఈ ఐదు విభవాలు భక్తులకు ఆరాధ్యాలు. ఇవి గాక, అంతర్యా మిత్వం కూడా ఆయన యొక్క విభవమే. అంతర్యామి అంటే అగ్నియందు ఉష్ణత్వంగా, జలమందు ద్రవత్వంగా, జడములందు జడశక్తిగా, ప్రాణులందు ప్రాణ శక్తిగా, జీవులందు జీవచైతన్యంగా, మానవులందు “నేను” గా వ్యక్తమయ్యే మూలశక్తి. ఆ మూలశక్తే పరమాత్మ చైతన్యం, ప్రజ్ఞానం. అదే సత్యం. అది నిరాకారం. దీనినే భగవంతునిగా ఆరాధిస్తాం. విగ్రహాల్లో కూడా అంతర్యామిత్వం ఉంటుంది.
అంతర్యామి అంటే లక్ష్మీ సమేతుడై, దివ్య మంగళ స్వరూపుడై భక్తుల హృదయంలో, సర్వత్రా కొలువై ఉన్నవాడు. తెలుసుకోలేని వారిలో, తెలుసుకోగలిగిన వారిలో కూడా ఉన్నాడు. భక్తి సాధనచేత తెలుసుకొని భగవదైక్యం పొందడానికి భక్తులకే సులభం.
అవాజ్మానస గోచరమైన భగవానుడు జ్ఞాన, ధ్యాన యోగాలలో కంటే భక్తి యోగంలో భక్త సులభుడు. అయితే జ్ఞానుల అవగాహనకోసం కూడా భగవంతుడు వ్యూహాలుగా వ్యాపకమై ఉన్నాడు. అవి అయిదు వ్యూహాలు. మొదటిది పరతత్త్వం.
మిగిలిన నాలుగు (1) వాసుదేవ వ్యూహం (2) ప్రద్యుమ్న వ్యూహం (3) సంకర్షణ వ్యూహం (4) అనిరుద్ధ వ్యూహం.
1. పరతత్త్వం :
కోటి భాస్కర తేజుడై శ్రీ నీళా భూసమేతుడై, హేమ పీతాంబరుడై, శంఖు చక్ర గదా పద్మ ధరుడై, దివ్యాభరణ భూషితుడై, గరుడ, అనంత, విష్వక్సేనుల వంటి నిత్య సూరులచే సేవింపబడుతూ ఉండే తత్త్వం. ముక్తులకు తప్ప, సాధారణ భక్తులకు, ఇతరులకు దొరకనిదే పరతత్త్వం. ఆయన పరమపదమున అపరిమిత ఆనందభరితుడై ఉన్నాడు.
2. వాసుదేవ వ్యూహం :
శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి నరనారాయణుడై తదీయ ప్రతిజ్ఞా నిర్వహణార్థం వైదిక పుత్ర సవకంబున తీసుకొని వచ్చిన స్థానాన్ని వాసుదేవ వ్యూహమంటారు. ఈ వ్యూహం కేవలం నిత్య సూరులకే తెలియబడుతుంది.
3. ప్రద్యుమ్న వ్యూహం :
బ్రహ్మలోకంలో వసించి, బ్రహ్మచేత పూజింప బడుతూ, తద్దేశవాసులను రక్షించే వ్యూహం.
4. సంకర్షణ వ్యూహం :
పాతాళంలో వసించి, బలి చక్రవర్తి, తద్దేశ వాసులను రక్షించే వ్యూహం.
5. అనిరుద్ధ వ్యూహం :
క్షీర సాగరంలో ఒక వైకుంఠాన్ని నిర్మించి, లక్ష్మీ సమేతుడై వసించే వ్యూహం. ఇది పూర్ణావతారాలకు మూల కందం. బ్రహ్మాది మునిపుంగవులు ఆయనను అవతరించమని ప్రార్థించేది ఇక్కడే. బ్రహ్మ, రుద్రులు, దేవతలు, సనకాది మునీంద్రులు, అక్కడికి వెళ్ళారు. ఇది వారి వారి కొరతలు తీర్చుకొనడానికి అనుకూలమైన వ్యూహం.
సాధారణ భక్తులకు ఈ వ్యూహాలు అందుబాటులో ఉండవు. సాధన ఫలితంగా వారు ఆయా వ్యూహాలలో చేరి, ఆనందిస్తారు. భక్తి సలపడానికి విభవ స్వరూపాలే అందుబాటులో ఉంటాయి. అవతారాల కాలం కాకపోయినా వారి విగ్రహాలను అర్చావతారాలుగా భావించి భక్తి సలపడం అందుబాటు లోనిది.
మానసిక భక్తిగా మారే వరకు విగ్రహారాధన చేసే క్రియలను అపరాభక్తి అంటారు. మానసిక భక్తిగా మారి, అది ముఖ్యభక్తి అయినప్పుడు మిగిలింది పరాభక్తి అంటారు. ఈ సూత్రంలో భగవంతుని విభవ రూపాలలో భావించి ప్రేమించడం, దానిని త్రికరణ శుద్ధిగా చేయడం, ఉత్తమ భజనగా చెప్ప బడింది. కాని ఆయన అంతర్యామిత్వాన్ని అర్థం చేసుకొని భజిస్తే పరాభక్తి సిద్ధిస్తుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
02 Oct 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 82
🌻 82. పరమ విరహాసక్తి, రూపా ఏకధా అపి ఏకాదశధా భవతి || 🌻
.
పరమార్థ దృష్టికి భక్తి అనేది ఏకరూపమే. కాని వ్యవహార దశలో అది 11 రూపాలుగా కనబడుతుంది.
1) భగవత్కళ్యాణ గుణాభివర్ణన
2) భగద్దివ్య మంగళ విగ్రహానురాగం
3) భగవత్పూజనం
4) భగవత్స్మరణం
5) భగవత్సేవ
6) భగవంతుని పట్ల సఖ్యభావ ప్రేమ
7) భగవంతుని పుత్రుడుగా భావించి ప్రేమించడం
8) భగవంతుని భర్తగా ప్రేమించడం
9) భగవంతునికి సర్వ సమర్పణ చేయడం
10) భగవన్మయుడై ఉండడం
11) భగవంతుని ఎడబాసి ఉండలేకపోవడం
ఈ విధాలైన భక్తి వారి వారి పూర్వ జన్మల సంస్కారాల ననుసరించి కలుగు తుంటాయి. ఇవి ఏకాదశ రూపాలే కాదు. ఇంకా అనేక రూపాలుగా కూడా ఉండవచ్చును.
నారదుడు, వ్యాసులవారు మొదలైనవారు భగవంతుని కళ్యాణ గుణాభి వర్ణన చేసేవారు.
బృందావన స్త్రీలు భగవానుని దివ్య మంగళ విగ్రహంపై అనురాగం కలిగినవారు. అంబరీషుడు భగవత్పూజలో ఆసక్తి కలవాడు. ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణను విడువనివాడు. హనుమంతుడు శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. ఉద్ధవార్జునులు సఖ్య భక్తిగలవారు.
దేవకీ, కౌసల్యలు పుత్ర వాత్సల్యంతో కూడిన ప్రేమ గలవారు. రుక్మిణీ సత్యభామలు భగవంతుని భర్త రూపంలో ప్రేమించేవారు. బలి చక్రవర్తి, విభీషణుడు భగవంతునికి సర్వ సమర్పణ అయినవారు. సనత్కుమార యాజ్ఞవల్క్యులు భగవన్మయులుగా ఉన్నారు.
గోపికలు భగవంతుడిని విడచి ఉండలేని ప్రేమికులు. వీరి ప్రేమ సాధారణం కాదు. మానవ ప్రేమ వంటిది కూడా కాదు. వీరంతా ఆయా అవతారాలను భగవత్స్వరూపంగా గుర్తెరిగి ప్రేమించినవారే. అందువల్లనే వారు ఉదాహరణీయులు.
వీరు ఒక్కోసారి భ్రాంతిలోపడి, నా పుత్రుడు, నా స్నేహితుడు, నా భర్త అని అనుకున్నప్పటికీ వారిలో సహజంగా ఉన్న నానా విధ ప్రేమ వ్యక్తీకరణాలలో భక్తి భావం ఏకరూపం గానే నిరంతరం ఉన్నది. వీరు భ్రాంతి లేని సమయంలో తన్మయత్వం చెంది ఉంటారు.
విరహాసక్తి గల భక్తికి రాధాకృష్ణులు అత్యుత్తమం. రాధాకృష్ణులు ఇద్దరు కాదు. శ్రీకృష్ణుడే తన ప్రేమ క్రీడ కొరకు తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నాడు.
ఒకటి తానైతే, రెండవది తన ఛాయ. ఆ రెండవదే రాధ. శ్రీ కృష్ణుడు రాధను ప్రేమించడమంటే, లేక రాధ శ్రీకృష్ణుని ప్రేమించడమంటే వారిని వారే ప్రేమించు కున్నట్లు. శ్రీ చైతన్య ప్రభువులు ఇలా వర్ణించి చెప్పారు. దీని అర్థమే క్రింది శ్లోకం.
శ్లో|| యేయం రాధాయశ్చ కృష్ణో రసాభిః
ద్వేదృశ్చైకః క్రీడానార్ధం ద్వివిధాభూత్
దేహో యథా ఛాయా శోభమానః ||
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Oct 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 83
🌻 83. ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయాః ఏకమతాః కుమార - వ్యాస - శుక - శాండిల్య - గ - విష్ణు - కౌండిన్య - శేషోద్ధవారుణి - బలి - హనుమద్ విభీషణాదాయో భక్త్యాచార్యాః || 🌻
ఈ క్రింది వారు భక్తి శాస్త్రానికి ఆచార్యులుగా గుర్తించబడినవారు. సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గుడు, విష్ణువు, కౌండిన్యుడు, శేషుడు, ఉద్దవుడు, ఆరుణి, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు మొదలైనవారు. వీరంతా భక్తే ముక్తి మార్గమని ఘంటా పథంగా చాటి చెప్పినవారు. గొప్ప భక్తులు చాలామందే ఉన్నారు. కాని వారిలో భక్తిశాస్త్రాన్ని చాటి చెప్పినవారు కొందరే. అందులోనూ మనకు లభించే శాస్త్రాలు ఇంకా తక్కువే. నారదులవారు తన గురించి తాను చెప్పుకోలేదు గాని, నారద మహర్షి కూడా అట్టి ఆచార్యులలో ఒకరు.
ఈ శాస్త్రం ప్రయోజనమేమంటే గౌణభక్తినీ, బాహ్యభక్తినీ మాత్రమే నిజమైన భక్తిగా భావించేవారు చాలామంది ఉన్నారు. వారందరికి ఈ విషయం చక్కగా తెలియాలి. సాధన మార్గం కూడా తెలియాలి. అది ముక్తి లక్ష్యంగా తెలిసి, చేయాలి. కొందరు జ్ఞాన మార్గంలో ఉన్నవారు భక్తిని తేలికగా చులకనగా తీసుకుంటున్నారు.
ఈ శాస్త్రం వారికి కూడా కనువిప్పు కలిగించి, వారి సాధనలో సహకరిస్తుంది. అపరభక్తితో గమ్యం చేరలేరు. అది పరాభక్తిగా సిద్ధమవ్వాలి. మీదు మిక్కిలి సాధనగా తీసుకునే వారికి భక్తి మార్గం సులభం. భగవంతుని ఆలంబనగా చేసుకోవడం ద్వారా సాధకుడు అజ్ఞానం నుండి విడుదలవడం తేలిక. తత్త్వ విచారణ అనేది తెలివైన వారికి మాత్రమే కుదురుతుంది.
భక్తికి తెలివి కంటే శరణాగతి ముఖ్యం. శ్రద్ధ, విశ్వాసం ఉంటే ఎవరైనాన శరణాగతి చేసి భగవదర్పితం కావచ్చును. లోకంలో ఇతర మార్గాల నవలంబించే వారికంటే భక్తులే ఎక్కువగా ఉన్నారు. కనుక భక్తి శాస్త్రానికి ప్రచారం అవశ్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
04 Oct 2020
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 84
🌷. చివరి భాగము 🌷
🌻 84. య ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధతే , స భక్తిమాన్ భవతి, సః ప్రేతం లభతే, సః ప్రేష్ఠం లభే || 🌻
ఈ గ్రంథం శివ శాసన ఫలంగా నారదునిచే చెప్పబడినది. నారదుల వారు వారంతట వారు సంకల్పించింది కాదు.
శివుని ఆజ్ఞానుసారం, శివుని ప్రేరణగా చెప్పబడింది. ఎవరైతే నారద విరచిత భక్తి శాస్త్ర గ్రంథాన్ని విశ్వసించి శ్రద్ధ గలవారై ఉంటారో, వారు భక్తిమంతులవుతారు. చిట్ట చివరగా జీవిత పరమావధి అయిన ముక్తి అనే ప్రయోజనం వారికి కలుగుతుంది.
ఇదే కోరదగింది. ఇదే శ్రేయస్సు, మంగళకరమైనది. ముమ్మాటికి అందరూ పరమార్థమైన కళ్యాణాన్ని పొందెదరు గాక !
🌻. నారద మహర్షి ఆశీర్వాదం 🌻
నారద మహర్షి ఈ సూత్ర గ్రంథాన్ని రచించి, దీనిని భక్తి శ్రద్ధలతో అనుష్టానం చేసే వారికి భగవదనుగ్రహం కలుగు గాక అని ఇలా ఆశీర్వదిస్తున్నారు.
శ్లో|| నమస్తుభ్యం భగవతే నిర్గుణాయ గుణాత్మనే
కేవలా యాద్వితీయాయ గురవే బ్రహ్మరూపిణే
యో 2 హం మమాస్తియత్కించి దిహలోకే పరత్ర చ
తత్సర్వం భవతోనాథ చరణేషు సమర్పితమ్ ||
శ్లో|| పదే పదే యథాభక్తిః పాదయోస్తవ
జాయతే
తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో ||
పతి పుత్ర సుహ్మద్ భ్రాతృ పితృవన్మాతృవద్దరిమ్ ||
యే ధ్యాయంతి సదోద్యుక్తా స్తేభ్యో 2 పీహ నమోనమః ||
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
🙏 🙏 🙏 🙏 🙏
సమాప్తం..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
05 Oct 2020
No comments:
Post a Comment