శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 422. 'సంధ్యా' - 1🌻


పగలు రాత్రి కానిది, రెంటినీ సంధి జేయునది సంధ్య. ఆమె శ్రీమాతయే. దైవ ధ్యానమునకు గాని, దైవ జ్ఞానమునకు గాని, దైవమును చేరుటకు గాని ఉత్తమోత్తమ కాలము సంధ్య. రాత్రింబవళ్ళను సంధించును. ఇహపరములను సంధించును. జ్ఞానా జ్ఞానములను సంధించును. విరుద్ధమగు విషయములను సంధించి సమన్వయించుట విశేషమగు యోగశక్తి. జీవాత్మ పరమాత్మలను కూడ అట్లే సంధించి సమన్వయ పరచును.

లోకముల నడుమ, కాలముల నడుమ, ఆద్యంతముల నడుమ - అన్నింటికినీ నడుమ నుండునది. పగలు రాత్రి నడుమ సంధ్య యున్నది. రాత్రి పగలు నడుమ సంధ్య యున్నది. శుక్ల పక్షము-కృష్ణ పక్షము నడుమ, మరియు కృష్ణ పక్షము-శుక్ల పక్షము నడుమ కూడ యున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 422. 'Sandhya' - 1🌻


The one which is neither day nor the night, dusk, it is the union of both. It is Srimata. Dusk is the best time for divine meditation, divine knowledge and to reach God. Unites day and night. Unites self and non self. Unites Knowledge and ignorance. It is a remarkable yogic power to bring together and harmonize conflicting things.

Similarly, She unites and harmonizes Jivatma and Paramatma. She stays between the worlds, between day and night, between the ages- in the midst of all. There is twilight in the middle of the day and night. There is twilight in the middle of night and day. There is also a Twilight zone between the fullmoon cycle and newmoon cycle and vice versa.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment