1) 🌹 02, JANUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vaikuntha Ekadashi 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 305 / Bhagavad-Gita -305 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -25వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 152 / Agni Maha Purana - 152 🌹 🌻. శాలగ్రామ పూజా విధానము - 1 / Mode of worshipping Śālagrāma- 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 017 / DAILY WISDOM - 017 🌹 🌻 17. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని అన్ని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తుంది / 17. Absolutism Satisfactorily Solves All the problems of Life 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 282 🌹
6) 🌹. శివ సూత్రములు - 19 / Siva Sutras - 19 🌹 🌻6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 3 / Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹02, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vaikuntha Ekadashi 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పుత్రదా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, Pausha Putrada Ekadashi, Vaikuntha Ekadashi🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 14 🍀*
25. విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగా పీడవాహనః |
తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్
26. విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గాయత్రీ మంత్రార్థం - సత్యజ్ఞాన సూర్యుని దివ్య తేజస్సును మేము వరించు చున్నామనీ, అది మా చితవృత్తులకు ఏడుగడయై వెలయ నభిలషించు చున్నామనీ గాయత్రీ మంత్రార్థం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 20:25:50 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: భరణి 14:25:03 వరకు
తదుపరి కృత్తిక
యోగం: సిధ్ధ 06:57:43 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 07:44:41 వరకు
వర్జ్యం: 27:25:00 - 29:09:08
దుర్ముహూర్తం: 12:42:06 - 13:26:34
మరియు 14:55:30 - 15:39:59
రాహు కాలం: 08:09:42 - 09:33:05
గుళిక కాలం: 13:43:14 - 15:06:37
యమ గండం: 10:56:29 - 12:19:52
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 09:17:00 - 10:59:20
సూర్యోదయం: 06:46:19
సూర్యాస్తమయం: 17:53:24
చంద్రోదయం: 14:17:41
చంద్రాస్తమయం: 02:40:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 14:25:03 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🍀. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vaikuntha Ekadashi 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 305 / Bhagavad-Gita - 305 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 25 🌴*
*25. నాహం ప్రకాశ: సర్వస్య యోగమాయాసమావృత: |*
*మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్*
🌷. తాత్పర్యం :
*మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడి యుందును. తత్కారణముగా వారు నేను అజుడననియు, నాశములేనివాడననియు ఎరుగరు.*
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమొసగెను గావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శితమగుటలేదని ఎవరైనను వాదింపవచ్చును. కాని వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. భూమిపై అవతరించియున్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలిసికొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు, భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగుననే పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలిసికొనగలిగిరి. అతడెన్నడును అభక్తులకు మరియు సామాన్యజనులకు విదితము కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరు తనను తమవంటివాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన ఆభక్తులకు తన అంతరంగశక్తిచే కప్పుబడియుండును.
శ్రీకృష్ణభగవానుడు “యోగమాయ” అను తెరచే కప్పబడియున్నందున సామాన్యజనులు అతనిని తెలిసికొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. (శ్రీమద్భాగవతము 1.8.19). ఈ “యోగమాయ” అను తెర ఈశోపనిషత్తు (మంత్రము 15) నందును తెలుపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు కీర్తించును.
హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ |
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే
“హే ప్రభూ! సమస్తవిశ్వమును పోషించువాడవు నీవే. నీ భక్తియే అత్యుత్తమ ధర్మనియమమై యున్నది. కనుకనే నన్ను కుడా పోషింపుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్యరూపము యోగమాయచే కప్పబడియున్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే ఆచ్చాదితమై యున్నది. నీ సచ్చిదానందవిగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని ఉపసంహరింపుమని నేను ప్రార్థించుచున్నాను.” సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడియుండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని గాంచలేకున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 305 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 7 - Jnana Yoga - 25 🌴*
*25. nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛtaḥ*
*mūḍho ’yaṁ nābhijānāti loko mām ajam avyayam*
🌷 Translation :
*I am never manifest to the foolish and unintelligent. For them I am covered by My internal potency, and therefore they do not know that I am unborn and infallible.*
🌹 Purport :
It may be argued that since Kṛṣṇa was visible to everyone when He was present on this earth, how can it be said that He is not manifest to everyone? But actually He was not manifest to everyone. When Kṛṣṇa was present there were only a few people who could understand Him to be the Supreme Personality of Godhead. In the assembly of Kurus, when Śiśupāla spoke against Kṛṣṇa’s being elected president of the assembly, Bhīṣma supported Him and proclaimed Him to be the Supreme God. Similarly, the Pāṇḍavas and a few others knew that He was the Supreme, but not everyone. He was not revealed to the nondevotees and the common man. Therefore in the Bhagavad-gītā Kṛṣṇa says that but for His pure devotees, all men consider Him to be like themselves. He was manifest only to His devotees as the reservoir of all pleasure. But to others, to unintelligent nondevotees, He was covered by His internal potency.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 152 / Agni Maha Purana - 152 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 47*
*🌻. శాలగ్రామ పూజా విధానము - 1🌻*
హయగ్రీవుడు చెప్పెను:
ఇపుడు చక్రాంకిత శాలగ్రామముల పూజావిధానమును చెప్పచున్నాను. ఇది సిద్ధిప్రదమైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకమ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉభయాత్మికగాని కావచ్చును. వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ-వామన-నృసింహుల పూజను ముక్తికొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము.
వీటిలో నిష్పల పూజ ఉత్తమము: సఫలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మద్యమము, చతురస్ర మండపముపైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును-
హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకాన్యసము చేసి మూడు ముద్రలను చూపవలెను పిమ్మట చక్రమునకు బైట, తూర్పున గురువును పూజించవలెను. పశ్చిమమున గణమును, వాయవ్యమున ధాతను, నైరృతి యందు విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, అగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 152 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 47
*🌻Mode of worshipping Śālagrāma - 1 🌻*
The Lord said:
1. I shall describe the mode of worshipping the śālagrāma marked with discs for (the sake of) accomplishment. The worship of Hari (in the śālagrāma) is of three kinds—
(i) kāmyā performed for gaining particular benefit
(ii) akāmyā performed with disinterestedness about the benefits
(iii) śubhayātmikā, that is of the nature of both of them.
2. (The worship) of the five (manifestations of Viṣṇu) (such as) the Fish[1] etc., is, either kāmyā or ubhayātmikā (The worship of the manifestations) of the Boar Man-lion and Dwarf forms (of Viṣṇu is) for emancipation.
3-6. Listen to the three-fold worship of the śālagrāma endowed with discs. The excellent worship is that performed without desiring for the fruits. The worship with desire for the fruits is the last (in the rank). The worship of an image is mediocre.
In a circular lotus placed on a rectaṅgular seat, having assigned the praṇava (the syllable Oṃ) to the heart and having assigned (the sacred syllables) to the parts of the body and having shown three mudrās (positions of fingers in the practice of worship), the preceptor should be worshipped outside the circle.
The attendant gods (gaṇas) should be worshipped on the west. Dhātṛ on the north-west, Vidhātṛ on the south-west, the Kartā and Hartā on the south and north, Viṣvaksena (Viṣṇu)should be worshipped in the north-east, and Kṣetrapālaka (the guardian deity) on the south-east.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 17 / DAILY WISDOM - 17 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 17. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని అన్ని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తుంది 🌻*
*కారణం అయిన బ్రహ్మం మరియు ప్రభావం అయిన ప్రపంచం ప్రాథమికంగా ఒకేలా ఉంటాయి, అందువల్ల మార్పు మరియు కారణం వాటి అర్థాన్ని కోల్పోతాయి. లౌకిక ప్రపంచం, గతం లేదా భవిష్యత్తు లేకుండా చెల్లాచెదురైన దేశకాలాలు మరియు కారణాలలో చిక్కుకుంది. ప్రతి విషయం మరొక దానికతో ముడిపెట్టబడి ఉంది. ఈ విధంగా ప్రపంచ ప్రక్రియ శాశ్వతమైనదిగా కనిపిస్తుంది.*
*శాశ్వతంగా ఈ ప్రక్రియ కొనసాగడం అనేది అసంభవం మరియు వ్యక్తికి అంత సహనం ఉండలేదు. ప్రపంచం, ఆ విధంగా, తనను తాను శూన్యమని నిరూపించుకుని శాశ్వతుడు, సత్య సనాతనుడైన జీవికి మాత్రమే లోబడుతుంది. మొత్తంగా సంసారానికి ఆరంభం లేదా ముగింపు లేదు కాబట్టి, వ్యక్తులకు సంబంధించి తప్ప, ఇక్కడ నిజమైన సృష్టి మరియు విధ్వంసం యొక్క తర్కాలు నిర్వీర్యంమౌతాయి. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని అన్ని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తుంది.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 17 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 17. Absolutism Satisfactorily Solves All the problems of Life 🌻*
*Brahman which is the cause and the world which is the effect are basically identical, and hence change and causation lose their meaning. The phenomenal world is caught up in space, time and causation, which scatter themselves without a past or a future. One thing is in relation to the other, and the world-process seems to be eternal.*
*An eternal multiplicity is an impossibility, and an individual cannot be an enduring being. The world, thus, proves itself to be a naught and gives way to the being that is one and that does not change. Since samsara as a whole has neither a beginning nor an end, except with reference to the individuals, the ideas of a real creation and destruction fall to the ground. Absolutism satisfactorily solves all the problems of life.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 282 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. గురువు చేసే పని నువ్వు నిశ్శబ్దంగా వుండడానికి సహకరించడం. దాని వల్ల నీ లోపలి గుసగుసల్ని వినగలుగుతావు. అప్పుడు నీ జీవితం లోపలి క్రమశిక్షణ వేపు కదుల్తుంది. నువ్వు నీ అంతర్దృష్టిని కనిపెట్టడానికి నేను సహకరిస్తాను. అప్పుడ నువ్వు స్వేచ్ఛను పొందుతావు. 🍀*
*నువ్వు నిశ్శబ్దంగా వున్నపుడు నీ శక్తి నీతో మాట్లాడుతుంది. నీతో గుసగుసలాడుతుంది. ఆ గుసగుసలు విస్పష్టమైనవి. అక్కడ 'ఐతే' ఒకవేళ లాంటివి వుండవు. హృదయానికి ఐతే, ఒక వేళ లాంటివి తెలీవు. అది కేవలం యిది నీ విధి అంటుంది. నువ్వు కవివి, చిత్రకారుడివి, శిల్పివి, నాట్యకారుడివి, సంగీతకారుడివి అంటుంది. నువ్వు సమగ్రత చెందడానికి అదే మార్గమంటుంది. అది నీకు దారి చూపిస్తుంది.*
*గురువు చేసే పని నువ్వు నిశ్శబ్దంగా వుండడానికి సహకరించడం. దాని వల్ల నీ లోపలి గుసగుసల్ని వినగలుగుతావు. అప్పుడు నీ జీవితం లోపలి క్రమశిక్షణ వేపు కదుల్తుంది. నువ్వు నీ అంతర్దృష్టిని కనిపెట్టడానికి నేను సహకరిస్తాను. అప్పుడ నువ్వు స్వేచ్ఛను పొందుతావు. కాబట్టి సాధన అన్నది, సన్యాసమన్నది కట్టుబాటుకాదు. అది స్వేచ్ఛా ప్రకటన. అది వ్యక్తి ప్రకటన. అది ప్రేమ ప్రకటన. సృజన ప్రకటన.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 19 / Siva Sutras - 19 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 3 🌻*
*🌴. అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనం అవుతుంది. 🌴*
*శివుడు, ఈ అధికారాన్ని శక్తికి ఇచ్చినందు వల్ల, ఆ అధికారంతో శక్తి ఈ విశ్వాన్ని నిర్వర్తిస్తుంది. శివుడు దానిని కేవలం గమనిస్తాడు తప్ప ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ చర్యలోనూ పాల్గొనడు. అతను తన ముఖంపై సన్నని చిరునవ్వుతో గంభీరంగా అలా కూర్చుని ఉంటాడు. శక్తి తమ ద్వారా చేసిన కార్యాలను తామే చేశామని అనుకుంటున్న ఈ మనుషుల అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటాడు.*
*విశ్వాన్ని నిర్వహించే ఏకైక అధికారం శక్తిదే. ఆమె తన అధికారాలను విభజించి అలా విభజించబడిన శక్తులు ద్వారా ఈ విశ్వాన్ని నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు, సృష్టి స్థితి లయ మొదలైనవి వివిధ శక్తుల ద్వారా నిర్వహించ బడతాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 019 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 3 🌻*
*🌴. In union of multitude of powers is destruction of the differentiated universe. 🌴*
*Shiva having given this power of attorney remains as mute spectator to the actions executed using His power of attorney. He does not get Himself involved in any of the acts either directly or indirectly. He sits majestically with imperceptible smile on His face. He smiles on observing the ignorance of men, wrongfully claiming ownership of various acts that were in fact executed through them by Śaktī.*
* Śaktī is the sole authority for administering the universe. She executes Her authority by delegating Her powers and each such power is known as śakti. For example, creation, sustenance, destruction, etc are administered by different śaktis or powers.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj