🍀 25 - OCTOBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 25 - OCTOBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 25 - OCTOBER - 2022 TUESDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 83 / Kapila Gita - 83 🌹 సృష్టి తత్వము - 389
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 5🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 257 / Osho Daily Meditations - 257 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 -1 🌹 'శివపరా'- 2

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹25, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆశ్వీయుజ అమావాస్య, సూర్యగ్రహణము, Aswiyuja Amavasya, Surya Grahan🌻*

*గ్రహణం యొక్క వ్యవధి : హైదరాబాదులో సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై 5:48 నిమిషాలకు ముగుస్తుంది.*

*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 8 🍀*

*8. వీర! త్వయా హి విహితం సురసర్వకార్యం*
*మత్సంకటం కిమిహ యత్త్వయకా న హార్యం.*
*ఏతద్ విచార్య హర సంకటమాశు మే త్వం*
*ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ద్వేషం కూడదు - నిన్ను పీడించే వానిని నీవు ద్వేషించవద్దు. ఏలనంటే, అతడు బలవంతుడైతే నీ ద్వేషం ఆతని పీడనను పెంచుతుంది. బలహీనుడైతే, నీవు ద్వేషించడం అనవసరం. ద్వేషం రెండు వైపులా పదను గల కత్తి. బలి దొరకనప్పుడు ఎదురు తిరిగి ప్రయోకనే మ్రింగివేసే ప్రాచీన మాంత్రిక ప్రయోగ క్రియను బోలినదది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: అమావాశ్య 16:15:56 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: చిత్ర 14:17:27 వరకు
తదుపరి స్వాతి
యోగం: వషకుంభ 12:31:23
వరకు తదుపరి ప్రీతి
కరణం: నాగ 16:14:57 వరకు
వర్జ్యం: 19:40:52 - 21:13:24
దుర్ముహూర్తం: 08:31:07 - 09:17:32
రాహు కాలం: 14:54:07 - 16:21:10
గుళిక కాలం: 12:00:02 - 13:27:04
యమ గండం: 09:05:56 - 10:32:59
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:59:56 - 09:34:12
మరియు 28:56:04 - 30:28:36
సూర్యోదయం: 06:11:51
సూర్యాస్తమయం: 17:48:13
చంద్రోదయం: 05:52:53
చంద్రాస్తమయం: 17:49:17
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు : ధ్వాo క్ష యోగం - ధన నాశనం, 
కార్య హాని 14:17:27 వరకు తదుపరి 
ధ్వజ యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 83 / Kapila Gita - 83🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 39 🌴*

*39. ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తి సంస్థాత్వమేవ చ|*
*తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః॥*

*పూజ్యురాలా! వస్తువులయొక్క ఆకారము, వాటి గుణములను తెలిసికొనునట్లు చేయుట అనగా వస్తువుల ఆకారము, పరిమాణములు మొదలగు వాని యొక్క జ్ఞాపకమును కలిగించుట, తేజోరూపముగా భాసించుట అనునవి రూపతన్మాత్ర యొక్క వృత్తులు.*

*చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ప్రతీ ద్రవ్యానికి ఒక ఆకారం కలిగించేది. ఒక వస్తువు గురించి చెబుతున్న్నామంటే దాని ఆకారం బట్టే చెబుతాము. ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది రూపం.*
*గుణతా: అంటే ద్రవ్య ఆశ్రయత్వం. ఆధారము లేకుండా ఆధేయం ఉండదు. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణం. గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం అంటే గుణం. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది.*
*ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తినుండి వేరు చేసేది రూపము. రూపముకు ఈ మూడు గుణాలు ఉన్నాయి.*
*1. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటున్నది, 2. ఒక ద్రవ్యానికి ఆకారాన్ని ఏర్పరుస్తున్నది, 3. ఒక ద్రవ్యాన్ని ఇంకో ద్రవ్యము నించి వేరు చేసి చూపుతుంది. దీన్నే తేజత్వం అంటాము. ఇవి రూపము యొక్క వ్యాపారము.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 83 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 39 🌴*

*39. dravyākṛtitvaṁ guṇatā vyakti-saṁsthātvam eva ca*
*tejastvaṁ tejasaḥ sādhvi rūpa-mātrasya vṛttayaḥ*

*My dear mother, the characteristics of form are understood by dimension, quality and individuality. The form of fire is appreciated by its effulgence.*

*Every form that we appreciate has its particular dimensions and characteristics. The quality of a particular object is appreciated by its utility. But the form of sound is independent. Forms which are invisible can be understood only by touch; that is the independent appreciation of invisible form. Visible forms are understood by analytical study of their constitution. The constitution of a certain object is appreciated by its internal action. For example, the form of salt is appreciated by the interaction of salty tastes, and the form of sugar is appreciated by the interaction of sweet tastes. Tastes and qualitative constitution are the basic principles in understanding the form of an object.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*

*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 5🌻*

యమధర్మరాజు చెప్పెను: "దేవ ప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిని వారిని మీరు నరకమునకు తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములో సంచరించుచు నా ఆజ్ఞను పాలింపుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారి కీ లోకములో నివాసము ఉండదు. 

భగవంతునిపై చిత్తము లగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తు లగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ. నిలచినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళలందును శ్రీకృష్ణనామస్మరణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తికకర్మల ద్వారా జనార్దనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్వ్రతశీలులు భగవంతునే చేరుదురు.

పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు ఆలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులకను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరూదు. కఱ్ఱతో గాని, మట్టితో గాని, ఱాతితో గానీ విష్ణువులనకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తుడగును. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 122 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 5 🌻*

Yama said:

“Those men who build temples of gods and adore the idols are not to be brought to hell.

36. Bring them to my view who have not built temples and other things. Move around in the befitting way and execute my directive.

37. Except those who have resorted to Ananta, the father of the universe, no other beings would at any time disregard the command.

38. Those who are devotees of Viṣṇu and have their mind fixed on him have to be avoided by you. They are not to live here.

39-49. Those who always adore Viṣṇu should be avoided by you from a distance. Those who sing the glories of Govinda while standing or sleeping or walking or standing behind or stumbling or remaining (at a place) are to be avoided by you from a distance. 

Those who worship Janārdana with obligatory and occasional rites are not to be beheld by you. Those who follow this course attain good position. Those who worship (the god) with flowers, incense, raiments, favourite ornaments, (and) those who have gone to the abode of Kṣṣṇa are not to be seized by you. 

Those who besmear with unguents, and those who are engaged in sprinkling his body, their children and their descendants should be left in the temple of Kṛṣṇa. Hundreds of men born in the family of one who has built the temple of Viṣṇu should not be seen by you with evil mind. Whoever builds a temple of Viṣṇu with wood or stone or earth gets free from all sins.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 257 / Osho Daily Meditations - 257 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 257. మాట్లాడం 🍀*

*🕉. మీకు మాట్లాడాలని అనిపించకపోతే, వద్దు - మీకు ఆకస్మికంగా రాని ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీకు పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటే చింతించకండి. దానిని ఒప్పుకో. మీరు మూగగా మారారని వారు భావిస్తే, దానిని అంగీకరించి, మీ మూగత్వాన్ని ఆస్వాదించండి! 🕉*

*అసలు ఇబ్బంది ఏమిటంటే, వారు ఏమి మాట్లాడుతున్నారో మరియు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఆపుకోలేక మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ మీరు మొత్తం అర్ధం లేని మరియు మనస్సులో జరిగే ఇబ్బంది గురించి కొంచెం తెలుసుకుంటే, చెప్పడానికి ఏమీ లేదని, ప్రతిదీ చిన్న విషయం అని మీరు తెలుసుకుంటే, మీరు వెనక్కి తగ్గుతారు. ప్రారంభంలో మీరు సంభాషణ చేసే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది - అది అలా కాదు. వాస్తవానికి, ప్రజలు సంభాషణ చేయడానికి కాదు, సంభాషణను నివారించడానికి మాట్లాడతారు. త్వరలో మీరు నిజంగా సంభాషణలు చేయగలరు. వేచి ఉండండి మరియు దేనినీ బలవంతం చేయవద్దు. మీకు మాట్లాడాలని అనిపించకపోతే, వద్దు - మీకు ఆకస్మికంగా రాని ఒక్క మాట కూడా మాట్లాడకండి.*

*మీకు పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటే చింతించకండి. దానిని ఒప్పుకో. మీరు మూగగా మారారని వారు భావిస్తే, దానిని అంగీకరించి, మీ మూగత్వాన్ని ఆస్వాదించండి! నిశ్శబ్దం గురించి చింతించకండి. అయినప్పటికీ, మొత్తం సమాజం మాట్లాడటంపై, బాషపై మాత్రమే కేంద్రీకృతమై వుంది. చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తులు సమాజంలో- నాయకులు, పండితులు, రాజకీయ నాయకులు, రచయితలు అవుతారు. కాబట్టి మిగితా వారు ఆందోళన చెందుతారు. భాషపై పట్టు కోల్పోతున్నామని భయపడతారు, కానీ చింతించకండి. నిశ్శబ్దం అనేది భగవంతునిపై పట్టు, మరియు మీరు నిశ్శబ్దం అంటే ఏమిటో ఒకసారి తెలుసు కున్నట్లయితే, మీరు మాట్లాడటానికి ఏదైనా ఉంటుంది. మీరు నిశ్శబ్దంలోకి లోతుగా వెళ్ళిన తర్వాత, మీ పదాలు మొదటిసారి అర్థాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు అవి ఖాళీ పదాలు మాత్రమే కాదు, దానికి మించిన వాటితో నిండి ఉంటాయి. మీకు ఒక కవిత్వం, ఒక నృత్యం వుంటుంది. అప్పుడు మీ అంతర్గత దయను అందరూ తమతో తీసుకు వెళతారు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 257 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 257. TALK 🍀*

*🕉. If you don't feel like talking, don't--don't say a single word that is not coming to you spontaneously. Don't be worried if people think you are going crazy. Accept it. if they think you have become dumb ,accept it, and enjoy your dumbness! 🕉*

*The real trouble is with people who go on talking and don't know what they are talking about and why. They go on talking because they cannot stop. But if you become a little aware of the whole nonsense and the trouble that goes on in the mind, if you become aware that there is nothing to say, that everything seems to be trivia, then you hesitate. In the beginning it feels as though you are losing the capacity to communicate--it is not so. In fact, people talk not to communicate, but to avoid communication. Soon you will be able to really communicate. Just wait, and don't force anything. If you don't feel like talking, don't--don't say a single word that is not coming to you spontaneously.*

*Don't be worried if people think you are going crazy. Accept it. if they think you have become dumb ,accept it, and enjoy your dumbness! Don't be worried about the silence. One does worry, though, because the whole society exists on talking, on language, and people who are very articulate become very powerful in society-leaders, scholars, politicians, writers. One soon becomes afraid that one is losing one's grip on language, but don't be worried. Silence is the grip on God, and once you mow what silence is, you have something to talk about. Once you have gone deeper into silence, then your words carry meaning for the first time. Then they are not just empty words, they are full of something of the beyond. They have a poetry to them, a dance. They carry your inner grace with them.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 410. 'శివపరా'- 2 🌻* 

*ప్రకృతి పురుషులలో ఇట్టి అవినాభావ అభేద స్థితి సతతముండును. ఇట్లు ఒకరి నొకరు మన్నించుకొనుట సృష్టియందు వీరిరువురి నుండియే ప్రారంభమైనది. భక్తుడు, భగవంతుడి నడుమ కూడ ఇట్టి అభేద స్థితి యున్నది. గురుశిష్యుల సంబంధముకూడ అట్టిదే. గోచరించుటకు ఒకటి కన్న ఎక్కువగా వున్ననూ ఇరువురి నుండి వ్యక్తమగు తత్త్వ మొక్కటియే. రామనామము చేయువానిని హనుమంతుడు అనుగ్రహించును. హనుమంతుని ఆరాధించువానిని రాము డనుగ్రహించును. నందీశ్వరుని గౌరవించినచో శివుడనుగ్రహించును. శివుని ప్రార్థించినచో నందీశ్వరుడు సహకరించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 410. 'Shivapara'- 2 🌻*

*In between nature and consciousness, this state of imperishable oneness is eternal. This feeling of oneness in creation originated from Srimata and Lord Shiva. The devotee and the Lord are also in this state of oneness. The same is with the relationship between Guru and His disciples. Eventhough they are more than one, there is oneness in the philosophy they are expressing. Lord Hanuman blesses the one who chants Ram Naam. Rama blesses the worshiper of Hanuman. If you respect Nandiswara, Shiva will bless you. If you pray to Lord Shiva, Nandiswara will help you.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు Happy Naraka Chaturdasi and Deepavali

 🧨. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు మిత్రులందరకి, Happy Naraka Chaturdasi and Deepavali to All. 🧨



నిర్మల ధ్యానాలు - ఓషో - 252


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 252 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. 🍀


జీవితంలో ఆనందంగా వుండడమన్నది దేవుణ్ణి సమీపించడం లాంటిది. నీ మార్గంలో నాట్యం చేస్తూ దేవుణ్ణి చేరు. నీ మార్గంలో నవ్వుతూ, నీ మార్గంలో పాడుతూ దేవుణ్ణి చేరు. గంభీరంగా ముఖం వేళ్ళాడేసుకునే సన్యాసులతో దేవుడు అలసిపోయాడు. వందల ఏళ్ళ నించీ బుద్ధిహీనులుగా వున్నారు. వాళ్ళ చిత్రాలు కూడా నా గదిలో పెట్టను. వాటితో దేవుడికి పిచ్చెక్కుతుంది.

నువ్వు జీవితాన్ని పరిశీలిస్తే, జీవితం దేవుని సృష్టి అయితే ఈ జీవితం దేవుని వ్యక్తీకరణ అయితే అప్పుడు నిజంగా దేవుడంటే నాట్యం చేసే దేవుడు. పూల పరిమళంతో, ప్రేమతో, సంగీతంతో, సృజనతో నిండిన దేవుడు. దానికి జీవితం మినహా మరో వుదాహరణ లేదు. దాన్ని బట్టి దేవుడు గంభీరుడు కాదని రుజువవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 353 - 18. పదార్ధం జీవితంతో . . . / DAILY WISDOM - 353 - 18. It is not True that . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 353 / DAILY WISDOM - 353 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻18. పదార్ధం జీవితంతో సమానం అన్నది నిజం కాదు🌻


ప్రాణం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? జీవం అనేది స్థూలపదార్థంతో ముడిపడి లేనిది అని జీవశాస్త్రం చెప్తుంది. జీవం సైతం పదార్థం లో ఒక భాగమని నిపుణులు అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ ఆ విషయం అర్ధం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాలేదు. ఎవరైనా ఇటుక లోనూ, దేహం లోనూ ఉండే జీవం ఒకటే అంటే, ఆ దేహం లేకపోయినా జీవం మనుగడ సాగుతుంది అంటే ఎలా నమ్ముతారు? మనిషి ఆ దేహం యొక్క స్పృహ లేకుండా కూడా జీవించగలడు. దేహము ప్రాణముతో సమానమైతే, దేహము నుండి విడిపోయినప్పుడు జీవము నశించి పోయేది. కానీ మనిషి కలలలోను, నిద్రలోను, లోతైన ఏకాగ్రత సమయాల్లో సైతం దేహ స్పృహ లేకున్నా సరే జీవించే ఉన్నాడు.

శరీరం తన స్పృహకు సంబంధించిన వస్తువు కానటువంటి పరిస్థితుల్లో, పదార్థమే జీవం అన్నది నిజమైతే, మనిషి ఒక్కసారిగా చచ్చిపోతాడు. పదార్ధం అంటే ప్రాణం అన్నది నిజం కాదు. అవి రెండు వేర్వేరు విషయాలు. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం. జీవితం అంటే ఏమిటో ఎవరూ ఒక నిర్ధారణకు రాలేదు. ఈ జీవం యొక్క శక్తినే ప్రాణశక్తి అంటారు. ఈ ప్రాణ శక్తే, జీవం యొక్క శక్తి. ఈ ప్రణ శక్తినే తేజస్సు అని, జీవశక్తి అని అంటారు. ఇదే మనిషిలో ఉండే స్థూల, సూక్ష్మ మరియు తేజో శక్తులు. కొన్నిసార్లు ప్రాణం శ్వాసతో గుర్తించబడుతుంది. కానీ అది శ్వాస కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 353 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻18. It is not True that Matter is the Same as Life🌻


What is meant by prana? What is life? The biologists tell us that there is a thing called life which is incapable of identification with matter. Though, many times, mechanistic materialists have held the opinion that life is not different from matter, it has become very difficult to accept this doctrine. How can anyone say that life is the same as brick, or a body with which one is lumbering, and without which also one can exist? It is seen that man can exist even without being conscious of the body. If the body were the same as life, life would be extinct when it is dissociated from the body. But man is alive even in dream, sleep, and states of deep concentration. In deep meditation one is not aware of the body.

Man would be dead at one stroke, if it were true that matter is life, in conditions when the body is not an object of his consciousness. It is not true that matter is the same as life. They are two different things. But it is difficult to understand what the relationship is between these two. No one has ever come to a final conclusion as to what life means. It is this life-force that is called prana-sakti. There is the prana-sakti, the power of the prana. Prana is vitality, living force, organic energy. It is a living, protoplasmic, organismic, and energising vitality in man. Sometimes prana is identified with breath. But it is interior even to breath.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636


🌹 . శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴

🌻. గణశుని పుట్టుక - 1 🌻


సూతుడిట్లు పలికెను -

తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత, ఉత్తమ వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై బ్రహ్మాను ప్రేమతో ఇట్లు ప్రశ్నించెను (1).

నారదుడిట్లు పలికెను -

దేవదేవా! ప్రజానాతా! నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము కంటె గొప్పది, పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని (2). ఇపుడు గణేశుని ఉత్తమ చరిత్రను, దివ్యము మంగలములలోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ వృత్తాంతమును వినగోరు చున్నాను (3).

సూతుడిట్లు పలికెను -

మహాముని యగు ఆ నారదుని ఈ మాటను విని బ్రహ్మ ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (4).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గణశుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా చెప్పయుంటిని. గణశుడు పుట్టుట, శని చూచుటచే ఆతని శిరస్సు భగ్నమగుట, ఏనుగు తలను అతికించుట అను గాథను చెప్పితిని. ఆ గాథ మరియొక కల్పమునకు సంబంధించినది (5). ఇపుడు శ్వేత వరాహకల్పమునకు సంబంధించిన గణశుని పుట్టుక చెప్పబడు చున్నది. ఈ గాథలో దయాళువు అగు శివుడు ఆతని శిరస్సును నరుకును (6).

ఓ మునీ! ఈ విషయములో నీవు సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలలను చేయును ఆ శంభుడు సర్వేశ్వరుడు. నిర్గుణుడే అయిననూ సగుణుడు కూడా (7). ఓ మహర్షీ! ఆయన లీలచేతనే జగత్తు సృజించబడి, పాలించబడి, సంహరింపబడు చున్నది. ప్రస్తుత గాథాను శ్రద్ధగా వినుము (8).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 636🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴

🌻 The birth of Gaṇeśa - 1 🌻


Sūta said:—

1. On hearing the marvellously excellent story of the slayer of Tāraka thus, Nārada was highly delighted and he lovingly asked Brahmā.

2. O lord of gods and people, O storehouse of Śiva’s cult, the excellent story of Kārttikeya, far better than nectar, has been heard by me.

3. Now I wish to hear the excellent story of Gaṇeśa, the details of his divine nativity, auspicious of the auspicious.


Sūta said:—

4. On hearing the words of Nārada the great sage, Brahmā became delighted and replied to him remembering Śiva.


Brahmā said:—

5. Due to the difference of Kalpas, the story of the birth of Gaṇeśa is told in different ways. According to one account he is born of the great lord. His head looked at by Śani[1] was cut off and an elephant’s head was put on him.

6. Now we narrate the story of the birth of Gaṇeśa in Śvetakalpa[2] when his head was cut off by the merciful Śiva.

7. No suspicion need be entertained, O sage. Śiva is certainly the cause of enjoyment and protection. He is the lord of all. Śiva is possessed as well as devoid of attributes.

8. It is by His divine sport that the entire universe is created, sustained and annihilated. O excellent sage, listen to what is relevant to the context, with attention.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 674 / Vishnu Sahasranama Contemplation - 674


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 674 / Vishnu Sahasranama Contemplation - 674🌹

🌻674. మహోరగః, महोरगः, Mahoragaḥ🌻

ఓం మహోరగాయ నమః | ॐ महोरगाय नमः | OM Mahoragāya namaḥ


మహాంశ్చాసావురగశ్చ విష్ణురుక్తో మహోరగః ।
సర్పాణామస్మి వాసుకిరితి గీతా సమీరణాత్ ॥

ఈతడు గొప్పదియగు ఉరగము అనగా సర్పము గనుక మహోరగః. వాసుకి అను సర్పముగూడ ఆ విష్ణుదేవుని విభూతియే.


:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥


నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడియావులలో కామధేనువును, ధర్మబద్ధమైన ప్రజోత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 674🌹

🌻674. Mahoragaḥ🌻

OM Mahoragāya namaḥ

महांश्चासावुरगश्च विष्णुरुक्तो महोरगः ।
सर्पाणामस्मि वासुकिरिति गीता समीरणात् ॥

Mahāṃścāsāvuragaśca viṣṇurukto mahoragaḥ,
Sarpāṇāmasmi vāsukiriti gītā samīraṇāt.


Since He is the great Uraga i.e., serpent, Lord Viṣṇu is known is Mahoragaḥ. The great serpent Vāsuki, that adorns the neck of Lord Śiva, is verily His effulgence only.


:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 12

Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmadhuk,
Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28.

Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa - the progenitor and among serpents I am Vāsuki.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీమద్భగవద్గీత - 275: 06వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 275: Chap. 06, Ver. 42

 

🌹. శ్రీమద్భగవద్గీత - 275 / Bhagavad-Gita - 275 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 42 🌴

42. అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||


🌷. తాత్పర్యం :

లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును.

🌷. భాష్యము :

జీవితారంభము నుండియే శిశువునకు ఆధ్యాత్మిక ప్రోత్సాహము లభించును కనుక జ్ఞానవంతులైన యోగుల ఇంట లేదా భక్తుల ఇంట జన్మము అతిఘనముగా ఇచ్చట కీర్తించబడినది. ఇట్టిది ఆచార్యుల వంశమునందు లేదా గోస్వాములు వంశమునందు ప్రత్యేకమైనదియై యున్నది. అట్టి వంశములవారు సంస్కృతి మరియు శిక్షణ కారణమున జ్ఞానవంతులను, భక్తులును అయియుందురు. తత్కారణమున వారు ఆధ్యాత్మికాచార్యులు కాగలరు. భారతదేశమునందు అట్టి ఆచార్యుల వంశములు పెక్కుయున్నను విద్య మరియు శిక్షణ లోపించియున్నందున అవి ప్రస్తుతము పతనము నొందియున్నవి.

అయినను భగవత్కరుణచే అట్టి వంశములు కొన్ని ఇంకను తరతరములుగా భక్తులను వృద్ధిచేయుచున్నవి. అటువంటి వంశములందు జన్మించుట యనునది నిశ్చయముగా మిక్కిలి అదృష్టకరవిషయము. భగవత్కృప చేతనే నా ఆధ్యాత్మిక గురువైన ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వాములవారును మరియు నేనును అటువంటి భక్తుల వంశములలో జన్మించుటకు అవకాశమును పొందితిమి. ఆ విధముగా జీవితారంభము నుండియు మేము శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు సుశిక్షితులమై తదుపరి దివ్యమగు భగవత్సంకల్పముచే ఒకరినొకరు కలిసికొంటివి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 275 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 42 🌴

42. atha vā yoginām eva kule bhavati dhīmatām
etad dhi durlabha-taraṁ loke janma yad īdṛśam


🌷 Translation :

Or [if unsuccessful after long practice of yoga] he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world.

🌹 Purport :

Birth in a family of yogīs or transcendentalists – those with great wisdom – is praised herein because the child born in such a family receives a spiritual impetus from the very beginning of his life. It is especially the case in the ācārya or gosvāmī families. Such families are very learned and devoted by tradition and training, and thus they become spiritual masters. In India there are many such ācārya families, but they have now degenerated due to insufficient education and training.

By the grace of the Lord, there are still families that foster transcendentalists generation after generation. It is certainly very fortunate to take birth in such families. Fortunately, both our spiritual master, Oṁ Viṣṇupāda Śrī Śrīmad Bhaktisiddhānta Sarasvatī Gosvāmī Mahārāja, and our humble self had the opportunity to take birth in such families, by the grace of the Lord, and both of us were trained in the devotional service of the Lord from the very beginning of our lives. Later on we met by the order of the transcendental system.

🌹 🌹 🌹 🌹 🌹



24 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹24, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

🍀. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు మిత్రులందరకి, Happy Naraka Chaturdasi and Deepavali to All. 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్దశి , దీపావళి, లక్ష్మీ పూజ, యమ దీపం, Naraka Chaturdasi, Deepavali, Lakshmi Puja, Yama deepam 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 4 🍀



7. సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః |
సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః

8. చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అత్రిరత్ర్యానమస్కర్తా మృగబాణార్పణోఽనఘః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : శరీర సంబంధమైన, హృదయ సంబంధమైన దుఃఖాలు —తమ పగిలి పోయిన బొమ్మలు వగైరాల కొరకు పిల్ల లేడ్చే ఏడ్పుల వంటివి. వాటికి నీలో నీవు నవ్వుకో. కాని, ఏడ్చేపిల్లల నోదార్చు. చేతనైతే వారి ఆటలో కూడా పాల్గొను. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ చతుర్దశి 17:28:09 వరకు

తదుపరి అమావాశ్య

నక్షత్రం: హస్త 14:42:01 వరకు

తదుపరి చిత్ర

యోగం: వైధృతి 14:29:23 వరకు

తదుపరి వషకుంభ

కరణం: శకుని 17:23:09 వరకు

వర్జ్యం: 22:33:40 - 24:08:00

దుర్ముహూర్తం: 12:23:24 - 13:09:52

మరియు 14:42:51 - 15:29:20

రాహు కాలం: 07:38:41 - 09:05:50

గుళిక కాలం: 13:27:18 - 14:54:28

యమ గండం: 10:33:00 - 12:00:09

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 08:40:30 - 10:16:54

సూర్యోదయం: 06:11:31

సూర్యాస్తమయం: 17:48:47

చంద్రోదయం: 04:58:43

చంద్రాస్తమయం: 17:10:24

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కన్య

వజ్ర యోగం - ఫల ప్రాప్తి 14:42:01

వరకు తదుపరి ముద్గర యోగం

- కలహం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹