శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ ।
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47 ॥🍀

🍀 160. నిశ్చింతా -
ఏ చింతలూ లేనిది.

🍀 161. నిరహంకారా -
ఏ విధమైన అహంకారము లేనిది.

🍀 162. నిర్మోహా -
అవగాహనలో పొరపాటు లేనిది.

🍀 163. మోహనాశినీ -
మోహమును పోగొట్టునది.

🍀 164. నిర్మమా -
మమకారము లేనిది.

🍀 165. మమతాహంత్రీ -
మమకారమును పోగొట్టునది.

🍀 166. నిష్పాపా -
పాపము లేనిది.

🍀 167. పాపనాశినీ -
పాపములను పోగొట్టునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹

📚. Prasad Bharadwaj

🌻 47. niścintā nirahaṁkārā nirmohā mohanāśinī |
nirmamā mamatāhantrī niṣpāpā pāpanāśinī || 47 || 🌻

🌻 160 ) Nischintha -
She who is not worried

🌻 161 ) Nirahankara -
She who does not have an ego

🌻 162 ) Nirmoha -
She who does not have any passion

🌻 163 ) Mohanasini -
She who destroys passion

🌻 164 ) Nirmama -
She who does not have selfish feelings

🌻 165 ) Mamatha hanthri -
She who destroys selfishness

🌻 166 ) Nishpapa -
She who does not have any sin

🌻 167 ) Papa nashini -
She who destroys sin

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 192

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 192 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 6 🌻

భగవత్ సిద్ధి

721. "అహమ్ బ్రహ్మాస్మి" జ్ఞానము, ముతైఱగుల పరి పూర్ణులకు సమానమే. ఈ జ్ఞానమ బౌతిక మరణముతో అంతము కాదు.

1. | సంస్కారము | చైతన్యము | తాదాత్మ్యత | భౌతిక ప్రపంచము | సూక్ష్మ ప్రపంచము | మనోమయ ప్రపంచము | సత్యలోకము | అనుభవజ్ఞులు |

2. | భౌతిక సంస్కారములు | అన్నమయ దేహ చైతన్యం | నేను దేహమును | ఉన్నది | లేదు | లేదు | లేదు | సామాన్య ప్రజానీకము |

3. | సూక్ష్మ సంస్కారములు | ప్రాణమయ దేహచైతన్యము | నేను ప్రాణమును | లేదు | ఉన్నది | లేదు | లేదు | జిజ్ఞాసువులు సాధకులు అన్వేషకులు యోగులు |

4. | మానసిక సంస్కారములు | మానసిక దేహ చైతన్యం | నేను మనస్సును | లేదు | లేదు | ఉన్నది | లేదు | మహాపురుషులు సత్పురుషులు |

5. | సంస్కారములు లేవు | ఆత్మ చైతన్యం | నేను భగవంతుడను | లేదు | లేదు | లేదు | ఉన్నది | బ్రహ్మీ భూతులు జీవన్ముక్తులు సద్గురువు అవతారము |

6. | యోగాయోగ సంస్కారములు | క్రీస్తు చైతన్యము | సర్వమూ నేనే | ఉన్నది | ఉన్నది | ఉన్నది | ఉన్నది | సద్గురువు అవతారము |

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 1 🌻

1. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కాశ్యపుడు. ఆయనకు ఒకసారి సిద్ధుడు కనబడ్డాడు. ఆ సిద్ధుడు త్రికాలవేది, విజ్ఞానసాగరం, లోకతత్త్వం బాగా తెలిసినవాడు. ఆ సిద్ధుడు, ఆయన శిష్యులు అలా ఆకాశమార్గాన వెళ్ళుతుంటే వాళ్ళ దివ్యతేజస్సులు చూచి ఆ సిద్ధుడికి నమస్కరించి “నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను, నువ్వెవరు? నాకు మార్గం చూపించు, తనకు మార్గోపదేశం చేయమంటే, ఆ సిద్ధుడు బోధ చేసాడు.

2. “ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది. ధర్మపరిజ్ఞానంవల్ల లోకంలో ఏది ధర్మమో తెలుస్తుంది. ఆత్మహితంకోరి ధర్మాచరణకోసమని శరీరాన్ని కాపాడుకోవాలితప్ప, దానియందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి, ఆహారము, ఉపవాసము ఇవన్నీ ఎంతవరకు ఉండాలో, ఎంతకు మించి ఉండకూడదో చెప్పాడు.

3. ధర్మాన్ని బాగా ఆచరించినవాళ్ళు, ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది.స్వర్గసుఖాలు సమాప్తమైన తరువాత వాళ్ళు సూర్యచంద్ర నక్షత్రలోకాల్లో ఎప్పుడు ఉంటారా? అక్కడినుంచీ పతనమై, మళ్ళీ భూమిపై పుడుతుంటారు. ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదు@ఖాలు తప్పవు. మన కర్తవ్యము ఒక్కటే. సుఖదుఃఖములకు అతీతమైన మోక్షమార్గమునే మనం అన్వేషించాలి. దానికి యోగమే మార్గము.

4. సుఖదుఃఖాలను ఏకకాలంలో వదిలిపెట్టాలి. సంకల్పం అనేదాని విసర్జించాలి. ఇక ధర్మమేమో జీవనవిధానంగా ఉండాలి, మోక్షమేమో ప్రధానం కావాలి. ధర్మం ప్రధానం కాదు, అప్రధానం, మోక్షమే ఆత్యంతికమైన విషయం.

5. అధర్మం మనకు దోషాన్నిస్తుంది. కాబట్టి తపస్సును భంగంచేస్తుంది. కనుక జీవన విధానంలో ధర్మంలో ఉండాలి. ధర్మం ఎందుకు ఆచరిస్తున్నామంటే, మోక్షం కోసమని చెప్పాలి. కాబట్టి ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే! అని బోధించాడు కాశ్యపుడికి.

6. “యోగమార్గాలున్నాయి కదా! తపస్సుచేసి ఆత్మదర్శనం చేయమని అంటారుకదా మాహాత్మా! ఆ విధివిధానం ఎలాగో బోధించమని అడిగాడు కాశ్యపుడు.

7. అందుకు బదులుగా సిద్ధుడు, “జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము వీటిలో మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది. ఉదాహరణకు పళ్ళమీద మనసు నిలబడిందనుకో, మనసుని అక్కడే నిలబెట్టు. దానిని మరెక్కడోనిలబేట్టే ప్రయత్నం చేయవద్దు.

8. అది ఎక్కడ సుస్థిరంగా దాని ప్రాంతంలో నిలబడిందో అక్కడే ఉంచెయ్యి. అట్లా కదల్చకుండా మనస్సును ఎక్కడయితే పెడతావో, దానికి అప్పుడు అన్వేషణను గురించి చెప్పు. ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకునేటటువంటి దృష్టిని మనసుతో చెప్పు. ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనసు దానిని పొందలేక, తానే లయం పొందుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 370

🌹 . శ్రీ శివ మహా పురాణము - 370 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 09

🌻. పార్వతి స్వప్నము - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మాటను విన్న వెంటనే మేనక భర్తను అచటకు పిలచి కుమర్తె చూచిన స్వప్నమును సమగ్రముగా తెలుపుడు జేసెను (19). అపుడా హిమవంతుడు కుమారై యొక్క స్వప్నమును మేనక చెప్పగా విని మిక్కిలి సంతసించి, ప్రియురాలగు మేనకను సంబోధించి ఇట్లు పలికెను(20).

హిమవంతుడిట్లు పలికెను-

హే ప్రియే ! నేను కూడా తెల్లవారు జామున ఒక స్వప్నమును చూచితిని. నేను దానిని గురించి శ్రద్ధగా చెప్పెదను. నీవు గొప్ప ప్రీతితో దానిని వినుమ (21). నారదుడు వర్ణించిన తీరున శ్రేష్ఠమగు అవయవములు గల ఒక గొప్ప తపశ్శాలి తపస్సును చేయుటకొరకై ఆనందముతో మన నగర సమీపమునకు విచ్చేసినాడు (22). నేను కూడ మిక్కిలి సంతసించి మన అమ్మయిని వెంటనిడుకొని అచటకు వెళ్లితిని. నారదుడు చెప్పిన వరుడగు శంభుప్రభుడు ఆతడేనని నాకు తెలిసినది (23).

నేను అమ్యాయికి ఆ తపశ్శాలిని సేవించుమని ఉపదేశించి అమె సేవను స్వీకరించుమని ఆయనును వేడుకొనగా, ఆయన అప్పుడు అంగీకరించలేదు (24). అపుడు సాంఖ్యులు, వేదాంతులు మెచ్చు కొనదగిన గొప్ప వివాదము చెలరేగెను. తరువాత అయన అనుమతిని పొంది మన అమ్మాయి అచటనే ఉండెను (25). అమె శివుని భర్తగా పొందవలెననే కోరికను మనసులో నిడుకొని భక్తితో ఆయనను సేవించెను. ఓ సుందరీ! నేను చూసిన స్వప్నము ఇది. నీకు వివరించి చెప్పితిని (26). ఓ ప్రియురాలా! మేనా! కావున ఆ స్వప్నము యొక్క ఫలమును మనము కొంతకాలము వరకు వేచి యుండి పరీక్షించవలెను. ఈ విషయములో ఇదియే యోగ్యమైన కర్తవ్యమని నా అభిప్రాయము. నివీ విషయమును నిశ్చయముగా తెలియము(27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓమహర్షీ! ఇట్లు పలికి ఆ పర్వతరాజు, మరియు మేనా దేవి శుద్ధమగు మనస్సు గలవారై ఆ స్వప్న ఫలమును పరీక్షించుచూ నుండిరి(28). ఇట్లు కొద్ది రోజులు గడిచెను. ఇంతలో సత్పురుషులకు శరణ్యుడు, సర్వసృష్టికి కారణుడు అగు పరమేశ్వరుడు సతీ వియోగముచే మిక్కిలి దుఃఖితుడై అంతటా తిరుగాడు చుండెను(29). సతి యందలి ప్రేమతో, విరహ దుఃఖముతో కల్లోలితమగు మనస్సు గల ఆ ప్రభువు కొద్ది గణములతో గూడి ప్రీతితో తపస్సును చేయుట కొరకై అచటకు విచ్చేసెను (30). అయన అచట తన దారిన తాను తపస్సు చేసుకొను చుండెను. అపుడు ఆయన అనుగ్రహమును కోరు పార్వతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నిత్యము ఆయనను సేవించుట యందు నిమగ్నురాలయ్యెను. (31).

దేవతలచే ఆయనను మోహింపజేయుట కొరకై పంపబడిన మన్మథునిచే బాణములతో కొట్టబడిననూ ఆ శంభుప్రభుడు వికారమును పొందలేదు (32). అయన అచటనే తన కంటినుండి బయల్వెడలిన మంటలతొ ఆ మన్మథుని దగ్ధము చేసెను. ఆయన నా మాటలను స్మరించి కోపించినవాడై అచట నుండి అంతర్హితుడాయెను(33). తరువాత చాల కాలము పిదప, పార్వతీ దేవి యొక్క గర్వము నడంచిన ఆ మహేశ్వరుడు ఆమె యొక్క ఘోర తపస్సునకు ప్రసన్నుడాయెను (34).

తరువాత విష్ణువుచే ప్రార్థింపబడిన రుద్రుడు లోకాచారము ననుసరించి కాలికా దేవిని వివాహమాడెను. అపుడు అనేక మంగళములు సంపన్నమాయెను (35). వత్సా! నీకుఆ శంకరవిభుని గొప్ప దివ్య చరితమును సంగ్రహముగా చెప్పి యుంటిని. మరల ఏమి వినగోరుచున్నావు?

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో స్వప్న వర్ణన మను తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2021

గీతోపనిషత్తు -170

🌹. గీతోపనిషత్తు -170 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 13

🍀 13. ధారణ - స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు. ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము. 🍀

సమం కాయ శిరో గ్రీవం ధారయ న్న చలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్ || 13

కాయము, శిరస్సు, కంఠము తిన్నగ నిలిపి కదలిక లేక స్థిరముగ కూర్చుండి చిత్తమును దిక్కులకు పయనింపనీయక నాసికాగ్రమును వీక్షించుచు ఉండవలెనని ఈ శ్లోకము నిర్దేశించు చున్నది. 11, 12, 13, 14, 15 శ్లోకములలో ఆత్మసంయమమునకు నిత్యము చేయవలసిన అభ్యాసము వివరింపబడినది.

ఆసనమున కూర్చుండు సాధకుడు ధ్యానమున కుపక్రమించు సమయమున శిరస్సును, కంఠమును, మొండెమును నిట్టనిలువుగ నుంచుటకు ప్రయత్నింప వలెను. శిరస్సు పైకెత్తుటగాని, క్రిందికి దించుటగాని చేయరాదు.

వెన్నెముకను బాణము వలె వంచక, దండమువలె నిట్టనిలువుగ నుంచవలెను. ఇట్టి ఆసనము సిద్ధించుట చాల ముఖ్యము. ఇట్టి ఆసనము మాత్రమే ప్రజా ప్రసారమునకు సహకరించును. అవరోధములు కలుగవు. ఇట్లు కూర్చుండుటలో సుఖము కలుగవలెను. స్థిరము కలుగవలెను. అభ్యాసవశమున అది జరుగగలదు.

ఆసనము విషయమున అప్రమత్తత సాధకునకు తప్పని సరి. మనస్సు, ఇంద్రియములు, దేహము సహకరింపనిదే స్థిరము, సుఖము అగు ఆసనము కుదరదు. స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు.

ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము.

గురువు లేక దైవముయొక్క ప్రసన్న వదన మును ధారణ చేయుట మరియొక ఉపాయము. ఉదయించు చున్న సూర్యబింబమును అంతర్ముఖముగ ధారణ చేయుట మరియొక ఉపాయము. సూర్యుని కాంతిచే వికసించుచున్న తెల్లని పద్మము ధారణ చేయుటకూడ ఒక ఉపాయమే.

అట్లే తాను, నేను అను తన వెలుగును ధారణ చేయుట గీతాచార్యుడు తెలిపిన ఉపాయము. చిత్తము ధారణచేయు వస్తువునందు లగ్నమై అచల స్థితి చెందవలెను. అప్పుడది క్రమముగ స్థిరమగు వెలుగుగ గోచరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Mar 2021

14-MARCH-2021 MESSAGES

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 170🌹  
11) 🌹. శివ మహా పురాణము - 370🌹 
12) 🌹 Light On The Path - 119🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252🌹 
14) 🌹 Seeds Of Consciousness - 317🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 192🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Lalitha Sahasra Namavali - 47🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 47 / Sri Vishnu Sahasranama - 47🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -170 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 13

*🍀 13. ధారణ - స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు. ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము. 🍀*

సమం కాయ శిరో గ్రీవం ధారయ న్న చలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్ || 13 

కాయము, శిరస్సు, కంఠము తిన్నగ నిలిపి కదలిక లేక స్థిరముగ కూర్చుండి చిత్తమును దిక్కులకు పయనింపనీయక నాసికాగ్రమును వీక్షించుచు ఉండవలెనని ఈ శ్లోకము నిర్దేశించు
చున్నది. 11, 12, 13, 14, 15 శ్లోకములలో ఆత్మసంయమమునకు నిత్యము చేయవలసిన అభ్యాసము వివరింపబడినది. 

ఆసనమున కూర్చుండు సాధకుడు ధ్యానమున కుపక్రమించు సమయమున శిరస్సును, కంఠమును, మొండెమును నిట్టనిలువుగ నుంచుటకు ప్రయత్నింప వలెను. శిరస్సు పైకెత్తుటగాని, క్రిందికి దించుటగాని చేయరాదు. 

వెన్నెముకను బాణము వలె వంచక, దండమువలె నిట్టనిలువుగ నుంచవలెను. ఇట్టి ఆసనము సిద్ధించుట చాల ముఖ్యము. ఇట్టి ఆసనము మాత్రమే ప్రజా ప్రసారమునకు సహకరించును. అవరోధములు కలుగవు. ఇట్లు కూర్చుండుటలో సుఖము కలుగవలెను. స్థిరము కలుగవలెను. అభ్యాసవశమున అది జరుగగలదు.

ఆసనము విషయమున అప్రమత్తత సాధకునకు తప్పని సరి. మనస్సు, ఇంద్రియములు, దేహము సహకరింపనిదే స్థిరము, సుఖము అగు ఆసనము కుదరదు. స్థిరము, సుఖము అగు ఆసనము కుదిరిన పిదప నాసికాగ్రమున దృష్టి నుంచవలెను. నాసికాగ్రమనగ భ్రూమధ్యము. భ్రూమధ్యమున దృష్టి సారించుట మానసికమే గాని భౌతికము కాదు. 

ఇట్లు భ్రూమధ్యమున ప్రజ్ఞను ధారణ చేయవలెను. ప్రజ్ఞ సహజమగు వెలుగు కనుక భ్రూమధ్యమున వెలుగును తానుగ దర్శించుట నిర్దేశింపబడినది. దిక్కులకు మనస్సు చెదరినను, మరల భ్రూమధ్యముననే లగ్నము చేసి వెలుగును దర్శింపవచ్చును. దీనిని 'ధారణ' అందురు. ధారణ నిలుచుటకు జ్యోతిని చూచి కనులు మూసుకొనుట ఒక సంప్రదాయము. 

గురువు లేక దైవముయొక్క ప్రసన్న వదన మును ధారణ చేయుట మరియొక ఉపాయము. ఉదయించు చున్న సూర్యబింబమును అంతర్ముఖముగ ధారణ చేయుట మరియొక ఉపాయము. సూర్యుని కాంతిచే వికసించుచున్న తెల్లని పద్మము ధారణ చేయుటకూడ ఒక ఉపాయమే. 

అట్లే తాను, నేను అను తన వెలుగును ధారణ చేయుట గీతాచార్యుడు తెలిపిన ఉపాయము. చిత్తము ధారణచేయు వస్తువునందు లగ్నమై అచల స్థితి చెందవలెను. అప్పుడది క్రమముగ స్థిరమగు వెలుగుగ గోచరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 370🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 09

*🌻. పార్వతి స్వప్నము - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మాటను విన్న వెంటనే మేనక భర్తను అచటకు పిలచి కుమర్తె చూచిన స్వప్నమును సమగ్రముగా తెలుపుడు జేసెను (19). అపుడా హిమవంతుడు కుమారై యొక్క స్వప్నమును మేనక చెప్పగా విని మిక్కిలి సంతసించి, ప్రియురాలగు మేనకను సంబోధించి ఇట్లు పలికెను(20).

హిమవంతుడిట్లు పలికెను-

హే ప్రియే ! నేను కూడా తెల్లవారు జామున ఒక స్వప్నమును చూచితిని. నేను దానిని గురించి శ్రద్ధగా చెప్పెదను. నీవు గొప్ప ప్రీతితో దానిని వినుమ (21). నారదుడు వర్ణించిన తీరున శ్రేష్ఠమగు అవయవములు గల ఒక గొప్ప తపశ్శాలి తపస్సును చేయుటకొరకై ఆనందముతో మన నగర సమీపమునకు విచ్చేసినాడు (22). నేను కూడ మిక్కిలి సంతసించి మన అమ్మయిని వెంటనిడుకొని అచటకు వెళ్లితిని. నారదుడు చెప్పిన వరుడగు శంభుప్రభుడు ఆతడేనని నాకు తెలిసినది (23).

నేను అమ్యాయికి ఆ తపశ్శాలిని సేవించుమని ఉపదేశించి అమె సేవను స్వీకరించుమని ఆయనును వేడుకొనగా, ఆయన అప్పుడు అంగీకరించలేదు (24). అపుడు సాంఖ్యులు, వేదాంతులు మెచ్చు కొనదగిన గొప్ప వివాదము చెలరేగెను. తరువాత అయన అనుమతిని పొంది మన అమ్మాయి అచటనే ఉండెను (25). అమె శివుని భర్తగా పొందవలెననే కోరికను మనసులో నిడుకొని భక్తితో ఆయనను సేవించెను. ఓ సుందరీ! నేను చూసిన స్వప్నము ఇది. నీకు వివరించి చెప్పితిని (26). ఓ ప్రియురాలా! మేనా! కావున ఆ స్వప్నము యొక్క ఫలమును మనము కొంతకాలము వరకు వేచి యుండి పరీక్షించవలెను. ఈ విషయములో ఇదియే యోగ్యమైన కర్తవ్యమని నా అభిప్రాయము. నివీ విషయమును నిశ్చయముగా తెలియము(27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓమహర్షీ! ఇట్లు పలికి ఆ పర్వతరాజు, మరియు మేనా దేవి శుద్ధమగు మనస్సు గలవారై ఆ స్వప్న ఫలమును పరీక్షించుచూ నుండిరి(28). ఇట్లు కొద్ది రోజులు గడిచెను. ఇంతలో సత్పురుషులకు శరణ్యుడు, సర్వసృష్టికి కారణుడు అగు పరమేశ్వరుడు సతీ వియోగముచే మిక్కిలి దుఃఖితుడై అంతటా తిరుగాడు చుండెను(29). సతి యందలి ప్రేమతో, విరహ దుఃఖముతో కల్లోలితమగు మనస్సు గల ఆ ప్రభువు కొద్ది గణములతో గూడి ప్రీతితో తపస్సును చేయుట కొరకై అచటకు విచ్చేసెను (30). అయన అచట తన దారిన తాను తపస్సు చేసుకొను చుండెను. అపుడు ఆయన అనుగ్రహమును కోరు పార్వతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నిత్యము ఆయనను సేవించుట యందు నిమగ్నురాలయ్యెను. (31).

దేవతలచే ఆయనను మోహింపజేయుట కొరకై పంపబడిన మన్మథునిచే బాణములతో కొట్టబడిననూ ఆ శంభుప్రభుడు వికారమును పొందలేదు (32). అయన అచటనే తన కంటినుండి బయల్వెడలిన మంటలతొ ఆ మన్మథుని దగ్ధము చేసెను. ఆయన నా మాటలను స్మరించి కోపించినవాడై అచట నుండి అంతర్హితుడాయెను(33). తరువాత చాల కాలము పిదప, పార్వతీ దేవి యొక్క గర్వము నడంచిన ఆ మహేశ్వరుడు ఆమె యొక్క ఘోర తపస్సునకు ప్రసన్నుడాయెను (34).

  తరువాత విష్ణువుచే ప్రార్థింపబడిన రుద్రుడు లోకాచారము ననుసరించి కాలికా దేవిని వివాహమాడెను. అపుడు అనేక మంగళములు సంపన్నమాయెను (35). వత్సా! నీకు

ఆ శంకరవిభుని గొప్ప దివ్య చరితమును సంగ్రహముగా చెప్పి యుంటిని. మరల ఏమి వినగోరుచున్నావు?

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో స్వప్న వర్ణన మను తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 119 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 12 🌻*

452. People think it would simplify their lives if the personality could remember all those past incarnations. In some ways it might, but I think that if in the personality we had the full remembrance of all our past lives before we had reached Adeptship, it would do more harm than good. In the first place, we have not the power to weigh all these things calmly. We should find it distinctly depressing to look back at the ghastly crimes we had committed in the past lives. 

I have long ago learnt how to look back at my own past lives, but it is by no means a pleasure to do so. There are certain beautiful actions, some fine incidents in the past lives of everyone, and one is able to look back with a certain degree of pleasure on those, but we have found that in looking back upon a past life the thing that immediately strikes one most forcibly is the number of opportunities which one did not see. 

Here, there, everywhere, we were surrounded by opportunities, and we cannot help feeling amazed that we took advantage of so few of them. It was not, usually, that we failed to take them because we did not want to do so; our intentions were good, though rather feebly good, perhaps, and if we had seen the opportunities we should have taken them. Now we look back and wonder at our own blindness. 

We say: “If only I had taken this or that course of action certain results would have followed, and by this time I might have reached Adeptship.” But we did not. When we rise to that level the power to look back will be useful to us, but with the amount of intellect and free-will we have now it would certainly not be an unmixed pleasure.

453. Let us consider the general principles involved. The whole of this scheme of which we are a part is intended to further the evolution of man, therefore there can be no doubt whatever that if it were best for him that a personality should remember all his past lives, most certainly that would have been so arranged. 

As that has not been done, we should at least have faith enough to see that it is best as it is. When a man has the power to look back he also gains with it a wider insight and a more balanced view of things, and by that time he is so imbued with the certainty of justice in the scheme that if he cannot see exactly how a result followed from its cause he will say: “Well, I do not see the reason for this, but I am sure I shall do so presently.” 

It would not occur to him to think that he had been unjustly treated. The person who is always talking of being unjustly treated and is perpetually accusing high heaven of neglecting him, does not understand the rudiments of the case. We know that the law is absolutely just – as just as the law of gravitation – but it does not follow that we can always tell exactly how it will work itself out.

454. As I have said, the ego makes a note of that which produces evil results. Warned by past experience, he tries to influence the personality before it becomes so strong, so definite and decided that it will not be guided by the vaguer touch from the ego behind. It distinctly thinks that it knows best along its own line. Very often it declines to be helped from above, and so the ego cannot influence it to the full extent that he would like. 

But he tries to gain control, and as we go on we shall feel this higher self more and more endeavouring to take the reins. If we will identify ourselves with him, we shall find that then he can do Very much more for us. His chief difficulty is the fact that the average personality identifies itself with the lower vehicles and rather resents his interference, but if it can be persuaded to identify itself with him, then at once the whole difficulty is very much lessened.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాశ్యప మహర్షి - 1 🌻*

1. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కాశ్యపుడు. ఆయనకు ఒకసారి సిద్ధుడు కనబడ్డాడు. ఆ సిద్ధుడు త్రికాలవేది, విజ్ఞానసాగరం, లోకతత్త్వం బాగా తెలిసినవాడు. ఆ సిద్ధుడు, ఆయన శిష్యులు అలా ఆకాశమార్గాన వెళ్ళుతుంటే వాళ్ళ దివ్యతేజస్సులు చూచి ఆ సిద్ధుడికి నమస్కరించి “నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను, నువ్వెవరు? నాకు మార్గం చూపించు, తనకు మార్గోపదేశం చేయమంటే, ఆ సిద్ధుడు బోధ చేసాడు. 

2. “ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది. ధర్మపరిజ్ఞానంవల్ల లోకంలో ఏది ధర్మమో తెలుస్తుంది. ఆత్మహితంకోరి ధర్మాచరణకోసమని శరీరాన్ని కాపాడుకోవాలితప్ప, దానియందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి, ఆహారము, ఉపవాసము ఇవన్నీ ఎంతవరకు ఉండాలో, ఎంతకు మించి ఉండకూడదో చెప్పాడు.

3. ధర్మాన్ని బాగా ఆచరించినవాళ్ళు, ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది.స్వర్గసుఖాలు సమాప్తమైన తరువాత వాళ్ళు సూర్యచంద్ర నక్షత్రలోకాల్లో ఎప్పుడు ఉంటారా? అక్కడినుంచీ పతనమై, మళ్ళీ భూమిపై పుడుతుంటారు. ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదు@ఖాలు తప్పవు. మన కర్తవ్యము ఒక్కటే. సుఖదుఃఖములకు అతీతమైన మోక్షమార్గమునే మనం అన్వేషించాలి. దానికి యోగమే మార్గము. 

4. సుఖదుఃఖాలను ఏకకాలంలో వదిలిపెట్టాలి. సంకల్పం అనేదాని విసర్జించాలి. ఇక ధర్మమేమో జీవనవిధానంగా ఉండాలి, మోక్షమేమో ప్రధానం కావాలి. ధర్మం ప్రధానం కాదు, అప్రధానం, మోక్షమే ఆత్యంతికమైన విషయం. 

5. అధర్మం మనకు దోషాన్నిస్తుంది. కాబట్టి తపస్సును భంగంచేస్తుంది. కనుక జీవన విధానంలో ధర్మంలో ఉండాలి. ధర్మం ఎందుకు ఆచరిస్తున్నామంటే, మోక్షం కోసమని చెప్పాలి. కాబట్టి ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే! అని బోధించాడు కాశ్యపుడికి.

6. “యోగమార్గాలున్నాయి కదా! తపస్సుచేసి ఆత్మదర్శనం చేయమని అంటారుకదా మాహాత్మా! ఆ విధివిధానం ఎలాగో బోధించమని అడిగాడు కాశ్యపుడు. 

7. అందుకు బదులుగా సిద్ధుడు, “జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము వీటిలో మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది. ఉదాహరణకు పళ్ళమీద మనసు నిలబడిందనుకో, మనసుని అక్కడే నిలబెట్టు. దానిని మరెక్కడోనిలబేట్టే ప్రయత్నం చేయవద్దు. 

8. అది ఎక్కడ సుస్థిరంగా దాని ప్రాంతంలో నిలబడిందో అక్కడే ఉంచెయ్యి. అట్లా కదల్చకుండా మనస్సును ఎక్కడయితే పెడతావో, దానికి అప్పుడు అన్వేషణను గురించి చెప్పు. ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకునేటటువంటి దృష్టిని మనసుతో చెప్పు. ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనసు దానిని పొందలేక, తానే లయం పొందుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 317 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 166. Abiding in the 'I am' (which is God) you won't want to leave it, and then it won't leave you! 🌻*

The indwelling knowledge 'I am' is the God, or divinity in you. First you must try to understand it very clearly without any doubts whatsoever. And if you have understood it correctly, you will not want to leave for even a moment. 

If you feel a sense of reverence and love for this 'I am' it a sure sign that you have understood it. Then this divinity, or God will hold on to you and not let you go!
 
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 192 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 6 🌻*

భగవత్ సిద్ధి

721. "అహమ్ బ్రహ్మాస్మి" జ్ఞానము, ముతైఱగుల పరి పూర్ణులకు సమానమే. ఈ జ్ఞానమ బౌతిక మరణముతో అంతము కాదు.

1. | సంస్కారము | చైతన్యము | తాదాత్మ్యత | భౌతిక ప్రపంచము | సూక్ష్మ ప్రపంచము | మనోమయ ప్రపంచము | సత్యలోకము | అనుభవజ్ఞులు |

2. | భౌతిక సంస్కారములు | అన్నమయ దేహ చైతన్యం | నేను దేహమును | ఉన్నది | లేదు | లేదు | లేదు | సామాన్య ప్రజానీకము |

3. | సూక్ష్మ సంస్కారములు | ప్రాణమయ దేహచైతన్యము | నేను ప్రాణమును | లేదు | ఉన్నది | లేదు | లేదు | జిజ్ఞాసువులు సాధకులు అన్వేషకులు యోగులు |

4. | మానసిక సంస్కారములు | మానసిక దేహ చైతన్యం | నేను మనస్సును | లేదు | లేదు | ఉన్నది | లేదు | మహాపురుషులు సత్పురుషులు |

5. | సంస్కారములు లేవు | ఆత్మ చైతన్యం | నేను భగవంతుడను | లేదు | లేదు | లేదు | ఉన్నది | బ్రహ్మీ భూతులు జీవన్ముక్తులు సద్గురువు అవతారము |

6. | యోగాయోగ సంస్కారములు | క్రీస్తు చైతన్యము | సర్వమూ నేనే | ఉన్నది | ఉన్నది | ఉన్నది | ఉన్నది | సద్గురువు అవతారము |

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ ।
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47 ॥🍀*

🍀 160. నిశ్చింతా - 
ఏ చింతలూ లేనిది.

🍀 161. నిరహంకారా - 
ఏ విధమైన అహంకారము లేనిది.

🍀 162. నిర్మోహా - 
అవగాహనలో పొరపాటు లేనిది.

🍀 163. మోహనాశినీ - 
మోహమును పోగొట్టునది.

🍀 164. నిర్మమా - 
మమకారము లేనిది.

🍀 165. మమతాహంత్రీ -
 మమకారమును పోగొట్టునది.

🍀 166. నిష్పాపా - 
పాపము లేనిది.

🍀 167. పాపనాశినీ - 
పాపములను పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 47. niścintā nirahaṁkārā nirmohā mohanāśinī |*
*nirmamā mamatāhantrī niṣpāpā pāpanāśinī || 47 || 🌻*

🌻 160 ) Nischintha -  
 She who is not worried

🌻 161 ) Nirahankara -  
 She who does not have an ego

🌻 162 ) Nirmoha -   
She who does not have any passion

🌻 163 ) Mohanasini -   
She who destroys passion

🌻 164 ) Nirmama -   
She who does not have selfish feelings

🌻 165 ) Mamatha hanthri -   
She who destroys selfishness

🌻 166 ) Nishpapa -  
 She who does not have any sin

🌻 167 ) Papa nashini -   
She who destroys sin

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 47 / Sri Vishnu Sahasra Namavali - 47 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కన్యా రాశి- ఉత్తర నక్షత్ర 3వ పాద శ్లోకం*

*🍀 47. అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః।*
*నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః॥ 🍀*

🍀 435) అనిర్విణ్ణ: - 
వేదన లేనివాడు.

🍀 436) స్థవిష్ఠ: - 
విరాడ్రూపమై భాసించువాడు.

🍀 437) అభూ: - 
పుట్టుక లేనివాడు.

🍀 438) ధర్మయూప: - 
ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.

🍀 439) మహామఖ: - 
యజ్ఞస్వరూపుడు.

🍀 440) నక్షత్రనేమి: - 
జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.

🍀 441) నక్షత్రీ - 
చంద్ర రూపమున భాసించువాడు.

🍀 442) క్షమ: - సహనశీలుడు.

🍀 443) క్షామ: - 
సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.

🍀 444) సమీహన: - 
సర్వ భూతహితమును కోరువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 47 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Kanya Rasi, Uttara 3rd Padam*

*🌻 47. anirviṇṇaḥ sthaviṣṭhō bhūrdharmayūpō mahāmakhaḥ |*
*nakṣatranemir nakṣatrī kṣamaḥ, kṣāmaḥ samīhanaḥ || 47 || 🌻*

🌻 435. Anirviṇṇaḥ: 
One who is never heedless, because He is ever self-fulfilled.

🌻 436. Sthaviṣṭhaḥ: 
One of huge proportions, because He is in the form of cosmic person.

🌻 437. Abhūḥ: 
One without birth. Or one has no existence.

🌻 438. Dharma-yūpaḥ: 
The sacrificial post for Dharmas, that is, one to whom all the forms of Dharma, which are His own form of worship, are attached, just as a sacrificial animal is attached to a Yupa or a sacrificial post.

🌻 439. Mahāmakhaḥ: 
One by offering sacrifices to whom, those sacrifices deserve to be called great, because they well give the fruit of Nirvana.

🌻 440. Nakṣatra-nemiḥ: 
The heart of all nakshatras.

🌻 441. Nakṣatrī: 
He is in the form of the nakshatra, Moon.

🌻 442. Kṣamaḥ: 
One who is clever in everything.

🌻 443. Kṣāmaḥ: 
One who remains in the state of pure self after all the modifications of the mind have dwindled.

🌻 444. Samīhanaḥ: 
One who exerts well for creation, etc.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹